ఆ లలితాంగి లేకయె గృహంబున కందము లేదు, లేదు బం ధాలకు ప్రేమగంధము, సుధామయ లోకము లేదు, గేహ సం చచాలకురాలు భామయె విచారణ జేయగ నట్టి యింటి మే స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2706 సమస్య :: *స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.* ఆడవాళ్లకు మ్రొక్కితే ధనము ధైర్యము శుభము కలుగుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: ధనాన్ని ఇచ్చే లక్ష్మీదేవి స్త్రీ. చదువును సంస్కారాన్ని ఇచ్చే సరస్వతీదేవి కూడా స్త్రీయే. చాలమి అంటే అశక్తతను తొలగించి ధైర్యాన్ని శౌర్యాన్ని ఇచ్చేది కూడా స్త్రీయే. కాబట్టి శ్రీ వాణీ గిరిజా స్వరూపిణులైన స్త్రీలకు మ్రొక్కితే ధనము శౌర్యము శ్రేయము తప్పకుండా సిద్ధిస్తాయి. *యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః* అని విశదీకరించే సందర్భం.
సుప్రసిద్ధ కవి పండితులగు శ్రీ రాణి సదాశివ మూర్తి గారు చేసిన ప్రశంస శ్లోకరూపంలో... పద్యాదౌ విద్యతే లక్ష్మీః పద్యమధ్యే సరస్వతీ| తతః స్థితా శుభా గౌరీ శుభదే పద్యశేఖరే|| 🙏🙏🙏👌💐💐💐
గురువు గారికి నమస్సులు. శంకరాభరణం బ్లాగు ద్వారా నేను మిమ్ములను ఎప్పుడు పరిచయం చేసుకున్నానో మర్చిపోయాను. కానీ, బ్లాగులోని పెద్దలు, ముఖ్యంగా మీరు ఇచ్చే training తో కొన్ని పద్యాలు వ్రాసే నైపుణ్యం పొందాను. పండిత శ్రీ నేమాని వారు , వరప్రసాద్ గారు పోస్ట్ చేసిన పాఠాలు నేను అనుసరిస్తూ వచ్చాను.పండిత శ్రీ ఏల్చూరి వారిని కలిసి , చర్చించి, వారి సలహాలను అనుసరించాను. భగవత్కృపతో మీవంటి పెద్దల ఆశీర్వాద బలంతో " ఉత్సాహ రాఘవ శతక కావ్యము " అనే పేరుతో , అన్నీ ఉత్సాహ వృత్తంలో, 117 పద్యాలను రచించి పదిలంగా భద్రపరచుకున్నాను. ఇది 2014 సంవత్సరంలో పూర్తి అయింది. అప్పుడే శివుడి మీద కూడా పద్యాలు వ్రాద్దామనుకున్నాను. కానీ ఈశ్వర కటాక్షం కొరకు వేచి యున్నాను.నిత్యాభిషేకాలతో స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించాను నేటికి శివుడు నాపై తన కృపాదృష్టిని ప్రసరిస్తున్నాడని అనిపిస్తున్నది. 4 సంవత్సరాల కాల వ్యవధి తరువాత ఇప్పుడే శంకరుని పద్యాల సేవకు శ్రీకారం చుట్ట బడింది. అయితే, ఉత్సాహ వంటి వృత్తాల జోలికి పోకుండా, అందరికీ తెలిసిన వృత్తాలు, కంద వంటి ఛందస్సులనే ఎన్నుకుంటున్నాను. గతంలో కూడా నా పద్య రచనా ప్రయాణంలోని విషయాలు, విశేషాలు అన్నీ మీకు తెలియ జేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అలాగే విన్నవించుకుంటున్నాను. Whatsapp ద్వారా మీకు సందేశం పంపుదామని ప్రయత్నించాను. చేతకాలేదు. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను.
మేలగు వర్తన ల్ గలిగి మిన్నగనందరిమె ప్పులందు చు న్ జాలియు ప్రేమ లొ ల్కకడు శాంత మనస్సు న దాన ధర్మ ము ల్ తాలిమి తో నొ న ర్చుచు ను ధార్మిక చింతన సత్య పాల నా స్త్రీల కు మ్రొక్కినన్ ధనము శ్రేయ ము శౌర్య ము గల్గు నిద్ధ ర న్ కరణం రాజేశ్వర రావు
పాలన జేయును జగతిని లాలనతో నూయలూపి లక్ష్యము కొఱకై క్రాలుచు, కనలుచు, శ్రమపడు స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్ ***)()(*** "The hand that rocks the cradle rules the world"(N.G.Damle) "ఊయల నూపెడి చేయి ప్రపంచాన్ని పాలిస్తుంది"
జిలేబి గారి జైత్రయాత్ర! ఇదివరకు 8 పూరణలు మీ రికార్డుగా పేర్కొనడం జరిగింది! ఈ రోజు య్ప్పటికే 12 అయ్యాయి! ఇంకెన్న్ రాబోతాయో! గిన్నిస్ బుక్ కు పంపుదామా! 👏👏🙏🙏
🎂శంకరాభరణం🎂 నేటి సమస్య:--- "స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యముఁ గల్గు నిద్ధరన్" మూలపుటమ్మలైన ముగ్గురు స్త్రీలు దేవతలు, పురుషుల జీవనగమనం లో ముఖ్యమైన ఆరు పాత్రలను నిర్వహించుట లో అద్వితీయులు స్త్రీలు, అందుకే సంస్కృతకవి స్త్రీపారమ్యాన్ని ఈ క్రింది శ్లోకంలో వర్ణించాడు. "కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ భోజ్యేషు మాతా శయనే తు రంభా షట్కర్మయుక్తా కులధర్మపత్నీ." అని. ఆ కవి భావన మేరకు ఇన్ని రూపాలలో ఆదుకునే స్త్రీలు దేవతాస్వరూపులే అనే భావన లో నా పూరణ.
