1, జూన్ 2017, గురువారం

సమస్య - 2375 (అమ్మా యని శశిధరుఁడు....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్"
(లేదా...)
"అమ్మ యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్"
ఈ సమస్యను పంపిన కవితశ్రీ శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు.

88 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. కొమ్మా! శ్రావణ మాసము
   వమ్ముగ బోనీయవలదు వరపూజమ్మా!
   కమ్మని వెన్నెల! రా! గౌ
   రమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

   తొలగించండి
  2. గౌరమ్మ సంబోధనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. నెమ్శోమునుగనగా పూ

  రెమ్శా షయనిపించుగాదె రేయింబవలు
  ముమ్మాాటికీ కడు చెలినాభా
  గ్యమ్శా!యని.........

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొత్త కీబోర్డు ఇంకా ఇబ్బంది పెడుతున్నట్టున్నది!

   తొలగించండి
  2. ఔనండీsamsungkeybordఎందుకోdeleteఐనదిక్రొత్తది స్వర...ఇంకాఅలవాటు కాలేదు

   తొలగించండి
 3. వమ్మయె నా ప్రయాసమది భావజుమారణమంత చూడగన్
  కొమ్మ త్వదీయ రూపఝరి గుండెల నిండెనుగాన నీవు వే
  గమ్ముగ నాదు తీవ్రతమకమ్మును తీర్పగ చంచలాక్షి! రా
  వమ్మ యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్

  రిప్లయితొలగించండి
 4. బొమ్మకు ప్రాణంబిడ, ప్రా
  ణమ్మును తీసి,మరలన్ ప్ర ణతికి కరటిమో
  రమ్మును తగిల్చి గణపతి
  కమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్
  (ఉత్తర భారతంలో భార్యను తన కుమారుని/కుమార్తె తల్లిగా సంబోధిస్తారు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఒక సందేహం! ఉత్తర భారతంలో భార్యలను పిల్లల పేర్లతో పిలిచే సంప్రదాయాన్ని (మోహన్‍కీ మా! సరితాకీ మా!) హిందీ సినిమాల్లోను, టివి సీరియళ్ళలోను గమనిస్తూనే ఉన్నాను. పెళ్ళయ్యాక ఏడాదికో, రెండేళ్ళకో పిల్లలు కలిగాక వాళ్ళ పేర్లతో జతచేసి భార్యలను పిలుస్తారు. కాని పిల్లలు కలిగేంత వరకు ఏమని పిలుస్తారు?

   తొలగించండి
  2. సార్! ప్రైవేటుగా ఏమని పిలుచుకొంటారో తెలియదు. పబ్లిక్ గా పేరుకు "జీ" అతికిస్తారు: ఉదా: "గౌరీజీ!" ("గౌరమ్మా!)

   తొలగించండి
 5. ముమ్మాటికి నాతనువున
  కొమ్మా సగ మిప్పు డీవు కొను మిదె ప్రియ వీ
  విమ్ముగ ముల్లోకంబుల
  కమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  ఇమ్మహి నీదయగన నే
  నిమ్ముల యజ్ఞంబు జేయ నిడగదె జయమున్
  గుమ్ముగ తెలగాణము కో
  యమ్మా!యని శశిధరుడు1 నగాత్మజ బిలిచెన్
  (1 చంద్రశేఖర రావు,కే.సి.యార్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శశిధరుణ్ణి చంద్రశేఖరునిగా చేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 7. డా.పిట్టా
  ఇమ్మహి రాక్షసాధముల,నిష్టుర వాదుల టెర్రరిస్టులన్
  సొమ్మసిలంగ జేయ నిక చూడరు మార్గము మానవాళి నీ
  కమ్మని వాణినిన్ ఖలుల గాఢ జడత్వము నూర్చు;కాళి యో
  యమ్మ యటంచు నిందుధరు డద్రి తనూజను బిల్చె మక్కువన్!

  రిప్లయితొలగించండి
 8. అమ్మల ను గన్న యమ్మవు
  నిమ్ముగ నవరాత్రులందు యెలరిపు తోడ
  న్నిమ్మహి ని బ్రోవు నా దు
  గ్గమ్మా! యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దుర్గమ్మ టైపాటు వల్ల దుగ్గమ్మ అయింది.

   తొలగించండి
  2. టైపాటు కాదు గురువుగారు...దుగ్గమ్మ అన్న పేరు పార్వతి నామాల్లో వుంది...ధన్యవాదములు

   తొలగించండి
 9. ఇమ్మహిలో నీ రూపము
  సమ్మానితమోయి నీవు సర్వుల హితమున్
  నెమ్మనమున జూచు త్రిగుణి
  వమ్మా యని శశిధరుడు నగాత్మజ బిలిచెన్!

