21, జూన్ 2018, గురువారం

సమస్య - 2713

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్"
(లేదా...)
"చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుండు ముమ్మాటికిన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

58 కామెంట్‌లు:


 1. కవనంబున జాల్రా వే
  సి,వందనము లిడి చటుక్కు సిగబట్టుచు, హా,
  జవరాల!జిలేబీ! విను,
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. చవిగొని యెన్నికలందున
  నవియివి కోతలను కోసి హాయిగ తనలో
  నవినీతిని కప్పుకొనుచు
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

  రిప్లయితొలగించండి
 3. ధృవముగ నామము నుదుటన
  ప్రవిమలమగు తులసి మాల భక్తిగ మెడలో
  కవి!హరి నామము మనమున
  చెవిఁ ,బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

  రిప్లయితొలగించండి


 4. కవివర్యా! వినుడయ్య మీరు ! నిజమేగా మేటి మీరంచు చె
  ప్పి వెసన్ కాళ్ళకు మ్రొక్కి చట్టనుచు మెప్పించంగ మాధుర్యమౌ
  చవులూరంగ కవిత్వముల్ భళి భళీ సారించి డబ్బాటుగన్
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుండు ముమ్మాటికిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  నివసించున్ గుడిప్రక్క , నిత్యమును ధ్యానించున్ మదిన్ భక్తి మా...
  ధవసాహస్రము , నర్చనన్ సలిపి భక్తక్షేమమున్ గోరువా...
  డవనిన్ బూజ్యుడునౌ పురోహితుడు , దివ్యమ్మౌ ప్రసాదమ్ముగా
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుఁడు ముమ్మాటికిన్ !!

  *ఈ సమస్య కూడా గతంలో ఇవ్వబడినదే... అప్పటి నా పూరణ*..

  ఎవరో కొందరు భక్తితత్త్వము విమర్శింపన్ కుయుక్తిన్ ధరన్
  చెవిలో పువ్వులు బెట్టు వారనిన ఛీ! ఛీ! మోసగాండ్రండ్రు , మీ
  రవి మన్నింపకుమయ్య ! వాస్తవమునందాలోచనన్ జేయుచో
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 6. శివనామము జపియించుచు
  భవితను దిద్దెదమనుచును వాసిగ ధనమున్
  నవలీలఁ బొంద గోరుచు
  చెవిఁ బువ్వులు పెట్టువాడె శిష్టుడు జగతిన్.

  రిప్లయితొలగించండి


 7. అవకతవకలన్నియు చే
  యు వెధవ యైనను మనుజుడు యుక్తిగ జవ్వా
  ది వెసన్నద్దుచు గురువుల
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. వివరము జోలికి వెళ్ళక
  నవసరమున్ బట్టి తప్పు అందించు మహా
  స్తవముల, నేరుపు కాడై
  చెవి పువ్వుల బెట్టువాడె శిష్టుడు జగతిన్

  రిప్లయితొలగించండి
 9. అవురా కలియుగమందున
  స్తవనీయుడసత్యవాది సర్వారాధ్యుం
  డవినీతికి నాయకుడై
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టాసత్యనారాయణ
  రవి చంద్రుల బోలుదువని
  భవితకు నీ సేవ ఘనము బ్రహ్మము నీవే
  ఇవి యవి జెప్పియు గురువుకు
  చెవి బువ్వుల బెట్టువాడె శిష్టుడు జగతిన్

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టాసత్యనారాయణ
  భవితన్ దిద్ద భగీరథుండవగుచున్ బ్రార్థించకే కోరికల్
  సవితా, పావకు నట్లు దీర్చినను నీ సాంగత్యమే నిత్యమా?
  చివరన్నెన్నికలందు గ్రొత్తముఖమున్ చేజేత గెల్పించడే
  నవతన్ గోరును వోటరన్న నెటులో నమ్మేటి రాజన్యుకున్
  జెవిలో బువ్వుల బెట్టువాడె గుణ సంశీలుండు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించండి
 12. ప్రవచనముల వినుచు నియతి
  నవశ్యముంబూని భక్తి నమ్రత తోడన్
  భవునిల గొల్చుచు నెలమిని
  చెవి బువ్వులు బెట్టువాడె శిష్టుడు జగతిన్ !