ఈ రోజు పద్యాల వరద చూస్తూంటే కళ్ళు తిరుగుతున్నాయి! ఒక స్త్రీ అనే అంశం కవిత్వానికి యెంత స్ఫూర్తిగాయకమో తెలుస్తున్నది! జిలేబిగారితో పోటీపడి మిస్సన్నగారు కూడ పద్యాల ప్రవాహం కల్పించారు! శ్రీమాత్రే నమః! 🙏🙏🙏🙏
కృష్ణ సూర్యకుమార్ గారూ, మీ 15 పూరణలు బాగున్నవి. అభినందనలు. ఇందిరాగాంధి పూరణ మొదటి పాదంలో గణదోషం. "నెపముల' అంటే సరి! అలాగే "కట్టడి నిడి తా । నేలెగద.." అనండి. సీత పూరణలో రెండవ పాదంలో గణదోషం. సవరించండి. సావిత్రి పూరణలో "సావిత్రియె" అనండి. అనసూయ పూరణలో "అనసూయయే" అనడం సాధువు. అక్కడ సంధి లేదు. ద్రౌపది పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి. మదర్ థెరిస్సా పూరణలో "వేదన విడి తా ।నీలోకపు..." అనండి. 'లేక' కళ. 'లేకన్' అనరాదు. సరస్వతి పూరణ రెండవ పాదంలో గణదోషం.
రిప్లయితొలగించండిపాలేటి రాచ కన్యయు
కోలాహలము కలిగించు గోమిని లక్ష్మిన్
బాలకుమారా కొల్సుచు
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
శుభం !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కొల్చుచు' టైపాటు?
మేలైన యప్పులిడుచును
రిప్లయితొలగించండిజాలిని జూపుచు వసూలు జాప్యము తోడన్
వీలుగ జేసెడి బ్యాంకరు
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేలును గూర్చెడు వారికి
రిప్లయితొలగించండికేలును మోడ్చుచు నిరతము కీర్తించిన లో
కాలేలెడువారగునా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిబాలకుమార! మేలగును పాటిగ లక్ష్మిని కొల్సుచున్ సదా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్!
గోలల గోల గోల యన కోయి!పరామృతధార గా నిధుల్
జోలెలు నిండగా సఖుడ జోస్యము చెప్పితి నిబ్బరించుమా !
జిలేబి
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొల్చుచు...
రిప్లయితొలగించండిగోలల మనీపరసులో
లీలలు గలవయ ! జిలేబులీను జిలేబీ
లే! లక్షణముగ వారికి,
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
జిలేబి
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాలేటిచూలి, శివసతి
రిప్లయితొలగించండికాలక,చతురానను శుభ గాదిలి యౌప్రో
యాలులకు పూజలిడి యా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాలక'?
కాలక. = పార్వతి ఆంధ్ర భారతి ఉవాచమ
తొలగించండిమూలపు టమ్మల రూపులు
రిప్లయితొలగించండిమేలిమి బంగరు నెలతలె మేదిని యందున్
తాలిమి గలిగిన వారౌ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీలవి పొంగునింట సిరి సేవలు జేసిన మానవాళికిన్
రిప్లయితొలగించండిమేలగు వాణి సేవలవి మేదిని కంతయు నింపు జ్ఞానమున్
చాలగ శక్తినిచ్చు సతి సన్నుతి జేసిన! నీక్రమంబునన్
*స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మేలగు వేతనమిడుచున్
రిప్లయితొలగించండితాలిమితో దిద్దుచుండు తప్పులనెల్లన్
కూలీలు నమ్రతగ మే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్!!!
శైలజ గారూ,
తొలగించండిమేస్త్రీలతో మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీహరి సతి లక్ష్మిని వేడగా కరుణను తానిడు
రిప్లయితొలగించండిస్థూల సంపద
బ్రహ్మకిల్లాలు చదువుల తల్లిగ ఒసగిన
జ్ణానమునదె నింపెద
షాపింగు మాలై సమస్తమునిచ్చు ఆలి
తానుగ వద్దనినన్
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము
గల్గు నిద్దరన్
వాలాయముగా పురుషుని
రిప్లయితొలగించండిమేలున్ గాంక్షించుచుండి మేదిని లోనన్
లాలించువార లౌటను
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్.
మేలును గోరువారలయి మేదినిలోసతతంబు నిష్ఠతో
చాల మృదూక్తులన్ పలుకు సన్మతు లామహిళల్ గనంగ నే
వేళను స్వీయసౌ ఖ్యమును వేడనివారలు మాతృమూర్తులా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిచాలా చక్కగ యిస్త్రీ
చేలల కొనరిచి ధరింప చెప్పెడు పూబో
డీ లలనలు సతులవుదురు
స్త్రీలకు మ్రొక్కిన, ధనమును శ్రేయముఁ గల్గున్ :)
జిలేబి
మీ నాలుగవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగరికిపాటి వారి పూరణ.....
రిప్లయితొలగించండిఆ లలితాంగి లేకయె గృహంబున కందము లేదు, లేదు బం
ధాలకు ప్రేమగంధము, సుధామయ లోకము లేదు, గేహ సం
చచాలకురాలు భామయె విచారణ జేయగ నట్టి యింటి మే
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.
మూడవ పాదం ప్రారంభంలో 'సం | చాలకురాలు...' అని సవరణ...
తొలగించండిరాలకు మ్రొక్కుచు పూజలు
రిప్లయితొలగించండిమేలని నిరతము జేయ మిక్కుట ముగనే
మాలిమి సతితో ప్రియముగ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. 'నిరతమ్ము' అంటే సరి!
