11, జూన్ 2018, సోమవారం

సమస్య - 2703 (జారులు నుతియింపఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్"
(లేదా...)
"జారులు ప్రస్తుతింప హరి శైలజఁ గూడె సురాళి మేలుకై"

118 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. డాక్టర్ వెలుదండ్ల సత్యనారాయణ గారి సవరణతో:

   నోరులు పవిత్రమయె పూ
   జారులు నుతియింపఁగ హరి; శైలజఁ గూడెన్
   మారుని వధించిన శివుడు
   కోరిక పార్వతిది తీర కొండల పైనన్

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. బారులు తీరగ భక్తులు
  జోరుగ మంత్రములు చదివి సొంపుగ ముదమున్
  ధారగ నభిషేక మునపూ
  జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగున్నది. మూడవ పాదంలో గణదోషం. "ధారాభిషేకమున పూ..." అనండి.
   కాని హరి శైలజను కూడడం?

   తొలగించండి
  2. ధారా భిషేక మునపూ
   జారులు నుతియింపఁగ హరి , శైలజఁ గూడెన్
   మారరిపుని చెంత ముదముగ
   జోరుగ మంత్రములు జదివి సొంపొన రింపన్

   తొలగించండి 3. వారిది ప్రేమవివాహము !
  చేరగ నొకరికియొకరుగ చెంగట, మజ మిం
  చారంగ జిలేబీ, పూ
  జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👏👏👏

   ఆహా! ఏమి పూరణ! మా అబ్బాయి పేరు శ్రీనివాస్ శ్రీనాథ్; కోడలి పేరు శైలజ; వారిది ప్రేమ (గల) వివాహము :)

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '... నొకరికి నొకరుగ' అనండి.

   తొలగించండి
  3. పరకుటుంబ సమస్యకు ఇహకుటుంబ సమాధానం..
   జీపీయస్ వారికి కనెక్టయ్యేట్టుగా :-)
   👏🏻👌🏻

   తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి

  5. యాదృచ్చిక లీలా విశేషము బాగుందండీ జీపీయెస్ వారు

   మీరొక హరి మీకొమరులొక హరి శైలజ కొక హరి
   వెరసి హరిత కుటుంబం :)


   జిలేబి

   తొలగించండి
  6. మామూలు గుఱ్ఱాలు కావండీ! ఇంద్రుని హరిత గుఱ్ఱాలు! 😊😊👍👍

   తొలగించండి


 4. మా అయ్యరు గారు రావే జిలేబి రావే అని పిలిచిరి నాడు :) (నేడు దుడ్డుకర్ర భయం వదలటం లే :)


  చేరగ లక్ష్మి భాగ్యముగ చెంగట కట్టెను తాళినంట పూ
  జారులు ప్రస్తుతింప హరి, శైలజఁ గూడె సురాళి మేలుకై
  వారుని కర్ధ నారి గను, భారతి చేరెను నాత్మ సంభవున్,
  పారము రా, జిలేబి, సముపార్జన చేయగ ధర్మ పత్నిగా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వారుని కర్ధనారి'?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి

  3. శైలజ వారుని కి అర్ధ నారి గ చేరెను అని ; సరియే నాండి ?


   చేరగ లక్ష్మి భాగ్యముగ చెంగట కట్టెను తాళినంట పూ
   జారులు ప్రస్తుతింప హరి, శైలజఁ గూడె సురాళి మేలుకై
   వారుని గేస్తు రాలుగను , భారతి చేరెను నాత్మ సంభవున్,
   పారము రా, జిలేబి, సముపార్జన చేయగ ధర్మ పత్నిగా !

   జిలేబి

   తొలగించండి
  4. కాస్త చనువు తీసుకున్నందుకు క్షమించాలి...

