9, జూన్ 2018, శనివారం

సమస్య - 2701 (కరినిఁ జంపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కరినిఁ జంపి యమ్మకరినిఁ గాఁచెను హరి"
(లేదా...)
"కరినిం జంపియు నక్రమున్ గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్"

146 కామెంట్‌లు:


  1. అన్యధాశరణంనాస్తి యనగ గావ
    కరినిఁ, జంపి యమ్మకరినిఁ, గాఁచెను హరి!
    శరణు గొనుమ జిలేబి వెస విభుని! నత
    డే సుమా యితమ్ములను నీడేర్చు నెప్డు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అన్యధా శరణంనాస్తి యనగ గావ
      కరినిఁ, జంపి యమ్మకరినిఁ, గాఁచెను హరి!
      శరణు గొనుమ జిలేబి వెస విభుని! నత
      డే సుమా యీప్సితముల నీడేర్చు నెప్డు !

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబి గారూ!
      ఒకే వాక్యం లో రెండుసార్లు కాచినట్టుందే🤔
      😀

      తొలగించండి

    3. విట్టు బాబు గారు, బాపూజీ గారి లా గాంచి అంటే సరి :)


      అన్యథా శరణంనాస్తి యనగ గాంచి
      కరినిఁ, జంపి యమ్మకరినిఁ, గాఁచెను హరి!
      శరణు గొనుమ జిలేబి వెస విభుని! నత
      డే సుమా యీప్సితముల నీడేర్చు నెప్డు !

      జిలేబి

      తొలగించండి
    4. శూన్యానికీ... శూన్యంలో సగానికి ఎంత తేడా!
      🤣
      బహుశా శూన్యాన్ని కూడా విభాగించడం ఒక్క తెలుగువారికే సాధ్యమేమో! మేజిక్!!

      తొలగించండి

    5. సున్ననరసున్నలన్ గనె
      నన్నా తెలుగోడు నాడు నమ్ముడు నేడా
      యెన్నతడు గుండు సున్నా !
      యెన్నగ మనుజుడు జిలేబి యే మహిని గదా !

      జిలేబి

      తొలగించండి
    6. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. సరసున జలకములనాడి సంతసముగ
    కరి యొక మకరి నోటను కట్టుబడగ
    పరిపరి విధములుగ డస్సి మొరల నిడిన
    కరినిఁ; జంపి యమ్మకరినిఁ; గాఁచెను హరి

    అరసున్నలు చేతగావు సార్ :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. స్మైలీలన్ వెస నేర్చి నామయ !అనుస్వారమ్ము నేర్పుల్ తెలీ
      లే :)

      జిలేబి

      తొలగించండి
    2. జీపీయస్ వారూ..
      సులువుగానే సాధించేశారు..
      ఇంక నేను నామినేషను వేయడమూ అనవసరమేమో!
      😃

      తొలగించండి


    3. స్మైలీలన్ వెస నేర్చి నామయ !అనుస్వారమ్ము నేర్పుల్ తెలీ
      లే! లీలై యగు పించె మాకు గురువా ! లే! శిష్య! లెమ్మా! భళా
      చాలా యీజి సుమా! జిలేబులవలెన్ చక్కంగ దీర్చన్నదే
      వీలై నీ జత గూడు శాస్త్రి ! వినుమా వేగమ్ము యత్నింపు మా !

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ***********
      జిలేబీ గారూ,
      __/\__

      తొలగించండి


  3. శరణీయంబతడే! జిలేబి ! వినుమా! సావాసి యాతండు నీ
    కు! రమావల్లభు డాతడే!విడువకే గుమ్మాళి!పూర్వంబహో
    "మరి నీవే ప్రభు! రక్ష ! హా! జడితి రమ్మా ! నన్ను గావన్" యనన్
    కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది సూపరు. రెండు కామాలతో...కామితార్థము ఈడేరినది
      👌🏻😃

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...గావన్ + అనన్' అన్నపుడు యడాగమం రాదు. "రమ్మా గావగా నంచనన్" అందామా?

