3, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2695 (శునకమయ్యెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"
(లేదా...)
"శునకమ్మయ్యెను విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్"

123 కామెంట్‌లు:



  1. మునుగడ కతలన్నర్థము
    గన తల తిరుగును జిలేబి కలవర పడకోయ్
    విను,సత్యంబనుకొనకోయ్
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కతలకు నర్థము...' అనండి.

      తొలగించండి


  2. కనుగట్టు చేసె విభుడే
    మునులకు నేర్ప తను కలడు ముల్లోకమునన్,
    వినవే బాల జిలేబీ,
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాను'ను 'తను' అనరాదు. 'ముల్లోకములన్' అనడం సాధువు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. కనుమా! కాలుడు నొకచో
      శునకమ్మయ్యెను; మురారి సురలు నుతింపన్
      పనిచెను సుధనా వేళను
      మునుపెన్నడు గాననటుల మోహిని యౌచున్

      తొలగించండి
    2. కంది శంకరయ్య గారు:

      ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పనిచెను' అంటే 'పంచెను' అన్న అర్థం లేదు. పంపెను, నియోగించెను అని అర్థాలు. *ఘనముగ బంచెను సుధనే* అందామా?

      తొలగించండి
    3. శాస్త్రి గారూ,
      శ్రమ తగ్గించారు. ధన్యవాదాలు!

      తొలగించండి
  4. వినలే దెప్పుడు ;కృతులను
    గనలే దెన్నడు ; కవివర! కరుణన్ జెపుమా
    మన మాగుట లే ; దెప్పుడు
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్?



    రిప్లయితొలగించండి
  5. వినుమా వింతలు జగతిని
    కనుపించని దైవ మంట కనికట్టు లనన్
    వినువీధిని పరికించుచు
    శునకమ్మ య్యెను మురారి సురలు నుతింపన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    ఘన ప్రేమము పశువులపై
    గొనకొని యొక కుక్కబెంచ గొణిగిరి యరరే
    జనులు"మురారీకుక్క"న(ఇదెవరి కుక్క కు జవాబు అయినా మురారియే కుక్క అని ధ్వనిస్తుంది కదా!)
    శునకమ్మయ్యెను "మురారి" సురలు నుతింపన్
    (మురారి, ఆతని పేరు.మనుజులు యిష్ట పడకున్నా సురలు అతని భూతదయను శ్లాఘించిరి)

    రిప్లయితొలగించండి
  7. తన వారికి మేలు స లు ప
    మును కొని మోహిని గ మారి ముక్క oటి కి లొ o
    గిన త రి తా మణి కంఠే
    శున కమ్మ య్యే ను మురారి సుర లు నుతిoపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమ్మ+అయ్యెను' అన్నపుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
  8. మిత్రులందఱకు నమస్సులు!

    [త్రిపురాసుర సంహార సందర్భము]

    తునుమంగన్ గమలాక్షునిన్ మఱియు విద్యున్మాలినిన్ దారకా
    క్షు, నిలన్ బండిగఁ జేసి, చక్రములుగా సూర్యున్ శశాంకున్ దగన్
    గొని, యశ్వాలుగ వేదముల్ దనరఁగాఁ, గోదండమై మేరు, వీ

    శునకమ్మయ్యెను విష్ణుదేవుఁడు, సురస్తోమంబు కీర్తింపఁగన్!

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    అమ్మే శరణము నమ్మిన వారికి
    అమ్మే మరణము నమ్మని వారికి

