28, మే 2017, ఆదివారం

సమస్య - 2372 (అమ్మ నమస్కరించినది...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు" 
(లేదా...) 
"అమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్"
ఈ సమస్యను పంపిన గొరిగె వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు. 

67 కామెంట్‌లు:

  1. రాణి వాసము గోల్పోయి రాత్రి పగలు
    కాననమున కేగి తుదకు ఘనము గాను
    ప్రాణమును సమర్పించిన రాణి సీత
    కమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

    రిప్లయితొలగించండి
  2. ఒక్క కార్యాలయంబున నొప్పు మీర
    తనదు తనుజాత యధికార దర్ప మంద
    నచట బంట్రోతు పదవిలో నమరి నట్టి
    దమ్మయె నమస్కరించిన దాత్మసుతకు.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    విజ్ఞతను విద్దెలను మేటి వినయమునను
    మెలగు పిన్నకు పెద్దలు మిడిసిపడమి
    గౌరవమునిచ్చు సంస్కృతి గన్నదగుట
    నమ్మయె నమస్కరించిన దాత్మ సుతకు

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    దిమ్మదిరుంగ భారత సుదీప్తిని గళ్ళకు గట్టినట్లుగన్
    కొమ్మయె నైన మ్లేచ్ఛులకు గుంఫన మొప్పగ వారి భాషలో(ఆంగ్లంలో)
    "పొమ్ము యెరుంగ జేయుమన"బోయె మహాత్ముని యాజ్ఞ మేరకున్
    దమ్ముల "కోకిలమ్మ"గదె తానె సరోజినిదేవి,దేశపున్
    అమ్మ నమస్కరించినది యాత్మ తనూజను భక్తియుక్తులన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'దిరుగంగ'ను 'దిరుంగ' అన్నారు.

      తొలగించండి
  5. వైభవమ్ముగ వరలక్ష్మి వ్రతము జేసి
    ముత్తయిదులకు వందనములిడి సరిగ
    పార్వతీ సిరి రూపున బరగు గాన
    పరిణయంబైన తనయకు వాయనమిడి
    అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పార్వతియె సిరి రూపున' అనండి.

      తొలగించండి
  6. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    1.బాధ లన్నియు భరియించు భవ్య మూర్తి
    మాత సీతను గాంచి సమ్మతము తోడ
    ధరణి సహనంపు రూపంబు శాంత చిత్త
    అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
    2.అమ్మయె నమస్కరించిన దాత్మ సుతకు
    తనదు పాత్రోచి తంబుగ తన్మ యమున
    తల్లి సుతయైచు సుతయును తల్లి యగుచు
    నాటకంబున నటియించు నట్టి వేళ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'యైచు'...? "తల్లి సుత కాగ..." అనండి.

      తొలగించండి
  7. ధర్మ బోధనల నుజేయు తనయు జూచి
    చక్క నైనట్టి యా తని సత్ప్ర వర్త
    నమును , ధా ర్మికత్వమ్మును నమ్రత లకు
    న మ్మ నమస్క రించిన దాత్మ సుతకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సుతుని విషయం చెప్పి సుతకు నమస్కరింపజేశారు.

      తొలగించండి
  8. భరతమాతకై తనభర్త ధరనువీడ
    తనకుటుంబపుభారము తలనుదాల్చి
    త్యాగములను చేయుచునుండ, తనివితోడ
    నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

    రిప్లయితొలగించండి
  9. గాలి మాటలు తనువెల్ల గాల్చుచుండ
    తన పవిత్రత సకలభూతమ్ములెఱుగ
    తనను జేరిన సీతమ్మ త్యాగమునకు
    నమ్మయె నమస్కరించినదాత్మ సుతకు

    రిప్లయితొలగించండి
  10. కమ్మనిభోజనమ్మిడుచు కన్నకుమారుల వాసమందు తా
    నిమ్ముగపెంచి విద్యనిడ నిక్కనువీడిరి వారు తుచ్ఛులై
    నమ్మకు నూతమిచ్చి కడు హర్షముతోడుతఁ జూచుచుండగా
    నమ్మ నమస్కరించినది యాత్మ తనూజను భక్తియుక్తులన్  

    రిప్లయితొలగించండి
  11. ఇమ్మహిలోన నే జననికిన్ సమకూడనిభాగ్య మమ్మరో
    యిమ్ముగ నాకునిచ్చితివి యీశునిరాణివి నాకు కూతువై
    మమ్ముల నుద్ధరించగను మాలిమి నంచును మేన,గౌరి క
    న్నమ్మ,నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్

    రిప్లయితొలగించండి
  12. ప్రేమ పేరున బయటికి వెళ్ళినట్టి
    బిడ్డ కనబడి రోదించ ప్రీతి కోరి
    యమ్మయె, నమస్కరించిన దాత్మసుతకు
    శుభము కలుగగ దీవించె శోభనిడుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెళ్ళినట్టి' అనడం వ్యావహారికం. "వెడలినట్టి" అనండి.

      తొలగించండి
  13. కవిమిత్రులారా,
    నమస్కృతులు. ఈరోజు మా తమ్ముని కొడుకు నిశ్చితార్థం కొరకు వెళ్తున్నందున మీ పూరణలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  14. పేగు తెంచుకు పుట్టిన పెద్ద బిడ్డ,
    తల్లి కాలేయము చెడగ, తల్లికి తన
    కారిజము నిడి బతికింప కరుణ జూసి
    నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

    రిప్లయితొలగించండి
  15. తల్లి దాసిగ నటియించ , తనయ రాణి
    గనయి దర్బారు సీనున గణుతి కెక్క
    పాత్ర యౌచిత్యమును జూపి ప్రతిభ జూప
    నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

    ఎంత జెప్పిన వినకుండ నేడ్చుచున్న
    తనయ నొప్పించ లేనట్టి తల్లి తుదకు
    విసిగి చేతులు జోడించె వేగలేక
    నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

    రిప్లయితొలగించండి
  16. పుత్రికా వివాహ దివసంబునఁ దలంచి
    సుతను లక్ష్మీస్వరూపి యంచు మది నాపొ
    లతి వ్రతోద్యాప నావసరమున నడరి
    యమ్మయె నమస్కరించిన దాత్మసుతకు


    కమ్మని భాషణమ్ములను గర్జము లీయగ దీవనల్ భువి
    న్నిమ్ముగఁ బిన్న వారలకు నీప్సిత సిద్ధికి చిత్త వృద్ధికిన్
    నెమ్మి నమస్కరించితిని నే బితృ దేవునకే యథోక్తి, కా
    దమ్మ నమస్కరించినది యాత్మతనూజకు, భక్తియుక్తులన్

    రిప్లయితొలగించండి
  17. పరమశివుని మెప్పించి యపర్ణ మిగుల
    నాదిదేవ సమేతయై యలరుచుండ
    తనకు జగదాంబ సుతయంచు తనరి మేన
    కమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

    రిప్లయితొలగించండి
  18. కృష్ణునకు యశోదేమగు, శిష్యు నెపుడు
    గురువు దీవించు, జీవుడు మరణ మొంద
    దివికి చేరునేది, జనకుడు ఎవరి పెండ్లి
    కొరకు ప్రకటించెనట స్వయo వరము నాడు
    అమ్మయె, నమస్కరించిన, దాత్మ , సుతకు


    కవి మిత్రులకు నమస్కారములు ఈ పద్యము పరి శీలించి తప్పులను సూచించి సాయము చేయగలరు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారు క్రమాలంకారములో పంచపాద తేటగీతి లో మీ పూరణ బాగుంది.
      కృష్ణు..శిష్యు లలో ప్రాసయతి భంగము. ష-ణ లతో సంయుక్తాక్షరమే ఉండాలి. సవరించండి.
      “నమస్కరించినది” దీనికి ప్రశ్నలో అన్వయలోపము కన్పించుచున్నది.
      జనకుడు+ ఎవరి సంధి నిత్యము. గణదోషము కూడా ఉంది.జనకుడెవరి యని సంధిచేస్తే రెండు దోషాలు పోతాయి.
      నాడు / అమ్మయె వాక్యాంతము పాదాంతము కాబట్టి విసంధియైన పరవా లేదు.

      తొలగించండి
    2. నాగమణి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      పోచిరాజు వారూ, ధన్యవాదాలు.

      తొలగించండి
  19. కామేశ్వర రావుగారూ నమోనమః. మీ రెండవ పూరణ అత్యద్భుతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సమస్య క్లిష్టతరమైనందున కించిదసంతృప్తి నాలో కన్పించింది. మీ అభినందన కొండంత ధైర్యాన్ని యిచ్చింది. నమస్సులు.

      తొలగించండి
  20. ఇమ్ముగ రాజశేఖరుడు పేర్మిని జక్కగ వైద్యవిద్యనున్
    సొమ్ములకాశజెందకను సౌమ్యము తోడన జేయుచుండగా
    నమ్మనమస్కరించినది యాత్మతనూజుని భక్తియుక్తుల
    న్నమ్మతనూజులన్నరయ యాత్మలు వేరగు బంధమొక్కటే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. 'తనూజ'ను 'తనూజు'ని చేశారు.

      తొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.

    పతికి మూత్రపిండమ్ము నవసరమవగ

    నిష్టపడి తన కూతురున్నివ్వ తుదకు

    ప్రాణగండము తొలగెను పతికియనుచు

    నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు.

