23, జూన్ 2018, శనివారం

దత్తపది - 141

హర - గణేశ - కుమార - నంది
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
విష్టుస్తుతి చేస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

65 కామెంట్‌లు:

 1. ఘోర రాక్షస సంహరణారత! హరి!
  సురగణేశ సంస్తుత పాద! పరమపురుష!
  పుష్ప సుకుమార సుందర పూత దేహ!
  నీ కరుణ నంది తరియింప నిలిచినాఁడ.

  రిప్లయితొలగించండి


 2. హృదయకుహరవాసా! దే
  వదేవ ! దైనందినమున వర్ధిల్లగ మ
  మ్ము దయగను! మాకు, మా రమ
  ణదేవుడ గణేశభూషణముగా నిలువన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గణేశ' శబ్దాన్ని ఏ అర్థంలో ప్రయోగించారు?

   తొలగించండి
 3. డా.పిట్టాసత్యనారాయణ
  భవహర!భూతగణేశా!
  సవితా శశి నేత్ర దివ్య శాంతి ప్రదాతా!
  కవితానందిత మముగను
  ప్రవిమల వటపత్ర శయన బాల, కుమారా!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా.పిట్టానుండి
   ఆర్యా,"దివ్య శాంతికి నిలయా" గా ‌స్వీకరించ గలరు.

   తొలగించండి
  2. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సవితృ శశి నేత్ర' అనడం సాధువు.

   తొలగించండి
 4. పాపహర శ్రీహరి దురితదూర గణేశపిత నుతవె
  లక్ష్మీరమణ
  శేషశయన శ్రీపతి పద్మనయన కరుణాభరణ
  పావనచరణ
  దేవకి సుతుడవు నందకుమార మోదము నందితిని
  నినుకొలిచి
  సంకటమోచన సరసిజలోచన వేడితి నిన్నే ప్రేమగ
  పిలిచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది. కాని 'గణేశ' శబ్దాన్ని స్వార్థంలో ప్రయోగించారు.

   తొలగించండి
 5. మోహ రవళిని బాపగ మ్రొక్కులిడుదు
  కేశవాచ్యుత!శ్రీశ!గణేశ భూష!
  వేగ నందింతు వందన మో గవీశ!
  రాకుమార!మహాత్మ!విభ్రాజ దేహ!

  గణేశ=సిందూరము,చందురము
  గవీశ=ఆల మందల ఱేడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గణేశ' మంటే సిందూరం కాదు. గణేశునకు భూషణమైనది సిందూరము. అందుకే 'గణేశభూషణము' అన్నారు. ఇక్కడ గణేశ శబ్దం స్వార్థంలోనే ఉన్నట్టు.

   తొలగించండి
 6. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  నేటి అంశం :: దత్తపది {హర-గణేశ-కుమార-నంది)
  విషయం :: పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ విష్ణుస్తుతి చేయాలి (నచ్చిన ఛందస్సులో).
  సందర్భం ::
  పదునాలుగు భువనాలకు అధిపతియైన శ్రీమన్నారాయణుని
  పదునాలుగు నామాలతో ఒక భక్తుడు స్తుతిస్తున్న సందర్భం.

  హరసఖ! శ్రీ మనో(హర)! జనార్దన!కేశవ! హే త్రివిక్రమా!
  స్థిర ఘన మోక్షదాయక! హృషీక(గణేశ)! ఉపేంద్ర! అచ్యుతా!
  వర సు(కుమార)దేహ! నిజ భక్తజనావన! నందనందనా!
  గరుడ విహార! మమ్ములను గావుము సన్నుతి (నంది) శ్రీహరీ!
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (23-6-2018)

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వందనమిదె నందుకొనుమ
   మందస్మిత! గోగణేశ! మాధవ! శౌరీ!
   కందర్పజనక! భవహర!
   నందకుమారా! వరముల నందించవయా!

   తొలగించండి
  2. కలికల్మషహర! శ్రీహరి!
   నళినేక్షణ! సురగణేశ! నందిత స్తోత్రా!!
   మలయప్పా! సుకుమారా!
   కులదైవమ! కరుణజూపు గోవిందాఖ్యా!

   తొలగించండి
  3. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురిదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏
   శనివారం , ఏకాదశి నాడు విష్ణుస్తుతి చేసే భాగ్యం ప్రసాదించారు!!

   తొలగించండి
  5. మేము హిరణ్యకశిపుని భక్తులం. విష్ణుస్తుతి చేయము...

   తొలగించండి

 8. ఆకాశ వాణి వచ్చే వారం సమస్య -


  ధనమే చిత్త వికాస సంపదకు ప్రాధాన్యంబు నై నిల్వగన్ !

