13, జూన్ 2018, బుధవారం

సమస్య - 2705

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద"
(లేదా...) 
"ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

108 కామెంట్‌లు:


  1. ఒడ్డె నిల్లాపె నొక జూదరుడగు భర్త !
    పంపె నడవికి మరియొక భర్త లోకు
    ల కొరకై ! చూడ గాను లలనల లేమి,
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయ లు గద!

    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "ఒడ్డె నిల్లాపె జూదరి యొక్క భర్త" అందామా?

      తొలగించండి
  2. ఏ పురాణము నందున నెచ్చటయ్య:
    "ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద?"
    చదివితిని నేను నీరీతి చక్కగాను:
    "ఊర్మిళయు సీతకును తండ్రి యొక్కడేను"

    రిప్లయితొలగించండి
  3. గరికిపాటి వారి పూరణ.....

    శ్రీ పరమావతారమగు సీత చిదగ్ని జనించె కృష్ణయే
    యీ పృథివిన్ జనించుటకు నిర్వురకున్ దగె యజ్ఞ మొక్కటే
    కాపురమందు నింద బడి కానన మందున కష్ట మందుటన్
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. గరిక పాటి సాటి గరిక పాటి యే :)


      జిలేబి

      తొలగించండి
    2. “గరికపాటి” అంతా ఒకటే పదం జిలేబి గారూ ☝️. ఇంటిపేర్ల విషయంలో మీకు, మరికొందరికి ఏదో block ఉన్నట్లుందే 🤔?

      తొలగించండి


    3. ఇంటి పేర్ల నడుమ విడువమాకు తలము
      విన్నకోట వారు విక్కి విక్కి
      యేడ్తు రమ్మ రమణి యేలనే తలనొప్పి
      తలము వీడ కమ్మ తమ్మికంటి :)

      జిలేబి

      తొలగించండి
    4. మేము “వెక్కం” (రాయుడా, మజాకా?) కాబట్టి ... చిర్రుబుర్రు లాడ్దె రమ్మ ... అని మార్చండి (ఛందస్సు గట్రా మీరు చూసుకోండి). అసలు .. పేర్లు, ఇంటిపేర్లు సరిగ్గా వ్రాయడం (అంటే ... సదరు వ్యక్తి తన పేరు ఎలా వ్రాసుకుంటారో ఎదుటివారు కూడా ఆ వ్యక్తి పేరు అలాగే వ్రాయడం అన్నమాట) అలవాటు చేసుకుంటే సొంపుగా ఉంటుంది కదా.

      తొలగించండి
    5. అయ్యా! విన్నకోట వారూ:

      వారి ఇంటిపేరు "గరికపాటి" కాదు..."గరికిపాటి"

      http://srigarikipati.com/

      తొలగించండి


    6. గరికిపాటి సాటి గరికిపాటియె గద

      జిలేబి

      తొలగించండి


  4. శాపము కార ణంబకొ? విషాదపు జీవితమో?విచారమే,
    పాపము దైన్య పాటుగయె, పాణిగృహీతల జీవితంబు సూ !
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా,
    యోపమి జూపి రయ్య నట యొడ్డుచు పత్నుల మానముల్ సదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఓపమి జూపి రయ్య నట నొడ్డుచు పత్నుల మానముల్ సదా !
      పాపము దైన్య పాటుగయె, పాణిగృహీతల జీవితంబు సూ !
      శాపమకో శుభాంగులకు ? సామ్యము చూడగ మందసానమున్
      ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      పాటుగనయె... అని ఉండాలి. నిజానికి అయె అనడం దోషం. ఆయె, అయ్యె అన్నవి సాధువులు. అక్కడ "దైన్యపాటు గద" అందామా?

