డా.పిట్టాసత్యనారాయణ అతిగా తత్త్వమదేల బోధనలకా హార్యంబె నీ దేహ మే గతి నీ కౌనొ ముదంబు గూర్చు మదియే కష్టాలలో నిన్ను ,నీ మతినిన్ మల్చుము యన్యు దుఃఖములలో మాన్యంబు సద్వర్తనా రతియే మూలము సర్వ ధర్మముల(అన్ని మతములలో/నీతులలో)సంరక్షింప లోకమ్మున్ "To do unto all men as I would, they should do unto me."
గురువర్యులు శ్రీ శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2698 సమస్య :: *రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.* రతి యే మూలము అన్ని ధర్మాలను కాపాడటానికి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: శ్రీ సరస్వతీ దేవి హితమును ఉపదేశించేది ధారణతో ఆశుకవితతో కూడినది బ్రహ్మదేవుని ఇల్లాలుగా కీర్తింపబడేది గొప్ప లీలావిభూతితో కూడినది మహా వేదాంత జ్యోతి అందఱికీ గతి అయినటువంటి మాతృమూర్తి. ఆ సంగీత సాహిత్య భారతియే లోకంలోని సకల ధర్మాలనూ సంరక్షించేందుకు మూలము అవుతూ ఉన్నది అని విశదీకరించే సందర్భం.
హితభావోన్నతి ధారణాశుమతి బ్రాహ్మీరూప సత్కీర్తి యా తత లీలారతి శ్రీ సరస్వతి మహా తత్త్వాంత సజ్జ్యోతియున్ సతమున్ సద్గతి మాతృమూర్తి యగు, నా సంగీత సాహిత్య భా *రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (6-6-2018)
సుకవి మిత్రులు పోచిరాజువారికి నమస్సులు! మీ రెండు పూరణములూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు! చిన్న సందేహం. కేవలం పరుషాక్షరాలైన క,చ,ట,త,ప లకు మాత్రమే సరళాదేశం వస్తుందని నాకు తెలుసు. కాని, మీరు క్షకారానికి సరళాదేశం చేశారు. "ఇలా చేయవచ్చునా?" అనేది నా సందేహం. దీనికేమైనా పూర్వకవి ప్రయోగాలున్నాయా...దయతో తెలుపగలరు. అజ్ఞానంతో అడుగుతున్నాను. అన్యథా భావింపవలదని మనవి.
కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. గురువు గారి, మీ వంటి విద్వాంసుల యభిప్రాయ మెఱుఁగఁ గోరి యుద్దేశ్య పూర్వకముగా నే నీ ప్రయోగము చేసితిని. “క్ష” సంస్కృతాంధ్ర వర్ణ మాలల లో{ సంస్కృతము-50; తెనుగు-55(36+19)} లేదు. ఇది వర్ణాంతరము కాదు. కేవలము సంయుక్తాక్షరము. ప్రౌఢ వ్యాకర్త (సంజ్ఞా పరిచ్ఛేదము: సూ.1.) యిదియే చెప్పెను.నిఘంటువులలో కూడా “క్వ” తర్వాత “క్ష” పదములు దాని తర్వాత “ఖ” పదము లీయఁ బడుచున్నవి. అందు వలన యిది క-ష ల సంయు క్తాక్షరముగా భావించి చేసితిని. ద్రుతము మీది ప్రా బ్రా యగునట్లు క్ష గ్ష యయినది యిక్కడ. యుక్తాయుక్తములు పరిశీలించ గోర్తాను. పూర్వ కవుల ప్రయోగమునకై చూచు చున్నాను కానీ యింకా లభించ లేదు. ప్రస్తుతము తిరిగి భారత పఠనము లో నున్నాను. వెదికెదను. మీకు కనిపించినఁ దెలుపఁ గలరు.
జిలేబి గారు మీ సందేహము దీని వలన తీరును. బాల. వ్యాక. సంధి. 16. ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళము లగు. పూచెను+కలువలు=పూచెను గలువలు తోఁచెను+చుక్కలు=తోఁచెను జుక్కలు చేసెను+టక్కులు=చేసెను డక్కులు నెగడెను+తమములు=నెగడెను దమములు మొగిడెను+పద్మము=మొగిడెను బద్మము
పోచిరాజువారూ! క్షకారమునకు సరళాదేశం రావడం నేనే గ్రంథంలోనూ చూడలేదు. రాదు కూడా! ఇకపోతే... మీరు తెలిపిన నిఘంటు క్రమం ఆధునికులు ఏర్పఱచినదే. ప్రాచీన కాలపు నిఘంటువులు పరిశీలిస్తే దీనికి విరుద్ధంగా... అంటే...కకారాంత శబ్దాలతో మొదలై, క్షకారాంత శబ్దాలతో ముగుస్తాయి. ఉదాహరణకు విశ్వకోశాన్ని పరిశీలించండి. ఇలాగే ప్రాచీన నిఘంటువులను పరిశీలిస్తే క్షకారము చివరనే యీయడం గమనిస్తారు.
