గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2696 సమస్య :: *పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్లొకో.* పుంస్త్వం లేని వాడు భార్యని బిడ్డని పొందడం ఎలా ? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: నెల్లూరు పరిపాలకుడైన మనుమసిద్ధి మహారాజుకు, సామంతుడైన కాటమరాజుకు యుద్ధం జరిగింది. మంత్రిగా ఉండిన ఖడ్గతిక్కన యుద్ధంలో ఓడిపోయి తన ఇంటిని చేరుకోగా అతని భార్య చానమ్మ శత్రువులకు వెన్ను చూపి వచ్చిన భర్తను జూచి ‘’ ధైర్యంగా యుద్ధం చేయకుండా పాఱిపోయి భార్యాబిడ్డలను చూడటానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇంతకుముందు ఇంటిలో అత్తగారితో కలసి ఇద్దరు ఆడవాళ్లము. ఇప్పుడు పుంస్త్వము లేని మీతో కలసి మొత్తం ముగ్గురు ఆడవాళ్లమైనాము’’ అని అమర్యాదగా మాట్లాడి అవమానించి అతనిలో పౌరుషాన్ని రేకెత్తించింది. తక్షణమే రణతిక్కన రణరంగానికి వెళ్లి వీరోచితంగా పోరాడి వీరమరణాన్ని పొంది వీరస్వర్గాన్ని అలంకరించాడు. అప్పుడు స్వర్గంలో ఒక అప్సరస మరియొకరితో ఖడ్గతిక్కన గుఱించి చెప్పే సందర్భం.
పుంస్త్వము నంది యుద్ధమున పోరుచు వచ్చెను నేడు; నాడు తా పుంస్త్వము లేనివా డితడెపో రణతిక్కన వెన్నుఁ జాపె, నీ పుంస్త్వ విహీనుఁ జూచుచు నపూర్వముగా సతి దూఱె నత్తఱిన్ *పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్టులో ?* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-6-2018)
కవిమిత్రులకు విన్నపం! కొందరు తమ పూరణలను బ్లాగులోను, వాట్సప్ సమూహంలోను, ఫేసుబుక్కులోను పెడుతున్నారు. (కొందరు నా వ్యక్తిగత వాట్సప్ కు కూడా పంపుతున్నారు). అన్ని చోట్లా వారి పూరణలపై వ్యాఖ్యానించాలంటే నాకు సమయం చాలడం లేదు. శ్రమ ఎక్కువౌతున్నది. "ఏదైనా ఒక్కచోట మాత్రమే పెట్టండి" అనడం సముచితం కాదు. ఎందుకంటే అందరికీ తమ పద్యాలను ఎక్కువమంది చూడాలని, స్పందించాలని కోరుకుంటారు. అందుకని నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏదో ఒకచోట మాత్రమే సమీక్షించి మిగతా చోట్ల ఉపేక్షిస్తాను. (ప్రస్తుతం ఫేసుబుక్కులో అదే చేస్తున్నాను). మిత్రులు అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాను.
వాట్సాప్ గ్రూపులో నేను కూడా సభ్యుడిని అవ్వాలని భావిస్తంన్నాను.. దయచేసి ఈ సాహితీ యజ్ఞం లో నన్ను కూడా భాగస్వామి ని చెయ్యండి.. నా వాట్సాప్ నెంబరు. 9553219978 మీరు link అయినా ఇవ్వండి
*తాచ్ఛీల్యే త్వం ... అనే ప్రత్యయం వస్తుంది. అది ప్రాతిపదికలపై చేరుతుంది. త్వం ప్రత్యయము సాధారణంగా ధాతువులపై చేరదు. ధాతువును ప్రాతిపదికగా చేస్తే చేయవచ్చు.ఉదా. శంస్త్వం ... శంస్ అనే భావము. స్రంస్త్వం ... స్రంస్ అనే భావం.. ఇలాగ చేయవచ్చు.
ఆచార్యులు శ్రీ రాణీ సదాశివమూర్తి గారి వివరణ. వారికి నమస్సులతో ఆ మేరకు పద్యంలో మార్పు.
