5, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2697 (చంద్రునిలో లేడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"చంద్రునిలో లేడి తినెను జగతినిఁ దృణమున్"
(లేదా...)
"చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్"

78 కామెంట్‌లు:

 1. సంద్రమ్ములు లేవు గదర
  చంద్రునిలో; లేడి తినెను ధాత్రీతృణమున్
  సాంద్రపు టడవుల లోనను
  చింద్రము చింద్రముగ దునిమి చిందుల తోడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చింద్రము : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)

   2. ఖండము

   తొలగించండి
  2. సంద్రమ్ములు లేవు గదర
   చంద్రునిలో; లేడి తినెను జగతినిఁ దృణమున్
   సాంద్రపు టడవుల లోనను
   చింద్రము చింద్రముగ దునిమి చిందుల తోడన్

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. ఐoద్రి భుజించెను కబళము
  చంద్రుని పై కలియుగమున, జలపుష్పంబుల్
  సంద్రము నువీడి వెడలెన్,
  చంద్రునిలో లేడి తినెను ధాత్రీతృణమున్"

  కలియుగము చివరలో కాకి చంద్రునిపై భోజనము చేసెను.చేపలు సముద్రము వదలి దివిలో నివసిoచెను చంద్రునిలో లేడి నేలపై గడ్డి తినెను అను భావన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   అభినవ కాలజ్ఞానంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. కంది శంకరయ్య గారు:

  కందపాద సమస్యలో యతి తప్పింది. సవరిస్తున్నాను...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. యతి ప్రాసలు మీ సమస్యలు :) మాకు కావు :)

   ఇచ్చిన వాక్యానికి కిట్టింపు వరకు మాత్రమే మా పని :)

   Its not our problem you know :)


   జిలేబి

   తొలగించండి
  2. అప్పుడప్పుడు మీ ఛందోజ్ఞానాన్ని పరీక్షించడానికి కావాలనే తప్పుగా ఇవ్వవచ్చు కదా!

   తొలగించండి


 4. పంద్రుండ్రు, శశమును గనిరి
  చంద్రునిలో, లేడి తినెను ధాత్రీతృణమున్,
  మంద్రము గా గానంబట
  కంద్రీగవలె చెవి తొలిచె కవన జిలేబీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. చంద్రుడు అమృతకిరణుడు... అక్కడ యున్న లేడి భూమిపై గడ్డితినుట అంటే... ఇలా


   సాంద్ర శతాధ్వరార్జిత విశాల మహా ఘన పుణ్యలబ్ధదే..
   వేంద్రపదాధిరూఢుడు శచీశుడు దీనత గోర జేరి యం
   గేంద్రుని చేయి చాచుటన హీనము గాదొ , విచిత్రమే యగున్ !
   చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్ !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. అర్థాంతరన్యాసాలంకారంతో మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 6. డా.పిట్టాసత్యనారాయణ
  అమ్మ శిశువుకు గోరుముద్ద తినిపించే సన్నివేశము
  ఇంద్రుని జూపిన నోరు సి
  సింద్రీ విప్పడుగ అమ్మ చేష్టలు జేయన్
  "భింద్రా"(శిశువు పేరు)చూడుము యిదిగో
  చంద్రుని లో లేడి తినెను ధాత్రీ తృణమున్
  (అనగానే చూడబోయి నోరు తెరువడం, అమ్మ గోరుముద్ద దాటించడం..)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   చక్కని స్వభావోక్త్యలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చూడుము + ఇదిగో' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "చూడుమ యిదిగో" అనండి.

   తొలగించండి
 7. క్రిక్కిరిసె భూమినొదిలి గ్రహమును వెతుకనె
  స్టీఫెన్ హాకింగ్
  వాస్తవం ఇదే అయినప్పటికిని వినుటకు
  మనకది జోకింగ్
  మూగ జీవులకు తనకు తరలించె భూమిపైని
  గ్రాసంబనగన్
  చంద్రుని లోని లేడి తినసాగెను ధారుణిపై
  తృణంబులన్

  రిప్లయితొలగించండి
 8. ఇంద్రునియంశతోడ జనియించినవాడు మహాతపోభిని
  స్తంద్రుడు ఫల్గునుండు జని ధన్యతనొందగ పార్వతీశుపై
  సంద్రమువోలె బాణము లసంఖ్యగ వేయుచు నేలగూల్పగన్
  చంద్రునిలోనిలేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   అర్జునుడు శివుణ్ణి నేల గూల్చడం అతిశయోక్తియే. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీ బాపూజీ గారూ! మీ పద్యం బాగున్నది.
   ఈరోజు నేను కూడా కిరాతార్జునీయ సన్నివేశమునే స్వీకరించానండీ. నమోనమః

   తొలగించండి
  3. ఔనండీ! చాలా సంతోషంగా ఉంది . "వడకుం గుబ్బలి
   కుమారి వడవడ వడకెన్ "అని శ్రీనాథోక్తి కదా! స్వామి పార్వతీదేవి పలుకులనీ పార్థుని ములుకులనీ భరించాడు .నమస్సులు .

   తొలగించండి
 9. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  ఇంద్రుని తోటనుండిభువికీడ్చెను కృష్ణుడు పారిజాతమున్
  నాంధ్రము నందునన్ తృణము లప్పుడు చక్కగ పృథ్వినిన్ బడ
  న్నింద్రుని నందన మ్మగుచునిచ్చట ధాన్యములిచ్చి బ్రో
  చం;"ద్రుని" లోనిలేడి తినెసాగెను ధారుణిపై తృణంబులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. చారి గారూ,
   మీ పూరణలో కొంత అన్వయలోపం ఉన్నది. 'ద్రుని' అంటే?

   తొలగించండి
 10. సమస్య :-
  "చంద్రునిలో లేడి తినెను ధాత్రీతృణమున్"

  *కందం*

  ఇంద్రడు పూరియు బెట్టగ
  చంద్రునిలో లేడి తినెను; ధాత్రీతృణమున్
  రంద్రాన్వేషణ జేయ గ
  జేంద్రునికైనను దొరకదు సేకరణ దినన్
  ...................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సమస్యలోని యతి సరిజేయబడింది. మీరు గమనించినట్టు లేదు.

   తొలగించండి
 11. మంద్రపు గీతమేదొ నను మాయను జేయగ రాత్రివేళలం
  దింద్రుని స్వప్న మందుగని నిందుని బొంది ధరిత్రి కేగ ని
  స్తంద్రము జూపి చెంగుమని సంభ్రమ మొందుచు దూకి *బాపురే*
  *చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీహర్ష గారూ,
   మీ స్వప్న వృత్తాంతపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. అతిశయముగ చెప్పెదవే
   సతతము  - నీవన్ననిపుడు     *"చంద్రునిలో లే
  డి తినెను జగతినిఁ దృణమున్"*
  మతిగలవాడెవడు వినడు మహిలోన సుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేసి, ప్రాసను సుగమం చేసికొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. శ్రీ చంద్రమౌళి గారూ!
   మీ పద్యంలోని గర్భకవిత్వమునకు
   అభినందనలను సమ్మతితో అందజేస్తున్నానండీ. .

   తొలగించండి
 13. ఇంద్రుని నందన వనమున
  సాంద్రత లేనట్టి భూమి సారము లేకన్
  ఆంధ్రమున పసిడి పంటలు
  చంద్రునిలో లేడి తినెను జగతినిఁ దృణమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. కాని సమస్య సమర్థంగా పరిష్కరింపబడలేదు.

   తొలగించండి
 14. డా.పిట్టాసత్యనారాయణ
  ఇంద్రుని రాజ్యకాంక్షవలె నిచ్చటి శోధక విజ్ఞులెల్లరా
  తంద్రిత శ్వేత సత్కిరణ తత్పర ఛాయల జూచి యోర్వకన్
  సాంద్రత గన్నయా శిలల చయ్యన దెచ్చిరి వారి స్వప్నమా
  మంద్ర సరాగ జీవముల మాటును వేసియు జూడనీగతిన్
  "చంద్రుని లోని లేడి తిన సాగెను ధారుణి పై తృణంబులన్ "

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఎల్లరు + ఆతంద్రిత.. ఎల్ల + రాతంద్రిత.. ఎల్లరు + ఆ + తంద్రిత...'? 'శ్వేత'కు ముందున్న 'త' గురువై గణదోషం.

   తొలగించండి
 15. చంద్రన్న మంచి నేతయె
  చంద్రన్నను పట్టినట్టి చవటలు నీతిన్
  సంద్రమున ముంచి వైచిరి
  "చంద్రునిలో లేడి తినెను జగతినిఁ దృణమున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   సమకాలీనాంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. చంద్రునితో మిత్రుత్వము
  సంద్రము పాలైన వేళ సహియింపక నా
  కేంద్రము పలికిన పలుకులు
  చంద్రునిలో లేడితినెను జగతినిఁ దృణమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మిత్రత్వము' అనండి.

   తొలగించండి

 17. అంద్రు జనులు మృగముందని
  చంద్రునిలో; లేడి తినెను జగతిని దృణమున్
  చంద్రుని పరిపాలనలో
  నాంధ్రుల కెనలేని యాస్తి యమరావతిలో!

  తృణమో, పణమో! 😊😊

  రిప్లయితొలగించండి
 18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2697
  సమస్య :: *చంద్రుని లోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్.*
  చంద్రునిలో ఉండే జింక భూమిపైన ఉండే గడ్డిని తినడం మొదలుపెట్టింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: అన్నయైన ధర్మరాజు యొక్క మాటననుసరించి అర్జునుడు హిమాలయంలో తపస్సు చేస్తూ పాసుపతాస్త్రాన్ని పొందదలచాడు. కిరాతుని వేషంలో వచ్చిన శివునితో పోరాడుతూ తనవింటితో తలపై కొట్టగా శివుడు నేలపై వ్రాలినాడు. అప్పుడు చంద్రమౌళి తలపై ఉన్న చంద్రునిలో ఉన్న జింక ‘’ ఓడిపోయినవాడు ఇంద్రుడైనా సరే గడ్డి మేయడం సహజం. నా ప్రభువైన చంద్రునికి ప్రభువైన శివుడే ఓడిపోయి నేలపై వ్రాలినాడు. అమృతాన్ని ఆస్వాదించే నేను ఇప్పుడు అనాథగా ఈ నేలపై గడ్డిని మేయ వలసిందే గదా అని అనుకొంటూ గడ్డి గఱచే సందర్భం.

  ఇంద్రసుతుండు చాపమున యేయగ వ్రాలె మృగాంకమౌళి, తా
  నింద్రుడె యైన నోడిన గణింపక గడ్డిని మేయు గాన, నా
  చంద్రుని మౌళిఁ దాల్చు పతి శర్వుడె యోడె నటంచు, వెంటనే
  *చంద్రుని లోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (5-6-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   "చాపమున నేయగ.." అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. నిజమేనండీ గురువర్యా నమోనమః

   తొలగించండి
 19. జై చంద్రబాబు!
  నిజము నిర్గుణునికెఱుక!

  మంద్రముగాను చెప్పినను మార్దవ పల్కుల నాలకించడే
  యింద్రుడు చంద్రుడన్న మరి యించుక దొణ్కడు చేయి చాచడా
  చంద్రుడె, యాంధ్రమం దతడ సాధ్యుడు, చోరుడు-లంచగొండనన్
  *"చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మార్దవ పల్కులు' దుష్టసమాసం. "మార్దవ వాక్కుల..." అనండి.

   తొలగించండి
 20. సాంద్రపు పరి శోధన లో
  నింద్రుని సాక్షి గ ను లేద దె oదున మృగమం
  చం ద్రుగ దా మరి యెక్కడ
  చంద్రుని లో లేడి తినె ను జగతి ని తృణము న్

  రిప్లయితొలగించండి
 21. సంద్రముగలదని యందురు
  చంద్రునిలో,లేడితినెనుజగతినిదృణమున్
  చింద్రముగజేసికొనుచును
  మంద్రంబుగబ్రేవుమనుచుమర్త్యునివోలెన్

  రిప్లయితొలగించండి
 22. మితిమీరిన యాకలి తో
  జతకలిసిన దొంగలంట చంద్రునిలో లే
  డి, తినెను జగతిని తృణమున్
  అతిశయ మేమున్నది యది అబ్బురమేలన్

  రిప్లయితొలగించండి
 23. ఇంద్రుని చెంతకేగిన మహీతల మాన్యుడు చెప్పెనీ తరిన్
  సంద్రము లేని రాజ్యమది సాధన తోడను పొందినట్టి యా
  చంద్రుడు వెన్నెలీనుచును జల్లని కాంతులనివ్వనేమి యా
  చంద్రుని లోనిలేడి తినసాగెను ధారుణి పై తృణంబులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'తృణమున్ అతిశయ' మని విసంధిగా వ్రాయరాదు. 'ఏలన్'..? అక్కడ "అబ్బుర మెటులౌ" అనండి.

   తొలగించండి
 24. అంద్రు కవు లూఱక కురం
  గేంద్రము గెంతుచు వడివడి నింపుగ, లేదీ
  సంద్రము గింద్రము నెందును
  చంద్రునిలో లేడి, తినెను జగతినిఁ దృణమున్


  చంద్ర నిభాస్య సీత గ్రహ చారము నేమన వచ్చు రాజ రా
  జేంద్రులు మెచ్చు భోజనము లెన్నని తాఁ దినెఁ గంద మూలముల్
  సంద్రము దాటి దైత్యు చెఱ శారము జానకి యారగించెనే
  చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! మీ వృత్తపూరణ ఆర్ద్రంగా అద్భుతంగా ఉన్నది! 🙏🙏🙏

   తొలగించండి
  2. సంద్రము దాటి దైత్యు చెఱ శారము జానకి యారగించెనే....కొంచెం వివరించరా కామేశ్వర రావు గారూ.

   తొలగించండి
  3. డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.
   మిస్సన్న గారు నమస్సులు. సముద్రమును దాటి (తీసుకొని రాబడి) రావణాసురుని చెఱలో నుండి వాయువు తిని (ఉపవాసములతో) కృశించినదని నా భావమండి.

   అంతట నచటఁ గాంచెను హరి వరుండు
   మలిన వస్త్రను రాక్షస మానినీ వృ
   త నుపవాస కృశాంగినిఁ దరుణి దీన
   వదన మఱి మఱి కుముల నిశ్వాసములను

   శుక్ల పక్షాదిఁ గనిపించు సోమ రేఖఁ
   బోలు నామె నస్పష్ట రూపున నగపడు
   నామె రుచిర ప్రభ వెలుఁగు నామె ధూమ
   జాలమున నగ్నికీలను బోలు నామె

   ముఖము కన్నీటి ధారల మునుఁగు నామె
   కూడు వీడఁగఁ గృశియించి కుములు నామె
   ముచ్చిరి తనమ్ము నిచ్చలు మూఁడు నామె
   దీనురాలి వెత కధీన మైన యామె

   మూలము:
   తతో మలినసంవీతాం రాక్షసీభిస్సమావృతామ్৷৷5.15.18৷৷
   ఉపవాసకృశాం దీనాం నిశ్శ్వసన్తీం పునః పునః.

   దదర్శ శుక్లపక్షాదౌ చన్ద్రరేఖామివామలామ్৷৷5.15.19৷৷

   అశ్రుపూర్ణముఖీం దీనాం కృశామనశనేన చ.
   శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణామ్৷৷5.15.23৷৷

   తొలగించండి
  4. లవకుశ సినిమాలో
   *రంగారు బంగార చెంగావులు ధరించు
   శృంగారవతి నారచీర లూనె*
   అనే సీస పద్యాన్ని (కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణం లోని పద్యాన్ని) గుర్తుకుతెచ్చిందండీ మీ పద్యం శ్రీ కామేశ్వర రావు గారూ! నమోనమః.

   తొలగించండి
  5. రాజ శేఖర్ గారు నమస్కారమండి. ఆ మహానుభావుని పద్యము మీకు గుర్తుకు వచ్చినందుకు నాకు మహదానందము కలిగినది. ధన్యోస్మి. లవకుశ చిత్రమంటే నాకు మహా యిష్టము. కనీసము 50 సార్లు చూసి యుంటాను నేనా చిత్రము.

   తొలగించండి
  6. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు.

   తొలగించండి
 25. మిత్రులందఱకు నమస్సులు!

  [ఇంద్రునితో నారదుఁడు మాటలాడు సందర్భము]

  చంద్రునిఁ జూడ నేఁగియు, విచారముఁ గొంటిని, లేడి లేక! దే
  వేంద్ర! యిదేమి వింతయయ! హేతువునుం గనరాదు! చంద్రికా
  సాంద్ర మయూఖ మార్గమునఁ జక్కఁగ సాఁగుచు, వేగ నేఁగి, యా

  జంద్రునిలోని లేడి, తినసాఁగెను ధారుణిపైఁ దృణంబులన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండో పాదంలో చిన్న మార్పు:

   చంద్రునిఁ జూడ నేఁగియు, విచారముఁ గొంటిని, లేడి లేక! దే
   వేంద్ర! యిదేమి వింతయొకొ? హేతువునుం గనరాదు! చంద్రికా
   సాంద్ర మయూఖ మార్గమునఁ జక్కఁగ సాఁగుచు, వేగ నేఁగి, యా
   జంద్రునిలోని లేడి, తినసాఁగెను ధారుణిపైఁ దృణంబులన్!

   తొలగించండి
  2. పద్యం చాలా బాగున్నదండీ. నమోనమః

   తొలగించండి
  3. ధన్యవాదాలండీ కోట వారూ! మీ అభిమానమునకు కృతజ్ఞుడను!

   తొలగించండి
 26. "చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్"
  చంద్రునిపైనలేడియటచావలిగడ్డినిమేయుటేమి,యా
  చంద్రుడుచూడగాగ్రహముశంబరమయ్యదిజంతువేగదా
  చంద్రునిపైనలేడియది సంభవ మెట్లగుజింతజేయగన్

  రిప్లయితొలగించండి
 27. చంద్రునిపై జీవించుట
  ఇంద్రునికే చేతగాదు!యెప్పటికైనన్
  చంద్రునికడనివ సించిన
  చంద్రునిలో లేడితినెను?జగతిని తృణమున్

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (భవిష్యవాణి: శ్రీహరికోట)

  చంద్రుని యానముల్ విరిసి చందురు నింపుగ నాక్రమింపగా
  చంద్రుని యందునన్ వెలసి చారుతరమ్ముగ తీర్చిదిద్దుచున్
  సంద్రము లేఱులున్ వనుల చక్కగ కూర్చగ భారతీయులా
  చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్

  ధారుణి పై తృణంబులు = భూమిపై నుండి తేబడిన తృణములు
  https://en.m.wikipedia.org/wiki/Chandrayaan-1

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారి ఆట విడుపు పూరణలు బలు పసందు.నమస్సులు

   ...దహగం సాంబమూర్తి

   తొలగించండి
 29. ఉత్పలమాల
  ఇంద్ర సభాంతరంబున మహేంద్రుడుఁ దక్కిన వారలున్ హరి
  శ్చంద్రుని సత్యసంధతను శ్లాఘ్యమనన్ ముని కౌశికుండిలన్
  చింద్రము జేయబోయి భువిఁ జేసిన కార్యము లిట్లుఁ దోచవే? 
  చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్!


  రిప్లయితొలగించండి
 30. సాంద్ర నిహారమున్ దినుచు చక్కగ గుంతల గంతులేయునే
  చంద్రునిలోని లేడి; తినసాగెను ధారుణిపై తృణంబులన్
  మంద్ర గతిన్ కురంగమది మండెడు నెండలలోన నీటికై
  యింద్రుని గోరుచున్నకట యెండిన కుంటల జాడలేగనన్

  రిప్లయితొలగించండి
 31. సాంద్ర నిపాతకంబులను సాకుట జేసి భరింపలేని దే
  వేంద్రుడు మేఘదూతలను వెన్ బిలువన్ గని యౌషధీ దిటౌ
  చంద్రునిలోని లేడి తిన సాగెను ధారుణిపై తృణంబులన్
  చింద్రము బీడునై తనరె చిత్రపు కాలము కంటిరే కలిన్

  రిప్లయితొలగించండి
 32. భూమినుండి విడివడిన భాగమే చంద్రునిగా మారిందని శాస్త్రజ్ఞుల ఉవాచ 😊

  చంద్రుడు ధరణి తునకయె
  చంద్రుని లో గల మృగమది సాగెను ధరణిన్
  చంద్రుడు భూభాగ మపుడు
  *"చంద్రునిలో లేడి తినెను జగతినిఁ దృణమున్"*

  రిప్లయితొలగించండి
 33. కందం
  ఇంద్రాదులు మెచ్చ, హరి
  శ్చంద్రుని నగుబాటుఁ జేయ సాగిన మునినే
  మంద్రు భువి మహాత్ములనన్
  "చంద్రునిలో లేడి తినెను జగతినిఁ దృణమున్"

  రిప్లయితొలగించండి
 34. గంద్రపు గోళమిద్దియెర! గంతులు వేయగ కానరామయో
  చంద్రునిలోని లేడి;...తినసాగెను ధారుణిపై తృణంబులన్
  చింద్రపు చందమై బ్రతుకు చీకటి ద్రవ్యము కూడబెట్టగా
  కేంద్రపు మంత్రి దూరగను ఖేదము నొందుచు ఖైదునందునన్

  రిప్లయితొలగించండి