      తొలగించండి
  4. (గజేంద్ర మోక్షణం)
    "ఇంతకాలపు నాబాధ నేమిచెబుదు?
    దేవ!వేడితి నాకింక దిక్కువీవె;
    హరి హరి"యటంచు రోదింప గరుణ గాంచి
    కరిని, జంపి యమ్మకరిని ,గాచెను హరి.

    రిప్లయితొలగించండి
  5. చావన్నది ఒక మోక్షము హరి చేతిలో అది
    నిజమౌ సాక్ష్యము
    అహమన్నది ఏనుగు పక్షము తొలగించుటయే
    దేవుడి లక్ష్యము
    నేననుటను గజమున జంపి చావుగ మొసలికి
    మోక్షమిచ్చెడిన్
    కరినిం జంపియు నక్రమున్ గరుణతో గాచెన్
    ముకుందుండొగిన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    బడుగుదేహి విపత్తులు బాప బోయి
    పెట్టె గట్టిన నోట్లను రట్టు జేయ
    ధనిక మకరియె క్రొత్తవి దండుకొనఢ
    కష్టముల గ్రాలి మడిసెను కరి, యదెట్లు?
    కరిని జంపి యమ్మకరిని గాచెను హరి!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టానుండి,ఆర్యా,3వ పాదఞలో"దండుకొనగ"ఉండవలెను.(టైపాటు)

    రిప్లయితొలగించండి
  8. దరికిన్ జేరిన కష్టమేదయిన సాధ్యమ్మౌను దాటంగ నా
    హరినిన్ చిత్తమునందు నిల్పుకొనుచున్ ధ్యానించుచున్ వేడినన్ -
    పరుగుల్ తీయుచు వచ్చి డాసెకద కాపాడంగ కోరంగనే
    కరినిం - జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
    వరియో జొన్నలొ పంటచేలు బెరుగన్ వర్షాలకే ముందుగా
    సరె యివ్వండని ద్రవ్యమున్ బనుపగా సౌహార్దతన్ కేసియార్
    సరిగా భూమికి లెక్కదేలక, బలే సర్కారు!పట్వారులన్
    దొరికేటంతగ దండుకొండను గతిన్ దుష్టంపు లంచాలె బో!
    కరినిం జంపియు నక్రమున్ గరుణతో గాచెన్ ముకుందుండొగిన్
    వరదా నొక్కని బట్టవైతివి యిదే వైనంబె సత్పాలనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వరదా యొక్కని' అనండి.

      తొలగించండి
  10. సిరితో చెప్పక నాయుధంబులను తా చేబూనకే నాత్రమున్
    ధర కేగన్ రమ శంఖ చక్రములు నా దామోదరున్ వెన్ బడన్
    హరి! నీవేనిక దిక్కు నా కనుచు హాహాకా రముల్ జేయు నా
    "కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. విట్టుబాబివ్వాళ సిక్సర్ కొట్టేరు . అదురహో

      జిలేబి

      తొలగించండి
    2. ఆహాఁ! యేమి నా భాగ్యము 😄
      శాస్త్రిగారికి, జిలేబి గారికి ధన్యవాదములు.
      🙏🏻🙏🏻

      తొలగించండి
    3. విట్టుబాబుగారు నామినేషన్ వేయనంటూనే యెన్నికలో గెల్చేశారు!! 👏👏👏👌👌👌

      తొలగించండి
    4. ధన్యవాదాలు సీతాదేవిగారూ 🙏🏻💐
      😄

      తొలగించండి
    5. కానీ తేటగీతిలో ఆదిలోనే బొక్కబోర్లా పడ్డాను. ఏదో జీపీయస్ వారు చేయందించబట్టీ..గురువుగారి కంట్లో పడకుండా తప్పించుకున్నాను.

      తొలగించండి
    6. విట్టుబాబు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      మీ తేటగీతి నాకు కనిపించలేదే?