  జిలేబి


  రిప్లయితొలగించండి


 9. అనువై ముక్తికి మార్గమై నిలుచు తానాధారమై వెల్గు, నీ
  తనువున్ హృత్తును బ్రహ్మపాదము కెడన్ ధన్యంబుగా చేర్చుచున్,
  మనసా మాలిని పూజ జేయ రమణీ మత్తేభమై నిల్చు నా
  ధనమే చిత్త వికాస సంపదకు ప్రాధాన్యంబు నై నిల్వగన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. సీసము
  ముంజకేశా!హరి! ముగ్ధ మనో(హర)రూప!శతానంద! మాపతి!బలి
  బంధనా! నందకి!పదునారు వేలగోపికలు(కు మార) !కపిలుడ!భరిమ!
  (నంది)నీ జనయిత! నారాయణా!భూరి!తరిదాల్పు!మధుజిత్తు!దానవారి
  సుర(గణేశ) నుత!అశోక!మధూహన! జడనిధి తల్పుడా !చక్ర పాణి!
  గట్టు దాలుపు!తరిదాల్పు!గరుడి రవుతు!
  విశ్వరూప !లక్ష్మీపతి!వేద గర్భ!
  సచ్చిదానందా!శ్రీహరీ, సంతతమ్ము
  నీదు కీర్తనలం జేతు నీరజాక్ష

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మా సంతకమ్ము సీసపు
   పూసలు నెద్దానినైన పూరింప సుమీ !:)


   జిలేబి

   తొలగించండి
  2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
   'గోపికలకు మార... సచ్చిదానంద' అనండి.

   తొలగించండి
 11. సిరి మనోహర వైకుంఠ పుర నివాస
  సుర గణేశ వంద్య మురారి పరమ పురుష
  బెట్టు సేయకు మా రమా విభుడ దేవ
  హరి వరము లనందించి మ మ్మా ద రించు

  రిప్లయితొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  సింధుకన్యామనో(హర!) శేషశాయి!
  నిత్యనమసితదేవ(గణేశ!) శౌరి!
  మద హరిత కాళియ పృదా(కు! మార) జనక!
  సతతభక్తజనాభి(నంది)త! నమోఽస్తు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండో పాదంలో చిన్న మార్పుతో...

   సింధుకన్యామనో(హర!) శేషశాయి!
   కేశ!నమసితదేవ(గణేశ!) శౌరి!
   మద హరిత కాళియ పృదా(కు! మార) జనక!
   సతతభక్తజనాభి(నంది)త! నమోఽస్తు!

   తొలగించండి
  2. గుండు మధుసూదన్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 13. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,


  ప్రమథ గణేశ వందిత | భవచ్ఛరణద్వయ మందెదన్ , మదీ

  య మనము నం దిరంబుగ | దయానిలయా | శరణంటి రా నినున్ |

  అమల చరిత్ర | పాప హరణా | ‌ హరి | శ్రీ హృద యాబ్జ ‌చంచరీ

  క | మ మిక ‌ బ్రోవు | మార జనకా | భువ నాధిప | రాక్షసాంతకా


  -----------------------------------------------------------------------------------------------------------------;

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కుమార' శబ్దం కనిపించడం లేదు?

   తొలగించండి
 14. మైలవరపు వారి పూరణ

  దత్తపది..

  హర ... గణేశ... కుమార... నంది
  విష్ణుస్తుతి... స్వేచ్ఛాఛందస్సు..

  శ్రీ మనోహర ! క్షీరాబ్ధి శేషశయన !
  సురగణేశవందితపాద ! శుద్ధవేష !
  మంజుదరహాస ! సుకుమార మారతాత !
  నన్ను బ్రోవుము మాధవా ! నతులనంది !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 15. శౌరి!సుమనోహర!రమేశ!నారసింహ!
  ముంజకేశ!మాధవ!దేవ!మునిగణేశ!
  శార్ఞ్గి!సుకుమార సుహృదయ!చక్రపాణి!
  సేవయే కానుకగ నంది కావుమయ్య!

  రిప్లయితొలగించండి
 16. ఈధరఁ గావుమా! సుర *గణేశ!* ప్రణామము *నంది* సర్వదా!
  శ్రీధర! చిద్విలాస! కరి సేవిత! శంకర! పద్మనాభ! శ్రీ
  నాథ! ఉపేంద్ర! నందకి! జనార్థన! శ్రీకర! నారదప్రియా!
  మాధవ! శేషశాయి! సు *కుమార!* మనో *హర!* సుందరా నమః!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శ్రీధర' తరువాత అరసున్న ఎందుకు?

   తొలగించండి
  2. ధన్యవాదాలు. అది ఆశ్చర్యార్థకం గురువుగారూ.
   🙏🏻

   తొలగించండి
 17. దుష్టసంహరణ!మురారి!దురితదూర!
  యఖిలసురగణేశ!ముకుంద!యాదిదేవ!
  నందునికుమార!వేంకటనామకుండ!
  కావుమమ్ములనిరతముగరుణనంది

  రిప్లయితొలగించండి
 18. గణేశభూషణము నో కాబట్టి మార్చినది :)
  సుకుమార యెట్లు యెస్ ?

