7, జూన్ 2018, గురువారం

సమస్య - 2699 (అభవు ముఖము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి"
(లేదా...)
"అభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్"

74 కామెంట్‌లు:



  1. అబ్బే ! నా లో సగం !

    నేను చూసి బావుకునే దేమిటి ? :)


    అచ్చెరువు!తన లో నర్ధ మాయె నంట !
    చూడ గా నతనిని తన చూపు లోన
    సగము గానుండు! ఈపాటి సామి యేల?
    అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. మైలవరపు వారి కృపతో:

      అర్ధ నారి యగుట చేత హాయిగాను
      ముందు చూడగలదు గద మురిసి మురిసి...
      అద్దమును చేత దాల్చక ముద్దు గాను
      అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి :)

      తొలగించండి

    2. మైలవరపు వారి కృపతో అర్ధనారి యగుట చేత :)


      ఆహా! కవీశ్వరుల కృప లేనిదే నీశునికైన అర్ధాంగి లేదులే :)

      జెకె!

      జిలేబి

      తొలగించండి
    3. పద్యం హాయిగా ముద్దుగా ఉంది 👌

      ...చిటితోటి విజయకుమార్

      తొలగించండి
    4. 👏👌👏🙏

      మీది నాది ఇంచుమించు సేమ్ పించ్ 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    అభవపదార్చనావిభవులైన మహర్షులు యోగిబృందముల్
    శుభకరుడైన శంకరుని జూడ తపించుట చెల్లు ! గౌరియే
    విభునిశరీరభాగ ! యన వేరుగ జూచుట సాధ్యమౌనొకో ?
    అభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాసుని పెండ్లి పత్రికను జూపి
      మనము పోవలె ! నాకొక మంచి చీర
      కొనుమనుచుఁ గౌరి కోరగా , కొనక యున్న
      అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  4. ప్రభవము గాను చేసెను తపమ్మును,నీశుని తోడు చేరగాన్
    నభమును తాకె తీక్ష్ణతయు, నాట్యము నాపి నటేశ్వరుండటన్
    విభువుగ చేర వచ్చెనట ! వీక్ష్యము! సిద్ధిని మించె శ్రద్ధయే !
    యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాయవటుడైన పరమేశు మాటలన్ని
      యీటెలై కర్ణముల సోకి యెంతగానొ
      మదిని నొప్పింప దపమున మగ్న యగుచు
      నభవు ముఖము జూడదట హిమాద్రిపుత్రి .

      తొలగించండి
    2. నాదు సుతనేల చంపెనో నాధు నడుగు,
      పలుక బోను నందీశ్వరా తెలుప కున్న
      నిజము,తెలుపుము శివునితో నిక్క మిదియె
      నభవు ముఖము జూడదట హిమాద్రి పుత్రి
      సతము ననుచు బలికెసతి వెతను బడసి

      వినాయకుని శివుడు చంపగా పార్వతి యలిగి నంది తో పలికెనను భావన

      తొలగించండి
  5. సగము దేహము తానుండి సరస మనుచు
    స్వార్ధ పరుడమ్మ నీసుడు యర్ధ నారి
    విడువ జాలడు క్షణమైన వెంట నుండు
    నభవు ముఖముఁ జూడదఁదట హేమాద్రి పుత్రి

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    అంతటను నణ్వు నణువున నతడె నిండె
    రూపముండునె తలయను రూఢిగలదె?
    పుట్టుకయె లేక తల్లిని బట్టలేడు
    అభవు ముఖము జూడదట హిమాద్రి పుత్రి

    రిప్లయితొలగించండి


  7. అభయుదు డాతడే, సరస మాడుచు నాట్యము చేయ నాగహా
    రి భయము గొల్పె చూడగను ! రిక్తము రూపము! విశ్వనాథుడై
    విభుడత డై సభాపతిగ భీషణుడై విషమాక్షుడవ్వగా
    యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. అరె! మనువయి మూన్నెల్లయినా నవలె ! భ
    వాని మగడు సభాపతి భార్య ముద్దు
    తీర్చె! మామిడికాయపై తీపి బోయె !
    అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
    అభయము లిచ్చి కష్టముల నన్నిట గ్రాలు దయామయుండె, యే
    విభవము లేని జీవనము వీకన విష్ణువు జేరు యాపద
    న్నిభపు సజీర్ణ వస్త్రమును నిండు జటల్ తలపైన గంగ యా
    అభవు ముఖంబు జూడదట యద్రి తనూజ తపో నిమగ్నతన్
    (అభవు--తపోనిమగ్నతన్--ముఖంబు జూడదట--యద్రితనూజ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టానుండి
      తల మాసిన ఒలు మాసిన ॥వలువలు మాసినను ప్రాణ వల్లభులైనన్॥కులకాంతలైన రోతురు.....

      తొలగించండి
  10. దేవతల కోర్కెయునదె పార్వతిగ తన స్థిర
    లక్ష్యమదె
    అశుతోషుని మెప్పించగలదె కైలాసమున
    నడయాడగలదె
    తననుపేక్షించినను అతనికై తానన్న
    మనోలగ్నతన్
    అభవు ముఖంబు జూడదట యద్రితనూజ
    తపోనిమగ్నతన్

    రిప్లయితొలగించండి
  11. విభవము స్త్రీలకున్ తమను ప్రేమగఁజూచెడి భర్తయంచునా
    త్రిభువన పాలకుండు పతిదేవుడునౌ శివునిన్ మనమ్మునన్
    ప్రభువుగనెంచి భక్తిఁ దన పాదములన్ గనుచుండుతప్పనా
    యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్

    రిప్లయితొలగించండి
  12. *ఒక పురాణం కథ ప్రకారం.. మధుర ఒకసారి కైలాష పర్వతాన్ని సందర్శించింది. ఆ సమయంలో పార్వతి దేవి లేకపోవటంతో ఆమె శివునితో రహస్యంగా రతి జరిపింది. ఆ సమయంలో శివుడి విబూది ఆమెకు అంటింది. పార్వతి వచ్చాకా ఆ విషయాన్ని గమనించి 12 సంవత్సరాలు కప్పగా బతకమని మధురకు శాపం పెట్టింది. ఆ శాపాన్ని తగ్గించమని శివుడు పార్వతిని అభ్యర్ధించాడు. అప్పుడు పార్వతి 12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత అసలు రూపం వస్తుందని చెప్పింది. మరోవైపు అసుర రాజు మయాసుర కుమార్తె కోసం కఠినమైన తపస్సు చేసి కూతురు కావాలనే వరాన్ని పొందాడు. ఇదే సమయంలో మధుర తపస్సు కాలం ముగిసి అసలు రూపాన్ని పొందింది. మయాసుర తపస్సు వల్ల వారికి మధుర కుమార్తెగా లభించింది. మధురకు అసుర రాజు మండోదరిగా నామకరణం చేశారు.*

    మధుర యొకనాడు కైలాస మంచు కేగె
    పార్వ తచట లేదపుడట పాశుపతిని
    మోహ మందున కలసె, విభూతి యంటె,
    యంత వచ్చిన యమ్మకు నదియుఁ దెలియ
    "నభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి"
    యాగ్రహమ్మున మండూక మవ్వ మనుచు
    శాప మొసగియు మధురకు శాంతి నొందె.
    ఆ మధురయె మండోదరి యయ్యె పిదప.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కర్మ కర్మ మరీ యిలాంటి జిలేబీయాలా ! టూ మచ్

      జిలేబి

      తొలగించండి
    2. ఎక్కడినుంచి పట్టుకొస్తారండీ యిలాంటి పిచ్చి కథలు?! అస్సలు బాగులేదు! 🤔🤔👎👎

      తొలగించండి
    3. జిలేబి గార్కి, సీతాదేవి గార్కి
      మీ ఆగ్రహానికి బద్ధుడను.

      పూరణార్ధం, రావణుడు పార్వతిని మోహించగా శివుడేమి చేశాడో తెలుసుకుందామని అంతర్జాలంలో వెదుకగా ఈ కథ లభించింది. పూరణకి సరిపోవచ్చనిపించింది. అంతే...

      ఇంకా చిత్రమైన విషయమేంటంటే...

      ఈ మధుర ఎవరో, పుట్టు పూర్వోత్తరాలేమిటో...నాకస్సలు తెలియలేదు.

      ఐనా ఈ మానవులు దేన్నీ నిర్మలంగా ఉండనివ్వరు. నిర్గుణుడికి కూడా దుర్గుణాలంటగట్టి కథలు పుట్టిస్తారు.
      🙏🏻

      తొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2699
    సమస్య :: *అభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్.*
    తన భర్త యైన శివుని ముఖాన్ని పార్వతి చూడదట ధ్యానంలో ఉంటుందట అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శుభకరుడైన చంద్రశేఖరుని చూడాలని శుభములను పొందాలని అందఱూ కోరుకొంటారు. ఐతే పార్వతి ఒకరోజు శివుని ముఖాన్ని చూడటం ఇష్టం లేక ధ్యానంలో ఉన్నదట. కారణ మేమిటి అంటే ఆ రోజు తిథి భాద్రపద శుద్ధ చవితి. ఆ తిథి నాడు చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయి కదా. చంద్రుడు శివుని తలపై ఉన్నాడు కదా. శివుని ముఖాన్ని చూస్తే చంద్రుని చూచినట్లు అవుతుంది కదా. అపనిందలకు గుఱి కావలసివస్తుంది కదా అని అనుకొంటూ గౌరి ఆరోజు శివుని ముఖాన్ని చూడకుండా ధ్యానంలో నిమగ్నురాలయ్యింది అని విశదీకరించే సందర్భం.
    { ఇటువంటి (సంస్కృత) సమస్యను బ్రహ్మశ్రీ కావ్యకంఠ గణపతి ముని అపూర్వమైన రీతిలో ఇలా పూరించియున్నారు.

    *వత్సరస్యేకదా గౌరీ*
    *పతివక్త్రం న పశ్యతి।*
    *చతుర్త్థ్యాం భాద్ర శుక్లస్య*
    *చంద్రదర్శన శంకయా।।* }

    శుభ మిడు చంద్రశేఖరునిఁ జూడగ నెంతురు భక్తి నందఱున్
    శుభముల నంద; భాద్రపద శుద్ధ చతుర్థిఁ గణించి చంద్రునిన్
    విభుని శిరమ్మునన్ గనిన వింతగ నిందలు వచ్చు నంచు, తా
    *నభవు ముఖంబుఁ జూడదట యద్రితనూజ తపోనిమగ్నతన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (7-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ అవధాని గారూ! అభినందనలు!🙏🙏🙏

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారూ!హృదయపూర్వక ప్రణామాలండీ.

      తొలగించండి
    3. కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని కేవలం పండితులే కారు, వారు గొప్ప మంత్రద్రష్ట. భగవాన్ రమణులను ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయుణ్ణి స్మరణకు తెచ్చినందుకు ధన్యవాదాలు...

      తొలగించండి
  14. సభలను ప్రస్తుతించబడు సాంబుని పొందగ నిశ్చయించి తాన్
    విభవము వీడి కాననము వేగమె జేరియు దీక్ష సేయగన్
    ప్రభువు తనంత తాను తుది రాగనె తాను పరాజ్ఞ్ముఖమ్ముతో
    "నభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టాసత్యనారాయణ
    మెడనంటి మూడు పాయల
    దడుమగ చేతులును వెనుక దరలగ మెడయే
    నెడ బ్రక్కకు దిరుగని గతి
    నిడితివి నిను గత్తిరించ నింతులకు జడా!

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టాసత్యనారాయణ
    మెడనంటి మూడు పాయల
    దడుమగ చేతులును వెనుక దరలగ మెడయే
    నెడ బ్రక్కకు దిరుగని గతి
    నిడితివి నిను గత్తిరించ నింతులకు జడా!

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టాసత్యనారాయణ
    మెడనంటి మూడు పాయల
    దడుమగ చేతులును వెనుక దరలగ మెడయే
    నెడ బ్రక్కకు దిరుగని గతి
    నిడితివి నిను గత్తిరించ నింతులకు జడా!

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టాసత్యనారాయణ
    జ(z)ల్లెడ తో నిను జంటగ
    నల్లిన జ(z),జ, వాడకమ్ము లాయెను మిథ్య
    ల్లల్లన నీవే మాయం
    బల్లునదే లేని కేశ మరసితిమి, జడా!

    రిప్లయితొలగించండి
  19. పుట్టినింటికి బోవగ బుద్ధిపుట్టి
    పిలుపు లేదని యడ్డిన విభుని మీద
    కినుక వహియించి మనమున ఖేదమొంది
    యభవు ముఖము జూడదట హిమాద్రిపుత్రి!

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టాసత్యనారాయణ
    మెడనంటిన కుచ్చును నా
    కడ వరకును జారు రవిక కందము కాగా
    పెడ చూపుల కెడపెడకై
    కడు మెచ్చిరి కొత్తిమీర కట్టలను జడా!!

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    మ ధ్యా క్క ర :--


    ప్రభు వను మాటయే , సదనురాగ వాక్యము లాడ దెపుడు

    ను భగీరథ సుత - సనాతనుని తోడ || నొకసారి యేని

    నభవు ముఖము జూడ దట హిమాద్రి పుత్రిక , సగ మగుచు

    విభుని తనువు లో | నిరువురు పెండ్లము లున్నను ఫలమె ?

    త్రిభువనముల నేలున ? నిక దిరుగునా రుద్రభూమి బడి ?

    -------------------------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టాసత్యనారాయణ
    మెడ దిరుగక పెడ జూడదు
    కడు వేడుక వెన్ను జూపు కంతుడు మెచ్చెన్
    దడ బుట్టును మస్తకమే
    నడి నెత్తికి బారె, నిన్ను నమ్మకనె, జడా!

    రిప్లయితొలగించండి
  23. గౌరి ప్రేమను కనుగొన కరిమెడదొర
    మారు రూపంబు ధరియించి మగువజేర
    పరపురుషుని గాంచగలేని పార్వతపుడు
    అభవు ముఖము జూడదట హిమాద్రి పుత్రి.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    [దక్షయజ్ఞానికిఁ దన భర్తనుం దననుఁ బిలువకున్నను, తండ్రి తన నాదరించునను తలంపున, భర్తయైన శివుఁడు వలదన్నను, పోయి, యవమానింపఁబడి, శివదూషణమునుం దాళలేక, తన ముఖమును శివునకుం జూపలేక, మఱియొక జన్మమునఁ దాను, తన తపోమహిమచే, శివునే భర్తగఁ బొందెదను గాక యని తలంచి, యగ్నిప్రవేశముఁ జేసిన సందర్భమునుం గూర్చి యామె చెలికత్తె లిరువుఱు ముచ్చటించుకొనుచున్న సందర్భము]

    విభుఁడు నివారణమ్మిడినఁ బ్రేముడిఁ బోయియు దక్షయజ్ఞమం
    దభవుని దక్షుఁడే తెగడఁ, దాళఁగలేక విషాదమంది, తా

    నభవు ముఖంబుఁ జూడదఁట! యద్రితనూజ తపోనిమగ్నతన్
    విభుఁ గొని, యప్డె చూతునని, వ్రేలెడి యగ్నిని దూఁకెనే సఖీ!

    రిప్లయితొలగించండి
  25. తేటగీతి
    గరళముఁ గొని సృష్టినిఁ గాచ గర్వపడుచు
    మోహినిన్ గూడి శిశువంద మోహుడనుచు
    కీర్తి భంగమయి మదిని ఖిన్నయగుచు
    నభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి

    రిప్లయితొలగించండి
  26. తానుజేసెడుకఠినపుతపమునకును
    భంగ మయ్యది వాటిల్లు భయముచేత
    నభవు ముఖముజూడదటహిమాద్రిపుత్రి
    నెనరునీలాపనిందలు నీధ్రుజూడ

    రిప్లయితొలగించండి
  27. పాముల మెడ లోధరి యించి భస్మ మల ది
    చర్మ వసనము దాల్చిన శంకరు oడు
    ప్రియ మనోహరు నేరీతి విడిచి యె ప్పు
    డ భవు ముఖము జూడ దట హి మాద్రి పుత్రి?

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి"

    సందర్భము: సర్వమంగళ తన మొగము పైకెత్తి గంగాధరుని చూస్తే చాలు ఆయన సిగలోని గంగమ్మ యెప్పుడూ గలగలా నినదిస్తూ వుంటుంది. అది నవ్వుతూ వున్నట్టు వుంటుంది. గౌరికి సవతి నవ్వు చూడవలసి వస్తుంది.
    అంతే కాదు ఆ నవ్వు పార్వతికి గలగల మన్నట్టుగా కాక కలకల మన్నట్టు వినిపిస్తుం దట! అంటే సరళంగా కాక పరుషములు పలికినట్టు లనిపిస్తుంది.
    కాబట్టి శివుని మొగం చూడడానికి ఆమె జంకుతుంది.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    మొగము పై కెత్త సిగలోన నగవు లొలుకు
    గలగలమటంచు గంగమ్మ ; కలకల మని
    పలికినటుఁ దోచు సరళాలు పరుషము లయి..
    యభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  29. ఇందుమౌళిఁ గోరి పతిగ నిందువదన
    డెంద మందునఁ జింతించి జెంది విసుగు
    నరయ దన్య మత్యుత్తమ మైన, వొంద
    నభవు, ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి

    [ముఖము = ఉపాయము]


    సభయ సువిస్మ యావృత విషాద వికార భరాత్మ కాల నం
    గ భవుఁడు నిశ్చయించె శితి కంఠునిఁ గొల్వఁ దపమ్మునన్ మనో
    విభవము గాంచ నెంచి మది పిల్వ మహా వటు వేషధారి యా
    యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులారా,
    నమస్సులు. నిన్న రాత్రి బంధువులు వచ్చారు. వాళ్ళతో చింతల్ లో ఒక కార్యక్రమానికి వచ్చాను. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి


  31. త్రిభువన పూజ్యుడౌ యసిత గ్రీవుని జాడ నెరుంగలేకయే
    యభవు ముఖంబు జూడదట యద్రితనూజ ; తపోనిమగ్నతన్
    ప్రభువు గజాసురోదరము వాసముగా
    గొనెనంచు దెల్సి దా
    విభుని మనోన్మనున్ శివుని వేగమె రాక్షస కుక్షి వెల్వడన
    న్నభయము గోరి చక్రధరు నధ్వము నెంచగ బ్రార్ధనల్గొనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాల్గవ పాదము చివర ఒక న కారం యెక్కువ పడింది! పరిహరించ ప్రార్ధన!

      తొలగించండి
    2. డా. సీతా దేవి గారు నమస్సులు. “మనోన్మనుడు” విశేషాసక్తి జనకమైన ప్రయోగము చేశారు. దీని ప్రయోగములో మీ భావము కొంచెము వివరించ గలరా?