      తొలగించండి
  11. తేటగీతి
    తరము కాదంచు పోరాడి కరమునెత్తి
    గావుకేకల సోలుచు "గరుడ గమన! 
    లావు చాలదు శరణమ్ము నీవె" యనెడు
    కరినిఁ, జంపి యమ్మకరినిఁ, గాచెను హరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శరణమ్ము నీ" వనఁ గని। కరిని,.." అనండి. అన్వయం బాగుంటుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవసవరిం పూరణ :
      తేటగీతి
      తరము కాదంచు పోరాడి కరమునెత్తి
      గావుకేకల సోలుచు "గరుడ గమన!
      లావు చాలదు శరణమ్ము నీవ"నఁ గని
      కరినిఁ, జంపి యమ్మకరినిఁ, గాచెను హరి.

      తొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2701
    *కరినిం జంపియు నక్రమున్ గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్.*
    గజేంద్రుని చంపి మొసలిని కాపాడినాడు విష్ణు భగవానుడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అగస్త్య మహర్షి యొక్క శాపాన్ని పొంది ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఏనుగుగా జన్మిస్తాడు. దేవలుడు అనే మహర్షి యొక్క శాపాన్ని పొంది హూహూ అనే పేరు గల గంధర్వుడు మొసలిగా జన్మిస్తాడు. సరస్సులోనికి దిగిన గజేంద్రుని కాలును మొసలి గట్టిగా పట్టుకొన్నది. భగవంతుడు అందఱినీ రక్షిస్తాడు. శాపములను తొలగిస్తాడు అని విశదీకరించేందుకు కరిగా (నిదర్శనంగా) విష్ణు మూర్తి సుదర్శన చక్రంతో మొసలి తలను ఖండించి గజేంద్రుని కాపాడినాడు. మొసలి రూపంలో ఉన్న గంధర్వుని శాపాన్ని తొలగించి అతనిని కూడా కాపాడినాడు అని తెలియజేసే సందర్భం.

    ఉరు శాపమ్మున నక్రరూపమున హూహూ నామ గంధర్వుడే
    సరసిం బట్టె గజేంద్రుఁ, జక్రమున నా శాపమ్మునే త్రుంచె శ్రీ
    హరి, కాచుం గద దైవ మందఱిని స్నేహ మ్మొప్ప, చూపించెగా
    కరినిన్; జంపియు, నక్రమున్ కరుణతో గాచెన్ ముకుందుం డొగిన్.
    (కరి=నిదర్శనము)
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (9-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      అర్థాంతరాన్నాశ్రయించి అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  13. శరణు వేడిన గజ రాజు సత్వ ర ము గ
    గావ నెంచి యు వెడలి యు జేవ జూపి
    భక్త వరదు డు న్న విధాన పాహి యన్న
    క రి ని 'జంపి య మ్మక రి ని 'గా చె ను హరి

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    వరుడెవ్వండు సృజించి కాచి నశియింపంజేయు లోకాళి , నీ...
    శ్వరుడెవ్వండు చరాచరాత్మకసమస్తాధిష్ఠితుండట్టి శ్రీ
    కరుడే దిక్కని పిల్వ, గాచుటకు దీక్షన్ బూని బాధారుదత్
    కరినిం ., జంపియు నక్రమున్ ., గరుణతోఁ గాఁచెన్ ముకుందుండొగిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎవ్వనిచే జనించు ...? నమోనమః! 💐💐🙏🙏

