8, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2700 (కనకకశిపుఁ బూజ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును"
(లేదా...)
"కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్"

103 కామెంట్‌లు:

  1. ప్రాస గీతి :)

    వినడు ప్రహ్లాదుడెపుడును తన జనకుడు
    కనకకశిపుఁ బూజయె; కాఁచుఁగద జగమును
    కనివిని యెరుగనటులను గణపతిది హ!
    తనమున మనమున హృదయమునను గదర!

    రిప్లయితొలగించండి

  2. మొదట చర్చలు వలదని మొండి, కోప
    గించు కొనె! పిదప బిలిచి గిట్ల వలదు
    మాట లాడద మనె ట్రంపు ! మాట వినవె
    కనక! కశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును!

    కశిపు -కోపము గలవాడు :) మన ట్రంపు లా అన్నమాట మొదట నో తరువాత యెస్:)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ వివిద్యమైన విరుపుతో, అండంతో బాగున్నది. అభినందనలు.
      'గిట్ల' అన్నది తెలంగాణ మాండలికం!

      తొలగించండి

    2. ట్రంపు తెలుగు మాట్లాడితే అని వూహిస్తే తెలగాణ మాండలికం ధారాప్రవాహంగా వచ్చేసె :)


      నెనరులు
      జిలేబి

      తొలగించండి
  3. రిప్లయిలు

    1. (వరగర్వితుడైన హిరణ్యకశిపుడుప్రజలతో ఉత్సాహంతో )
      దనుజుల నగరమ్ములోని దైత్యులార! వినుడికన్
      కనులబడని విష్ణుడెంతొ కష్టవార్థి ముంచెనే ?
      అనగ వలదు వాని నామ; మతని తలపువీడుడీ!
      కనకకశిపు బూజయే జగమ్ము బ్రోచు నెప్పుడున్ .

      తొలగించండి
    2. బాపూజీ గారూ,
      మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. తేటగీతి
    హరిని నిందా స్థుతిన్ జేసి త్వరితమంద
    వైరభక్తిని ప్రకటించ శౌరి దాల్చు
    మహిత నారసింహావతార హితమంద
    కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిందాస్తుతి' టైపాటు!

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.టైపాటు సవరణతో

      తేటగీతి
      హరిని నిందా స్తుతిన్ జేసి త్వరితమంద
      వైరభక్తిని ప్రకటించ శౌరి దాల్చు
      మహిత నారసింహావతార హితమంద
      కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    హిరణ్యకశిపుని శాసనం...

    అనవలదిక విష్ణునామ., మందరొక్క గొంతుతో
    కనకకశిపునే దలంపగావలెన్ ముదంబునన్
    మనకు హితుడు బాంధవుండు మాన్యుడాతడే ధరన్
    కనక కశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  6. ప్రహ్లాదుని గురువు పిల్లలతో


    వినుడు వినుడు పిల్ల లార ! వీరు డౌ హిరణ్యమౌ !
    మనుగడ మనకతని వలన మారు బల్క రాదుగా!
    మనసునన్గొలుచుడతనిని మాన్యుడాతడే సుమా !
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. దానవకుల ఇనుడు దానవోద్దారకుడు
    జనకుడు
    సురలనుగ్గడించు వీరుడు హరికి పరమ
    పగతుడు
    ప్రహ్లాదుని హితమునకు దనుజ గురువులు
    చెప్పెడున్
    కనక కశిపు బూజయే జగమ్ము బ్రోచు
    నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  8. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో:
    ఉత్సాహ:
    అనకునీదునోటివెంటనసురరిపుని నామమున్
    వినుము నాదుమాట సుతుడ వెతలనొందఁబోకుమా
    ఘనుడులోకమందునీదు కన్నతండ్రియొక్కడే
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. భలే !

