21, జులై 2018, శనివారం

దత్తపది - 143

చేప - రొయ్య - నత్త - పీత
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో 
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

63 కామెంట్‌లు:

  1. మైలవరపువారి పూరణ

    భూపతి రాముడు జానకి
    జేపట్టగ ., నరిగిరొయ్యఁజిత్రము వనికిన్
    ప్రాపన ., నత్తరి కన్నీ
    రే పీతంబనగ బడిరి యిడుములనెన్నో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. విభీషణుడు... లంకేశునితో...

      శ్రీపతి రాముడే ! రమయె సీత ! చెఱన్ గొన నీకు సౌఖ్యమం...
      చే పగిదిన్ దలంచితివి ? యిద్ధర సర్పమునెవ్వరొయ్యనన్
      ప్రాపుగనెంతురే ? యెరిగి రాముని పాదము గొల్వనత్తరిన్
      నీ పయి జాలిఁ జూపు ! తగునే ? నిలుపీతగవున్ విచక్షణన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. కవి పండితులగు శ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు అవధాని గారికి నమోవాకములు... మీ సూచన శిరోధార్యము....( అప్రస్తుతం.... ఈ చేపలు రొయ్యలు ఓ పట్టాన మ్రింగుడు పడటం లేదండీ...) 🙂🙏🙏

      విభీషణుడు... లంకేశునితో...

      ఇల నన్యాంగన బట్టి తెచ్చి హితమంచేపద్ధతిన్ బల్కితో ?
      బలవంతుల్ వర రామసైనికకపుల్ వారొయ్యనన్ జేరగా
      ఫలితమ్మేమగునెంచనత్తరి ? శుభంబౌనొక్కొ ? యీ లంకకున్
      విలయమ్మే గమనింపు , రక్కసుల సృక్పీతప్రమత్తుల్ గదా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  2. (శివధను ర్భంగం - సీతారామ కల్యాణం )
    విల్లు చేపట్టి రాముడు విరచివైవ
    సభ్యజను లెల్ల రొయ్యన సంతసింప
    నలఘుతేజము దిక్కుల నత్తమిల్ల
    పీతపుష్పపు మాలిక సీత వైచె .

    రిప్లయితొలగించండి
  3. తండ్రి మాటను చేపట్టి తనివితోడ
    చేరిరొయ్యన వనికకు సీతను గొని
    దశరథ సుతులు, కనుచు నత్త వసు గర్భ
    పొగల స్ఫీత హృదయ కుజ వగల నచట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కనుచు నత్త'..?

      తొలగించండి
    2. AM
      తండ్రి మాటను చేపట్టి తనివితోడ
      చేరిరొయ్యన వనికకు సీతను గొని
      దశరథ సుతులు, కనుచు నత్తరి వసుధయు
      పొగల స్ఫీత హృదయ కుజ వగల నచట

      తొలగించండి
  4. డా.పిట్టాసత్యనారాయణ
    క్రొత్తగ నుండుగాథ బహు కూరిమి*చే ప*ఠనాన పాపము
    *న్నత్త*రి నిత్తరిన్ దొలగ నాయె, జనావళి మెచ్చు గాథ వి
    ప్రోత్తమ, పండితాళి గన *రొయ్య*న దీని రహస్య మెద్దియో
    చిత్తమునందు రాముని స*పీత* పటంబు ధరించు వాని సం
    పత్తున లేమినిన్ దలప బాయును క్లేశములెల్ల నీభువిన్!

    రిప్లయితొలగించండి
  5. విల్లు । చేపట్టి రాముడు విరిచి నంత
    పలువురొయ్య న మెచ్చగా పరిణయం బు
    నత్త రి జరిగె పొంగెడు హర్ష మతులు
    పీత వసను ని గాంచి రి ప్రీతి నొ oద

    రిప్లయితొలగించండి
  6. వదలి పీతాంబరమ్ముల వనముకేగ
    నారచీరెల గట్టెగా నత్తరి కుజ
    భర్త మార్గము చేపట్టి భారమనక
    చేరె ప్రజలెల్లరొయ్యన సీతజూడ.

