18, జూన్ 2018, సోమవారం

సమస్య - 2710

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె"
(లేదా...)
"ఎక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్" 

71 కామెంట్‌లు: 1. చిక్కితినట కష్టము, సయి చింత చదువు
  కై మహానగరంబున ఖర్చులధిక
  మాయె! దేవుని దయగ సుమా చనవరి,
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క, మగఁడె
  నిక్కటుల దీర్చిరి జిలేబి నిక్కముగను !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. శుభోదయం గురువుగారు.....'ఎ' కు 'య' కు యతి కుదురుతుందా?

  రిప్లయితొలగించండి
 3. అక్క! నా మగడు చనియె చక్కగాను
  నొక్క మెతుకును లేదుగ నిక్కముంగ
  చిక్క లేదు నాబిడ్డకు నొక్క తండ్రి
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె!

  రిప్లయితొలగించండి


 4. చిక్కితి కష్టమాయెను సుశీల! మహానగరంబులోన నే
  ప్రక్కల చూడ నెల్లపుడు బాడపు ఖర్చులు! చూచు వారులే
  రక్కడ దిక్కు లేదు, మఱి యక్క, మగండిక దిక్కు నాకికన్
  చక్కగ నన్ను చూచుకొన సాధ్యమయెన్ చదువుల్ వెసన్ సఖీ

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. వయసది పాతిక చకచక దాటెను సొగసది
  వాడుతు చాటెను
  దిగులది మనసును మీటెను ఒంటరి గీతలు
  తానిక గీటెను
  అడవి గాచిన వెన్నెలనగన్ చెల్లికి మది నిట్లు
  తోచగన్
  ఎక్కడ దిక్కులేదు మఱి యక్క మగండిక దిక్కు
  నాకికన్

  రిప్లయితొలగించండి
 6. దేవదేవుడె తలచంగ దినము దినము
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క! “మగఁడె
  తాగుబోతౌట యీత?”డం చాగ కుండ
  పలుకు చుండెను తానొక్క పడతి యచట.

  రిప్లయితొలగించండి
 7. చక్క నైనట్టి మగడగు చంద మామ
  వెదకి వేసారి పోవగ తుదకు మదిని
  సంధి జేసుకు దొరకని బంధి యేల
  దిక్కు లేనప్డు దిక్కునా కక్క మగఁడె

  రిప్లయితొలగించండి


 8. చిక్కితి కష్టమాయెను సుశీల! మహానగరంబులోన నే
  ప్రక్కల చూడ నెల్లపుడు బాడపు ఖర్చులు! చూడగాను వే
  రెక్కడ దిక్కు లేదు, మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్
  చక్కటి వేడబమ్ము సయి సాయమొనర్చెడు నైజమాయెగా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  కార్పొరేట్ విద్యావలయంలో చిక్కిన సాధారణమైన రైతుబిడ్డ ఆవేదన...


  చక్కని భూమి యుండె , వ్యవసాయము జేయుమనంగ , ద్రోసి , బీ...
  టెక్కన మక్కువంచు పెరటింగల పెన్నిధిఁ గాలదన్నితిన్ !
  ప్రక్కనె సంద్రమున్నను పిపాసను దీర్చునె ! కొల్వు రాదు నా...
  కెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ అక్కమగండుదిక్కగున్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 11. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి పెళ్ళయిన అక్క తప్ప సోదరులు లేని యువతి మనోగతం:

  దక్కక తల్లిదండ్రులిక ధారుణిలో మఱి యో ప్రమాదమున్
  చిక్కదు మానసంబునను చిక్కులు దీరక సంతసమ్మికన్
  మ్రొక్కెద నన్ను గాచగను మోదము తోడను నాకు దండ్రిగా
  *"ఎక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడు యక్క మగండు దిక్కగున్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణ సూచించిన గురువులు శ్రీ సూరంవారికి నమస్కరిస్తూ

   దక్కక తల్లిదండ్రులును ధారుణిలో మఱి తావులేదికన్
   చిక్కదు మానసంబునను చిక్కులు దీరక సంతసమ్మునే
   మ్రొక్కెద నన్ను గాచగను మోదము తోడను నాకు దండ్రిగా
   *"ఎక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడు యక్క మగండు దిక్కగున్"*

   తొలగించండి
 12. దిక్కు లేనప్డు దిక్కు నా కక్క ;మొగుడె
  చనగ దేశాంతర ముపాధి సాధనమున
  చక్కదిద్దగ నేర్పుగా సంతునంత
  సాయమయ్యెగా తనవంతు చక్కగాను

