25, జూన్ 2018, సోమవారం

సమస్య - 2716

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము"
(లేదా...)
"లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "
(ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు)

105 కామెంట్‌లు: 1. వేదన పడకండి సుభిక్షమిదియె మనకు
  రాధనమును తెచ్చు జనులారా వినండి !
  రాదనగ వచ్చె తెలగాణ రాష్ట్రమున్ను
  లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. "వేదన వలదు మనకు సుభిక్ష మిదియె" అనండి.
   వేద - మిది.. ప్రాసయతిలో ప్రాసకు ముందున్న అక్షరాల లఘు గురు సామ్యం ఉండాలి.

   తొలగించండి
 2. "ఏషోస్య పరమా గతిః ఏషోస్య పరమా సంపత్"

  కామ క్రోధమ్ములను వీడి నామమెరిగి
  ధ్యాన ధారణలను గూర్చి మౌనమునను
  రామకృష్ణుల కీర్తించి రమ్యముగను
  పాద పద్మమ్ములనుజేరి పచ్చి "నేను"
  లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము
  :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   అహంభావాన్ని వీడాలంటూ ఆధ్యాత్మిక పరంగా వ్రాసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. బాధ తప్పదు జనులకు వగచు టేల
  ఎవడు రాజైన మనకేమి నెనరు గలదు
  దొంగ లందరు నూళ్ళను దోచు కొనగ
  లేదనఁగఁ గల్గు భోగభాగ్యో దయమ్ము

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టాసత్యనారాయణ
  ఏవి యలనాటి సూత్రము లేర్పడంగ?
  వృద్ధి రేటని ధనము స్థిరీకరించ
  రాదు, వ్యాధిని బిగబట్ట రాదు దాచ,
  లేదనగ గల్గు భోగ భాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి

 5. నారా వారి మాట గా


  మీ దరఖాస్తు లెల్లను సమీక్షకు పంపితి నేను పోరగన్
  కాదని చెప్పు వారు సయి ఖాతరు చేసెదరయ్య! నమ్ముడీ
  వేదన లేల! తెచ్చెద సుభిక్షము రాష్ట్రము కొత్త దయ్యె, నే
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టాసత్యనారాయణ
  కాదన ,వచ్చు భాగ్యములు గవ్వల గూర్చిన నొక్క సంఖ్యకున్
  నాదిది యింత యంచనడనాదిగ మానవు డెల్లవేళలన్
  ప్రోదిని బొక్కనీయకనె బుద్ధిగ మెల్గుట మేలు నమ్రతన్
  లేదన లేదు లేదనగ లీలగ గల్గును భోగ భాగ్యముల్

  రిప్లయితొలగించండి
 7. గురుదేవులకు ప్రణామములు. తేటగీతి సమస్యాపాదమున యతి భంగము?

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  సూర్యుడు... తన సుతుడైన దాన వీర శూర కర్ణునితో... ఇలా.. 👇

  ఆదరణీయుడైన అమరాధిపుడే చెయి సాచి విప్రుడై
  నీ దరిఁ జేరునా కపటి , నీ తనురక్షను కుండలమ్ములన్
  మోదము దీర గోరు దన పుత్రునికై ! సుత ! తప్పు కాదులే!
  లేదన ., లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. *అంతా లేదనుకొనుటలోనే ఉంది*... చక్కని సమస్యనిడిన శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు.. ధన్యవాదాలు 💐🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అవధాను లనిపించుకున్నారు. వారికి అభినందనలు.

   తొలగించండి

  3. *ఏమి చేతురా లింగ* !!


   నే దరిఁ జేర నెంగిలి యనెన్ భ్రమరమ్ములు పూలు గోయ ., గం...
   గోదకమున్ గ్రహింప నిది యొల్లదనెన్ ఝషమొండు , నీకు నే..
   నీదగు వస్తువేది యిల ? నేమిక జేసెద లింగ ! నా కడన్
   లేదన లేదులేదనగ లీలగ గల్గును భోగభాగ్యముల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. మురళీకృష్ణ గారికి ధన్యవాదములు నమస్సులు. శుక్రనీతిని జానపద నీతిని ప్రకటించుచు మీ జేసిన పూరణము లద్భుతములు.