   కనిపించే మూడు మూర్తులూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైతే (మాకెవ్వరికీ) కనిపించని ఆ నాలుగోమూర్తే ఈ జిలేబేశుడు..:)
   🙏🏻

   తొలగించండి

  5. జిలేబేశుడు ఇంద్రభోగాలనుభవిస్తో రావే జిలేబి రావే అని పిలుస్తున్నాడండి :)

   ఆ రావే సమయంబింకా రాలె :)


   జిలేబి

   తొలగించండి
  6. జిలేబిగారూ! నిన్న మీరిచ్చిన మత్తకోకిల పూరించానండీ! చూశారా?

   తొలగించండి

  7. ఇప్పుడే చూసొస్తున్నానండోయ్

   తేనియలూరుచుండె తెలుగు :)


   జిలేబి

   తొలగించండి
 5. కందం
  ధారుణి వధూవరులను ర
  మా రమణులనంగ శ్రుతులు, మహిమాన్వితుఁడౌ
  సారంగుడట వరుఁడు! పూ
  జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  చేర శివాలయమ్మునకు ., చెప్పిరి యాలయగాథ భక్తిఁ బూ...
  జారులు ప్రస్తుతింప ., హరి శైలజఁ గూడె , సురాళి మేలుకై
  చేరె గజాస్యు మూషికము, చేరె నటేశుని నంది , షణ్ముఖున్
  జేరినదా మయూరము విచిత్రము శైవకుటుంబమిద్దియే !!

  హరి... సింహము

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ శైవ కుటుంబము :)

   ఈ మధ్యే వరల్డు ఎన్విరాన్మెంట్ డే అని ఓహో ఆహో అని మాట్లాడేరు చాలా మంది :) మీ పద్యం చూస్తే శివా ది "ఆది" ఎన్విరాన్ట్మెంటలిస్ట్ అని చెప్పేసుండొచ్చు !


   అదురహో

   జిలేబి


   తొలగించండి
  2. హరికి గల ప్రత్యేకార్ధంతో అద్భుతమైన పూరణ అవధానిగారూ! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
  3. ధీరత భండాసురసం...
   హారార్థము జనుచునుండె నమ్మ , తురగమై
   లేరా! సాయమునకనుచుఁ
   జారులు నుతియింపఁగ హరి, శైలజఁ గూడెన్!!

   చారులు... గూఢచారులు
   హరి.. సింహము

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 7. చోరులకు రేడు కొండడు
  గౌరమ్మ కొమార్తె! మరియొక హరికుడే కా
  గా రాధారమణుడు, కయి
  జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   హరికుడు...?

   తొలగించండి

  2. హరికుడు
   హరికుడు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
   n.
   A thief, a gambler. తస్కరుడు, ద్యూతకారుడు.
   హరికప్రయోగము gambling, ద్యూతము.
   "రాజమృగాదిముఖబంధనంబును హరిక ప్రయోగంబును." G. ix.177.


   జిలేబి

   తొలగించండి
 8. కం.
  జోరుగ వివాహ వేడుక
  పేరున్న కుటుంబమందు పెద్దలు కూర్చన్
  వారే హరి,శైలజ పూ
  జారులు నుతియింపగ హరి శైలజ గూడెన్ ..

  రిప్లయితొలగించండి
 9. దుష్టుల శిక్షింప శిష్టుల రక్షింప హరిహరులు
  తమకు తాము సరి
  మానవాళి మేలుకై పూనెదరు వారు తమ
  లీలలుగా గురి
  మోహినిగా తానదె మరులు గొలిపె జారులు
  ప్రస్తుతింప హరి
  శైలజ గూడె సురాళి మేలుకై భవుని షణ్ముఖ
  జన్మగ మరి

  రిప్లయితొలగించండి
 10. ఆరాధన కు తని సె పూ
  జారు లు ను తి యింప గ హరి ;శైలజ గూడెన్
  కోరి క తో మను వాడి యు
  మారుని వి రి తూ పుతగు ల మక్కువ తోడ న్

  రిప్లయితొలగించండి
 11. కార్తీక మాసంలో గుడిలో దీపం (స్వార్ధమైనా సరే) పెట్టినంతమాత్రాన శత్రుజిత్తును కైలాసానికి తీసుకుపోయాడే శివుడు. మరి హరిమాత్రం జారులు పూజలు చేస్తే అందుకోడా!