అయితే నేను క్షకారం ప్రత్యేకాక్షరమా...సంయుక్తాక్షరమా అనే వాదానికి పోవడం లేదు. కేవలం ప్రయోగౌచితీ విషయమై ప్రశ్నించాను. అంతే!
ఇలాంటి చర్చలే సుకవి మిత్రులందరికీ మార్గదర్శకాలవుతాయనే ఉద్దేశంతోనే నేను ప్రశ్నిస్తున్నాను. అన్యథా భావింపవలదని మనవి.
కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. వ్యాకరణ చర్చకు నవకాశము కొఱకు మాత్రమే వాడితిని. వినడానికి సరళా దేశము కర్ణ కఠోరముగా నున్నది కూడా. నన్నయామాత్యుని యీ ప్రయోగములతో ద్రుతసంధ్యకృత విచారము కూడా తొలగినది.
నరవ్రజమ్మునకు క్షుత్పీ డార్త సమ్మోహ గా సవరణ గ్రహించఁ గోర్తాను.
కించిత్తుపారతి ప్రయోగ మాలోచించియే చేసితిని. కించిత్తుపారతి యిక్కడ సమాసముగా వాడ బడ లేదు. వాక్యములోని పదములే. కించిత్ ను ముందు తత్సమము చేసి సంధి చేయ వచ్చునని భావించితిని. కించిత్సందేశము / కించిత్తు సందేశము వలె కించిదుపారతి, కించిత్తుపారతి రెండును సాధువులని నా యభిప్రాయము.”కించిత్” ను “కించిత్తు” అని తత్సమము చేసిన తర్వాత సంస్కృత పదము వచ్చినా తెలుగు సంధినే చేయాలి కదా. విశ్వామిత్రుఁ డతిఘోర తపము. విశ్వామిత్రుఁడు “విశ్వామిత్ర” కి తత్సమ రూపము.అతి ఘోర తపము సంస్కృత పదము.
చాలా సంతోషమండీ! నేను కించిత్తుపారతి ప్రయోగ చర్చను ఉపసంహరించుకున్నాను. కించిత్తు+ఉపారతి ...కించిత్తుపారతి అని తెలుగు చేయవచ్చును. అందుకే ఉపసంహరించుకున్నాను. స్వస్తి
1996లో కడప ఆకాశవాణిలో చదివిన నా పూరణ: సమస్య:"రతియు లేని పూజ రమ్యమౌనె?" పూరణ : ఆత్మ శాంతి లేని యార్జన సుఖమౌనె? కరణ రసము లేక కావ్యమౌనె? సర్వ రక్షకుండు శర్వుని పైనభి "రతియు లేని పూజ రమ్యమౌనె?" ****)()(**** (ప్రస్తుత సమస్య చూడగనె ఇది గుర్తుకు వచ్చింది)
సందర్భము: వ్యాస భారతి ఎలాంటిది? 'వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం' అన్నారు. అష్టాదశ పురాణాలు లోకానికి అందించి విశ్వ మానవాళికి మార్గ దర్శనం చేసిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఒక్క భారతంలోనే మానవుడు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి కావలసినన్ని ధర్మ సూక్ష్మా లున్నవి. ఇంద్రియ నిగ్రహావశ్యకత మొదలైన అనేక విషయాలను తెలియ జెప్పే భగవద్గీత భారతంలోనిదే కదా! ఆ మహాత్ముని అనంతమైన సాహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నా చిన్ని బుఱ్ఱకు ఇలా అనిపించింది. అది అతులమైనది అనగా సాటిలేనిది. అనవద్యమైన సౌఖ్య మనే ఫలమైనది. ఎప్పుడూ నేనెలా ఆనందించాలి.. అనే కాదు ఇతరుల నెలా ఆనందింపజేయాలా! అనేది కూడ రవంత ఆలోచించాలి. ఆనందనము.. అంటే ఆనందింపజేయడం. అనుమానా లనే చీకటితో కూడిన మనస్సులు గలవారికి జవాబు లనే కాంతి నిచ్చేది. విచ్చలవిడి శృంగారం గొప్ప తెలివి కాదు. నాగరికత కాదు. అది ఎప్పుడూ దురంతమైనదే! అలాంటి భావా లనే నీటికి గట్టు (దరి)లాంటిది. బరితెగించిన శృంగార భావాలు భద్రమైనవి కా వని యెప్పటికైనా తెలుసుకోవలసిందే! ఆ భావాల నీటిలో యీదు లాడడం ప్రమాద మని ఎప్పటికైనా గ్రహించవలసిందే! మానవుడు గట్టు చేరాల్సిందే! అందువల్ల వ్యాస భారతియే లోకంలో ధర్మ రక్షణకు మూలము. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ అతులంబై యనవద్య సౌఖ్య ఫలమై యానంద నావాలమై తత శంకా మహి తాంధ్య మానస సమా ధాన ప్రభా శీలమై యతి శృంగార దురంత భావ జల స మ్య క్కూలమై వ్యాస భా రతియే మూలము సర్వ ధర్మముల సం రక్షింప లోకమ్మునన్
సతమత మయ్యెడి ప్రజలకు
రిప్లయితొలగించండిమతముల నుండెడి ఋతమును మాటల నిడుచున్
సతతము పెనుపొందెడి భా
రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్
భారతి = వాక్కు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిగతులకునై సుతులుండుట
మతి నిలుపుట కొరకె నన్ని(యన్ని) మతములు సుమ్మీ!