  రిప్లయితొలగించండి
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2710
  సమస్య :: *ఎక్కడ దిక్కు లేదు మఱి యక్క మగం డిక దిక్కు నా కికన్.*
  సందర్భం :: వాలి నేల కూలి ‘’ఓ రామా! ధర్మమూర్తి వైన నీవు నన్ను ఇలా చంపడం న్యాయమేనా ? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీరాముడు ‘’ఓ వాలీ ! నీవు నీ సోదరుడైన సుగ్రీవుడు బ్రతికి యుండగానే అతని భార్యను (నీకు కోడలితో సమానమైన దానిని) అధర్మంగా అనుభవించావు. తండ్రి యాజ్ఞ ననుసరించి అడవికి వచ్చిన నేను అడవిలో ఉన్న అధర్మపరులను శిక్షించి వధించి వారికి ఉత్తమ లోకములను కలిగించాలి. అందువలన నిన్ను శిక్షించాను’’ అని ధర్మసూక్ష్మమును తెలియజేశాడు. అప్పుడు సుగ్రీవుని భార్య యైన *రుమ* తన గతం గుఱించి ఆలోచించుకొంటూ తన అశక్తతను సమర్థించుకొంటూ ‘’ఏ దిక్కూ లేని నాకు అక్క యైన తార భర్త యైన వాలియే దిక్కు అని మనసులో అనుకొనే సందర్భం.

  మక్కువ రామచంద్రుడు ‘’రుమాపతి యుండ నధర్మవర్తివై
  చిక్కె నటంచు పొందితి విసీ రుమపొందును గాన వాలి ! ని
  న్నిక్కడఁ జంపినాడ’’ ననియెన్; రుమ యిట్లు తలంచె వింతగా
  *’’యెక్కడ దిక్కులేదు మఱి యక్క మగండిక దిక్కు నా కికన్.’’*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (18-6-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూరణకు పురాణ గంధ మలదినారు ! భేష్ ! శభాష్ !అభినందనలు !

   తొలగించండి
  2. శ్రీ జనార్దన రావు గారూ! ధన్యవాదాలండీ.

   తొలగించండి
  3. రెండవ పూరణ (కోట రాజశేఖర్)

   భర్తను వదలివేయాలని అనుకొన్న మహిళకు చెల్లెలు వంటి పొరుగింటి మహిళ చేసే హితోపదేశం.

   మితం దదాతి హి పితా
   మితం మాతా మితం సుతః ।
   అమితస్య హి దాతారం
   భర్తారం కా నపూజయేత్ ।।

   (అయోధ్యాకాండ-39 వ సర్గ-30 వ శ్లోకం)పై శ్లోకం లోని భావానికి అనుగుణమైన పూరణ

   నిక్కము తల్లి తండ్రియు గణింప సుతుండు మితమ్ము గానె నీ
   కెక్కడ నైన కోరినది యిత్తురు; తోడుగ భర్త యున్నచో
   మక్కువ దక్కు నీ కమిత మైన సుఖమ్ము, త్యజింప వద్దు, నీ
   కెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడు *నక్క !* మగండె దిక్కగున్.

   తొలగించండి
  4. మదీయ రామచంద్ర శతకము నుండి:

   తల్లి దండ్రు లైన దనయులు నైన ని
   చ్చునది మితము గాదె చూడ నమిత
   దాత పతి యొకండె దార పూజింపదే
   రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 82.

   తొలగించండి
  5. కోటవారికీ, కామేశ్వరరావు గారికీ నమోనమః! 🙏🙏🙏🙏

   తొలగించండి
 14. ఎక్కడె క్కడ వెదికి నా చిక్క లేదు
  నాకు మగడు గ కలిగెగా చీకు చింత
  కొంత యోచిoచి యనుకొంటి కూర్మిమీర
  దిక్కు లేనప్దు దిక్కు నా కక్క మగ డె

  రిప్లయితొలగించండి
 15. చక్కని సుందరాం గుడగు సాహస వంతుడు మంచివా డనన్
  దిక్కులు పిక్కటిల్ల గల ధీరుని భర్తగ కోరుకొం టినే
  నెక్కడ యెక్కడెక్క డన నేరుగ గాంచిన పొందలే దకో
  ఎక్కడ దిక్కు లేదుమఱి యిప్పుడు యక్క మగండు దిక్కగున్