    ఘన రామాఖ్యము దివ్యనామమనగన్ గావన్ యయాతిన్ కపీ...
    శునకమ్మయ్యెను ., హానిఁ గూర్చనట విష్ణున్ దూలు నా రాక్షసే...
    శునకమ్మయ్యెను ., విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్
    దునిమెన్ .,నమ్మిన గాచు, జంపునదె ధూర్తున్ ., నమ్ముమమ్మే యగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఇనచంద్రుల్ రథచక్రయుగ్మము ., రథమ్మీ ధాత్రి , చాపమ్ము కాం
      చనశైలమ్ము , విరించి సారధి , మహాశ్వమ్ముల్ శ్రుతుల్ , వార్ధియే
      ఘనతూణీరము , శేషుడల్లె , త్రిపురున్ గర్వాంధు గూల్చంగ నీ...
      శునకమ్మయ్యెను విష్ణుదేవుడు ‌సురస్తోమంబు కీర్తించగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  10. ఘనమగు మోహిని రూపున
    వనమాలిని గనుచు హరుడు వలచిన వేళన్
    జనియించిన శబరిగిరీ
    శున, కమ్మయ్యెను మురారి సురలు నుతింపన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమ్మ+అయ్యెను' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి
  11. సవరణ:

    ఘనసౌందర్యమ్మున మో
    హినిగ నవతరించి దనుజులెల్లరకున్ దాఁ
    గనుటచే శబరిమలే
    శు, నకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"(శబరిమలేశున్+అకము+అయ్యెన్; అకము=దుఃఖము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణ:

      ఘనసౌందర్యమ్మున మో
      హినిగ నవతరించి దనుజులెల్లరకున్ దాఁ
      గనుట కతన శబరిమలే
      శు, నకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమ్మ + అయ్యెను' సంధి లేదు.

      తొలగించండి
  12. మూడు తత్త్వముల ముగ్గురనగ ఒకటిగ వెలసె
    దత్తుడె అనఘా
    కుక్కలవి తన చెంతనె యనగ ఏ మర్మమో
    అగోచరముగా
    ఉఛ్ఛ నీచములంటని స్థితిగ తాత్త్విక లోతు
    గుర్తింపగన్
    శునకమ్మయ్యెను విష్ణుదేవుడు సురస్తోమంబు
    కీర్తింపగన్

    రిప్లయితొలగించండి
  13. అనలాంబకునికి వహనము
    శునకమ్మయ్యెను, మురారి సురలు నుతింపన్
    ఘనతన్ వరాహ మై వసు
    ధను కాచె దనుజుని చంపి దక్షత తోడన్

    రిప్లయితొలగించండి
  14. guruvu gaaru ninnati naa puranamu prisheelimchamdi

    సాయకమున కప చితినిడి
    రాయలు కేలన్ ధరించె, రమణి పదములన్
    జేయి నిడి, మ్రొక్కి పయనం
    బాయెను సమరమ్ము జేయ పగతులతోడన్

    రాయలు = రాయడు = రాజు
    రాజు యుద్ధ భూమికి వెళ్ళు సమయమున కత్తికి పూజ చేసి చేత ధరించి తల్లి పాదములకు నమస్కారము చేసెనను భావన


    రిప్లయితొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2695
    సమస్య :: *శునకమ్మయ్యను విష్ణుదేవుడు సురస్తోమంబు కీర్తింపగన్.*
    విష్ణువు శునకంగా మారగా దేవతలందఱూ ప్రశంస చేశారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: తారకాసురుని కుమారులైన విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే ముగ్గురు బ్రహ్మను మెప్పించి కామగమనం గలిగిన మూడు పురములను తయారు చేయించుకొని వాటిలో తిరుగుతూ అందరినీ బాధించడం మొదలుపెట్టినారు. లోకకల్యాణం కోసం త్రిపురాసుర సంహారం చేయడానికి శివుడు ముందుకు వచ్చాడు. యుద్ధానికి సిద్ధమైన పరమశివునికి సహాయం చేయడానికి భూమి రథ మయ్యింది. వేదాలు గుఱ్ఱాలు అయ్యాయి. సూర్యచంద్రులు రథ చక్రాలు అయ్యారు. మేరు పర్వతం ధనుస్సు అయ్యింది. బ్రహ్మ సారథి అయ్యాడు. విష్ణువు (ఈశునకు+అమ్ము) ఈశునికి బాణం అయ్యాడు. దేవతలు కీర్తించగా త్రిపురాసుర సంహారం జరిగింది అని విశదీకరించే సందర్భం.

