26, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2717

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు"
(లేదా...)
"శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

82 కామెంట్‌లు: 1. మర్త్యు లార వినుడు మహిలోన బాధల
  శత్రు చయ మొసఁగుఁ, బ్రశాంతి నెపుడు
  మిత్రపక్ష మొసగు, మీటుగ విహితుల
  పటలి కై యతనము వలయు భువిని

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. కామ లోభ భరిత కార్యములనువీడి
  భక్తితో భజించి ముక్తి కోరి
  క్రింద మీద పడుచు గెల్వగ మోక్షపు
  శత్రు చయమొసఁగుఁ బ్రశాంతి
  నెపుడు

  ...వేదాంతం తప్పలేదు సార్! :(

  రిప్లయితొలగించండి
 3. అసహనమ్ము కోప మనునవి నరులకు
  శత్రుచయ, మొసఁగుఁ బ్రశాంతి నెపుడు
  వినయము సహనమ్ము విజ్ఞతయు వివేక
  ములెకదా జనులకు ముదము గాను.

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  యుధిష్ఠిరుడు ఒక వనేచరుని గూఢచారిగా పంపి సుయోధనుని పరిపాలన విషయములను తెలుసుకొనగోరెను... అతడు తిరిగి వచ్చి " మీతో వైరమువలన రారాజు మీ కంటె గొప్ప కీర్తి పొందుటకు ప్రజలను చక్కగా పరిపాలించుచున్నాడు.. గొప్పవారితో శత్రుత్వము కూడా మేలు కలిగించును కదా" ! అని తెలిపెను.......

  *వరం విరోధోऽపి సమం మహాత్మభిః*

  రాత్రి దినమ్ములున్ ప్రజల రక్షణనే తలపోయుచుండె , స...
  త్పాత్రులకిచ్చుచుండె ధనధాన్యములెన్నొ ! భవద్విరోధమే
  నేత్రయుగమ్మునన్ మెదల నిర్మలుడయ్యె , మహాత్మ ! శ్రేష్ఠమౌ
  శత్రుచయంబొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్" !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భేష్! చక్కని ఆలోచన! చక్కని పూరణ! శుభాభినందనలండీ మైలవరపువారూ!

   తొలగించండి
  2. మైలవరపు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. సూత్రిత ధర్మమర్మముల జూపి , పరాఙ్ముఖులైనవారితో
   మైత్రి వహించి , చేరి , మనమందరమొక్కటె యంచు , ప్రేమకున్
   పాత్రులఁ జేసి చూప , పరివర్తన గల్గును ! తృప్తమైనచో
   శత్రుచయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్యకోటికిన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 5. చిత్రిక బట్టి చూడవలె! చిత్రము గాన్పడు భూతలమ్ములో
  మిత్రుడ! నీకు శాంతి మరి మీటుగ బోవగ కష్టకాలమున్
  శత్రు చయం బొసంగును, బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్
  ఛత్రము బట్టి కాచు యనుసారకు లిత్తురు నిక్కమియ్యదే!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాచు ననుసారకు లిత్తురు...' అనండి.

   తొలగించండి
 6. మనను చూసి వాడేడ్చగ మనసుకు ఎంతో
  నెమ్మది కలుగును
  నీ ప్రగతికి కళ్ళు మండితె ఎదలో పులకలు
  లేచి వెలుగును
  మండే కడుపులు చుట్టు లేకున్న థ్రిల్లు లేదు
  ముమ్మాటికిన్
  శత్రు చయంబొసంగును బ్రశాంతిని నిత్యము
  మర్త్యకోటికిన్

  రిప్లయితొలగించండి
 7. అరయ వైరివర్గ మంతరంగము నుండు
  కామ క్రోధ లోభ గణము లారు
  సాధనమున వాని జల్లార్చ ప్రవిజిత
  శత్రుచయ మొసగు బ్రశాంతి నెపుడు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ భగవానువాచ:

   ధాత్రి బ్రజాళికిన్ గన బ్రధాన విరోధులు
   కామక్రోధముల్
   మైత్రిని గూర్చునట్టివగు మన్నన శాంతము నిర్వికారముల్
   సూత్రము మిత్రమా! వినుము శోకము వీడుచు పోరి గెల్వగా
   శత్రుచయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్యకోటికిన్!