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ


    పాపము ! ఘోరమైన వనవాసమునందిరి మా పతివ్రతల్ ,
    శ్రీపతినే తలంచి తమ చిత్తములందున , కష్టకాలమం...
    దాపదఁ దీర్చునంచు శరణాగతి జేసిరి , ధర్మపాలనన్
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. మొన్న వచ్చిన ఫలితాల నెన్ను తరిని
    నాడె ప్రాచార్యునకు నుపాధ్యాయు డిట్టు
    లార్య! యీసారి కక్ష్యలో నగ్రగములు
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏🙏🙏

      బహుకాల దర్శనం. బాగున్నారా?

      తొలగించండి
    2. ఆర్యా.
      నమస్కారం.
      బాగున్నానండి.

      తొలగించండి
    3. సత్యనారాయణ మూర్తి గారూ,
      చక్కని పూరణతో పునరాగమనం... సంతోషం! చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. తేటగీతి
      అత్తవారింట సుఖముల నందకుండ,
      సుత లరణ్యవాసంబున వెతలఁ బడఁగ
      ద్రపద, జనకుల మదిలోని దుఃఖముఁగన
      ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద!

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. జీవియస్ గారూ! ఆడపిల్ల తండ్రి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు! అభినందనలు!!💐💐💐

      తొలగించండి
    4. గురుదేవులకు మరియు శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  8. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,



    ఆహ ! పౌరాణి కాంకము లద్భుతముగ

    సురభి నాట్యమండలి వారు చూపి | రందు

    ద్రౌపదియు - సీత లొక తండ్రి తనయలు గద !

    విస్తుచెందుచు మిగుల గ్రామస్తు లెల్ల ,

    గౌరవించిరి శాలువల్ గప్పి చివర |

    ---;-;-------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అదురహో సురభి వారి నాట్యమండలి


      జిలేబి

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. జి లే బి గారికి న మ స్కృ తు లు

      గు రు వ ర్యు ల కు పా ద న మ స్కా ర ము లు మ రి యు‌

      ధ న్య వా ద ము లు

      తొలగించండి
  9. పాపము! దోష మించుకయు వానిది కాదది భూమిపై తగన్
    దీపిలు నాటినుండియును దెల్పగ వానికి హూణవిద్యలన్
    చూపగ నన్యసంస్కృతులశోభలు వాడనె నోక్కరోజునన్
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా

    రిప్లయితొలగించండి
  10. యాగపుత్రిక ద్రౌపది అయోనిజ సీతలవి
    కారణ జన్మలు
    పెంచిన జనకులకు పేరు తెచ్చిన పావన
    సుతలు పుణ్యాత్మలు
    కానల కేగి ఇడుముల బడ తలచవలె
    నివ్విధి వారిని సదా
    ద్రౌపది సీత లిద్దరొక తండ్రికి బుట్టిన
    బిడ్డలే కదా

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. ఆపత్కాల పూరణము:

    పూరణము చేయమనగనె స్ఫూర్తి నిడుచు
    గరికపాటి పూరణమును గనుడటన్న
    శంకరాభరణంబున సర్వు లనిరి
    *"ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలమాట చద్దిమూట కదా మరి!😊😊😊

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      పూరణలో ఇదీ ఒక పద్ధతియే. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    3. గురువుగారికీ, సీతాదేవిగారికి ధన్యవాదములు
      🙏🏻🙏🏻

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2705
    సమస్య :: ద్రౌపది సీత లిద్ద ఱొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!
    సందర్భం :: జనకజ అంటే జనకుని కుమార్తె ఔతుంది. ద్రౌపది సీత వీరిద్దరినీ అయోనిజలు అని అంటారు కదా. అందువలన వారిద్దరూ *అయోని* అనే పేరుగలిగియున్న ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. చెప్పవయ్యా! నాకు జ్ఞాపకశక్తి నశించింది. అని ఒక వయో వృద్దుడు మరొక వ్యక్తిని అడిగే సందర్భం.