    చనునే యీ త్రిపురాసురుల్ బ్రతుకగా? సంహారముం జేతు వీ
    రిని నేనే యని బల్కగా శివుడు, కూర్మిన్ సాయ మందింప స్యం
    దన మయ్యెన్ గద భూమి, సారథిగ తానయ్యెన్ గదా బ్రహ్మ, యీ
    *శున కమ్మయ్యెను విష్ణుదేవుడు సురస్తోమంబు కీర్తింపగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (3-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ అవధాని గారూ! చాలమందికి మార్గదర్శకులయ్యారు! అభినందనలు, ధన్యవాదములు! 💐💐💐🙏🙏🙏

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి
    4. గురువర్యులగు శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
    5. నేటి సమస్యకు రెండవ పూరణ

      అనిలో గెల్వగలేక, లీల విజయ మ్మాశించుచున్, నేరుగా
      దునుమం జాలక తారకాక్షు ఖలు, విద్యున్మాలి యన్ నీచు, దై
      త్యుని దుష్టున్ కమలాక్షు ; నేర్పు మెయి తా యోచించి యోచించి యీ
      శున కమ్మయ్యెను విష్ణుదేవుడు సురస్తోమంబు కీర్తింపగన్.
      *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*

      తొలగించండి
  16. దునుమగ త్రిపురాసురలను
    చను శివునకు మేరు గిరియె చాపము కాగా
    తనవంతు సాయముగ యీ
    శున ,కమ్మయ్యెను మురారి సురలు నుతింపన్!!!

    రిప్లయితొలగించండి
  17. ఘనమగు వేల్పులలోకపు
    యునికిని నిలుపగ దివిజుల నుదలని భయమున్
    దునుముచు సురలోకమునకు
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లోకపు టునికిని' అనండి. 'సురలోకమునకు శునకము'...?

      తొలగించండి
    2. 🙏🏽 ధన్యవాదములు. సురలోకమునకు కాపలా కాయువాడయ్యెను అనే భావంతో వ్రాయడమైనది. శునకము విశ్వాసంగా కాపలా కాస్తూ మనకు అభయం లేకుండా చేస్తుందని. తప్పు భావన అయితే క్షంతవ్యుడను

      తొలగించండి
  18. వినియుంటిమి త్రిపురాసురు
    దునుముటకై హరునకు హరి తోడ్పడు విధమున్
    జనులందఱు మురియగ నీ
    శునకమ్మ య్యెను మురారి సురలు నుతింపన్

    రిప్లయితొలగించండి
  19. డా.పిట్టాసత్యనారాయణ
    కనకమ్మాయెను గీత-వాక్యములలో కైవల్యమాశించకన్
    శునకః పాకము నశ్వపాకమును వే సూచించె నాచార్యుడే
    పనిపాటల్ గొనువారి కమృతమదే , పాటింపకున్నన్ బుధుల్
    గొను శాకంబులు మృగ్యమై లవణమున్ గ్రోలన్ సమంబంచు వా
    క్శునకమ్మయ్యెను విష్ణుదేవుడు సుర ‌స్తోమంబు కీర్తింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      పద్యం బాగుంది. కాని పూరణ భావం బోధపడలేదు.
      'కమృత' అన్నచోట గణదోషం.

      తొలగించండి
    2. డాపిట్టానుండి
      ఆర్యా,శునకశ్చశ్వపాకేచ పండితాః సమదర్శినః..గీతా వాక్యం.ఆచార్యుడు మాంసాహారాన్ని తప్పు పట్టక ప్రత్యేకంగా శునకం వైపు తన వాక్కులో సమదర్శిత్వం చూపినాడు.అందరూ శాఖాహారులైతే అవి దొరకక ఉప్పు తినాలి. ఈ భేద భావం సమసి పోవడానికి వాక్కులో తాను శునకం రూపు దాల్చినట్లయింది.గీత లో శునకానికి ప్రాధాన్యత ఇవ్వబడినది కదా అని చెప్పదలచితిని,పండితులలో శ్రమ జీవుల ఆహారం గూర్చిన సమదర్శనం అవసరమన్నాడని .........

