29, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2720

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్"
(లేదా...)
"భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్"

99 కామెంట్‌లు:

  1. అరరే! మాండవిని కదర
    భరతుఁడు పెండ్లాడినాఁడు; భామిని సీతన్
    సరసముగ పెండ్లి యాడెను
    భరతుని సోదరుడు గాద పరవశమౌచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  2. అరయగ రాముని తమ్ముడు?
    దరమము విరిచి మనువాడె ధర్మము గానె
    వ్వరిని రఘురాముడు సుమీ?
    భరతుఁడు; పెండ్లాడినాఁడు భామిని సీతన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  3. బాలు మీ కోర్టు కే యిక వేయాలె :)

    సరిసరి కైపదమ్ము భళి చక్కటి చిక్కు సమస్య నిచ్చిరే!
    అరె!రఘురాముడయ్య మనువాడెను సీతను కంది శంకరా!
    పరిపరి రీతి యోచనల పాటిగ చేసితి నెట్ల నొప్పునో
    భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరము ప్రశంసనీయమగు గాదని చెప్పుట కీ జిలేబికిన్!
      బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    విరచితరంగవల్లికల వీథులు స్వాగతమంచు బల్క , సు...
    స్వరయుత వేద మంత్ర శుభ బంధుర వేదిక రామమూర్తి ., సో..
    దరుడగు లక్ష్మణుండును ముదంబున జూడగ వచ్చిచేరగా
    భరతుఁడు., పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అవధాను లవధాను లవధానులే !

      వామ్మో రెండో పాదానికి లంకె నాలుగో పాదంలో ఇవ్వడం !

      అద్భుతం

      జిలేబి

      తొలగించండి
    2. శ్రీయుతులు ప్రభాకరశాస్త్రి గారికి.. ఉమాకాంత్ ప్రసాద్ గారికి.. అంజయ్య సోదరులకు... సహదేవుడు గారికి.. శేషఫణి శర్మ గారికి... జిలేబీ గారికి... విట్టుబాబు గారికి.. వెలుదండ వారికి... శ్రీమతి రుక్మిణీ గారికి... శ్రీ పెద్దింటి వారికి.. ధన్యవాదాలు.. నమోనమః 🙏🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    3. విఱుపులో మెఱుపుం జూపిన మైలవరపువారి పూరణము మనోహరముగ నున్నది! వారికి నా అభినందనలు!

      తొలగించండి
    4. పలువురు మిత్రుల ప్రశంసలు పొందిన మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    5. హరుని శరాసనమ్ము గొని , యల్లె బిగించియు ఫెళ్లు ఫెళ్లనన్
      విరిచెను రాఘవుండు , సుమవృష్టి రహింపగ , జానకీ ముఖాం...
      బరమున కౌముదిద్యుతులు భాసురమై వెలుగన్ , వినష్టలో...
      భ రతుఁడు., పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    6. బాగు బాగు... నమోనమః...శ్రీ బసవరాజు సారయ్య గారికి... శ్రీ కంది శంకరులకు వందనములు .🙏🙏

      విరచితరంగవల్లికల వీథులు స్వాగతమంచు బల్క , సు...
      స్వరయుత వేద మంత్ర శుభ బంధుర వేదిక రామమూర్తి ., సో..
      దరులు సుమిత్ర పుత్రులు ముదంబున జూడగ , వచ్చిచేరగా
      భరతుఁడు., పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    7. సరిచేయనిడిరి గురువులు
      "భరతుఁడు పెండ్లాడినాడు భామిని సీతన్
      త్వర" నన శిష్యులు సరి చే...
      సిరి "రాముడు పెండ్లియాడె సీతనటంచున్ !"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. ఎరుగుము కైక కుమారుడు;
    చిరునగవులు చిందుచుండు శ్రీరాముడహో!
    సుర,ముని,జన,గణ వినుతుడు;
    "భరతుఁడు ; పెండ్లాడినాఁడు భామిని సీతన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దాన రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయలోపం ఉన్నట్టుంది.

      తొలగించండి
  6. కందము
    నెరవేర్చి మౌని యాగము
    గిరి రాతిన్ నాతిఁ జేసి, గెలుపొంది స్వయం
    వరమున శ్రీరాముండు శు
    భ రతుడు పెండ్లాడినాఁడు భామిని సీతన్

    రిప్లయితొలగించండి
  7. కరుణాభరణుడు ; నాశ్రిత
    శరణుడు ; రాముడు ; రఘుపతి ; సన్మునిగణసం
    చరణుడు ; సంతతవినమిత
    భరతుడు ; పెండ్లాడినాడు భామిని సీతన్ .

    రిప్లయితొలగించండి
  8. వరి యించి మాం డ వి సతి ని
    భరతుడు పెండ్లాడి నాడు ; భామిని సీత న్
    హరువిల్లు విరిచి రాముడు
    వర గుణుడైపెండ్లి యా డె వైభవమొ స గ న్
    _______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. రాముని శివధనుర్భంగము ఇనకులమునకు
    కన్యాలాభ శృంగము
    లక్ష్మణ ఊర్మిళ బంధము శత్రఘ్ను శృతకీర్తి
    కందము
    మాండవిని దేవేరిగ తానెంచి భరతుడు
    పెండ్లియాడె గద
    భామిని సీతను ప్రేమమీరగన్ దాచెను
    దాశరథి తన యెద

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టాసత్యనారాయణ
    వరపుత్రిక 'సీత'ను గని
    రరమొర లేకుండ గీర్తి హాయిని బొందన్
    సరి మేనరికపు బావయె
    'భరతుడు'పెండ్లాడినాడు భామిని 'సీత'న్

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టాసత్యనారాయణ
    వరముల నిచ్చువారలను వాసియె రాముడు-సీత జంటకున్
    జరిగిన వంతలెప్పుడును జ్ఞప్తికి దప్పవు 'సీత'నామమున్
    బరగ నొసంగి యల్లునికి భద్రనగాధిపు పేరు నెన్నరే?!
    వరలిన ముప్పు బాపుట కవారిత పెద్దయు న(అ)క్క కొడ్కు నౌ
    'భరతుడు'పెండ్లియాడెగద భామిని'సీత'ను ప్రేమ మీరగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      లౌకికార్థంలో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2720
    సమస్య :: *భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీఱఁగన్.*
    సందర్భం :: విష్ణు భగవానుడే తన యొక్క అంశతో దివి నుండి భువికి అవతరించి దశరథ మహారాజునకు జ్యేష్ఠ పుత్రుడుగా ప్రభవించి దాశథిగా పేరు గాంచి భక్తవరదుడుగా ధర్మమూర్తిగా పరమ పవిత్రుడుగా ఆశ్రిత జన రక్షకుడుగా కృతజ్ఞుడుగా సర్వ భూత హితుడుగా సత్య వాక్పరిపాలకుడుగా సచ్చరిత్ర కలవాడుగా శివ ధనుస్సు నెత్తిన వాడుగా శ్రీ రామచంద్రుడుగా సత్కీర్తితో విరాజిల్లినాడు. ఆ విధంగా అనంత సత్కీర్తి లాభమును పొందుట యందు ఆసక్తి గలిగిన ఆ కీర్తి లాభ రతుడు సీతాదేవిని పెండ్లియాడినాడు అని సుగుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుని గుణ గణములను కీర్తించే సందర్భం.

    వరదుడు ధర్మవర్తనుడు పావను డాశ్రిత రక్షకుండు దా
    శరథి కృతజ్ఞుడున్ హితుడు సత్యము బల్కెడి వాడు నిత్య స
    చ్చరితుడు రాము డీశ్వరుని చాపము నెత్తిన వాడు కీర్తి లా
    *భ రతుడు పెండ్లియాడె గద భామిని సీతను ప్రేమ మీఱఁగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (29-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అద్బుతమండీ కీర్తి లాభ రతుడు !


      జిలేబి

      తొలగించండి
    2. సవరణ - సందర్భంలో *దాశథిగా* అనే పదాన్ని *దాశరథిగా* అని మార్పుతో చదువ ప్రార్థన

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.

      తొలగించండి
    4. ఎన్నియో ఘనకార్యము లొనరిచినట్టి ఘన కీర్తి లాభ రతుఁడగు నా శ్రీరామచంద్రప్రభువునుఁ గూర్చిన మీ పూరణ మద్భుతముగా నున్నదండీ కోట వారూ! అభినందనలు!

      తొలగించండి
    5. కోట వారూ,
      రాముని విశేషణాలను ఏకరుపు పెట్టి 'కీర్తిలాభరతు'డంటూ మీరు చెప్పిన పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    6. నాపై ఆదరాభిమానములతో నా పద్యాన్ని గొప్పగా ప్రశంసించిన శ్రీ మధుసూదన్ గారూ ప్రణామాలండీ.

      తొలగించండి
    7. సహృదయులు జిలేబి గారూ!
      హృదయపూర్వక ప్రణామాలండీ.

      తొలగించండి
    8. సదా నాపై వాత్సల్యమును ప్రదర్శిస్తూ గొప్పగా అభినందిస్తున్న గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారూ! భక్తి పూర్వక ప్రణామాలండీ.

      తొలగించండి
    9. సహృదయులు
      శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారికి
      హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
  13. వరపుత్రికమాండవినే
    భరతుడుపెండ్లాడినాడు,భామినిసీతన్
    పురుషోత్తముడారాముడు
    సరసుడునైబెండ్లియాడెచాపమువిఱిచిన్

    రిప్లయితొలగించండి
  14. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    వర గుణు డగు శ్రీ రాముడు
    పుర హరుని ధనుస్సు విఱిచి
    భూమి తనూజన్
    నర సుర మహర్షి లోక శు
    భ రతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    29.6.18

    రిప్లయితొలగించండి
  15. గరిమగ మాండవి కన్యను
    భరతుడు పెండ్లాడినాడు; భామిని సీతన్
    పిరిమిన శ్రీరాముడు శ్రీ
    కరముగ పెండ్లాడెనుగద కారణ జన్మన్

    రిప్లయితొలగించండి
  16. సురలును మెచ్చగ రాముడు
    మరదళ్ళేప్రక్కనుండ మరి నిలువంగా
    వరుసగ సుమిత్ర సుతులును
    భరతుఁడు, పెండ్లాడినాఁడు భామిని సీతన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    నిరతము యోగి బృందముల నెంతయుఁ గీడ్పడఁజేయు తాటకన్
    దురమునఁ గూల్చి; ఱాయినటఁ దోయజలోచన నా యహల్యగన్
    జరణ వనేజ రేణువునఁ జక్కిడి; భిచ్ఛివకార్ముకోద్విజృం
    భ రతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్!

    రిప్లయితొలగించండి
  18. సురదన మాండవి నప్పుడు
    భరతుఁడు పెండ్లాడినాఁడు, భామిని సీతన్"
    వర రాముడు పెండ్లాడెను
    సురలె ల్లరు నింగిలోన చూచుచు నుండన్

    guruvu gaaru ninnati naa puranamu okasari parisheelimcharaa


    పాల బాలెను చేబట్టి పత్ని రాగ
    నడుము పైచేయి వేయుచు పడక పైన
    బెదురు వలదని కూర్చుండ బెట్ట వలయు,
    చుబుకమును బట్టి పైకెత్తి చూడ వలయు
    కనులలో వెలు గాడెడు కాంతులన్ని,
    వదన దోయిని దరిచేర్చిపెదవులజత
    మూసి వైచి మధురమైన ముద్దు లిడుచు
    సున్నితముగ భుజములను సొట్టనిడగ
    వలయు, అరుణిమ జీరలు వెలుగ కనుల
    లోన, రతిసుఖమును కోరు మేను నపుడు,
    మిత్రమా రయము వలదు, క్షేత్ర మూర్తి
    కెల్ల కంపనము కలుగు, కల్లగాదు
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము,
    నిక్కమిది దేహము సెగలు కక్కుచుండు .
    నదియె మంచి తరుణముని మదిని తలచి
    సంగ మించ వలయు నీవు సంతసముగ
    ననుచు బలికె నస కిటుకులను సులువుగ
    నొకడు తన స్నేహితుని యొక్క సుకము కోరి







    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మన్నించండి... ఆలస్యంగా స్పందిస్తున్నందుకు....
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'వదనదోయి' అన్నది దుష్టసమాసం. "వదనములు రెండు దరి జేర్చి..." అనవచ్చు. 'తరుణముని/తరుణమని' టైపాటు. '..బలికె నస'?

      తొలగించండి
  19. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    దయచేసి నిన్నటి పూరణ స్వీకరించ మని ప్రార్థన


    శృంగార వర్ణన. :- ప్రియుడు ప్రేయసిని అధరకములచే

    కామవిధగ్ధను జేయగా " అరయగ నింతి ••••••••••••• "



    సరస వచో ప్రవాహమున జక్కగ ముంచుచు , నంకపాళికన్

    గరుగగ జేయుచు , న్నధరకమ్ముల వెచ్చదనమ్ముతో మహా

    భిరతి రగుల్చుచున్ , బ్రియుడు ప్రేయసిఁ గామవిధగ్ధఁ జేసిన

    న్నరయగ - నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్ ! !



    { అంకపాళిక = కౌగిలి ; అధరకము =

    కుచ చుంబనము ; మహ + అభిరతి = అధిక వాంఛ ;

    కామవిధగ్ధ జేసినన్ = కామముచే దహింప బడినదానిగా చేసిన ;

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ సరసంగా, మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  20. హరువిలు భంగమున్ సలిపి యారఘు రాముడు తండ్రియానతిన్
    పరిణయ వేదికన్ జదువ పాఱులు చక్కగ వేదమంత్రముల్
    వరులుగ వేచుచుండనట ప్రక్కననుండి సుమిత్ర పుత్రులున్
    భరతుఁడు, పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  21. గురుమూర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    " తరగని సంపదల్ గలవు | తక్కువ కాని సుకమ్ము దక్కుగా |

    నరయగ మించు భావజుని నందము నం " దని యున్న నొక్క కూ

    తు రయిన సీత నిచ్చి పడ ద్రోసిరి పెద్దలు కూపమందునన్ ||
    ..................................................................................................

    దొరలును మందు - మత్తు బడి | దుర్వ్యసనమ్ముల దోగు మూర్ఖుడౌ |

    వరుస గణింప లే రయిరి | వా డొక - మూర్ఖుడు - కామినీ ప్రలో

    భ రతుడు , పెండ్లియాడె గద భామిని సీతను | ప్రేమమీరగన్

    హరుసము గూర్చడయ్యె క్షణమైనను సీతకు || బుద్ధిమంతునిన్

    వరునిగ నెన్ను కోవలయు ; భాగ్యము నాకృతి జూచి కాదు సూ ! !


    { వరస = పద్ధతి , విధానము ; వరుస గణింప లే రయిరి = ఆతని

    గుణ విధానము గమనింప లేకపోయారు ;


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      లౌకికాంశంతో లోభరతుడు అంటూ మీరు చేసిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. వర లక్ష్మణాగ్రజుండు ద
    శరథాగ్ర తనూజుఁడు ఘన చాపుఁడు రాముం
    డు రవికుల నిజోత్తర భవ
    భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్


    పరజన భేది దాశరథి పార్థ సుపుత్రకుఁ డీ జగన్మనో
    హరుఁడు కనిష్ఠ జాతకుఁడు నా శ్రుతకీర్తినిఁ బొందగన్ సుమి
    త్ర రమణ సూనుఁ డూర్మిలను రాముఁడు, పెండిలి యాడ మాండవిన్
    భరతుఁడు, పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీఱఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో అన్వయక్లిష్టత ఉన్నట్టున్నది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      పద విభజన:
      ...కనిష్ఠ జాతకుఁడు నా శ్రుతకీర్తినిఁ బొందగన్, సుమి
      త్ర రమణ సూనుఁ డూర్మిలను, పెండిలి యాడ మాండవిన్ భరతుఁడు, రాముఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీఱఁగన్.

      తొలగించండి
  23. వరమునజన్మనొందుసతిభామినిమాండలినేగదారమా!
    భరతుడుపెండ్లియాడెగద,భామినిసీతనుప్రేమమీరగన్
    నరయుముచసపమెత్తుచునహాయనునట్లుగరాజులందరున్
    నిరవుగసంతసంబుపదియింతలుగాగనుబెండ్లియాడెసూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాండవి' టైపాటు. మరికొన్ని టైపాట్లున్నవి.

      తొలగించండి
  24. స్వరముల కంటెముఖ్యమగుసైగలమంత్రము లాలపించగా
    మరులునుగొల్పు భావనల మచ్చికనచ్చగ మెచ్చియిద్దరున్
    వరసగ నాటకాలె కడుబంధమునింపగ?పెద్దలండతో
    భరతుడు పెండ్లియాడెగద!భామినిసీతనుప్రేమమీరగన్! (నాటకసంఘమందు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెద్దల + అండ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "పెద్ద లౌననన్" అందామా?

      తొలగించండి
  25. విరిబోణి మాండవిని గద
    భరతుడు పెండ్లాడినాడు, భామిని సితన్
    సురవంద్యుడు రఘురాముడు
    హరచాపమ్ము విరిచి గొనె నర్ధాంగిగ తాన్ .

    రిప్లయితొలగించండి
  26. కరుణను వీడి రాఘవుని కానలకంపిన కైక పుత్రుడే
    భరతుడు, పెండ్లియాడె గద భామిని సితను ప్రేమమీరగన్
    చరణపు ధూళితోడ సతి శాపము దీర్చిన పుణ్యమూర్తి దా
    శరథి పురాతనమ్మయిన చాపము ద్రుంచి సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  27. సురవంద్యుడు రఘురాముం
    డరవింద దళాయతాక్షుడరి వీరుండౌ
    కరుణాలయుండు సద్గుణ
    భరతుడు పెండ్లాడినాడు భామిని సీతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో రాముని అడవికి పంపింది భరతుడు కాదు కదా! మేనమామ ఇంటినుండి అయోధ్యకు వచ్చేవరకు అతనికి ఆ విషయమే తెలియదు.
      మూడవ పూరణలో 'సద్గుణ భరితుడు' అనవలసింది 'సద్గుణ భరతుడు' అన్నారు.

      తొలగించండి
    2. కరుణను వీడి రాఘవుని కానలకంపిన కైక (యొక్క) పుత్రుడే
      భరతుడు,

      తొలగించండి
  28. ధరణిజఁ గని ముదమొందగ
    భరతుఁడు, పెండ్లాడినాఁడు భామిని సీతన్
    హరిత్రేతాయుగమందున
    ధరిత్రి రామునిగ పుట్టి తద్దయు ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (విరుపులు సరుపులు)

    విరిచెను రామభద్రుడట వీనుల విందుగ శంకరాస్త్రమున్
    విరిచెను కృష్ణమోహనుడు వీనుల విందుగ పార్థు శంకలన్
    విరిచె ప్రభాకరుండునిట వెర్రిగ మొర్రిగ క్రింది వాక్యమున్ 👇
    భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్

    అస్త్రము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు)
    సం. వి. అ. న.
    3. విల్లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "ఆబ" కందము

      విరిచెను రాముడు నాడే
      సరి చేసె మురారి నరుని సారధియై! అం
      బరమణి సరిజేయుచు భళి
      విరిచెన్ కైపదమునే కవీశ్వరుడగుచున్ :)

      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      ఇదేదో ఆటవిడుపుగా వ్రాసిన పూరణ కాదు. చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  30. 1.తరలెను మాతులునింటికి
    భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్"*
    హరుని ధనువును విరిచి తా
    పరవశమున జూచి మురిసి వసుధా స్థలిలో.

    2.ధర పాదుకలను మోసెను
    భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్"*
    భరమున త్ర్యక్షుని విల్లును
    విరువగ జనులెల్ల మెచ్చ వేడుక తోడన్

    3.అరయుము కైక కుమారుడు
    భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్"*
    కరమను రక్తిని చూపుచు
    విరుచుచు స్మరహరు ధనువును వేల్పులు పొగడన్.

    రిప్లయితొలగించండి
  31. ధర, కైకేయిసుతుడెవరు?
    పరమేశుని విల్లువిరిచి భరతాగ్రజుడే
    పరిణయమాడెను యెవరిని?
    భరతుడు, పెండ్లాడినాడు భామిని సీతన్..!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'భరతాగ్రజుడే। మురిసి యొనరించె నెయ్యది' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  32. చంపకమాల
    ధరణిని తండ్రిమాట జవదాటక కాచెను మౌని యాగమున్
    దరుణిగ మార్చి రాతినట ధర్మము దాల్చుచు మెచ్చనందరున్
    వరలుచు 'నొక్కమాట' 'యొక బాణము' రామున దన్నటుల్ యశో
    భ రతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్ 

    రిప్లయితొలగించండి
  33. సరగున మౌని యానతిని శంభుని చాపము లేపి లీలగా
    విరచిన రాఘవుండు కడు బ్రీతిని జానకి పొంగ మాండవి
    న్నరిమిలి జేయి బట్ట భరతాన్వయు డా ప్రియ బంధు మైత్రి లా
    భ రతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భరతాన్వయుడు'...? సమాసంలో 'మైత్రీలాభ' మని ఉండాలి కదా!

      తొలగించండి
    2. మైత్రి ఈకారాంత స్త్రీలింగ శబ్దం. సమాస పూర్వపదంగా దీర్ఘాంతమై ఉంటుంది. అక్కడ "స్నేహలాభ" మనవచ్చు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు గురువు గారికి. తప్పును సరిదిద్దుకొంటాను. .....భరతాఖ్యుడు నా ప్రియ బంధు మిత్ర లాభ రతుడు... అనవచ్చు నంటారా?

      తొలగించండి
  34. ఇరువురు సోదరులోకచో
    నిరువురు సోదరుల వలచి యిష్ట పడంగన్
    మురహరి వనజను గైకొన,
    "భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్"
    ****)()(****
    { మురహరి,భరతుడు అన్నదమ్ములు; వనజ,సీత అక్క చెల్లెళ్ళు.
    'సోదరి' కి బహువచనము సోదరులే కద!}

    రిప్లయితొలగించండి
  35. ధరలో మాండవికి మగడు
    భరతుడు! పెండ్లాడినాడు భామిని సీతన్
    కరములు కన్నులు కలియుచు
    చిరుదరహాసములు విరియ శ్రీరాము డటన్!

    రిప్లయితొలగించండి
  36. మురియగ నెల్లరు నిఖిల శు
    భ రతుడు పెండ్లాడినాడు భామిని సీతన్
    చరితార్థులాయె వేడ్కను
    నిరవద్యుని పరిణయము గనిన జనులెల్లన్ !

    రిప్లయితొలగించండి
  37. మరియాదా పురుషోత్తము
    డరుదగు విల్లు విరచి జను లాహా! యనగా
    సరసీరుహ నేత్రుండు శు
    భ రతుడు, పెండ్లాడినాడు భామిని సీతన్!

    రిప్లయితొలగించండి
  38. భరతను నేను చిత్రమది భామిని సీతకు నచ్చె నెంతయో
    మరిమరి చూచె ముచ్చటగ మైథిలి బాబు పరాక్రమంబునే
    వరుడయి భామ స్వప్నమున వ్రాలుచు నమ్రత తోడువీడి నా
    భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    వర గుణు డగు శ్రీ రాముడు
    పుర హరుని ధనుస్సు విఱిచి
    భూమి తనూజన్
    నర సుర మహర్షి లోక శు
    భ రతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్

    మరొక పూరణము...

    .. ..సమస్య
    భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని
    సీతను ప్రేమ మీరఁగన్

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ధరణిని పెండ్లి యాడె గద
    ధర్మ గుణ ప్రియయైన మాండవిన్
    భరతుఁడు!... పెండ్లి యాడెఁ గద
    భామిని సీతను ప్రేమ మీరఁగన్
    వరదుడు రామ మూర్తి!... గుణ
    వారిధి లక్ష్మణు డూర్మిళా సతిన్...
    కెరలి విలాస మొప్పు శ్రుత
    కీర్తిని నాలవ రాకుమారుడున్

    నాలవ రాకుమారుడు=శత్రుఘ్నుడు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    29.6.18

    రిప్లయితొలగించండి
  40. సరిసరి చెప్పెదన్ వినుము చక్కని చుక్కగు మాండవమ్మనే
    భరతుఁడు పెండ్లియాడెఁ గద; భామిని సీతను ప్రేమ మీరఁగన్
    విరుచుచు శంభు చాపమును వీరుడు రాముడు పెండ్లియాడగా
    మురియుచు సీత దెమ్మనెను ముచ్చటి జింకను ముద్దు మీరగా

    రిప్లయితొలగించండి