    రిప్లయితొలగించండి
  7. పీతవస్త్రపుధారియావీరుడపుడు
    ధనువుజేపట్టి కర్ణముదాకువరకు
    లాగిధనువునునత్తఱి లయముజేయ
    బలువు రొయ్యనగరతాళపదరొనర్చె
    ---
    పదరు=ధ్వని

    రిప్లయితొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది {చేప - రొయ్య - నత్త - పీత అనే పదాలను వేఱే అర్థంలో ఉపయోగిస్తూ రామాయణ పరంగా పద్యం}
    సందర్భం :: శ్రీరామచంద్రుడు మిథిలానగరంలో స్వయంవర సభలో శివధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టినాడు. బ్రాహ్మణోత్తములు శుభం కలగాలని ఆశీర్వదిస్తూ ఉండగా జనకాత్మజయైన సీతాదేవిని తన సహధర్మచారిణిగా చేపట్టినాడు. ఆ సమయంలో లోక కల్యాణ కారకమైన ఆ సీతారామ కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది. పీతాంబరధారియైన శ్రీ మహా విష్ణువు శ్రీ మహాలక్ష్మితో కూడినవాడై కల్యాణవేదికపై ఉండి అందఱికీ తన దర్శనభాగ్యాన్ని అందజేసినాడు అని విశదీకరించే సందర్భం.

    చేపట్టెన్ శివకార్ముకమ్మును వెసన్ శ్రీరాము, డా సీతనే
    చేపట్టెన్ ద్విజు లంద రొయ్యన శుభాశీర్వాదముల్ పల్కగన్,
    చూపట్టెన్ సభ నత్తఱిన్ శుభములే, శోభిల్లె కల్యాణమే,
    చూపట్టెన్ హరి పీతవస్త్రధరుడై సొంపారుచున్ లక్ష్మితో.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
    (21-7-2018)

    రిప్లయితొలగించండి


  9. చేపట్టెన్ సీతమ్మను
    శ్రీపతి, వనికేగెనత్తరి పితరు నాజ్ఞన్
    కాపాడెరొయ్యన మొనరి
    నోపికతో కాశ్యపీతనూజను సుదతీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂దత్తపది🤷‍♀.. .. .. .. .. .. ..
    *చేప - రొయ్య - నత్త - పీత*
    అన్యార్థంలో రామాయణార్థంలో
    నచ్చిన ఛందస్సులో పద్యం

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పీతవసనుండు వనమాలి విష్ణుమూర్తి
    రాముడై వచ్చె.. సీతయై లక్ష్మి వచ్చె..
    నత్తరి నతడు చేపట్టె నామె.. నంద
    రొయ్య నొయ్యన గ్రహియించి రయ్య! నిజము

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    21.7.18

    రిప్లయితొలగించండి
  11. చేపట్టగ రాముడు కోదండం రొయ్యన తానొణికె
    అజాండం
    తానత్తరి తోచ బ్రహ్మాండం రాక్షసులకు తీరని
    గండం
    రామబాణమది ప్రచండం అసుర పీతలకు
    పెట్టిన పిండం
    రాముని శౌర్యము అఖండం పెట్టెదము గాక
    పదివేల దండం

    రిప్లయితొలగించండి
  12. పీత వస్త్రములను దాల్చి విశ్వమందు
    పుట్టి రాముడు చేపట్టె పుడమిజనట
    హరధనువు ద్రుంచ నత్తరి హర్షమూని
    జనులు జేరిరొయ్యన నట సంబరాన.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    త్వర నత్తాటకఁ జంపి, మౌని వెనుకన్ వా[పీత]టాకాల్, మహీ
    ధరముల్ దాఁటి, యహల్యఁ బ్రోచి, మిథిలాస్థానానఁ దా [నత్త]ఱిన్
    వరుఁ డా రాముఁడు విల్లుఁ ద్రుంచి, ధర నవ్వా[రొయ్య]నం ద్రెళ్ళ; సం
    బర మందన్ జనకుండు; సీత నదె [చేప]ట్టెన్ జనుల్ మెచ్చఁగా!

    రిప్లయితొలగించండి
  14. వా రొయ్యన తెచ్చిన శివ
    సారంగము చే పడంగ సన్మానసుఁడై
    యా రాముఁడు గన నత్తరి
    వారెల్లరు విఱిచి పీత వస్త్రుం డనియెన్

    రిప్లయితొలగించండి
  15. దశరధ తనయుడు ధనువును విరచగ జనకసుత మది మోదనమును బడ
    య చెలియ లెల్ల (రొయ్య)రముగ నడచుచు జతగూడ కళ్యాణ జగతి పైకి
    నడుగు బెట్టెను సీత, యతివరు లెల్లరు మంత్రమ్ములు పలుక మాడు పైన
    గుడముకు( పీత)ము గూర్చి చేసిన మిశ్రమమును బెట్టెను మూరుతము ఘడియన
    రాఘవుండు, (నత్త)రి నంబరమున వేల్పు
    లెల్లరును దీవెనలనిచ్చె, నిల్లుటాలు
    వ్రేలు (చేప)ట్టి రాముడు జ్వాలి చుట్టు
    చేసెను వలను లేడును సీత కూడి .

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విలు విఱిచిన నత్తఱి సీత పీత పుష్ప
    సరము రాముని మెడలోన సంతరించె
    మనుజులెల్ల రొయ్యన ముదమందగాను
    రఘుపతి కుజను చేపట్టె రహియె పొంగ

    రిప్లయితొలగించండి
  17. ఓ కపీ! తక్షణమె వచ్చి యుద్ధమందు
    రావణుని గూల్చ మని చెప్పు రామున కని
    సిత పల్కెనత్తరి చెప్పె వాత సుతుడు
    కదలి వారొయ్యనొయ్యన కడలి దాటి
    వత్తు రమ్మిటు, కపులచే పదిలముగను
    చింత మానుము నీకింక క్షేమమొసగు.

    రిప్లయితొలగించండి
  18. పదుగు రొయ్య న మేలని పలుకు చుండ
    తాను పీతాంబరధరుడు ధనువు నెత్తె
    కలికి సీతను చేపట్టు కాంక్ష తోడ
    విరిగె నత్తరి యావిల్లు ఫెళ్ళు మంచు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'విరిగె నత్తరి నావిల్లు...' అనండి.

      తొలగించండి
  19. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂దత్తపది🤷‍♀.. .. .. .. .. .. ..
    *చేప - రొయ్య - నత్త - పీత*
    అన్యార్థంలో రామాయణార్థంలో
    నచ్చిన ఛందస్సులో పద్యం

    సందర్భము: పాదమున కొక్క పదమే రావలె ననే నియమం పాటించడం మంచి దని శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజా రావు గారు సూచించగా...
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పీత వసనుడౌ చక్రియే సీత మగడు..
    లక్ష్మియే చూడ నత్తఱి రాముని సతి..
    వారి తీ రొయ్యన గ్రహించు భక్తవరులె
    భవము నీదుచు ముక్తి చేపట్టగలరు..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    21.7.18

    రిప్లయితొలగించండి
  20. ధృతిఁ చేపట్టిన బాణం
    బతి వేగమె వచ్చెరొయ్య యని యసురుల సం
    తతులెల్ల బెదరె నత్తఱి
    హతుఁడయె రావణుఁడు పీత వస్త్రు కరమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చెరొయ్య'...?

      తొలగించండి
  21. ఆటవిడుపు సరదా పూరణ:
    (మంధర కైకేయితో)

    నేడు చేపట్టు వరములు నిక్కముంగ
    నేడు కోరొయ్యరమ్మున నిక్కముంగ
    నేడు పీతమ్ములను వీడు నిక్కముంగ
    నేడు మేనత్తమిల చేయు నిక్కముంగ!

    కోరొయ్యరము = కోరు + ఒయ్యరము
    పీతము= పుష్యరాగము
    మేనత్తమిలు = మేను + అత్తమిలు
    ఒయ్యరము = మనోహరము
    అత్తమిలు = శయనించు

    (ఆంధ్ర భారతి నిఘంటు శోధన)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      'నికమముగ' అనండి.

      తొలగించండి
    2. 🙏🙏🙏

      అలాగే!

      మంధర తెలుగు అంతంత మాత్రమే...నాలాగా:)

      తొలగించండి
  22. చాకలి తిప్పడుపలికినపలుకులు
    ___________________
    తప్పదాగగ?నీరొయ్య తిప్పడనెను
    అత్తమేనత్త జెప్పిన నాలినేల
    రామునివలె చేపట్ట పరాభవమ్ము
    పీతమణివలె నుందు!యాపీడవలదు! (భార్యవలదు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని మొదటి పాదం అర్థం కాలేదు. ".నుందు నా పీడ.." అనవలె కదా!

      తొలగించండి
  23. మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందలి నేటి పద్యములలో నొకటి:

    గొప్ప భూతము లవ్యక్త మొప్పు చుండ
    మఱి యహంకారమును బుద్ధి మఱియు నింద్రి
    యమ్ములు పదియు నొక్కటి యమరు చుండ
    నింద్రియంపు గోచరము లై దెలమి విరియ ..శ్రీకృష్ణ. సూ. సుధా. 13. 5.

    మూలము:
    మహాభూతాన్వహంకారో బుద్ధి రవ్యక్త మేవచ |
    ఇంద్రియాణి దశైకంచ పంచ చేంద్రియ గోచరాః || ...శ్రీమద్భగ. 13. 5.

    రిప్లయితొలగించండి


  24. కాపాడెన్ క్రతువున్ నహల్యకొసగెన్ కైవల్యమున్ రొయ్యనన్
    చేపట్టెన్ తను కాశ్యపీ తనయ నే సింగాణి ఛేదింపగా
    వప్రుండానగ నేగె కానన‌ము,హా!ప్రాణేశుయే నత్తరిన్
    తాప్లావిన్ గని తెమ్మనన్ వెడల సీతాయంచు నేమార్చెనే

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాపాడెన్ క్రతు వా యహల్య కొసగెన్..' అనండి. 'రొయ్యనన్'..? ప్రాస విషయంలో సందేహం!

      తొలగించండి
  25. జనులు తారొయ్యన గనగ జానకినియె
    దాశరథియె చేపట్టె నత్తరి భళిభళి!
    పీతనము పొంగగ జనుల కాతరుణము
    దేవతలు పూలు గురిపింప దీవెనలుగ!
    ****)()(****
    పీతనము = ఉత్సాహము
    *****)()(*****
    మునుపిచ్చిన దోసె,పూరీ,వడ లాంటి పదార్థాలు చింత (పరవా) లేదుగానీ యీ పదార్థాలంతగా మింగుడు పడలేదు.

    రిప్లయితొలగించండి
  26. చేపట్టుకుంచమై చెంతను మీరుండ
    .....నా కేల భయ మింక నాథ! చెపుమ
    చూపట్టు మునిపత్నులం జూచి మురిసెద
    .....వా రొయ్యన నుతింప స్వామి! నిన్ను
    నాపట్టు నీపట్టు హాయిగా తిరుగాడి
    .....నే నత్తమిల్లెద నీదు నీడ
    పీతద్రు చందన పిప్పల సాలాది
    .....తరుచాయలను జేరి పరుగు లిడుదు

    ప్రియపతీ!నీవు వని కేగ బేల వోలె
    పురము నందుడ జాలను పురుష వృషభ!
    రాము డెచ్చట నుండిన రమణి సీత
    యచటనే యుండు పురమైన నడవి యైన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చాలాకాలం తర్వాత మీకు క్లాసు తీసుకొనే అవకాశం ఈరోజు దొరికింది....
      సీసపద్యం రెండవ పాదం పూర్వార్ధంలో యతి తప్పింది.
      'తరు + ఛాయ = తరుచ్ఛాయ' అవుతుంది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారూ. అనుమానపడుతూనే ఉంచాను. "తరువుల ఛాయల పరుగు లిడుదు".

      యతి సవరిస్తాను. మీరు క్లాసులు తీసుకుంటూ ఉంటేనే ఇలా ఉన్నాను. లేకపోతే వేరే చెప్పాలా. ఇంతే సంగతులు.

      తొలగించండి
  27. చేపట్టుకుంచమై చెంతను మీరుండ
    .....నా కేల భయ మింక నాథ! చెపుమ
    చూపట్టు మునిసతీ శోభల మురిసెద
    .....వా రొయ్యన నుతింప స్వామి! నిన్ను
    నాపట్టు నీపట్టు హాయిగా తిరుగాడి
    .....నే నత్తమిల్లెద నీదు నీడ
    పీతద్రు చందన పిప్పల సాలాది
    .....తరువుల నీడల పరుగు లిడుదు

    ప్రియపతీ!నీవు వని కేగ బేల వోలె
    పురము నందుడ జాలను పురుష వృషభ!
    రాము డెచ్చట నుండిన రమణి సీత
    యచటనే యుండు పురమైన నడవి యైన.

    రిప్లయితొలగించండి
  28. కందం
    నీచే పట్టిన జానకిఁ
    గాచేవాడందురొయ్యఁ గానల కంపన్
    గాచెను నత్తరి నీ నా
    మాచరణుడు పీత వస్త్ర మౌనియె భక్తిన్

    రిప్లయితొలగించండి

  29. శార్దూలవిక్రీడితము
    మీ చే పట్టిన జానకీసతినిఁ దా మేధావిగా దెప్పినన్
    శౌచేయున్ విని రొయ్యనన్నడవికిన్ సాధ్వీమణిన్ బంపగన్
    గాచెన్మీదగు నామ మంత్రమున ప్రజ్ఞాలుండు తా నత్తరిన్
    మీచే గానిది పీతవస్త్ర మునియే మేల్గూర్చె సద్భక్తుఁడై!

    రిప్లయితొలగించండి