      తొలగించండి
    3. డాపిట్టానుండి
      వారికిన్సుధయదే గా చదువ గలరు.

      తొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తనశోభలచే మది నీ
      శున కమ్మయ్యెను మురారి, సురలు నుతింపన్
      కనికట్టుగ మోహినియై
      దనుజుల మోహింప జేసె దాపము మీరన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    ................ కేవలము కల్పన మాత్రమే .................



    [ కొండల ‌‌రెక్కలను కోసి - కోసి ఇంద్రుని వజ్రాయుధము మొద్దు

    వారినది • రాక్షసులతో యుద్ధ మొనరించు నపుడు విష్ణువు

    ఇంద్రునికి అస్త్రము గా నయ్యెను • ]


    కన , నగముల రెక్కల గో

    సిన పవి మొద్దయ్యె | నంత :- జేయుచు రణమున్ ,

    దునుమగ సురారుల , శచీ

    శునకు + అమ్ము + అయ్యెను మురారి సురలు నుతింపన్ |


    { + గుర్తలు పెట్టి విడదీసి నందుకు నన్ను క్షమింప వలెను }

    రిప్లయితొలగించండి
  22. సమస్య :-
    "శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"

    *కందం**

    జనియించె గదా విష్ణువు
    వినుతిన రక్షించ భవిని వివిధరకములన్
    కనికరమున మరి కావగ
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్
    ...............✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.
      'వినుతిన'..?
      '

      తొలగించండి
  23. సకల చరాచర స్థితికీ హరియే కారణము

    తను చేపగ తను కప్పగ
    తను పాముగ తను మృగముగ తాను నరునిగన్
    మనుటకు యింధన మయి తాఁ
    *"శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"*


    త్రిపురాసుర సంహార ఘట్టము

    అనిలో భూమియె తేరుగ
    ధనువై మేరువుయె నొప్పె దానవ వధకున్
    మననము చేయగ తా నీ
    *"శున కమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేప = జలచరము
      కప్ప = ఉభయచరము
      పాము = సరీసృపము
      మృగము = మానవేతర జంతుజాలము
      నరుడు = పరిపూర్ణ జీవి...

      సూక్ష్మములను తప్ప సకల జీవులను ప్రస్తావించినట్టే అనుకుంటాను...
      😊

      తొలగించండి
    2. తాను ను తను అనరాదు...గురువుగారి వ్యాఖ్య
      😐

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. సవరణ:
      గనఁ చేపగ కప్పగ వన
      మున తా నా పాముగ మృగముగను నరునిగన్
      మనుటకు యింధన మయి తాఁ
      *"శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"*

      తొలగించండి
    5. గురువుగారీ మధ్య బ్లాగుపై సీతకన్నేశారు! వాట్సప్ పై ఆదరణ చూపిస్తున్నారని పిస్తుంది! 😔😔😔

      తొలగించండి
    6. కిమపరమ్ (వాట్సప్) లో వీక్షకులు పరిమితము; శంకరాభరణము లో నపరిమితము!!!

      తొలగించండి
    7. నిజమే! కానీ ఏమిజేయగలరు కంది వారు? వ్హాట్సప్లో దాదాపు 250 మంది...కొందరు కవులూ, కొందరు అవధానులూ, కొందరు లాక్షణికులూ, కొందరు వైయ్యాకరణులూ, కొందరు ప్రేక్షకులూ, కొందరు వచ్చే పోయే వారూ, ఒక ఆటవిడుపుగాడూ, ఇలా ఎంతోమందిని కాచుకొనవలెను వారు ప్రతిక్షణం. లేనిచో కలహాపులగం ఔతుంది కదా.