   తొలగించండి
  5. శ్రీ కామేశ్వరరాయ ! ధన్యుడ త్వదాశీరాశిసంపన్నతన్!! 🙏🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 9. హరిహరుల భేద మెంచక ననవ రతము
  భక్తితోడను కొలుచుచున్ వాసిగాను
  దయను కలిగి స్వార్థానికి స్థానమికను
  లేదనఁగఁ గల్గు భోగ భాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి

 10. గుండు అది.
  గుండు యిది
  గుండు లోనుండు గుండు
  గుండు లోనుండి గుండు
  గుండు గుండే గుండౌ  వేదన లేల కర్వరిని ! వెంగలివిత్తుగ మారు టేలనో !
  నాదిది కాదు నెద్దియు! సనాతన మైనది దేహభుక్కు!నా
  దేదియు లేదు భూమిని విదేహము చెంద జిలేబియెచ్చటన్ ?
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్  నేతి నేతి జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాదు + ఎద్దియు = కా దెద్దియు' అవుతుంది. నుగాగమం రాదు. 'కా దదెద్ధియు' అనండి.
   'గుండు' ప్రస్తావన అర్థం కాలేదు.

   తొలగించండి
 11. కాదనలేదు కాదనగ మనసున తొలగును
  మోహావేశముల్
  చేదనలేదు చేదనగ తీపిని విడుచును రక్తపు
  బంధముల్
  పోదనలేదు పోదనగ తన తనువును తొలచును
  వ్యామోహముల్
  కాదనలేదు కాదనగ లీలగ గల్గును భోగ
  భాగ్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రమేశ్ గారూ,
   భావం బాగుంది. సమయం అనుకూలిస్తే దీనికి పద్యరూపం ఇస్తాను.
   క్రమం తప్పకుండా సమస్యలపై స్పందిస్తున్నారు. సంతోషం. పద్యాలు వ్రాసే ప్రయత్నం మొదలు పెట్టవచ్చు కదా!

   తొలగించండి
 12. శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో

  బాలకుడని భావించకు మాలకించు
  వలదునీయ మూడడుగుల తలము నీవు
  తలచగాను నీతడగును దానవారి
  లేదనగ గల్గు భోగభాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వలదు + ఈయ = వలదీయ' అవుతుంది. నుగాగమం రాదు. "వల దొసంగ మూడడుగుల" ఆనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏

   తొలగించండి

 13. రమేశు గారి భావనకు

  కాదన లేదు కాదనగ కామము మోహము వీడు చిత్తునే
  చేదన లేదు చేదనగ చెక్కర తీపిని వీడు బంధముల్
  పోదన లేదు పోదనగ పోవు శరీరము కాల్చు వేదనల్
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. ఫలిత మాశిoచు పూజలు పనికి రావు
  కలిమి నిమ్మoచు ప్రార్థించు కాంక్ష వదలి
  నిర్మల oబు గ కొలిచె ద నిన్ను కోర్కె
  లేద నగ గల్గు భోగ భాగ్యో ద య మ్ము

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2716
  *లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగభాగ్యముల్.*
  అడిగినవానికి లేదు లేదు లేదు అని చెబుతూ ఉంటే భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: దానకర్ణుడుగా పేరుపొందిన అంగరాజు చదువుకొనే రోజులలో *లే దు* అనే రెండు అక్షరాలను నేర్చుకోలేదు అని చెబుతూ ఉంటారు. *లా కేత్వ మివ్వ లేడట, దా కును కొమ్మివ్వ డట్టి దాతయు కలడే?* అనే పద్య పాదాన్ని మనం వినియున్నాం కదండీ.
  నా దగ్గఱ లోభ గుణం లేదు. అసత్య మనే మాట లేదు. యుద్ధంలో వెన్ను చూపడ మనే మాట లేదు. ఇతర స్త్రీలు కోరినా సరే కౌగిలి ఇచ్చేది లేదు. ద్రోహబుద్ధి అనే మాట లేనే లేదు అని అంటూ సాటి లేని దాన ధర్మములు చేస్తూ మేటి కీర్తిని పొందిన కర్ణుని వలె లేదు లేదు లేదు అని అంటూ ఉంటే భోగ భాగ్యాలు కలుగుతాయి అని చమత్కారంగా తెలియజెప్పే సందర్భం.

  లేదను లోభ మెన్నడును, లే దనృత మ్మను, వెన్ను జూపుటే
  లేదను యుద్ధరంగమున, లేదను కౌగిలి యన్యభామకున్,
  లేదని ద్రోహబుద్ధి తుల లేక వెలింగెడి కర్ణు పోలికన్
  *లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగభాగ్యముల్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (25-6-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన పూరణ అవధానిగారూ!! నమఃపూర్వక అభినందనలు!!🙏🙏🙏

   తొలగించండి
  2. రాజశేఖర్ గారూ,
   ఉత్తమునకు ఉండకూడనివి వివరిస్తూ కర్ణుని ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. శ్రీమతి సీతాదేవి గారూ! ప్రణామాలండీ.

   తొలగించండి
  4. శ్రీ గురుభ్యో నమః
   నేటి సమస్యాపూరణ పద్యభావమునకు ప్రేరణను కూర్చిన పూర్వ కవి కృత పద్యం.
   *తిమ్మ జగపతి - ఇవ్వడు*
   ఇవ్వడు ఇవ్వడంచు జను లెప్పుడు తప్పక చెప్పుచుందు రే
   మివ్వడు ? అన్య కాంత కుర మివ్వడు! సంగర రంగ మందు వె
   న్నివ్వడు! శత్రులన్ ప్రబల నివ్వడు! బెబ్బులి నైన పట్టి పో
   నివ్వ! డసత్య వాక్య మెపు డివ్వడు! తిమ్మజగత్పతీంద్రుడే.
   సేకరణ :: శ్రీ రామకవచం వేంకటేశ్వర్లు. (పుస్తకం పేరు : తీయని తెలుగు పద్యం).

   తొలగించండి
  5. రాజ శేఖర్ గారు మూడు “లేదు”లకు మఱో యేను “లేదు”లు చేర్చిన మీ పూరణము మనోహరము! నమస్సులు.

   తొలగించండి
 16. వాదముఁ జేయు టేల నిలఁ బ్రార్ధనఁ జేయుచు నిర్గుణాత్మునిన్
  వేదన లిచ్చు కర్మలను వీడుచు నెప్పుడు దానబుద్ధితో
  మేదిని లోనఁ జూచినను మేధనుఁ గల్గియు మాకు లోభమే
  *"లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "*

  రిప్లయితొలగించండి
 17. తాతయొకడుండెభీమన్నతాతయనగ
  నేదియడిగినముందుగాలేదనుచును
  దెచ్చియిచ్చునుదరువాతతీరికగను
  లేదనగగల్గుభోగభాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 18. బీదల సాదలన్ గనుచు ప్రేమను జూపిన మెచ్చు నీశుడే
  నీదయ కొంతజూపి సరి నీకడనున్నది దాచకుండగన్
  వాదన జేయబోక మరి వచ్చిన వారిని నెట్టు బుద్ధియే
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 19. పోదురు మీదు డాబుసరి! పూర్తిగ తప్పు శుభమ్ము లివ్వవే!
  వేదము చెప్పదిట్లు పరివేష్టిత శోభలు జేర్చవే కవీ
  శా!దెసదిక్కు లేదనగ చక్కగ నొప్పునకో?మరెట్లయా
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. వాదనజేయకుండగనుభామలతోడనునెల్లవేళలన్
  గాదనకుండగాదొడరికామితవస్తువులెల్లదీర్చుచో
  లేదనలేదులేదనగలీలగగల్గునుభోగభాగ్యములు
  ల్లాదరణంబుతోనెపుడుహర్షమునొందగనిత్తురేగదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భాగ్యముల్ + ఆదరణంబు = భాగ్యము లాదరణంబు' అవుతుంది. ద్విత్వ లకారం రాదు.

   తొలగించండి
 21. లేదను మాట వద్దనిరి లేమినిఁ బెంచును లోకమందనిన్
  లేదన దానమీయకను లెస్సగు మాటది నిత్యసత్యమే!
  లేదన లోభ బుద్ధియును లేదన మత్సర మింక స్వార్థమున్
  *"లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అందనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "లోకమంతటన్" అనండి.

   తొలగించండి
 22. కాదనకుండ చేయవలె కల్మియె కల్గిన వారు దానముల్
  మోదము తోడ చెప్పవలె మోక్షము నందెడి మార్గమే గురుల్
  భేదము లేక ధర్మమది వెల్గగ,లేదను మాట లేదనిన్
  *లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ *

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీహర్ష గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లేదనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "మాట వీడుచున్" అందామా?

   తొలగించండి


 23. లేదని చెప్పు! నీశు డస లేలనకో యని ప్రశ్న వేయుమా
  లేదు విధాత భాగ్యమసలెక్కడ యంచు సవాలు చేయు మా
  లేదను నేను లేక భువి లేదని చెప్పుము ధైర్య శాలిగా
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. స్వార్థ మును వీడ కలుగును సంతసమ్మె
  యంతె ఱుగని యాశ లిడునె సుంత సుఖము?
  భువి విరాగమునకు మించి పొందనేది
  "లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము"

  రిప్లయితొలగించండి
 25. [25/06, 05:32] ‪+91 75698 22984‬: 25, జూన్ 2018, సోమవారం
  సమస్య - *2716*
  కవిమిత్రులారా,
  ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

  *"లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము"*

  (లేదా...)

  *"లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "*

  http://kandishankaraiah.blogspot.in
  [25/06, 09:37] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
  శ్రీకరప్రకాశిత! నిఖిల శ్రేయ నిలయ!
  నీది కాదె యీ భూభవ నిధి సకలము
  నేనసత్యము సత్యము నీవె "నాది
  లేదనగ" గల్గు భోగభాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు కేవలం పద్యాన్ని పోస్ట్ చేస్తే చాలు. సమస్యలను పోస్ట్ చేయడం ఎందుకు?

   తొలగించండి
 26. మురికి మానసులకు నుప యోగ పడక
  సిరి యుదారుల చెంతను చేరుచుండు
  ప్రజల సేవలలోన విరామమసలు
  లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరణను వాట్సప్‍లో సూచించాను.

   తొలగించండి
 27. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  లేదన లేదు లేదనఁగ
  లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ 

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "వాదము లేల? యెందులకు
  వత్తురు మీరలు.. మా గృహంబునన్
  లే దనకుండగాఁ దినవ
  లెన్ గడుపారగఁ.. దృప్తి మా కదే
  యాదరణీయులార! యిసు
  మంతయు మా కడ లోభ మన్నదే
  లే" దన "లేదు, లే" దనఁగ
  లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  25.6.18

  రిప్లయితొలగించండి


 28. మహా నటి సావిత్రి


  చౌదరి యింట గుబ్బతిలె సాధన పత్రిక చిత్ర మివ్వగా
  నాదరణల్ సినీజగతు నాట్య మయూరి గణేశు జామిగా
  కాదన లేదు కోరగ సుగంధము లొప్ప సహాయముల్ భళీ
  లేదన లేదు, లేదనఁగ ! లీలగఁ గల్గును భోగ భాగ్యముల్,
  మీద పడంగ గంధవతి మింకిరి జేసె మహానటిన్ గదా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సినీజగతి' అనండి.

   తొలగించండి
 29. విద్య నొసఁగినఁ బెరుగును విజ్ఞత మఱి
  తపము నొనరించ ఘనముగ దక్కుఁ బరము
  దాన మర్థుల కిచ్చిన యేని, కాదు
  లేదనఁగఁ, గల్గు భోగభాగ్యోదయమ్ము


  పోదురె మూటఁ గట్టు కొని పుత్తడి విత్తులఁ బుణ్య లోకముల్
  కాదన కిత్తు నున్నెడలఁ గాసులు సంతత మర్థు లెల్లరన్
  వాదన లేల సాదరము పంపుదు దృప్తిగ నెవ్వ రేని, నే
  లే దన, లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   'ఎవ్వరేని నేలే దన..' ఇక్కడ భావం బోధపడలేదు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   ఎవ్వరేని లేదు లేదనఁగ, నే లేదన (ను) అని నాభావమండి.

   తొలగించండి
 30. మోదముతోడ చేరుసిరి, మ్రుచ్చుల చెంతను నిల్వ దెప్పుడున్
  స్వేదము చిందజేసి కడుఁ జెన్నుగ కార్యము లన్ని చేయుచున్
  వేదన నొందునట్టి నిరు పేదల సేవల లోవిరామమే
  లేదన, లేదు లేదనఁగ, లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

  రిప్లయితొలగించండి
 31. రాదగు నాదు కౌగిలికి రంజుగ నీ వన వారకాంతయే
  కాదిది లంచ మెన్న పనికై బహుమానము తీసికొండనన్
  మోదముతోడ త్రాగు డిది మున్నె సురల్ రుచిజూచినా రనన్
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్.

  రిప్లయితొలగించండి
 32. ఉన్నయంతలోన సతతంబుర్వి యందు
  దాన ధర్మములను చేయ ధన్యత గను
  నెప్పుడునునోటినుండియు నేది నాది
  లేదనగ గల్గు భోగ భాగ్యోదయమ్ము!  కామమును మరి క్రోధమున్ కడకు ద్రోసి
  సతత హరిచింతనాసక్తి జగతియందు
  తిరుగుచాపన్నులడిగిన దెల్ల నొసగి
  నేను నాదన్నదీభువి నేది లేదు
  లేదనగ గల్గు భోగ భాగ్యోదయమ్ము!

  రిప్లయితొలగించండి
 33. వాదనమాని తృప్తిగను వైరములెవ్వరియందులేక స
  మ్మోదమునింపు కోర్కెలన?మోసముచెంతనజేరినట్లె!యు
  న్మాదపు యూహలుంచకను"నాదనువాదముమానసంబునన్
  లేదనలేదు లేదనగ"లీలగగల్గును భోగభాగ్యముల్

  రిప్లయితొలగించండి
 34. ఆటవిడుపు సరదా పూరణ:
  ("ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం")

  "లేదుర రాజధానికిక లెమ్ముర తెచ్చితి జమ్నమన్నునున్
  లేదుగ నాంధ్రకున్ స్పెషలు లెమ్ముర తెచ్చితి మల్లెమాలనున్
  లేదన బోకు నా చెలిమి లెమ్ముర చూడు జగన్నుమోహనున్
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్"

  జమ్న = యమున (హిందూస్తానీ)
  https://m.youtube.com/watch?v=6dMRxZhmhR4

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆబ కందం

   లేదనక జమున మట్టిని
   లేదనకన్ మల్లె పూవు లెస్సగ చెవిలో
   కాదనక పెట్టితి! జగను
   సోదరుని చిరునగవు గను శోకించకుమా !

   జిలేబి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 35. ఆదర పూర్వక oబుగ స హాయ మొన ర్చు ను దార బుద్ది తో
  పేదల నాదు కో దల చి పేర్మిమన స్సు న దాన ధర్మ ము ల్
  కాదన బో క నిచ్చు చు ను గర్వమొ కిం చుక చూప కుండ తా
  లేద న లేదు లేద నగ లీలగ గల్గు ను భోగ భాగ్యము ల్

  రిప్లయితొలగించండి
 36. వాదము లేలనయ్య నిల వాసిగ మూటలు గట్టి ద్రవ్యమున్
  గాదెల యందు దాచినను గైకొని పోవడు చావు వెంటరాన్
  ఖేదము లేక నిప్పు డిట కీర్తిని పొందగ నెంచి యర్థులన్
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో సవరణ సూచించాను.

   తొలగించండి
 37. వలయు పనినిపూరించ నావల్లకాద
  ని నడుమనె వీడకుండగ నేర్పు తోడ
  తగినరీతి కష్టపడుట తప్ప వేరు
  లేదనగ గల్గు భోగభాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 38. తేటగీతి
  దైవకృపతోడ నెన్నడుఁ దరగ నట్టి
  సిరులు సమకూర జీవించు సరళిఁ దెలిసి
  లోకుల వెతలుఁ దీర్చఁగ లోభమెపుడు
  లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము


  రిప్లయితొలగించండి
 39. నక్షత్రకుడు హరిశ్చంద్రునితో......

  నీదగు సత్యదీక్ష గద నిన్నును నన్నును బాధపెట్టుచున్
  పేదగ మార్చినీదయిన భీరువునే యెడ బాపె గాదె, నన్
  వేదన పెట్టుచుంటివిక విడ్వుడు సత్యవ్రతమ్ము నో నృపా
  లేదన లేదు లేదనఁగ లీలగ గల్గు భోగభాగ్యముల్

  రిప్లయితొలగించండి
 40. బలితో శుక్రాచార్యుడు......,

  నీదరి జేరినట్టి ధరణీసుర బాలకుఁ నమ్మ బోకుమా
  కాదనెఱంగుమా వడుగు కల్పము బ్రోచెడు దీక్షతో యిటన్
  వేదన ద్రుంచగన్ సురలు వేడగ వచ్చిన విష్ణువాతడే
  మోదము తోడతానడుగు మూడడుగుల్ భువిగాదే దానినిన్
  లేదన లేదులేనఁగ లీలగ గల్గును భోగభాగ్యముల్.

  రిప్లయితొలగించండి
 41. నక్షత్రకుడు హరిశ్చంద్రునితో....

  భాగ్యముల్ వీడి యడవుల పాల బడిన
  నృపుడ నామాట వినవయ్య నిన్ను గాతు
  సత్య దీక్షను విడనాడి చక్క గాను
  లేదనఁగఁ గల్గు భోగ భాగ్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో వ్యాఖ్యను గమనించండి.

   తొలగించండి
 42. డా.పిట్టాసత్యనారాయణ
  కాదన ,వచ్చు భాగ్యములు గవ్వల గూర్చిన నొక్క సంఖ్యకున్
  నాదిది యింత యంచనడనాదిగ మానవు డెల్లవేళలన్
  ప్రోదిని బొక్కనీయకనె బుద్ధిగ మెల్గుట మేలు నమ్రతన్
  లేదన లేదు లేదనగ లీలగ గల్గును భోగ భాగ్యముల్

  రిప్లయితొలగించండి
 43. రావణాసురునకు మండోదరి హితబోధ :

  ఉత్పలమాల
  కాదన నేల? సమ్మతము కాదన నంగదు రాయబారమున్
  మేదిని వంశనాశనము మేలను కొంటిరొ? రాముఁ జేరుచున్
  వేదన బాపి సీతనిడి వేడుచు మోహము నాకు నమ్మపై
  లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

  రిప్లయితొలగించండి
 44. కాయకష్టంబు సేయుచు కలసిమెలసి
  ఒకరికినొకరుగ నెపుడు యొద్దికగను
  అన్నదమ్ములిర్వురు నాదియను తలంపు
  లేదనగ గల్గు భోగ భాగ్యోదయమ్ము.

  రిప్లయితొలగించండి
 45. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  లేదన లేదు లేదనఁగ
  లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ 

  సందర్భము: అతిథి దేవో భవ.. అన్నారు. ఊరకే కాదు.. అతిథిగా వచ్చినవాడు దేవు డని భావించి భోజనం పెట్టవలె. కడుపార భుజించిన అతిథి దేవతలు
  "అన్నదాతా సుఖీభవ.." అని మనసారా దీవిస్తారు. "లోభ మనేది వీళ్ళ దగ్గర లేదు.. లేదు.." అంటూ వుంటే గృహస్థులు సంపాదించిన ధనానికి సార్థకత కలుగుతుంది.
  "దానము భోగము నాశము.. పూనికగా మూడు దశలు భువి ధనమునకున్.." అన్నారు. అదాన దోషం వల్ల దారిద్ర్యం సంభవిస్తుం దని ప్రాజ్ఞుల వచనం. దానం చేసే వానికి భోగభాగ్యాలు కలుగుతా యని పెద్దల మాట. ఐతే యిదంతా ఐహికమే!
  దానంవలన ఐహిక మిలా ఫలిస్తే జ్ఞానంవలన ఆముష్మికం సఫల మౌతుంది. జ్ఞానాదేవ తు కైవల్యం.. అని కదా! ఏ జ్ఞాన మంటే "సర్వం ఖల్విదం బ్రహ్మ.." (అంతా పరబ్రహ్మమే!.. నే ననేది లేదు..) అనేది.
  "సర్వము న్నతని దివ్య కళామయ మంచు" నెఱిగి.. ఆ ఎఱుకను అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మానవుడు జీవించి వున్నప్పుడే ముక్తు (జీవన్ముక్తు) డౌతాడు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  మోదము నందగా నతిథి
  ముఖ్యులు దీవన లీయ.. "లోభమే
  లే" దన.. "లేదు, లే" దనఁగ
  లీలగఁ గల్గును భోగ భాగ్యముల్
  "వాదము లేదు.. సర్వమును
  బ్రహ్మమె!.. బ్రహ్మమె!.. నాది యేదియున్
  లే" దన.. "లేదు లే".. దనగ
  లీలగ మోక్షము.. నన్ వరింపదే!

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  25.6.18

  రిప్లయితొలగించండి
 46. పేదరికమ్మునన్ సరము పేరిమి నిచ్చిన ధర్మపత్నికిన్
  లేదన; లేదు లేదనఁగ; లీలగఁ గల్గును భోగ భాగ్యముల్
  వాదన మానుచున్ వడిగ వడ్లను దంచిన నట్కుమూటనున్
  నీదు భుజమ్మునన్ తొడిగి నేరుగ బోవగ ద్వారకాపురిన్

  రిప్లయితొలగించండి