క్షతి గనని నీతి,కార్య ని
రతి మూలము సర్వ ధర్మ రక్షణకు భువిన్!
సత్యనారాయణ గారూ,
తొలగించండినీతికార్యనిరతితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మతమే దైనను ప్రాణికి
రిప్లయితొలగించండిసతతము క్షేమముగ నుండి సంతును పొందన్
మతిగొని జీవిం చుటకని
రతి మూలము సర్వధర్మ రక్షణకు భువిన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇక్కడ మీరు 'రతి'ని ఏ అర్థంలో ప్రయోగించారు?
మతమే దైనను ప్రాణికి
తొలగించండిసతతము క్షేమముగ నుండి సంతును పొందన్
మతిగొని జీవిం చుటకు ని
రతి మూలము సర్వధర్మ రక్షణకు భువిన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిచ్యుతధన్విన్ విజయున్ రణోన్ముఖునిగా నుద్యత్ప్రభామూర్తిగా
హతచింతాభయచిత్తుఁ జేసి నిజకార్యాసక్తి గల్గించుచున్
స్థితధీభాసితుజేసినట్టి శ్రుతియౌ శ్రీకృష్ణవాగ్దివ్యభా...
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శ్రీకృష్ణవాగ్భారతితో మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసతిపతులకు,సర్వజనుల
కు,తరముగ జిలేబులకు జకుటపు యజిరమై
జతగూడునదియె గానన్
రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం ఉత్తరార్ధం అర్థం కాలేదు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఅతిగా తత్త్వమదేల బోధనలకా హార్యంబె నీ దేహ మే
గతి నీ కౌనొ ముదంబు గూర్చు మదియే కష్టాలలో నిన్ను ,నీ
మతినిన్ మల్చుము యన్యు దుఃఖములలో మాన్యంబు సద్వర్తనా
రతియే మూలము సర్వ ధర్మముల(అన్ని మతములలో/నీతులలో)సంరక్షింప లోకమ్మున్
"To do unto all men as I would, they should do unto me."
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిగతులకునై సుతులుండుట
మతి నిలుపుట కొరకె నన్ని(యన్ని) మతములు సుమ్మీ!
క్షతి గనని నీతి,కార్య ని
రతి మూలము సర్వ ధర్మ రక్షణకు భువిన్!
'కొరకె యన్ని' అన్నదే సాధువు.
తొలగించండిడా}.పిట్టా సత్యనారాయణ}
రిప్లయితొలగించండిజడ, జల్లెడ చదువులకే
కడకవి మిగులంగ నోపు; గనమెచ్చట నీ
జడ కొత్తిమీర కట్టయు
గడబిడ లేకుండ మెదలు గార్హస్త్యమునన.
'జడా!' అన్న మకుటం ఉండాలండీ!
తొలగించండిసతతము వీణా వాదన
రిప్లయితొలగించండిచతురత్వమున తనరత్న సభను సకల శో
భితమును చేసెడి నా భా
రతి మూలము సర్వ ధర్మ రక్షణకు భువిన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆహారం నిద్రా మైథునములవి ప్రాణికోటికదె
రిప్లయితొలగించండిసమానము
అనాదిగ జాతులు కొనసాగుటకు శృంగారమదె
కొలమానము
ఆశ్రమధర్మ గృహస్థుకు సతిగా దొరికె రతియే
మూలము
సర్వధర్మముల సంరక్షింప లోకమ్మున సంసార
జాలము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా. పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిజడభరతుని కడ లేడీ(lady)
కడకిట్టుల మార నామె కలుములు, వెనుకన్
పడి పడి చూడగ పిడికెడు
జడ సొబగులు హేమ సమము చలమున బొందన్
పిట్టా వారూ....