  వేఱుగ నెంచడు మరుఁడని
  "జారులు నుతియింపఁగ హరి, శైలజఁ గూడెన్"
  మారునిఁ జంపిన శివుడే
  తీరును దెలివిన గనంగ దెలియును నిజమే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జారులను జారులుగానే ఉంచాలనే ప్రయత్నంలో పూరణలో నేను ఫెయిల్..

   అందుకే శ్రమించైనా జారులను పూజారులను చేయాలని విజ్ఞులు సెలవిచ్చి యుంటారు
   :)

   తొలగించండి
  2. మీ పూరణలో కొంత అన్వయలోపం ఉన్నట్లుంది.

   తొలగించండి
 12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2703
  సమస్య :: *జారులు ప్రస్తుతింప హరి శైలజఁ గూడె సురాళి మేలుకై.*
  సందర్భం :: దుష్టుడైన కంసుని వధించేందుకు విష్ణు భగవానుడు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంలో కుమారుడుగా జన్మించాలని నిశ్చయించుకొన్నాడు. దేవకీదేవికి పుట్టిన ఆరుగురు బిడ్డలను కంసుడు చంపివేశాడు. ఆ తరువాత దేవకీదేవికి సప్తమ గర్భంలో ఆదిశేషుని పేర ఉన్న తన తేజస్సును నేర్పుగా బయటకుతీసి వసుదేవుని యొక్క మఱియొక భార్యయైన రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టవలసినది అని చెప్పేందుకు శ్రీహరి తన సహోదరి యైన యోగమాయను పిలిచినాడు. జరుగవలసిన పని గుఱించి ఆ శైలజతో కలసి మాట్లాడినాడు. సాధువులకు సురులకు మేలు కలిగించగోరిన ఆ శ్రీ హరిని పూజారులు మొదలైనవారు అందఱూ ప్రస్తుతించారు అని విశదీకరించే సందర్భం.

  ధీర! సహోదరీ! విజయ! దేవకి లోపల శేషతేజమై
  చేరితి, నాదు తేజమును శీఘ్రమె గైకొని రోహిణీసతిన్
  జేరుచు, నామె కుక్షి ననుఁ జేర్చు మటంచు వచింప బిల్చె; పూ
  *జారులు ప్రస్తుతింప హరి శైలజఁ గూడె సురాళి మేలుకై.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-6-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచి పూరణ అవధానిగారూ! అభినందనలు! కాని, త్రిపురాసుర సంహారంలో ఈశ్వరునికి దేవతలందరూ సహాయం చేసినట్లు, భండాసుర వధలో కూడ అమ్మవారికి ఇంద్రాది ( విష్ణువు సహా) దేవతలంతా సహాయం చేశారని విన్నాను! అలా యేమైనా పూరించడానికి వీలుంటే మా కోసం మరో పద్యం వ్రాయ ప్రార్ధన! 🙏🙏🙏🙏

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ఆర్యా! నా ప్రయత్నము నొక పరి పరికించ ప్రార్ధన!

   క్రూరుడు కర్వరిన్ దునుమ కోమలి యేతగు నంచు విష్ణు కం
   జారులు, నుతియింప హరి, శైలజ గూడె, సురాళి మేలుకై
   మీరగ సూర్యకోటిప్రభ మిన్నుల నంటిన నార్భటిన్ పరీ
   వారము తోడుగా జెనక భండుని, బాలను శ్యామలాదులన్!