పుంస్త్వము లేదను దుఃఖపు స్రంస్త్వము రానీక, పొంది శస్త్ర చికిత్సన్, శంస్త్వంబున సుతు బడసెను పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుంగాంచెన్
పుంస్త్వమ్ముండగ పూర్వము
రిప్లయితొలగించండిపుంస్త్వముతో భార్య గూడి పుత్రుని నొందెన్;
పుంస్త్వము పోగా, కనులను
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
కాంచు = చూచు
😄👌🏻👏🏻
తొలగించండిప్రాసను జయించారు.
😊
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివిమలమతి జని యనాధా...
శ్రమమునకొక బిడ్డఁ దెచ్చి సాకగ , గని , పుం....
స్త్వము లేని భర్త యవుఁబో
కొమరున్ సతి గాంచె నెట్లొకో" యనిరి జనుల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారు ఉత్పలమాల పాదాన్ని కందంలో ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపుంస్త్వము పుంస్త్వంబనుచున్
పుంస్త్వంబు నటతెగనాడ పుణ్యము గలదే?
పుంస్త్వము కోరి విభుని దయ,
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్!
జిలేబి
ఇవ్వాళ కంది వారు సెలవా ?
మరీ యిట్లాంటి ప్రాసయా !
😃👏🏻👌🏻
తొలగించండినేను క్లీన్‌బౌల్డ్ మరియు డకౌట్ ఈ ప్రాసకి.
లేదా కాపీకేట్ అనిపించుకోవాలి 😀
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పదిరోజుల క్రితం షెడ్యూల్ చేసిన సమస్యల వరుసలో ఇది ఈరోజు వచ్చింది. అంతే! సెలవు పెట్టలేదు.
కందం
రిప్లయితొలగించండిపుంస్త్వముఁ గల నభిమన్యుని
పుంస్త్వమున కిరీటి గనియె మును, యుత్తర కా
పుంస్త్వము చెంద బృహన్నల
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
(ఒక చిన్న ప్రయత్నం. పరిశీలించ ప్రార్థన)
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత గందరగోళంగా ఉంది (నాకైతే)..
గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన
తొలగించండికందం
పుంస్త్వముఁ గల నభిమన్యుని
పుంస్త్వమున కిరీటి గనియె మును, యుత్తర కా
పుంస్త్వ వరునిడ బృహన్నల
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపుంస్త్వపు వీర్య కణమ్ముల
సంస్తవనీయతను గలుప సాధ్వికి నిసువౌ
పుంస్త్వము పరాయిదైనను
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ప్రాస తప్పింది. భావం కూడా కొంత గజిబిజిగా ఉన్నది.
డా.పిట్టానుండిఆర్యా}, గలుప అనడంలో సంతాన బీజములగల వీర్యమును చేర్చగా.పరాయివీర్యము3వ పాదములో..ఈమేళనమున అని భావము. స.త.వలు ప్రాసలోనున్నవి కదా,ఒకచోట రాకున్నా.
తొలగించండిడా.పిట్టానుండిఆర్యా}, గలుప అనడంలో సంతాన బీజములగల వీర్యమును చేర్చగా.పరాయివీర్యము3వ పాదములో..ఈమేళనమున అని భావము. స.త.వలు ప్రాసలోనున్నవి కదా,ఒకచోట రాకున్నా.
తొలగించండిపుంస్త్వము కలిగిన సురలట
రిప్లయితొలగించండిపుంస్త్వపు కోరిక లతోన భోగము నొందెన్
పుంస్త్వపు చూపులు గలిపిన
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
కిట్టించాను గానీ ?...?....?
అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. కాని అంతా గడబిడగా ఉంది.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపుంస్త్వము కాంతికిన్ గలదొ పుంస్త్వము గాలికి నుండ గర్ణుడున్
పుంస్త్వపు భీమసేనుడును బుట్టిరి గిట్టిరి యూహ శోధనల్(Science from fiction)
పుంస్త్వము మీద జేయగను, బూన్చ పటిష్టపు వీర్య బీజమున్
పుంస్త్వము లేని భర్త యవు బో కొమరున్ సతి గాంచె నెట్లొ బో
పుంస్త్వము లేని భర్త యవు బో కొమరున్ సతి గాంచె"నట్లె" బో!!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుంస్త్వము లేదని ధైర్యము
రిప్లయితొలగించండిస్రంస్త్వము కానీక యొకడు శస్త్ర చికిత్సన్
శంస్త్వంబుగ సుతు బడసెను
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుంగాంచెన్
(శబ్ద సాధుత్వము నాకు తెలియదు)
విజయకుమార్ గారూ,
తొలగించండిదుష్కర ప్రాసను ఛేదించే మీ ప్రయత్నం ప్రశంసనీయం. బాగున్నది. అభినందనలు.
కాని నిఘంటు శోధనలో 'స్రంస్త్వము, శంస్త్వము'ల అర్థాలు లభించలేదు.
స్రంస్, శంస్ ధాతువులనుండి నేను సృష్టించిన పదాలవి. వాటి సాధుత్వంపై నాకు అవగాహన లేదు . ఒక ప్రయత్నం మాత్రమే.
తొలగించండిపుంస్త్వము లేదని వగవకు
రిప్లయితొలగించండిపుంస్త్వము గలిగెడు చికిత్స పొందగ వచ్చున్
పుంస్త్వము పుంజుకొన గలరు
"పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅముల్ బట్టరులాంటి మగడు ప్చ్ :)
"అములు నవనీత" మైన
ట్టి మగడు! పనిలేనివాడు! ఠీవియు లే! పుం
స్త్వములేని భర్త యవుఁబో !
కొమరున్ సతి గాంచె నెట్లొకో గడుసరియే :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిభేష్! సాధించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఏదో ప్రయత్నించా....సఫలమో....విఫలమో....☺️
రిప్లయితొలగించండి"పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్లొకో"
పుంస్త్వపు గర్వమున్ గలసి పూనిన కామముఁ బ్రేయసీ ప్రియుల్
పుంస్త్వము తోసుతున్ గనిరి, పుట్టిన వాని ననాధగా విడన్
పుంస్త్వము లేదనిన్ వ్యధయె పోవగ బెంచిరి నూత్న జంటయే!
నూత్న జంట అనగా మరియొక జంట అని నా భావన
తొలగించండివిట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "పుంస్త్వము లేని యా వ్యథయె పోవగ..." అనండి.
ధన్యవాదాలు గురువుగారూ!
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2696
సమస్య :: *పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్లొకో.*
పుంస్త్వం లేని వాడు భార్యని బిడ్డని పొందడం ఎలా ? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: నెల్లూరు పరిపాలకుడైన మనుమసిద్ధి మహారాజుకు, సామంతుడైన కాటమరాజుకు యుద్ధం జరిగింది. మంత్రిగా ఉండిన ఖడ్గతిక్కన యుద్ధంలో ఓడిపోయి తన ఇంటిని చేరుకోగా అతని భార్య చానమ్మ శత్రువులకు వెన్ను చూపి వచ్చిన భర్తను జూచి ‘’ ధైర్యంగా యుద్ధం చేయకుండా పాఱిపోయి భార్యాబిడ్డలను చూడటానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇంతకుముందు ఇంటిలో అత్తగారితో కలసి ఇద్దరు ఆడవాళ్లము. ఇప్పుడు పుంస్త్వము లేని మీతో కలసి మొత్తం ముగ్గురు ఆడవాళ్లమైనాము’’ అని అమర్యాదగా మాట్లాడి అవమానించి అతనిలో పౌరుషాన్ని రేకెత్తించింది. తక్షణమే రణతిక్కన రణరంగానికి వెళ్లి వీరోచితంగా పోరాడి వీరమరణాన్ని పొంది వీరస్వర్గాన్ని అలంకరించాడు. అప్పుడు స్వర్గంలో ఒక అప్సరస మరియొకరితో ఖడ్గతిక్కన గుఱించి చెప్పే సందర్భం.
పుంస్త్వము నంది యుద్ధమున పోరుచు వచ్చెను నేడు; నాడు తా
పుంస్త్వము లేనివా డితడెపో రణతిక్కన వెన్నుఁ జాపె, నీ
పుంస్త్వ విహీనుఁ జూచుచు నపూర్వముగా సతి దూఱె నత్తఱిన్
*పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్టులో ?*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-6-2018)
నేటి సమస్యకు రెండవ పూరణ
తొలగించండిసుమతిన్ గైకొనె దత్తత
విమలు నొకని పెంచుకొనగ విజ్ఞతతో, పుం
స్త్వము లేని భర్త యవుఁబో
కొమరున్ సతి గాంచె నెట్లొకో శుభ మయ్యెన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
కవిమిత్రులకు విన్నపం! కొందరు తమ పూరణలను బ్లాగులోను, వాట్సప్ సమూహంలోను, ఫేసుబుక్కులోను పెడుతున్నారు. (కొందరు నా వ్యక్తిగత వాట్సప్ కు కూడా పంపుతున్నారు). అన్ని చోట్లా వారి పూరణలపై వ్యాఖ్యానించాలంటే నాకు సమయం చాలడం లేదు. శ్రమ ఎక్కువౌతున్నది. "ఏదైనా ఒక్కచోట మాత్రమే పెట్టండి" అనడం సముచితం కాదు. ఎందుకంటే అందరికీ తమ పద్యాలను ఎక్కువమంది చూడాలని, స్పందించాలని కోరుకుంటారు. అందుకని నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏదో ఒకచోట మాత్రమే సమీక్షించి మిగతా చోట్ల ఉపేక్షిస్తాను. (ప్రస్తుతం ఫేసుబుక్కులో అదే చేస్తున్నాను). మిత్రులు అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యో నమః
తొలగించండివాట్సాప్ గ్రూపులో నేను కూడా సభ్యుడిని అవ్వాలని భావిస్తంన్నాను..
తొలగించండిదయచేసి ఈ సాహితీ యజ్ఞం లో నన్ను కూడా భాగస్వామి ని చెయ్యండి..
నా వాట్సాప్ నెంబరు.
9553219978
మీరు link అయినా ఇవ్వండి
శుక్రమది నామమత్రము చలనహీనము
రిప్లయితొలగించండిఅది కదలగ లేదు
నపుంసకత అడ్డు నిలిచె శ్రోణితమును చేర
వీర్యము పోదు
కృత్రిమ గతి పిండమేర్పడె సాంకేతికతలన
ఏమొకో
పుంస్త్వము లేని భర్త యవుబో కొమరున్
సతి గాంచె నెట్లొకో
పుంస్త్వము లేదని వగచక
రిప్లయితొలగించండిపుంస్త్వము గలవానియెంచి పూజింపంగన్
పుంస్త్వము దానము చేయగ
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుని గాంచెన్!
పూర్వము సంతానాన్ని నియోగ పద్దతి ద్వారా ( మహాభారతం),ఇప్పుడు వీర్యదాతల ద్వారా పొందే వీలున్నది!
సుమతియె మంత్ర జపంబున
తొలగించండిన్నమలిన రీతిన్ పిలువగ నార్యుల దా పుం
స్త్వము లేని భర్త యవుబో
కొమరున్ సతిగాంచె !నెట్లకో యనగలమే?
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'వాని నెంచి' అనండి.
రెండవ పూరణ రెండవ పాదం ప్రారంభంలో ద్విత్వ నకారమెందుకు?
ధన్యవాదములు గురుదేవా! రెండవ పూరణలో ముందు ఒక నకారమే వ్రాశాను! మళ్ళీ సందేహం వచ్చి ద్విత్వమునుంచాను! సవరిస్తాను! 🙏🙏🙏
తొలగించండిపుంస్త్వము లేదని వగచక
తొలగించండిపుంస్త్వము గలవానినెంచి పూజింపంగన్
పుంస్త్వము దానము చేయగ
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుని గాంచెన్!
సుమతియె మంత్ర జపంబున
తొలగించండినమలిన రీతిన్ పిలువగ నార్యుల దా పుం
స్త్వము లేని భర్త యవుబో
కొమరున్ సతిగాంచె !నెట్లకో యనగలమే?
పుంస్త్వములేదనివగవకు
రిప్లయితొలగించండిపుంస్త్వములేకుండయికనుబుత్రులగనగ
న్బుంస్త్వపుమందులు గలుగుట
పుంస్త్వములేనట్టిభర్త పుత్రుంగాంచెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్లొకో"
రిప్లయితొలగించండిపుంస్త్వములేకపోయిననుబుత్రులనొందగవచ్చునెట్లనన్ బుంస్త్వమువానివీర్యమునుబొందుగబంపగ గర్భమందునన్ బుంస్త్వమువానివోలెయికబుత్రులబొందగ వీలుగల్గుసూ
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
సమ ధి క సాంకేతిక ముగ
రిప్లయితొలగించండిశ్రమియించి చికిత్స చేయు శాస్త్రము తో పుo
స్త్వము లేని భర్త య వు బో
కొమరు న్ సతి గాంచె నెట్ లొ కో యం చ న రే!॥।
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పూరణ:
రిప్లయితొలగించండికందం
పుంస్త్వము గావలె మగనికి
పుంస్త్వము ననె సుతుఁ గనంగ మూలిక లందన్
పుంస్త్వము సమకూరంగ న
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు *
పుంస్త్వము మగటిమి చిహ్నము,
రిప్లయితొలగించండిపుంస్త్వము వంశమును నిలుపు పుంభావము తోన్
పుంస్త్వమె ఘనమౌ జూడఁ న
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్.
బాల సుబ్రహ్మణ్యం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*తాచ్ఛీల్యే త్వం ... అనే ప్రత్యయం వస్తుంది. అది ప్రాతిపదికలపై చేరుతుంది. త్వం ప్రత్యయము సాధారణంగా ధాతువులపై చేరదు. ధాతువును ప్రాతిపదికగా చేస్తే చేయవచ్చు.ఉదా. శంస్త్వం ... శంస్ అనే భావము. స్రంస్త్వం ... స్రంస్ అనే భావం..
రిప్లయితొలగించండిఇలాగ చేయవచ్చు.
ఆచార్యులు శ్రీ రాణీ సదాశివమూర్తి గారి వివరణ. వారికి నమస్సులతో ఆ మేరకు పద్యంలో మార్పు.
పుంస్త్వము లేదను దుఃఖపు
స్రంస్త్వము రానీక, పొంది శస్త్ర చికిత్సన్,
శంస్త్వంబున సుతు బడసెను
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుంగాంచెన్
(దుఃఖపు భావన రానీక; శంస్త్వంబున= ప్రశంసా భావమున)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆర్యా నేనును త్వ ప్రయోగము ధాతు పదాలకు చేయ కూడా దేమో యని విరమించుకున్నాను. కానీ కొన్నిటికి నలా చేయ వచ్చునని ఇప్పుడు తెలిససినది. ధన్యవాదములు.
తొలగించండినమస్సులండీ. ధాతువును ప్రాతిపదిక చేసిన తరువాతే త్వ ప్రత్యయం ప్రయోగించాలి. అపవాదాలు మనం అనుసరించ కూడదు అనుకొంటాను. అలా అయితే నా పద్యం దోష భూయిష్టమే.
తొలగించండిపుంస్త్వమగు భూష నీచా
రిప్లయితొలగించండిపుంస్త్వము ధీరులకుఁ దాపము సుమి వసుధలోఁ
బుంస్త్వ మధిక మించుక కా
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
[నీచ +అపుంస్త్వము = నీచాపుంస్త్వము; కా పుంస్త్వము = చెడ్డ పౌరుషము]
కొడుకు కూడ పౌరుష హీనుఁడు కాగలఁ డేమో యని సతి బాధ:
విమలమతి నుతించెన్ సతి
కమలాయత లోచను గృపఁ గావు మనుచుఁ బుం
స్త్వము లేని భర్త యవుఁబో
కొమరున్ సతి గాంచె నెట్లొకో యో కృష్ణా
[పుంస్త్వము = పౌరుషము]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుంస్త్వము లేనిచో బడయ పుత్రుల దుర్లభ మన్న నానుడిన్
రిప్లయితొలగించండిపుంస్త్వము లేని వాని కరముం గొని ముద్దియ కల్ల జేసె నా
పుంస్త్వము లేని భర్త దగు మూలకణమ్మున బల్క బోకుమా
పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్లొకో.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బ్రమతో వైద్యుల సేవా
రిప్లయితొలగించండిశ్రమగా దంపతుల ఖర్చు సాధనచే పుం
స్త్వములేనిభర్తయవుబో
కొమరున్ సతిగాంచె నెట్లొకోననబోకన్ (నేటిఆధునికవైద్యంతో)
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పోక' కళ. 'పోకన్' అనరాదు. "ఎట్లోకో యనకుండన్" అనండి.
కమలాయత నేత్రి కనగ,
రిప్లయితొలగించండిసుమేరువునివాసి నెమ్మిచూడగ సుతు, పుం
స్త్వము లేని భర్త యవుఁబో
కొమరున్ సతి గాంచె నెట్లొకో యనిరి జనుల్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(పండితుడు bacterium తో)
"పుంస్త్వము పుష్టిగా కలదె పుత్రులు పౌత్రులు తాతగార్లకున్?"
"పుంస్త్వమె లేదు పండితుడ! పుట్టుక నుండియు నేటికిన్ భళా"
"పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్లొకో?"
"పుంస్త్వము లేకయే విరిగి పుట్కని రెండుగ చీలిపోవగా"
శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
సార్! సరదా పూరణలు వృత్త రచన practice కోసం. 🙏
తొలగించండికొనసాగించండి... మంచి అభ్యాసమే...
తొలగించండి👏👏😄😄
రిప్లయితొలగించండి😊
తొలగించండిగురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండిజడ శతక పద్యముల సంకలనమునకు పైసలు పంపవలెనన్న ఎడ్రసు తెలుపగలరు . సెలవు . అక్క రాజేశ్వరి
Kandi Shankaraiah
తొలగించండిA/C No. 62056177880
State Bank of India,
Warangal Main.
IFC - SBIN0020148
కందం
రిప్లయితొలగించండిప్రముఖుండగు వైద్యుఁడొసఁగఁ
గ మూలికఁ గొన సమకూర గట్టితన మపుం
స్త్వము లేని భర్త యవుఁబో
కొమరున్ సతి గాంచె! నెట్లొకో యనఁ దగునే?
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు *
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[భీష్ముఁడు తనను భార్యగాఁ గొనని కారణమున నంబ, తపస్సుఁ జేసి, మఱొక జన్మమున ద్రుపదునకుఁ గూఁతురుగా "శిఖండి" యను పేర జన్మించెను. స్త్రీ యయిననుఁ బురుష వేష్యగా నామెనుఁ బెంచి, యౌవనమున నొక రాజకుమార్తెతోఁ బెండిలి సేసెను. ఆమె, ’శిఖండి పుంస్త్వము లేనివా’ డని గుర్తెఱిఁగి, తన తండ్రికిఁ దెలుపఁగా, నతఁడు, ’ద్రుపదుఁడు తనను వంచించ’ నను కినుకతో, దండెత్తి రాఁగా, దాని నవమానముగాఁ దలఁచి, శిఖండి యాత్మహత్యకుఁ బూనుకొనఁగా, నొక యక్షుఁ డామెకుఁ దన పుంస్త్వము నిచ్చి, యామె స్త్రీత్వమును దాఁగొనెను. ఈ విధముగ సంతోషమున శిఖండి భార్యతోఁ గాపురముఁ జేసి, యొక కొమరుం గాంచఁగాఁ, "బుంస్త్వము లేనివాఁడు పుత్త్రునిఁ గనినాఁ డిదేమి చోద్య" మంచు నిటుల నిందించవచ్చునా? యని నిందకులఁ బ్రశ్నించు సందర్భము]
మత్తేభమాలిక:
"పుంస్త్వవిశిష్ట! మాం వరయ పుణ్య సతీ" మ్మనుచుండి యంబయున్,
బుంస్త్వ విశేషు భీష్మునకుఁ బోరియుఁ జెప్ప, నలక్ష్యుఁడై, "యవి
ద్వాంస్త్వమిలే!" యటంచుఁ దన దారినిఁ బోయెఁ! దపస్సుఁ జేసియున్
బుంస్త్వము లేనిదై, ద్రుపదు పుత్త్రిగఁ బుట్టి, "శిఖండి" పేరిటన్
బుంస్త్వు విధానఁ బెద్దయయి, బోటినిఁ బెండిలి యాడ, నాతనిన్
’బుంస్త్వము లేని వా’ డని, గబుక్కున గుర్తిడి, తండ్రికిం దగన్
’బుంస్త్వవిహీనుఁడే తన విభుం’ డని చెప్ప, శిఖండి బాధ మైఁ
బుంస్త్వము లేని తాను మృతిఁ బొందుటె శ్రేయమటంచుఁ బో, నటన్
బుంస్త్వుఁడొకండు యక్షుఁ డిడి పుంస్త్వము, స్త్రీత్వముఁ దాఁ గొనంగ వే
పుంస్త్వముతోడఁ భార్యఁ గొని, పొందెను సంతతిఁ! దాను మున్నుగాఁ
బుంస్త్వము లేని భర్త యవుఁబో! కొమరున్ సతి గాంచె! నెట్లొ కో
పుంస్త్వము లేని భర్త యిటు పుత్రునిఁ గాంచెనటంచుఁ బల్కుటల్?
ఉత్పలమాలికకు బదులు మత్తేభమాలిక అని పొరపాటున టైపయినది. మన్నించండి! దానిని "ఉత్పలమాలిక"గా పఠించగలరు.
తొలగించండిఅద్భుతం..
తొలగించండిచాలా బాగుంది సార్...
తొలగించండికం.
రిప్లయితొలగించండిశుభమని పెండ్లిని జేసిన
ముభావ పెండ్లికొడుకయ్యె పుంస్త్వము లేన
ట్టిభర్త , పుత్రుం గాంచెన్
సభితయె చేసెను చికిత్స సఫలము నొందన్ .
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
సందర్భము: చెడు తిరుగుళ్ళకు మరిగి అపుత్రకుడైన వా డొకడు తన యన్న కొడుకును ప్రేమతో చేరదీసి "నా లాగా తయారుగాకురో!" యని స్వానుభవ పురస్సరంగా హితవు చెబుతున్నాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"పుంస్త్వము గల యన్న కొడుక!
పుంస్త్వముఁ బంచుచుఁ దిరుగకు...
పోవునురో! నా
పుంస్త్వము నటు లైన" దనుచు
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
పుంస్త్వపుటవసర మెక్కడ
రిప్లయితొలగించండిపుంస్త్వము తోడనె మనసున పుత్రుని కనగన్
పుంస్త్వమునేల తలచెదవు
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాన్చెన్
పుంస్త్వము= మగతనము, పౌరుషము
పుంస్త్వము లేదని తెలియగ
రిప్లయితొలగించండిపుంస్త్వకణమునుకృతకముగ పూంచ గర్భమున్
పుంస్త్వము నొందుచు పుట్టగ
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుని గాంచెన్
రిప్లయితొలగించండిపుంస్త్వము లేదని వగవకు
పుంస్త్వము లేకున్నగాని పుడమిని ననుచున్
పుంస్త్వముగలబాలునికొన
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్"