తొలగించండిపద్యం చివర "జడా" అని మకుటం రావాలి.
నెడ4వ పాద
రిప్లయితొలగించండిడా.పిట్టానుండి,ఆర్యా, గప్పిన॥నెడ..గా తీసుకొనండి.
"జడ కందములు" పద్యసంకలనం ఆవిష్కరణోత్సవం జులై 8, ఆదివారం, సాయంత్రం 4 గం.లకు హైదరాబాదులో జరుగుతుంది. వేదిక తరువాత తెలియజేస్తాను.
రిప్లయితొలగించండిక్షితియే మనుగడ హేతువు
రిప్లయితొలగించండిపతియే దైవము సతికిని ప్రత్యక్షముగా
సతతము జ్ఞానము నిడు భా
"రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్"
గురువర్యులు శ్రీ శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2698
సమస్య :: *రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.*
రతి యే మూలము అన్ని ధర్మాలను కాపాడటానికి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: శ్రీ సరస్వతీ దేవి హితమును ఉపదేశించేది ధారణతో ఆశుకవితతో కూడినది బ్రహ్మదేవుని ఇల్లాలుగా కీర్తింపబడేది గొప్ప లీలావిభూతితో కూడినది మహా వేదాంత జ్యోతి అందఱికీ గతి అయినటువంటి మాతృమూర్తి. ఆ సంగీత సాహిత్య భారతియే లోకంలోని సకల ధర్మాలనూ సంరక్షించేందుకు మూలము అవుతూ ఉన్నది అని విశదీకరించే సందర్భం.
హితభావోన్నతి ధారణాశుమతి బ్రాహ్మీరూప సత్కీర్తి యా
తత లీలారతి శ్రీ సరస్వతి మహా తత్త్వాంత సజ్జ్యోతియున్
సతమున్ సద్గతి మాతృమూర్తి యగు, నా సంగీత సాహిత్య భా
*రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (6-6-2018)
చాలా బాగున్నదండీ కోట వారూ! అభినందనలు!
తొలగించండిహృదయపూర్వక ప్రణామాలండీ శ్రీ మధుసూదన్ గారూ!
తొలగించండిసతత ము దైవము తలచు చు
రిప్లయితొలగించండివితరణ బుద్ది న్ గలిగి యు విశ్వేశ్వరు కు
న్న తు లొ న రించినొ సగు హా
రతి మూ ల ము సర్వ ధర్మ రక్షణ కు భువి న్
స్థితి సృష్టి లేక యుండున
రిప్లయితొలగించండిస్థితి మూలము ప్రాణికోటి జీవన మునకున్
మతితో యోచించగ నా
"రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్"
క్షితిపై పుట్టిన మానవాళిఁ బరమోత్కృష్టమ్ముగాఁ దీర్చి ధీ
రిప్లయితొలగించండిమతులౌనట్లుగ సంస్కరించునది సన్మార్గమ్ములోవారలన్
సతతమ్మున్ నడిపించునట్టి చదువుల్ చక్కంగ నేర్పించు భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
మతియే మూలము జీవితమ్మునను సన్మార్గాభియానమ్ముకున్;
రిప్లయితొలగించండినతియే మూలము సర్వవేదికల విన్నాణమ్ము జూపింపగన్;
జతియే మూలము గాననాట్యముల ప్రజ్ఞాలోలసంరూడికిన్;
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.
(రతి=అనురాగం)
చక్కని పూరణ బాపూజీగారూ! అభినందనలు! 💐💐🙏🙏
తొలగించండిధన్యవాదాలండీ !🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి["మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" కాఁబట్టి, ’మనుష్యుల మనస్సులపై నధికారియై చనెడు తల్లి యగు నా భారతి లేకున్న మనుజునకు నాలోచనయుండదు. అట్టి భారతియే యందఱ మానసములపై యధికారమును నెఱపుచు, నన్ని సాహితీ ప్రక్రియలకు, నానందములకు, నైతికతలకు, ధర్మములకు మూలమై యున్నది’ యను సందర్భము]
మతికిన్ క్షేమముఁ గూర్చుచున్, దొసఁగులన్ మాన్పంగఁ జేయూఁత స
మ్మతి నందించుచు, సాహితీ వ్రతుల సమ్మానించు సద్గ్రంథ సం
స్థితి నెల్లప్పుడు లోకమందు నిడుచున్, జింత ల్వెసన్ డుల్చు భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్!
సతికిన్ గౌరవ మొసగుచు
రిప్లయితొలగించండిగతిలేని బడుగు జనులను కాచుచుఁ బ్రీతిన్
మతిలో స్వచ్చత కల యబి
రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్
వెతుకంగ జగతినందలి
రిప్లయితొలగించండిమతముల సారమొకటంచు మనుజులు నేర్వన్
యితరుల భావములం దను
రతి మూలము సర్వధర్మ రక్షణకుభువిన్
నేటి శంకరాభరణం సమస్య
రిప్లయితొలగించండి"రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్ములన్."
