28, జూన్ 2018, గురువారం

సమస్య - 2719

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము"
(లేదా...)
"అరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్"
బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...

59 కామెంట్‌లు:



  1. అరయ సతి మోము చంద్రుని యాననమ్ము,
    అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము,
    అరయ సతి యూరువులు మరి యరటిబోద
    లరయ కవుల తలపులు పొలపొల ‌సూవె!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యాననమ్ము।నరయ.. ఆవృతమ్ము। నరయ...' అనండి.

      తొలగించండి


  2. సుర సుర యన నెండ తలపై సూటిగాను
    తగుల సతికి గొడుగుబట్టి తళుకు లీను
    కమ్మి చమకుల గాంచుచు కవియనెనయ
    "అరయ సతి!, గుబ్బగవ, యనలావృతమ్ము"

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కలికి పయ్యెద తొలగగన్ గాంచి నంత
    తనువు దహియింప సాగగన్ తాళలేక
    తలచితిగద నీ రీతిగ తమక మందు
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము.

    రిప్లయితొలగించండి
  4. కన్న రారాయనుచు తనచన్ను గుడువ
    చిన్ని కృష్ణుని బిలువగ వెన్నుడచట
    క్షీరధార గాక విషము చిందగ గన
    నరయ సతిగుబ్బగవ యనలావృతమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      పూతనా ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  5. మరవ వలదు మిత్రమ యెప్డు మాట నాది
    సరసముగ దొరకుచునిల సంతసముగ
    కరచు పూతన వంటిది కారు చిచ్చు
    యరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదంలో రెండు అక్షరాలు ఎక్కువ అయ్యాయేమో !

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిచ్చు + అరయ' అన్నపుడు యడాగమం రాదు. "కారు చిచ్చె। యరయ..." అనండి.
      **************
      వామన కుమార్ గారూ,
      మొదటి పాదం సరిగానే ఉన్నది.

      తొలగించండి
  6. (దక్షవాటికలో పతినింద సైపలేని సతీదేవి ఆత్మాహుతి)
    సరగున దక్షపుత్రి తనస్వామికినైన పరాభవమ్మునే
    తెరగున నోర్వలేక పదతీవ్రత భూమిని గీరగా మహ
    త్తరమగు నగ్నిపుష్ప భరితమ్ములు మాలికలెల్ల సోకగా
    నరయగ నింతి గుబ్బగవ యగ్నిశిఖావృతమై వెలింగెడిన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      సతీదేవి ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      పదతీవ్రతయా నఖతీవ్రతయా?

      తొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    కరుణను రాల్చు కన్నులను గాంచ విసమ్మును జిమ్ముచుండగా,
    గరములు చాపబాణముల కాలభుజంగములట్లు దోప , నా
    నరకు వధింపగా నడుమునన్ బిగియించిన చీరకొంగులో
    నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ సత్యభామా ప్రస్తావనతో ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శివుడు నిను గాల్చి బూదిగా జేసె , గాని
      మదము తగ్గలేదింతయు మదన నీకు !
      మదిని విరహాగ్ని రగిలించు మనసిజ ! గను
      మరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  8. సురసుర యెండ భార్యపయి సూటిగ తాకగ మాటు విప్పుచున్
    నరరె జిలేబి తళ్కు మజ నవ్వుల మోమును గాంచి, పైన కాం
    తి,రమణకెక్కు కైపుగని, తీరుగ యోచన చేసి చెప్పెనౌ
    "అరయఁగ నింతి!, గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్"

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విప్పగా నరరె/ విప్ప దా నరరె' అనండి.
      మజ/మజా పదంమీద మీకు మక్కువ ఎక్కువ ఉన్నట్టుంది. అది అన్యదేశ్యం కదా! దాని వాడకం తగ్గించండి.