    ****************************

    రిప్లయితొలగించండి
  22. పోచిరాజు కామేశ్వర రావు గారికి నమస్కారములు మీరు తెల్పిన ప్రకారము ఇంకొక పూరణము పంపుతున్నాను పరిశీలిoచి అభిప్రాయము తెలుపగలరు . ధన్యవాదములతో పూసపాటి


    అవనిజ కుశునకేమగు, అచల పుత్రి
    ఎదురు బడిన రాముని జూచి ఏమి చేసె,
    జనులు మరణించిన పిదప తనువు విడచి
    దివికి చేరునేది, జనకు డెవరి పెండ్లి
    కొరకు ప్రకటించెనట స్వయoవరము నాడు
    అమ్మయె, నమస్కరించిన, దాత్మ , సుతకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పంచపదిని షట్పది చేసారే!బాగుంది. “ ..మగు, నచల పుత్రి (పార్వతి)
      యెదురు బడిన.. యేమి చేసె, విడిచి ” అనండి.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారికి నమస్కారము అచల పుత్రిని నేను భూపుత్రి (సీత) గా తలచి వ్రాశాను తప్పు కాదు గదా. మిగిలినవి దిద్దుకుంటాను. శ్రీ శబ్ద రత్నాకరము లో 1082 వ పీజిలో భూమి పర్యాయ పదములు అచల అని ఇచ్చారు తప్పు కాదుగదా తెలుపవలెను

      తొలగించండి
    3. చలించనిది యన్న యర్థములో భూమి కూడ సాధువే.

      తొలగించండి
    4. మనకు 'అచలాత్మజా పరిణయము' అన్న ద్వ్యర్థికావ్యం ఉండనే ఉన్నది.
      అచల (అకారాంత పులింగం) + ఆత్మజా (పర్వతము యొక్క పుత్రిక అయిన పార్వతి) పరిణయము.
      అచలా (ఆకారాంత స్త్రీలింగం) + ఆత్మజా (భూమి యొక్క పుత్రిక అయిన సీత) పరిణయము.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి చక్కని విషయము చెప్పారు.

      తొలగించండి
    6. నాగమణి గారూ, మీ ప్రయత్నము ప్రశంసనీయం. స్వస్తి!

      తొలగించండి
  23. నమ్మిన కొడ్కులిర్వును నమ్మిక వమ్మును జేసి యమ్మకున్
    దుమ్ము మిగిల్చిపోయిరి సుదూరపు దేశము శాశ్వతంబుగా
    కమ్మని ప్రేమతోడ కడు కష్టము కోర్చియు సాకె కూతురే
    అమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్

    రిప్లయితొలగించండి
  24. సర్వ జనులాత్మ రూపులై జగతి వరల
    నెల్లవారిని దైవమంచెలమి భక్తి
    భావమున నతులును సమర్పణ నిడరె!
    అమ్మయె నమస్కరించినదాత్మ సుతకు.

    రిప్లయితొలగించండి
  25. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపు టమ్మ గౌరికిన్,
    యమ్మ నమ్స్కరించినది,యాత్మతనూజకు భక్తి యుక్తులన్
    సమ్మతి నిచ్చి పూజలను శ్రద్ధయుతమ్ముగ జేసి భర్త ప్రే
    మమ్మును బొంది కాపురము మార్దవ మొప్పగ సంతు గల్గగన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గౌరికిన్+అమ్మ' అన్నపుడు యడాగమం రాదు. "గౌరికే। యమ్మ..." అనండి.

      తొలగించండి
  26. కన్న సుతులు కాఠిన్యులై "నన్ను భార
    మంచు నెంచుచు వృద్ధాశ్రమంబులోన
    బార వైచిరే తల్లి!కాపాడుమంచు"
    యమ్మయె నమస్కరించిన దాత్మసుతకు.

    రిప్లయితొలగించండి



  27. దేశభక్తుడిల తనదు తిరుగులేని
    శౌర్య విక్రమములు జూపి జయము నంద
    ధరణి మాత ఋణము దీర్చ తనయు జూచి
    యమ్మయె నమస్కరించిన దాత్మసుతుని.

    రిప్లయితొలగించండి
  28. విజయదశమిన బాలలే వేడ్క మీర
    బాల రూపున పూజలన్ బరగ నిలువ
    పట్టి జూజుచు మననున భక్తితోడ
    నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దశమిని...' అనండి.

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు.
      దోష సవరణతో....

      విజయదశమిని బాలలే వేడ్క మీర
      బాల రూపున పూజలన్ బరగ నిలువ
      పట్టి జూజుచు మననున భక్తితోడ
      నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

      తొలగించండి
  29. ఉత్పలమాలలో నిన్నటి నా పూరణ కనిపించడం లేదు గురువుగారూ!

    ఇమ్ముగ నాదిదేవుడట నిండుగ మెచ్చి యపర్ణ సేవలన్
    నమ్మిన దేవతల్ మురియ నందను జేకొన మోదమై కనుల్
    చెమ్మగిలన్ పరాత్పరియె చిక్కెను కూతుగ నంచు మేనకౌ
    యమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్

    రిప్లయితొలగించండి
  30. వమ్మవ నాశలన్నియును భామలు వీడుట బుర్కవుర్కలన్
    దమ్ములు మీరగా సుతలు దారుణ నీతుల ధిక్కరించగా
    కమ్మగ జెడ్డ పట్నమున కారును తోలెడి కూతుజూచి బూ
    బమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్

    జెడ్డ = Jeddah, city in Saudi Arabia

    రిప్లయితొలగించండి