      తొలగించండి
    8. కిట్టుబాబు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    9. కవిమిత్రులారా,
      నాకు బ్లాగే ముఖ్యం. మొన్నటిదాక మొదట బ్లాగులోని పూరణలను సమీక్షించి వాట్సప్ చూసేవాణ్ణి. అయితే అప్పటికే వాట్సప్‍లో వ్యాఖ్యలు ఎక్కువై పూరణలను వెదుక్కోవడం ఇబ్బంది అవుతుందని ముందుగా వాట్సప్ చూడసాగాను. ఈమద్య 'జడపద్యాల' కారణంగా పనిభారం ఎక్కువై కొంత నిర్లక్ష్యం జరిగింది. మన్నించండి. ఇకనుండి ముందుగా బ్లాగునే చూస్తాను. నాకు బ్లాగే ప్రధానమైనది.

      తొలగించండి
  24. వినుమా శంకర! యీయది
    వినరానివివినుచునుంటివివిధపువార్తల్
    కనివిని యెఱుగని దీయది
    శునకమ్మయ్యెనుమురారిసురలునుతింపన్

    రిప్లయితొలగించండి
  25. కన, భైరవ వాహనమే
    శునక మయ్యెను, మురారి సురలు నుతింపగన్
    దనుజుల పరిమార్చుటకై
    యినకుల తిలకుండుగ జనియించెను గాదే

    రిప్లయితొలగించండి
  26. జన క్షేమమ్మును గోరి ధర్మమిల సంస్థాపింపగా నెంచుచున్
    ఘనశ్రీకంఠుడె భైరవుండవగ నా కామారి కే వాహ్యమే
    శునకమ్మయ్యెను, విష్ణుదేవుడు సుర స్తోమంబు కీర్తింపగన్
    నినవంశోద్భవుడై జనించెనిలలో హీనాత్ములన్ ద్రుంచగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జనసంక్షేమము గోరి...' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  27. దనుజుల వంచించగ మో
    హినిగా నవతారమెత్తి యీశుని సతియై
    ఘనుడగు సుబ్రహ్మణ్యే
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమ్మ+అయ్యెను' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  28. రిప్లయిలు
    1. విని నంతనె ప్రహ్లాదు వ
      చనములు దా దూఱె నిఁక నచర చర తతులన్
      మనుజుల ద్విజములఁ గన నది
      శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్


      ఇన చంద్రద్వయ మయ్యె చక్ర యుగమే యింపార వేదమ్ములే
      ఘన వాహమ్ములు బ్రహ్మ సారథి యనంగం గార్ము కంబయ్యె మే
      రు నగంబే రథ మయ్యెఁ బృధ్వి త్రిపురుల్ రోదించఁ దాక్షాయణీ
      శున కమ్మయ్యెను విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్

      [దాక్షాయణీ + ఈశునకు + అమ్ము +అయ్యెను; అమ్ము = బాణము]

      తొలగించండి
    2. హరి సర్వాకృతులం గలం డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
      త్వరుఁడై యెందును లేఁడు లేఁ డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
      నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమ స్థావరో
      త్కరగర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్ ....భాగ. 7. 277.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  29. అనసూయ పరీక్షందున
    కనుపించిరి బాలురగుచు కనులకువిందై
    మనుగడ మార్చగ "లోకే
    శునకమ్మయ్యెను"!మురారిసురలునుతింపన్ (త్రిమూర్తులకుఅనసూయమ్మ!అమ్మపిల్లలుగామార్చినప్పుడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరీక్ష + అందున, అమ్మ + అయ్యెను' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జై! భారత్ మాతాకీ జై!)