      తొలగించండి

    2. మాటు - గొడుగు

      ఇప్పుడు సవరణ తరువాయి చదువతావుంటే డబల్ మీనింగు వేటూరి అయిపోయినట్టుంది


      జిలేబి

      తొలగించండి
  9. ధరనమృతంపు భాండమది స్థన్యముఁ గుడ్చెడి పిల్లవానికిన్
    హరువగు మన్మధాస్త్రమది యాలిగనొందిన వాని చూపుకున్
    పరులకుఁ జూడకూడనిది వాంఛగఁజూడ దహించునట్టిదౌ
    *"నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మనోహరమైన భావంతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  10. మును జగద్గురు శంకర నుడువగ కాంత
    సొగసులవి ఇంతింతని
    మాంసము వసలే తళుకు బెళుకులు ఎరుగక
    మరుగగ పూబంతిని
    తనకు తానై కొవ్వు మండును చూసెడి వారల
    మండించెడిన్
    అరయగ నింతి గుబ్బగవ యగ్నిశిఖావృతమై
    వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
  11. సంతసముబంచు ప్రియురాలి చెంత జేరి
    అరయ సతి గుబ్బగవ, యనలావృతమ్ము
    బహుళ కల్లోల భరితమై పరితపించు
    స్వాంత మానంద నిలయమౌ కాంతునకును.


    కుటిల భావాన నింతుల గోరి చేరు
    చెనటి జనముల కిలలోన ననుదినంబు
    దు:ఖములు గల్గు హర్షంబు తొలగి పోవు
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. డా.పిట్టాసత్యనారాయణ
    కోటికొక్క డువిద పొందు గోరకుండ
    సతత హరి చింతనను మను సహజ యోగి
    వయసు పొంగుల నావిరి వలెను మలచ
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టాసత్యనారాయణ
    (స్త్రీణామ్ వజ్రాదపి కఠోరాణి, మృదూని కుసుమాదపి)
    సరసపు వేళలన్ సుఖము సౌమ్యము బువ్వును దాకినట్లుగన్
    విరసములోన నావిషము వింతగ వంపుల గార నాగగున్
    ఖరకరు తేజమున్ గొనిన కర్కశ వజ్రపు ముక్కలై చనున్
    అరయగ నింతి గుబ్బగవ,యగ్ని శిఖావృతమై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. పుట్టి బడ్డడుజనిపోవ పురిటియందె
    అడ్డుగట్టగ నిలుచున్నయమ్మపాలు
    గడ్డగట్టగ?కన్నీరు గార్చుబాధ
    నరయసతిగుబ్బగవ?యనలావృతమ్ము

    రిప్లయితొలగించండి
  15. శివుని దూషించ కోపించి చీత్క రించి
    తానె ద హియిoచుకొన బూనె దక్షునె దు ట
    తనువు మంట ల లో జిక్కు తరు ణ మందు
    నర య సతి గుబ్బగనయన లావృతమ్ము
    ________కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  16. వరమిదె మర్త్యకోటికిని పాలను పంచెడి తల్లిచన్నులున్
    మరణము దాటి బిడ్డలకు మర్త్యపు జీవన మిచ్చుచుండెడిన్
    తరుణుల యందు భావమున తల్లిని జూడని వానిపాలిట
    న్నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2719
    సమస్య :: *అరయగ నింతి గబ్బి గవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్.*
    సందర్భం :: నరక చతుర్దశి నాడు ఒక మహిళ సంతోషంతో నాట్యం చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వరుసగా దీపాలు పెట్టింది. ఎన్నో టపాసులు కాల్చింది. చేతుల్లో చిచ్చుబడ్లను పట్టుకొని వాటిని అజాగ్రత్తగా వెలిగించింది. హఠాత్తుగా అగ్నిప్రమాదం ఏర్పడింది. అప్పుడు ఆమె వక్షస్థలం తగలబడి చిచ్చుబుడ్డి కాంతులలో వెలిగింది. కాబట్టి టపాసులు అజాగ్రత్తగా కాల్చకూడదు అని జాగ్రత్తలు చెప్పే సందర్భం.