      ఉత్సాహం పంచ చామరపు పోకడ ల మేళవింపు అదురహో ! (మొదటి మూడు పాదాలు)


      జిలేబి

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు మాష్టారు
      ధన్యవాదాలు జిలేబీ గారు

      తొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
    కనక కణకణమున వాడె గలడటంచు
    వినికిడిని నమ్మి బ్రహ్మమున్ వెతక వెర్రి
    కనగ బరిశోధనము జేయు కఠిన శ్రమకు
    కనక కశిపు బూజయె కాచుగద జగమును

    రిప్లయితొలగించండి


  10. చంద్ర మౌళి గారి పద్యం చదివేక కొంత పంచ చామర ఫ్లేవర్ :)



    వినుడు మీరు పిల్ల లార ! వీరు డౌత రేడురా
    మనకు నాత డేను దిక్కు మారు బల్క రాదుగా!
    మదిని గొల్వ మేలు గాను మాన్యుడాతడే సుమా !
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    అనగ ననగ స్వాంతమందె హ్లాదమొప్ప గన్పడు
    న్నన విని పరికించ కెట్టు లౌనె శోధనా కళన్
    జని పగసెగ నంటుబెట్టి సాము జేయు శ్రద్ధకై
    కనక కశిపు బూజయే జగమ్ము బ్రోచు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  12. అరయ భూపతియె నశించు నరుల కుట్ర;
    మహిని దేనివీడి జనులు మనగ లేరు?;
    సర్వ రక్షకుండగు మేటి శర్వునకును
    "కనక; కశిపుఁ ;బూజయె కాఁచుఁగద జగమును"
    ***)()(***
    కనక = తెలియక;ఊహించక;పసిగట్టక
    కశిపు = అన్నము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. పరుల పక్షాన నిలచిన పాపమదియు
    చేరి కొలుచువారికి సమకూరు నన్ని
    పార్టి మార్చిన వాడౌను వల్లభుండు
    కనక కశిపు బూజయె కాచుగద జగమును.

    రిప్లయితొలగించండి
  14. చండమార్కులు ప్రహ్లాదునితో

    అనకు శ్రీహరియని, మనక హరహ మదియె రక్షయై
    మనల నాదుకొనెడు నామ మదియె లోకమందు నో
    కూన మానుమంటి నీదు కూత యెరగు మింక నా
    కనక కశిపు బూజయే జగమ్ము బ్రోచు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  15. రావణుండేలు చుండు కురాజ్యమందు
    హరిని బూజింప రాదని యడ్డు కొనుచు
    కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును
    ననుచు బోధించి బాధించి రపుడు జనుల

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2700
    సమస్య :: *కనకకశిపు పూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్.*
    ‘’హిరణ్యకశిపుని పూజయే ఈ లోకాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది’’ అని చెప్పడం ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: నవ విధ భక్తి మార్గాలలో స్మరణ భక్తికి ఉదాహరణగా భక్త ప్రహ్లాదుని పేరు చెబుతారు.

    శ్రీ విష్ణో: శ్రవణే పరీక్షిదభవద్వైయాసకి : కీర్తనే
    ప్రహ్లాద: స్మరణే, తదంఘ్రి భజనే లక్ష్మీః పృధు: పూజనే ।
    అక్రూరస్త్వభివందనే కపిపతిర్దాస్యే చ, సఖ్యేఽర్జునః
    సర్వస్యాత్మసమర్పణే బలి రభూత్ కైవల్య మేషాం ఫలమ్ ।।
    అనే శ్లోకం ద్వారా పై విషయం బోధపడుతున్నది.
    ప్రహ్లాదుడు గురుకులంలోని తోటి బాలకులకు విష్ణుభక్తి మహిమను గఱించి చెబుతూ ‘’ శ్రీ మన్నారాయణుని నామ *స్మరణ* చేయండి. శ్రీ మహా విష్ణువే సర్వ జగద్రక్షకుడు. మన గురువులు అగు చండామర్కులు మనకు చెప్పే మాటలు మంచివి కావు అని విశదీకరించే సందర్భం.

    వినుడు మీరు బాలులార! విష్ణువున్ స్మరింపుడీ
    కనుడు విష్ణుమూర్తియే జగమ్ముఁ బ్రోచు నెంచుడీ
    చెనటి మాట లిచటి గురులు చెప్పుచుందు రిట్టులన్
    ‘’కనకకశిపు పూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్.’’
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (8-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వావ్ ! ఇక్కడ కూడా పంచచామరోత్సాహ గుభాళింపు :)

      చాలా బాగుందండీ కోటా వారు


      జిలేబి

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. సహృదయులు జిలేబీ గారికి ధన్యవాదాలు. ప్రణామాలు.

      తొలగించండి
    4. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారికి ప్రణామాలు.

      తొలగించండి
  17. చండామార్కులు ప్రహ్లాదునితో

    జనకుడైన కతంబున చక్కగాను
    కనకకశిపు బూజయె కాచుగద; జగమును
    గెల్వజాలిన యాతని కీర్తిముందు
    శ్రీవిభుని కీర్తనలు బహు చిన్నబోవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనకు వచన మెప్పుడున్ విచార మౌను సత్యమై
      వినుము వినుము బాలకా నవీన భావ జాలమున్
      కనక కశిపు బూజయే జగమ్ము బ్రోచు నెప్పుడున్
      కనగ నతని శౌర్యమున్ నగారియైన నల్పుడే!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. గురువుగారికి నమస్సులు! మీరీ రోజు యిచ్చిన రెండవ పూరణ పాదము యే ఛందస్సుకు చెందినది? నా వద్దగల చిన్న వ్యాకరణ పుస్తకములోని యే లక్షణాలతో సరిపోవడం లేదు! పైగా కవులంతా రకరకాలుగా పూరించి యున్నారు!
      నేను కేవలం మీరిచ్చిన పాదం లోని గణాల ఆధారంగా పూరించాను! దయచేసి వివరించ ప్రార్ధన!🙏🙏🙏

      తొలగించండి
    4. కంది శంకరయ్య గారు:

      ఈనాటి సమస్యా పాదాలలో మొదటిది తేటగీతి, రెండవది ఉత్సాహము.
      ఉత్సాహ లక్షణం... ప్రతి పాదంలో 7 సూర్యగణాలు + 1 గురువు. 5 వ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం ఉంది కనుక పద్యాన్ని గురు లఘువులలో దేనితో ప్రారంభిస్తామో మిగిలిన పాదాలను దానితోనే ప్రారంభించాలి.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురువుగారూ! గురువుగారి సందేశాన్ని అందించిన అన్నగారూ! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి

    6. ఈ ఉవాచ ఎప్పుడు ఎక్కడ కందివారిచ్చేరు ?

      "కంది శంకరయ్య గారు:

      ఈనాటి సమస్యా పాదాలలో మొదటిది తేటగీతి, రెండవది ఉత్సాహము. "

      జిలేబి

      తొలగించండి

    7. ఈ స్మైలీల కర్థమేమి తిరుమలేశా :)

      కొచ్చెను పేపర్లకు గురువు గారు బిట్లందిస్తున్నారోచ్ :)



      జిలేబి

      తొలగించండి
    8. లేదు లేదు జిలేబిగారూ! నేను ఆన్సర్లు వ్రాసి పాస్ అయ్యాకే అన్నయ్య వివరణ యిచ్చారు!
      ప్రశ్న సరిగా అర్ధం కాకపోయినా జవాబు వ్రాసి పాస్ అయ్యానండీ! అదీ ఆచార్యకత్వం లోని తెలివి! 😄😄😄

      తొలగించండి

    9. అబ్బే సీతాదేవి గారు మీ గురించి కాదండీ
      ఈ బిట్లందించింది వేరే మరేదో ' వేదిక ' లో అని నా నారదీయ బుర్రకు తట్టుతోంది :)

      జీపీయెస్ వారు వులకక పలకక వున్నారంటే .....


      నారదా!
      జిలేబి

      తొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,



    . . . . . . . . చండా మార్కలు . . . . . . . . . . . . .




    వినుడు ద‌నుజ బాలలార ! వినుతి జేయుడీ మదిన్ ,

    కనక కశిపు బూజయే జగమ్ము బ్రోచు నెప్పుడున్ |



    . . . . . . . . . ప్రహ్లాదుడు :- . . . . . . . . . . . . . . . .



    అనఘలార ! త్రిభువనముల హరియె కాచు నిత్య మం

    చనెడు సత్య మెరిగి కూడ నందరికిటు బోధ సే

    య , నుచితంబె ? గురువు లగుచు ననృత మాడ ‌ ధర్మమే ?

    కనుక భయము వలదు మీకు కంజనాభు డుండగా ! ! !


    --------------------------------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  19. చండా మార్కు లు ప్ర హ్లా దునితో __:
    వలదు హరి నామ చింతన తలపు నందు
    తండ్రి దైవ మను చు నెంచ తప్ప కుండ
    కనక క శి పు పూజ యె కాచు గద జగమును
    మార్చు కొను ము ప్ర హ్లా ద మంచి దగు ను

    రిప్లయితొలగించండి
  20. తినుట తగిన దాని మంచిది కద యొంటి కెప్పుడున్
    మనుట మేలు బట్ట దాల్చి మంచి గౌరవం బగున్
    మనకు తిండి గుడ్డు లౌను మాననీయ దైవముల్
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  21. వరగర్వముతో ముల్లోకాలను జయించిన పిదప దేవతలను సేవించే యజ్ఞయాగాదులు చేయరాదని, అందరూ జగజ్జేతయైన హిరణ్యకశిపునే పూజించాలని చాటించే సందర్భము:

    ఎవడు ముల్లోక ములను జయించి నాడొ
    ఎవని సేవకు నా యింద్రు డేగు చుండు
    యట్టి వానిని సేవింపు డందరికను
    "కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఘనత గల్గు దేవతలను కట్టఁ గట్టి కూల్చగన్
      వినుతి జేయ నసుర జాతి వీరు డెవ్వడీ భువిన్
      గనగ మూడు లోక ములను గాచు వాడు నాతడే
      "కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్"

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "..ఏగుచుండు। నట్టి వానిని..." అనండి.

      తొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    ["రాక్షసాంతకుఁడగు నా హరినిఁ జూపినచో, నాతని వధించి, లోకముచేఁ బూజలందెదను పుత్రా! ఆ విష్ణువెక్కడున్నాఁడో చూపు!" మనుచుఁ బ్రహ్లాదునిఁ గోరెడి హిరణ్యకశిపుని వచనములు!]

    "వినుము పుత్ర! చూపుమయ్య, విష్ణు జిష్ణుఁ డెక్కడో?
    కనఁగఁ జూపు మెందుఁ గలఁడొ? ఘనతఁ గొంచు నిప్పుడే,
    కనలుచున్ హరిన్ వధించి, కాంతు నేనె పూజలన్!
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్!"

    రిప్లయితొలగించండి
  23. విను సుపుత్ర నా మాటల, విశ్వమందు
    నన్ను మించిన వాని నీ వెన్నతరమె
    మూడు లోకము లందున నీడు లేని
    కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును

    రిప్లయితొలగించండి
  24. ప్రహ్లాదునితో నాతని గురువు సంభాషించు సందర్భము


    అనుజునిపరిమార్చినవాని నణచ, తపము
    చలిపి బమ్మనుండివరము చవికొనంగ
    నీరజోదరు రిపువైన నీజ నకుడు
    కనకకశిపు బూజయె కాచుగద జగమును

    రిప్లయితొలగించండి
  25. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హరిని జూపుమనియెడి సందర్భము:


    కనకకశిపుఁబూజయే జగమ్ము బ్రోచు నెప్పుడున్
    వినక నీవు హరిని గొల్చి వెడఁగు నంద నేలనో?!
    గనెద వాని చూపు మిపుడె కంబ మందు నిచ్చట
    న్ననుచు మోఁద నిలచె హరియె నచట నారసింహుడై!

    రిప్లయితొలగించండి
  26. పసిడి నగలను గళమున పరిఢ వించ
    వచ్చు ,పసిడిని దానంబు నిచ్చిన కలుగు
    సద్గతులు ,పితృ దేవతల్ సంతసించు
    పిండముల బెట్ట,రాజేంద్ర, గండమిడును
    కనక కశిపు బూజయె,కాచు గద జగమును,
    శాస్త్ర మొప్పెడి బూజలు ,శాంత చిత్తు
    డవయి వినుమని పండితుం డపుడు బలికె

    రాజు ధన గర్వము తో పిత్రు దేవతలకు పిండములు స్వర్ణ సహిత అన్నమును వండించి చేతునని తెలుప వలదని పండితుడు వారించు సందర్భం

    కశిపు = అన్బము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "..నిచ్చిన నగు.." అనండి.

      తొలగించండి
  27. జగ మనఁగ నసురులె మానుషాదు లౌర
    రాక్షసాధిపుఁ గ్రూరంపు వీక్షణమున
    వినఁగ వింతయై తోచిన వేల్పుగొంగ
    కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును


    ఉత్సాహము:
    వినుచు విష్ణు గాథ లెల్ల వీను లలర రక్తిఁ గ్రో
    లిన పదామృతమ్ము చేయ, లేచి యుదయ మందు పా
    వనపు స్నాన మాచరించి భక్తి నియమ నిష్ఠలం,
    గనక కశిపుఁ, బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్

    [ కనక = చూడక (తినక); కశిపువు = అన్నము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  28. ప్రహ్లాదుని తో తల్లి లీలావతి :

    ఉత్సాహము
    పెనుగులాట వీడుమయ్య పితరుడన్న ప్రేమతో
    తనయుఁ జూడ కుండ నేను తాళ లేను నందనా !
    వినుము కన్న! నాన్న మాట వేల్పటంచు దల్చుచున్
    గనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్


    రిప్లయితొలగించండి
  29. ఉగ్ర నారసింహుడగుచునుక్కడించె
    కనకకశిపు,బూజయెకాచుగదజగమును
    భక్తిశ్రధ్ధలతోడనురక్తిగలిగి
    ధ్యానమగ్నుడైయహరహమ్ము జేయు

    రిప్లయితొలగించండి
  30. మొదటిపాదము
    ఉక్కడచెను
    గాచదువప్రార్ధన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. "ధ్యానమగ్నుడయి యహరహమ్ము జేయు" అనండి.

      తొలగించండి
  31. ప్రహ్లాదునితో తండ్రి

    కనుల గాంచ లేని వాని ఘనము జేయజెల్లునే
    దనుజులన్న కనలువాని దల్చెదీవు నెట్లొకో
    వినుము నేటితోడ జెల్లు వెన్నునింక బొగడగా
    కనకకశిపు బూజయే జగమ్ము బ్రోచు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దల్చె దీవదెట్లొకో" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏🙏

      తొలగించండి
  32. చేయబోకుడు సఖులార చెడెద రికను
    కనక కశిపు బూజయె, కాచు గదజగమును
    శ్రీహరి పద కమలములే శ్రీకరమని
    మరువకను చేయునా హరిస్మరణ మొకటె

    రిప్లయితొలగించండి
  33. వినుము నాదు పలుకు హరిని వీడి కొల్వు మంటి నే
    మనకు దైవ మనగ నెపుడు మదన రిపువు గాన యో
    పుత్ర రత్న మాయ టంచు బొగడి నయము గాను యా
    కనక కశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గాన నో పుత్ర' అనండి. అలాగే "నయము గావునన్' అనండి.

      తొలగించండి
    2. వినుము నాదు పలుకు హరిని వీడి కొల్వు మంటి నే
      మనకు దైవ మనగ నెపుడు మదన రిపువు గాన నో
      పుత్ర రత్న మాయ టంచు బొగడి నయము గావునన్
      కనక కశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్

      తొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (హీరా బెహెన్ పుత్రోత్సాహము)

    వినుడు భారతీయులార వింత గాధ నుడివెదన్
    చనెను హస్తినాపురమ్ము చాయి నమ్ము వాడెబో
    ధనములేని వాడతండు ధాత్రినిన్ జయించె నా
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్


    కనక కశిపుడు = బంగారు వస్త్రములు ధరించిన వాడు (Rs 4.3 crores...Guiness Book of World Records)
    (ఆంధ్రభారతి నిఘంటు శోధన)

    "The yellow, almost-gold, stripes that appear against the navy blue wool fitted Indian jacket and pants he wore on Sunday were not simple stitching. They were Mr. Modi’s name embroidered into the fabric, said a person familiar with Mr. Modi’s wardrobe."

    https://blogs.wsj.com/indiarealtime/2015/01/26/narendra-modis-suit-and-its-message-to-obama/

    రిప్లయితొలగించండి
  35. ఘనపు వంశ మందు పుట్టి కాంచి నాడ జయములన్
    వినుము నాదు మాట, కొంటి విశ్వమందు ఖ్యాతి నీ
    మనమునందు నన్నునిల్పి మనుము నీవు భక్తితో
    కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  36. కనకకశిపు పూజయె కాచుగదజగమును
    అనినగురువుకు ప్రహ్లాదుడన్నమాట
    "అంతరంగాన నిలచిన హరిని వీడి
    పరుల భజనలుగావించ?పాపమనెను,

    రిప్లయితొలగించండి