      తొలగించండి

    2. విట్టుబాబు గారి మాటల్లో చెప్పాలంటే

      ముమ్మారు "కాచే" రు మైలవరపు వారు

      అదురహో

      జిలేబి

      తొలగించండి
    3. ఏదైనా ముమ్మారు చెబితే యిక తిరుగు లేదుగా! ( ముమ్మారు తలాక్) 😊😊😊

      తొలగించండి
    4. కాచిన కొద్దీ పాలు చిక్కబడి మరింత మధురమోతాయేమో!
      ☺️

      తొలగించండి
    5. 'బాధారుద త్కరినిన్...' అంటూ మైలవరపు వారు మైలవరపు వారు అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  15. డా.పిట్టాసత్యనారాయణ
    వరియో జొన్నలొ పంటచేలు బెరుగన్ వర్షాలకే ముందుగా
    సరె యివ్వండని ద్రవ్యమున్ బనుపగా సౌహార్దతన్ కేసియార్
    సరిగా భూమికి లెక్కదేలక, బలే సర్కారు!పట్వారులన్
    దొరికేటంతగ దండుకొండను గతిన్ దుష్టంపు లంచాలె బో!
    కరినిం జంపియు నక్రమున్ గరుణతో గాచెన్ ముకుందుండొగిన్
    వరదా నొక్కని బట్టవైతివి యిదే వైనంబె సత్పాలనన్

    రిప్లయితొలగించండి
  16. బలము గర్వంబు లడుగంట కలతజెంది
    బలిమి యాతండె ననిదాను తెలిసికొనగ
    నీవు తప్పనితరుల నేనెరుగనంచు
    మోర లెత్తుచు ప్రార్ధించ ముక్తుజేయ
    కరిని, జంపి యమ్మకరిని, గాచెను హరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ! ఈ రోజు మంచి సమస్యనిచ్చి గురువుగారు అందరి చేతా ఆ గజేంద్ర మోక్షాన్ని స్మరింపజేసి పుణ్యాత్ములయ్యారు!🙏🙏🙏🙏

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యాతండె యని...' అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదాలండీ! సవరిస్తాను! 🙏🙏🙏

      తొలగించండి
  17. వాసి స్థానాలు పొందినన్ బలము లేక
    చతికిల బడె కర్ణాటను సామజమ్ము
    మట్టి కరిపింప నొకటైన మర్కటములె
    కరిని జంపియమ్మకరిని గాచెను హరి.

    రిప్లయితొలగించండి
  18. సవరణలు సూచించిన ప్రభాకర శాస్త్రిగారికి,
    శ్రీహర్ష గారికి, చక్రవర్తి గారికి కృతజ్ఞతాభివందనాలతో...

    *తేటగీతి పూరణ:*
    సర్వసైన్యాన్ని కురురాజుకిచ్చి, తానొక్కడే పాండవుల పక్షానికి పోయినపుడు, సాధారణ పౌరులు పాండవులకు కృష్ణుడు అన్యాయం చేస్తున్నాడేమో..ఏనుగుని చంపి మొసలిని కాపాడుతున్నాడు... అనుకొన్నారట.

    అర్జునుని వెంట తానేగె యంత సైన్య
    మును కురు నృపుని పాల్జేసె మోదమౌన!?
    యనుచు పల్కిరి పౌరులు నంత యిటుల
    "కరినిఁ జంపి యమ్మకరినిఁ గాఁచెను హరి"

    రిప్లయితొలగించండి
  19. ఆర్తనాదమ్ము వినినంత నాగకుండ
    కమల నాభుండు వడిగతా కదిలె నపుడు
    చెప్పకుండనె సతికి, రక్షింప దలచి
    కరిని, జంపియమ్మకరిని, గాచెను హరి.

    రిప్లయితొలగించండి
  20. సూరం శ్రీనివాసులు గారి పూరణ:

    పరమార్థంబును బోధచేసి నరునిన్, వంచించియున్ సైంధవున్,
    సిరులంగూర్చి కుచేలునిన్, వలువలన్ జేబూని గోపీతతిన్,
    పరువున్ నిల్పియు గృష్ణ, వేగమతియై ప్రాణమ్ములంగాచుచున్
    గరినిం‌,జంపియు నక్రమున్ గరుణతో గాచెన్ ముకుందుండొగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధాని సూరం శ్రీనివాసులు:

      అభినందించిన అందరికీ అభివందనాలు.ఒక్కవిషయం.
      ఈ పూరణకు ప్రాణం ముకుందపదం.ముకుం దదాతి ఇతి ముకుందః..అని వ్యుత్పత్తి.మోక్షమిచ్చేవాడని అర్థం.

      తొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి ‌‌
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    కరుణా సాగర ! దీనరక్షక ! ననున్ గ్రాహంబు బాధించు | నే

    శరణంచున్ గరమోడ్చి వేడితి ‌ నికన్ , చక్రాయుధా ! శౌరి‌ ‌! బ్రో

    వర యంచున్ విలపించి మాధవు కడున్ బ్రార్థింప గాపాడ నా

    కరి‌నిన్ , జంపియు ‌నక్రమున్ గరుణతో గాచెన్ ముకుందుం డొగిన్


    --------------------------------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ప ద న మ స్కా ర ము లు మరియు ధ న్య వా‌ ద ము లు గు రు వ ర్యా

      తొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "కరినిఁ జంపి యమ్మకరినిఁ గాఁచెను హరి"

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అమ్మకును బిడ్డ భాగవతమ్మును విని

    పించు చి ట్లనె.. "నో యమ్మ! భీకరముగ

    కరిని బట్టె మకరి; కరి మొర వినెను; మ

    కరినిఁ జంపి యమ్మ! కరినిఁ గాఁచెను హరి"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    9.6.18

    రిప్లయితొలగించండి
  23. ధర చరణము దరి నొక నగరు పెరటి
    న గల నిధి బదరికము కనగ, హరికుని
    కరము పదరము దొరయగ నరయు పురుగు
    నరసి పడగ పుటములెత్తి కరచెను, కర
    కరిని జంపి, యమ్మకరిని గాచెను హరి

    కొండ పాదములవద్ద గల ఆలయము వెనుక భాగములో గల గుప్త నిధిని దొంగతనము చేయ తలపెట్టిన కర్కోటకుడు తన చేతిని ఆ నిధి పెట్టె పై వేయగ కాపలా కాయుచున్న పాము అతనిని కాటు వేసెను. (హరికుడు = దొంగ) (కరకరి = క్రూరుడు) , (మకరము = మకరి = నిధి), ( హరి = పాము,) గాచెను యను భావన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      అర్థాంతరాలతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. పరిరక్షించెడు వాడవందురు గదా భక్తాళినే ప్రేమతో
    మరిరావెందుకు బ్రోవగన్ పిలిచితిన్ మమ్మాదరింపంగనో
    హరి! నీవే గద మాకుదిక్కనగ క్షీరాంభోధినే వీడుచున్
    సిరికింజెప్పక వేగమున్ గదిలె రక్షింపన్ విశాలాక్షుడే
    కరినిం, జంపియు నక్రమున్ గరుణతో గాచెన్ ముకుందుండొగిన్

    రిప్లయితొలగించండి
  25. గుంపుగా పోయి ముదముతో కొలనుకడకు
    కూడి గజములు జలకము లాడు తరిని
    మడుగు నందున తాచిక్కు పడిన కాంచి
    కరినిఁ ,జంపి యమ్మకరినిఁ ,గాఁచెను హరి

    రిప్లయితొలగించండి


  26. మరీ వాచాలురంటే ప్రీతి గల విష్ణువయ్యె :)



    సిరికిం జెప్పక శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపకన్
    పరివారంబు నహిద్విషున్ విడిచి ,గాబాగూబి వైకుంఠమున్
    పరమాత్ముండతడే త్యజించి, భళిరా , వాచాటు మత్తేభమౌ
    కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సిరికిం జెప్పఁడు శంఖచక్ర యుగముం జేదోయి సంధింపఁ డే
      పరివారంబును జీరఁ డభ్రగ పతిం బన్నింపఁ డాకర్ణికాం
      తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
      పరిచేలాంచల మైన వీడఁడు నుతిం బాటించి తాఁ జేరి యా
      కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాచెన్ ముకుందుం డొగిన్

      తొలగించండి
    2. అవధాని శ్రీ సూరం శ్రీనివాసులు గారి రెండవ పూరణ:

      పోతనకు క్షమాపణలతో....
      సిరికింజెప్పక శంఖచక్రయుగముంజేదోయి సంధింప కే
      పరివారంబును లేక యభ్రగపతిన్ మన్నింప కాకర్ణికాం
      తరధమ్మిల్లము చక్కనొత్తక వివాదప్రోత్థితశ్రీకుచో
      పరిచేలాంచలమైన వీడక కృపా
      ప్రాప్తిన్ సమీపించి యా
      కరినిం,జంపియు నక్రమున్ గరుణతో గాచెన్ ముకుందుండొగిన్

      తొలగించండి
    3. జిలేబీ గారికి,
      కామేశ్వర రావు గారికి,
      సూరం శ్రీనివాసులు గారికి,
      అభినందనలు....
      ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలు!

      తొలగించండి
  27. రిప్లయిలు
    1. మకరిపై కరి కరి పైన మకరి పెనఁగి
      పెనఁగి పోరాడఁ గరి రాజు కనలి చెనక
      వేయి యేండ్లు కరము డస్సి వేఁడ వేగఁ
      గరినిఁ , జంపి యమ్మకరినిఁ , గాచెను హరి


      కరిపై నక్రము విక్రమంబునఁ జెలంగం గుంజ రంబంత మీ
      నర శార్దూలముపై పెనంగి కరమున్ నారాయణున్ వేడగం
      బర మోదారు గజేంద్రు నెయ్యమున , విధ్వస్తాంగ లీలా మహా
      కరినిం జంపియు నక్రమున్, గరుణతోఁ గాచెన్ ముకుందుం డొగిన్


      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      ఇక్కడ కాచు లో నరసున్న యుండదని యెంచి తొలగించితిని. తప్పైన తెలుప గలరు.
      కాఁచు = కాఁగఁజేయు,
      కాచు = రక్షించు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'కాఁచు' శబ్దం విషయమై పొరబడ్డాను. ధన్యవాదాలు!

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  28. కావుమానీవ గతియన గాచె విభుడు
    కరిని,జంపియమ్మకరినిగాచెనుహరి
    తనను వేడుకొనినగరిదయనుగలుగ
    భక్త రక్షణయనగను బరమప్రీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో కొంత అన్వయదోషం ఉన్నట్టుంది.

      తొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    "హరి! నీవేగతి! నన్నుఁ గావఁ గనరా! హా యీశ్వరా! నే నిటన్
    మరణమ్మందఁగనుంటిరా! మురహరా! మాతండ్రి! నన్నేలరా!
    శరణమ్మోమధుసూదనా!" యనఁగ, విశ్వాత్ముండుఁ దాఁ జేరి యా
    కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదనుడు కూడా పద్యములో ఇమిడిపోయారు

      తొలగించండి
    2. అవునండీ నేను గూడా వెళ్ళవలసివచ్చింది! గజేంద్రుని మొఱయాయె మఱి!

      ధన్యవాదములు!

      తొలగించండి
    3. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తరుణీ సంగము యవ్వనంబు సిరి
      సంతానంబు సంధిల్లగా
      పరమాత్మన్ మది గొల్వకే మసలి యార్భాటమ్ముతో, జిక్కగా
      కరి కుంభీరము నోటనే విడె నహంకారమ్ము ,హేశ్రీహరీ!
      కరుణన్ జూపుమనంగనే యరిగి శ్రీకాంతుండహో! బ్రోచెగా
      కరిని,జంపియు నక్రమున్ కరుణతో గాచెన్ ముకుందుండొగిన్!

      కరిని, నక్రమును యిద్దరినీ కాచాడు!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  31. శoకరార్యులు బ్లాగు పై సీత కన్ను వేసినారు ఎందుకో తెల్పుమా మనసా ???