రాలకు మ్రొక్కుచు పూజలు
తొలగించండిమేలని నిరతమ్ము జేయ మిక్కుట ముగనే
మాలిమి సతితో ప్రియముగ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశ్రీలలితాంగి , సర్వసురసేవితదివ్యపదాబ్జ లక్ష్మి ., వా...
గ్జాల కృతాంగి శారద విశాల దయానిధి., సింహగామియౌ
ఫాలవిలోచనార్ధతనుభాసితశైలజ మాతృమూర్తులీ
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ఉత్కృష్టంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
సందర్భము: సులభము.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
మేలుకొరకు దేవతలౌ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును
శ్రేయముఁ గల్గున్..
జాలము మేలా! మొక్కుల
నేలా చెల్లించుకొన రిసీ! నరు లధముల్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
14.6.18
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండివేలకు వేల ధనమ్మును
చాల సమర్థులుగ "యైటి" సంగతి గనిరే :)
గోలలు వలదువలదనకు !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీహరి సతి లక్ష్మిని వేడగా కరుణను తానిడు
రిప్లయితొలగించండిస్థూల సంపద
బ్రహ్మకిల్లాలు చదువుల తల్లిగ ఒసగిన
జ్ణానమునదె నింపెద
షాపింగు మాలై సమస్తమునిచ్చు ఆలిని
నీవే గతియన్నన్
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము
గల్గు నిద్దరన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిచాలగ సగభాగంబై
పాలకులై మనగ గనమె ప్రార్థన లందన్
లీలగ గోర్కెల దీర్చెడు
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కూళల నమ్మిన చో పరి
రిప్లయితొలగించండిపాలనమందునను మంచి ఫలము కలుగునే?
మేలగు హృదయము గల శా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపాలిత లోక వత్సలుడె, పట్టడు నా మొర మంగ!చెప్పవే
లీలగ నిన్ను జేరు తరి లేమల లాలన నాలకించు, నీ
జాలము నోప జాలనను చక్కని గాయకు ఘంటసాల రా
గాలకు తల్లియే కదలి కావగ రాదె పవిత్ర దేవతా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రఘయము శౌర్యము గల్గు నిద్ధరిన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిబేలలు బేలలనకు ! కర
వాలము బట్టిరి తుపాకి వాటము గనిరే !
కేలుమొగువు మానవుడా!
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
బాబోయ్! కడుపు నొప్పి!
తొలగించండి
తొలగించండి:) ఇంకా వుంది :) వస్తోంది :) తస్సాదియ్య గురువు గారిక ఇట్లాంటి సమస్య లివ్వనే లివ్వరు :)
నెనరుల్స్ :)
జిలేబి
ఇన్ని పద్యాలు చూసాక బేలలని ఎలా అంటాం?
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపాలిత లోక వత్సలుడె, పట్టడు నా మొర మంగ!చెప్పవే
లీలగ నిన్ను జేరు తరి లేమల లాలన నాలకించు, నీ
జాలము నోప జాలనను చక్కని గాయకు ఘంటసాల రా
గాలకు తల్లియే కదలి కావగ రాదె పవిత్ర దేవతా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రఘయము శౌర్యము గల్గు నిద్ధరిన్
రిప్లయితొలగించండిచాలమి లే, తిరుగాడిరి
గోళము లన్తిరిగిరి భళి గూగుల్ లో మీ
లా లక్షలను గడించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
రిప్లయితొలగించండిజోలెలు బట్టిరి మగవాం
డ్లే !లెస్సగనయిరి మగువలే లబ లబలే
లా ! లావణ్యవతులయా !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
__/\__
తొలగించండిఏలలనామణుల్ హరినినీశుని బ్రహ్మను ప్రేమనెల్లెడన్
రిప్లయితొలగించండిలాలనతోడ కొంగుకొనలందున బంధన చేసియుంచిరో
యాలలనా మనమ్ములు దయామయమైనవి యట్టి దేవతా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
(చిరు ప్రయత్నం)
సూర్య నారాయణ గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలు మాష్టారు
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2706
సమస్య :: *స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.*
ఆడవాళ్లకు మ్రొక్కితే ధనము ధైర్యము శుభము కలుగుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: ధనాన్ని ఇచ్చే లక్ష్మీదేవి స్త్రీ. చదువును సంస్కారాన్ని ఇచ్చే సరస్వతీదేవి కూడా స్త్రీయే. చాలమి అంటే అశక్తతను తొలగించి ధైర్యాన్ని శౌర్యాన్ని ఇచ్చేది కూడా స్త్రీయే. కాబట్టి శ్రీ వాణీ గిరిజా స్వరూపిణులైన స్త్రీలకు మ్రొక్కితే ధనము శౌర్యము శ్రేయము తప్పకుండా సిద్ధిస్తాయి. *యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః* అని విశదీకరించే సందర్భం.
శ్రీల నొసంగు *లక్ష్మి వలె చిందులువేయును స్త్రీ* గృహమ్మునన్
శీలము గూర్చు *వాణి వలె శ్రేయము గూర్చును స్త్రీ* యె సర్వదా
చాలమిఁ ద్రుంచు *గౌరి వలె శౌర్యము గూర్చును స్త్రీ* యె కావునన్
స్త్రీలకు మ్రొక్కినన్ *ధనము శ్రేయము శౌర్యము* గల్గు నిద్ధరన్.
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (14-6-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిసుప్రసిద్ధ కవి పండితులగు
తొలగించండిశ్రీ రాణి సదాశివ మూర్తి గారు చేసిన ప్రశంస శ్లోకరూపంలో...