  రిప్లయితొలగించండి
 10. కమ్మని వెన్నెలలో కర
  మిమ్ముగ శివతాండవమ్ము హిమశైలముపై
  రమ్ము, రహిఁ జలుప నో గౌ
  రమ్మా! యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

  రిప్లయితొలగించండి
 11. ముమ్మాటికి నిది సత్యము
  నమ్మిన భక్తులను రామ నామము బ్రోచున్
  నెమ్మదిలో పలుకగ రా
  వమ్మాయని శశిధరుండు నగాత్మజ పిలిచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'శ్రీరామ రామ రామేతి...' శ్లొకాన్ని గుర్తుకు తెచ్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. సమ్మతి నంబిక పదములు
  నమ్మెను భక్తిని నిడుములు నాశము కాగన్
  యమ్మను వానిని గనుమిక
  నమ్మా! యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాగన్+అమ్మను అన్నపుడు యడాగమం రాదు. "నశియించగ తా। నమ్మను..." అందామా?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. సమ్మతి నంబిక పదములు
   నమ్మెను భక్తిని నిడుములు నశియించగ తా
   నమ్మను వానిని గనుమిక
   నమ్మా! యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

   తొలగించండి
 13. అమ్మల గన్న యమ్మవుగ నార్తుల బ్రోచెడు కల్పవల్లిగ
  న్నిమ్మహి బూజలందుగొను నీరజ లోచని నిన్ను జూడగన్
  సమ్మతి కోరి వేచితిని శాంకరి, నీపతి చెంతజేర రా
  వమ్మ యటంచు నిందుధరుఁ డద్రి తనూజనుఁబిల్చె మక్కువన్!!!

  రిప్లయితొలగించండి
 14. ఇమ్ముగ బిలుతుము దేవిని
  న మ్మాయని ,శశి ధరు డు నగాత్మజ బిలిచెన్
  కొమ్మా !రా యిటు భక్తులు
  నెమ్మనమున జేయు బూజ నెఱి పరికింపన్

  రిప్లయితొలగించండి
 15. దొమ్మిని తారకుఁ జంపెడు
  నెమ్మిరవుతు జన్మఁ గోర నిర్జరులెల్లన్
  సమ్మతినిడ నువు నా సగ
  మమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

  రిప్లయితొలగించండి
 16. ఇమ్ముగ నను బెండ్లాడఁగ
  లెమ్మమ్ముక్కంటి నేల లేమ వరించన్
  వమ్ము నలయం దపస్సే
  లమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్


  అమ్మలఁ గన్న యమ్మను గజానను గన్న విశాల నేత్రనుం
  బమ్మిన ప్రేమ పాశమునఁ బన్నగ భూషణు డగ్గికంటి లో
  కమ్ముల నెల్ల భద్రముగఁ గన్నులఁ గాంచగ జీవరాశి కీ
  వమ్మ యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్

  [రాశికి+ఈవు+అమ్మ =రాశికీవమ్మ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'షరా మామూలే' అన్నట్టు మీ రెండు పూరణలు అందరికంటే వైవిధ్యంగా, మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 17. వమ్మయె నాతప మియ్యెడ
  కమ్మని యూహలనునింపె కద మన్మధుడే!
  రమ్మిక ; సగ భాగము గొన
  వమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

  రిప్లయితొలగించండి
 18. కమ్మని ప్రణయపు రసలా స్యమ్ములసొమ్ములనుదోచు సరసపు కైలా
  సమ్మీకౌగిలి, సతిగౌ
  రమ్మాయని శశిధరుడునగాత్మజ పిలిచెన్

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. అమ్మలగన్నయమ్మ గుట నాదిపరాత్పరియౌట కావుత
  న్నమ్మయటంచు నిందుధరుడద్రితనూజనుబిల్చె మక్కువ
  న్నిమహి నెంచు చూడగను నీమెకు సాటియ లేరుగానెట
  న్నమ్మహితాత్మ నెప్పుడును హర్షముతోడన బ్రస్తుతించెదన్

  రిప్లయితొలగించండి
 21. అమ్మహి రామచంద్రునిగ నంబుజనాభుడు నుద్భవించియున్
  దమ్ము గలుంగ మద్ధనువుఁ దాల్చెను దిక్కులు పిక్కటిల్ల, సీ
  తమ్మ వరించెడున్ పరిణయంపు మహోత్సవమున్ గనంగ రా
  వమ్మ యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్

  రిప్లయితొలగించండి
 22. "నెమ్మిగ ముద్దిడు మన నను
  కమ్మగ,తలదాల్చినావ? కౌగిలి యుమకా?",
  సమ్మతి,జాహ్నవి,మొట్టిన
  అమ్మా!యని శశిధరుడు నగాత్మజ బిలిచెన్.