    వినరే కాంగ్రెసు భాజపాలు నొకటై ప్రేమాతిశయ్యమ్ముతో
    కనరే నేలిరి కేరళన్ తొలుతగా కాశ్మీరు పర్యంతమున్...
    పనికిన్ మాలిన మాటలౌ పలుక పాపమ్మౌర నీరీతిగా:
    "శునకమ్మయ్యెను విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      'అతిశయ్యము' అన్న పదం లేదు. "ప్రేమాభిమానాలతో" అందామా? 'కనరే యేలిరి' అనండి.

      తొలగించండి
  31. రిప్లయిలు
    1. 'శీతకన్నే'... కాని అది గ్రాంధికం కాదు.

      తొలగించండి
    2. మంచిదే. నేనడిగిందీ వ్యావహారికం గురించే.

      తొలగించండి
    3. విన్నకోటవారూ! శీతకన్నును సీతకన్నుగా వ్రాయడం నాతప్పే! క్షమార్పణలు!
      కాని ఈ జాతీయం వెనుక కధయేమిటో మీరు చెబితే వినాలని ఉంది! నిజంగా నాకు తెలియకే అడుగుతున్నాను! దయచేసి వివరించగలరు! శీతాకాలంలో కొన్ని జంతువులు దీర్ఘని్ర పోతాయని విన్నాను. దానికి సంబంధించినదా?

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. అయ్యో, ఈ మాత్రానికే క్షమార్పణలెందుకండి సీతాదేవి గారూ. టైపింగులో పొరపాటు జరిగుంటుందిలెండి. ఆన్లైన్లో టైప్ చేస్తున్నప్పుడు తెలియకుండానే తప్పులు దొర్లడం మామూలే. అదే చేతివ్రాతలో అయితే ఆస్కారం తక్కువ కదా. ఏదో నాకు అలవాటైన పదానికి విరుద్ధంగా కనిపించేసరికి వ్యాఖ్యగా అడిగేశాను, ఏమనుకోకండి.

      “శీతకన్ను” అనే పదానికి మూలం ఏమిటో చెప్పగలిగినంత భాషాశాస్త్ర పరిజ్ఞానం నాకు లేదండి. పట్టించుకోకుండా ఉండే ధోరణి అని మాత్రం తెలుసు. పట్టించుకునేవారి చూపులు “వెచ్చగా” ఉంటాయని గనక భావిస్తే, నిర్లక్ష్యం చూపించేవారి చూపుల్ని దానికి వ్యతిరేకంగా శీతకన్ను (“చల్లని” అనే అర్థంలో మాత్రం కాదు) అని వర్ణించవచ్చని భావిస్తున్నారేమోనని నా ఊహాగానం. అసలు ఈ పదం మరీ పాతది కాదనీ, cold-eyed (not affected by emotions : having a cold or unfriendly appearance అని ఆంగ్ల నిఘంటువు చెబుతోంది) లాంటి ఏదైనా ఆంగ్లపదానికి “శీతకన్ను” అని ఏ అనువాదకులో, పాత్రికేయులో మక్కికిమక్కీ అనువాదం చేసి తెలుగులో వాడకంలోకి తీసుకొచ్చుంటారేమోనని నా అనుమానం.

      ఇక, మీరడిగినట్లు అత్యంత శీతలప్రాంతాల్లో శీతాకాలంలో దీర్ఘనిద్ర (hibernation) పోయే జంతువుల నుంచి ఈ పదం వచ్చిందా అంటే ... చెప్పలేం - ఎందుకంటే ఆ టైములో అవి అసలు కళ్ళు తెరుచుకునే ఉండవు కదా వాటి చూపుల్ని ఎదుటి ప్రాణుల మీద పారించడానికి - ఇది నా అవగాహన మాత్రమే. బ్లాగుల్లో ఎవరైనా శాస్త్రపరిజ్ఞానం కలిగినవారు వివరిస్తే బాగుంటుంది.