      తొలగించండి

    3. ఇంతకు మునుపు ఓ మారు నేను మనోన్మణి అని ప్రయోగించా :) అప్పుడూ ఇట్లాగే కందివారో లేక పోచిరాజు వారో పట్టేసారు :)

      ద్రావిడ ఫ్లేవర్ మద్రాసు గాలి నెల్లూరు దాకా తగల కుండా వుంటుందా :)


      జిలేబి

      తొలగించండి


    4. https://kandishankaraiah.blogspot.com/2017/02/2274.html?showComment=1486253305504&m=1#c3481251437740818278


      జిలేబి

      తొలగించండి
    5. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! ప్రత్యేకించి విశేషార్ధంగా వ్రాయలేదండీ! రుద్రాభిషేకం చేసేటప్పుడు యేకాదశ రుద్రులలో మనోన్మనాయ నమః అని వింటూఉండడం వల్ల అదిశివుని పేరని తెలుసు! అర్ధం చూస్తే మనస్సులో రమించే వాడని! అంటే నిత్యానందస్థితిలో ఉండేవాడని! అమ్మవారు తపోనిమగ్నతన్ అయ్యవారి జాడ తెలిసి కొన్నట్లు వ్రాశాను కనుక, అమ్మవారు నిత్యం తలచేది అయ్యవారినే కనుక..... యేదో యిలాంటి భావాలతో మనోన్మనున్ అని వ్రాశాను!
      కేవల భక్తి భావమే గాని పాండిత్య ప్రతటన లేదు!🙏🙏🙏🙏

      తొలగించండి
    6. కందివారి జడశతకానికి నేను వ్రాసిన ఒక కందము:
      జడధారిని కామారిని
      కడునేర్పున సహజగంధ కబరీ భరమున్
      బడవేసిన కడు నల్లని
      నిడుపైన తుహిన మలయజ నిండైనజడా!
      🙏🙏🙏🙏

      తొలగించండి
  32. చంపకమాల
    ప్రభువు యుదారుడై వరముఁ బంచి గజాసురు గర్భమందగన్
    యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ, తపోనిమగ్నతన్ 
    విభవము గూర్చ నా పతికి విష్ణువు వేడఁగ బ్రహ్మ తోడుతన్ 
    స్తిభినిగ గంగిరెద్దుఁ గొని చీల్చి నిశాచరునంది రీశ్వరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భావము ఒకటే యైనప్పటికీ నా పద్యం కన్న మీ పద్యం బాగుంది! అభినందనలు! 💐💐💐

      తొలగించండి
    2. 🙏🙏🙏 ధన్యవాదములండీ.మీ పద్యం కూడా చక్కగా యుంది.

      తొలగించండి
  33. తే: గణపతికి చేయు పండుగ దినమునందు
    గతమునందు కోపముతోడ గలువ చెలికి
    తానె యిచ్చిన శాపము తగులుననుచు
    నభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యు డస్తమించిన వేళ సొబగు లీను
      చంద్ర కాంతులు విరజిల్ల శివుడె తాను
      పరవశించి కామార్థియై భామ జేర
      చెంతగావచ్చు పతిగాంచి సిగ్గుతోడ
      అభువు ముఖము జూడదట హిమాద్రి పుత్రి

      తొలగించండి
  34. రభసములో జలంధరుడు రాక్షస మాయను జూపి మోహమున్
    విభుడగు కాలకంఠునిగ వేషము దాల్చి శివాని ముందునన్
    నభయమొసంగు వాడతడె యంబరకేశుని వోలె నిల్చినన్
    నభువు ముఖంబు జూడదట యద్రితనూజ తపో నిమగ్నతన్

    రిప్లయితొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (Failed Ganga Action Plan)

    నభమున నుండి శంకరుని నల్లని జుత్తును దూకు గంగనున్
    విభవము తోడ కన్నులకు విందుగ శుద్ధము జేయలేక తా
    శుభముగ చంద్రశేఖరుని చూచుట నొల్లక సిగ్గుమోముతో
    నభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్


    అభవు ముఖము = (గంగావతరణం చిత్రములోని) శివుని ముఖము

    అద్రితనూజ = (తాపసి) ఉమాభారతి
    https://en.m.wikipedia.org/wiki/Uma_Bharti

    రిప్లయితొలగించండి
  36. "అభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్"
    శుభములనీయునాభవునిజూడగనెందరువేచియుందురో
    విభుడనవిశ్వమంతటికివేంకటనాధుడుగాదెతెల్పుమా
    యభయమునిచ్చియెల్లరనునామహితాత్ముడుగాచుగావుతన్

    రిప్లయితొలగించండి
  37. నిదుర యందున తపమందు నీడయందు
    భక్త కోటికి రక్షగా బయలుదేర
    వ్రతము నొనరించ?ఫలితముబంచువేళ
    అభవుముఖము జూడదట హిమాద్రిపుత్రి

    రిప్లయితొలగించండి
  38. శివుడిని పొందాలనే తపోదీక్షలో యున్న పార్వతిని పరీక్షించ దలచిన శివుడు విచిత్ర వేషధారియై ఏ సంపదలూ లేనివాడు, బూడిద పూసుకునే వాడితో ఏం సుఖపడతావు? తపము వీడుము అని చెబుతున్న సందర్భం.

    ప్రభలను వెల్గలేడు గద రాశుల బూడిద యావదాస్తియే
    విభవము లేనివా డతడు విజ్ఞత తోడుగ నాలకించవే
    శుభములు గల్గునా యనుచు సూక్తులు పల్కిన చిత్రరూపుడౌ
    "యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరస మాడగ తగడుగా సాధు వతడు
      మంచు పర్వత మందునన్ మసలు వాడు
      వాని పొందగ తగదుగా బాల యన్న
      "యభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి"

      తొలగించండి
    2. విట్టుబాబుగారూ! మీ తాజా పూరణలు రెండూ బాగున్నవి! అభినందనలు! 💐💐💐

      తొలగించండి
    3. 🙏🏻
      ధన్యవాదాలు సీతాదేవి గారూ!
      ఈ పద్యాలతో పాప పరిహారం జరిగినట్లే అనుకుంటాను. ధన్యోఽస్మి!!

      తొలగించండి
  39. కవిమిత్రులారా,
    నమస్సులు. నిన్న రాత్రి బంధువులు వచ్చారు. వాళ్ళతో చింతల్ లో ఒక కార్యక్రమానికి వచ్చాను. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి



  40. తే.గీ:అర్ధనారీశ్వరుండౌటఁ ననవరతము

          అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి"

           సతులిరువురున్న గనలేరు శంభు మోము

          చిత్రమన్న నిదియెకదా చిద్విలాస.


    2.తే.గీ:కపట వటుడుగా నచ్చోట కానుపించి

             హరుని తిట్టుచు నుండగ నలుక బూని

            అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి"

            తాను మోము త్రిప్పుకొనగ దరహసించె

    రిప్లయితొలగించండి
  41. ప్రభలు చెలంగ తీక్ష్ణమయి పర్వులు బెట్టగ భూతకోటి యా
    శుభములు గూర్చు శంకరుడె క్షోభను జెందగ సృష్టి కాల స
    న్నిభుడయి భూతసంప్లవపు నృత్యము జేయగ తల్లి కాన తా
    నభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్.

    రిప్లయితొలగించండి
  42. అభయ మొసంగు వాడగు మహా శివునే స్మరియించు తాపసుల్
    శుభకరకారుడౌ భవుని చూడగ వచ్చునదేమి చిత్రమో
    ప్రభువున కర్థభాగమగు పార్వతి దర్పణ సాయమందకన్
    నభవు ముఖంబు జూడదట యద్రితనూజ తపోనిమగ్నతన్

    రిప్లయితొలగించండి
  43. శుభముగ ద్వారపాలకుని శుద్ధిగ జేయుచు సున్నిపిండితో
    విభవము తోడ ప్రాణమిడి ప్రీతిని నొల్లగ పుత్రరీతినిన్
    దభదభ మొత్తి వానినట దంభము మీరగ చావగొట్టినా
    యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్

    రిప్లయితొలగించండి