   తొలగించండి
  2. అందమైన పూరణము! అభినందనలండీ సీతాదేవి గారూ!

   తొలగించండి
  3. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
  5. ధన్యోస్మి! మధురకవి గారూ! నమస్సులు! 🙏🙏🙏

   తొలగించండి
  6. డా. సీతా దేవి గారు ప్రబోధాత్మకముగా మనోహరమైన పూరణము.
   కామ క్రోధ లోభాది గుణము లారున్నవి కాని గణము లారు లేవు కదా! ఆరు నొక్క గణ మగును.


   తొలగించండి
  7. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమఃపూర్వక ధన్యవాదములు!
   యతి కొరకు గణములన వలసి వచ్చినది!
   చాల సేపు యోచించగా ప్రాసయతి మేలనిపించినది.
   కామ క్రోధ లోభ నామములను యనిన నెట్లుండును? పరిశీలించ గలరు!🙏🙏🙏

   తొలగించండి
  8. “అంతరమగము నుండు” లో నన్వయము కొంచెము క్లిష్టముగా కన్పించుచున్నది. అందుచేత యీ సవరణ పరిశీలించండి.
   అరయ వైరివర్గ మంతరంగము నందు
   కామ క్రోధ లోభ గణము చెలఁగు

   తొలగించండి
  9. చాల సులువుగా పరిష్కరించారు! ధన్యవాదములార్యా! నమస్సులు! 🙏🙏🙏

   తొలగించండి

  10. అరయ వైరివర్గ మంతరంగము నుండు
   కామ క్రోధ లోభ గణము చెలగ
   సాధనమున వాని జల్లార్చ ప్రవిజిత
   శత్రుచయ మొసగు బ్రశాంతి నెపుడు

   తొలగించండి
 8. వ్యసన మున్నమనిషి భయమునదోగాడు
  శత్రుశయము నొసగుబ్రశాంతినెపుడు
  అన్నభావమున్న?హాయిగూడదెచట
  మంచిమార్గమున్న?పంచుసుఖము!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో టైపాటు, గణదోషం.

   తొలగించండి
 9. డా.పిట్టాసత్యనారాయణ
  కుత్ర ప్రశాంతి జీవికన? గూరును మేళన మందునన్,సఖా!
  గాత్రపు రోగ బీజములెగాదె చికిత్సకు మేలుగూర్చు నీ
  శత్రుని శత్రువున్ గలిసి శ్రాంతిని గానక బోర నేర్వుమీ
  సత్రపు మూడు నాళ్ళయిన సత్త్వప్రదర్శన వల్ల గీర్తి యా
  శత్రు చయంబొసంగును ప్రశాంతిని నిత్యము మర్త్యకోటికిన్

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా సత్యనారాయణ
  పుట్టుకన నారు రిపులతో(అరిషడ్వర్గము)పోరు గాదె?
  వాని నిర్జించ బ్రహ్మంబు బట్టబయలు
  గెల్పు సాధించ ముక్తియె గిట్టు నీదు
  శత్రు చయమొసగు(చయమిడునౌర)బ్ర(ప్ర)శాంతి నెపుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పూరణలో సమస్య ఆటవెలది పాదమైతే మీరు తేటగీతిగా మార్చారు. అది సంప్రదాయం కాదు.

   తొలగించండి
 11. తనదు లోని రిపులు తన్ను చెఱుతురెప్పు
  డొరులు చెఱుతు రనుట యొట్టిమాట
  ఎవరి కైన గాని చివరకిట్టి విజిత
  "శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు"

  రిప్లయితొలగించండి
 12. [26/06, 05:26] ‪+91 75698 22984‬: 26, జూన్ 2018, మంగళవారం
  సమస్య - *2717*
  కవిమిత్రులారా,
  ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

  *"శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు"*

  (లేదా...)