  హృదయకుహరవాసా! దే
  వదేవ ! దైనందినమున వర్ధిల్లగ మ
  మ్ము దయగను! మాకు, మా రమ
  ణదేవ, హరి,సురగణేశ, నాణ్యత గూర్చన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. కమలా మనోహ రానిమి
  ష మణి గణేశ సుకుమార సత్కర నలినా
  ర్చ్య మహానందిత మానస
  విమల మునీంద్ర నుత దేవు విష్ణునిఁ దలఁతున్

  రిప్లయితొలగించండి
 20. అహరహమున్ స్మరింతు నిను నచ్యుత! కేశవ! చక్రి! కైటభా
  రి! హరసురేశవందిత! హరీ! నిజభక్తగణేశ! మాధవా!
  యిహపర సౌఖ్యముల్ బడయ నెంచను చేయకు మారదాసుగా
  స్పృహ నిడు పాపవర్తనుల జేర్చకు సాగరనందినీప్రియా!

  రిప్లయితొలగించండి
 21. తే: భవహరా! హరి శ్రీనాథ! పద్మ గర్భ!
  సురగణేశ! తామర కంటి! గరుడ వాహ్య(గమన)
  శౌరి!సుకుమార! భూజాని! చక్రధరుడ!
  సతతమానంది! నను కావు! శంఖపాణి!

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. హరకుని గొలుతురుభక్తిగ. (కృష్ణుడు)
  నరలకు మారకునితండ్రి నాయకుడనగా?
  వరములనందించుటచే
  గురుకారమునన్ గణేశుడనిదలంతున్

  రిప్లయితొలగించండి
 24. నేటి దత్తపదాలు హర,గణేశ, కుమార, నంది పదాలను శ్లోకంలో పూరించాను
  వ్యా "హర" న్ యో హరే ర్నామ
  నిత్యముక్త "గణేశ"! తం
  సు"కుమార"పవిత్రాంగ!
  "నంది"తో న భవేత్కథమ్?.


  రిప్లయితొలగించండి
 25. నేటి దత్తపదాలు హర,గణేశ, కుమార, నంది పదాలను శ్లోకంలో పూరించాను
  వ్యా "హర" న్ యో భవన్నామ
  నిత్యముక్త "గణేశ"! తం
  సు"కుమార"పవిత్రాంగ!
  "నంది"తో న భవేత్కథమ్?.


  రిప్లయితొలగించండి
 26. సరసిజనాభ! మనోహర!
  కరివరదా! సురగణేశ! కామిత ఫలదా!
  వర సుకుమార! రమాపతి!
  గరుడవిహార! నుతినంది కావవె వరదా!

  రిప్లయితొలగించండి
 27. శర్మ చెరుకూరి:

  ఎందుకు మారవేల పది యిండ్లకు పాలకు వెన్నకేగి ,మి
  న్నందిన కీర్తి గూల్చెదవు?హా!నిను దిట్టగలేను ,కృష్ణయా!
  యందము జిందు నీనగవునందు మనోహరమాయ యున్న దే
  మందు?యశోద పిచ్చిదని యందరు బల్కెర!గోగణేశుడా!

  రిప్లయితొలగించండి
 28. శీఘ్రమె నృసింహ రధమునుచేద దాని
  గంట గణగణే శరణుగ కన్పడెగద
  లచ్చిమి మగడా! నాకు మారదు నియమము
  నీదు సేవనందిమ్ముగ నిలిచియుండ

  రిప్లయితొలగించండి
 29. కందం
  సిరి ప్రియమనోహర! వరద!
  పరమపద గణేశ! శౌరి! పన్నగ శయనా!
  హరి! సుకుమార! పరాత్పర!
  నిరతము నీ పదమునంది నిల్చెద ధరణిన్!

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂దత్తపది🤷‍♀.. .. .. .. .. .. ..
  హర గణేశ కుమార నంది అన్యార్థంలో..
  విష్ణుస్తుతి.. నచ్చిన ఛందస్సు..

  సందర్భము: దైత్య గణ.. ఈశు డంటే రావణుడు. ఆతని తనూజులు అంటే ఇంద్రజిత్తు అక్షయుడు.. వారిని వరుసగా...
  యుద్ధంలో లక్ష్మణుడు...
  లంకాదహన సందర్భంలోనే ఆంజనేయుడు సంహరించినారు.
  దేవతలు తిలకించి సంతోషించినారు. రాముని చూచి వారికి.. అనగా..
  లక్ష్మణునికి సోదరుడు సుమా! యని..
  ఆంజనేయునికి సోదర సమానుడు సుమా! యని..
  ఆ యా సందర్భాలలో వినుతిస్తూ వుండగా రాముడు మురిసిపోయేవాడు. అటువంటి ఓ రఘు రామా! నన్ను కరుణ గనుమా!
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  వసుధ దైత్య (గణేశ) రావణ తనూజ
  సం(హర)ణ శీలురైన లక్ష్మణుని, పవన
  సుతుని గనుచుఁ ముదము(నంది)
  సురలు మెచ్చి..
  సోదరుడు, సోదర సముండు
  సుమ యనంగ..
  మురియు సు(కుమార!) రఘు రామ!
  కరుణ గనుమ!...

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  23.6.18

  రిప్లయితొలగించండి

 31. మురళీధరమురహర శ్రీ
  నరసింహా సురగణేశ నగధరశౌరీ
  పరమానందిత శ్రీశా
  సరుగున నిడు మాకుమారజనకా జయముల్

  రిప్లయితొలగించండి