    ద్రౌపది సీత లిద్దఱు సతమ్ము నయోనిజ యన్న పేరునన్
    దోప, *నయోని* యన్నదియె తోచెను వారల తండ్రి పేరుగా,
    జ్ఞాపకశక్తి పోయినది జ్ఞానము కొంత నశించె, చెప్పుమా
    *ద్రౌపది సీత లిద్దఱొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (13-6-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆ మరో వ్యక్తి విస్తుబోయి యేమి అని వుండును :)


      బాగు బాగు పూరణ అదురహో కోటవారు


      జిలేబి

      మరో వ్యక్తి పల్కుగా

      మీ మతి మరుపున్ జూడగ
      మామా యీ మొదలిసంజె మంచిగ లేద
      య్యా మీకు పద్య పూరణ
      కై! మార్చుడయా సమయము కైమోడ్చెదనౌ :)

      జిలేబి

      తొలగించండి
    2. అటులనె నో జిలేబి సమయమ్మును గైకొన కేలు మేడ్చెదన్.

      తొలగించండి
    3. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    4. జిలేబి గారూ!

      శ్రీ కోటరాజశేఖర్ గారికి !అద్భుత పూరణ!అభినందనలు!🌹👌👍🖐👏🌹
      50యేళ్ళ క్రితం విన్న సంగతి గుర్తుకొస్తున్నది.అందఱికీ తెలియదని కాదు,తెలియని వారు ఐదు శాతమైనా ఉంటారని వ్రాస్తున్నాను.
      మొదటిసారి హైదరాబాద్ వెళ్ళిన ఒక పల్లెటూరి వ్యక్తి చార్మినార్ చూచి ఆశ్చర్యపడి 'యిదెవరు కట్టారు?' అని పక్క మనిషినడిగితే "నయి మాలూమ్" అనే సమాధానం వచ్చింది.అలాగే అసెంబ్లీ వద్ద,'అసెంబ్లీ ఎవరు కట్టారు'అనడిగితే "నయి మాలూమ్"అనే జవాబొచ్చింది.అలాగే హుస్సేన్ సాగర్ వద్ద,యింకా రెండు మూడు చోట్ల యిదే సమాధానం వచ్చింది.ఆపల్లెటూరి వాడు తన ఊరికెళ్ళాక గొప్పగా మిత్రులతో యిలా చెప్పాడు."హైదరాబాద్ లో ఓ గొప్ప వ్యక్తి ఎన్నెన్నో గొప్ప కట్టడాలు కట్టాడు తెలుసా?" అని చప్పడంతో 'ఎవరా గొప్పవ్యక్తి? ' అనడి గారు వారు. "ఆయనని 'నయిమాలూమ్' అనంటారని చెప్పాడు. (ఇది శ్రీ జనార్దనరావు గారి యొక్క వాక్కు)
      ఈ భావంతో పద్యం

      మయు చాతుర్యము వెల్గు నట్టి పలు నిర్మాణమ్ములన్ జూచుచున్
      నియతిన్ వీని నెవండు గట్టెనని ప్రశింపన్, సమాధానమే
      నయి మాలూమని వచ్చె, నాతని కళా నైపుణ్యమున్ మెచ్చుచున్
      నయిమాలూము ! సలాము మీ కనుచు సన్మానమ్ము నే జేసెదన్.

      తొలగించండి

    5. ప్రశ్న వేస్తే అద్భుత మైన పూరణలలొస్తాయని తెలిసుంటే రోజూ ప్రశ్నలేద్దును :)

      అదురహో!

      జిలేబి

      తొలగించండి

    6. ఉడతాభక్తిగ :)


      నయిమాలూమెవడో గా
      ని యైదరాబాదులోన నిక్కచ్చిగ గొ
      ప్ప యివపుగుబ్బలి గాడే
      నయ చక్కగకట్టినాడు నవ్యత గానన్ :)

      జిలేబి

      తొలగించండి
    7. కోటవారికి, జిలేబిగారికీ నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
  15. ఆపద లందు ము న్గ పరమావధి నెన్న డు వీడరె న్న డు న్
    ప్రాపుగ ను న్న దైవము ను బంధు ర రీతి ని గోల్చువా ర లై
    దీపము ల ట్లు వెల్గు ల ను దివ్య ము గా ప్రసరింప జే యు నా
    ద్రౌపది సీత లిద్దరో క తండ్రి కి బుట్టీ న బిడ్డ లే క దా !
    __::::కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదం లో పరమావధి నేప్పుదు వీడరె న్న డు న్ అని సవరణ

      తొలగించండి
    2. రాజేశ్వరరావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  16. యుగము యేదైన యిక్కటు లువిద కొకటె
    అగ్ని సంభూత లగుచును నటవినడరె
    పతుల ననుగమించి భువిని బడయ కీర్తి
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యుగము + ఏదైన' అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ఏదైన(న్) + ఇక్కటులు = ఏదైన నిక్కటులు' అవుతుంది. "యుగము లేవైన నిక్కటు లువిదల కగు" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
    3. యుగము లేవైన నిక్కటు లువిదల కగు
      అగ్ని సంభూత లగుచును నటవినడరె
      పతుల ననుగమించి భువిని బడయ కీర్తి
      ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద!

      తొలగించండి
  17. వినుము పుట్టలేదొక యుగ మున వనితలు
    "ద్రౌపదియు సీత ,లొకతండ్రి తనయలు గద"
    నూర్మిళ యు నయోనిజయును ,పేర్మి తోడ
    దశరధ సుతుల సతులాయె ధరణి పైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుతులైరి' అనండి.

      తొలగించండి
  18. ఆపద లొందలేదె విధి యానతి మేరకు నక్కటక్కటా ;
    చూపరు లందఱిన్ మిగుల శోభిల జేసెడు రామలక్ష్మణుల్;
    "ద్రౌపది సీత లిద్ద ; రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా"
    యీపగిదిన్ సమస్యలివి యెన్నని పూరణ జేయగా వలెన్?
    ****)()(****
    (అన్నీ సంబంధ, బాంధవ్యాల గుఱించే ఒకే ధోరణిలో సమస్యలు వస్తున్నవి.వైవిధ్యము చూపమని మనవి,ప్రార్థన !)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు
      మీ సూచన శిరోధార్యం. ధన్యవాదాలు.

      తొలగించండి
  19. వయసుమీరిన కతనాన వచ్చెమరపు
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద
    యనెడు మాటలు వ్రాయుట యదియ ఫలము
    వేరువిధముగగాదని విన్నవింతు

    రిప్లయితొలగించండి
  20. శాప మదాయె నిద్దరికి శాశ్వతమా మరి యందమిచ్చటన్
    చాపము లైరి యిద్దరును శత్రుల జంపుట కారణంబుగన్
    బాపగ పాప భారమును వారల యోనిజలై జనించగా
    *"ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      'చాపములైరి'?

      తొలగించండి
    2. పాండవుల క్రోథము శరమనీ, ఏదేమైనా యుద్ధం జరిగి తీరవలసినదే యని పట్టుబట్టిన ద్రౌపతిని చాపమనీ అలాగే..సీతాపహరణమే రావణవథ జరగడానికి కారణం కాబట్టి ఇక్కడ రాముని క్రోధం శరమైతే, సీతను చాపమనీ అన్నానండీ. అంటే ఆ క్రోధమనే శరం ప్రయోగించడానికి సాధనములుగా ఉపయోగ పడ్డారనీ నా భావము.