పద్యాదౌ విద్యతే లక్ష్మీః
పద్యమధ్యే సరస్వతీ|
తతః స్థితా శుభా గౌరీ
శుభదే పద్యశేఖరే||
🙏🙏🙏👌💐💐💐
పాలను పాపలకిడి, తా
రిప్లయితొలగించండిపాలను జల్లార్చుదురుగ పతిలో సగమై
పాలన జేయు గృహిణులౌ
"స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు ద్వారా నేను మిమ్ములను ఎప్పుడు పరిచయం చేసుకున్నానో మర్చిపోయాను.
కానీ, బ్లాగులోని పెద్దలు, ముఖ్యంగా మీరు ఇచ్చే training తో కొన్ని పద్యాలు వ్రాసే నైపుణ్యం పొందాను.
పండిత శ్రీ నేమాని వారు , వరప్రసాద్ గారు పోస్ట్ చేసిన పాఠాలు నేను అనుసరిస్తూ వచ్చాను.పండిత శ్రీ ఏల్చూరి వారిని కలిసి , చర్చించి, వారి సలహాలను అనుసరించాను.
భగవత్కృపతో మీవంటి పెద్దల ఆశీర్వాద బలంతో " ఉత్సాహ రాఘవ శతక కావ్యము " అనే పేరుతో , అన్నీ ఉత్సాహ వృత్తంలో, 117 పద్యాలను రచించి పదిలంగా భద్రపరచుకున్నాను. ఇది 2014 సంవత్సరంలో పూర్తి అయింది. అప్పుడే శివుడి మీద కూడా పద్యాలు వ్రాద్దామనుకున్నాను. కానీ ఈశ్వర కటాక్షం కొరకు వేచి యున్నాను.నిత్యాభిషేకాలతో స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించాను నేటికి శివుడు నాపై తన కృపాదృష్టిని ప్రసరిస్తున్నాడని అనిపిస్తున్నది. 4 సంవత్సరాల కాల వ్యవధి తరువాత ఇప్పుడే శంకరుని పద్యాల సేవకు శ్రీకారం చుట్ట బడింది.
అయితే, ఉత్సాహ వంటి వృత్తాల జోలికి పోకుండా, అందరికీ తెలిసిన వృత్తాలు, కంద వంటి ఛందస్సులనే ఎన్నుకుంటున్నాను.
గతంలో కూడా నా పద్య రచనా ప్రయాణంలోని విషయాలు, విశేషాలు అన్నీ మీకు తెలియ జేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అలాగే విన్నవించుకుంటున్నాను. Whatsapp ద్వారా మీకు సందేశం పంపుదామని ప్రయత్నించాను. చేతకాలేదు. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను.
🙏🙏🙏🙏🙏
తొలగించండివామన కుమార్ గారూ,
తొలగించండిసంతోషం. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. కొనసాగించండి. స్వస్తి!
నా వాట్సప్ నెం. 7569822984.
వాలిన భక్తిని కొల్వగ
రిప్లయితొలగించండివైళమ ముగురమ్మలే శుభంబుల నిడరే!
శ్రీ లలితాంబకు 'ప్రతి'యై
స్త్రీలకు మ్రొక్కిన ధనంబు ప్రేమను గల్గున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రతియౌ' అంటే బాగుంటుందేమో?
ఆలయముల కరుగుచునే
రిప్లయితొలగించండిరాలకు మ్రొక్కంగ నేమి లాభమది సఖా!
నేలను గల దేవతలగు
"స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్"
బాగా చెప్పారు! 👌🙏
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్తీలకు మ్రొక్కిన ధనంబు శ్రేయము గల్గున్
రిప్లయితొలగించండిమేలగు వర్తన ల్ గలిగి మిన్నగనందరిమె ప్పులందు చు న్
రిప్లయితొలగించండిజాలియు ప్రేమ లొ ల్కకడు శాంత మనస్సు న దాన ధర్మ ము ల్
తాలిమి తో నొ న ర్చుచు ను ధార్మిక చింతన సత్య పాల నా
స్త్రీల కు మ్రొక్కినన్ ధనము శ్రేయ ము శౌర్య ము గల్గు నిద్ధ ర న్
కరణం రాజేశ్వర రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబేలలు గాదు గాదు మరి భీరువులై చనువారు గాదు పూ
రిప్లయితొలగించండిమాలల నివ్వగా మురిసి మైమరచే మతు లింత గాదు లే
పాలను బెట్టు దల్లిగను బాలనఁ జేయు కృపాసముద్రులే
*"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"*
శ్రీ సూరంవారికీ, శ్రీ చక్రవర్తిగారికీ కృతజ్ఞతలతో
తొలగించండిసవరసవరింంచిన పద్యం
బేలలు గాదు గాదు మరి భీరువులై చనువారు గాదు పూ
మాలల నీయగా మురిసి మైమరపుల్ గనువారు గాదు లే
పాలను బెట్టు దల్లిగను బాలనఁ జేయు కృపాసముద్రలే
*"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాలన జేయును జగతిని
రిప్లయితొలగించండిలాలనతో నూయలూపి లక్ష్యము కొఱకై
క్రాలుచు, కనలుచు, శ్రమపడు
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
***)()(***
"The hand that rocks the cradle rules the world"(N.G.Damle)
"ఊయల నూపెడి చేయి ప్రపంచాన్ని పాలిస్తుంది"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమేలుగ విద్యల నేర్చిరి
కాళికలై కదము ద్రొక్కి ఖండాంతరముల్
మూలకు మూలల వెళ్ళిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెళ్ళిరి' అన్నది వ్యావహారికం. "పోయిరి" అనండి.
లాలన జేయుచు పాపల
రిప్లయితొలగించండిపాలనలో పాలుగొనుచు పదవుల గొనుచున్
మాలిమి తాలిమి గలిగిన
స్త్రీలకు మొక్కిన ధనమును శ్రేయము గల్గున్!
తాలిమితో ధనము, మాలిమితో శ్రేయము!
అ మ్మా ! సీ తా దే వి గా రూ ! చ క్క ని పూ ర ణ ! !
తొలగించండిధన్యవాదములండీ! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిలాలన జేయుచున్ కులము లాగుచు నోర్పున కాపురమ్మునే
తొలగించండిపాలన జేయగా దగిన పాటవ మొప్పగ
నేర్పున కార్యశాలలన్
మాలిమి తాలిమిన్ గలిగి మాతలు నేతలుగా రమించునా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గునిద్ధరన్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదెులు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిధన్యవాదములు!🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅమ్మ జయలలిత :)
లాలిత్యం బొప్పెడు నట
నా లావణ్యముల జూపి నవరసముల ధా
రాళముగ "అమ్మ" గనయిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండికందం
శ్రీలన్ గూర్చును మాధవి
మేలిమి విద్యలనొసంగు మేదావిని,తా
నై లావొసంగ శివ యీ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆదిశక్తి ఇందిరమ్మ
ఏలెన్ దేశము బింద్రన్
వాలేలన్నడచెను భళి బాంకుల జాతీ
యాలై నిల్పెను వినుమా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
స్త్రీలె ప్రపంచసృష్టికి బ్రదీపముగా వెలుగొందు చుందు రా
స్త్రీలను బాధవెట్టు మనిసిన్ , దన తల్లిని సాక నట్టి యా
పాలసునిన్ దహించినను బాపము లేదుగ | పెద్దవార లౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిధ్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బాధపెట్టు మనుజున్' అనండి.
ఆలయముల నిర్మించుచు
రిప్లయితొలగించండిరాలనె యనువగు నివాస రత్నమ్ములుగా
తేలికగా జేసెడి మే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***)()(***
ఆలయములు = ఇళ్ళు;గృహములు
మ్రొక్కిన = నమ్మి యాశ్రయించిన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆమ్రపాలి
పాళీ బట్టి కలెక్టరు
లై లెస్సగ నామ్రపాలి లా యేలిరయా
మూలంబయ్యిరి ప్రగతికి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ్రోలనొదిగియుండి,తన
రిప్లయితొలగించండిప్రాలవిభవముకొసరెడు సురజ! గృహమునకున్
వ్రాలుకతన, కడుభక్తిన్
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణదోషం. "...యుండియు తన" అనండి.
రిప్లయితొలగించండిబాలీవుడ్ టాలీ వుడ్ అన్ని వుడ్సూ మావే :)
బాలీ వుడ్డును నేలిరి
టాలీ వుడ్నందు బావుటా లెగరేయం
గా లావై వెల్గిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
ఇప్పుడు హాలీవుడ్డు కూడ, ప్రియాంకతో!
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆకాశం మాదే :)
గాలిని నడిపిరయ విమా
నాలను నేర్హోస్టెసులుగ నాణ్యపు సేవల్
లాలించుచు పాలించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
జిలేబి గారి జైత్రయాత్ర! ఇదివరకు 8 పూరణలు మీ రికార్డుగా పేర్కొనడం జరిగింది! ఈ రోజు య్ప్పటికే 12 అయ్యాయి! ఇంకెన్న్ రాబోతాయో! గిన్నిస్ బుక్ కు పంపుదామా! 👏👏🙏🙏
తొలగించండిఇప్పటికే•
తొలగించండిఎంత మార్పు! ఎంత మార్పు! ఏడాది క్రితం ఇదే సమస్యకి రెండే రెండు పూరణలు! జిలేబీ పాకం అంటే ఇదేనేమో!
తొలగించండిసూర్యకాంతం గుండమ్మలు:
తొలగించండిమేలును కోరిన వాడా!
మాలిమితో కాళ్ళుబట్టి మమతలు మీరన్
వేలు విరుచు గయ్యాళీ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
తొలగించండిఏడాది ముందు లింకెక్కడండీ ?
జిలేబి
Secret!
తొలగించండిమీ తాజా రెండు పూరణలు బాగున్నవి (అని అనక చస్తానా?). అభినందనలు.
తొలగించండిఈ ముసలాడిని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు!
రిప్లయితొలగించండిస్పిరిట్యువల్ ' క్వీన్ డమ్ ' మాదే :)
లాలను జూపుచు మాతా
శ్రీలై సంస్థాపకులుగ సిద్ధిన్ బుద్ధిన్
మేలుగు నిల్పిరి గారే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి
రిప్లయితొలగించండికాలక.= పార్వతి ఆంధ్రాబారతి ఉవాచ
__/\__
తొలగించండి
రిప్లయితొలగించండిమాలాల యూసఫ్
మాలాలా యూసఫులుగ
మూలాల నెదిరిచినారు మూలంబయి పూ
మాలై భువినే చుట్టిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరదాగా....
రిప్లయితొలగించండిరాలను బాదుళ్ళకు, దం
డేలను వ్రేలుళ్ళ, కెండ డీడిక్కులకున్
కాలిన వాతల నగువి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాలిమితోడ చూచుచును మందిరమందున నత్తమామలన్
రిప్లయితొలగించండితాలిమితోడ వర్తిలుచు తద్దయు ప్రీతిని భర్తఁ బ్రోచుచున్
కాలమునంతయున్ కడు నకల్మష బుద్ధి చరించు నా కుల
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబేలగ నుండక దు ష్ టు ల
రిప్లయితొలగించండిలీలలు ఖండించ బూను లేమలు కవిత ల్
వై ళ మె రచింప వె రు వ ని
స్త్రీ ల కు మ్రొక్కిన ధనము ను శ్రేయ ము గల్గు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేలను పురుషున కమ్మయు
రిప్లయితొలగించండినాలియు చెల్లియును వదిన యత్తయు సుత వే
యేలా సర్వము వారే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాలములకు సబబుతెలిపి
రిప్లయితొలగించండిఆలిగ మగనికి సరియగు ఆర్థిక మంత్రై
మాళిగను తీర్చిదిద్దెడి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మంత్రి + ఐ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వసుంది.
మేలుగ వాణీ లక్ష్మీ
రిప్లయితొలగించండిశూలిసతీ పావనానసూయా సీతా
లీలావతీ ముఖ మహా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
కాలము నుత్తరించ నతి కౌతుక మందునఁ బౌర వాసమై
ప్రోలులు వెల్గ నింపుగ సరోవర భాసిత నారికేళ స
త్తాల పలాశి సస్య ఫల ధాతు సుసంహిత సంగ తేద్ధ శా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
[శాస్త్రి+ఇల = శాస్త్రీల; శాస్త్రి = శాస్త్రవిదుఁడు]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధూళిగ నుండి రామపద ధూళికి నోచిన యామె, ధాత్రి పాం
రిప్లయితొలగించండిచాలిగ మించు నామె, ధరజాతగ రాముని గొన్న యామె, యా
వాలికి నైన యామె, దశవక్త్రుని రాణిగ నున్న యామె యీ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.
👏👏👏
తొలగించండి"పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్"
🙏
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిస్త్రీలనుజేయకుచులకన
రిప్లయితొలగించండిస్త్రీలేమనప్రాణసములుజీవించుటకున్
స్త్రీలన శక్తులె యగుటన
స్త్రీలకుమ్రొక్కినధనమునుశ్రేయముగల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలుని మెప్పు పొంది పతి గాచిన భార్య, బిరాన నాథునిం
రిప్లయితొలగించండిదేలని భక్తి వేశ్య కడ దింపిన సాధ్యి, వనాన నిద్రలో
జాలిని వీడి వీడిన ప్రజాపతి రాణియు నెన్న ధాత్రి నీ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి🎂శంకరాభరణం🎂
రిప్లయితొలగించండినేటి సమస్య:---
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యముఁ గల్గు నిద్ధరన్"
మూలపుటమ్మలైన ముగ్గురు స్త్రీలు దేవతలు,
పురుషుల జీవనగమనం లో ముఖ్యమైన ఆరు పాత్రలను నిర్వహించుట లో అద్వితీయులు స్త్రీలు,
అందుకే సంస్కృతకవి స్త్రీపారమ్యాన్ని ఈ క్రింది శ్లోకంలో వర్ణించాడు.
"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ
రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా శయనే తు రంభా
షట్కర్మయుక్తా కులధర్మపత్నీ." అని.
ఆ కవి భావన మేరకు ఇన్ని రూపాలలో ఆదుకునే
స్త్రీలు దేవతాస్వరూపులే అనే భావన లో నా పూరణ.
మేలిమిరూపమందు సిరి, మిక్కిలి యోర్పును జూప ధాత్రియౌ,
మౌలికసూచిత మ్మొసగ మంత్రి, క్రియాపరిచర్య దాసియౌ,
తాలిమిఁ దిండి కూర్చు నెడఁ దల్లియె, రంభయె శయ్యలందహో!
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యముఁ గల్గు నిద్ధరన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీలము ధావన్,యర్చన,
రిప్లయితొలగించండిబాలా దేష్ పాండె,వింత బాలియు ఘనులీ
నేలన బుట్టిన వారల్,
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్
గొప్ప పారస్రామిక వేత్తలు పై వారు
లీలావతి కనెను ఘనుడౌ
రిప్లయితొలగించండిబాలకుని,యతండు భక్త ప్రహ్లాదుండై
పాలన జేసె నసురులను,
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్టాక్ మార్కెట్ మాదే :)
డీలింగురూము, నెక్స్చేం
జీలన్,స్టాక్మార్కెటున గజిబిజియు లేకన్
వాలెట్లన్నింపిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికండెక్టరుగిరి, డ్రయివింగు మాదే :)
చాలా చక్కగ నార్టీ
సీలో కండెక్టరులయి జిలుగులొలుకుచున్
ఓలాడ్రైవర్లయిరే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితలపై కిక్కు సైడుకిక్కు మాదే
భోళా శంకరు తలపై
మాలిని సుఖదగ నిముడుచు మరి నిల్లాపై
శైలజగా నిల్చిరిగా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిలోలకము మేమే మా లోక మి మేమే :)
బాలకుమారా! వినుమో
యీ ! లోలకము వలె తిరుగు యింతులకు కడున్
మాలోకంబై చుట్టెడు
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితాళిని గట్టి యాలి యని తన్నుచు దిట్టుచు గొట్టి త్రావుచుం
రిప్లయితొలగించండిదూలుచు సొమ్ము లిమ్మనుచు దోచుచు దాచిన డబ్బు చాలకా
తాళినె త్రెంచి యమ్ముకొను త్రాష్టుల బాధల కోర్చుచున్న యా
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.
రిప్లయితొలగించండికూలను వేయ రావణుని గూడదు రాజ్యము రామమూర్తికిన్
జాలిని వీడి కానలకు జయ్యన పంపు మటన్న వేలుపుల్
నేలను గొప్ప పాపి యని నింద భరించిన కైక బోలు సు
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిస్త్రీలననాదిశక్తులిల,జీవనదాతలుగూడనేర్వుమా
రిప్లయితొలగించండిమేలములాడబోకనుసమైక్యపుబుధ్ధినిగారవించుచున్
లాలనతోడజూచునెడ రాజిలుమోముననుండునట్టియా
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
సందర్భము: సర్వమంగళాలకు మూలమైన మువురమ్మలను కీర్తించిన అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి
*శ్రీ లలితాంగి* అన్న పద్యానికి ప్రశంసగాను... సమస్యకు పూరణంగాను...
*శ్రీ శ్రీ శివలు*= లక్ష్మీ సరస్వతీ పార్వతులు..
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
మేలయిన పద్య మిదియే!...
మే లొనగూడుటకు మువురు
మేదిని ముఖ్యుల్..
మూలము.. *శ్రీ శ్రీ శివ* ...లా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును
శ్రేయముఁ గల్గున్..
మరొక పూరణము..
సందర్భము: గృహస్థాశ్రమాని కాధార భూతమైన గృహిణి ప్రాధాన్యాన్ని ఆవిష్కరించిన అవధాని శ్రీ కోటరాజశేఖర్ గారి
*శ్రీల నొసంగు లక్ష్మి* అన్న పద్యానికి ప్రశంసగాను... సమస్యకు పూరణంగాను...
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
మేలయిన పద్య మిదియే!...
మే లొనగూడుటకు మువురు
మెలతలు ముఖ్యుల్..
మూల.. మటులె *గృహిణు* లయిన
స్త్రీలకు మ్రొక్కిన ధనమును
శ్రేయముఁ గల్గున్..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
14.6.18
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరేలు బవళ్ళును మాయని
రిప్లయితొలగించండిమాలిమితో మురళిధరుని మధురానురతిం
గ్రోలి తరించిన గోపీ
స్త్రీలకుమ్రొక్కినధనమునుశ్రేయముగల్గున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మురళీధరుడు' సాధువు కదా!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము
శౌర్యము గల్గు నిద్ధరన్
సందర్భము: దేవతలను పిలువా లంటే ఒక పద్ధతి ప్రకారమే పిలువాలి. అడుగా లంటే ఒక పద్ధతి ప్రకారమే అడుగాలి. మంత్ర జపాలకు ఖచ్చితమైన నియమాలూ వున్నవి. పాటించకపోతే బెడిసికొడుతాయి కూడ.
శ్రీ మతులను ఎలా పిలిచినా సరే!
(ఒసేవ్! అన్నా పలుకుతూనే వున్నారు కదా! 'ఎక్కడ చచ్చావ్' అన్నా వస్తూనే వున్నారు కదా!) అడుగక ముందే ఇస్తూనే వున్నారు గదా! తమ మాంగల్యం కోసమైనా అన్నీ భర్తలకు సమకూర్చి యిల్లు చక్కదిద్దుకుంటూనే వున్నారు గదా! వ్యసనపరులనూ భరిస్తూనే వున్నారు గదా!
అందువల్ల లక్ష్మీ సరస్వతీ పార్వతుల కన్న మన గృహిణులే గొప్పవారు కారా! మీరే చెప్పాలి మరి!!!
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
మేలుగఁ బిల్వగా వలయు;
మేలుగనే యడుగన్ వలెన్ గదా!
శ్రీ లును విద్య లీయగను
శ్రేయము లీయగ మువ్వు రమ్మలన్..
లీలగఁ బిల్చినన్ బలుక
లే మన; రిచ్చెద; రింటి దివ్వెలౌ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము
శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
14.6.18
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసీయెమ్ములు రాష్ట్రపతులు మేమే
లోలాక్షులు సీయెమ్ములు
గా లలనల్ " రాష్ట్రపతులు " గా మన దేశా
న్నేలిరి మహాజనులుగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ రోజు పద్యాల వరద చూస్తూంటే కళ్ళు తిరుగుతున్నాయి! ఒక స్త్రీ అనే అంశం కవిత్వానికి యెంత స్ఫూర్తిగాయకమో తెలుస్తున్నది!
రిప్లయితొలగించండిజిలేబిగారితో పోటీపడి మిస్సన్నగారు కూడ పద్యాల ప్రవాహం కల్పించారు!
శ్రీమాత్రే నమః! 🙏🙏🙏🙏
సంతోషించి ప్రోత్సహించ దగినదే... కాని నాకు శ్రమ ఎక్కువయింది.
తొలగించండిఅవును గురువుగారూ! మీ ఓపికకు జోహార్లు! పోటీ ఉండాలి కాని మరీ వేలం వెర్రిగా కాదు! 🙏🙏🙏🙏
తొలగించండిఇందిరాగాంధి
రిప్లయితొలగించండివేలెత్తి చూపి నెపములన్
కాలి దిగువ తేలువోలె కట్టడి నిడుచున్
యేలెగద ఘనత నిందిర ,
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
కొడుకు ప్రేమకు దూరమైన స్త్రీ
రిప్లయితొలగించండిలాలించి బుజ్జ గించుచు
పాలను త్రాగింఛి పెంచు పడతుక లెపుడున్,
కాలిడి తన్న వెత పడని
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
సీత
రిప్లయితొలగించండికాలమునకు తల వంచుచు
మాలిన్యపు ననుమితి లేక మసలెన్ వనిలో
బేలయగు సీత, ఘనులగు
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
సావిత్రి
రిప్లయితొలగించండికాలుడు పతినిగొనివెడల
మాలిమి తోడ సమవర్తి మనమును మార్చెన్
బేల తనపు సావిత్రే,
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
అనసూయ
రిప్లయితొలగించండిచేలము నువిడిచి మెయిపై
బాలుల జేసి తినిపించె పావని యనసూ
యే లోకము నుతించగ
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
ద్రౌపది
రిప్లయితొలగించండివాలాయ మనుచు నొవ్వక
నాలిగ ద్రుపద తనయ నాస్వా దించెన్
పాలకులైదుగురనుచున్
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
దమయంతి
రిప్లయితొలగించండిమాలను స్వయంవ రములో
వాలుగ నలునిమెడలో న వైచగ పొందెన్
బేల దమయంతి బాధలు
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
జాలియు జన్మగల్గి మనజాలగయింటనుమంచిబెంచుచున్
రిప్లయితొలగించండితాలిమిచేత వంశమును ధర్మపదంబునలక్ష్యసాధనా
పాలనజేయుతల్లులన?భక్తిగ,శక్తిగ దేవతల్ వలే
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము,శ్రేయము,శౌర్యముగల్గునిద్దరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనజాలగ నింటను... వలెన్" అనండి.
మదర్ ధెరీసా
రిప్లయితొలగించండిలాలన తోడ ధెరీసా
వేల జనుల నిచట గాచె వేదన లేకన్
యీ లోకము జనని యనగ,
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
పార్వతి
రిప్లయితొలగించండిబాలుని బొమ్మను జేసి క
పాలిని ప్రాణము నిడ, గణపతిగా వెలసెన్ ,
కాలుడు శిరంబు నిడగన్ .
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
తాలిమి కుపమానమ్ముగ
రిప్లయితొలగించండిమేలొనరించన్నదులన మేదిని దేవత
లై లెస్స గాంచు మరి యా
స్తీలకు మ్రొక్కిన ధనమును శ్రేయము గల్గున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం చివర గణదోషం.
లక్ష్మి
రిప్లయితొలగించండిపాల పరాంగవపు తనయ
పాలకడలి శయనుని సతి ,పద్మిని, భువిలో
పాలనము జేయు ఘనతన్.
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
సరస్వతి
రిప్లయితొలగించండివేలుపుల పెద్ద బ్రహ్మకు
నాలిగ మదిలోన జేరిన భగవతి, ప్రో
యాలు నొసంగును జ్ఞానము,
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(హా మాయా! హా మమతా! హా కనిమోజీ!)
"మూలుగు మానుమయ్య! విడు! మోడిని గాంచిన దుగ్ధలన్నియున్
చాలిక నెగ్గజాలవుర చప్పున దర్పము నుజ్జగించుచున్
కాళిని వోలెడా మమత కాళ్ళకు; మాయల మారులయ్యెడిన్
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్!"
(సోనియా రాహుల్ తో) 👆
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభూమాత
రిప్లయితొలగించండిచేల కొరకు తన మేనును
బాళిని బడక నిడు నట్టి భరణి జనులకున్
లాలించెడు జనని గదా
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
నదీమ తల్లి
రిప్లయితొలగించండితాలిశములోన బుట్టుచు
నేలన రయముగ పరుగిడి నెయ్యము తోడన్
చేలను తాకుగద నదులు .
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
దేవకి, యశోద
రిప్లయితొలగించండిజైలున బాలుని కని, తన
పాలన వలదని యశోద పావని కడకున్
తోలెను దేవకి, ఘనమౌ
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
అరుంధతి
రిప్లయితొలగించండితాళిని గట్టి జనులు జడ
దాలుపుడు వసిష్టు సతిని తలతురు ఘన కౌ
డీల నిడి నరుంధతికిన్,
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ 15 పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఇందిరాగాంధి పూరణ మొదటి పాదంలో గణదోషం. "నెపముల' అంటే సరి! అలాగే "కట్టడి నిడి తా । నేలెగద.." అనండి.
సీత పూరణలో రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
సావిత్రి పూరణలో "సావిత్రియె" అనండి.
అనసూయ పూరణలో "అనసూయయే" అనడం సాధువు. అక్కడ సంధి లేదు.
ద్రౌపది పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
మదర్ థెరిస్సా పూరణలో "వేదన విడి తా ।నీలోకపు..." అనండి. 'లేక' కళ. 'లేకన్' అనరాదు.
సరస్వతి పూరణ రెండవ పాదంలో గణదోషం.
వకుళా దేవి
రిప్లయితొలగించండిఆలిని వెదుకుచు యా సుడి
వాలుదొర భువికి నడుగిడ వకుళ నెనరుతోన్
లాలించె తిరుమల విభుని,
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
మీ వకుళాదేవి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెదకుచు నా సుడి...' అనండి.
రిప్లయితొలగించండిజోలల్ పాడిరి తల్లులు
గా లలనామణి బసాలు గా తీపి జిలే
బీలయిరే బామ్మలు గా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబ్లాగులో అరవై ఆరు కందాలయ్యేయి
వందా ఎనిమిదికి ౪౨ తక్కువ కాయ్ రాజాకాయ్ :)
జీపీయెస్ వారు వాట్సప్ లో ఇవిగానివి యెన్ని కందాలొచ్చేయి ?
మరో శతకం తయార్
జిలేబి
లేలే జిలేబి కనుమీ
రిప్లయితొలగించండిగోల కవన రణములోన, కూర్చితి నే ప
ద్యాలను సమస్య యగు నా
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
చాలును నేటికి సమరము
రిప్లయితొలగించండిప్రేలును బాంబులు, గురువులు పెట్టు చివాట్లన్
మాలిని జిలేబి , ఘనులౌ
స్త్రీలకు మ్రొక్కిన ధనమున్ శ్రేయము గల్గున్
__/\__
తొలగించండి
రిప్లయితొలగించండిజాలీ జాలీ గా ప
ద్యాలల్లుచు శతకమునకు దారిన్ గనిరీ
వేళ విషయము పడతిగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!
జిలేబి
__/\__
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజిలేబీ... గారికి.. ఆశీస్సులతో..
రిప్లయితొలగించండిఅరువది యేడు కందములు
నందముఁ చిందుచు దూకెనే భళా!
తిరముగ నూరు పద్యముల
దివ్యముగా రచియింపు మమ్మ!
~డా వెలుదండ సత్యనారాయణ