ఆహ్వానం
పుస్తకావిష్కరణ సభ
కంది శంకరయ్య సగర్వంగా సమర్పించు
“జడ కందములు – మా కందములు”
116 కవుల పద్య
సంకలనం
ఆవిష్కర్త : శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు
---oOo---
“తిరుప్పావై గజల్ మాలిక”
రచయిత్రి : డా.
ఉమాదేవి జంధ్యాల
ఆవిష్కర్త : గజల్ కవులు శ్రీ టి.వి.యస్. రామకృష్ణ ఆచార్యులు గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు
---oOo---
వేదిక : వడ్డేపల్లి
కమలమ్మ సీనియర్ సిటిజన్స్
భవనం,
పోస్టాఫీసు ప్రక్కన,
వివేకానంద నగర్, కూకట్
పల్లి, హైదరాబాదు.
తేదీ : 8 – 7 – 2018 (ఆదివారం)
సమయం : (కచ్చితంగా) సా. 4 గం. నుండి సా. 6 గం. వరకు.
ఆహ్వానించువారు
:
‘శంకరాభరణం’ ప్రచురణలు & జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాదు.
‘ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, కూకట్ పల్లి చాప్టర్ వారి సౌజన్యంతో…
గ్రంథపుష్పద్వయావిష్కరణ సౌగంధ్యసంపన్నమగుగాక!!
రిప్లయితొలగించండిజడ పద్య పుష్పాలతో విజవంతంగా వెలుగొందుగాక.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసమూహములో నందరికి శుభాభినందనలు
జిలేబి
మీరు వస్తున్నారు కదా సభకు!
తొలగించండి
తొలగించండిఅవునండి. జిలేబి లేకుండా సభయా ! నెవర్
జిలేబి
😊
తొలగించండిఅందరికీ శుభాకాంక్షలు!💐💐💐💐
రిప్లయితొలగించండి116 మంది కవులకు శుభాభినందనలు. గురువుగారికి నమస్సులు
రిప్లయితొలగించండి౧౧౬ కవులతో ఇది తొలి మెట్టు గురువు గారు ఇటువంటివి అ సంఖ్యాకముగా చేసి ఉన్నత శిఖరాల పై విహరించాలని ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని ౧౧౬ మంది కవుల తరుఫున నేను దేముడిని ప్రార్ధిస్తున్నాను అబినందనలతో
రిప్లయితొలగించండిగురువు గారి పద పద్మములకు ప్రణామములతో
జడపద్యమేటికవులకు
రిప్లయితొలగించండినిడుదునునేభక్తితోడ నిమ్ముగనతులన్
నడకువనుకందిసామికి
మెడకాయనువంచియుందుమెండమువోలెన్
'జడ కంద ము లు -మాక oదములు ' పుస్త కావి ష్ కరణ సభ జయప్రద oకా వా లని ఆకాంక్షిస్తున్నాను
రిప్లయితొలగించండికరణం రాజేశ్వర రావు -హిందూ పురం
ప్రణామములు గురువుగారు..అందరకూ శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిజడకవులకు అభినందన సుమములు.
రిప్లయితొలగించండిగజల్ మాలిక కవయిత్రి డా. ఉమాదేవి గారికి,
రిప్లయితొలగించండిసమీక్షకుడు తమ్ముడు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మకు అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువులకు పండితులకు పెద్దలకు ప్రణామములు . కవిమిత్రులకు శుభాభి నందనలు .
నేదునూరి. రాజేశ్వరి.
U.S .
పాల్గొన్న వారందరికీ అభినందనలు. శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి_()_ _()_ _()_
రిప్లయితొలగించండిగురువర్యులకు ,కవిమిత్రులందరికి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిజడకందం మా కందములకు శుభాకాంక్షలతో
సవాలాయెన్ రాణీ మదితిరిగె నీ సన్నిధిన్ కోరుచున్ మే
ఘవర్ణంబై సర్పంబువలె కదిలెన్ కాంతివంతంబుగా నీ
దు వేణీ! పూబోణీ! లలన! మగువా! దువ్వినావే వయారీ
రవేసాకుల్తెమ్మా కవివరులకై రా! సభాప్రాంగణం బి
ద్ది వేంచేపుల్ కందమ్మునకు తిరికిన్ తీర్థమిద్దే శుభాంగీ!
జిలేబి
రిప్లయితొలగించండివేణీ! కందపు పద్యమాలికలివే వేగంబుగా రమ్మ ! శ్రీ
వాణీ పుత్రులు నిన్ను మెచ్చి వరుసన్ పారించినారివ్వి! పూ
బోణీ! నాల్గనగంట కొట్టగ భళా పొత్తమ్ము ప్రాప్తంబగున్
కాణీ లెక్కలజేర్చి కూర్చినవివే ! కాంతామణీ రా గొనన్!
జిలేబి
అందములు వాణి కీ జడ
రిప్లయితొలగించండికందములు మనోజ్ఞమైన కైతల కివి సం
బంధములు కావ్య వన మా
కందములును తెలుగు తల్లి కచబంధము నౌ.
సంధ్యా కాలమునందు గోపికలతో సంరంభమై యుండ స
రిప్లయితొలగించండిద్వంద్యుండౌ హరి యాలకించెను తిరుప్పావై గజల్మాల సౌ
గంధ్యమ్ముం గొనియాడ వక్త,, లడిగెన్ కన్నయ్య వైనమ్ముకై,
"జంధ్యాలాన్వయ రత్న మ య్యుమ కృతిన్ శ్లాఘించుటల్, పాప దౌ
ర్గంధ్యమ్మున్ హరియించు నయ్యది" యనెన్ రాధమ్మ, వింటే? భళీ!