వితతానంతవిషానుభావ్యవిషయావిష్కారసంసారసం
గతచిత్తార్తినివారణోద్యతమహత్కార్యోన్ముఖీనమ్ము,సం
తతసంశ్రేయము, మానవాళి కిలలో తత్త్వప్రబోధార్థవా
గ్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్ములన్.
రమ్యంగా పూరించారు రామాచారి గారూ.
తొలగించండివెతలను బాపుచునే దు
రిప్లయితొలగించండిర్గతులను తొలగింప జేయు గౌరీ పతినే
మతి దలచుచునే యిడు హా
"రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్"
ధృతి చెడనీయక జగతిని
రిప్లయితొలగించండిహితమగు సంతానమిచ్చు హేతువుకాగా
సతితోడుత గృహమేధికి
రతిమూలము సర్వధర్మ రక్షణకు భువిన్
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
స్థిత ధీధన మిచ్చి మానవ తతిన్ జీవింపగా జేయు - భా
రతియే మూలము , సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్ |
సతమున్ మానసమందిరమ్ములను (లో) తోషంబున్ బ్రతిష్టించుమా |
రతియే ముఖ్యము | ద్వేషభావనము వర్జ్యంబై చనున్ మిత్రమా |
{ రతి = అనురాగము [ శబ్దార్థచంద్రిక ] ; వర్జ్యము =
విడువ దగినది , విసర్జింప దగినది }
-------------------------------------------------------------------------------------------------
బ్రతికినఁ దా నొక్కఁ డిట ని
రిప్లయితొలగించండియతి నయ్యది చాల దయ్య యలయక ధృతినిన్
సతత మవినీతిపై పో
రతి మూలము సర్వ ధర్మ రక్షణకు భువిన్
[పోరు + అతి =పోరతి; అతి = ఎక్కువ]
మతి మంతుల్ వచియింత్రు మంచి నిల నింపంగన్ మహాదుఃఖ వే
పిత సర్వాంగ నరవ్రజమ్మునకుఁ గ్షుత్పీ డార్త సమ్మోహ సం
తతి కిద్ధాత్రి ధనమ్ము పంచవలె స్వార్థంబందు కించి త్తుపా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
[ఉపారతి = మానుట]
సుకవి మిత్రులు పోచిరాజువారికి నమస్సులు!
తొలగించండిమీ రెండు పూరణములూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు!
చిన్న సందేహం. కేవలం పరుషాక్షరాలైన క,చ,ట,త,ప లకు మాత్రమే సరళాదేశం వస్తుందని నాకు తెలుసు. కాని, మీరు క్షకారానికి సరళాదేశం చేశారు. "ఇలా చేయవచ్చునా?" అనేది నా సందేహం. దీనికేమైనా పూర్వకవి ప్రయోగాలున్నాయా...దయతో తెలుపగలరు. అజ్ఞానంతో అడుగుతున్నాను. అన్యథా భావింపవలదని మనవి.
తొలగించండిఅయ్యలారా ! సరళాదేశ సంధి అనగా నేమి ?
జిలేబి
జిలేబీ గారూ...
తొలగించండిద్రుతం తర్వాత వచ్చే కచటతప-లు గజడదబ-లుగా మాఱి, ద్రుతం బిందువు(అరసున్నా/నిండుసున్నా)గా మారడం. ద్రుతం అంటే నకారం(న్, నిన్, నున్).
ఉదా: నినున్ + కని > నినున్ + గని > నినుఁ గని, నినుం గని ... అను రూపాలు రావడమే సరళాదేశసంధి.
కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. గురువు గారి, మీ వంటి విద్వాంసుల యభిప్రాయ మెఱుఁగఁ గోరి యుద్దేశ్య పూర్వకముగా నే నీ ప్రయోగము చేసితిని.
తొలగించండి“క్ష” సంస్కృతాంధ్ర వర్ణ మాలల లో{ సంస్కృతము-50; తెనుగు-55(36+19)} లేదు. ఇది వర్ణాంతరము కాదు. కేవలము సంయుక్తాక్షరము.
ప్రౌఢ వ్యాకర్త (సంజ్ఞా పరిచ్ఛేదము: సూ.1.) యిదియే చెప్పెను.నిఘంటువులలో కూడా “క్వ” తర్వాత “క్ష” పదములు దాని తర్వాత “ఖ” పదము లీయఁ బడుచున్నవి.
అందు వలన యిది క-ష ల సంయు క్తాక్షరముగా భావించి చేసితిని. ద్రుతము మీది ప్రా బ్రా
యగునట్లు క్ష గ్ష యయినది యిక్కడ.
