4, జులై 2018, బుధవారం

సమస్య - 2724

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె"
(లేదా...)
"జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే"

55 కామెంట్‌లు:

  1. బలము కోలుపోవుచు నుండి వలను జూసి
    కలిసికట్టుగ త్రెంచుచు కాట్లు వేసి
    యలమటించగ నాకలి నపుడు, సృణిక
    జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె :)

    సృణిక : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
    సం. వి. ఆ. స్త్రీ.
    చొంగ.
    (రూ. సృణీక.)

    సృణిక జలము = లాలాజలము

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులకు నమస్కృతులు...
    'జడ కందములు - మా కందములు' పుస్తకావిష్కరణ సభ ఏర్పాట్లలో వ్యస్తుడనై బ్లాగులో మీ పూరణలను సమీక్షించలేక పోయాను. మన్నించండి.
    8వ తేదీ ఆవిష్కరణ సభకు ఎవరెవరు వస్తున్నారో తెలియజేయవలసిందిగా మనవి. మీ మీ చిరునామాలు తెలియజేస్తే పోస్టు ద్వారా మీకు పుస్తకాలను పంపిస్తాను.

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యులకు నమస్సుమనస్సులు .
    నాచిరునామా :
    Dr.Jandhyala Jaya krishna Bapuji
    C/o Jandhyala Srinath
    8543 Rugby Drive
    Irving
    Texas-75063 U.S.A

    రిప్లయితొలగించండి
  4. K.S. గు రు మూ ర్తి ఆచా రి ( Retired Bank employee. )

    Opposite :-- State Bank of India

    V E L U G O D U. POST

    K u r n o o l. District. A P



    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టాసత్యనారాయణ
    పరగ జాతీయ భావమున్ బ్రక్కకిడగ
    జలము కేంద్రమునన్ మంటలంటె, నేత
    లరరె! ప్రాంతీయ తత్త్వము న్నరయ వింత!
    "జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె!"

    రిప్లయితొలగించండి
  6. 8 వ తారీఖున. నేను కూడ ఆవిష్కరణకు వస్తున్నాను .

    ఇట్లు గురుమూర్తి ఆచారి నమస్తే

    రిప్లయితొలగించండి


  7. బ్రహ్మ రంధ్రమున తళుక్కు భగము చేరి
    మయత నుదకపు తళుకున మల్లె పుట్టి
    నాత్మ పరిణితి హృదయపు నాభి గాన
    జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ చిరునామా తెలియజేస్తే 'జడ కందములు...' పుస్తకాన్ని పోస్టులో పంపిస్తాను. ఇక్కడ పెట్టడం ఇష్టం లేకుంటే నా మెయిల్ కు పంపండి.
      shankarkandi@gmail.com

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    సలలిత మంజు వర్ణ పద జాలములన్ గన మత్స్యసంఘముల్ ,
    చలిత గభీర చిత్తము విశాలమహాబ్ధి ,కవిత్వమగ్నియౌ !
    నిలకడఁ గైత వ్రాయఁ గవి ., నేనని నేనని లేచి గెంతుచున్
    జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్య గారు:

      "మైలవరపు వారూ,
      పదాలు చేపలు, గంభీరచిత్తం సాగరంలో పుట్టిన కవిత్వపు టగ్నిలో ఒదిగిన సమర్థ పదాల చేపలు తప్పక సంబరా న్నందుతాయి. అందమైన, ఉత్కృష్టమైన పూరణ. అభినందనలు."

      తొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
    చలమున రండు రండనుచు సాటి విదేశపు మేకినిండియా(Make in India)
    జలమున మంట లేచునని చాలగ జింతిలు వారలేరి? యీ
    చలనమె జాతి నీతి యను చందమునందరు మెచ్చ జేపలై
    విలవిలలాడకే ముదము వింతగ నంది రదెట్లటన్న,బో!
    "జలమున నగ్ని పుట్టగనె సంబరమందెను మత్స్యజాలమే!"

    రిప్లయితొలగించండి
  10. (దక్షిణ ధ్రువప్రాంతంలో గడ్డకడుతున్న అంటార్కిటికా )
    మంచుగడ్డగ మారెడి మరణజలధి
    "అంటరికిటాన "మీనమ్ము లలమటింప
    భగభగలు గ్రక్కి వేవేడి సెగలతోడ
    జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె .

    రిప్లయితొలగించండి
  11. చిమ్మ చీకటి చెచ్చెరఁ గ్రమ్ముకొనగ
    తరణి మబ్బుల మాటున దాగ, రాత్రి
    జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె
    వెలుగు ఱేని కనుంగొను తలపుతోడ

    రిప్లయితొలగించండి
  12. తామదె దాగి ఉన్నవి కద జలమున ఆమ్లజని
    ఉదజనులు
    వినియోగింతురు రేపటి రోజున విడివిడిగానె
    పురజనులు
    ఇంధనముగ నీటిని నిలుపును చూడగ
    రాబోవు కాలమే
    జలమున అగ్ని పుట్టగనె సంబర మందెను
    మత్స్య జాలమే

    రిప్లయితొలగించండి
  13. క్రమాలoకారం లో ___
    ఎచట నుండును బడబాగ్ని ? ఏమి పెట్టి
    ర సురులు హనుమ తోక కు ? నహి నివాస
    మేది ? వానలు మెండైన నేమి జరి గు ?
    జలము లో ' నగ్ని' పుట్ట ' మ త్ స్యము లు మురియు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదం చివర జరుగు అని సవరణ చేయడ మైనది

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2724
    సమస్య :: *జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే.*
    నీటిలో అగ్ని పుట్టగానే చేపలు సంతోషపడ్డాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఒక ఐంద్రజాలికుడు (గారడీవాడు) *అబ్రకదబ్ర* అని అంటూ ప్రేక్షకులను చేపలుగా మార్చేశాడు. జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నేను నీటిలో నిప్పును పుట్టిస్తాను అని అన్నాడు. తక్షణమే నీటిలో నిప్పు పుట్టింది. చేపలుగా మారిపోయి అచ్చట ఉన్న ప్రేక్షకులు ఆ అద్భుతాన్ని సంబరంగా చూచినారు అని చిత్రవిచిత్రాలను చేయగల మాంత్రికుని కనికట్టును గుఱించి విశదీకరించే సందర్భం.

    ఇల నొక డైంద్రజాలికుడు హేలగ *నబ్రకదబ్ర* యంచు దా
    బలుకుచు, మత్స్యజాలముగ బాగుగ మార్చుచు ప్రేక్షకావళిన్,
    జలమున నగ్ని పుట్టును ప్రశంసల జూడు డనంగ, నచ్చటన్
    *జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-7-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      ఇంద్రజాలికుని వ్యాజంతో చక్కని పూరణ చెప్పారు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. మద్యమును గ్రోలు మగడున్న మగువకిలను
    ఖాళి సీసాల నమ్మిన కాసు లెన్నొ
    చేరునంచును ముదమందు నారు లుందు
    రంచు దలచు మూర్ఖుడు వచి యించె నిట్లు
    జలములో నగ్నిపుట్ట మత్స్యములు మురిసె.

    రిప్లయితొలగించండి
  16. డా.ఎన్.వి.ఎన్ .చారి
    మిలమిలలాడు మీనములమ్రింగగ వేసిరి జాలమా నదిన్
    వలలను జూచి చేపలును ప్రార్థన జేయగ దేవదేవునిన్
    జలముననగ్ని పుట్టగనె సంబరమందెను మత్స్యజాలమే
    వలల దహించెనగ్నియు నవారిత భక్తి మహాత్మ్య కాంతులన్

    రిప్లయితొలగించండి
  17. అండ్రువిబుధులుబడబాగ్నియదియయనుచు
    జలములోనగ్నిపుట్ట,మత్స్యములుమురిసె
    చెఱువునిండుగజలధారచేరజూసి
    యుసురుపదిలమైమనకికయుండుననుచు

    రిప్లయితొలగించండి
  18. కరణం రాజేశ్వర రావు
    విశ్రాంత తెలుగు ఉపాధ్యా యులు
    5_3_138హిందూ పురం డి .ఆర్ .కాలనీ
    515201అనంత పురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్
    9182329440

    రిప్లయితొలగించండి
  19. చంపకమాల

    మలమల మాడ వేసవికి మర్త్యులు భూమిని తల్లడిల్లగన్
    జలములు నావిరైన సరసందున జీవనమంత రించనన్
    ఫెళఫెళ నింగిఁ దేలుచును భీతిలు గర్జనఁ జంచలానఁ గ
    జ్జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      చంపకమాల

      మలమల మాడ వేసవికి మర్త్యులు భూమిని తల్లడిల్లుచున్
      జలములు నింక నేటను విచారముఁ జెందుచు జీవనమ్మునన్
      ఫెళఫెళ నింగిఁ దేలుచును భీతిలు గర్జనఁ జంచలానఁ గ
      జ్జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే

      తొలగించండి
    3. కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి సూచిత సవరణతో

      తొలగించండి
  20. జలచరమన్నియున్భయముచాలకలుంగగపారిపోయెనే
    జలముననగ్నిపుట్టగనె,సంబరమందెనుమత్స్యజాలమే
    జలములుబొంగిపొర్లుచునుచాలిననంతకుమిక్కుటంబుగా
    బరుగులుదీయుచున్వడిగబారుచునుండగజూచివేడుకన్

    రిప్లయితొలగించండి
  21. పూని విశ్వమందున మిన్ను మానికమ్ము
    మీఱి చండ ప్రచండుఁడై మిన్ను నుండఁ
    దాఁక సూర్య కిరణములు వీఁక రాత్రి
    జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె

    [రాత్రి జలము = మంచు]


    సలలిత జీవ కోటికి నిశా దివసమ్ములు ఘోర హైమ లా
    తుల శిశిర మ్మసహ్య మగుఁ దోరముగన్ బడబాగ్ని రూపమై,
    సలిలము శీతలమ్మున వెసన్ ఘన మౌటను రోష వార్థికిం
    జలమున, నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే

    [వార్థికిన్ + చలమున = వార్థికిం జలమున]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 13/7/2017 నాటి పూరణలు:

      నలినజు సృష్టి చిత్రములు నైపుణి నెంచఁ దరమ్మె యేరికిన్
      జలనిధి నింపె రత్నముల జాతము సేసె నబింధనమ్మునున్
      వలనుగ భోజనార్థము నపార విహార విలాస నీరధిం
      జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్

      [అబింధనము = బడబాగ్ని; అగ్ని = చిత్రమూలము (మొక్క పేరు)]


      కన్నులా యవి నిజమెంచఁ జెన్ను మీన
      ములు సుమీ చూడఁ జూడగ ముద్దు గొలుపు
      చేడియ ప్రియకాంతునిఁ జూడ సిగ్గు తోడఁ
      జలములో నగ్ని పుట్టె! మత్స్యములు మురిసె!

      [చలము = వణుకు; మత్స్యములు = నయనోక్తములు]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      ఇది గతంలో ఇచ్చిన సమస్యయే అన్న విషయం మీరు ప్రస్తావించే వరకు తెలియదు. ధన్యవాదాలు.
      మీ అప్పటి, ఇప్పటి పూరణలన్ని అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  22. జలనిధి మానసమ్మవగ స్వార్థము మోహము కామక్రోధముల్
    జలచరముల్ గదే నరుని చంచల బుద్ధిని సంచరించెడిన్
    తలపులలోన వాంఛలను దావము జృంభణమైన వేళలో
    జలమున నగ్నిపుట్టగనె సంబరమందెను మత్స్య జాలమే.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ,కె,ఈశ్వరప్ప, విశ్రాంత ఆరోగ్యవిస్తరణాధికారి
    ఇ"నం:4/514 గాంధినగర్
    ఆలూరు కర్నూలు జిల్లా518395
    A,p

    రిప్లయితొలగించండి
  24. మనశరీరాని కిడుతిండి మహిమచేత
    శక్తి నాసక్తి గలుగంగ?యుక్తిగాను
    సూక్ష్మ జీవులె చేపలై జూడకున్న
    జలములోనగ్ని బుట్ట?మత్స్యములుమురిసె!

    రిప్లయితొలగించండి
  25. ఆటవిడుపు సరదా పూరణ:
    ("సీతారాం సీతారాం సీతారాం జై సీతారాం")

    విలవిల లాడు నాయకుని వీధుల వెంబడి పాదయాత్రలో
    కలకలలాడు సందడహ! కన్నులు వీనులు విందుజేయ నా
    హలహల మందు వోటరుల హాయిని జూడగ నిట్లు తోచెగా: 👇
    జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే

    రిప్లయితొలగించండి
  26. మత్స్యగంధి పుట్టగ నొక మత్స్యమునకు
    ఉపరిచర వసు రేతస్సను అనలము వ
    లన; చతురతగ నివ్విధి యనదగుగద
    జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె!

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    జలమున నగ్ని పుట్టగనె
    సంబర మందెను మత్స్యజాలమే

    సందర్భము: చేపల కోసం కొత్తగా వచ్చిన ఆహారపు గుళికలు నీళ్ళలో వేయగానే నిప్పురవ్వలలాగా మిలమిలా మెరుస్తాయి.
    వాటిని ఒక్కొక్కటే అక్వేరియంలో జారవిడుస్తుంటే అవి నిప్పు కణికల లాగా మెరుస్తున్నాయి. కాని చేపలు తెగ మురిసిపోతున్నాయి. వాటిని పట్టుకొని తినడానికి చుట్టూ మూగుతున్నాయి....
    ఆ సన్నివేశం నీటిలో నిప్పు రగులుకొ న్నట్టుగా వుంది. కాని చేపలు సంబరపడిపో తున్నట్టుగా కనపడుతున్నది.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    మిలమిలలాడుచున్ జ్వలన
    మే యను తీరు భ్రమింపజేయు నా
    గుళికలు తిండికోసమయి
    క్రొత్తగఁ జేయగబడ్డవాని చే
    పల కొక టొక్కటే విడువ..
    పట్ట వెసన్ జను గాజు గీములో..
    జలమున నగ్ని పుట్టగనె
    సంబర మందెను మత్స్యజాలమే..

    గాజు గీము= గాజు గృహము.. చేపలకోసం గాజుతో తయారు చేయబడిన అక్వేరియం

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    4.7.18

    రిప్లయితొలగించండి
  28. వలపున నాల్గు మీనములు బ్రాహ్మడు జార్చగ చేపతొట్టిలో
    తలుపును తీసి మన్మడట దబ్బున వేయగ మంచుగడ్డలన్
    కులికెడి చేప పిల్లలహ గుడ్లను త్రిప్పుచు తోకలెత్తగా
    కలవరమంది బాపడట గ్యాసున బెట్టగ చేపతొట్టినిన్
    జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే 😊

    రిప్లయితొలగించండి