  రిప్లయితొలగించండి
 13. అబ్బా అంతొద్దు సుత్తి ఇక కొట్టొద్దు మాటలివి
  మనకు ముద్దు
  మస్తుల ఉందది నాకెంతిష్టమో ఇది భాష చూడ
  ఇరుకది
  భావదాస్య ధరిధ్రుల వెతికి తడిమి పరిహరించి
  చూడగన్
  చెవిలో బువ్వుల బెట్టువాడె గుణసంశీలుండు
  ముమ్మాటికిన్

  రిప్లయితొలగించండి


 14. అవిరళముగ నామంబిడి
  సవివరముగ పూజల నెటు సలిపిన మేలం
  చు విదురులనడిగి, భక్తిగ
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. వివిధములగు మోసముల ప
  దవిని గొని ప్రజలను ముంచి ధనమును గొనుచున్
  యువతకు గతిఁ జూపెదనని
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

  రిప్లయితొలగించండి
 16. డా.పిట్టానుండి
  యమ్మేటి రాజన్యుకున్ గా చదివిన"నమ్మేటి"వ్యావహారికమను బెడద ఉండదేమో! సవరణ.

  రిప్లయితొలగించండి
 17. అవగుణములెన్ని యున్నను
  నవనీతము బోలు మాట నవ్యమగు విధి
  న్నవలీలగ కోతలతో
  చెవి బువ్వుల బెట్టువాడె శిష్టుడు జగతిన్ !

  రిప్లయితొలగించండి
 18. శివదేవుని బూజించగ
  సవినయముగ గుడికి వెడలి సాగిలబడుచున్
  భవునిప్రసాదమనుచున్
  చెవిలో బువు బెట్టువాడె శిష్టుడు జగతిన్!!!

  రిప్లయితొలగించండి
 19. అవిగో ఇవిగో కను డ య
  భవిత కు బంగారు బాట పరి చె ద నను చు న్
  చ వు లూ రించె డు ను డు ల న్
  జె వి బు వ్వు లు బె ట్టు వాడె శిష్ టు డు జగతి న్
  ________కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 20. సవతిని తెచ్చిన మగడట
  వివరించగ జాయ తోన వేదన వలదే
  జవదాటక తోడు నీకని
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్  రిప్లయితొలగించండి
 21. అవిరామముగా నుదయమె
  శివునికి మక్కువగ పూజచేసిన పూలన్
  భవుని చరణమున గైకొని
  చెవి బువ్వుల బెట్టువాడె శిష్టుడు జగతిన్

  రిప్లయితొలగించండి
 22. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2713
  సమస్య :: *చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుండు ముమ్మాటికిన్.*
  చెవిలో పువ్వులు పెట్టేవాడే నిజంగా గుణవంతుడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం:: మన జన్మను ధన్యం చేసికోవాలి అనే మంచి బుద్ధితో పెట్టే గుణం ఉంటే అంటే దానంచేసే గుణం ఉంటే మనకు సకల ప్రయోజనాలూ సిద్ధిస్తాయి అని అంటూ
  ‘’పెట్టిన దినముల లోపల
  నట్టడవుల కైన వచ్చు నానార్థమ్ముల్
  పెట్టని దినముల కనకపు
  గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ.’’
  అని బద్దెన మహాకవి తన సుమతి శతకంలో చెప్పియున్నాడు. కాబట్టి చెవిలో పువ్వులు పెట్టుకొన్నా పెట్టుకోకపోయినా , లేనివారికి అవసరమైనదానిని చిత్తశుద్ధితో పెట్టేవాడే (ఇచ్చేవాడే) గుణవంతుడు శీలవంతుడు పూజింపదగినవాడు అవుతాడు అని దాన గుణం గుఱించి విశదీకరించే సందర్భం.

  భవమున్ ధన్యము జేయునట్టి సుమతిన్ బద్యమ్ములో జెప్పె దా
  ‘’నవనిన్ బెట్టిన నాడె వచ్చు నిల నానార్థమ్ము’’ లంచున్ మహా
  కవియౌ బద్దెన; గాన పెట్టినను వీకన్ బెట్టకున్నన్ సదా
  *చెవిలోఁ బువ్వులఁ ; పెట్టువాడె గుణసంశీలుండు ముమ్మాటికిన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (21-6-2018)

  రిప్లయితొలగించండి
 23. భవబంధము దొలగించెడి
  శివ బూజయె శ్రేష్టమనెడు చింతన తోడన్
  ప్రవిమల నిర్మాల్యము గొని
  చెవి బువ్వుల బెట్టువాడె శిష్టుడు జగతిన్!

  రిప్లయితొలగించండి
 24. శివునికి భక్తుని ననుచును
  భవుశిష్యులమభ్యవెట్టిబంగరుసరుకు
  ల్లవలీలగగొంచుచుండి
  చెవిబువ్వులబెట్టువాడెశిష్టుడుజగతిన్

  రిప్లయితొలగించండి
 25. అవలోకింపగను పరమ
  పవిత్ర మైన గురు శిష్య బంధమదేదీ?
  చివరకు మృగ్యము నేడది!
  చెవి బువ్వుల బెట్టువాడె శిష్టుడు జగతిన్

  రిప్లయితొలగించండి
 26. నిన్నటి సమస్య.....
  -----------
  పలుకులు నవ కవితలుగా
  నలరారెడు వాసమిదెయనగ నెల్లరు; ని
  ర్మలమౌ శంకరు దయ కై
  తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె కవియౌ !