   కర్వరి = రాక్షసుడు
   కంజారుడు = బ్రహ్మ
   హరి = ఇంద్రుడు

   బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా! 🙏🙏

   తొలగించండి
  4. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   *********
   సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  5. ధన్యవాదములు గురువుగారూ! సమస్యాపాదము వ్రాసుకోవడంలో తప్పుజరిగింది. సవరిస్తాను! 🙏🙏🙏

   తొలగించండి
 13. (కవిబ్రహ్మ-హరిహరనాథస్వామి)
  ధీరుడు తిక్కనార్యుడు నుతింప రమాసతిచేయి పట్టె పూ
  జారులు ప్రస్తుతింప హరి;శైలజ గూడె సురాళి మేలుకై
  హారతివెల్గులో హరుడు హాసముజేయుచు;నంతలోనె పెం
  పారిన వేడ్కతో హరిహరప్రభురూపము దాల్చె నెంతయున్,


  రిప్లయితొలగించండి

 14. విట్టుబాబు గారి కోసం జారులు మెచ్చిన కన్యను‌ "పేరువు" అనేవాడి పుత్రిక ను హరి యనే రారాజు లవ్వాడి మనువాడె :)


  పోరాడగ వెడలెను హరి
  రారాజు! తరుణియొకతె సరాగము లాడెన్
  పేరువు పుత్రిక యనుచున్
  జారులు నుతియింపఁగ, హరి శైలజఁ గూడెన్.

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. పోరాడగ వెడలెను హరి
   రారాజు! తరుణియొకతె సరాగము లాడెన్
   "మారాజుకుతగ్గ రమణి",
   జారులు నుతియింపఁగ, హరి శైలజఁ గూడెన్.

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. మారుని దునిమిన హరుడే
  ఘోర తపమునకును మెచ్చి గుబ్బలి పట్టిన్
  హోరున బొగడగ దివి పూ
  "జారులు,నుతియింపఁగ హరి;శైలజఁ గూడెన్"

  రిప్లయితొలగించండి
 16. ఘనముగ త్రిపురముల్ గగనము నందు గూల్చగ హరుని శరము , జగతి సంత
  సంబు తోడ పరవశంబు నొందెను , విరించి సహిత వేల్పులు చేరె శివుని
  చెంతకు, దివ్య యాశీస్సులు తాపసుల్ బలుకగ, శాంతి పూజలను జేసె
  ఘనముగా పూజారులు, నుతియింపగ హరి,శైలజ కూడెన్ విజయము బడసి,
  నాగ చూడుడా! ధూర్జటీ! నందివర్ధ
  నా! గరళకంఠ! జోహారు నైకమాయ
  యనుచు ఇంద్రాది దేవత లంకనములు
  జేయ , కైలాసపతి సంతసించె నపుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   కంద పాదాన్ని సీసంలో ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   కంద పాదాన్ని సీసంలో ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 17. ninnati naa samasya okka sari chudamdi guruvu gaaru

  హర్మ్యంబుల్దాకె దివిని,
  హర్మ్యంబులు దివిని వెలెసె, నచ్చెర్వాయెన్
  హర్మ్యంబులు తిమిని వెలియ,
  హర్మ్యంబున నీదులాడె నవి మత్స్యంబుల్
  నేలపై ఉన్న స్ధలము చాలక కలియుగ ములో ఇంజనీర్లు ఇతర గ్రహములలో ను మరియు సముద్రముల లోను భవనములు కట్ట సముద్రం లోని చేపలు జలధి లో కట్టిన హర్మ్యములలో ఈదులాడనని భావన

  రిప్లయితొలగించండి
 18. డా.పిట్టాసత్యనారాయణ
  తీరా నాయకు మనుమడు
  సూరి జనుడు పేదపిల్ల జూపుల గలిసెన్
  భూరి వివాహంబని బం
  జారులు నుతియింపగ హరి1శైలజ2 గూడెన్ (1,2 వరుడు ,వధువుల పేర్లు,వీరు ఆదిమ జాతి వారలు)

  రిప్లయితొలగించండి
 19. కోరిన వారికి వరములు
  సారెకు నందీయ శుభద శాంకరి కరమున్
  మారుని స్యందనమని పూ
  జారులు నుతియింప హరి శైలజ గూడెన్!

