16, జూన్ 2018, శనివారం

సమస్య - 2708

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా"

81 కామెంట్‌లు:

 1. అల్మోరా వంటి పురము
  కల్మషమే లేని నదిని గంగకు వోలెన్
  వల్మీకములను నిండుచు
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా

  రిప్లయితొలగించండి

 2. బోల్మేరా అబ్బా జాన్ !
  బాల్మా! చెప్పితి జిలేబి బాగుగ వినవే !
  సల్మాను ఖాను,దరిమిల
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. అల్మాసుపేట నుండెడు
  సల్మానుకు జెప్పె నొక్క సన్నిహితుడొగిన్
  అల్మారజేయు వాడగు
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా

  రిప్లయితొలగించండి


 4. జుల్ముగ చెప్పిరి కవివరు
  "వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా",
  కల్మషమైన, సరియనెద !
  మల్మల్ నెలతుక జిలేబి మహిళను, కవిరాట్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. అవధాని తాతా సందీప శర్మ గారి పూరణ...

  పల్మానసహరమగు కవి
  త ల్మాధుర్యమ్ముతోడుతన్ జెప్పచు చె
  న్ను ల్మీరెడు నా యభినవ
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా!
  (డా.ధూళిపాళ మహాదేవమణి గారికి అభినవ వాల్మీకి అన్న బిరుద మున్నది. వారు రాజమండ్రి వాస్తవ్యులు)

  రిప్లయితొలగించండి
 6. కల్మష రహితుండనుచును
  బల్మారులు పలుకనేల పామరు డైనన్
  చెల్మికి బ్రాణము నిచ్చెడు
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా.

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  మేల్మేల్ భారతమున శ
  బ్దాల్మధురిమలొల్క తెలుగు బాసకు దానై
  తాల్మిఁ దొలికవి యగు., తెలుగు....
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. తెలుగు వాల్మీకి ఎవరండి ?

   వావిలకొలను సుబ్బారావు గారు, ఆంధ్ర వాల్మీకి యా?

   చెన్నై గుంటూరు దాటి వెళ్లి నట్లు లేదే ?

   జిలేబి

   జిలేబి

   తొలగించండి

  2. ఓకే భారతము - మహాభారతము ;తొలికవి - నన్నయ్య ?

   జిలేబి

   తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. కల్మషము లేని వారలు
  గిల్మానులుగా నుండి గేహిని చెంతన్
  గుల్మము రక్షణ జేయగ
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. కల్మషము లేని వారలు
   గిల్మాను లైనన్ ఘనముగ గేహిని చెంతన్
   గుల్మము రక్షణ జేయగ
   వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా

   తొలగించండి


 9. పల్మాఱు వందనమ్ములు ?
  కల్మష ముల దీర్చు గంగ కలదెచ్చటనో ?
  అల్మారి రామబాణపు ?
  వాల్మీకికి; రాజమండ్రి; వాసమ్ము గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ ప్రశ్న అర్థం కాలేదు!

   తొలగించండి
 10. కేల్మోడ్చెద నన్నయ్యకు
  పాల్మాలక భారతమును ప్రస్తుత పరచెన్
  వాల్మీకివలెనె-మరి యా
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగదా.

  రిప్లయితొలగించండి
 11. పల్మారు క్రొత్త ప్రక్రియ
  బల్మిని గొని కందుకూరి వర్ధిలె నిచటన్
  మేల్మాటల నవకవితా
  వాల్మీకికి రాజమండ్రి వాసము కాదా.

  రిప్లయితొలగించండి
 12. అవధాని తాతా సందీప శర్మ గారి పూరణ...

  పల్మానసహరమగు కవి
  త ల్మాధుర్యమ్ముతోడుతన్ జెప్పచు చె
  న్ను ల్మీరెడు నా యభినవ
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా!
  (డా.ధూళిపాళ మహాదేవమణి గారికి అభినవ వాల్మీకి అన్న బిరుద మున్నది. వారు రాజమండ్రి వాస్తవ్యులు)

  రిప్లయితొలగించండి
 13. జాల్మయను పేరు గలిగెను
  వాల్మీకికి,రాజమండ్రి వాసమ్ముగదా
  దాల్మియగు వేద ఘోషల
  చెల్మిన్గలిగి పురజనులు చిందులు వేయన్

  రిప్లయితొలగించండి
 14. నిల్మోయి దీనిగణములు
  పల్మాటల నాడకుండ పలుకుము శిష్యా!
  “వల్మీకోద్భవుడగు నా
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా”

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ************
   సూర్యకుమార్ గారూ,
   మీ ప్రశ్నకు పై పూరణకు సంబంధం?