  *"శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్"*

  ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు
  http://kandishankaraiah.blogspot.in
  [26/06, 07:38] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
  ఆత్రముతోడ తల్లియుద రాంతర సీమను దాటివచ్చితిన్
  గాత్రపు యీతి బాధలవి గాంచెను శత్రువు లార్గురీ మదిన్
  పాత్రతపొందదైవమున పాడిగ "చంపిన నట్టి దుష్ట మౌ
  శత్రుచయం"బొసగును బ్రసాంతినో నిత్యమం మర్త్యకోటికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఎన్.వి.ఎన్. చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు కేవలం మీ పూరణ పద్యాన్ని పోస్ట్ చేస్తే చాలు.

   తొలగించండి
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2717
  సమస్య :: *శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్యకోటికిన్.*
  శత్రువుల సమాహం ప్రశాంతిని ఇస్తుంది ఈ భూలోకంలో అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: హిరణ్యకశిపుడు ఓ ప్రహ్లాదుడా! అందఱూ నాకు భయపడుతున్నారు. నీవు మాత్రం నాకు భయపడకుండా ప్రశాంతంగా ఉంటున్నావు. కారణ మేమిటి నిన్ను నేను ఎలా గెలువగలను? ఎలా ప్రశాంతంగా ఉండగలను ? అని ప్రశ్నించినప్పుడు భక్త ప్రహ్లాదుడు ఓ తండ్రీ! మనస్సే బంధమోక్షములకు కారణము. నీవు నీ మనస్సును అదుపులో ఉంచు. ఇంద్రియములను నిగ్రహించు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే ఆరుగురు శత్రువులను జయించు. అప్పుడు నీకు శత్రువు అనేవాడు ఉండడు. నీవు ప్రశాంతంగా ఉండగలవు. (పోతన భాగవతం-సప్తమ స్కంధము-267 వ పద్యము {లోకములన్నియున్ గడియలోన జయించిన వాడ.......} భావము) అని హితోపదేశం చేస్తాడు. కాబట్టి మనకు ఉన్న అంతశ్శత్రువులను జయిస్తే ఈ లోకము మనకు ప్రశాంతతను సమకూరుస్తుంది అని విశదీకరించే సందర్భం.

  చిత్ర విచిత్ర మీ జగము చిన్మయరూపము శాంతిధామ మీ
  సూత్ర మెఱింగి చిత్తమును చొక్కెడి యింద్రియ కామ వర్గమున్
  పాత్రత వైరు లంచు నరిభంజన జేయ జగమ్ము భిన్న దు
  *శ్శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్యకోటికిన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (26-62018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతం!...భిన్న దుశ్శత్రుచయంబు... చాలా బాగున్నదండీ! అభినందనలు!

   తొలగించండి
  2. సహృదయులు
   శ్రీ మధుసూదన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

   తొలగించండి
  3. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్బుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  4. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారికి
   హృదయపూర్వక ప్రణామాలు.

   తొలగించండి
 14. ఆటవెలది
  అర్జునుడన వైరమని తోఁచఁ గర్ణున
  కంగ రాజ్యమొసఁగి యాదరించి
  రణము గెలుతు ననెడు రారాజునకు శత్రు
  శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు.   రిప్లయితొలగించండి
 15. మానవాళి ప్రగతి మనుగడ నడ్ డు చు న్
  లోభ వశుల జేసి లొంగ దీయు
  నారు గురి ని జంప హాని జేయ వు గ దా
  శత్రు చ య మొ సగు బ్రశాంతి నె పుడు
  ________కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 16. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇ చ ట. శ త్ర వు ల న గా = అ రి ష డ్వ ర్గ ము లు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


  శత్రుల నేల బెంచెదవు ? సాత్త్విక చింతన బెంచు మోయి | ని

  శ్శత్రుచయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్ |

  ధాత్రిని నిల్చు నాలుగు దినమ్ములు ధర్మము దప్పకు | చూడు సృష్టి వై

  చిత్రి ! ! శ్మశానపున్ స్థలిని జేరెడు నప్పుడు చిల్లి గవ్వయున్

  మిత్రమ , వెంటరాదు గద ! మేకొని చేయు పరోపకారమున్ |

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కని పూరణ గురుమూర్తిగారూ! నమస్సులు! 🙏🙏🙏🙏

   తొలగించండి
  2. చక్కని సందేశం! పూరణ మద్భుతం! నిశ్శత్రుచయంబు చక్కని ప్రయోగం! అభినందనలండీ గురుమూర్త్యాచారిగారూ!