యుక్తాయుక్తములు పరిశీలించ గోర్తాను.
పూర్వ కవుల ప్రయోగమునకై చూచు చున్నాను కానీ యింకా లభించ లేదు. ప్రస్తుతము తిరిగి భారత పఠనము లో నున్నాను. వెదికెదను. మీకు కనిపించినఁ దెలుపఁ గలరు.
జిలేబి గారు మీ సందేహము దీని వలన తీరును.
బాల. వ్యాక. సంధి. 16.
ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళము లగు.
పూచెను+కలువలు=పూచెను గలువలు
తోఁచెను+చుక్కలు=తోఁచెను జుక్కలు
చేసెను+టక్కులు=చేసెను డక్కులు
నెగడెను+తమములు=నెగడెను దమములు
మొగిడెను+పద్మము=మొగిడెను బద్మము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపోచిరాజువారూ!
తొలగించండిక్షకారమునకు సరళాదేశం రావడం నేనే గ్రంథంలోనూ చూడలేదు. రాదు కూడా!
ఇకపోతే...
మీరు తెలిపిన నిఘంటు క్రమం ఆధునికులు ఏర్పఱచినదే. ప్రాచీన కాలపు నిఘంటువులు పరిశీలిస్తే దీనికి విరుద్ధంగా... అంటే...కకారాంత శబ్దాలతో మొదలై, క్షకారాంత శబ్దాలతో ముగుస్తాయి. ఉదాహరణకు విశ్వకోశాన్ని పరిశీలించండి. ఇలాగే ప్రాచీన నిఘంటువులను పరిశీలిస్తే క్షకారము చివరనే యీయడం గమనిస్తారు.
అయితే నేను క్షకారం ప్రత్యేకాక్షరమా...సంయుక్తాక్షరమా అనే వాదానికి పోవడం లేదు. కేవలం ప్రయోగౌచితీ విషయమై ప్రశ్నించాను. అంతే!
ఇలాంటి చర్చలే సుకవి మిత్రులందరికీ మార్గదర్శకాలవుతాయనే ఉద్దేశంతోనే నేను ప్రశ్నిస్తున్నాను. అన్యథా భావింపవలదని మనవి.
సెలవు.
నమస్సులతో...
గుండు మధుసూదన్
కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. వ్యాకరణ చర్చకు నవకాశము కొఱకు మాత్రమే వాడితిని. వినడానికి సరళా దేశము కర్ణ కఠోరముగా నున్నది కూడా.
తొలగించండినన్నయామాత్యుని యీ ప్రయోగములతో ద్రుతసంధ్యకృత విచారము కూడా తొలగినది.
అధర్మోత్తరంబుగా క్షత్రియులు.. భార. ఆది. 3 .162.
ధర్మ విరోధంబు లేకుండు నట్లు గాఁ బ్రసాదింప.. భార.ఆది. 3. 169.
నరవ్రజమ్మునకు క్షుత్పీ డార్త సమ్మోహ గా సవరణ గ్రహించఁ గోర్తాను.
కించిత్తుపారతి ప్రయోగ మాలోచించియే చేసితిని. కించిత్తుపారతి యిక్కడ సమాసముగా వాడ బడ లేదు. వాక్యములోని పదములే.
కించిత్ ను ముందు తత్సమము చేసి సంధి చేయ వచ్చునని భావించితిని.
కించిత్సందేశము / కించిత్తు సందేశము వలె కించిదుపారతి, కించిత్తుపారతి రెండును సాధువులని నా యభిప్రాయము.”కించిత్” ను “కించిత్తు” అని తత్సమము చేసిన తర్వాత సంస్కృత పదము వచ్చినా తెలుగు సంధినే చేయాలి కదా.
విశ్వామిత్రుఁ డతిఘోర తపము. విశ్వామిత్రుఁడు “విశ్వామిత్ర” కి తత్సమ రూపము.అతి ఘోర తపము సంస్కృత పదము.
చాలా సంతోషమండీ! నేను కించిత్తుపారతి ప్రయోగ చర్చను ఉపసంహరించుకున్నాను. కించిత్తు+ఉపారతి ...కించిత్తుపారతి అని తెలుగు చేయవచ్చును. అందుకే ఉపసంహరించుకున్నాను.
తొలగించండిస్వస్తి
చక్కటి చర్చకు నవకాశ మిచ్చారు. ధన్యవాదములండి.
