10, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2702

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్"
(లేదా...)
"హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే"
(పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలతో...)

75 కామెంట్‌లు:

  1. హర్మ్యంబిదియే మయునిది
    ధర్మ్యంబౌ పాండవులది ధరలోనిక సా
    ధర్మ్యంబే లేనిది యా
    హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్

    ధర్మ్యము = ధర్మము నుండి తొలగనిది
    సాధర్మ్యము = పోలిక

    రిప్లయితొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    ధర్మ్యమ్మిద్దియటంౘు దెల్పఁగఁ, బరంధాముండు కల్పింౘు నా
    పోర్మ్యావిష్టయుగాంతసన్నిభ జలప్రోద్యన్నభఃపృక్త సా
    ధర్మ్యమ్మెంతయొ మేరమీఱ, జలముల్ తత్పత్తనాల్ముంపఁగా,
    హర్మ్యంబందున నీఁదులాడె నవె మత్స్యంబుల్! గనన్ వింతయే?

    స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణలతో...

      ధర్మ్యమ్మిద్దియటంౘు దెల్పఁగఁ, బరంధాముండు కల్పింౘు నా
      పోర్మ్యావిష్టయుగాంతభీకరజలప్రోద్యన్నభఃపృక్త సా
      ధర్మ్యమ్మెంతయొ మేరమీఱ జలముల్, తల్లీఢ దీవ్యత్పురీ
      హర్మ్యంబందున నీఁదులాడె నవె మత్స్యంబుల్! గనన్ వింతయే?

      తొలగించండి
  3. డా.పిట్టా సత్యనారాయణ
    (ఒక పూరి గుడిసెలో జరిగిన ఉదంతము)
    హర్మ్యంబున రవి చంద్రులు
    ధర్మ్యంబని తొంగి చూడ ధారుణి వర్షాల్(పై కప్పుకు ఉన్న చెదిరిన గడ్డి పోచల నుండి)
    హర్మ్యంబానిన వరదన్
    హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టాసత్యనారాయణ
    (ఆక్వేరియం ఆందం కొరకని చేపలను బంధించగా....)
    హర్మ్యంబందున బెంచ మీనములనే హ్లాదంబటంచెంచగన్
    మర్మ్యంబున్ గన గాజు కొంప లలరన్ మారాజులే పెంచగా
    ధర్మ్యంబాపక పెట్టె జారి పగులన్ దాత్సారమున్ జేయకన్
    హర్మ్యంబందున నీదులాడెనవె మత్స్యంస్యంబుల్ గనన్ వింతయే

    రిప్లయితొలగించండి
  5. జలావరణ ఆక్వేరియమున మనిషి నడయాడగ
    భూతలము
    హైడ్రోఫోనిక్కు మొక్కలు పెరిగె అడుగున లేకయే
    తలము
    రెక్కలు లేక గాలినెగురగ గగన విహారమొక
    సంతయే
    హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్
    గనన్ వింతయే

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    హర్మ్యంబుల్ మరి గోర ! నీవలపు నాకందంగ , నీ పొందు నా
    నైర్మ్యమ్మౌ స్మరబాణఘాతములకున్ , హాసమ్ములన్ జిల్క సా...
    ధర్మ్యమ్మున్నదె నీకునీజగతిలో ? త్వద్వక్త్రసౌందర్యపుం
    హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా!
      మైలవరపు వారి కవిత్వసంపదకు నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. SeethaDevi Gurramజూన్ 10, 2018 7:51 AM

      వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా!
      మైలవరపు వారి కవిత్వసంపదకు నమోనమః! 🙏🙏🙏🙏

      శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు.. మీ స్పందన నా భావనను అమ్మాయి వైపు నుండి అమ్మ వైపు అడుగులు వేయించింది. అవే పదాలతో అమ్మ ఇలా పలికించింది 🙏ఈ పద్యం మీకే అంకితం.. నమోనమః👇

      హర్మ్యంబుల్ మరి గోర ! నీ కరుణ నాకందంగ , నీ రక్ష నా
      నైర్మ్యమ్మౌ భవ రోగ జాత వివిధ వ్యాధ్యాదులన్ ద్రోల , సా..
      ధర్మ్యమ్మౌనె శశాంకకోటి ? లలితా ! త్వద్వక్త్రసౌందర్యపుం
      హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. సరసము నుండి భక్తిరస సారము గల్గె నదేమి వింతయో!
      👌🏻👏🏻🙏🏻💐

      తొలగించండి
    5. అత్భుత పద్యరాజము! ఎంత బాగా పద్యాన్ని మార్చగలిగారు!! మా లాంటి భావ సౌందర్యము మాత్రమే గల్గి కవిత్వ సంపద లేని వారికి మీ పద్యములు మహదానందాన్ని కలిగిస్తాయి! మీ వంటి వారి పరిచయం యేర్పడడం మా అదృష్టము! ధన్యవాదములు! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
    6. @ విట్టుబాబు గారు
      కామిగాని వాడు మోక్షగామి గాడు గదా!😊😊😊

      తొలగించండి
    7. మురళీకృష్ణ గారు నమస్సులు. మహాద్భుతమైన పూరణ నందించితిరి. అభినందనలు.
      శశాంక కోటికి మించిన లలితా దేవి సౌందర్యపు ముఖమను హర్మ్యము వరకు సుస్ఫష్టము. మత్స్యము లీదుట కన్వయము కష్టముగా తోఁచు చున్నది.

      ప్రజలను మీన సమూహపు మత్స్యములు లలితా దేవి వీక్షణములనే సముద్రములో నీదు చున్నవను భావముతో నీ పాదమును సమీక్షించండి.
      “సా /
      ధర్మ్యంబైన ప్రజాండజాలి లలితా ! త్వద్వీక్షణాంభోధి నా /
      హర్మ్యంబందున”.

      తొలగించండి
    8. ప్రజలు హర్మ్యములో , మత్స్యము లంభోధి లో.

      తొలగించండి
    9. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు... మీ సూచనను ఇప్పుడే గమనించితిని.. పద్యహర్మ్యమునకు విద్యుద్దీపకాంతుఉలలదినట్లు భాసించినది .. నమోనమః

      తొలగించండి
  7. మయసభను గాంచి రారాజు.....


    హర్మ్యంబు భళా యనె వై
    ధర్మ్యంబు తా గలిగియు ధర్మజు తోడన్
    హర్మ్యంబున వింతలు గన
    హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్ !

    వైధర్మ్యంబు......వ్యతిరేకత

    రిప్లయితొలగించండి
  8. (ఉలూచీ ధనంజయ కల్యాణం)
    ధర్మ్యంబైన వివాహమాడ దనదౌ ధ్యానంబు భాసిల్లగా
    మర్మ్యంబౌక్రియ నాగలోకమునకున్ మౌనంబుగా జేర్చునా
    కర్మ్యంబెంచి యులూచి బార్థవరుడే కల్యాణి జేపట్ట నా
    హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే !

    రిప్లయితొలగించండి
  9. ఓకే దేశపు రాజ చిహ్నము చేప ప్రతి గదిలో రాజ చిహ్నమైన చేప వ్రేలాడుతు ఉన్నది.అది సర్వారిష్టములను పోగొట్టేదిగా ఉన్నది.

    హర్మ్యంబున వ్రేలాడెను
    ఐర్మ్యంబుగ రాజ చిహ్న మకలంకంబై
    ధర్మ్యము కొనసాగుటకై
    హర్మ్యంబున నీదులాడె నవి మత్స్యంబుల్

    ఐర్మ్యము=వ్రణమును మాన్పు లేపన ధ్రవ్యము
    శబ్ద రత్నా.
    ధర్మ్యము=ధర్మము నుండి తొలగనిది
    శబ్ద రత్నా

    రిప్లయితొలగించండి


  10. హర్మ్యంబు శంకరయ్యది
    హర్మ్యంబిదియే మనసుకు హాయిని జేర్చన్,
    హర్మ్యంబు కవిత్వమునకు
    హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్


    ఇక్కడ యీదులాడు మత్స్యములకెల్ల శుభాకాంక్షలతో

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హర్మ్యం శంకర కందివారి దిచటన్ హాయిన్ జిలేబీ వసెన్

      తొలగించండి
    2. హర్మ్యం బున కూర్చొని యి
      య్యర్మ్యంబను ప్రాస బట్టి యాతన పడగన్
      కర్మ్యం బై పద్యమొలికె
      "హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్"

      ఈ 'ర్మ్య' అనే ప్రాస అందామని...
      యియ్యర్మ్యంబను ప్రాస అన్నాను... 😄

      తొలగించండి
    3. కవిశ్రేష్ఠులు శ్రీ సూరం శ్రీనివాసులు గారు మెచ్చుకున్నారహో...
      😃

      తొలగించండి
    4. 👏👏👏👍👍👍💐💐💐 విట్టుబాబు గారికి!

      తొలగించండి
    5. హర్మ్యంబు శంకర జాలము(బ్లాగు)
      హర్మ్యంబది కవులు తాము హాయిగ దిరుగన్
      హర్మ్యంబు కవితావార్ధిని
      హర్మ్యంబున నీదులాడె కవి మత్స్యంబుల్!

      జిలేబిగారికి ధన్యవాదాలతో! 🙏🙏🙏

      తొలగించండి
    6. 🙏🏻 ధన్యవాదాలు సీతాదేవి గారు. అచ్చెరువు, ఇవ్విధి లాంటివన్నీ గుర్తొచ్చీ...బాణం వేశాను. అంతే...😄

      తొలగించండి
    7. @జిలేబి గారు
      @సీతాదేవిగారు

      హర్మ్యము హర్మ్యమే యనుచు హర్మ్యము నందున నీదులాడగన్
      😁

      తొలగించండి
  11. హర్మ్యంబుల్దాకె దివిని,
    హర్మ్యంబులుదివిని వెలెసె, నచ్చెర్వాయెన్
    హర్మ్యంబులు తిమిని వెలియ,
    హర్మ్యంబున నీదులాడె నవి మత్స్యంబుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేలపై ఉన్న స్ధలము చాలక కలియుగ ములో ఇంజనీర్లు ఇతర గ్రహములలో ను మరియు సముద్రముల లోను భవనములు కట్ట సముద్రం లోని చేపలు జలధి లో కట్టిన హర్మ్యములలో ఈదులాడనని భావన

      తొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2702
    సమస్య :: *హర్మ్యం బందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే*
    చేపలు ఒక గొప్ప భవనంలో ఈదులాడుతున్నాయి. ఇది యేమంత వింత కాదు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: మత్స్యగంధి మత్స్యరాజు అనే ఇద్దరూ ఉపరిచర వసువు యొక్క అంశతో ఒక చేపకు జన్మించారు. మా నాన్న సంతోషంగా కన్యాదానం చేసినప్పుడే నేను వివాహం చేసికొంటాను. అలా చేయడమే ధర్మము అని మత్స్యగంధి తనను మోహించిన పరాశర మహర్షికి అట్లే శంతన మహారాజునకు తెలియజెప్పింది. చేపకు జన్మించిన మత్స్యగంధి మత్స్యరాజు ఇద్దరూ తమకు భవనం లాంటి తమ నివాసమైన యమునానదిలో సంచరిస్తున్నారు ఇది యేమంత వింత కాదు అని విశదీకరించే సందర్భం.

    ధర్మ్యంబౌ పితృదత్త నైన తఱి నుద్వాహంబు, నా బాటయున్
    భర్మ్యంబౌ నను మత్స్యగంధియు, తలంపన్ మత్స్యరా జిట్లు సా
    ధర్మ్యం బొప్పగ నుందు రీ యమునలో, తద్గేహసీమన్ నదీ
    *హర్మ్యం బందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మళ్ళీ మళ్ళీ అదే చెప్పాలి..ఎన్ని పురాణాలను ఔపాసన పట్టేశారో...
      నమోనమః
      🙏🏻🙏🏻🙏🏻

      తొలగించండి
    2. శ్రీయుతులు విట్టుబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శుభమస్తు.

      తొలగించండి
  13. హర్మ్యంబును నిర్మించగ
    ఘర్మ్యుని దాయాది జనులు ఘనముగ నిల సా
    ధర్మ్యము లేని పటిమ నా
    హర్మ్యంబున నీదులాడె నవి మత్స్యంబుల్!

    ఘర్మ్యుడు = గాంధారి కొడుకు ( ఆంధ్ర భారతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో! అన్నయ్యను కాపీ కొట్టానండీ! 😊🙏

      తొలగించండి
    2. ఘర్మ్యుని దాయాదులనుట ఘనమైనదనన్!
      ☺️

      తొలగించండి
    3. కామేశ్వర రావు పోచిరాజుసెప్టెంబర్ 21, 2017 1:06 PM
      జిలేబి గారు నాలాగే మీరు కూడ నాంధ్రభారతి శోధకు లైనందులకు సంతోషము. అన్నీ మన మెదడులోనే యుంచుకొనుట సమయానికి గుర్తుకు వచ్చుట కష్టము కాబట్టి నిఘంటువులను సంప్రదించుట తప్పని సరి. పదప్రయోగౌచిత్యము మన మేధస్సు గొప్పదనము.

      మీ పూరణ చాలా బాగుంది.

      ఘర్మ్యుఁడు కౌరవ శతకము లో లేఁడు. అతఁడు గాంధారీ సూనుఁడు కాదు.
      గాంధారుని కొడుకు. గాంధారుఁడు యయాతి కొడుకైన దుహ్యుని పౌత్రుడు. గాంధార నగరమును నిర్మించిన వాఁడు. గాంధారి శకునుల తండ్రి సుబలునకు చాలా తరములు ముందటి వాఁడు

      https://kandishankaraiah.blogspot.com/2017/09/2470.html?m=1

      తొలగించండి
    4. హతోస్మి! పరువు పోయిందే! 😟😟🙏🙏🙏

      తొలగించండి
    5. హర్మ్యంబును కూర్చగ సా
      ధర్మ్యము లేనిగతి మయుడు ధర్మజు కొఱకై
      హర్మ్యము నలరగ మడుగులు
      హర్మ్యమున నీదులాడె నవె మత్స్యంబుల్!

      తొలగించండి
    6. డా. సీతా దేవి గారు ఘర్మ్యుడు గాంధారి కొడుకు కాక పోయినా మీ మొదటి పూరణకు వచ్చిన దోష మేమియు లేదు. చింతించకండి.
      సవరణ మరింత మనోహరముగా నున్నది.

      తొలగించండి
    7. ధన్యోస్మి! కామేశ్వరరావు గారూ! ఒక పూటలో మారిపోయే జాతకాలంటారు చూడండి, అలా అయింది నా పరిస్థితి! ముందు పొగడ్త, తర్వాత తెగడ్త, మళ్ళీ పొగడ్త! ఆహా! జీవితంలో మిట్ట పల్లాలు! నమోనమః!🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. దత్త కంద పాదానికి శార్దూలంలో నా పూరణ:
    ఆహా యీ రచనా చమత్కృతి - మయుండత్యంత రమ్యంబుగా
    సౌహార్దమ్మున కట్టి యిచ్చెనట యాశ్చర్యమ్ముతో నందరున్
    బాహాటమ్ముగనీ సభన్ పొగడెనైశ్వర్యమ్ములే నిండెగా
    నా హ
    ర్మ్యంబున - నీదులాడె నవె మత్స్యంబుల్ తటాకమ్మునన్
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  16. హర్మ్యంబుసొగసుజూడగ
    నైర్మ్యంబౌఛాయమనదినీటనువోలెన్
    హర్మ్యంబేజలమనుకొని
    హర్మ్యంబుననీదులాడెనవెమత్స్యంబుల్

    రిప్లయితొలగించండి
  17. 10.6.18
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్"

    సందర్భము: సులభము. హైదరాబాద్ లో అకస్మాత్తుగా వర్షం కురిసింది. అపార్ట్ మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లోకి నీళ్ళు వచ్చేశాయి. క్రమంగా సెకండు ఫ్లోర్ లోకి కూడ.
    ఆ బహుళ అంతస్తు లున్న హర్మ్యంలో చేప లీదులాడసాగినవి.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    హర్మ్యము తొలి యంతస్తున..
    హర్మ్యము మలిదానియందు నరెరే! నిండెన్..
    ధర్మ్యంబే జల మైనను
    హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్!

    మరొక పూరణము...