  రిప్లయితొలగించండి
 20. శ్రీ ప్రభాకర శాస్త్రిగారు మరియు శ్రీ సూరం వారి ప్రోత్సాహంతో...హరిని *బాజారుల* పాలు జేశా :-))

  తీరున సోదరుడై మమ
  కారము నను గాపు గాయు కారణముననే
  వీరత్వము నా మధురై బా
  "జారులు నుతియింపఁగ హరి(న్), శైలజఁ గూడెన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మా కయిజారుల నుతియింపు పద్యం చూపించండి మీ ప్రోత్సాహకులకు :)


   జిలేబి

   తొలగించండి
  2. ఇదివరలో యిలాంటిదే జారుల పూరణ యిచ్చినపుడు అన్నయ్య “ షేరు బజారుల” గురించి వ్రాసినట్టు గుర్తు!

   తొలగించండి


  3. బాజారుపాలయెన్నప
   రాజితుడున్ శైలజయు పరంధాముడు నౌ
   రా జిజ్ఞాసువుడా మిము
   మా జిల్లా వెంకటేశు మంచిగ గావన్ :)

   జిలేబి

   తొలగించండి
  4. సీతా:

   ఆది నా శంకరాభరణం ఎంట్రీ పద్యం. యతి దోషాన్ని పట్టించుకోకుండా శంకరయ్య గారు స్వాగతం పలికి బుట్టలో వేసుకొన్నారు 😊

   తొలగించండి


  5. నా యెంట్రీపద్యంబది
   ఆ యతి గణములు పదముల అవకతవకలన్
   హేయము గా చూడక మా
   సాయమొనర్చిరి గురువులు చల్లగ సీతా!

   జిలేబి

   తొలగించండి
  6. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *******
   ప్రభాకర శాస్త్రి గారూ,
   మొదటి పూరణలో యతిదోషం అంటూ అడ్డంకి వేస్తే మీ ప్రస్థానం కొనసాగే?

   తొలగించండి
 21. జోరున రమనుకలిసె పూ
  జారులు నుతియింపగ హరి; శైలజ గూడెన్
  వేరుగ కల్మషకంఠుని,
  ఊరున హరిహరులకు గుడులొద్దన నుండన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వద్ద' ను ఒద్ద అన్నారు.

   తొలగించండి
  2. 🙏🏽 ధన్యవాదములు
   ఒద్ద=సమీపము ( ఆంధ్ర భారతి )

   తొలగించండి
 22. ధారుణి బుట్టె సురలు బూ
  జారులు నుతియింపగ హరి, శైలజ గూడెన్
  హీరుడు జగతిని బ్రోవగ
  తారకుడను గూల్చునట్టి తనయుని బడయన్.

  రిప్లయితొలగించండి
 23. ధారుణి బుట్టె రాముడయి ధర్మము నిల్పెడు స్వామివంచు బూ
  జారులు ప్రస్తుతింప హరి,శైలజ గూడె సురాళి మేలుకై
  హీరుడు, తారకాసురుని హీనగుణాత్ముని సంహరించెడిన్
  ధీరుని కొడ్కుగా బడయ దేవత లెల్లరు గోరినంతనే.

  రిప్లయితొలగించండి
 24. తీరనిసంపదలిడెపూ
  జారులునుతియింపగహరి,శైలజగూడెన్
  బారముజేరగ,శంభుడు
  మీరగగౌతూహలంబుమెచ్చగజగముల్

  రిప్లయితొలగించండి
 25. డా.ఎన్.వి.ఎన్.చారి
  శ్రీరమ ,హరులును వసుధను
  జేరిరి తమవారిపైన చింతితులౌచున్
  వారిని జేరగ నా పూ
  జారులు ప్రస్తుతింప హరి,శైలజ గూడెన్

  రిప్లయితొలగించండి
 26. కారుణ్యంబున సుర సహ
  కారంబున నిజ తపః ప్రకాశమున శివున్
  మారహరు హరుఁ, నుడువగం
  జారులు నుతియింపఁగ హరి, శైలజఁ గూడెన్


  ఘోర తపంబు సల్పఁగ నకుంఠిత దీక్ష వహించి దుఃఖ సం
  తారకు శైలధన్వు మమతం బడయంగఁ దరించి యింపుగం
  జారు తరైక రూపవతి శంభు మహేశుని, దేవలోకపుం
  జారులు ప్రస్తుతింప, హరిశైలజఁ గూడె సురాళి మేలుకై

  [చారులు = వేగులు; హరిశైలజ = పచ్చని కొండకు కూతురు, పార్వతి;
  నానా లతా ద్రుమ విరాజిత హిమాద్రి పచ్చగా నుండునని భావన.]

  రిప్లయితొలగించండి
 27. స్వామి శంకరార్య

  బ్లాగు లో మీ రాకకై మేమెల్లరము చేయుచుంటిమి ఇంతజారు .

  దోషములున్నయేమోనని కలిగె మదిలో బేజారు .

  కోరుతుంటిమి ఎల్లరము రయముగ మీ హాజరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. రా కున్న కయిజారుతో కొట్లాటలు :)


   జిలేబి

   తొలగించండి
  2. కొద్ది రోజులుగా ఇంటర్ నెట్ ఇబ్బంది పెడుతున్నది.

   తొలగించండి

  3. ఇంటర్నెట్టులో ఏమి ప్రాబ్లెమండి కంది వారు ?
   తెలియ జేస్తే మనవణ్ణి అడిగి చెబ్తా

   జిలేబి

   తొలగించండి
 28. కౄరుడు మహిషా సురుడను
  పోరున దునుమాడగలుగు పొలతియనంచున్
  నేరుగ తెలుపుట కై పూ
  జారులు నుతియింపగ హరి శైలజ గూడెన్.

  రిప్లయితొలగించండి
 29. అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించ దలచి త్రిమూర్తులు అతిథుల రూపంలో వచ్చి దిగంబరంగా వడ్డించ మం టారు.ఆమె వారిని శిశువులుగా మార్చి వడ్డిస్తుంది.వారిని గుర్తించలేని భార్యలు వేడుకొనగ తిరిగి త్రిమూర్తులుగా మారుస్తుంది.


  పేరిమి రమ తాన్ సుర పూ
  జారులు నుతియింపగ హరి ; శైలజ గూడెన్
  తీరుగ హరుని ; నలువతోన్
  జేరగ వాణియు తనిసిరి చేకొని పతులన్ .

  రిప్లయితొలగించండి
 30. మిత్రులందఱకు నమస్సులు!

  [శ్రీమహావిష్ణువుతో నారదుఁడు శివపార్వతుల సమాగమముం గూర్చి ముచ్చటించుచున్న సందర్భము]

  "కూరిన వేడ్కతోడుతను, గోరికఁ దాఁ గొని యప్డు భార్యగా
  గౌరినిఁ, ’దారకుం దునుమగాఁ దగు పుత్రుని షణ్ముఖున్ ముదం
  బారఁగ నేఁ గనన్ దగును వైళమ!’ యంచు శివుండు, తన్నుఁ బూ
  జారులు ప్రస్తుతింప, హరి! శైలజఁ గూడె, సురాళి మేలుకై!"

  రిప్లయితొలగించండి
 31. కోరిక లెగయగ హరికిన్
  ప్రేరణగల శైలజమ్మ ప్రేమకులోనై
  మారగ మమతలతో బే
  జారులు నుతియింపగ హరిశైలజగూడెన్

  రిప్లయితొలగించండి
 32. ఆటవిడుపు సరదా పూరణ:
  (మధుర మీనాక్షి పెళ్ళి సంబరాలు)

  చేరగ ముద్దుగా మధుర, చీరలు బంగరు షాపులున్న బా
  జారులు ప్రస్తుతింప, హరి శైలజఁ గూడె సురాళి మేలుకై
  గారపు సుందరేశునిది కన్నియ దానపు సంబరాలలో.....
  కోరిన వన్నియున్ కొనుచు కోమలి పాకెటు ఖాళిజేసెనే :(

  కూడు = కలయు
  బాజారు : నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986
  బజారు, వీధి.