  రిప్లయితొలగించండి
 23. ఇమ్ముగ పాలకై *గుహుడు* నేడ్చుచునుండగ *షట్స్వరమ్ములన్* ,
  దమ్ముని జూచి *యన్నయును* దా శ్రుతిజేసెను *ఘీంకృతమ్ము* , రా..
  వమ్మ! యటంచు ., నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్
  రమ్మని వచ్చి వారికి త్వరన్ రసదుగ్ధములిచ్చి బ్రోవగన్ !!

  రిప్లయితొలగించండి
 24. ఇమ్ముగ *గజవదనుడు* తొం..
  డమ్మును బైకెత్తి *తూర్యనాదమ్మున* పా...
  లిమ్మని యేడ్చుచు బిలువగ
  నమ్మా! యని" శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్ !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. కుమారస్వామి (షడాననుఁడు) షట్స్వరమ్ముల తోను గజాననుఁడు ఘీంకృతమ్ము తో రోదించడము! అద్భుత శబ్దౌచిత్యము! మురళీ కృష్ణ గారు మనోహరమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి
  3. మీ వృత్త పూరణ చాలా బాగున్నదండీ మురళీకృష్ణగారూ! శుభాభినందనలు!

   తొలగించండి
  4. శ్రీ కంది శంకరయ్య గారికి... శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి... శ్రీ గుండు మధుసూదన్ గారికి నమోవాకములు... ధన్యవాదాలు..... మురళీకృష్ణ

   తొలగించండి
  5. అద్భుతమైన పూరణతో అలరించిన మైలవరపు మురళీ కృష్ణ గారికి అభినందనలు.

   తొలగించండి
  6. శ్రీ సత్యనారాయణ రెడ్డి గారూ..నమోనమః...... మురళీకృష్ణ

   తొలగించండి
 25. కమ్మని తెల్గు పద్యముల కాళిని కొల్వగ, తల్లి వేడ్కతో
  రమ్మని పుత్రు బిల్చి నిను రాజును జేసె భవుండు, పూనికన్
  లెమ్మని చంద్రకోహళిని లెస్సగ నుంచగ ఏకదంతికిన్
  అమ్మయటంచు నిందుధరు డద్రితనూజను బిల్చె మక్కువన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఏకదంతుని ఏకదంతి అనడం సందేహమే. ఏకదంతికిన్+అమ్మ... అని విసంధిగా వ్రాయరాదు. "విఘ్నరాజుకే।యమ్మ..." అందామా?

   తొలగించండి
 26. మిత్రులందఱకు నమస్సులు!

  "ఇమ్ముగ గంగ నిచ్చె హరి యిందుని షడ్డకు నంచు నాకు! గం
  గమ్మ శిరమ్మునెక్క మది క్రాఁగుచునున్నది! యర్ధభాగ నీ
  మ మ్మిదె నీ తప మ్మడిగె! మమ్ముపయంతగఁ బొంద రమ్ము గౌ
  రమ్మ!" యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మనోహరమైన పూరణ. అభినందనలు.
   "...అర్ధభాగ నీమ మ్మిదె..." అర్థం కాలేదు.

   తొలగించండి
 27. నమ్మియు నాగభూషణుని నల్వురు మెచ్చగ చిత్తమందు తా
  విమ్మని కోరి శైలసుత వేల్పుని గూర్చి తపంబు నెట్టి దో
  షమ్ములు లేక పూనికను సల్పగ విప్రుని వేషమంది లే
  వమ్మ యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్

  రిప్లయితొలగించండి
 28. రిప్లయిలు
  1. కొమ్ములుగల రాజేంద్రులు
   అమ్మహిత ధనుస్సువంచ నడలిరి కానీ
   యిమ్మున రాము డడచె జూ
   డమ్మా! యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాజేంద్రులు+అమ్మహిత...' అని విసంధిగా వ్రాశారు. "కొమ్ములు తిరిగిన నరపతు। లమ్మహిత..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 29. క్రొవ్విడి వెంకట రాజారావు

  తమ్ముని దోడ్కొని వచ్చెడి
  కొమ్ములుగలవేలుపు సవ గోమును గూర్చ
  న్నిమ్మున వారిని గను గౌ
  రమ్మా! యని శశిధరుడు నగాత్మజ బిలిచెన్


  రిప్లయితొలగించండి
 30. కమ్మని భావనల్ తనువు కాకను బెంచగ,నీరజాక్షి నీ
  సమ్మతి గోరుచున్ సరస సాంద్ర సుధారస మాధురీ విలా
  సమ్ముల కౌగిలింతలను శాంతిని బొందగ వేగమింకరా
  వమ్మ యటంచు నిందుధరు డద్రితనూజను బిల్చె మక్కువన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ పద్యాలు రెండు సార్లు వస్తున్నవి?

   తొలగించండి
  2. ఔను సార్ రెండుసార్లువస్తున్నవిఎందుకో అర్దం కావడంలేదు

   తొలగించండి

 31. పిన్నక నాగేశ్వరరావు.

  కొమ్మలు శ్రావణ మందున

  నిమ్ముగ పూజలను చేసిరీప్సితములకై

  నెమ్మిని వరములనిడ రా

  వమ్మా యని శశిధరుడు నగాత్మజ
  బిలిచెన్.
  *****************************
  సవరణతో.....
  *****************************

  రిప్లయితొలగించండి

 32. ఇమ్ముగ పడతులు నిన్నే
  నెమ్మనమునతలచి వ్రతము నెమ్మిగ చేయన్
  రమ్మావరమిడ షణ్ముఖు
  నమ్మా!యనిశశిధరుడు నగాత్మజ బిలిచెన్.

  అమ్మవు నీవే ననుచును
  నిమ్ముగ వాయనములిడగ నింతులు నచ్చో
  గుమ్మము కడనే కరిముఖు
  నమ్మా!యనిశశిధరుడు నగాత్మజ బిలిచెన్.


  కమ్మని రాముని నామము
  నిమ్మహిలోపల జపింప నేఫలమగునో
  నిమ్ముగ దెలిపెద నోగౌ
  రమ్మా యనిశశిధరుడు నగాత్మజ బిలిచెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "నీవే యనుచును" అనండి (రెండవ పూరణలో)

   తొలగించండి

 33. ఇమ్మహిలో పలన్ జనులు నెల్లరు భక్తి ప్రపత్తుల తోడ నిన్నిటన్
  నెమ్మితొ పూజలన్ విడక నెప్పుడు చేయుచు నుందురట్టిచో
  కమ్మగ దీవనల్ యొసగ గాదిలి పుత్రులు వెంటరాగనో
  యమ్మ యటంచు నిందుధరుడద్రి తనూజను బిల్చె మక్కువన్.

  రిప్లయితొలగించండి
 34. క్రొవ్విడి వెంకట రాజారావు

  తమ్ముని దోడ్కొని వచ్చెడి
  కొమ్ములుగలవేలుపు సవ గోమును గూర్చ
  న్నిమ్మున వారిని గను గౌ
  రమ్మా! యని శశిధరుడు నగాత్మజ బిలిచెన్


  రిప్లయితొలగించండి
 35. రాజేశ్వరి అక్కగారు అస్పత్రి నుంచి డిశ్చార్జి అయి శంకరభరణములోకి అడుగు పెట్టిన శుభ సందర్భములో

  హాస్పి టలునుంచి వేంచేసె యక్క గారు,
  ఇచ్చి నారుట యొకలిస్టు ఇంటి కొచ్చు
  తరుణమున మందు మాత్రలు మర్చి పోక
  వారములు పదునాలుగు వాడ మనుచు
  అక్కా:
  వలదు మాత్రలు మందులు, కలత అసలు
  వలదు సోదరీ, మనకంది వారు యిచట
  నాడి వైద్యులు, కవిజన నాడి పట్టి
  జబ్బు ఏమిటో తేల్చును జంకులేక,
  మత్తు మందుల నిపుణులు మాన్య పోచి
  రాజు వారు, పద్యములన్ని రమ్య గతిన
  సాగి మదికి నిదురనిచ్చు సరస గతిన,
  బలము టానిక్కు మిస్సన్న పద్య శైలి,
  పద్య తేనియల్ టానిక్కు బలము నిచ్చు ,
  శాస్త్రి గారి పద్యములన్ని శ్వాస నీయ
  ఏల వెంటిలేటరు మీకు ఎంచి చూడ.
  ఫణి కుమారుని పద్యాలు పాల వోలె
  స్వస్త తనిడును సతతము శక్తి నిచ్చి,
  గుండు వారి పూరణములు గుడ్లు వోలె
  పుష్టినిచ్చి మేల్జేయును పొట్ట కెపుడు ,
  ఎన్నియో పద్య ఫలములు ఇష్టపడుచు
  బ్లాగులోన ఎదురు చూచె , బాధ తీర్చు
  కావ్య ధన్వంతురుల యండ కలుగు చుండ
  వేరు వైద్యశాల లొలదు, వేగి రముగ
  శంకరాభరణము యిచ్చు సంతసమ్ము

  రిప్లయితొలగించండి
 36. కమ్మగ చంద్రశేఖరుడు కాంగ్రెసు నోడిచి త్రోసెనంటగా
  కుమ్ముచు చంద్రనాయుడికి గూటము నెత్తిన కొట్టెనంటగా
  గమ్మున పోయి చూచెదము ఖైరత బాదుకు నందిమీద రా
  వమ్మ! యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్

  రిప్లయితొలగించండి