    సందర్భము: మన మెప్పుడూ కిందనే గదా వుండేది.. అంత పెద్ద పెద్ద ఎత్తైన సౌధాలలో పురుషులూ స్త్రీలూ ఎలా వుంటారో చూడా లనుకున్నా యట ఒకసారి చేపలు.
    ఈ లోపల హఠాత్తుగా వర్షం మొదలైంది. వాగులూ వంకలూ పొంగిపొర్లాయి. బహుళ అంతస్తుల భవనాలూ అక్కడక్కడ చాలావరకు మునగడంతో చేపలు హాయిగా ఆ అంతస్తులలో దూరి ఈదులాడాయి.
    మానవు లే మేమి యెక్క డెక్కడ యెలా దాచుకుంటారో తేలిగ్గా చూడ గలిగాయి.
    (కంద పద్య పాదాన్ని మత్తేభంలోకి తీసుకోవడం గమనార్హం.)
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    నరు లం తెత్తున నెట్టు లుందురొ!.. లస
    న్నారీ జనంబున్ జరిం
    తురొ యే లాగున సౌధ సీమఁ గన నౌ
    త్సుక్యంబుఁ జూపెన్ ఝషా;..
    లరెరే! వర్షము కుండపోతఁ గురిసెన్;
    హర్మ్యంబులున్ మున్గె; సుం
    దర హర్మ్యంబున నీదులాడె నవె మ
    త్స్యంబుల్ బలే.. హాయిగా..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    10.6.18

    రిప్లయితొలగించండి
  18. ధర్మ్యమ్మది తోవ తప్పెన?
    హర్మ్యమ్మది నీట మునిగె నతివృష్ఠి పడన్
    హర్మ్యమ్మున చేపలు బడి
    హర్మ్యంబుననీదులాడెనవెమత్స్యంబుల్

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. హర్మ్యము లందు నది మహా
      హర్మ్యము మత్స్య మను దేశ మందున నెంచన్
      ధర్మ్య మన ప్రజను మత్స్యము
      హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్ !


      ధర్మ్యావాస మటంచు భాసిలెడి సద్ధామంబు నిత్యమ్ము ర
      మ్యోర్మ్యా లంబిత సాధు నీరయుత పంపోక్తేద్ధ కాసార సా
      ధర్మ్యం బైన తటాక ముండ నతి విస్తారంబునై వెల్గు నా
      హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే

      తొలగించండి
  20. డా. వెలుదండ వారి సూచనతో మత్తేభములో కందపాదము
    నిరతం బా జలరాశులన్ మునిగి యా నీరంబులన్ దేలుచున్
    పరితాపంబు లవేమి లేక దమ వ్యాపారంబులన్ జేయుచున్
    సరియౌ రీతిన నుండనీక చిరు కాసారమ్ములన్ ద్రోయగన్
    ధర *"హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్"* సదా భ్రాంతిగన్

    చిరు కాసారము = ఏక్వేరియం

    రిప్లయితొలగించండి
  21. హ ర్మ్యoబున నేర్పర చి న
    హ ర్మ్యంబు న నీదు లాడెన వె మ త్స్యoబుల్
    హ ర్మ్యము లో పిల్ల లు గని
    హ ర్మ్యoబున నె గు రు చుండ్రు హర్ష ము తోడ న్

    రిప్లయితొలగించండి
  22. హర్మ్యంబెరుగని వైనా
    హర్మ్యంబున కాపురాన నలరెడితొట్టిన్
    హర్మ్యపు వాసులునిడగా?
    హర్మ్యంబున నీదులాడె!నవెమత్స్యంబుల్!

    రిప్లయితొలగించండి
  23. హర్మ్యమ్మీ జాలము ; సా
    ధర్మ్యంబు గల కవివరుల ధాటి గనిన ; వై
    ధర్మ్యంబిది యనదగునా
    హర్మ్యంబున నీదులాడె నన మత్స్యంబుల్ !

    రిప్లయితొలగించండి
  24. హర్మ్యంబుల్యవి నిర్మితమ్ము లవగా తోయంబు మధ్యంబునన్
    హర్మ్యంబుల్యవి గాజుచేతనటులన్
    చేయంబడ న్నెంచ సా
    ధర్మ్యంబే కనలేని యాకృతులచే
    నద్దాని వీక్షింప నా
    హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎవరైనా ఈ మధ్య వచ్చిన 3D, 4D Paintings గురించి వ్రాస్తే బాగుంటుంది!

      తొలగించండి
  25. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారి స్ఫూర్తితో)

    హర్మ్యం శంకర కంది వారిదిచటన్ హర్షించె వెల్దండ లా
    హర్మ్యంబందున కందమున్ నమిలెగా హాయంచు మత్తేభ మీ
    హర్మ్యంబిందున చంద్రమౌళి నడిపెన్ హైయంచు శార్దూలమున్...
    హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే?

    రిప్లయితొలగించండి
  26. మోహమ్మొందిన భార్యకౌతుకముపై పోవం దుకాణమ్ము నన్
    బాహాటంబుగ చూపినట్టి నగలో బంగారు మీనమ్ము లన్
    మోహించన్ నసపెట్ట వేరెవరికో పోకుండ
    కొన్నప్పు డే
    యాహర్మ్యంబున నీదులాడెనవె మత్స్యంబుల్ గళంబందు నన్

    మోహము=అజ్ఞానము, వలపు
    ఈదులాడు=ఊగాడు

    రిప్లయితొలగించండి


  27. హర్మ్యంబీ భువి! యిందు మానవులటన్ హాకంబు మేమంచు సా
    ధర్మ్యంబున్ వడిగా త్యజించిరి;మనోధర్మంబు మాదంచు, నై
    ష్కర్యంబంచు జిలేబు లై తిరిగిరే ; శాంతమ్ము గోల్పోవుచున్
    హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారి “పానశాల” ను గుర్తుచేశారు జిలేబిగారూ! ధన్యవాదాలు!
      ఆయన మా నెల్లూరీయుడే!

      తొలగించండి


    2. వేదాంతంబిదియె జిలే
      బీదీ పూర్ణముగ గుండు విరివిగ నుండున్
      కాదేదియు కష్టమ్ము సు
      మా దీకొను దేనినైన మహిలో సుమతీ :)

      జిలేబి

      తొలగించండి

    3. ధన్యవాదాలండీ సీతాదేవి‌గారు :) పూరించుడీ :)


      చానచక్కగ గూర్చిరమ్మరొ ఛందపద్యము చూడగన్
      పానశాలయె గుర్తుకొచ్చెను పద్యమిద్ది జిలేబియే :)



      జిలేబి

      తొలగించండి
    4. తేనెలూరెడు తెల్గుమాటలె తీరుగా సమకూర్చుచున్
      సానబెట్టగ పద్యవిద్యకు శంకరయ్య సదస్సునన్
      🙏🙏🙏🙏

      లేటుగా చూశాను కనుక పూరించడం ఆలస్యమయింది! కవికోకిల యనగానే మీకు మత్తకోకిల స్ఫురించింది! That is Jilebi!
      👍👍👍🌹🌹🌹

      తొలగించండి


  28. ఆక్రోశవాణి‌ సమస్యా పూరణ


    గణితమ్మిద్ది ! తెలుంగు వారి నిధియౌ! కావ్యమ్ము, నీపూరణల్,
    మణిమాలై నిలుచున్, జిలేబి విను! సామంజస్యమున్ గాంచుమా,
    క్షణమై నన్నెగ జోపకన్ గణములన్ సాధింపగా నంక పూ
    రణమే ప్రాణము పోయు పద్య కళయై రాణించు సద్గోష్టులన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు:

      ఈ శంకరాభరణం సమస్యను మీరు మిస్సయ్యారు:

      "పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్"

      తొలగించండి

    2. ధన్యవాదాలండి కంది వారు

      ఖండన మండన జేయుచు
      భండన భీములమటంచు భారీ పదముల్
      దండిగ దట్టింపు,బుసము
      పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్?

      జిలేబి

      తొలగించండి

    3. *ధన్యవాదాలండి జీపీయెస్ వారు

      తొలగించండి
    4. 👏👏👏

      G P Sastry (gps1943@yahoo.com)జూన్ 09, 2018 6:44 PM

      తిండియు తిప్పలు గలిగిన
      పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్?
      కొండొక దండుగ సభలో
      మొండిగ వాగ్వాదములను ముద్దుగ జేయన్ :)

      తొలగించండి
    5. భావ ప్రధానమైన కవిత్వాన్ని చివరకు అంక గణితం చేసేశారే! 😪😪😪

      తొలగించండి
  29. శార్దూలవిక్రీడితము
    ధర్మ్యమ్మౌ విధి క్రింద నీటఁ గని మత్స్యంబుండు పై యంత్రమున్
    హర్మ్యంబందున ద్రుంచ ద్రౌపది వివాహంబాడ గాజూడ సా
    ధర్మ్యమ్మున్ గల వీరవర్యులను, తద్వక్త్రంపు సంశోభితా
    హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే

    రిప్లయితొలగించండి