    నరకచతుర్దశిన్ మగువ నాట్యము జేయుచు దీప మాలికన్
    కరమనురక్తి బెట్టినది, కాల్చె టపాసుల, చిచ్చుబుడ్డులన్
    కరములలోన నుంచుకొని కాల్చగ నగ్ని ప్రమాదమయ్యె, మే
    *మరయగ నింతి గబ్బి గవ యగ్నిశిఖావృతమై వెలింగెడిన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (28-6-2018)

    రిప్లయితొలగించండి

  18. అరయఁగ నింతి! గుబ్బ, గవ యగ్ని, శిఖావృతమై వెలింగెడిన్
    పరిపరి రీతులన్ జనులు పాటిగ కొల్తురు దేశ మందు, తా
    నరయగ నగ్ని పర్వతము, నమ్మిన వారికి ఫ్యూజిసాన్ జపా
    ను రయిలు దారి లో మన కనుల్బడు మేటిగ నౌ జిలేబియా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. అరయసతిగుబ్బగవయనలావృతమ్ము
    పట్టుకొనజూడగాల్చునుభస్మమటుల
    స్త్రీయనగశక్తిరూపిణిత్రిజగములకు
    వందనీయులుగదమనయందరకును

    రిప్లయితొలగించండి
  20. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    శృంగార వర్ణన. :- ప్రియుడు ప్రేయసిని అధరకములచే

    కామవిధగ్ధను జేయగా " అరయగ నింతి ••••••••••••• "



    సరస వచో ప్రవాహమున జక్కగ ముంచుచు , నంకపాళికన్

    గరుగగ జేయుచు , న్నధరకమ్ముల వెచ్చదనమ్ముతో మహా

    భిరతి రగుల్చుచున్ , బ్రియుడు ప్రేయసిఁ గామవిధగ్ధఁ జేసిన

    న్నరయగ - నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్ ! !



    { అంకపాళిక = కౌగిలి ; అధరకము =

    కుచ చుంబనము ; మహ + అభిరతి = అధిక వాంఛ ;

    కామవిధగ్ధ జేసినన్ = కామముచే దహింప బడునట్లు చేయగా ; }

    _____________________________________________

    రిప్లయితొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము

    సందర్భము: శిశువు పెద్దవా డౌతున్నా డని తల్లి పాలు మాన్పించా లని పాలిండ్లకు వేపాకురసం పూసింది.
    ఆకలి మంట జ్వాలలై చెలరేగుతుండగా పాలు గ్రోలలేక బాలు డిలా అనుకున్నాడు..
    "అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము"
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పాలు మాన్పింప రాసె వేపాకు రసము
    తల్లి ; ఆకలి జ్వాలలై తల్లడిల్ల
    గోలఁ జేయుచు బాలు డీ లీలఁ దలచె...
    "నరయ సతి గుబ్బగవ యన లావృతమ్ము"

    మరొక పూరణము...

    సందర్భము: భర్త నపుంసకుడు కాగా చాలా కాలంగా నిరీక్షించిన ఒక కామిని ఆవేదన...
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "పేడితో సుఖ మేడ? నే వీడలేను..
    కూడగాలేను.. కుందితి.. వీడు మగడె!
    పాడుగా" ననె.. ప్రాయంపు వేడి వీడ..
    దరయ సతి గుబ్బగవ యన లావృతమ్ము..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    28.6.18

    రిప్లయితొలగించండి
  22. పండుగదినాన యెండన పడతినడువ
    అద్దములరవికన సూర్యునంశుపడుట
    నరయ, సతి గుబ్బగవ యనలావృతమ్ము
    గ మనసుకుతోచి కలిగించె కనులవిందు

    రిప్లయితొలగించండి
  23. చలి వనటను కలుగజేయ, చెలియ కౌగి
    లింత లో చేరి నప్పుడు శాంతికలుగు
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము
    సఖియలేనివానికి చలి సంకటమిడు

    రిప్లయితొలగించండి
  24. చూచు చుండగ నెల్లరు చోద్యముగను
    టేఁకు తలుపు లన్నింటినిఁ దాకి వీఁక
    మంట లల్లనఁ జెలరేఁగ నింట నంత
    నరయ సతి, గుబ్బగవ యనలావృతమ్ము