  రిప్లయితొలగించండి
 16. చిన్న నాటనె కోల్పోవ కన్న వారి
  పేద రాలను, మాబావె యాదరించి
  పెంచి పెద్దజేసియు నాకు పెళ్ళి జేసె
  "దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె"

  రిప్లయితొలగించండి
 17. ప్రేమనే భ్రమలో ఇల్లు విడచి మోసపోయిన యువతి మనోగతం:

  చక్కదనాల చుక్కనని సారము లెంచక నిక్కినీల్గితిన్
  మక్కువ చూపెనంచు నొక మందుని ప్రేమను మోసపోతిగా
  నక్కడ తల్లిదండ్రులకు నాదగు మోమునదెట్లు జూపెదన్
  *"ఎక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడు యక్క మగండు దిక్కగున్"*
  చిక్కుల తోడునిల్చి యిక క్షేమము గూర్చును దండ్రి రూపుగా!

  రిప్లయితొలగించండి
 18. తల్లి తండ్రులు లేరన్నదమ్ములసలె
  లేరు, బతుకు సాగగ దారిలేకనుంటి
  ఎల్లవేళల రక్షణనీయనెట్టి
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్కమగడె

  రిప్లయితొలగించండి
 19. ఎన్ని సామెతలవి లేవు యెంచి చూడ
  ఒక్క మార్గమె తోచిన నూరడింప
  చెప్పుకొను మింక మదిలోన చింత దీర
  *"దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె"*

  రిప్లయితొలగించండి
 20. ఏమొగుడులేనియెడలనుభామకక్క
  మొగుడెదిక్కునగువిధము,ముదముకాదె?
  దిక్కులేనప్డుదిక్కునాకక్కమగడె
  యనుచుసరిపెట్టుకొనగనునార్య!యామె

  రిప్లయితొలగించండి
 21. ఎక్కడదిక్కులేదుమఱి యిప్పుడయక్కమగండుదిక్కగు
  న్నక్కటయెంతకష్టమదియక్కమగండటదీక్కునాయెనే
  యిక్కటులెన్నియోకలుగునీయదిబంధముగల్గుచోనిల
  న్జక్కనివాడునై మిగులజక్కగజూసినహర్షమేగదా

  రిప్లయితొలగించండి
 22. డా.ఎన్.వి.ఎన్.చారి
  అక్కకుపెండ్లి జేసితన అమ్మయు నాన్న యు స్వర్గమేగగా
  నెక్కడ దిక్కులేదు మరి యిప్పుబ యక్క మగండు దిక్కగున్
  ప్రక్కన జేరుమంచనెడు బావను వీడెను చీదరించుచున్
  చక్కని వృద్ధదంపతుల చల్లని పంచన వృద్ధి నందెనే

  రిప్లయితొలగించండి
 23. డా.ఎన్.వి.ఎన్.చారి
  అక్కకుపెండ్లి జేసితన అమ్మయు నాన్న యు స్వర్గమేగగా
  నెక్కడ దిక్కులేదు మరి యిప్పుబ యక్క మగండు దిక్కగున్
  ప్రక్కన జేరుమంచనెడు బావను వీడెను చీదరించుచున్
  చక్కని వృద్ధదంపతుల చల్లని పంచన వృద్ధి నందెనే

  రిప్లయితొలగించండి
 24. ఆత్త పలుకుల కెపుడు నా యక్క యెదురు
  పలుక లేక వ్యాసముని తో కలసి వచ్చె
  నిన్న, నా వంతని బలికె నేడు , ఏమి
  చేతు, యెవరు దిక్కిప్పుడు, చిక్కు లోన
  పడితివి గద నంబాలిక, వెడలు పడక
  టింటికి యనుచు నా మది వెంట బడెను
  (దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె)
  ననుచు నంబాలిక నడచె మనసు జంపి
  వ్యాస ముని మందిరమునకు గాసి బడుచు

  వ్యాస మునితో సంతానము బడయుటకు అంబికను పంపిన తదుపరి సత్యవతి అంబాలికను శయన మందిరమునకు మరునాడు వెడలమని అజ్ఞాపింప అంబాలిక మనోగతము ఈ రీతిన ఉండవచ్చు యను భావన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీసము
   అప్సరస, ఘ్రుతాచి యా బాదరాయణుల్ తల్లి దండ్రుల్ గదా తరచి చూడ
   యే ముని వరునకున్, యీసుడు దక్ష ప్రజాపతి కేమాయె, చావు తాను
   కోరిన సమయాన కూడు నట్టి వరము బడసిన వీరుడెవడు తెలుపు త
   నయ, (శుక యోగికి, నల్లుడయ్యె, సురనది కొడుకే) , గా విను, తెలుగు పద్య