   తొలగించండి
  3. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  4. శ్రీమతి సీతా దేవి గారికి , పూజ్య శ్రీ మధుసూదనార్యులకు ,

   శ్రీ గురువర్యులకు పాద నమస్కృతులు మరియు ధన్యవాదములు !

   మూడవ పాదము సవరణ :--

   ధాత్రిని నిల్చు కాలమున ధర్మము దప్పకు - - - -

   తొలగించండి
 17. వలదు సోదరా నెగులు రామ చంద్రుని
  తోడ నెపుడు, వెళ్లి వేడు కొనుము ,
  రక్ష నిడు మనకు శరణమనిన, నసుర
  "శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు
  రావణుని తోడ విభీషణుని పలుకులు. రాముడు సుగ్రీవుడు స్నేహితులు వారి వద్దన ఉన్న వారలు దైవ స్వరూపులు అందువలన వారి వలన మనకు ప్రశాంతి కలుగును. వారిని వేడుమంచు తెలుపు సందర్భము  రిప్లయితొలగించండి
 18. రాత్రికి శత్రువౌనట ఖరాంశుడు చూడగ వాని గొల్వమే
  ధాత్రి జనంబు గొల్చుగద దానవులన్ వెఱఁపించు సంఘమున్
  శత్రువు లైన వారికల!శత్రువు లందరు జూడ మిత్రులా
  శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్

  రిప్లయితొలగించండి
 19. శాంతిలేనట్టిదినములుసర్వులకును
  శత్రుచయమొసగు,బ్రశాంతినెపుడు
  నిచ్చుదైవనామముపఠియించుబ్రజకు
  శాంతికలిగినమనుజునిబ్రదుకుహాయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   సమస్యాపాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాసారు. సవరించండి.

   తొలగించండి
 20. మిత్రులందఱకు నమస్సులు!

  శత్రులు వేవురైన నరి షట్క చయమ్మున కీడు కా, విహా
  ముత్రఫలమ్ము దక్కఁగను పూర్తిగ వీనిని వీడఁ జేయఁ జా
  రిత్రము చక్కనౌను కొని ప్రేమము; నిర్జితమైన వైరి ష
  ట్ఛత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాన్యులు శ్రీ శంకరయ్యగారి సూచనతో చిన్న సవరణ:

   శత్రులు వేవురైన నరి షట్క చయమ్మున కీడు కా, విహా
   ముత్రఫలమ్ము దక్కఁగను పూర్తిగ వీనిని వీడఁ జేయఁ జా
   రిత్రము చక్కనౌను కొని ప్రేమము; నిర్జిత హృద్గతోరు ష
   ట్ఛత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్!

   తొలగించండి
  2. మధుసూదన్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 21. మిత్రులమధ్యనెప్పుడునుమేదినినొప్పువీరోధభావమున్
  శత్రుచయంబొసంగును,బ్రశాంతినినిత్యముమర్త్యకోటికిన్
  రాత్రియువేకువన్ననకరామునిపూజలుసేయుచోనికన్
  నాత్రములేనిజీవితమునారనిసంపదలిచ్చునేగదా

  రిప్లయితొలగించండి
 22. నిత్య ధర్మ రత మునివ్రజ సంభావ్య
  నిర్మ లాంత రంగ నిరత శాంత
  విగత దురిత నిచయ విబుధగ ణాజాత
  శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు


  ధాతృ కరాబ్జ సేవ్య బృహ దార్త జనోత్కర కామి తార్థ సం
  ధాతృ విహంగ వాహన కథా వర గాన సుధా పునీత స
  ద్గాత్ర రుచిప్రభా విభవ ధర్మ రతైక మనో విదగ్ధ దు
  శ్శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్

  రిప్లయితొలగించండి
 23. తే: బయటి శత్రువొసగు బాధల కంటెను
  లోపలగల యహితులు సతతమ్ము
  నదిక బాధ నిడుదు రడచుకొనిన యంత
  శ్శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ, నాల్గవ పాదాలలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. సవరించిన పూరణ:

   లేదను రాజ్యకాంక్ష మరి లేదను నిచ్చిన మాటదాటుటన్
   లేదను ధర్మరక్షణకు లేమి యనుగ్రహ విగ్రహుండనన్
   లేదుగ యుద్ధభీతి లవ లేశము మీరడు క్షాత్రధర్మమున్
   లేదుగ సాధ్విసీత సరిలేమయు, సాటిల రామచంద్రుకున్
   లేదన లేదు లేదనగ లీలగగల్గు భోగభాగ్యముల్!


   తొలగించండి
  4. “రామ మూర్తికిన్” అనండి విన సొంపుగా నుంటుంది.
   ..గల్గును భోగ భాగ్యముల్.

   తొలగించండి
  5. ధన్యవాదములార్యా! తప్పక సవరించెదను!🙏🙏🙏🙏

   తొలగించండి
  6. లేదను రాజ్యకాంక్ష మరి లేదను నిచ్చిన మాటదాటుటన్
   లేదను ధర్మరక్షణకు లేమి యనుగ్రహ విగ్రహుండనన్
   లేదుగ యుద్ధభీతి లవ లేశము మీరడు క్షాత్రధర్మమున్
   లేదుగ సాధ్విసీత సరిలేమయు, సాటిల రామమూర్తికిన్
   లేదన లేదు లేదనగ లీలగగల్గును భోగభాగ్యముల్!

   తొలగించండి
 25. సరుదునందు మనకు సతతముక్షోభను
  శత్రుచయమొసగు; ప్రశాంతి నెపుడు
  కోరుచుందుముగద కుపితమునందెల్ల
  ఆశతీరువిధము నరయరాదు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సరుదు'...?

   తొలగించండి
  2. 🙏🏽 ధన్యవాదములు
   సరుదు = ఎల్ల , సరిహద్దు (ఆంధ్ర భారతి)

   తొలగించండి
 26. ఏదోవిధంగా కిట్టించాను.
  ధాత్రి వసించు వారలకు తప్పక హానిని చేయు బాహ్యపున్
  శత్రుచయమ్ము, లోనగల శత్రువొ సంగును హెచ్చు బాధలన్
  చిత్రముగా నెడంద వెస చేరిన వైరుల వంచ నప్పు డా
  శత్రుచయం బొసం గును బ్ర శాంతిని నిత్యము మర్త్య కోటికిన్

  రిప్లయితొలగించండి
 27. శత్రుచయమొసగుబ్రశాంతినెపుడనుట
  నిజముకాదుశత్రునివహమార్య!
  కీడుజేయజూచుకీచకునివలెను
  శర్వునామమొకటెశాంతినిచ్చు

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (ప్రణబ్ ముఖర్జీ పై అహ్మద్ పటేల్ రాహుల్ గాంధీతో ఇఫ్తర్ పార్టీలో)

  మిత్రమ! కొంటెగాను వడి మీ మదరక్కట! పైకితన్నగా
  రాత్రుల నిద్రలేక యిక రాష్ట్రపతిందుల పైత్యమెక్కువై
  రాత్రిని స్వప్నమందు వినె: "రాష్ట్రియ సంఘపు వేడ్కలందునన్
  శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్"

  రాష్ట్రియ సంఘము = RSS

  రిప్లయితొలగించండి
 29. పాత్రత బొంద నెంచి హరి భవ్య పదాబ్జ నిరంతరార్చన
  న్నాత్రుత మీర సద్గురు సమాశ్రయ మందున బొంది శిక్షణన్ సూత్రము దప్ప బోక పరిశుద్ధ మనమ్మున నొంచబడ్డ లో
  శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్.