      (నా జవాబు నిడివి ఎక్కువైంది కానీ పస లేదేమోనని నాకే అనుమానం)

      తొలగించండి
    6. నాకు తెలిసిన దిది:
      శీత (అ,ఆ,అ: త్రిలింగ పదము) పదమునకు మందకొడి, సోమరితన మను నర్థములు కూడా కలవు. కేవల సంస్కృత పదముతో కన్ను జేర్చిన దుష్ట సమాసము. (అందుకే వ్యావహారిక మయినది.) మందకొడి చూపు అని భావించ వచ్చును.

      తొలగించండి
    7. ధన్యవాదములండీ! మీకు తోచిన వివరణ సరిగానే అనిపిస్తోంది! పెద్దలెవరైనా యింకా వివరించగలిగితే మంచిదే! 🙏🙏🙏

      తొలగించండి
    8. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏

      తొలగించండి
  32. దనుజులు త్రిపురా సురులను
    వినాశ మొనరింప నెంచ పృథివియె రథమై
    సనతుడు చోదకు డయె నీ
    శున కమ్మయ్యె మురారి సురలు నుతింపన్

    రిప్లయితొలగించండి
  33. ఘనులౌ ముగ్గురుమూర్తులాతరినటన్ గాంభీర్యమున్ చూపుచున్
    అనినా దైత్యుల గెల్వగా దలచు చున్ నాదివ్యులేతెంచగన్

    ధనువయ్యెన్గిరి సారథయ్యెనజుడాత్ర్యక్షుండునౌ యాగిరీ

    శున కమ్మయ్యెను విష్ణుదేవుడు సురస్తోమంబు కీర్తింపగన్.

    రెండవపూరణ

    అనిమిషు లెల్లరు నచ్చట

    గనగన్ సారథిగనయ్యె కమలోదరుడే

    యనిలో ముదమున తా నీ

    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్.

    రిప్లయితొలగించండి
  34. విను త్రిపుర వధజేయగ నీ
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్
    కనగను మును మణికంఠే
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "విను త్రిపుర వధకు నీ" అనండి. 'అమ్మ + అయ్యెను' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  35. వినగానయ్యెనువింతగామిగులదావిష్ణుండుమారన్బళా
    శునకమ్మయ్యెనువిష్ణుదేవుడుసులస్తోమంబుకీర్తింపగన్
    కనగాలేదుగనెచ్చటయ్యదిలరాకాచంద్రుపైసాక్షిగా
    వినుమావిష్ణువునెత్తుదానెపుడువేవేషంబునిత్యంబుసూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విష్ణుండు, విష్ణుదేవుడు'... అని పునరుక్తి.

      తొలగించండి
  36. ఘనుడా కర్దమునింట బుట్టిపెరిగెన్ గారాబుగాఁ భ్రాయమున్
    మనువాడన్‌ మునిముఖ్యుఁడత్రి, తగుధర్మంబాచరించెన్ ధరన్
    బెనుసంబాధముదాటి పొంది వరమున్ దత్తాఖ్యుఁడౌ సంయమీ
    శునకమ్మయ్యెను, విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊకదంపుడు గారూ,
      ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు మీ దర్శనం! సంతోషం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని 'అమ్మ + అయ్యెను' అన్నచోట సంధి లేదు.

      తొలగించండి
  37. ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ లోపాలను తెలిపిన ప్రభాకర శాస్త్రి గారికి, సూరం శ్రీనివాసులు గారికి, చక్రవర్తి గారికి, వెన్ను తట్టిన శ్రీహర్ష గారికి కృతజ్ఞతలతో....

    సవరణతో మరో ప్రయత్నం:

    ఘన వేదోపనిషత్తు లందు గన నీ కాయంబు వర్ధిల్లగన్
    దన రూపున్ స్థితి సంభవంబునగు నాధారంబు నాతండనెన్
    వనమున్ చేపయు గప్పయున్ మృగము నాబామున్ పరీక్షింపగన్
    "శునకమ్మయ్యెను విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మృగము నా పామున్' అనండి.