  రిప్లయితొలగించండి
 33. సూచన చేసిన వెలుదండ వారికి,
  మైలవరపు వారికి కృతజ్ఞతాభివందనములతో..🙏🏻🙏🏻

  చేరె నెలుక గణనాథుని
  చేరె నెమలి షణ్ముఖునిని సేవలు జేయన్
  చేరె హరుని నందియె పూ
  "జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్"

  రిప్లయితొలగించండి
 34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 35. bbaraoజూన్ 11, 2018 3:32 PM

  .తీరని సంపదల్దనరుదేకువతోడనుదప్పకుండపూ
  జారులుప్రస్తుతింప,శైలజగూడెసురాళిమేలుకై
  పారమునొందజేయుప్రభు,పార్వతినందనుబ్రోచునాత
  డే
  మీరనిప్రేమనున్గలిగిమేదిని నింగినిదానయైసుమా

  రిప్లయితొలగించండి
 36. క: నైరృతు డౌ మహిషాసురు
  ఘోరమ్మౌ రణమునందుఁ గూల్చుమటంచున్
  ధారుణి ప్రజఁ గావగ పూ
  జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్

  రిప్లయితొలగించండి
 37. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  చిన్న సవరణతో..

  "జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్"

  సందర్భము: సులభము.
  (శ్రీ మైలవరపువారికి ధన్యవాదాలతో)
  శిఖి=నెమలి; ఆజవము= కుటుంబము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  చేర గుడిఁ జెప్పి రిటు.. పూ
  జారులు నుతియింపఁగ..
  "హరి శైలజఁ గూడెన్
  హేరంబు నెలుక; గుహు శిఖి;
  చేరె శివుని నంది; వింత శివు నాజవమౌ.."

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  11.6.18

  రిప్లయితొలగించండి
 38. ఉత్పలమాల
  భూరి వరమ్ము లీయ హరుఁ బొందె గజాసురుఁ డంతఁ గుక్షినన్
  శౌరిని వేడగన్ సురలు శైలతనూభవ శూలి రాకకై
  సారభమాడ బ్రహ్మ సుర సంఘము వాద్యము గూర్చ రాగఁ బూ
  జారులు ప్రస్తుతింప హరి శైలజఁ గూడె సురాళి మేలుకై

  రిప్లయితొలగించండి
 39. దూరగ తగువా రెవ్వరు?
  దూరమ్మౌ నేమిజేయ దురితము లన్నియును జటా
  చీరుండేరిని గూడెను?
  "జారులు ;నుతియింపఁగ హరి; శైలజఁ గూడెన్"
  ('హరి' శబ్దాన్ని ద్వితీయా విభక్తిలో నిలిపినాను.సరియేనా?)

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  "జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్"

  సందర్భము: సులభము.
  శ్రీ రమ.. ఉమాశశి.. పద్మాలయ.. లలితవాణి.. హరిశైలజ.. అనేవి స్నేహితురాండ్ర పేర్లు. పద్మాలయ ఒక ఆలయంలో హరికథ చెబుతూ వుండగా తక్కినవారు వినడానికి ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకున్నారు.
  (లలితవాణి ఉమాశశి.. అనే పేర్లు గల అక్కా చెల్లెళ్ళు ప్రస్తుతం హైదరాబాదులో వున్నారు. ప్రభుత్వోద్యోగినులు. పద్మాలయ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రెండు తెలుగు రాష్ట్రాలలో పేరు మోసిన భాగవతారిణి ఉపాధ్యాయురాలు)
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  *శ్రీ రమ..యుమాశశి* గుడికిఁ
  జేరిరి.. *పద్మాలయ* మరి..
  చెప్పె హరి కథన్..;
  జేరె *లలితవాణి* యు; పూ
  జారులు నుతియింపఁగ
  *హరిశైలజఁ* గూడెన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  11.6.18

  రిప్లయితొలగించండి