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు

  సందర్భము: కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అరిషడ్వర్గము.. అంటారు. ఇవి ఎప్పుడూ మనుజుని చుట్టుమట్టి ఉన్నతునిగా నెదుగనీయకుండా ఎన్నెన్నో ఆటంకాలు కలుగజేస్తూనే వుంటాయి.. దానితో అత డెప్పుడూ అశాంతితోనే కొట్టు మి ట్టాడుతూ వుంటాడు.
  ఆ అశాంతిని పోగొట్టుకోవాలంటే జ్ఞానులైన గురువుల సన్నిధిలో చేరి విని తెలుసుకొని భద్రమైన భావాలు అంటే శుభకరమైన తలంపులను తన కిష్టం వున్నా లేకున్నా పెంచుకుంటూపోతే క్రమంగా బలపడుతాయి. అవే అరిషడ్వర్గాలకు శత్రువులై ఎదుర్కొని పారద్రోలుతాయి. క్రమంగా ప్రశాంతి కలుగుతుంది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  కామ మాది యారు ఘనమైన శత్రువుల్..
  శత్రు చయ మొసగుఁ నశాంతి నెపుడు..
  భద్ర భావనములె వాని నెదుర్కొను
  శత్రు చయ; మొసఁగుఁ బ్రశాంతి నెపుడు..

  మరొక పూరణము:....

  శత్రు చయం బొసంగును బ్రశాంతిని
  నిత్యము మర్త్య కోటికిన్

  సందర్భము: అరి వర్గము... లేదా అరి షడ్వర్గము.. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఇవే అంతశ్శత్రువులు. వీటిని జయించగలిగితే లోకంలో శత్రువు లుండరు. కాని ఇవి చేస్తున్న నిర్వాకం ఇంతా అంతా కాదు....
  కేవలం తినడంకోసమే జీవించే వా ళ్లున్నారు. కేవలం కామోపభోగాలు అనుభవించడమే జీవిత లక్ష్యంగా భావించి జీవించే వా ళ్లున్నారు. వీళ్ల దృష్టి అంతకు మించి ముందుకు పోదు. వాళ్ళు కోల్పోతున్న శాశ్వతానందం ఒక టున్నదని వాళ్లకే తెలియదు.
  అంటే ఇంద్రియాలు తామెంతో గొప్ప మిత్రుల మైనట్టుగా ఆయా జీవులను నమ్మిస్తున్నాయి. శాంతిని దోచేస్తున్నాయి. జీవుణ్ణి జీవునిగానే వుండేందుకు చుట్టూరా మాయా వలయాన్ని పన్నుతున్నాయి. అందువల్ల తాను దేవు ణ్ణన్న విషయమే తెలియకుండా పోతున్నది.
  ఎప్పుడైతే మానవుడు తన యింద్రియా లను అరిషడ్వర్గములందు చిక్కుకోకుండా నేర్పుతో ఓర్పుతో తప్పించుకో గలుగుతాడో ఆతడు మాత్రమే ధన్యుడు. ఎందుకంటే ఆతడే జీవితంలో ప్రశాంతిని అనుభవించ గలుగుతాడు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  మిత్రు లటన్న నమ్మకము
  మించ నొనర్చును; నిక్కమైన దు
  శ్శత్రువు లౌచు మానవుల
  శాంతిని దోచును; జీవ భావ మే
  మాత్రము వీడనీయదు సుమా
  యరి వర్గము; గెల్వబడ్డదౌ
  శత్రు చయం బొసంగును
  బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  26.6.18

  రిప్లయితొలగించండి
 31. శత్రులు లేక లేరుగద జై! రఘురాముడు కృష్ణుడుండిలన్
  శత్రులు లేక నర్జునుని శస్త్రము లస్త్రములబ్బు త్రుప్పునున్
  శత్రులు లేనిచో మునులు శాంతము దాంతము నేర్వలేరుగా
  శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్

  రిప్లయితొలగించండి