      తొలగించండి
  38. జన చక్షుండును జంద్రుడున్ రథముకున్ జక్రాలుగా మారగన్
    ఘనుడౌ బ్రహ్మయె చోదకుండవగ నీ కల్పమ్మె తేరవ్వగన్
    దనుజాధమ్ముల ద్రుంచనెంచగను వేదాలెల్ల యశ్వాలు నీ
    శున కమ్మయ్యెను విష్ణుదేవుడు సురస్తోమంబు కీర్తింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రథమునకున్' అనడం సాధువు. రథముకున్ అనరాదు. అక్కడ "రథమునన్" అనండి.

      తొలగించండి
  39. నమస్కారములు
    ఈ వారం[ 2-6-18 ] ఆకాశవాణి వారి సమస్యను తెలుపగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్య గారు:

      ఈనాటి ఆకాశవాణి వారి సమస్య *అన్నము లేనివాఁడు పరమాన్నము బంచెను పల్లె పల్లెలన్* అన్నది శంకరాభరణం బ్లాగులో 3-10-2013 నాడు ఇచ్చినదే. కాకుంటే అప్పుడు 'వాడవాడలన్' అంటే ఇప్పుడు 'పల్లెపల్లెలన్' అన్నదొకటే తేడా. చూడండి...https://kandishankaraiah.blogspot.com/2013/10/1193.html

      తొలగించండి
  40. శంకరాభరణం
    3, జూన్ 2018, ఆదివారం
    సమస్య - *2695*
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..

    *"శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"*
    (లేదా...)
    *"శునకమ్మయ్యెను విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్"*

    నా ప్రయత్నం :

    కందం
    పెనుమినుకు లొక్కటొకటిగ
    శునకమ్మయ్యెను! మురారిసురలునుతింపన్
    వనజభవుఁడు హరుఁడుఁ గలియ
    ఘన దత్తాత్రేయుఁడగుచు జ్ఞానమ్మొసఁగెన్

    మత్తేభవిక్రీడితము
    ఒనగూర్చంగను జ్ఞానబోధ నిగమా లొక్కొక్కటొక్కొక్కటే
    శునకమ్మయ్యెను! విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్ 
    సనతుండీశ్వరు లేకమౌచు తనలోసంధానమై నిల్వగన్
    దనరంగన్ ప్రజ దాల్చె నత్రి సుత దత్తాత్రేయ రూపంబునన్.

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్

    సందర్భము: మురారి శునక మెట్లా ఐనా డయ్యా అంటే.. ఇదుగో ఇట్లా ఐనాడు.
    *శు* అంటే *శుభకరుడు*
    *న* అంటే *నగధరుడు*
    *కం* అంటే *కంజాక్షుడు*

    *శుభకరుడైన* కృష్ణుడు చిన్ననాడే గోవులను గోపాలురను రక్షించడానికై గోవర్ధన గిరి కొనగోట ధరించినాడు.
    అందువల్ల *నగధరుడైనాడు.* దేవత లందరూ ప్రస్తుతించినారు.
    దేవేంద్రుడూ ఈ పసివాడే *కంజాక్షు* డని (శ్రీ హరి యని) గ్రహించి తన తప్పు తెలుసుకొని క్షమాపణ వేడుకున్నాడు. కాబట్టి..
    *మురారి శు.న.కం. ఐనా డనవచ్చు.*
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    కనుగొన *శుభకరు* డయ్యెను..

    ఘన గో గోపకుల గావగా *నగధరు* డ

    య్యెను.. *కంజాక్షుం* డయ్యెను..

    *శు* *న* *క* మ్మయ్యెను మురారి...

    సురలు నుతింపన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  42. తినుచున్ నల్లని విత్తమంతయునుతా తీండ్రింప నేతృత్వమున్
    కొనుచున్ వోటుల కోట్లకోట్లనిడి తా కూర్చంగ నాధిక్యమున్
    కనకాలంకృత పీఠమెక్కుచును భల్ గంధమ్ము పాఱించెడిన్
    శునకమ్మయ్యెను విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్

    రిప్లయితొలగించండి