తొలగించండిఅతివా! వింటివె యీయది
రిప్లయితొలగించండిరతిమూలముసర్వధర్మరక్షణకుభువిన్
గతితప్పనివిధముగనది
సతిపతులకునుండునెడలజగతికిమేలౌ
సతిపతి యజ్ఞమునన్ హా
రిప్లయితొలగించండిరతి మూలము”సర్వధర్మ రక్షణకు భువిన్
గతమునయతిసంస్కారము
పతనము లేనట్లు జేయ?భాగ్యము సుమ్మీ
1996లో కడప ఆకాశవాణిలో చదివిన నా పూరణ:
రిప్లయితొలగించండిసమస్య:"రతియు లేని పూజ రమ్యమౌనె?"
పూరణ :
ఆత్మ శాంతి లేని యార్జన సుఖమౌనె?
కరణ రసము లేక కావ్యమౌనె?
సర్వ రక్షకుండు శర్వుని పైనభి
"రతియు లేని పూజ రమ్యమౌనె?"
****)()(****
(ప్రస్తుత సమస్య చూడగనె ఇది గుర్తుకు వచ్చింది)
బాగుందండీ! మీ పద్యం చూడగానే “ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల” పద్యం జ్ఞాపకం వచ్చింది!
తొలగించండిఅతివేలమ్మగు, సర్వకాలముల సత్యాసత్య నిర్థారణా
రిప్లయితొలగించండిమతియే మూలము సర్వకార్యముల సంభాళింపగన్ నేర్పుగా
ధృతియే కల్గగ సర్వరూపముల సందేశమ్మిడన్ మాత భా
"రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్"
అతివేలము = గొప్ప, అధికము
మతి = శాస్త్రచింతనాదులచేఁగలుగు నర్థనిర్ణయ జ్ఞానము
ధృతి = సంతోషము
గతినీవేయని సంతతమ్ముఁ గని వాక్కాంతన్ కరమ్మిచ్చతో
రిప్లయితొలగించండిమతిలోనిల్పిన జీవితమ్మునను, సమ్మానించు నాతల్లియే
ధృతితో వచ్చి వసించి జ్ఞానమిడు నుత్తేజమ్ముతో, దివ్య భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(పదహారు రోజుల పండుగ దండుగ)
పతిరో! నాపయి ప్రేమలేదనుచు కోపమ్మున్ మహాతాపమున్
ప్రతి రాత్రిన్ పదహారు రోజులుగ నీపైనన్ ప్రదర్శింపగా
సతికిన్ కెంపులు రత్నముల్ మణులు వజ్రమ్ముల్ ప్రదానమ్మిడన్
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
రతి = రవలు పచ్చలు తూచే పడికట్టు
ప్రదానము = ప్రకృష్టదానము
(ఆంధ్రభారతి నిఘంటు శోధన)
ఔనండీ.తాపీధర్మారావుగారు విజయవిలాసంలో ఈ పదపరిచయాన్ని వివరించారు వేశ్యావర్ణనలదగ్గర.
తొలగించండి...దాలి నాయుడు
ఆటవిడుపులు కూడా ఆలోచనా రసగుళికళే
తొలగించండి...దహగం సాంబమూర్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిశ్రుతి సూక్తమ్ముగ భాగవత్కథల సంశోభిల్ల గాజెప్పుచున్
భృతికై పోతన యంకితంబిడునొ? సేవించంగ సమ్రాట్టులన్
యతనిన్ మేల్కొన జేయ మేలనచు స్వప్నావస్థ బోధించు భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
కందం
రిప్లయితొలగించండిసుతకున్ జన్గుడిపి తిరిగి
వెత జెందక వచ్చు గోవుఁ వినయము జూడన్
నుతియించి పులి యొసఁగు నా
రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్
అతిగా వాగ కసత్య మాడకుమ ఆయా వేళలం బట్టి వా
రిప్లయితొలగించండిక్చతురత్వమ్మును జూపు గొప్ప హితవే కానిమ్ము వాక్రుచ్చుచో
యితరు ల్మెచ్చని రీతి బోకు నుడులే యింపౌ నగ ల్సత్య వా
గ్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.
సతతము మనుజులిలను పర
రిప్లయితొలగించండిమత సహనము జూపుచు పరమాత్ము గొలువ నా
హితమును కోరుకొనెడి యను
రతి మూలము సర్వ ధర్మ రక్షణకు భువిన్!
చతురానను బ్రియ సతియే
రిప్లయితొలగించండిమతినిచ్చెడు తల్లియంచు మహికొలువన్ స
ద్గతి మార్గాచరణకు భా
రతి మూలము సర్వధర్మ రక్షణకు భువిన్.
ఇతిహాసాది పురాణముల్ వివిధ సాహిత్యమ్ములే గాంచ స
రిప్లయితొలగించండిద్గతి మార్గమ్మును జూపుచున్ నడిపెడుద్గ్రంథమ్ములేకావుటే
క్షితిపై సాహితి సంపదల్ సతము సంక్షేమమ్మునేగూర్చు భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
అతులిత చతురత నొందగ
రిప్లయితొలగించండిసతతము 'ఐం'కార జపము శక్తిని యొసగన్,
శ్రుతులను దాగిన శ్రీ భా
రతిమూలము సర్వధర్మరక్షణకు భువిన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
అతి కూడదు దేనికయిన
రిప్లయితొలగించండిగతి తప్పని దేదయినను గమ్యము జేరున్
జతగా సరియగు సమయపు
"రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్"
ఇచ్చట "గమ్యము" ధర్మ రక్షణే!
(సమయము కాని సమయంలో కలయిక రాక్షస ప్రవృత్తికి కారణమని రావణ కుంభకర్ణులు నిరూపించారుగా)
రిప్లయితొలగించండి1.కం:మతభేదము లెంచకనే
సతతము కర్మలువిడువక సలుపుచు నున్నన్
క్షితిలో మేలగు ,ధర్మని
రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్.
2.కం:సతిపతులు జతగ తిరుగుచు
సతతము సత్కార్యములను జరుపుచు నుండన్
హితమొనగూడును ధర్మపు
రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్.
3.కం:గతి చూపగ సతతము భా
రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్"
యితిహాసములెల్ల చదువ
క్షితిలో చేకూరు మేలు నింపుగ నెపుడున్.
4.కం: గతి తప్పిన నేర్పును భా
రతి ,మూలము సర్వధర్మరక్షణకు భువిన్"
సతతము చేయంగ మురిసి
హితమును బోధించుచుండు నిలలో నెపుడున్.
వెతలను తొలగించుటకై
రిప్లయితొలగించండిఅతురత బడకుండ మంచి యాలోచనతో
హితమొనరించగ సతము ని
రతి మూలముసర్వధర్మ రక్షణకు భువిన్!!!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప
లోకమ్మునన్
సందర్భము: వ్యాస భారతి ఎలాంటిది?
'వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం' అన్నారు. అష్టాదశ పురాణాలు లోకానికి అందించి విశ్వ మానవాళికి మార్గ దర్శనం చేసిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఒక్క భారతంలోనే మానవుడు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి కావలసినన్ని ధర్మ సూక్ష్మా లున్నవి. ఇంద్రియ నిగ్రహావశ్యకత మొదలైన అనేక విషయాలను తెలియ జెప్పే భగవద్గీత భారతంలోనిదే కదా!
ఆ మహాత్ముని అనంతమైన సాహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నా చిన్ని బుఱ్ఱకు ఇలా అనిపించింది.
అది అతులమైనది అనగా సాటిలేనిది. అనవద్యమైన సౌఖ్య మనే ఫలమైనది.
ఎప్పుడూ నేనెలా ఆనందించాలి.. అనే కాదు ఇతరుల నెలా ఆనందింపజేయాలా! అనేది కూడ రవంత ఆలోచించాలి. ఆనందనము.. అంటే ఆనందింపజేయడం.
అనుమానా లనే చీకటితో కూడిన మనస్సులు గలవారికి జవాబు లనే కాంతి నిచ్చేది.
విచ్చలవిడి శృంగారం గొప్ప తెలివి కాదు. నాగరికత కాదు. అది ఎప్పుడూ దురంతమైనదే! అలాంటి భావా లనే నీటికి గట్టు (దరి)లాంటిది.
బరితెగించిన శృంగార భావాలు భద్రమైనవి కా వని యెప్పటికైనా తెలుసుకోవలసిందే! ఆ భావాల నీటిలో యీదు లాడడం ప్రమాద మని ఎప్పటికైనా గ్రహించవలసిందే! మానవుడు గట్టు చేరాల్సిందే!
అందువల్ల వ్యాస భారతియే లోకంలో ధర్మ రక్షణకు మూలము.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
అతులంబై యనవద్య సౌఖ్య ఫలమై
యానంద నావాలమై
తత శంకా మహి తాంధ్య మానస సమా
ధాన ప్రభా శీలమై
యతి శృంగార దురంత భావ జల స
మ్య క్కూలమై వ్యాస భా
రతియే మూలము సర్వ ధర్మముల సం
రక్షింప లోకమ్మునన్
ఆనందనము=ఆనందింపజేయడం.
ఆవాలము=ఆలవాలము..పాదు
కూలము=గట్టు, దరి
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
ధన్యవాదాలు డా.సీతాదేవి గారు!💐💐
రిప్లయితొలగించండిప్రతి రోజింటను వంటజేయుచును తా ప్రారబ్ధ కర్మంబునన్
రిప్లయితొలగించండిచతికిల్బడ్చును పాకశాస్త్రమును తా సాధింప లేకుండగా
సతినిన్ గూడగ బ్రహ్మచర్యమును తా చాలించ హృద్యమ్మదౌ
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్