    [గుబ్బ = తలుపు మీది గుండ్రముగ నుండు చెక్క దిమ్మ]


    వరుసగ నిల్పి ప్రాణము నపాయము నేకము సేసి వాటినిన్
    మరలిచి నాభి దేశమున మానుగఁ జేర్చి నుదాన మందునన్
    విరియఁగఁ జేసి చిత్తమున వీడి గళమ్మును భ్రూకుటిన్ సువం
    ద్య రగులఁ జేయ నగ్ని పతిఁ దల్చుచు దక్ష తనూజ దేహ మం
    దరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
  25. పాల బాలెను చేబట్టి పత్ని రాగ
    నడుము పైచేయి వేయుచు పడక పైన
    బెదురు వలదని కూర్చుండ బెట్ట వలయు,
    చుబుకమును బట్టి పైకెత్తి చూడ వలయు
    కనులలో వెలు గాడెడు కాంతులన్ని,
    వదన దోయిని దరిచేర్చిపెదవులజత
    మూసి వైచి మధురమైన ముద్దు లిడుచు
    సున్నితముగ భుజములను సొట్టనిడగ
    వలయు, అరుణిమ జీరలు వెలుగ కనుల
    లోన, రతిసుఖమును కోరు మేను నపుడు,
    మిత్రమా రయము వలదు, క్షేత్ర మూర్తి
    కెల్ల కంపనము కలుగు, కల్ల గాదు
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము,
    నిక్కమిది దేహము సెగలు కక్కుచుండు .
    నదియె మంచి తరుణముని మదిని తలచి
    సంగ మించ వలయు నీవు సంతసముగ
    ననుచు బలికె నస కిటుకులను సులువుగ
    నొకడు తన స్నేహితుని యొక్క సుకము కోరి



    రిప్లయితొలగించండి
  26. మరణము నొందగా తన కుమారుడు తోడ్కొని వచ్చె కాల్చగా
    కరమును కట్టమంచనగ కాపరి, లేదని చెప్ప చంద్ర, తా
    నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్
    తరుణికి చెప్పెకంఠమున తళ్కుల నీనుచు నండె కాంచితిన్
    పరులకు నమ్మి పుస్తెలను పన్నుగ కట్టుమటంచు చెచ్చెరన్

    రిప్లయితొలగించండి
  27. వింత పోకడల కవకాశ మీయ కుంటకు నిట్టి సమస్యల నీయ కున్న దాపు రించెడి నష్ట మేమి కలదు!

    రిప్లయితొలగించండి
  28. కరమునుబెద్దవైయడరికానగనయ్యెనదేమిచిత్రమో
    యరయగనింతిగుబ్బగవ,యగ్నిశిఖావృతమైవెలింగిడిన్
    నరయుముపాపికొండలకునావలదూరమునందుపెద్దగా
    తిరముగనొక్కచోటననతీంద్రియశక్తులుగూడెనాయనన్

    రిప్లయితొలగించండి
  29. సూరం శ్రీనివాసులు గారి పూరణ:

    తిరుమలలో బరాత్పరుని తీయము లెన్నగ నెన్ని!మొన్ననే
    తిరిగెను జాతరూపరథదీప్తులతో నటకేగుదెంచుచో
    మెరసెను ఛత్రచామరసమీకృతరౌప్యము
    భక్తితోడ నే
    నరయగ నింతి!గుబ్బగవ యగ్నిశిఖావృతమై వెలింగెడిన్


    గుబ్బ=గొడుగుపొన్ను

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (కలకత్తా కాళీ బెనర్జీ)

    మరవడు జ్యోతిబాసు డహ మండిన కాష్ఠము కమ్యునిస్టుదౌ
    మరవడు బుద్ధదేవు డట మండిన కాష్ఠము టాట కారుదౌ
    మరవడు కేసియారు డిట మండిన కాష్ఠము యుక్త ఫ్రంటుదౌ
    నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్