      🙏🏻

      తొలగించండి
  21. సీత లిద్దఱు లేరుగ నాతు లపుడు
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలుగ ద
    లంపఁ దగ దెన్నఁడు యుగముల యెడ గలదు
    లలనల నడుమ గనుమ యలరుచు నింక

    [ద్రౌపదియు సీతయు ననక సీతలొక.. యన్న సమస్యకు నన్వయము కలుగు నట్లు చేసిన పూరణ:]



    ద్రౌపది సీత యంచు నొక ధర్మ రతుండు పతివ్ర తాఖ్యలే
    యేపగుఁ బ్రేమ నామముల నింపుగఁ బెట్టి నిరంతరమ్మునున్
    వే పిలువంగ వారిఁ గని విస్మయ మొంది తలంచి తివ్విధిన్
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  22. "ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా"
    ద్రౌపది సీతలిద్దరునుదండ్రికిబుట్టినవారుగారిలన్
    ద్రౌపదిసీతలిద్దరునుదాజనియించిరయోనిజల్గసూ
    జ్ఞాపకమున్నమేరకునుజ్ఞప్తికితెచ్చుకువ్రాసి టిట్లుగన్

    రిప్లయితొలగించండి
  23. 🎂శంకరాభరణం🎂
    సమస్య:-
    "ద్రౌపది సీత లిద్దరొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!."

    ద్రౌపది వహ్నిసంజనిత, ధాత్రిజసీత శిఖీపునీత, సం
    ప్రాపితనైపుణీకృతశరాసనభంజకవీర్యశుల్కలై
    తాపసవేషధారణవిధానవనాంతరవాససామ్యతన్
    ద్రౌపది సీత లిద్దరొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా.


    రిప్లయితొలగించండి
  24. సాపతి జేయగా వెతల చానల కేలను బట్టిరే యనన్
    భూపతు లయ్యుబో పతులు భూరిగ ధర్మము పేరునెంచుచున్
    బాపగ లేకయే శ్రమము భార్యల చిక్కుల
    బెట్టగా గనన్
    ద్రౌపది సీతలిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలే గదా!

    రిప్లయితొలగించండి
  25. పాండవ వనవాసమున ద్రౌపదిగ నక్క
    సీతగను లవకుశ లోన చెల్లివేసి
    యద్భుతముగ నటింపగ ననిరి జనులు
    ద్రౌపదియు సీతలొకతండ్రి తనయులుగద.

    రిప్లయితొలగించండి
  26. ఇర్వురిలనయోనిజ లైన యింతులైన
    గానలందున బలురీతి కష్టములను
    పొంది సత్కీర్తి మతులైన పొలతులేను
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయులుగద.

    రిప్లయితొలగించండి
  27. చూపిరి కౌశలమ్మునట శోభన ద్రౌపది గాను, సీతగా
    పాప యశోదయే తనదు పాటవ మొప్పెడు రీతిలో గనన్
    ద్రౌపది సీతలిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలే గదా
    శ్రీపతి రావు పుత్రికలు చిచ్చర పిడ్గులనంచు మెచ్చిరే.

    రిప్లయితొలగించండి
  28. పంచమాంకాలనాటకాల్ ప్రతిభబెంచు
    అందచందాల ద్రౌపదినడవియందు
    సీతసింగారి వనవాస జీవితంబు
    తీరుతెన్నులు నొకటిగా దీర్చినట్లు!
    ద్రౌపదియు,సీతలొకతండ్రితనయలుగద! (నాటకానగాక)

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (ఇద్దరు నిద్దరే...)

    చూపెను మత్స్యయంత్రమును సుందరి ద్రౌపది కొట్టమంచునో
    చూపెను నీశుచాపమును సుందరి సీతయె యెత్తమంచునో
    లేపిరి గొప్పగా బలులొలింపికు గోల్డు మెడల్సు నార్చరిన్...
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ
    బుట్టిన బిడ్డలే కదా!

    లేపిరి...మెడల్సు = lifted Olympic gold medals in archery

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్య గారు:

      "నిజంగానే సరదా పూరణ. బాగుంది. అభినందనలు."

      తొలగించండి


    2. అంటే ఇన్ని రోజులు చేసినవి "నిజంగానే" సరదా పూరణలు కావకో :)

      నారాయణ ంంంంంంంంంంంంంంంంంంంంంంం

      జిలేబి

      తొలగించండి
  30. ఆర్యా
    నా పూరణలో ఆఖరి పాదము చూడండి

    దశరధ సుతుల సతులైరి ధరణి పైన

    అని ముగింపు పలికాను అక్కడ. సుతులైరి???

    రిప్లయితొలగించండి
  31. మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందలి నేటి పద్యములలో నొకటి:


    యోగ యుక్తుఁడు సంతత ముడిగి కర్మ
    ఫలములను బొందు శాంతినిఁ బరమ మైన
    దానిఁ దగులు తఱుమ ఫలితమ్ముల నిడి
    తగులము నయుక్తుఁ డరయు బంధనము లెల్ల ..శ్రీకృష్ణ. సూక్తి.సుధా. 5.12

    మూలము:
    యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్
    అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే .. శ్రీమద్భగ. 5.12.

    రిప్లయితొలగించండి
  32. ద్రౌపది తండ్రి యా ద్రుపద దండధరుండని, యావిదేహ పృ
    థ్వీపతి తండ్రి సీతకని, ధీవర నేనెరుగంగజాలనే?
    యాపరమేశుడే జనకుడౌనని ప్రాణులకెల్ల చెప్పితిన్
    ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల
    చూపగ నుండ సామ్యములు సూరన రాఘవపాండవీయమున్
    దీపిలు శ్లేషకావ్యముగఁ దీర్చి రచించెను, కష్టమందునన్
    ద్రౌపది సీతలిద్దరొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా 
    నా పగిదిన్ వచించె మది నంటఁగ నిద్దరి నొక్క వర్ణనన్

    రిప్లయితొలగించండి
  34. పేర్మితో గాదిలి సుతలు బెరిగిరి జన
    కుల కడ నరసి సద్గుణంబుబను ; నీతి
    నడిచి సత్కీర్తి బెంచిన పడతులెన్న
    ద్రౌపదియు సీతలొక తండ్రికి తనయలు గద!

    రిప్లయితొలగించండి
  35. రెండవ పాదంలో సద్గుణంబులను అని చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేవిక గారూ! పద్యం బాగుంది కాని రెండవ పాదంలో యతి తప్పినట్లుంది?

      తొలగించండి
    2. పూజ్యులు సీతాదేవి గారికి నమస్సులు.
      రెండవ పాదంలో సద్గుణంబులను బదులుగా
      సద్గుణంబుబను అని పొరపాటున టైపు చేశాను.దానిని సవరించిన యతి సరి పోవుననుకుం టాను. దోష సవరణ చేసినందులకు ధన్యవాదములు.

      తొలగించండి
    3. ఓహో! ప్రాసయతి వేశారా! అయితే సరిపోయింది! నేనే పొరబడ్డాను! సారీ! 😊😊😊

      తొలగించండి
    4. అయ్యో! మీరు సారీ చెప్పడం బాగాలేదు.మీరు నాపద్యాన్ని చదివారని నేను చాలా సంతోషించాను.నేను యాధృఛ్ఛికంగా ఈ బ్లాగును చూడడం జరిగింది.మీ అందరి పద్యాలు చదువుతుం టే ఎంత సంతోషం కలుగుతుందో చెప్పలేను.పద్యం వ్రాయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.
      ధన్యవాదాలతో........దేవిక.

      తొలగించండి
    5. శంకరయ్యగారి బ్లాగులో చేరాక యిక వదిలి పెట్టడం జరగదు! వారి మాయాజాలం అటువంటిది! కొత్తగా వ్రాయడం మొదలు పెట్టినా బాగా వ్రాస్తున్నారు! మీకు నా శుభాకాంక్షలు!

      తొలగించండి

    6. π - ఓహో! ప్రాసయతి వేశారా! అయితే సరిపోయింది! నేనే పొరబడ్డాను! సారీ!

      సీతాదేవి గారు

      దేవిక గారెవరో తెలుసా ? శైలిని బాగా పరికించి‌ చూడుడీ శంకరయ్య గారి పాత టపాలను చూడుడీ :)

      నారాయణ +++

      జిలేబి

      తొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద

    సందర్భము: పోలికలు చూస్తే మాత్రం ద్రౌపది సీత ఒక తండ్రి కుమార్తెలే అనిపిస్తుంది. ఆ పోలిక లేవీ.... అంటారా!.......
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అగ్ని సంజాత ద్రౌపది; అగ్ని జాత
    సీత; ఘన ధనుర్విద్యచేఁ
    గ్రీత లయిరి;
    అడవి దారులఁ బడిరి; సామ్యములఁ జూడ..
    ద్రౌపదియు సీత లొక తండ్రి తనయలు గద!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    13.6.18

    రిప్లయితొలగించండి
  37. సరదా పూరణ:

    నెల్లిమర్ల - విజయనగరం ప్రక్కనే ఉన్న నా బాల్య,కౌమారములు గడచిన ఊరు.

    ద్రౌపది యన్న నామమును ధారుణి లోనిక నేటికాలమున్
    పాపల కిత్తురా యనుచు పైబడు టేలకొ? నెల్లిమర్లలో
    ద్రౌపది నామమున్ గలుగు దామరకంటికి సీత చెల్లెలే
    *"ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా"*

    ఆ ఊర్లో మా పక్కింటావిడ పేరు ద్రౌపది. ఆమెకు సీత అనే చెల్లెలు ఉందేమో మరి! 😄

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తామరకంటి = స్త్రీ : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

      తొలగించండి
  38. రామాయణమంతా విని రాముడికి సీతేమౌతుందని అడిగాడట వెనకటికి. వాడు ఈ రోజు నాతో పిచ్చాపాటి మాట్లాడటానికి వచ్చాడు.. ఇక నా పరిస్థితి యేమని చెప్పనూ!

    ఓపిక లేదనంచు నిక యూరక యుండక వాగుడెందుకో
    ప్రాపును పొందలేక మరి భారతమాది పురాణగాధలున్;
    పాపమ దేమి జేసితిని పాడియ నీకు నిదిట్లు జెప్పగన్
    *"ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా"*

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టా సత్యనారాయణ
    తండ్రి కూతురు నిచ్చుట తగును వరులు
    ఐదుగురికిచ్చి తంటాల నపుడు పడగ
    బుద్ధి దెచ్చుక నొకనికే పో నటన్న
    ద్రౌపదియు సీత"లొక తండ్రి "తనయలు గద!

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టాసత్యనారాయణ
    ఆపని తల్లి పెత్తనము,"నందరు బంచుకొనండి పండన"
    న్నోపును,తండ్రి లేడుగద,నుయ్యియొ గొయ్యియొ జూచుకొంట కా
    దాపున దండ్రి పెద్దవగ దాశరథిన్ గన గల్గె సీత యే
    ప్రాపును లేని కష్టముల పాలవ నోపని దివ్య ప్రేమచే
    ద్రౌపది సీతలిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలే గదా!

    రిప్లయితొలగించండి



  41. వెతలనందె కానలయందు విభుని వీడి

    తానయోనిజయయ్యును తపనచెందె

    నరసి చూడంగనిద్దరున్ నవనియందు

    ద్రౌపదియు సీత లొక తండ్రి తనయులుగద.

    రిప్లయితొలగించండి
  42. పాపము భామలిద్దరును భర్తల గూడిరి కాననమ్ములన్
    తాపము లోర్చి కూల్చిరిగ తప్పులు జేసిన దుండగీడులన్
    చేపను నొడ్డె ద్రౌపదియె చెన్నుగ చాపము నొడ్డెసీతయే...👇
    "ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా" :)

    రిప్లయితొలగించండి
  43. సితా దేవి, ద్రౌపది, లక్ష్మీ దేవి కాకుండా ఇంకా ఎవరైనా అయోనిజలు మన పురాణాలలో ఉంటే దయచేసి చెప్పగలరు.

    రిప్లయితొలగించండి