   ములను, కవులు బహు విచిత్రముగ లిఖించె
   దరు ఘనత తోడ, కనవమ్మ తనయ, శంక
   రార్యు లిచ్చు సమశ్యలన్, పారు వరద
   లై కవుల పూరణమ్ములు లక్షణముగ

   గురువు గారు నిన్నటి నా పూరణ ఒక్క సారి చూడండి

   తొలగించండి
 25. చెడ్డవాడైన భర్తని వదిలేయ వచ్చుగా అని అడిగిన పక్కింటి ఆమెతో ఆక్కా అని సంబోధిస్తూ :
  చిక్కితి మూర్ఖుడైన పతి చేతులలోఁ బ్రతి రోజునేడ్చుచున్
  మ్రొక్కితినెల్ల వేల్పులకు బుద్ధిని మార్చమటంచు భర్తకున్
  గ్రక్కున వీడి వెళ్ళినను రమ్మని యాశ్రయమిచ్చు వారు లే
  రెక్కడ - దిక్కు లేదు మరి యిప్పుడునక్క! మగండు దిక్కగున్

  రిప్లయితొలగించండి
 26. పతి బాధితురాలి యావేదన:

  చుక్కలు చూపుచున్ విభుడు చూడ్కుల జేష్టల గాల్చు చుండె, నే
  నిక్కడ తాళలేను మరణించెదనన్న విధమ్ము కాదు, నా
  యక్కయె నాకు దిక్కయి సహాయము చేయగ నిల్చె, తోడుగా
  “నెక్కడ దిక్కు లేదు, మఱి యిప్పుడు యక్క మగండు దిక్కగున్”

  రిప్లయితొలగించండి
 27. పెండ్లి వలదన్న భావ్యమే పిన్నఁ దనము
  నందు దిక్కగు జనకుఁ డమందముగను
  జీవితాంతము మఱి సురుచిరము నెట్టి
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క! మగఁడె


  వెక్కసమైన ద్వేష మలివేణికి నీ మగజాతి యన్నచో
  నొక్క దినంబు పట్టణము నొంటరిగం జన రాత్రి యయ్యినన్
  నక్కిరి చుట్టు ముట్టును ఘనమ్ముగ నచ్చటఁ జోరులే చుమీ
  యెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క! మగండు దిక్కగున్

  [అక్క = ఔర; మగఁడు = వీర పురుషుఁడు]

  రిప్లయితొలగించండి
 28. మామకొడుకును చేబట్ట మక్కువగొని
  కాలుని కడకేగె నతడు కల్లుఁ ద్రావి
  చూపులను గ్రుచ్చు కూళల నోపలేను
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె

  రిప్లయితొలగించండి
 29. చక్కని వాడటంచు కడు సౌమ్యుడటంచు వివాహ మాడగా
  గ్రక్కున చచ్చె కృత్రిమపు కల్లునుఁ ద్రావి ప్రియుండు, చింతతో
  నెక్కటిగా గృహమ్మున వసించుట దుర్లభమయ్యె నాకు నా
  కెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్

  రిప్లయితొలగించండి
 30. పాండురాజు మరణానంతరము హస్తినకు తిరిగివచ్చు కుంతి మనోగతము

  చుక్కల బోలెడిన్ సుతుల సూక్ష్మపు బుద్ధిని జూడజాలకే
  మక్కువ మీరగా కులపు మంచిని చెడ్డను నాదరించకే
  దక్కని నాథునిన్ దలచి దారుణ ఖేదము నిండగుండెలో
  దిక్కును దోచకే తిరిగి దీనత హస్తిన జేరగావలె
  న్నెక్కడ దిక్కులేదు మఱి యిప్పుడు యక్కమగండు దిక్కగున్!

  అక్కమగడు = ధృతరాష్ట్రుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కుంతి కన్నా గాంధారి చిన్నది ధృతరాష్ట్రుడు పాండు రాజు కు అన్నయ ఐనా పనికి రాదని అనుకొని నేను కుంతి విషయము విరమించుకొన్నాను యదయం పెద్దలు ఏమంటారో మరి???

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. గాంధారి చిన్నదే అయినప్పటికీ, వరుసకు అక్కయే అవుతుంది. కనుక తప్పులేదు!

   తొలగించండి
 31. తాగుబోతగు తండ్రితోయేగలేక
  కట్నకానుకలివ్వగ కలిమిలేక
  యవ్వనంబున సూటిగానవ్వలేక
  దిక్కు లేనప్డు దిక్కు నాకక్కమగడె!
  2) చక్కని "రూప" రూపసి,నిజాయితిగల్గినధర్మకర్తయై!
  మక్కువనింపెడిన్ మమత,మానవతత్వముగల్గియున్ననూ
  లక్కును మాన్పె!నంగవికలత్వమునుండగ?పెళ్లిగానిచో
  ఎక్కడదిక్కులేదు మరియిప్పుడ యక్కమగండెదిక్కగున్

  రిప్లయితొలగించండి
 32. ఆటవిడుపు సరదా పూరణ:
  (అమిత్ షా కలలో మమతా దీదీ తో ఎగతాళిగా...2019)

  మిక్కిలి గీరతో మిడిసి మెండుగ మోడిని మొట్టబోతివే...
  చక్కిలి గింతలాయెనహ! చక్కని చుక్కకు మానభంగమై...
  తుక్కుగ నోడిపోతివిగ! త్రుళ్ళకు దూకకు బంగభూమిలో
  నెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క! మగండు దిక్కగున్ :)

  https://www.google.co.in/search?q=amit+shah+with+mamata+banerjee&client=safari&channel=iphone_bm&prmd=niv&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwiQidqZ1tzbAhXbQ30KHW-LDcoQ_AUIEigC&biw=375&bih=549#imgrc=edzfebXBa995uM:

  రిప్లయితొలగించండి


 33. ఆటబట్టు కందము :)


  ఐఫోను సవారీచే
  సే ఫోటోలనట గాంచి సింగారా లొ
  ల్కే ఫలుదా పద్యంబును
  తా ఫాలముతడిమి గట్టి తాళింపులిడెన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. సమస్య :-
  "దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె"

  తే.గీ*

  పెళ్ళి కూతురు దొరకక పెళ్ళి గాక
  ముదిరి పోవుచుండగ జూచి ముందరపడి
  వెతకు భారమంతయు బావ వేసుకొనెను
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె
  ................✍చక్రి

  రిప్లయితొలగించండి
 35. 2వపాదం చివర
  దిక్కు గాచదువఋప్రార్ధన

  రిప్లయితొలగించండి
 36. దిక్కగు తల్లిదండ్రులు గతించిరి, రొక్కము లక్క పెళ్ళికై
  మిక్కిలి ఖర్చులయ్యె శ్రుతిమించగ, లేదిక చిల్లి గవ్వ, నే
  నొక్కడ నేడ నుందు, తగు నొక్కడు సాకెడు వాడు లేడు, నా
  కెక్కడ దిక్కులేదు మఱి యిప్పుడ యక్కమగండె దిక్కగున్.

  రిప్లయితొలగించండి
 37. పార్వతీ విలాపం:

  ఉత్పలమాల
  చక్కని యాది దంపతుల జంటగ సర్వులు మమ్మెరుంగగన్
  దక్కని గౌరవంబునకు దక్షుని యాగమునందు గాలితిన్
  చిక్కగ నాదు యక్క సిగ జేరుచు నీశ్వరు, నేటి జన్మలో
  కెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్. 
  (తప్పైన క్షమించ ప్రార్థన)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరించిన చివరి పాదంతో :

   పార్వతీ విలాపం:

   ఉత్పలమాల
   చక్కని యాది దంపతుల జంటగ సర్వులు మమ్మెరుంగగన్
   దక్కని గౌరవంబునకు దక్షుని యాగమునందు గాలితిన్
   చిక్కగ నాదు యక్క సిగ జేరుచు నీశ్వరు, నేటి జన్మలో
   నెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్. 
   (తప్పైన క్షమించ ప్రార్థన)

   తొలగించండి

 38. రెండు దినములు గా కంది వారు కనబడుటలేదు.

  కుశలమే గదా ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. “జిలేబి” గారూ, మరచితిరా? 👇
   ——————————————————-
   “శంకరయ్య కంది జూన్ 16, 2018 1:36 PM
   రేపు ఉదయం వరంగల్ లో జరిగే పుస్తకావిష్కరణ సభ కోసం ఇప్పుడు బయలుదేరుతున్నాను. రేపు ఉదయం బయలుదేరితే సమయానికి చేరలేను. ఇప్పటి నుండి రేపు రాత్రి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.”
   ——————————————————-
   (15, జూన్ 2018, శుక్రవారం; సమస్య - 2707 “పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్" అనే టపాలోని వ్యాఖ్య)

   తొలగించండి
  2. కంది శంకరయ్య గారు:
   (ఈరోజు మధ్యాహ్నం 3.36)

   "కవిమిత్రులారా,
   ఉదయం నుండి మన జడ పద్యాల పరిష్కారంలో ఉన్నాను. ఎల్లుండి ప్రింటింగ్ ప్రెస్ లో ఇవ్వాలి. అందువల్ల రెండు మూడు రోజులు సమూహానికి అందుబాటులో ఉండను. మన్నించండి."

   తొలగించండి
  3. జిలేబి గారూ:

   మీరీ శంకరాభరణ సమస్యను మిస్సయ్యారు:

   "కొరవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ"

   తొలగించండి

  4. అడిగితే అదిన్ను కందమకరందము వదిలెదమా ?


   సరసపు వేళన తర్కము,
   బరబర మగడిని జిలేబి వాయించుట నీ
   కు రవణము కాదు సూ!అర
   కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)

   జిలేబి

   తొలగించండి
  5. 👏👏👏

   నోరు భరించని కంపని
   వారింపగ నీవు ధూమపానమ్మును నీ
   పోరుబడ లేక విడిచితి
   కొరవిని, గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ!

   తొలగించండి


  6. జడ పద్యమ్ములు గురువుల
   దడదడ లాడించె గా, సదనమున గానన్
   తడయయ్యె భళారె జడా!
   గడగడ లాడింతువో పగడమై తలలో :)

   జిలేబి

   తొలగించండి
 39. బాపు మరణించిన బావమరది మనోగతం :

  తేటగీతి
  మేన బావ యనుచు మేలు మేలటన్న 
  యోగ్యుతెఱిఁగి యక్కయె పెళ్లికొప్పు కొనియె
  బాపు మరణించ మరదిగ బాలునౌచు
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె! 

  రిప్లయితొలగించండి
 40. డా.పిట్టాసత్యనారాయణ
  ఏమి చేతు మభాగ్యమున్నెవడు మెచ్చు
  అక్కయైనను దరిజేర నలుక జెందు
  దిక్కు లేకున్న వారికిన్ దిక్కు హరియ
  పెక్కులౌ యుపాధులు నేడు, బిడియమేల?
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగడె?!

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టా సత్యనారాయణ
  ఎక్కడ దిక్కులేదు మరి యిప్పుడ యక్క మగండు దిక్కగున్
  జిక్కితి గష్టకాలమున జ్యేష్ఠమ యింటను గజ్జె గట్టినన్
  స్రుక్కెడు దుర్దశల్ గనము చొక్కపు నార్జనలుండ నేడు యీ
  టక్కుటమారి సామెతల ఠావులు దప్పె మగండు బోయినన్!

  రిప్లయితొలగించండి
 42. డా.పిట్టా సత్యనారాయణ
  అరయగనన్నియు బొ‌సగగ
  చొరవగ నా వరుని గనిన చోద్యమె వాడున్
  బరువడి బండ మగండవ
  కొరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ!

  రిప్లయితొలగించండి
 43. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె

  సందర్భము: ఒక మహిళ దీన దశనుంచి తన నుద్ధరించిన పుణ్యాత్ముడైన తన అక్క భర్తను ఇలా స్మరించుకుంటున్నది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "అన్న మో రామచంద్ర!"యం చలమటించు
  దీనదశలోన మనకెల్ల దేవు డొకడె
  దిక్కు లేనప్డు దిక్కు; నా కక్క మగఁడె
  యిది వచించె; నమ్మకమును మది రచించె..

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  18.6.18

  రిప్లయితొలగించండి
 44. 15,999 పడుచుల గోల:

  "చక్కనివాడు కృష్ణుడహ చక్కని యక్కను రోహిణమ్మనున్
  మక్కువ మీరగా కొనియె మందిర మందున మేలుభార్యగా
  తక్కువ నేమి జేసితిని తక్కిన యక్కల రూపురేఖలన్?...
  ఎక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్!"

  "When Krishna arrives in the palace of the captive women, each of them prays to Krishna to accept her as his wife."

  https://en.m.wikipedia.org/wiki/Junior_wives_of_Krishna

  రిప్లయితొలగించండి