   తొలగించండి

 16. కందివారు

  పుస్తకాలను తొలిచే పురుగును రామబాణ పురుగు అంటామండి. అల్మారి లో రామబాణపు ? (వాసము గదా)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. డా.పిట్టాసత్యనారాయణ
  తాల్మిని గోదావరి గని
  మేల్మిని నా తెల్గు చరిత మెచ్చిరి యవనుల్ 1.
  "మేల్మేల్ భాషా సంస్కృతి
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగదా!"
  (1.ఆంగ్లేయులు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. I am proud of him as he is my senior Ph.D. scholar in English. Dr Pitta will continue his scholarly pursuits even at the age of 75 as a young scholar. I wish him all success.
   -- Prof G. Damodar, Former Dean & HoD, English, Kakatiya University.

   తొలగించండి
 18. తొల్మేలగు కవినామము
  వాల్మీకికి; రాజమండ్రి వాసముగదా
  మేల్మేలన నాదికవికి,
  పల్మారులు వందనమిడ ప్రాజ్ఞులు వారే!

  రిప్లయితొలగించండి
 19. డాపిట్టానుండి
  ఆర్యా,రేపే ఆవిష్కరణ.ఆహ్వానము మిత్రులకందీయవచ్చును గదా!

  రిప్లయితొలగించండి
 20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2708
  సమస్య :: *వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా.*
  దొంగలు మొదలైన వారికి రాజమండ్రి (సెంట్రల్ జైలు) నివాసం కలుగుతుంది గదా. అదేవిధంగా కిరాతుడుగా ఉండిన వాల్మీకికి రాజమండ్రి వాసము సిద్ధించి ఉంటుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం :: యాత్రలు చేస్తూ రాజమండ్రికి చేరుకొన్న వారికి ఒక మార్గదర్శి (గైడ్) అన్ని విశేషాలను చూపిస్తూ ఉన్నాడు. అతడు ఒకచోట భగవాన్ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని చూపించి ఓ యాత్రికులారా! ‘’ఇది ఆదికవి యైన వాల్మీకి మహర్షి విగ్రహం. ఈ వాల్మీకి ప్రచేతసుని కుమారుడు. మొదట కిరాతుడుగా ఉండినాడు అని అంటారు. కిరాతుడు అంటే తలముందు ఈకలు మొదలైన వాటిని ధరించిన వాడు అని అర్థం చెబుతారు. మనసులో ఎటువంటి కల్మషమూ లేకుండా అసంఖ్యాకంగా రామ నామ జపం చేసి తపస్సు చేసి శ్రీమద్రామాయణాన్ని దేవనాగరి లిపిలో రచించిన ఆదికవి ఇతడే. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గోదావరీ నదీ తీరంలో గౌతముడు మొదలైన మునులతో పాటు మెలగిన మునిపుంగవుడు. ఇపుడు ఈ రాజమండ్రి ఏర్పడియున్న ప్రాంతంలో అనేక వేల సంవత్సరాల క్రితం నివసించాడు అని కూడా ఈ మహర్షి గుఱించి చెప్పుకోవచ్చు అని విశదీకరించే సందర్భం.

  పల్మాఱు రామ యనుచున్
  కల్మష మది లేక యాదికవి యయ్యె నిటన్
  వల్మీకభవుడు మెలగెను
  *వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (16-6-2018)

  రిప్లయితొలగించండి
 21. క్రమాలoకారం లో _
  వల్మీకము మూ లమె వ రి కి ?
  మేల్ మే ల్ రచనల తొలి కవి మేదిని యందు న్
  చె ల్మి గ నె చట వసిoచె ను ?
  వాల్మీకి కి ; రాజ మండ్రీ వాసమ్ముగ దా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "వల్మీక మూల మెవరికి" అనండి.

   తొలగించండి

 22. వచ్చే వారపు ఆకాశ వాణి వారి సమస్య :)


  స్వరములు లేని గీతములు శ్రావ్యము లయ్యెను లోకు లెన్నగన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అరరె! జిలేబులై తిరుగు నాట్యపు కైపులు సైయనంగ, హా!
   బరబర లాగుచుందురట పైటల! కర్ణకఠోరమై సఖీ
   గరగర లాడు చుండు సయి కాలపు పోకడ తీరు గా భళీ
   స్వరములు లేని గీతములు, శ్రావ్యము లయ్యెను లోకులెన్నగన్!


   జిలేబి

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 23. బోయడదె రామాయణము వ్రాసెనని అందరనెదరు
  దారి దోపిడిలు హత్యలు అతడు చేసినవవి కనరు
  నేనారీతి అభినవ వాల్మీకినని పలుకు సదా
  చోర వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా

  రిప్లయితొలగించండి


 24. ఉల్ముకము బట్టి వెతికితి
  నిల్మెతవారిఖు చదివితి నెచటన్ గలదో
  యిల్మీ చెప్పవె సఖియా,
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగ, దా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణలో ఇల్మెతవారిఖు, ఇల్మీ అన్నవి అర్థం కాలేదు.

   తొలగించండి


  2. ఉల్ముకము - కొరవి దీపము

   ఇల్మెతవారిఖ్ - ఇతిహాస విద్య/చరిత్ర

   ఇల్మీ - జ్ఞానము తెలియ జేయుట


   ఆంధ్ర భారతి నమో నమః


   జిలేబి

   తొలగించండి
 25. కల్మషమే లేదుగ కవి;
  చెల్మియు నాదరణ గలుగు చెన్నగు పురమే;
  బల్మి గల చోటె యనువగు;
  "వాల్మీకికి; రాజమండ్రి; వాసమ్ము గదా"

  రిప్లయితొలగించండి
 26. రెండవ పాదానికి భంగ్యంతర పాదము:
  "పల్మారులు నుడువ నేల బంగరు పురమే"

  రిప్లయితొలగించండి
 27. [రాజమండ్రిలో నివసించు నొక వాల్మీకి నామునిఁ గూర్చి చెప్పు సందర్భము]

  వాల్మీక కులాభిమతిన్
  వాల్మీ కాభిధను నొకఁడు బాగుగఁ గొనియున్
  గల్మినిఁ బొందెను; కనఁ ద
  ద్వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా!

  రిప్లయితొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని భారతం వాల్మీకిది కాదు కదా?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 29. కల్మష వినాశకుఁడు దాఁ
  బల్మరు రామా యటంచు భాషించు మహా
  శాల్మలి సంస్థిత కోకిల
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా

  [రాజము +అండ్రి = రాజమండ్రి; రాజము = రజస్సంబంధ మైనది; అండ్రి = అనిరి; వాసము =ఇల్లు / పుట్ట]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 30. కల్మియన రామ నామమె
  వాల్మీకికి! రాజమండ్రి వాసమ్ము కదా
  బల్మిని భారతమును ని
  ష్కల్మషముగ వ్రాసిన తొలి కవి నన్నయకున్!

  రిప్లయితొలగించండి
 31. వల్మీకంబున పాములు
  సల్మాన్ ఖాన్ సినిమ లందుసరసంబులులా
  అల్మారందున డబ్బుల?
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగద| {వాల్మీకి=పుట్ట}

  రిప్లయితొలగించండి
 32. కేల్మోడ్చెద తాపసియౌ
  తాల్మిని ప్రవహించు నెచట దక్షిణ గంగే
  వల్మీకము పాములకున్
  వాల్మీకికి, రాజమండ్రి, వాసమ్ము గదా!!!

  రిప్లయితొలగించండి
 33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 34. కల్మషములే తొలగు కా
  వ్యాల్మధురమ్ముగను వ్రాసినట్టి కవికి యా
  మేల్మేలనాంధ్ర భారత
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగదా.

  రిప్లయితొలగించండి
 35. కందం
  మేల్మినిఁ బేర్గను వారిని
  చెల్మిని మావారలనుచుఁ జెప్పుచు సభలో
  బల్మిగొనఁ బల్కె నొక్కఁడు
  "వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా"

  రిప్లయితొలగించండి
 36. వాల్మీకి రామచరితన్
  తాల్మిన్ వావిళ్లవారు తగ బ్రచురింపన్
  మేల్మిన్ గూర్చిన దాంధ్రకు
  *"వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా"*
  (వావిళ్ల రామస్వామిశాస్త్రులు అనే ప్రచురణకర్తలు రాజమండ్రి వారు . వీరు వైదికసాహిత్యానికిచెందిన అనేక గ్రంథాలని వెలుగులోకి తెచ్చిన వారు. వారే కాక పూర్వం అనేకమంది ప్రచురణకర్తలు అక్కడి వారు ).

  రిప్లయితొలగించండి
 37. మేల్మి కవనమందించిన
  వాల్మీకికి ,రాజమండ్రి వాసమ్ముగ దా
  కల్మషము బాపు నదికిన్
  కేల్మొగిచి నిడెద ప్రణతులు కెరలిన భక్తిన్ !

  రిప్లయితొలగించండి
 38. మేల్మిగ వెల్గిన నభినవ
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ముగ దా
  బల్మి గల సాహితీ కవి
  తల్మాధుర్యముగ జెప్ప దాసుండైతిన్ !

  రిప్లయితొలగించండి
 39. వాల్మీకీ గృహములనుచు
  మేల్మిగ సౌకర్యమిచ్చి మెచ్చ గిరిజనుల్
  బల్మి నొసంగె ప్రభుత్వము
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము కదా !
  (బ్యాంకులు ప్రభుత్వపథకంగా వాల్మీకి, అంబేద్కర్ ఆవాస్ యోజన అనే పేరుతో హరిజనగిరిజనులకి గృహసముదాయాన్ని ఇచ్చాయి)

  రిప్లయితొలగించండి
 40. ఆటవిడుపు సరదా పూరణ:
  (హైదరాబాదు మణిప్రవాళ భరితము)

  దాల్మే కాలా జైసా
  గోల్మాలై పోయెగదర గుల్షన్ భాయీ
  ఫూల్మే కాఁటా ప్రాసా:
  "వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా"

  గమనిక: ఈ పూరణలోని పదములన్నియు
  "ఆంధ్రభారతి నిఘంటు శోధన"
  లో కలవు ("గుల్ మొహర్" వలె)

  http://www.andhrabharati.com/dictionary/

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆంధ్రభారతి కి మార్కెటింగ్ మేనేజర్ అయ్యారేంటి జీపీయెస్ వారు ? :)


   జిలేబి

   తొలగించండి
 41. కేల్మోడ్తునునేనిరతము
  వాల్మీకికి,రాజమండ్రివాసమ్ముగదా
  వాల్మీకిరామకధనిల
  దాల్మినిదావ్రాసెవిశ్వనాధుడెయరయన్

  రిప్లయితొలగించండి
 42. రేపు కఠిన మైన సమస్య ఎదుర్కోoడి గురువు గారు రేపు ఊళ్లో ఉండరు.

  రిప్లయితొలగించండి
 43. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా

  సందర్భము: నన్నయ పొరుగూరులు తిరిగి రాజమండ్రికి మరలి వచ్చేటప్పుడు దారిలో ఒకానొక వల్మీకమును (పుట్టను) దర్శించాడు. వెంటనే ఆ మహాకవికి వాల్మీకి గుర్తుకు వచ్చాడు. వాల్మీకికి మనస్సులోనే నమస్కరించి కదిలాడు.
  రాజమండ్రి నన్నయ నివాసం కదా!
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  పల్మఱు నన్నయ పొరుగూ
  రు ల్మాన కఱిగి కనె మరలుచుఁ బుట్టన్; గు
  ర్తు ల్మదిఁ దోపగ మొక్కెను
  వాల్మీకికి.. రాజమండ్రి వాసమ్ము గదా

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  16.6.18

  రిప్లయితొలగించండి


 44. వల్మీకంబే వాసము

  వాల్మీకికి, రాజమండ్రి వాసమ్ము గదా

  పల్మందినుతించెడికవి

  వాల్మీకికి,కందుకూరి పంతుల,కిలలో.

  రిప్లయితొలగించండి