  రిప్లయితొలగించండి
 27. కవితాశక్తికి మించిన
  శ్రవణానందమ్మునింపు చతురోక్తులతో
  అవసరమగువోట్లకొరకు
  చెవిపువ్వులుబెట్టువాడె శిష్ణుడుజగతిన్

  రిప్లయితొలగించండి
 28. కందమును సీసములోకి మార్చి పూరణము

  వలదు బాబూశంక కలకాలము బిజేపి పార్టితో నీవున్న ఫలము మెండు
  రాష్ట్రము కొరకు నిరాటంకముగ మేము పంపెదము నిధులు పట్టుబట్టి
  యనుచు మోడి తెలిపి తన మాట మార్చెను, పాహిమాం కాపాడు, భవుడ,శివ శి
  వ (చెవి బువ్వులబెట్టు వాఁడె శి ష్టుఁడు జగతిన్, )రాష్ట్రమును ముంచి తివిగ మోడి!

  నిన్ను మేమెల్లరము నమ్మి దన్ను కాచి
  నాము , పోలవరము నడ్డి నావు నిధులు
  రాల్చక, మిగిల్చి నావుగ రాష్ట్రమునకు
  మట్టి యని బాబు వాపోయే మనసు విరిగి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. అదురహో పూసపాటి వారు!

   మూడు వాక్యాల కందాన్ని పూరించటానికి మేమంతా హైరానా పడి క్రిందా మీదా పడి పోతోంటే మీరేమో వరుసలకు వరుసలు గా వాక్యాలనే సీసాలలో బంధించి మధ్యలో ఆ కందపు ముక్కను జిమ్మిక్కుగా పెట్టేస్తున్నారు !


   అదురహో


   జిలేబి

   తొలగించండి
 29. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా💐💐💐💐

  శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః!!

  శిశువుల పశువుల పాముల
  వశమొన రించెడి శ్రుతియుత పాటల వినగా
  శషభిషలు లేక యెల్లర
  కుశలము జేకూర్చునట్టి గొప్పవరమిదే!

  రిప్లయితొలగించండి
 30. భవుడేవచ్చునుజూడుమాయనుచుశంభంభమ్మహాహాయనిన్
  జెవులోబువ్వులుబెట్టువాడెగుణసంశీలుండుముమ్మాటికిన్
  నవహేళంబులుమానుమాయికనునయ్యాలాపవాక్యంబులన్
  నెవడున్ఖాతరుజేయడెప్పుడునునోయీమూర్ఖుడారాయుడా

  రిప్లయితొలగించండి
 31. అవి యివి యింపగు మాట ల
  నవరతము నుడివెడు వార నయ వంచనులే
  భువి సంభావ్యు లగుదురే !
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్ !


  ఎవ రేమన్నను సుంత యేని మన మందెన్నండు శంకించ కం
  త వివేకమ్ము సెలంగ నమ్రుఁ డయి సద్భక్తుండు దేవీ పదా
  బ్జ విలాసమ్ములనుం బరిభ్రమణ మాపాదించి కందోయికిం
  జెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుండు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 17/3/2017 నాటి పూరణలు. గురుసమీక్షణను నోచుకోలేదు.


   భవసాగర మీఁదగ దే
   వ విభుండు నుమా ధవుండు పరమేశున కా
   శివుని కనురక్తిఁ, దా ననె
   జెవిలోఁ, బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

   [పెట్టువాఁడు = సమర్పించువాఁడు]


   అవనీ నాథులు భూసురేంద్రులును విద్యాధిక్యు లౌగాక యీ
   భువిసంజాతులు దైవ భక్తులు సుమీ పుణ్యాత్ములే యెంచఁ గే
   శవ పాదార్చితముల్, త్యజించి మదిఁ దాత్సారమ్ము, సద్భక్తినిం
   జెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్

   తొలగించండి
  2. కీ.శే. శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి పూరణ:

   సవినయముగ ఛాత్రుండై
   ధవళకరుడు గురునిపత్ని తారను గూడెన్
   శివుని సిగ జేరె.గురువుకు
   చెవిలోబువు బెట్టువాడె శిష్టుడుజగతిన్.

   తొలగించండి
 32. సవరించి చీర కొంగును
  భవముగ చెరిసగము సుధను పంచెద ననుచున్
  చవిగొని దైత్య సమూహపు
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

  భవము = శుభము

  రిప్లయితొలగించండి
 33. కందం
  రవిశశి నయనుని మఱపిం
  చు విద్య నేర్పె డు గురువుల సులభమ్ముగఁ గే
  శవ నామమునఁ దనరగన్
  జెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

  ( శిష్టుఁడు = ప్రహ్లాదుడు)

  రిప్లయితొలగించండి
 34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 35. కవియై నిత్యము నీతికిన్ నిలచుచున్ కాంక్షించి దేశోన్నతిన్
  భువిపై మానవ జాతికిన్ సతతమున్ బోధించుచున్ యోగ్యముల్
  రవియైవెల్గుచు భార్యమానసమునన్ రాత్రిన్ రతిక్రీడలో
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాడె గుణ సౌశీల్యుండు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించండి

 36. భువిలో బ్రదుకును హాయిగ
  చెవిలో బువు బెట్టువాడె, శిష్టుడు జగతి
  న్నవమానము లెదురైనను
  భవములనే గోరుకొనెడు భవ్యుడె దలపన్

  రిప్లయితొలగించండి
 37. భువిలో దేలిక మార్గమందుధన మున్ బొందంగ తానెంచుచున్
  సవితా! దుర్మతి యైనవాడె సతమున్ స్వార్థమ్ముతో నెప్పుడున్
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాడె, గుణసంశీలుండు ముమ్మాటికిన్
  నవమానించిన వారికైనను సహాయమ్మే సదా చేయడే.

  రిప్లయితొలగించండి
 38. ఆటవిడుపు సరదా పూరణ:
  (బిల్డర్ బౌండర్ బుల్డోజర్)

  ఇవిగో మిద్దెలు మేడలన్ గనుము మాయింపైన చిత్రాలలో
  హవుసింగ్ బోర్డుకు సమ్మతంబయిన నీ యాకాశ హర్మ్యాలలో
  భువినిన్ స్వర్గము జూపెదన్ సఖ! మహా భోగమ్ము నీదేననిన్
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుండు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆటబట్టు కందము ;)


   ఇవిగో మిద్దెలు మేడలు!
   అవిగో ఆకాశహర్మ్య ఆశాదీపా
   లవిగో రారండోయని
   చెవిలో బువు బెట్టువాడె, శిష్టుడు జగతిన్

   జిలేబి

   తొలగించండి
  2. "ఆటబట్టు కందమా"? లేక "ఆడబడుచు కందమా"?

   తొలగించండి
 39. ప్రవిమల భక్తిని గుడిలో
  శివునకు చరణమ్ములందు చేతుల నెదపై
  నవుదల ముఖమున నాసిక
  జెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్.

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

  సందర్భము: ఇతరులకు చెవిలో పువ్వులు పెట్టా డంటే అతడు వంచకుడు. తనకు తాను చెవిలో పువ్వులు పెట్టుకున్నా డంటే తనలోని దైవ భక్తికి ధర్మ ప్రీతికి అది సంకేతంగా భావించవచ్చు నని అనేకుల అభిప్రాయం.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  భువి మృషలు వలికి పరులకు
  "చెవిఁ బువ్వులఁ బెట్టు" ననిన
  చెడు వాడె యగున్..
  ప్రవిమల శీలుడు "తనుఁ దా
  జెవిఁ బువ్వులఁ బెట్టు"...
  వాఁడె శిష్టుఁడు జగతిన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  21.6.18

  రిప్లయితొలగించండి
 41. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణ
  సంశీలుండు ముమ్మాటికిన్

  సందర్భము: వితండవాదం చేసే
  ఒక అతి తెలివిపరుని భాషణం..
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "చెవిలో పువ్వులఁ బెట్టు వాడ" నని నన్
  జెప్పంగ వా డెవ్వడో...
  చెవిలో పువ్వులఁ బెట్ట నేర్చుటయు వీ
  క్షింపంగ సామాన్యమా!
  చెవిలో బెట్టక చేతిలోన నిడినన్
  ఛీ యంచు దూషింపరే!
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణ సం
  శీలుండు ముమ్మాటికిన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  21.6.18

  రిప్లయితొలగించండి
 42. [6/21, 9:59 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి.


  కువలయమందున భక్తితొ

  నవనవలాడెడు విరులను నయగారముతో

  భవునకు కొసగి పిదప తా

  చెవిబువ్వులపెట్టువాడె శిష్టుడుజగతిన్.


  అవకాశము వెదికి కొనుచు

  నవియివి చేసెదననుచును నతిశయ మొప్పన్

  యువతను పెడదోవనిడుచు

  చెవిబువ్వులపెట్టువాడె శిష్టుడుజగతిన్.

  రిప్లయితొలగించండి
 43. భువిలో నీకిక సాటి లేరనుచుహా! పుణ్యాత్ముడీవేర భల్
  స్తవనీయుండగు నేత నీవనుచు పల్ దండమ్ములర్పించుచున్
  కవితల్ వ్రాయుట చేతగాక శిరమున్ కాళ్ళందు నానించుచున్
  చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుండు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించండి