దొడ్డిన్ దారిని... ప్రయోగమసాధువని అవధాని వరేణ్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు సూచించినారు... అందుచే చిరుమార్పు చేసితిని.... మన్నించండి... శ్రీ రామారెడ్డి గారికి నమస్సులు 🙏
డా.పిట్టాసత్యనారాయణ ధర్మమును నిర్వచించగా తరముగాక అర్జున విషాద యోగమే యవతరించె మంచి బెంచుచు గర్మల మలచ వలయు ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు. (Do good and be good.)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2721 సమస్య :: *అడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్.* నా కర్తవ్యాన్ని నెఱవేర్చేందుకు నా ధర్మ ప్రవర్తనయే నాకు అడ్డమయ్యింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ధర్మరాజు మాయజూదంలో సోదరులను ధర్మపత్ని యైన ద్రౌపదిని తనను కూడా ఓడిపోయాడు. నాకు అడ్డే లేదు అని అహంకరించిన దుర్యోధనుడు పతివ్రత యైన ద్రౌపదిని కోరి తన తొడపై కూర్చుండ రమ్మని పిలిచినాడు. ఆ సమయంలో ఉగ్రుడైన భీమసేనుడు దుర్యోధనుని అక్కడికక్కడే చంపివేయాలని అనుకొన్నాడు. ఐతే అన్న అనుమతి లేదు కదా అని ఊఱకున్నాడు. భార్యను దారుణంగా అవమానించిన వాడిని శిక్షించడం భర్త యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణకు అన్న యైన ధర్మరాజు మాటను పాటించడమనే ధర్మ ప్రవర్తనము అడ్డము అయ్యింది అని కురు సభలో ఉండిన భీముడు భావించే సందర్భం.
ఒడ్డెన్ ధర్మజు డగ్రజుండు మముఁ దా నోడెన్ సతిన్ గూడ, నా కడ్డే లేదని యీ సుయోధనుడు నే డాశించె నీ ద్రౌపదిన్ విడ్డూరమ్ముగ, వాని జంప దలతున్ భీముండ, యోచింప నా *కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (30-6-2018)
రిప్లయితొలగించండిచేతి చిల్లిగవ్వయు లేదు చెంగటన్ జి
లేబు లై తలకాచగ లేరు పెద్ద
వాళ్లు వీధిన పడినాను వారకాంత
బతుకు తలిదండ్రులనుగావ పరిధి దాట
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్మ కాండలు జేయుట కష్టమవదు
రిప్లయితొలగించండిధర్మ మెట్టిదో తెలియదు దాడులందు
మర్మ మిచటనే తెలుసును ధర్మజునకు:
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు
తెలియును... అనండి... పద్యం బాగుందండీ 🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
🙏🙏🙏
తొలగించండితెలియదు నాకు తెలుగు...:)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
తొలగించండిసుయోధనుని మనోవేదన...
"అడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్"
వడ్డింపన్ విసమున్ భుజించియును చావండేమి భీముండు ?., వీ
రడ్డంబంచునునింటఁ గాల్చిననపాయమ్మేమి లేకుండెడిన్ !
దొడ్డిన్ దారిని వీరిఁ గాచుటకు దా తోడుండె గోపాలకుం..
డడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా ! కార్యసంసిద్ధికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
దుర్యోధనుని మనోగతంగా మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదొడ్డిన్ దారిని... ప్రయోగమసాధువని అవధాని వరేణ్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు సూచించినారు... అందుచే చిరుమార్పు చేసితిని.... మన్నించండి... శ్రీ రామారెడ్డి గారికి నమస్సులు 🙏
తొలగించండిసుయోధనుని మనోవేదన...
"అడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్"
వడ్డింపన్ విసమున్ భుజించియును చావండేమి భీముండు ?., వీ
రడ్డంబంచునునింటఁ గాల్చిననపాయమ్మేమి లేకుండె ! వా..
రొడ్డన్ సర్వము దాసులైరనగ రక్షోపాయమా చక్రి , మా
కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా ! కార్యసంసిద్ధికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
హరిశ్చంద్రుని ఆవేదన....
రిప్లయితొలగించండిఎదుట మృతజీవుఁడై యుండెనే తన సుతుఁ
డతని యంత్యేష్టి జరుపుట కవసరమగు
కాటి సుంకము లేదనె కద సతియును
తండ్రిగా తన విధి నిప్డు తప్పు టెట్లు?
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు
🙏🙏🙏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
అత్యంత స్వాభావికమైన వస్తువును ఎన్నుకొని పూరించారండీ ! అభినందనలు .
తొలగించండి
రిప్లయితొలగించండిబిడ్డల్నిచ్చెనునాకొకండు విడిచెన్ పీడించి పీడించుచున్
దుడ్డుల్లేవయ చేతిలో, తడవుగా దూకంగ నేస్తమ్ములు
న్నడ్డంబుల్తొలగింప లేరు, ధరణిన్ నాయన్నవారేరయా
వడ్డీలెక్కలజీవనమ్ము చిదిమెన్ వాణిజ్యమైనాను! నా
కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రజల సేవ యె పరమార్థ భాగ్య మను చు
రిప్లయితొలగించండిపెక్కు సంక్షేమ పథకాలు ప్రీతి తోడ
నమ లు పరచoగ పూ న గా నక్క సు గ న
ధర్మ వర్తన మ డ్ డు కర్తవ్య మునకు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నారి వినుమంటి సత్యమే నాదు మాట
రిప్లయితొలగించండిధనము నార్జించు టొక్కటే ఘనమనంచు
తలచు మానవ కోటికీ ధరణి యందు
ధర్మ వర్తన మడ్డు కర్తవ్యమునకు.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఘనమటంచు' అనండి.
వర్తకమ్మునకంచును పలికినారు ;
రిప్లయితొలగించండికోట్లసంపదలను కొల్లగొట్టినారు ;
భరతభూమికి ప్రభువులై వరలినారు ;
తెల్లవారలు మత్తును చల్లినారు ;
మాయకులు వారలు ; మన మమాయకులము ;
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిమద్యమున నాని మూల్గిన ఓటు నోట్లలో
రిప్లయితొలగించండిఎండిన ఘాటు
ప్రజాస్వామ్యమునకిది చేటు విలువలకు పడెను
పెద్ద తూటు
బలమునకు సభ్యులేటికిన్ హార్సు ట్రేడింగ్
మనకుండగన్
అడ్డంబయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య
సంసిద్దికిన్
(ఇటీవలి కాలపు రాజకీయ పర విశేష ప్రాచుర్య
పదము "హార్సు ట్రేడింగ్""Horse Trading"
"గుర్రపు వర్తకం")
రిప్లయితొలగించండిమా నారా వారి పల్కు :)
విడ్డూరంబిది! స్టేటసిత్తుమని నీవే సోదరా చంద్ర మా
చడ్డీల్గాచితి వంచు బల్కిరి గదా! సాధ్యంబు కాదిప్పుడం
చడ్డాల్పల్కుచు కేంద్రమేల గునిసెన్ ? సాగింపనీ పొత్తులన్
నడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉదర మందు శరము నిడ నోడి గాలి
రిప్లయితొలగించండిపోవు సోదరునకు ,కాని పూజ్య రాఘ
వుండు వలదనె,ఏరీతి గండము తొల
గుననుచు విభీషనుడుమనమునతలచెను
ధర్మవర్తనమడ్డుకర్తవ్యమునకు
తెలుపుము హనుమంత యనుచు పలికె నపుడు
రావణాసురుని పొట్టలో అమ్రుత కలశము ను పగుల గొట్టమని విభీషణుడు తెల్ప రాముడు వారించగ హానుమంతునితో మనసు లోని బాద తెలుపు సందర్భం
వలదనె నేరీతి అని సవరణము
రిప్లయితొలగించండికృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిండు చూలాలు సీతమ్మ బొండు మల్లె
రిప్లయితొలగించండివ్యర్థు నిందను మోయుచు వనముకంపె
తండ్రి రామయ్య ఖేదము దలప తరమె?
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు!
కల్లలాడుటె తెలియును కాసు కొఱకు
తొలగించండిచేయిదడుపక నేపని చేయబడదు
రాజకీయము నేడిది వ్రాసుకొను మ
ధర్మ వర్తనమడ్డు కర్తవ్యమునకు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిమొదటి పద్యము మొదటి పాదమున చిరు సవరణ:
తొలగించండినిండు చూలాలు సీతమ్మ కండగాక
యని చదువ ప్రార్థన!!
తే: ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు
రిప్లయితొలగించండినంచు నెరిగించ కృష్ణుడె, యనృతమాడి
ద్రోణుని నిహతి కాంచిరి దురమునందు
పాండవులు, తెగడ రిపులు పందలనుచు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రధాని ఆలోచన - కాశ్మీరు
అడ్డాల్నాడు జిలేబులౌత!రిపులై యడ్డంబడన్పౌరులున్
గడ్డాల్బట్టుచు వేడనేల నికనో? కాశ్మీర రాష్ట్రంబు లో
నడ్డంబై నిలువన్ సమున్నతికి నానారీతి నేనొప్ప! నా
కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
👏👏👏👏👏
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిధర్మమును నిర్వచించగా తరముగాక
అర్జున విషాద యోగమే యవతరించె
మంచి బెంచుచు గర్మల మలచ వలయు
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు.
(Do good and be good.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండి"బిడ్డా!గాంచుము సూర్య, చంద్ర గతులన్ బేర్కొమ్ము నీ శ్వాస"నం
చడ్డాలప్పుడె ధర్మ సూక్ష్మములకున్ శాస్త్రంబునే జూపగన్
బిడ్డండడ్గిడి గడ్ప దాట గనకే భీరుండు; బోర్లంబడె
న్నడ్డం బయ్యెను ధర్మ వర్తనము కట్టా, కార్యసంసిద్ధికిన్!
(సూర్యనాడిలో కుడి కాలు ముందు,చంద్రనాడిలో నెడమ కాలు ముందువేసి గడప దాటిన కార్యసిద్ధి కలుగునని, తండ్రి తనయునకు శాస్త్ర ధర్మాలు జెప్పగా జరిగిన సందర్భము. ఒక్కొక్కసారి ఏ నాడి నడుస్తుందో నిర్ణయించలేము తొందరలో.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2721
సమస్య :: *అడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్.*
నా కర్తవ్యాన్ని నెఱవేర్చేందుకు నా ధర్మ ప్రవర్తనయే నాకు అడ్డమయ్యింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ధర్మరాజు మాయజూదంలో సోదరులను ధర్మపత్ని యైన ద్రౌపదిని తనను కూడా ఓడిపోయాడు. నాకు అడ్డే లేదు అని అహంకరించిన దుర్యోధనుడు పతివ్రత యైన ద్రౌపదిని కోరి తన తొడపై కూర్చుండ రమ్మని పిలిచినాడు. ఆ సమయంలో ఉగ్రుడైన భీమసేనుడు దుర్యోధనుని అక్కడికక్కడే చంపివేయాలని అనుకొన్నాడు. ఐతే అన్న అనుమతి లేదు కదా అని ఊఱకున్నాడు. భార్యను దారుణంగా అవమానించిన వాడిని శిక్షించడం భర్త యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణకు అన్న యైన ధర్మరాజు మాటను పాటించడమనే ధర్మ ప్రవర్తనము అడ్డము అయ్యింది అని కురు సభలో ఉండిన భీముడు భావించే సందర్భం.
ఒడ్డెన్ ధర్మజు డగ్రజుండు మముఁ దా నోడెన్ సతిన్ గూడ, నా
కడ్డే లేదని యీ సుయోధనుడు నే డాశించె నీ ద్రౌపదిన్
విడ్డూరమ్ముగ, వాని జంప దలతున్ భీముండ, యోచింప నా
*కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (30-6-2018)
అగ్భుతమైన పూరణ అవధానిగారూ! అభినందనలు! 🙏🙏🙏🙏
తొలగించండిశ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.
తొలగించండి
తొలగించండిసలాంకొట్టేమయ్యా కవివరుడ! మీ సాటిగా వేసిరయ్యా
కళావంతంబై వెల్గెనయ పదముల్ క్రాంతితో భీముడిన్ ని
ల్పె లావణ్యంబొప్పంగ కనులెదుటన్! లెస్స శార్దూలమయ్యా!
భళా! శ్రీరాజా! పాదపు వరుసలన్ బాగుగా గట్టిరయ్యా!
జిలేబి
సహృదయులు శ్రీ జిలేబి గారూ! ప్రణామాలండీ.
తొలగించండిమీ విశ్లేషణకు మీ ప్రశంసలకు
హృదయపూర్వక ధన్యవాదాలండీ.
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరమేశు గారి భావనకు
బుడ్డీలన్, సయి వోటు నోట్ల భళిరా పోయించి పారించుచున్
చడ్డీల్దాల్చి రిసార్టులందు భళి వేశ్యారూపులై యాడుచున్
రడ్డుల్నేలగ హార్సు ట్రేడు గలదర్రా కోపుగా, యేల, మా
కడ్డం బయ్యెను, ధర్మవర్తనము, కట్టా కార్యసంసిద్ధికిన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిరమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు.
ధర్మ వర్తనమడ్డు కర్తవ్యమునకు
రిప్లయితొలగించండిస్వార్థపరతత్వ మందునసాగుచుండ
మానవత్వములేనట్టిదానవులకు
సహన సంస్కారమన్నదిసాగుటగున?
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
బకాసురుని జంపబోవు బీముని మనోగతము
................ ............... ........... .................
మెసగితిని మధు రాన్న పాయసము లేను |
కుడిచితిని లడ్డు గారెలు గడుపు నిండ |
కాని , క్షుద్బాధఁ గుములు బకాసురు నెటు
జంపవలె నన్న చిన్న సంశయము గలిగె |
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు |
నయిన శ్రీకృష్ణపరమాత్ము డాఙ్ఞ నొసగె |
వాని వధియించి పురముఁ గాపాడ వలయు |
------------------------------------------------------------------------
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(దుష్ట పాలకునకు సద్బుద్ధి గల మంత్రి చేయు సద్బోధ!)
రిప్లయితొలగించండి****}{}{****
ఒడ్డారించెడి వారలెవ్వరిలలో నూహింప నిక్కాలమున్?
వడ్డీకాసుల వాడె యండ నిలువన్ వారించు వారెవ్వరో?
గడ్డీగాదము పైన నాశ విడుచున్ గష్టింప నేరీతిగా
నడ్డం బయ్యెను, ధర్మవర్తనము, కట్టా కార్యసంసిద్ధికిన్?!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ...
రిప్లయితొలగించండితేటగీతి
విజయమో వీరమరణమో వీరులెంచఁ
దగును పార్థా! రణమ్మున దారి తప్పి
వెదకి బాంధవ్యముల నిట్లు వెన్నిడెడు న
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు
చక్కని పూరణ జి వి యస్ గారూ! అభినందనలు! 👏👏👏
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు మరియు శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు
తొలగించండిచిత్త శుద్ధియె కల్గియు చేసినంత
రిప్లయితొలగించండికలుగు తథ్యమ్ము భువిలోన కార్యసిద్ధి!
రాదు,రాదెన్న డైనను రాదు రాదు
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలకులధర్మయుతులయివర్తిలయెడ
రిప్లయితొలగించండిధర్మవర్తనమడ్డుకర్తవ్యమునకు
పట్టుమాగొడుగునునెండవాలుబట్టి
రక్షణొనగూర్చునయ్యదినిశ్చయముగ
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి.
సరదాగా...
రిప్లయితొలగించండిచెడ్డీ వేసితి జీన్స్ కట్టితి గదా చీరేలనో యింక నా
కడ్డంబౌ నని దువ్వలేక కురులన్ కాస్తంత కట్ చేసితిన్
గడ్డే కూర్చొన జాబుకై వ్రతములో కాదన్న నా వేషమం
దడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్.
తొలగించండిఇట్లాంటిదేదో జీపీయెస్ వారు ఆటవిడుపుకింద వేస్తారనుకున్నా :) మిస్సన్న వారు ముందుపడేరు !
అదురహో ! ఇంక ఆటవిడుపు యేమొస్తుందో చూడాలి :)
జిలేబి
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకాశవాణి లో...
రిప్లయితొలగించండి(30/06/2018 ) ఈ రోజు ప్రసారమైన సమస్యాపూరణంలో..నా పూరణ చదివినారు..
సమస్య.. ధనమే చిత్త వికాస సంపదకు ప్రాధాన్యంబునై నిల్వగన్
నా పూరణ :
---------------
ధనమే చిత్త వినాశ కారకమగున్ తథ్యంబు ముమ్మాటికిన్!
తనువే తుచ్ఛ సుఖంబు గోర మరి యంతర్యామి బోధిల్లునే!
మునులే మోక్ష పథంబు దెల్పెదరు పెంపున్ గావునన్ వారి భో
ధనమే చిత్త వికాస సంపదకు ప్రాధాన్యంబునై నిల్వగన్!
~ ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
వనపర్తి జిల్లా
తొలగించండిపైవారం సమస్య యేమిటండి ?
జిలేబి
అభినందనలు.
తొలగించండివచ్చే వారానికి సమస్య :
తొలగించండికరి కాపాడుచు నుండు ముజ్జగములన్ గారుణ్య వారాశియై
తొలగించండిజీవీయెస్ వారికి నెనరులు
పరివారమ్మన లేదు సొంతముగ సంబంధంబు లేదాయె నె
వ్వరితో ధ్యానము చేయుచుండునెపుడున్ ప్రార్థించుచున్నీశుడిన్
కెరటంబై కృప నెల్ల వేళలను తాక్రేగంటలొల్కంగ మ
స్కరి కాపాడుచు నుండు ముజ్జగములన్ గారుణ్య వారాశియై!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశంకరాభరణమునకు మాత్రమే.
తొలగించండి🙏🙏🙏🙏🙏
తొలగించండితర ళోద్యత్శిత ఘోర శూల కరి దైత్యశ్రేణికిన్ దుర్భయం
తొలగించండికరి మౌనీంద్ర నికాయ మోక్ష కరి దుష్కార్యాత్మ విధ్వంస క
ర్యురు గౌరీ పతి చిత్త తోష కరి తా యోగీశ్వరీ గౌరి శాం
కరి కాపాడుచు నుండు ముజ్జగములన్ గారుణ్య వారాశియై
ఒడ్డున్ మానవ జీవితంపు పడవన్ యుక్తిన్ సదాఁ జేర్చగా
రిప్లయితొలగించండితెడ్డే ధర్మము దీని యాచరణమే దిక్కౌను, మోక్షమ్మిడున్
విడ్డూరంబుగ మూర్ఖులౌ జనులు భావించున్ గదా యేలనో
*"యడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీతను ద్యజించె ఘన రాజ నీతి నెంచి
రిప్లయితొలగించండిప్రాణ సమ సతిని ధృతిని రామ భద్రుఁ
డెద వగపు నింపి కానేర దెన్నఁ డైన
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు
దొడ్డాలిన్ సుతు భూమి సూర్యకుల జాతుండెల్లఁ గోల్పోయెనే
చెడ్డం జేయఁగఁ గైక రాముఁ డకటా సీతాసతిం గోల్పడెన్
విడ్డూరంబుగ ధర్మనందనుఁడు దా వీక్షించెఁ గాంతారమే
యడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమనశంకరాభరణం వారివి చదివారా ?
రిప్లయితొలగించండిఒడ్డారమ్మును వీడు వేడెదను నీకో దండ మో కైక నే
రిప్లయితొలగించండినొడ్డుం జేరెద నిచ్చి రామునకు రాజోద్యోగమున్ హాయిగా
నడ్డే లేదని విఱ్ఱవీగితిని మాయల్ క్రమ్మె నా కింతలో
నడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'నీకో'... 'ఒక'ను 'ఓ' అనరాదు కదా!
అవును గురువు గారూ. నీకున్ దండమో...
తొలగించండినీకున్... అంటే యతి తప్పుతుంది.
తొలగించండిసన్నుతాచారు డొకరుడు మున్ను తనకు
రిప్లయితొలగించండివలయు కార్యంబు జరుగుట కిలను లంచ
మీయ వలయుట స్మరియించి యిట్లు తలచె
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడ్డేమున్నది పెండ్లియాడ సుతుడా యానాటి నీ బాసనే
రిప్లయితొలగించండియడ్డంచున్ దలపోయనేల మన వంశాభ్యున్నతిన్ గోరుమో
బిడ్డా! యంచును బల్కసత్యవతితో భీష్ముండు తా జెప్పెనే
యడ్డంబయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గడ్డాల్ బట్టుచు పాకు బిడ్డలను హా! కయ్యంబులే వద్దనన్
రిప్లయితొలగించండితెడ్డుంజూపుచు తీవ్రవాదమును విద్వేషమ్ములన్ పెంచెడిన్
విడ్డూరమ్మును గాంచరే హతవిధీ వీక్షించ చిత్రమ్మునౌ
అడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సడ్డం జూపుచు వాడు కార్యములలో సన్మానముం గాంచుచున్
రిప్లయితొలగించండిదుడ్డున్ లంచముగా నొసంగు ఫణితిన్ దుర్మార్గమౌనంచు తా
నొడ్డం జాలక మానమున్ కుకృతికై యోదేవ యంచాడె నా
కడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(సిద్ధరామయ్య ఆవేదన)
నడ్డిన్ నొప్పని నాకిటంచు జననే నానాడు ధర్మస్థలిన్
యెడ్డీయూరపు డీవురమ్ము సరినీ యిష్టంబు గైకొన్మనన్
బిడ్డండాతడు రాహులుండు వడిగా బిల్వంగ డిల్లీకి...నా
కడ్డంబయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్
గమనిక: నడ్డినొప్పికి తంత్రం అఖండ యతి :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సనకసనందుల శాపం వల్ల జయవిజయుల ఆవేదన:
రిప్లయితొలగించండిశార్దూలవిక్రీడితము
గడ్డౌ కాలము వీడ లేము హరి! వేగంబే మిమున్ జేరెడున్
దొడ్డౌ దారిని జూపు మన్న పరులౌదుర్మార్గమున్ జూపితే
నడ్డాదిడ్డపు రాక్షసాధములుగానయ్యయ్యొ వైరమ్ములే
నడ్డంబయ్యెను ధర్మవర్తనము కట్టాకార్యసంసిద్ధికిన్
(ప్రయత్నం పరిశీలించ మనవి)
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు కవిపండితులు శ్రీ సూరారం శ్రీనివాసులు గాగా సూచిత సవరణలతో :
తొలగించండిశార్దూలవిక్రీడితము
గడ్డౌ కాలము వీడ లేము హరి! వేగంబే మిమున్ జేరగా
దొడ్డౌ దారిని జూపు మన్న పరులై దుర్మార్గమున్ జూప మీ
రడ్డాదిడ్డపు రాక్షసాధమత సాధ్యంబద్ది యంచాడఁగా
నడ్డంబయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్
(ఆవు-పులి కథ)
రిప్లయితొలగించండి————————————
ధర్మ వర్తన మడ్డు కర్తవ్యమునకు
సుతుని యెడల వాత్సల్యమ్ము ; సూనృత మను
నియతి గల నమ్మొదవు సత్య నిరతి తోడ
కడగి సాగగ పుండరీకము కడకును.
దేవిక గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువర్యా!
రిప్లయితొలగించండినిన్నటి సమస్య
రిప్లయితొలగించండి-----------
అరయ నరోత్తముండు రఘురాముడు సంచిత సద్గుణంబులన్
నిరతము పెంపొనర్పగ వినిర్మల సత్య మనోఙ్ఞ వీక లా
భ రతుడు పెండ్లియాడె గద భామిని సీతను ప్రేమ మీరగన్
తరళిత భవ్యమౌ నటుల తా పతియై తరితీపు పండగన్ !
దేవిక గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదములో యతి దోషం
తొలగించండిఇడ్డెన్లమ్మెడి యవ్వ కన్గొనగనా యింపైన సాంబారునన్
రిప్లయితొలగించండిలడ్డున్వోలెడి బల్లి నొక్కటిని నాలస్యమ్ముగన్ వీధినిన్
తెడ్డున్తోడుత తీసి వైచుచునుతా తియ్యన్గ నమ్మున్గదా!👇
"అడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్"