15, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2707

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్" 
(లేదా...)
"పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

133 కామెంట్‌లు:

 1. గరికిపాటి వారి పూరణ....

  పద్య మటన్న రమ్యమగు భావము శైలియు సచ్చమత్కృతుల్
  హృద్య పదప్రయోగములు హేలగ లీలగ సాగగా వలెన్
  విద్యల కెల్ల విద్య యిది, వేద్యమగున్ రసికాళి కట్టదౌ
  పద్యము రాదనెన్ గరికిపాటికి కోపము హద్దు మీరగన్.

  రిప్లయితొలగించండి
 2. హృద్యపదాళి వద్దు , కనిపింపగ రాదు చమక్కులిందు , సం...
  పద్యుత భావసౌరభము మచ్చునకైన నిషిద్ధమౌ , నిటన్
  మద్యముఁ ద్రావి చెప్పవలె మాన్య ! యనంగ వధానమందు, దాఁ
  బద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు వారి పూరణ

  రిప్లయితొలగించండి

 3. విద్యా గంధము లేదని
  పద్యము రాదనెను, గరికిపాటికి, నలుకన్,
  చోద్యము జిలేబి! "రాయగ
  సేద్యంబుగ వేద్యమగును" చెప్పిరి వారున్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ పద్యాన్ని ఇలా చెప్తే బాగుంటుందేమో....
   విద్యాగంధ విహీనుడు
   పద్యము రా దనెను గరికిపాటికి, నలుకన్
   చోద్యముగ జిలేబి కనగ
   సేద్యంబుగ పద్యశతము జేసె నతండే.

   తొలగించండి


 4. విద్యయు లేదు నాకనుచు వెక్కుచు నేడ్చి జిలేబి చెప్పుచూ
  పద్యము రాదనెన్, గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్,
  సేద్యము చేయు మమ్మ సరి చేయుచు నేర్పుదు రాకవీశులే
  వేద్యము గానగున్! తొడరువేగద ముఖ్యము, నాంధ్ర భారతిన్
  నాద్యపు శక్తి గా గనుము ! నాట్యము లాడును వృత్తముల్ భళా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. విద్యయు లేదు నాకనుచు వెక్కుచు నేడ్చి జిలేబి చెప్పుచూ
   పద్యము రాదనెన్, గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్,
   "సేద్యము చేయు మమ్మ" యని చెప్పిరి "నేర్పుదు రాకవీశులే
   వేద్యము గానగున్, తొడరువేగద ముఖ్యము, నాంధ్ర భారతిన్
   నాద్యపు శక్తి గా గనుము ! నాట్యము లాడును వృత్తముల్ భళా" !

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చెప్పుచున్" అనండి.

   తొలగించండి
 5. కిట్టింపు:

  సేద్యము జేసెడి వాడై
  విద్యయె రానట్టి మొద్దు బీజింగందున్
  "హృద్యముగా చైనీసున
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్"

  రిప్లయితొలగించండి
 6. మద్యము తాగిన వేళన్
  పద్యము రాదనెను గరికపాటికి,నలుకన్
  మాద్యము లెల్లయు తెలుపగ
  చోద్యమ నుచుటీవిలోన చూచెను జనముల్  రిప్లయితొలగించండి
 7. సద్యశ మందిన కవిరాట్!
  విద్యలలో మేటియే!కుకవిత్వము రాదే!
  పద్యము వారికీ సుళువే!
  వద్యము రాదనెను గరికపాటికి నలుకన్?

  రిప్లయితొలగించండి
 8. హృద్యమని జనులు పొగడగ
  చోద్యమ్మని జూడవచ్చె జూదరి యొకడున్
  మద్యము త్రావిన మత్తున
  పద్యమురాదనెను గరిక పాటికి నలుకన్.

  రిప్లయితొలగించండి
 9. పద్యము పలుకును శారద
  హృద్యము గాపిలిచి నంత హేలగ కవికిన్
  చోద్యము వినుటకు తృణమది
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్

  రిప్లయితొలగించండి
 10. నా పూరణ....

  హృద్య వధాన మెల్లెడల నెల్లరు మెచ్చగఁ బెక్కుఁ జేయుచున్
  సద్యశ మంది దేశమున సత్కృతు లెన్నియొ పొందుచుండ స
  పద్యుత గర్వ మీర్ష్యయును బాగుగఁ గల్గిన మూర్ఖుఁ డొక్కఁడున్
  బద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీరఁగన్.

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టాసత్యనారాయణ
  నింద్యమె రాగము పఠనమ
  వద్యము చదువంగ యతుల వాహ! యనంగన్
  గద్యము వలె నాశువు గొన
  పద్యము (తనకు,శ్రోతకు) పద్యము రాదనెను గరికి పాటికి నలుకన్ఋఋ
  (యతివద్ద నాపకుండ పూర్తి పాదమును, మరొక పాదమును వడిగా యెత్తు కొనుచో పూర్తి పద్యమును శ్రోతకు,ఆ వడిని అందుకొనడంకష్టమనిపిస్తుంది.ఆ స్పీడులో పూర్తి పద్యాన్ని స్మరణకు తెచ్చుకోలేక చేసిన ఉక్తి దోషమది)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. మద్యము సేవించి యొకడు
  పద్యము రాదనెను గరికిపాటికి; నలుకన్
  సద్యముగ నాకవియు నన
  వద్యముగ నతనిపయి నొకపద్యము నుడివెన్

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టానుండి
  ఆర్యా,ఋఋ,చివరన టైపాటుగా నెంచమనవి.

  రిప్లయితొలగించండి
 14. మద్య నిషేధమున్ సలుప మంచిని గూర్చును రాష్ట్రమందదే
  యుద్యమమయ్యె నేడనుచునూరును వాడల చాటిచెప్పుచున్
  హృద్యములైన పద్యములనెన్నియొచెప్పగ త్రాగుబోతులే
  పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్

  రిప్లయితొలగించండి
 15. డా.పిట్టాసత్యనారాయణ
  విద్యలకెల్ల ముఖ్యమని వేలకు వేలగు వృత్త సంఖ్యలన్
  హృద్యముగా సృజించి ఘన హేలను బంచు వధాని శేఖరా!
  పద్యము రాదనెన్ "గరికి"1పాటికి2 గోపము హద్దు మీరగన్
  గద్యమె గద్దె నెక్కె నదిగాదన బద్యమవద్య మీయెడన్!
  (1.కవి యను మత్తేభమునకు,2.సాటి యగువారికి,అనగా కవి దిగ్గజములకు కోపము హద్దు మీరడం సహజము.)

  రిప్లయితొలగించండి
 16. వాక్యము నరికి నిట్టనిలువుగ పెట్టి కవితిది
  యనుట కాదు
  పద్యము బిగించి ఛట్రమున చెబితెనే నీకు
  పేరది రాదు
  వృత్తములవె నృత్యము చేయగ నాకు
  పద్యము రాదనెన్
  గరికిపాటికి గోపము హద్దు మీఱగన్
  సబబిది కాదనెన్

  రిప్లయితొలగించండి


 17. వైద్యుడొకడు "మాత్రల" నై
  వేద్యము గా నిచ్చి నాడు, వేదన తోడై,
  చోద్యము "క(గ) ణములు" సరిలే!
  పద్యము రాదనెను గరిక పాటికి నలుకన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. అద్యతనుల్ పురాతనులు హర్షము నందుచు నేర్చినట్టి స
  ద్విద్యకు స్థానమై బహుళ విజ్ఞత కాస్పద మైన చోటునన్
  చోద్యము గాగ నొక్కరుడు శుంఠ తెలుంగున నొక్కటేనియున్
  పద్యము రాదనెన్, గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్.

  రిప్లయితొలగించండి
 19. మధ్యము త్రాగివ్రా సెదరు మాన్యులు పెద్దలు పండితో త్తముల్
  చోద్యము గాదటంచు మరి సొంపుగ ధూమము పానమం దునన్
  గద్యము వ్రాసినన్ గనగ గారవ మందున ప్రీతిపొం దుచున్
  పద్యము రాదనెన్ గరికపాటికిఁ గోపము హద్దు మీరగన్

  రిప్లయితొలగించండి
 20. పద్యము హృద్యమై తన రి భాసి లు ని మ్మహి శాశ్వతం బు గ న్
  విద్యలు నేర్చు వారల కు ప్రీతి ని గూర్చు విశిష్ట నాద మై
  ఆద్యము నై మహోన్నతి గ నాంధ్రము న న్ వె లు గొంద నాం గ్లమౌ
  పద్యము రాదనె న్ గ రి కి పాటి కి గోపము హద్దు మీర గ న్
  _____కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 21. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2707
  సమస్య :: *పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్.*
  సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారు *నాకు పద్యం రాదు* అని అన్నాడని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
  సందర్భం :: *పద్యమే నా ప్రాణము* అని భావిస్తూ కాకినాడలో మహా సహస్రావధానం చేసి *ధారణా బ్రహ్మరాక్షసుడు* గా బిరుదాన్ని పొందిన శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఎంతోమంది విద్యార్థులకు పద్యాలు నేర్పించారు. పద్యాలు వ్రాయమని పరీక్ష పెడితే ఒక్కడు తప్ప అందఱూ పద్యాలు చక్కగా వ్రాసినారు. ఆ ఒక్కడు మాత్రం పద్యం వ్రాయలేక అవధాన గురువర్యా! నాకు ఏ పద్యమూ రాదు అని అన్నాడు. అప్పుడు శ్రీ గరికిపాటి వారికి పట్టరానంత కోపం వచ్చింది అని ఊహించి చెప్పే సందర్భం.

  పద్యమె ప్రాణమౌ గరికపాటి నృసింహుడు కాకినాడలో
  పద్యము నేర్పె పిల్లలకు, పద్య పరీక్షల లోన నందఱున్
  పద్యము వ్రాయుచుండ నొక బాలుడు వ్రాయగ లేక నాకు నే
  *పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (15-6-20018)

  రిప్లయితొలగించండి


 22. విద్యాబుద్ధులు లేవని
  పద్యము రాదనెను, గరికిపాటికి, "నలుకన్
  గద్యము పద్యము లన్నియు
  వేద్యంబగునే జిలేబి" విదురుడు చెప్పెన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి


 23. ఆద్యంతములు తెలియవే
  పద్యము రాదనెను, గరికిపాటికి, "నలుకన్,
  నాద్యంబగు దుర్గ దయను
  వేద్యంబగునే జిలేబి" విదురుడు చెప్పెన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  [ఒక కర్షకుఁడు గరికిపాటితో మాటలాడు సందర్భము]

  "హృద్యమనోజ్ఞభావముల నిమ్ముగ నందఁగఁజేయునట్టి నీ
  పద్యమువోలె నేను ఘనపద్యము వ్రాయఁగఁ బండితుండనే?
  సేద్యము సేయువాఁడనయ; చిత్తము పంటలఁ గూర, నాకు నే
  పద్యము రా" దనెన్, గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   కాని పాపం... పద్యం రాదన్నమాత్రాన కర్షకునిపై కోపమేల?

   తొలగించండి

  2. కర్షకులైన శ్రీనాథ, పోతన లకు పేరు పోతోందయ్యా అని దుంఖముతో కలిసిన కోపమయ్యుండొచ్చు :)


   జిలేబి

   తొలగించండి
 25. మద్యము గ్రోలువా డొకడు మాన్యుల నెంచగ మత్సరంబునన్
  *"పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్"*
  పద్యము, చోద్యమే యనుచు పామరు మాటల వింత జూడగన్
  విద్యల నేలు దల్లికిక వేదన గల్గద యిట్లు జెప్పగన్

  రిప్లయితొలగించండి
 26. విద్యుజ్జిహ్వుడు,చతురుడు,
  స్వాద్యపుధృతియని తెలుగున జనులునుతింపన్
  ఆద్యూనుడొకండీసున
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్

  రిప్లయితొలగించండి
 27. మద్యముద్రాగుచునొకడట
  చోద్యముగానడిగెనిటులసురుచిర మంబౌ
  పద్యమునాపైచదువన
  పద్యమురాదనెనుగరికపాటినలుకన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సురుచిరమగు నా। పద్యము...' అనండి.

   తొలగించండి

 28. విన్నకోట ఉవాచ

  కొన్నేళ్ళ క్రితం ... గరికపాటి వారు కూడా వేదిక మీద కూర్చునున్న ఒక కాలేజ్ ఫంక్షన్లో ... వక్తగా వచ్చిన ఒక తెలుగు సినిమా హాస్యనటుడు తన ప్రసంగంలో గరికపాటి వారి గురించి అమర్యాదగా మాట్లాడాడు (ఆ నటుడు తాగి వచ్చాడని అన్నారు

  దీని ఆధారంగా

  మద్యము సేవించి యొకడు
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్
  ఖాద్యంబేమియొ నతనికి
  చోద్యము గా వేదిక పయి జోకులు వేసెన్.

  జిలేబి

  రిప్లయితొలగించండి
 29. రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొన్ని టైపాట్లున్నవి. "పెక్కు నేర్చు కవి వీరుడు" అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 30. ఉత్పలమాల
  మద్యముఁ ద్రాగి పిల్చిరొ? యమాత్య! ప్రపంచమహాసభాళికిన్
  సాధ్యమె ముఖ్యమంత్రియగు చంద్రునిఁ బిల్వక నన్ను రమ్మనన్
  బాధ్యత లేనివానివలె పర్గున వచ్చిన నాకు వేదిపై
  పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   ససందర్భంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
   'సభాస్థలిన్' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. 'సభాస్థలిన్'అంటే అన్వయం సరిపోతుందంటారా?

   తొలగించండి
  3. నేను పొరబడ్డాను. మీ ప్రయోగమే బాగున్నది.

   తొలగించండి
 31. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  హృద్య పదప్రసూన మొలికించగ > భావ మరంద ధారలన్

  పద్యము నల్లి పండితులపై వెద జల్లును | హృద్యపద్య నై

  వేద్యము బల్కురాణికి నివేదన మిచ్చు మహాత్ము డెవ్విధిన్

  పద్యము రాదనెన్ ? గరికపాటికి కోపము హద్దు మీరగన్

  విద్యలమాత డెందమున వేదన జెందగ , నిత్తెరంగునన్

  చోద్యము నౌ సమస్య నిడ సుంతయు భావ్యము కాదు సత్కవీ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

 32. గద్యము నేది కూడగను కమ్మగ నుండును చింతజేయగన్?
  విద్యలు పెక్కెఱుంగు కవి వీరుడు గావున గొంకదన్నదే
  మద్యము గ్రోలుటన్ గనియు మాతయె పుత్రుని మందలించెగా
  "పద్యము ; రాదనెన్ గరికిపాటికిఁ; గోపము హద్దు మీఱఁగన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోషం ఉన్నట్టుంది.

   తొలగించండి
 33. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్

  సందర్భము: గాయకు డొకడు గరికిపాటి యవధానానికి వచ్చి చివరిదాకా వుండి సాహిత్యం బుఱ్ఱ కెక్కక ఆశాభంగమై.. అక్కడ వాయిద్యాలూ లేవు.. ఆయనకు పాడడానికే రాదు పద్యం.. అన్నాడట!
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  హృద్యముగఁ బాడు నొక్కడు..
  చోద్యం బవధాన మనుచుఁ
  జూచుచుఁ దుదకున్
  వాద్యము లేవీ! పాడగ
  పద్యము రాదనెను
  గరికిపాటికి నలుకన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  15.6.18

  రిప్లయితొలగించండి

 34. సద్యస్ఫూర్తికి నిలయము
  విద్యల తల్లికి తనయుడు పెద్దవధానిన్
  చోద్యమగు జూడ నెవ్వరు
  పద్యము రాదనె గరికిపాటికి నలుకన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. జిలేబిగారి దారిలో

   పద్యము జెప్పగా బిలిచి పండగ పూటను పాఠశాలకున్
   విద్యల రాణికిన్నిరవు వేదిక పైనను వెక్కసంబుగన్
   చోద్యపు రీతిగా నటుడు జోకుల పేరిట మాటతూలగా
   పద్యము రాదనెన్ గరికిపాటికి గోపము హద్దులు మీరగన్!

   తొలగించండి
  3. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా! వమస్సులు! 🙏🙏🙏🙏

   తొలగించండి

 35. శంకరార్యుల వారి మాట గా :)

  చోద్య "మరవపాటి" కిదే
  యుద్యోగంబో? విడువదు యుక్తమయుక్తం
  భేద్యము గానదకో యని
  పద్యము రాదనెను, "గరికి" పాటికి, నలుకన్ :)  జిలేబి

  రిప్లయితొలగించండి
 36. హృద్యముగ కవితలల్లక
  మద్యము తలకెక్కగ నవమానము సలుపన్
  విద్యా సాహిత్య విదుని
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్.

  రిప్లయితొలగించండి
 37. చోద్యముగ నొకండరయక
  పద్యము రాదనెను గరికపాటికి ;నలుకన్
  హృద్యముగ దెలియ జెప్పగ
  సద్యోపద్యము నతనికి సాటి యెవరనెన్ !

  రిప్లయితొలగించండి
 38. మద్యముగ్రోలుచున్నొకడుమాన్యునియానరసింహునిన్ననెన్
  హృద్యపుపద్యమున్నొకటివ్రాయగగోరుదుసామినిన్ననన్
  బద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్"
  విద్యలురానివాడడుగబ్రీతినినెవ్వరుజెప్పనోపరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మాన్యుని నా నరసింహు నిట్లనెన్' అనండి. సాధ్యమైనంత వరకు 'పద్యమ్మున్నొకటి' వంటి ద్విత్వ నకార ప్రయోగాలు వర్జించండి.

   తొలగించండి
 39. మద్యముఁ ద్రావిన మూర్ఖుడు
  పద్యము రాదనెను గరికిపాటికి, నలుకన్
  హృద్యమగు పద్యములతో
  మద్యపు మత్తు హరియించె మాన్య్డ గురుఁడు తాన్

  రిప్లయితొలగించండి
 40. సద్యస్స్ఫూర్తి వికాశం
  బాద్యంతద్యోతమానమై తనరంగన్
  హృద్యాలంకార రహిత
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్


  గద్యము వ్రాయ రాదనుచుఁ గమ్మగఁ జిన్నయసూరి కం చనెం
  బద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్
  విద్యల విల్లునందునను విస్తృత వేత్త నరుండు కాదనెన్
  హృద్య విఘాతముల్ పలుకు లివ్విధిఁ బల్క వినంగ నోపునే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు హృద్యంగా ఉన్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'వికాశంబు' అర్థం కాలేదు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   అది “వికాసంబు” నకు ముద్రా రాక్షసము! క్షమించండి.

   తొలగించండి


 41. హృద్యంబగుపద్యమదియె
  సద్యఃస్పురణగ రచించె చక్కగ నతడే
  విద్యార్థుడననుచు నతడు
  పద్యము రాదనెను "గరికి" పాటికి, నలుకన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 42. గద్యము నాశ్రయించుకొని కమ్మగ శ్రోతలు మెచ్చు రీతిగా
  పద్యము వ్రాయ నేర్వని కుపండితు డొక్క డసూయ మించగా
  హృద్యత కేమిలే వినుము హే సఖ మద్యము ద్రావబోక యే
  పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్.

  రిప్లయితొలగించండి
 43. చోద్యము లెన్నియో జగతిఁ జూతు మవాక్కగు రీతి నొప్పగన్,
  స్వాద్యరసప్రపూర్ణమగు నామధు వందునఁ దీపి లేదనన్
  వేద్యము గాని భావమున విజ్ఞత లేని యొకండు నిట్లుగా,
  పద్యము రాదనెన్ గరికిపాటికి,
  కోపము హద్దు మీఱగన్.

  రిప్లయితొలగించండి


 44. సద్యోగంబిచ్చునకో
  పద్యము? రాదనెను, గరికిపాటికి, నలుకన్,
  విద్యార్థి ; చెప్పిరయ వా
  రద్యత విద్యానులాపి రావంబిదియే !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ:

   మీరీ శంకరాభరణ సమస్య మిస్సయినారు:

   "గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్"

   తొలగించండి

  2. జీపీయెస్ వారే దిక్కు :)

   బాడబ! కథలేలనయా!
   జోడుగ నంది గలదుగద చొప్పడు? దానిన్
   వీడుచు శాస్త్రీజీ, యే
   గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్?

   జిలేబి

   తొలగించండి
  3. రోడులు నుత్తరఖండున
   వాడుక మీరంగ పెక్కు వానలలోనన్
   పాడవగను గతిలేకయె
   గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

   తొలగించండి


  4. బాడబ! మోడీ యెక్కిన
   గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్,
   జోడుగ నందిని వీడుచు
   వేడుక చూడన్ జనాళి వీరంగములన్ :)

   జిలేబి

   తొలగించండి
  5. జిలేబీ గారి, ప్రభాకర శాస్త్రి గారి పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  6. జిలేబీ గారి, ప్రభాకర శాస్త్రి గారి పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  7. సార్! నిన్నటి శంకరాభరణ 220 వ్యాఖ్యలు record break...

   తొలగించండి
 45. "పద్యము లక్షణాలుగల భావప్రకంపనరాగయుక్తమౌ
  విద్య"!వివేకవృద్ది!నవివేకముమాన్పెడి నౌషదంబులౌ
  పద్యముమాని జెప్పమన?బల్కక నష్టవధానమందునన్
  పద్యమురాదనెన్ గరికపాటికిగోపముహద్దుమీరగన్*

  రిప్లయితొలగించండి
 46. చోద్యము గా నాంధ్రుడొకడు
  పద్యము రాదనె ను గ రి కి పాటి కి ; న లు క న్
  హృద్యపు పద్యము నేర్వని
  విద్యా గంధం బు లేని వెధవా యని యె న్

  రిప్లయితొలగించండి
 47. ఆటవిడుపు సరదా పూరణ:
  (అవధాని మాట అగ్గి మూట)

  "పద్యము పల్కెదన్ వడిగ భారత మందున నెట్టివేళనున్
  పద్యము పల్కెదన్ వడిగ భాగవతమ్మున నెట్టివేళనున్
  పద్యము రాదనిన్ వడిగ పల్కుట నాకని దెల్పవోయెడిన్
  పద్యము రాదనెన్";...గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్


  వక్రాన్వయం:
  "వడిగ పద్యము పల్కుట నాకు రాదని దెల్పబోవు పద్యము రాదు"

  రిప్లయితొలగించండి
 48. విద్యాగంధము సోకక
  ఆద్యంతము అమ్మభాష అరయకయుండన్
  సద్యత్ కౌశల మొప్పక
  పద్యము రాదనెను గరికి పాటికి నలుకన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 49. పద్యమ్మన హరికి న్నై
  వేద్యమ్ముగ నుడువ వలెను వేడుక యొప్పన్
  హృద్యము కాని విధి నుడువ
  "పద్యము, రాదనెను గరికిపాటికి నలుకన్"

  రిప్లయితొలగించండి
 50. లక్ష్మీదేవి విష్ణుమూర్తి తో:

  కందం
  హృద్యముగ జనని, వాణిన్
  బద్యమ్ములఁ బొగడి తాను ప్రారంభించున్
  సద్యము సిరులిడ నాపై
  పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్

  రిప్లయితొలగించండి
 51. ఉ: పద్యములన్ వచించుచు సభాస్థలి రంజిల జేయ పిల్వగా
  చోద్యముగాదె? నిచ్చ ప్రజ సొమ్ముభుజించెడు నేత రానిచో
  పద్యము రాదనెన్, గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్
  విద్యల తల్లి పాటవము వెంబర కోసము వాడ న్యాయమా?

  రిప్లయితొలగించండి
 52. విద్యార్థిగనున్న తరిన్
  పద్యము రాదనెను గరికపాటికి నలుకన్
  అధ్యాపకుండు నేడనె
  పద్యమ్మునకున్ గట్టిరి పట్టం బనగా.

  రిప్లయితొలగించండి
 53. రేపు ఉదయం వరంగల్ లో జరిగే పుస్తకావిష్కరణ సభ కోసం ఇప్పుడు బయలుదేరుతున్నాను. రేపు ఉదయం బయలుదేరితే సమయానికి చేరలేను. ఇప్పటి నుండి రేపు రాత్రి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి

 54. మద్యపు మత్తున పలికెన
  విద్యావంతుడు మదమన విశ్వమునందున్
  హృద్యంబుగనిట పాడగ
  పద్యము రాదనెను గరికపాటికి..నలుకన్.

  రిప్లయితొలగించండి
 55. పద్యపు శంకరాభరణ ప్రాంగణ మందున కోతిచేష్టలన్
  మద్యము గ్రోలి పిక్కటిలి మాటలు రాకయె తెల్గుభాషనున్
  విద్యయె లేక వాలమును విప్పుచునుండు ప్రభాకరుండుకే
  పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్

  రిప్లయితొలగించండి