    గుబ్బ గవ = గుండ్రపు (కండ్ల) జత

    రిప్లయితొలగించండి
  31. పురజను లెల్ల వచ్చిరట మోదము మీరగ నందునింటికిన్
    మురియుచు బారసాలకని, పూతన సైతము బాలుఁజంపగన్
    తరుణిగ మారిజేరెనట దండున తానొక గొల్లకాంతయై
    యరయగ నింతి గుబ్బ గవ యగ్నిశిఖావృతమై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
  32. కవియె వర్ణించె నీరీతి కావ్యమందు
    భీరువు వదనమది చంద్ర బింబ మనుచు
    కన్నులట గాంచిన విశాల కమల రేకు
    లరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము

    రిప్లయితొలగించండి
  33. వరముగ బుట్టిచచ్చె పసిబాలుడు దుఃఖమునాపలేకనే
    గరళము వంటితూకమునుకంఠకమైననుపాలునిండగా?
    నరకమె యట్టితల్లికవి నమ్మినవాడిల ముంచిబోవగా|
    నరయగనింతిగుబ్బగవ యగ్ని శిఖా వృతమైవెలింగెడిన్ {గరళము=గడ్డిమోపు}

    రిప్లయితొలగించండి
  34. తేటగీతి
    వీరతిలకముదిద్దుము విజయుఁడగుచు
    వత్తుననె యభిమన్యుండు నుత్తరఁగని
    రాని పతి, లోని వంశాంకురముఁ దలంచ
    నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము! 

    చంపకమాల
    మురిసెద వేల నీ సుతుఁడుఁ బొందగఁ బట్టముఁ జూడనొప్పవే? 
    యిరువుగ నాడు మెచ్చి పతి యింపుగ నిచ్చిన నా వరమ్ములన్
    మఱువక గోరు రాజునని మంధర కైకకు చిచ్చు రేపగా
    నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్!

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    [సుధేష్ణాదేవి కీచకునితో సైరంధ్రినిం గూర్చి తెలుపుచున్న సందర్భము]

    కరము విమోహ తీవ్రతను కాలుచు నుంటివి; కాని, భ్రాత! యి
    త్తరుణి పతుల్ మహోన్నతులు! తప్పును సైఁపరు; దేవయోనిజుల్!
    విరహముతో సతిం బిలువ, వేగిరమే నినుఁ ద్రుంత్రు! తాఁక వ,
    ద్దరయఁగ నింతి గుబ్బగవ, యగ్ని శిఖావృతమై వెలింగెడిన్!

    రిప్లయితొలగించండి
  36. గరళము మ్రింగి ప్రాణముల గాతువె కూడదు ముట్టబోకు మా
    పరధన మెన్న కస్సుమని పైబడి కాటును వేయు పామురా
    కరమున తాకబోకు పరకాంతను దగ్ధము చేయు నిల్వునన్
    వరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్.

    రిప్లయితొలగించండి


  37. కపట బుద్ధిని చూపుచే కాంతమందు
    పరవనితనుకాంక్షింపగ వసుధయందు
    నరయ సతి గుబ్బుగవ యనలావృతమ్ము
    లగుచు దహియించు దప్పక నట్టి ధూర్తుఁ.

    రిప్లయితొలగించండి
  38. అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము
    గను దహించుచో వక్రపు జనులనెల్ల
    భీతి నొంది జూడరుగద నాతి దెసను
    ముదిత లెల్ల బొందు ప్రముదితము నపుడు.

    రిప్లయితొలగించండి
  39. అడ్డేమున్నది పెండ్లియాడ సుతుడా యానాటి నీ బాసనే
    యడ్డంచున్ దలపోయనేల మన వంశాభ్యున్నతిన్ గోరుమో
    బిడ్డా! యంచును బల్కసత్యవతితో భీష్ముండు తా జెప్పెనే
    యడ్డంబయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్.

    రిప్లయితొలగించండి
  40. కరచుచు భాజపాను భళి కంగరు పుట్టగ వంగభూమినిన్
    తరలగ బెంగుళూరికహ తందన తానన డింపులయ్యకున్
    మురియుచు మోడి పంపగను ముద్దుల గుమ్మకు సీబియైనట
    న్నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి