2, జూన్ 2018, శనివారం

సమస్య - 2694 (రాయలు కేలన్ ధరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"రాయలు కేలన్ ధరించె రమణి పదములన్"
(లేదా...)
"రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్"

67 కామెంట్‌లు:



  1. సాయంకాలము దాటెను
    మాయా వేళయు మొదలయె మహిని జిలేబీ,
    ఛాయా మోహపు భోగము!
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. గాయము మోడీ జేయగ
      మాయావతి వోట్లు కోరి మారిన వాడై
      సాయము కొరకై కాంగ్రెసు
      రాయలు కేలన్ ధరించె రమణి పదములన్


      ...అంజయ్య గారికి కృతజ్ఞతలతో

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    రాయలు కేలఁ దాల్చెఁ జెలి! , రమ్యపదంబుల నూపురమ్ములన్
    ధీయుతుడై విరించిసుదతీచరణాంబుజదివ్యభూషలన్!
    మాయని కీర్తిఁ బొందెనసమానకవిత్వసుధాప్రవాహసం...
    ధాయితహృద్యపద్యరచనమ్మున ధారుణినాంధ్రభోజుడై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్వయసౌలభ్యం కొరకు చిరుమార్పు.. మన్నించండి 🙏

      ధీయుతుడై విరించిసుదతీచరణాంబుజదివ్యభూషలన్
      రాయలు కేలఁ దాల్చెఁ జెలి! , రమ్యపదంబుల నూపురమ్ములన్ ,
      మాయని కీర్తిఁ బొందెనసమానకవిత్వసుధాప్రవాహసం...
      ధాయితహృద్యపద్యరచనమ్మున ధారుణినాంధ్రభోజుడై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  4. మాయలు తెలియని రాజట
    ప్రేయసి ప్రేమను కోరి ప్రియమగు బాసల్
    ఛాయా గ్రహణము దీయగ
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టాసత్యనారాయణ
    కోయకు కోతలు పురుషా!
    మాయలు నీ మనసునందె మసలును రతికై
    చేయగ గూడని పనులన్
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    పాయలుదీసి నీవె నిరపాయముగా మెరుగందువేలకో
    ఆయమ స్త్రీ యటంచు చిరు హాసము నీ మదినింపి;సంగమ
    చ్ఛాయలు గ్రమ్మ నీవొక పిశాచము దేవత యామెకాదె,పో!
    రాయలు కేలదాల్చె జెలి రమ్య పదంబుల నూపురమ్ములన్

    రిప్లయితొలగించండి
  7. (కర్పూరవసంతరాయలు అందాలనర్తకి లకుమాదేవి అద్భుతనాట్యం తిలకించి)
    మాయలెరుంగనట్టి లకుమాసఖిగజ్జెల ముద్దుమోతలే
    తీయని హాయినిం గొలుపు తీరగు ప్రేమపు జంటసంకెలల్
    వేయగ ; నర్తనంబునను బెల్లగు గాయపునెత్తురద్దుచున్
    రాయలు కేల దాల్చె జెలిరమ్యపదంబుల నూపురంబులన్.

    రిప్లయితొలగించండి
  8. అల గోపాలుడు భామ పద రజమును
    నుదుటను దాల్చ లేదా
    నీవే దిక్కని మగలు ఆలికి సాగిలపడుట
    నిజము కాదా
    భూమి రవిని చుట్టగ మగడు సతికి వలయమై
    సంచరించగన్
    రాయలు కేల దాల్చె జెలి రమ్యపదంబుల
    నూపురమ్ములన్

    రిప్లయితొలగించండి


  9. ఈ రాయలెవరో మరి :)


    రాయన్ వ్యాఖ్యల టపటప
    రాయలు కేలన్, ధరించె రమణి పదములన్,
    దాయపడుచు కందమ్మున,
    సాయంబట్టుచు టకటక సదనంబందున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. శాయి కలమ్మును బట్టెను
    రాయలు కేలన్, ధరించె రమణి పదములన్,
    మేయపు సొబగుల ఛందము
    సాయము, కూర్చెను కవిత్వ సౌరభమునటన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. సాయము జేయగ సతికిన్
    రాయలు కేలన ధరించె రమణి పదములన్
    పూయుచు పారాణి సరిగ
    హాయిని కలిగించె నతడె నర్ధాంగిమదిన్!!!

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2694
    సమస్య :: *రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదమ్ముల నూపురమ్ములన్.*
    శ్రీ కృష్ణ దేవరాయలు చెలి పదములను నూపురములను (అందెలను) చేత ధరించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా ప్రసిద్ధి వహించిన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించి ఆంధ్రభోజుడుగా కీర్తికెక్కిన కవి పండిత పోషకుడు. పరిపాలనలో రాయలకు రాయలే సాటి. రసిక రాజైన రాయలు ఒకనాడు నాట్యం నేర్చుకొనే సమయంలో ఒక భంగిమలో నాట్యం నేర్పే చెలి యెక్క పదములను నూపురములను చేత ధరించాడు అని చెప్పే సందర్భం.

    రాయలు సాహితీప్రియుడు రాయలు సజ్జను డాంధ్రభోజుడున్
    రాయలు ధర్మపాలకుడు రాయ లహో కవిపోషకుం డిలన్
    రాయలు రాయలే ; రసికరాజుగ నాట్యము నేర్చు వేళలన్
    *రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. రాజ శేఖరులు జిలేబి రాజశేఖ
      రులె సుమా! భళి వీరి మెరుపులకు గల
      దే యిలన సాటి పదములు దేని కవియె
      మేటి కోటమేల్కోట సుమేధసులవి!

      జిలేబి

      తొలగించండి
    2. సహృదయులు జిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పద్యరూప ప్రశంసల నందజేసిన తమరికి ప్రణామాలు.

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాయడు, సత్యభామ కనురాగపు
      దాసుడు వాసుదేవుడే
      గాయము సేయగా చెలియ గాఢపునెయ్యము రుక్మిణింటనే
      మాయల మారివంచు చెలి మౌనము దాల్చగ బుజ్జగించుచున్
      చేయుచు ప్రార్ధనల్ ప్రతిన జేయచు దెత్తును పారిజాతమున్
      రాయలు కేలదాల్చె జెలి రమ్యపదమ్ముల నూపురంబులన్!

      తొలగించండి
    2. నిత్యబ్రహ్మచారి

      పూయగ నలుకల పూవులు
      చేయగ నపరాధములను చేడియ పట్లన్
      మాయల పతి శృంగారపు
      రాయలు కేలను ధరించె రమణి పదములన్!

      తొలగించండి
  14. తన భార్య తిరుమల దేవి పాదం తాకిందని కోపంతో నున్న కృష్ణదేవరాయలు, నంది (ముక్కు) తిమ్మన పారిజాతాపహరణం విన్నాక/చదివాక, సరసములో చెలికాలు తగిలిన తప్పులేదని భావన చేశాక కోపము తగ్గి తిరుమలదేవి కాళ్ళు నిమిరాడనీ...

    గాయము మది చెలి పాదము
    చేయగ, తిమ్మన రచనయె చింతను దీర్చన్
    బాయగ నలుకయె సతిపై,
    "రాయలు కేలన్ ధరించె రమణి పదములన్"

    రిప్లయితొలగించండి
  15. హాయిగ కావ్యము వ్రాయగ
    ప్రోయాలుకు వందనమిడి ముదమున నా పా
    రాయణి స్వరూప మంచును
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్.

    ఘంటమనగా ఇచట సరస్వతీ మాత పదములు గా భావించితిని

    రిప్లయితొలగించండి
  16. వేయారులు గల ప్రభువుల
    రాయలకున్ సాటివచ్చు రాజెవరిలలో?
    నాయమ వాణియె మురియగ
    "రాయలు కేలన్ ధరించె రమణి పదములన్"

    రిప్లయితొలగించండి
  17. పాయ ని ప్రేమను బంచ గ
    సోయగము ల తిరు మల గని సొంపగు రీతి న్
    రొయక పారాణి నల ద
    రాయలు కేల న్ ధరించె రమణి పదము ల న్

    రిప్లయితొలగించండి
  18. రాయంచ కులుకు లొలికెడు
    ప్రోయాలే యలిగి తనను రోషము తోడన్
    ప్రేయసి తన్నగ యదుకుల
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్

    రిప్లయితొలగించండి
  19. రాయంచ పేరు రమణియె
    సాయంకాలము సరసున సరసకు రాగా
    సోయగమొప్పగ జూడగ
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్

    రిప్లయితొలగించండి
  20. సోయగము చెన్నుమీరగ
    రాయలుకేలన్ధరించెరమణి పదముల
    న్నీయవనినిదాసోహ
    మ్మయెగానికజింతజేయనార్యా!నిఃజమా?

    రిప్లయితొలగించండి

  21. సాయక మున కపచితి నిడి
    రాయలు కేలన్ ధరించె, రమణి పదములన్
    జేయి నిడి, మ్రొక్కి పయనం
    బాయెను సమరమ్ము జేయ పగతులతోడన్

    రాయలు = రాయడు = రాజు
    రాజు యుద్ధ భూమికి వెళ్ళు సమయమున కత్తికి పూజ చేసి చేత ధరించి తల్లి పాదములకు నమస్కారము చేసెనను భావన



    రిప్లయితొలగించండి
  22. ఈయుగ నృపతిగ వెలిగెను;
    సాయుధుడై విష్ణుమూర్తి చక్రాయుధమున్;
    బాయకు మెపుడును వాణీ;
    "రాయలు ; కేలన్ ధరించె ; రమణి పదములన్"

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    [తిరుమలదేవితోడి రాయల ప్రణయ కలహ వృత్తాంతము]

    గాయముఁ జేయఁగా వలపుఁ గయ్యము, తిర్మలదేవి యల్గ, నా
    రాయల యాజ్ఞఁ, దిమ్మనయె, రాణిని రాజునుఁ గూర్చు కోర్కిచేన్,
    వ్రాయఁగఁ బారిజాత హరణమ్ముఁ, బఠించియుఁ, జెంతఁ జేరి, యా

    రాయలు కేలఁ దాల్చెఁ, జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్!
    [రమ్యపదాంకిత అంటే బాగుండేది]

    రిప్లయితొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    ఆ యరి కంఠ ఖండనము నాలము నందొనరింప , ఖడ్గమున్

    రాయలు కేల దాల్చె | జెలి రమ్య పదంబుల నూపురమ్ములన్

    మ్రోయగ జేయుచున్ , విజయ మోహన గీతిక నాలపించుచున్ ,

    సోయగ మార నర్తిలెను | సొంపుగ నిర్వురు ధర్మపత్ను లిం

    కాయన ఫాలమందున జయం బని దిద్దిరి వీర రేఖలన్ |


    { వీర రేఖ = వీర‌ తిలకము }


    .................................................

    రిప్లయితొలగించండి
  26. కాయముదూలగానపుడుకాలికినూపురతాడనంబయౌ
    "రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్
    సోయగముండుచోనటులెసూపనిచేయగనిచ్చగింతురే
    యాయతరీతినిన్వగలునందగజేతురుపూరుషాళియున్

    రిప్లయితొలగించండి
  27. రసికాగ్రణి, కవిశేఖరుడు, వీరాగ్రేసరుడైన శ్రీ కృష్ణదేవరాయలు అలిగిన తన అనుంగు సతిని
    బ్రతిమాలు సందర్భము.

    "తీయగ నోపునే చెలియ! తీరిచి దిద్దిన భూషణమ్ములన్,
    మోయగలేని వౌనె? మృదుముగ్ధతనూలతికాస్వలంక్రియా
    మేయవిలాసబంధురసమేతము", లంచుఁ దొడంగఁ బూని, తా
    రాయలు కేలఁ దాల్చె జెలి రమ్యపదమ్ముల నూపురమ్ములన్.

    రిప్లయితొలగించండి
  28. ఆయోధనమున ఖడ్గము
    రాయలు కేలన్ ధరించె, రమణి పదములన్
    బాయక మదితల చుచు తా
    శ్రేయము గూర్చుచు జనాళి క్షేమము గోరెన్

    రిప్లయితొలగించండి
  29. శ్రేయస్తర పింజర రమ
    ణీ యాకా రాభరణ ఘృణి విమోహితుఁడై
    పాయక నలంకరింపఁగ
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్

    [పదములు = వస్తువులు (ఆభరణములు)]


    ఆయత కామ సంజనకుఁ డార్తవ దుస్సహ చండ బాణముల్
    వేయఁగ నోప లేఁ డొకఁడు వీర గణోత్తమ భోజ్య రాజ్య సం
    ధాయకుఁ డైన నేమి వసుధాపతి కాంతకు దాసుఁడే యనన్
    రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్

    రిప్లయితొలగించండి
  30. హాయిని గూర్చువేళ నట యందుము నొప్పెడు పూలతోటలో
    కూయని తీపిరాగమున కోకిల గీతము లాలపింపగన్
    ప్రేయసి చెంతజేరుచును బ్రేమను పంచుచు ముద్దులాడుచున్
    రాయలు కేలుఁదాల్చె జెలిరమ్యపదంబుల నూపురమ్ములన్.

    రిప్లయితొలగించండి
  31. తోయజలోచన! క్రన్నన
    రా, యలుకేలన్? ధరించె రమణి పదములన్
    సాయముచేయగ పతి నా
    త్మీయముగతొడంగి మువ్వ మెప్పును పొందన్

    రిప్లయితొలగించండి
  32. ధ్యేయంబొక్కటె భక్తిగ
    రాయల కేలన్ ధరించె"రమణి పదములన్
    జేయగ నుంగరమందున
    మాయనుమాన్పించు మంగమాంబయుచిహ్నం

    రిప్లయితొలగించండి



  33. 1.శ్రేయము గూర్చెడి పలుకులు

     తీయగ చెవిసోక పలికె దేవీ మువ్వల్

    బాయకు మెప్పుడటంచును

    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్.


    2.రాయలు గెలిచెను సీమను

       రాయల మదిదోచె చిన్న రమణీయముగా

       రా,యని చెంతకు చేరుచు

       రాయలు కేలన్ ధరించె రమణి పదములన్.


    3.సోయగ మొప్పగ మువ్వల

      రాయలు కేలన్ ధరించె రమణి పదములన్

     హాయిగ తాకుచు తానే

    యాయమకు తొడిగెను ముదమున నద్దమ రేయిన్

    రిప్లయితొలగించండి
  34. ప్రాయము జేరినంత ఘన బాధ్యత జేకొని ధీరుడాతడై
    శ్రేయము గూర్చుచున్ జనుల క్షేమము గోరుచు రాజ్య పాలనన్
    రాయలు కేలుఁ దాల్చె, జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్
    మోయక ధర్మ మార్గమున పూజ్యులు విజ్ఞులు మెచ్చురీతిగన్.

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    సవరణతో...

    "రాయలు కేలన్ ధరించె రమణి పదములన్"

    సందర్భము: శ్రీ కృష్ణ దేవరాయలకు తిరుమలదేవి చిన్నాదేవి యని యిరువురు దేవేరులు. పడక గదిలో తిరుమల దేవి పాద మొకసారి పొరపాటున రాయలకు తాకిన దట! ఇక అప్పటినుంచి ఆ మహారాజు అలిగి ఆ రాణి అంతఃపురాని కేగడం మానుకున్నా డట!
    ఆమె పుట్టింటినుంచి అరణపు కవిగా వచ్చి స్థిరపడినాడు మహాకవియైన ముక్కు తిమ్మన. ఆతనితో చనువు గలిగిన రాణి తన విషయం చెప్పుకొని బాధపడిం దట!
    అప్పుడాయన పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రచించా డట! అందులో కృష్ణుడు సత్యభామ పాదాలు పట్టుకునే సన్నివేశ ముంది. అది చూచి రాయలు తన అలుక వీడి రాణిని క్షమించి చేరదీసినా డట! పాదాలనూ పట్టుకున్నాడట!
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ఆ యరవిందాక్షుండే
    పాయక సత్యా పదములఁ బట్టెనె! తప్పా..
    నా యతివ తాకిన ననుచు..
    రాయలు కేలన్ ధరించె
    రమణి పదములన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  36. ఆటవిడుపు సరదా పూరణ:
    (గైడ్ సినిమాలో తప్పత్రాగిన దేవానంద్ తొట్రుపాటు)

    సాయము దాటిపోయె గద సభ్యులు కూడిరి నాట్యశాల నౌ
    రా! యలు కేలఁ దాల్చెఁ జెలి?రమ్యపదంబుల నూపురమ్ములన్
    తీయగ దాల్చి రావలెను తీరుగ దిద్దిన రూపురేఖలన్
    సోయగ మొప్పుచున్ వడిగ! సొమ్ముల నామెవి దొంగిలింపగన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్య గారు:

      "ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'గైడ్' సినిమా అనగానే నాకెంతో ఇష్టమైన 'గాతారహే మేరా దిల్' పాట గుర్తుకు వచ్చింది. వెంటనే యూట్యూబులో చూడాలి."

      తొలగించండి
  37. అద్భుతమైన విరుపుల మెరుపులు!! 👌👌👏👏💐💐

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉదయం నేనీ ఆటవిడుపు పూరణ వ్రాసి మధ్యాహ్నమునకు దాచిపెట్టితిని. ఈ లోపుగా ఇదే విరుపుతో అంజయ్య గౌడ్ గారు అందమైన ఈ క్రింది పూరణను చేసిరి:

      "అంజయ్య గౌడ్

      నా యపరాధమేమిక వినమ్రత తోడ మెలంగు వాడనే
      కూయగరాని కూతలను కూ
      సెడి వాడను కానుగాని యౌ
      రా ! యలుకేలన్ దాల్చె జెలి రమ్యపదంబుల నూపు రమ్ము లన్
      పాయక పట్టుకొందమన పావడ గప్పెనదేమి చిత్రమో"

      తొలగించండి
    2. అంజయ్య గారికి అభినందనలు!👏👏💐💐

      తొలగించండి
    3. సీతాదేవి గారికి ప్రభాకర శాస్త్రి గారికి👏🏽👏🏽👏🏽👏🏽👏🏽

      ...అంజయ్య గౌడ్

      తొలగించండి
  38. కందం
    నీ యలుకలు తాళగలనె? 
    దాయని నీ మేను నేడు దాతు వదేలా? 
    పాయవె మౌనమ్మని యదు
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్!

    రిప్లయితొలగించండి
  39. పోయినవని పట్టీలే
    మీయావిడనంతతిట్టి మీరితివవధుల్
    సాయంత్రమ్మవి దొరకెను
    రా! యలు కేలన్? ధరించె రమణి పదములన్(చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  40. సాయము వేయ శీఘ్రముగ శౌరి తనూజుడు, కామమొంది యా
    రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్
    తోయజనేత్రి భర్తఁగని తోషముతోడుత కౌగి లించగా
    ప్రేయసి యూపుఁ జూసి పతి ప్రీతిని పొందెను సంగమమ్ములో

    రిప్లయితొలగించండి
  41. భగవంతుడా కాపాడు! ఒక భర్త మొఱ! 😊😊

    ఏయప రాధము దోచెను
    రా? యలుకేల ధరించె రమణి? పదములన్
    బాయని ప్రేమను బట్టెద
    తోయజదళ నేత్రుడ సతి తోడ గలుపవే!

    రిప్లయితొలగించండి
  42. సోయగ మొప్పు నా ప్రణయ సుందరి కేమయె నేమి జేయ నౌ
    "రా! యలు కేలఁ దాల్చెఁ జెలి, రమ్యపదంబుల నూపురమ్ములన్"
    నాయర చేతినిన్ గొనుచు నా హృదయేశ్వరి కోపమీ గతిన్
    బాయగ జేయగన్ వలయు పాదము లొత్తక దప్పదో తమిన్!

    తమి = ఆపేక్ష, వలపు, రాతిరి....ఏ అర్థం తీసుకున్నా బాగానే ఉన్నట్టుంది.

    రిప్లయితొలగించండి
  43. మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందలి నేటి పద్యములలో నొకటి:

    ఇవ్విధము మహాబాహు మహితము బుద్ధి
    కన్న నైన దాని నెఱిఁగి తన్ను నింక
    నాత్మ చే నియమించి కామాకృతిఁ గని
    పించు నరిని దురాసదుఁ ద్రుంచు మించి .... శ్రీకృష్ణ. సూ.సుధా. 3.43.

    మూలము:
    ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా
    జహి శత్రుం మహా బాహో కామ రూపం దురాసదమ్ .... శ్రీమద్భగ. 3.43.

    రిప్లయితొలగించండి
  44. నీయలుక మానుమిక యివి
    గో!యని గజ్జెలు సతికిని గోముగ నపుడే
    యీయగనే వేంకట పతి
    రాయలు కేలన్ ; ధరించె రమణి పదములన్

    రిప్లయితొలగించండి
  45. తీయని భక్తి రసామృత
    మా! యను నాముక్తమాల్యదా గ్రంథంబున్
    వ్రాయుచు పెద్దన తనకిడ
    రాయలు కేలన్ ధరించె రమణి పదములన్!

    (రమణి పదములు=వాణీ శబ్దములు(పలుకులు) అనే భావనతో)

    రిప్లయితొలగించండి


  46. 4 వపూరణ

    తోయజవదనా చెంతకు

    రా,యలుకేలన్,ధరించె రమణిపదములన్

    సోయగ మొలికెడి మువ్వలు

    నూయలవలె సవ్వడించ నొప్పుగ తానున్.

    5.

    రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్

    సోయగమొప్పగ జనులు చూడగ నాతడు వాణికిన్ యిడన్

    “హా”యను నుద్గరంబునను నౌనను కూతలనొప్పుచున్ జనుల్

    సాయము చేయగా నచట సంబర మంబరమెల్లనిండెగా.

    రిప్లయితొలగించండి
  47. గురువు గారి దర్శన భాగ్యం కలుగలేదేమీ దినము

    రిప్లయితొలగించండి
  48. కవిమిత్రులకు నమస్సులు... ఈరోజు ఆక్సెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుండి కొందరు వచ్చి మా వృద్ధాశ్రమం నుండి కొందరిని 'మహానటి' సినిమాకు తీసుకువెళ్ళారు. అందులో నేనూ ఉన్నాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోయాను. అలసట వల్ల ఇప్పుడూ సమీక్షించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  49. గాయము మోడి చేయగను గాభర నొందుచు తల్లడిల్లుచున్
    సోయగ హీనురాలునగు చొప్పల దంటుల హస్తిమార్కుదౌ
    మాయల మాయవత్నినట మచ్చిక జేయుచు యాదవాఖ్యుడౌ
    రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్

    రిప్లయితొలగించండి