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రేపు మా వృద్ధాశ్రమంలో కొత్తగా కట్టిన ప్రారంభోత్సవానికి మంత్రులు, శాసన సభ్యులు వస్తున్నారట! పాలక సభ్యులు నన్ను ఆ సందర్భంగా ఒక కవిత వ్రాయమన్నారు. నిన్న సాయంత్రం మొదలు పెట్టి, ఇవాళ ఉదయం పూర్తి చేసి, దానిని టైప్ చేసి సూరారం అనే ఊరికి వెళ్ళి అక్కడ ప్రింటౌట్ తిసుకొని 50 జిరాక్స్ కాపీలు తీసుకొని వచ్చేసరికి రోజంతా గడిచి పోయింది.
      రేపు వరంగల్లులో 'ప్రజ-పద్యం' వారి సమావేశానికి వెళ్తున్నాను. ఆ ఏర్పాట్లలో ఉన్నాను కూడా... అంటే రేపు నేను బ్లాగుకు అందుబాటులో ఉండనన్నమాట!

      తొలగించండి
  32. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "కరినిఁ జంపి యమ్మకరినిఁ గాఁచెను హరి"

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "అమ్మ! వినవమ్మ! భాగవత" మ్మటంచు
    మనుమరాలికి తాత కమ్మని కథలను
    జెప్పెను.., గజేంద్ర మోక్ష మీ చొప్పు.. "న మ్మ
    కరినిఁ జంపి యమ్మ! కరినిఁ గాఁచెను హరి"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    9.6.18

    రిప్లయితొలగించండి
  33. ఆటవిడుపు సరదా పూరణ:
    (అల్ల కర్ణాట...)

    విరియన్ తామర యెడ్డియూరపయ సుప్ప్రీంకోర్టు బ్రార్థించుచున్
    తరుణమ్మిమ్మని వేడగా తనకు తాత్సారమ్ము నొల్లమ్మనిన్
    పరిరక్షించి కుమారసామి నిటులన్ పాలించి మోక్షమ్మిడెన్:
    కరినిం జంపియు నక్రమున్ గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్

    రిప్లయితొలగించండి
  34. "కరినిం జంపియు నక్రమున్ గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్"
    వెరవున్నయ్యెనుమిత్రమాయిదియారావేమాకుటీరంబుకు
    న్నిరవున్జూడవినోదమున్గనుల నింపారన్ ముకుందుండుసూ
    కరమున్రక్షణజేసెగాదయనునాగ్రాహంబుబారిన్గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యిదియ రావే...' టైపాటు. 'కుటీరంబునకు' అనడం సాధువు.

      తొలగించండి
  35. బాబోయ్ రేపు కష్టమైన ప్రాస గల సమస్య ఉంటుందన్నమాట భయమేస్తోంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పూసపాటి గారు రేపటి సమస్య

      రణమే ప్రాణము పోయు పద్య కళయై రాణించు సద్గోష్టులన్ !

      జిలేబి :)

      తొలగించండి
    2. ఇది ఆకాశవాణి వారిది గదా

      తొలగించండి
    3. అయినా పేపర్ లీక్ చేస్తె మాచ్ ఫిక్సింగ్ అంటు శంకరార్యులు పరీక్ష తప్పిస్తారు

      తొలగించండి
    4. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      ధన్యవాదాలు! మంచి 'హింట్' ఇచ్చారు. ఎలాగూ రేపు రోజంతా వరంగల్ సమావేశంలో వ్యస్తుడనై ఉంటాను. దుష్కరప్రాసతో ఇవ్వడానికి సమస్యను ఆలోచిస్తున్నాను...

      తొలగించండి
    5. ఇప్పుడే 'ర్మ్య' ప్రాసతో కంద పాదంతో, శార్దూల పాదంతో సమస్య నిచ్చాను.

      తొలగించండి


    6. గుర్తు చేసి మరీ వాయించుకోవడ మంటే యిదే :)

      కిట్టింపులకే ప్రాసైతేనేం :)

      జిలేబి

      తొలగించండి
    7. అయల్ దుష్కర ప్రాస, ఆపైన శార్దూలమా??!! పరీక్ష పాసయినట్లే!! గోవిందా! గోవింద!! 🙏🙏🙏

      తొలగించండి
    8. జిలేబి గారూ:

      హిందీలో దీన్ని ఇలా అంటారు:

      "ఆ బైల్ ముఝే మార్!"

      తొలగించండి
  36. కరిసంఘమ్ములు కానలో తిరుగుచున్ కన్పించ తోయమ్మటన్
    కరమౌ దప్పికతోడ చేర కడు నాకాంక్షన్ జలమ్ముల్గొనన్
    సరసీ మద్యమునందు పట్టె నసిదంష్ట్రమ్మచ్చటో సింధువున్
    మొరపెట్టంగహరీశునక్కటికకై మోదమ్ముతో గాంచి యా
    కరినిం, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అచ్చటో, హరీశు (కోతుల కధిపతి?)'?

      తొలగించండి
  37. మకరిబట్టగ నేనుగు మడుగునందు
    హరినిదలచగ పరుగున మరలివచ్చి
    శరణుగోరిన గాపాడె హరియునచట
    కరిని"జంపియమ్మకరిని"గాచెనుహరి!

    రిప్లయితొలగించండి
  38. మత్తేభవిక్రీడితము
    సరసాలాటలఁ దేలియాడు ప్రభువున్ సంరక్షణార్థమ్ముగన్
    వరదా! రమ్మని గావుకేకల నహో! ప్రార్థించ నావేదనన్
    కరమున్ దాల్చక శంఖచక్రములనే కాపాడు సంరంభియై
    కరినిన్, జంపియు నక్రమున్, గరుణతోఁ గాఁచెన్ ముకుందుండొగిన్

    రిప్లయితొలగించండి
  39. మరియాదా పురుషోత్తముండగుచు రామాఖ్యుండునై రావణున్
    పరిఖండించగ మోక్షమిచ్చి ,విహిత భాషుం డనుభ్రాతనున్
    శరణార్ధుండని గావగా హరికి దుస్సాధ్యంబు గాదేది, యా
    కరిని, జంపియు నక్రమున్ ,కరుణతో గాచెన్ ముకుందుండొగిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విహిత భాషుం' డన్న చోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. సవరించిన పూరణ:
      మరియాదా పురుషోత్తముండగుచు రామాఖ్యుండునై రావణున్
      పరిఖండించగ మోక్షమిచ్చి ,విమల స్వాభావ్యుం డనుభ్రాతనున్
      శరణార్ధుండని గావగా హరికి దుస్సాధ్యంబు గాదేది, యా
      కరిని, జంపియు నక్రమున్ ,కరుణతో గాచెన్ ముకుందుండొగిన్!

      ఆర్యా! విమల స్వాభావ్యుండు లో ల గురువై మళ్ళీ గణదోషమా?

      తొలగించండి
  40. వినుము తల్లి ! తెలిపెదను విష్ణు కథను
    హరిహరీ ! యనినంతనె పరుగులిడును
    మొర వినియు వచ్చియును వెస పరుగుతో మ
    "కరినిఁ జంపి యమ్మ ! కరినిఁ గాఁచెను హరి"


    రిప్లయితొలగించండి
  41. పరమ పదముకై హరిభక్తి పాయకుండ
    పరితపించు భక్తుని మదిన్ భక్తి యను మ
    కరిని గాచుటకై మోహ కలిత తుల్య
    కరిని జంపి యమ్మకరిని గాచెను హరి.

    మకరి--నిథి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేవిక గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరమపదముకై' అనరాదు. "పరమపదమునకై భక్తి..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురుదేవా!సవరించుకుంటాను.

      తొలగించండి
  42. 2004 లోక్ సభ ఎన్నికలు:

    అరెవో! భారత వోటరయ్య గనగా హైరాన కల్గున్ గదా!
    గొరిగెన్ నీటుగ భాజపాను భళిగా కోపమ్ము తెప్పించుచున్...
    ఖరమౌ సోనియ గెల్వ నోడెను గదా గంధర్వమౌ వాజపాయ్...👇
    "కరినిం జంపియు నక్రమున్ గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్"

    రిప్లయితొలగించండి