7, జులై 2018, శనివారం

సమస్య - 2727

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్"
(లేదా...)
"పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

91 కామెంట్‌లు:

  1. పరపతి పెంచుట కొరకై
    మరిమరి కొండలనునెక్కి మాంద్యపు మదితో
    తిరకాసు నిండు హృదినిన్
    పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్

    రిప్లయితొలగించండి

  2. హరిహరులు వేరు వేరని
    పరిధిని దాటుచు నసభ్య పదజాలములన్
    బరకటపుమాట బల్కుచు
    పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్.

    .

    రిప్లయితొలగించండి

  3. పరిపరి పూజారులను డొ
    గరి తితిదే ముఖ్యులమని గర్వితు లగుచున్
    పరిపక్వత లేక జనులు
    పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్!

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    అరయన్ పాపము తూలరాశి యన ఫాలాగ్నిప్రభావమ్మునన్ ,
    గరిమన్ గాంచగ పంకిలమ్మనుచు గంగాతోయసంప్రోక్షణన్
    కరుణాసాంద్రుడు శంకరయ్య తొలగంగా జేయు , నిశ్చింతన...
    ప్పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. చిరమగు ముక్తి లభించును
    పరమేశు గొలువ ; నఘములు పండవె కరమున్
    సురలను గురులను ఘనులను
    వెరవక దూషణ సలిపెడి వెంగలి జేరన్.

    రిప్లయితొలగించండి
  6. నిరతము దురిత రతుండై
    పర పీడన సేయునట్టి పాపాత్మునకున్
    పరసతి సౌఖ్యము కొఱకై
    పరమేశుఁగొలువ నఘములు పండవె కరమున్

    రిప్లయితొలగించండి
  7. నిరతము స్వార్థము తో కడు
    దురితము లే చేయునట్టి దుష్టుడు వాడే
    పరులను వంచింపదలచి
    పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్

    రిప్లయితొలగించండి

  8. శరణాగత వత్సలుడగు
    పరమేశుఁ గొలువ, నఘములు పండవె కరమున్,
    బిరబిర కర్మ ఫలముగా
    పరిపాకంబై మనికి సఫల వృక్షముగన్!

    రిప్లయితొలగించండి
  9. సిరులును శుభములుఁగల్గును
    పరమేశుఁగొలువ;నఘములు పండవె కరమున్
    పెరవారల కపకారము
    దొరలించెడు చెడ్డ బుద్ధితో చరియింపన్

    రిప్లయితొలగించండి

  10. నిరతము స్వార్థపరతతో
    చరియించుచు భూమిపైన జంబుకుడై న
    స్థిరమౌ పూజల చలుపుచు
    పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జంబుకుడై యస్థిరమౌ..' అనండి.

      తొలగించండి
  11. పరమ పదం బు లభిoచును
    పరమేశు గొలువ ;న ఘ ము లు పండవె కరమున్
    వె రు వక చెడు నొ న రించు చు
    పర దూషణ జేయ బూన వక్ర పు బుద్ది న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. చేసిన పనికదె పారితోషం ఇస్తాననెగా
    గీతావేశం
    దుడ్ల తోడుగ వెంకటేశం లడ్లుగ తిరిగొచ్చె
    భక్తి పాశం
    తప్పుడు తలపులై లెక్కలే హుండిలో పడినవి
    రొక్కమ్ములే
    పరమేశుం గొలువంగ బాపములు వే పండంగ
    నిక్కమ్ములే

    రిప్లయితొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2727
    సమస్య :: పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ము లే.
    పరమేశ్వరుని కొలిస్తే పాపాలు పండుతాయి. ఇది నిజం అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: ధర్మరాజు చేస్తూ ఉండిన రాజసూయ యాగంలో శిశుపాలుడు శ్రీ కృష్ణుని అనేక విధాలుగా నిందించినాడు. శ్రీ కృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రం శిశుపాలుని శిరస్సును ఖండించింది. అప్పుడు ఆ శిశుపాలుడు ఒక తేజోరూపంలో శ్రీకృష్ణుని దేహంలో ప్రవేశించి ఆ భగవానునిలో ఐక్యమైపోయాడు. దీనిని చూచి ఆశ్చర్యపడిన ధర్మరాజు సభలోనే ఉన్న నారదుని చూచి ఓ మహర్షీ! శ్రీ హరి నింద జేసిన వీడు ఎలా భగవంతునిలో లీన మయ్యాడు? అని ప్రశ్నింపగా నారదుడు ఓ ధర్మరాజా! భక్తితోనైనా భయంతోనైనా చివరకు వైరంతోనైనా సరే హరి నామ స్మరణ చేస్తే చాలు ఎవడైనా సరే దైవసాయుజ్యాన్ని పొందుతాడు. వైరంతో ఈ శిశుపాలుడు హరి నామ స్మరణ చేసి శ్రీ హరిలో లీనమయ్యాడు అని సమాధాన మిచ్చిన సందర్భం.

    చిర కీర్తిన్ శిశుపాలు తేజము హరిన్ జేరన్ గతం బేమి? స
    త్కరుణన్ దెల్పు మనంగ ధర్మజుడు , వీకన్ నారదుం డిట్లనెన్
    నరనాథా! విను వైరమైన భగవన్నామమ్మునే పల్కుచున్
    *పరమేశుం గొలువంగ పాపములు వే పండంగ నిక్కమ్ము లే.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (7-7-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా సత్యనారాయణ
      ఆర్యా,"వాని పాపం పండిందంటే శిక్ష పడాలికదా! ఏకంగా సాయుజ్యమే సాయుజ్యమే(మంచి) సిద్ధించింది.సమస్యలోని విరుద్ధ భావం పోషింపబడినట్లేనా,వివరించగలరు.

      తొలగించండి
    3. డా.పిట్టా సత్యనారాయణ
      ఆర్యా,"వాని పాపం పండిందంటే శిక్ష పడాలికదా! ఏకంగా సాయుజ్యమే సాయుజ్యమే(మంచి) సిద్ధించింది.సమస్యలోని విరుద్ధ భావం పోషింపబడినట్లేనా,వివరించగలరు.

      తొలగించండి
  14. వరములు బొందిన యసురులు
    కరవాలము చేత బట్టి కాఠిన్య ముగన్
    నిరతము జనులను జంపుచు
    పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్

    రిప్లయితొలగించండి
  15. అరయగ పాపము పుణ్యము
    మరిమరి బంధించును గద మనుజుని గతినే
    త్వరితము మోక్షము గోరుచు
    పరమేశు గొలువ నఘములు పండవె కరమున్!

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టాసత్యనారాయణ
    కరచరణము లరుగంగను
    ఇరవుగ నొక కొలతబట్టు నియమము జెలగన్
    పొరపాటున శిల పెరుగునె
    పరమేశు గొలువ నఘములు పండవె కరమున్?(పండుననుట తథ్యము)
    (ఒక టేప్ తో విగ్రహాన్ని కొలుచుటగా గైకొని చేసిన పూరణము)

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    పరమే లక్ష్యముగాగ కోరికలనే బాయంగ మున్ముందుగన్
    నరుడే కామిగ గాకయున్న నెటులౌ నంటంగ నా స్థాయిని(కామిగాక మోక్ష గామిగాడు)
    న్నిరవౌ పూజలె శీల సంపదలిలన్నింతింతగా బెంచకే
    పరమేశుం గొలువంగ బాపములు వే పండంగ నిక్కమ్ములే!

    రిప్లయితొలగించండి
  18. పరి పరి విధముల నాతని
    పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్
    త్వరిత గతిన్ పాపము బా
    యురీతి పుణ్యాలు గలుగు హొ!కర్మతరణియం


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరపాదంలో గణదోషం. తరణియం...? భావం కొంత అస్పష్టంగా ఉన్నది.

      తొలగించండి
  19. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    పరులై స్నేహితులందరున్ కలసి చంపంగన్ ప్రయత్నింపగా
    నరరే చేసిన మేలునే మరచి తామన్యా యమున్ జేతురే?
    కరముల్ మోడ్చుచు కోరెదన్ వరద నన్ కాపాడు మంచున్ నుతిం
    ప, రమేశుం గొలువంగ, బాపములు వేపండవే నిక్కంబుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      చక్కని విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. గిరగిరదిరుగుచుబోవును
    బరమేశుగొలువనఘములు,పండవెకరమున్
    బరమాత్ముభజనజేయగ
    వరదునినాశిసులససులుభక్తులపైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆశిసులససులు'...?

      తొలగించండి
  21. స్థిరవాసాన్వితమోక్షధామభగవత్సేవాపరాకాంక్షణల్,
    నిరతోద్యత్త్రిదివాప్తిపూజనములున్, నిశ్రేయముల్ గూర్చగన్,
    దురితేచ్ఛాపరిదూషితార్చనలతో దుష్టప్రయుక్తమ్ములై
    పరమేశుం గొలువంగ పాపములు వే పండంగ నిక్కంబులే.

    రిప్లయితొలగించండి

  22. పరమత సహనమ్మని నా
    ర్ష రహిత దేశమును నిలుప రయ్యన పోటీ
    లరరే ద్వేషపు పలుకుల
    పరమేశుఁ గొలువ, నఘములు పండవె కరమున్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. అరయన్గల్గునుగాదెపుణ్యములనాయాసంబుగాపృధ్విని
    న్బరమేశున్గొలువంగ,బాపములువేపండగనీక్కమ్ములే
    విరసంభావముతోడనాశివునినేవేళన్దలంచన్నిక
    న్గరమున్దూషణజేయుచోసతమునాకామేశుముక్కంటితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విరసం భావము'...? పద్యంలో అన్వయదోషం ఉన్నట్టుంది.

      తొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,




    దొరకున్ శాంతము , వర్తిలన్ నిరతమున్ దోషఙ్ఞ చిత్తంబునన్ |

    దొరకున్ మోక్షము , భక్తితో భువన నాధున్ - ‌ శంకరు - న్నీశ్వరున్ -

    పరమేశున్ గొలువంగ || పాపములు వే పండంగ నిక్కమ్ము = లే

    మరులన్ గాంతల పై నపేక్షపడుచున్ , మద్యమ్ము సేవించుచున్ ,

    గరమున్ బుద్ధి విశుద్ధి హీనమగు దుష్కార్యంబులన్ సల్పినన్


    { దోషఙ్ఞ చిత్తమ్మునన్ = దోషమును గ్రహించు మనసుతో

    లేమరులన్ = అనురాగముతో మోహముతో }

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




    రిప్లయితొలగించండి


  26. ఓయీ అజ్ఞాతా!

    కందాలు రాసి కందివారితో జిలేబీ అనిపించుకుంటే సరిపోతుందా :)


    రాపోటీగ జిలేబులవ్వ పదముల్ రాపాడ మత్తేభమై :)

    హరియే దైవము నెల్లలోకమున కాహార్యంబు కైమోడ్చుచున్
    పరమేశుం గొలువంగఁ, బాపములు వే పండంగ నిక్కమ్ములే,
    పరలోకాన్విత మోక్షమార్గము సదా ప్రార్థింపుమా నాతనిన్
    కరటిన్గ్రాహము నొక్క రీతి దయతో కాపాడెగా నాతడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ యీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రార్థింపుమా యాతనిన్' అనండి.
      అయితే ఈనాటి అజ్ఞాత, నిన్నటి బుచికి మీరు కాదా?

      తొలగించండి

    2. ఎవరో బడుద్దాయి. దాన్ని నాదని చెప్పేరు మీరున్ను. నా బ్లాగులో కామెంటెట్టాడు. పేరు చెప్పి‌ శరణు కోరరా ఢింభకా అని వార్నింగిచ్చానిప్పుడే

      జిలేబి

      తొలగించండి
    3. మనకు పేర్లూ ఊర్లూ లేవుగా...

      "చిదానంద రూపః శివోహం శివోహం..."

      తొలగించండి

    4. సర్వము శూన్యమయమ్ము :)

      జిలేబి

      తొలగించండి
  27. గు రు వు గా రి కి ‌ ప ద న మ స్కృ తు లు .

    నేను‌ కూడా సమస్య నివ్వాలని కుతూహల పడుచున్నాను .

    ఎలా పంపాలో వివరంగా తెలుపు‌ మని ప్రార్థన

    రిప్లయితొలగించండి
  28. గురువులఁ దరుణులఁ బసి బా
    లుర గురి సేసి వెతలకుఁ బలుకులఁ గుటిలుఁడై
    పరువపు బలిమినిఁ దా నిఁకఁ
    బరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్


    పరువం బందలి కావరమ్మున మనో వైకల్యముం జెంది వే
    మరు పీడింప దురాత్ముఁడై జనులఁ గామజ్వాల దగ్ధుండు నై
    కరుణాహీన మనస్కుఁడై సతము గాఁకన్, నేర్వ లేకున్న నా
    పరమేశుం గొలువంగఁ, బాపములు వే పండంగ నిక్కమ్ములే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి


  29. కరముల్ మోడ్చుచు జనులున్
    పరమేశుఁ గొలువ, నఘములు పండవె? కరమున్
    శరణుశరణనుచు జేర్చగ
    వరమిచ్చునతడు జిలేబి వరదుండగుచున్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  30. కందం
    దొరికినఁ వన్నియు దోచుచుఁ
    గిరీటముల నొసఁగి మ్రొక్కుఁగిట్టించితినన్
    వరుసన మరిమరి దోచుచుఁ
    బరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కిట్టించితినన్'...?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.దేవునకు మ్రొక్కిన మ్రొక్కు గిట్టుబాటుచేసుకున్నాను.అని మళ్లీ మళ్లీ అలాగే దోపిడీకి దిగినచో పాపములు పండవా? అని భావించాను సర్.పరిశీలించ ప్రార్థన.

      తొలగించండి
    3. సహదేవుడు గారు యీ యర్థ భేదములు గమనించండి.

      కిట్టించి తనన్ (కిట్టించితి + అనన్): “కిట్టించితివి యనన్” అని యర్థము.
      కిట్టించితి ననన్ (కిట్టించితిన్ + అనన్): “కిట్టించితిని యనన్” అని యర్థము.
      ఇక్కడ “కిట్టెనె యనుచున్ “ అన్న సరిపోవును.

      తొలగించండి

    4. ఆర్యా! దయతో సవరణ గురించి వివరముగా తెలియజేసి నందులకు మిక్కిలి కృతజ్ఙుడను. సవరించిన పూరణ :

      కందం:

      దొరికినఁ వన్నియు దోచుచుఁ
      గిరీటముల నొసఁగి మ్రొక్కు కిట్టెనె యనుచున్
      వరుసన మరిమరి దోచుచుఁ
      బరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్?

      తొలగించండి
  31. పరులన్ ధూర్తతఁ హింసజేసి నిజ సంబంధంబుఁ దూషించుచున్
    వర దైవీగత కార్య కర్మములఁ దాఁ వైరుండుగా నిల్చి య
    స్థిరమౌ చంచల సంపదాళి కొఱకై చేకొన్న స్వార్థంబుతో
    పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే

    నిక్కమ్ములే = నిజము కాదు కదా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ (1):
    ("గుళ్ళో హాజరు ప్రతి శనివారం
    గూడుపుఠాణీ ప్రతాదివారం")

    కరముల్ మోడ్చుచు కాళ్లపై బడుచు నాకాళ్లన్ సదా లాగుచున్
    వరముల్ గైకొని గుర్వులన్ వడిగ పాపాత్ముల్ ర వారోయనిన్
    నిరతమ్ దూషణ జేయుచున్ మహిని నేనేరా మహాత్ముండనిన్
    పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే

    **************************************************

    ఆటవిడుపు సరదా పూరణ (2):
    ("ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి")

    వరముల్ పంచుచు నెత్తిపై కరముతా వారింప జాలండనిన్
    పరుగుల్ పెట్టుచు మోహినమ్మలను తాపారించు వాడోయనిన్
    స్థిరుడై యెల్లరి హృత్తులన్ వెలయు నాసిద్ధుండనున్ గాంచకే
    పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే

    "మృత్యోస్స మృత్యుం గచ్ఛతి య ఇహ నానేవ పశ్యతి"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ రెండు ఆటవిడుపు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఆటవిడుపు' అన్నాక దోషాలెంచకూడదు. కాని అలవాటు పడ్డ ప్రాణం తప్పడం లేదు...
      మొదటి పూరణలో 'వారోయనిన్'...? 'నిరతమ్' అని హలంతంగా వ్రాయరాదు. 'అనిన్'?
      రెండవ పూరణలో 'అనిన్'? 'సిద్ధుండనున్'...?

      తొలగించండి
    2. "అనిన్";

      అనగా..."అనుచున్”

      "అనున్"..అనగా "అనబడున్"

      అనే అర్థములో వ్రాసితిని.

      🙏

      తొలగించండి


  33. సరిసరి స్వాధ్యాయీ! గడు
    సరి వాడివి సూవె! నీదు సర్వంబును నొ
    డ్డి రమేశును,నీశుని నా
    పరమేశుఁ గొలువ, నఘములు పండవె కరమున్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. డా.పిట్టా సత్యనారాయణ
    పరమే లక్ష్యముగాగ కోరికలనే బాయంగ మున్ముందుగన్
    నరుడే కామిగ గాకయున్న నెటులౌ నంటంగ నా స్థాయిని(కామిగాక మోక్ష గామిగాడు)
    న్నిరవౌ పూజలె శీల సంపదలిలన్నింతింతగా బెంచకే
    పరమేశుం గొలువంగ బాపములు వే పండంగ నిక్కమ్ములే!

    రిప్లయితొలగించండి
  35. డా.పిట్టా సత్యనారాయణ
    ఆర్యా,Suggested Samasya for Pooranamu:
    కవితలు కలహప్రదములు గానవు చేతల్....లేదా
    కవితల్ వే కలహాల దెచ్చునిలలో గాంచేవె సత్ చేష్టలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. కవితల్ దెచ్చును వాగ్వివాదముల రంగారంగరంగా యనన్!

      జిలేబి

      తొలగించండి
  36. దొరికిన దెల్లను తనదని
    మరిమరి తినుటను మరిగిన మానవుడింకన్
    విరులను గొనుచును విడువక
    పరమేశు గొలువ నఘములు పండవె కరమున్

    రిప్లయితొలగించండి

  37. తరగని శాంతియు దక్కును
    పరమేశుఁ గొలువ ,నఘములు పండవె కరమున్
    నిరతము నిష్కారణముగ
    పరులను బాధించుచుండ వసుధను ప్రజకున్.

    రిప్లయితొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    పరమేశుఁ గొలువ నఘములు పండవె
    కరమున్

    సందర్భము: స్పష్టము..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    హరియింపవె భక్తిమెయిన్

    పరమేశుఁ గొలువ నఘములు...
    పండవె కరమున్

    వర శుభములు... మరి నిండవె

    తిరముగ సంపదలు నింట
    దీనత దొలగన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    7.7.18

    రిప్లయితొలగించండి
  39. హరహరయనగా భక్తిగ
    వరములుగుప్పించ శివుడు!వైరముచేతన్
    శరణనకన్ భస్మాసుర
    పరమేశునిగొలువ?నఘములుబండవెకరమున్

    రిప్లయితొలగించండి
  40. అరయన్ స్వార్థము పెచ్చుమీరగ ననాయాసమ్ముగా సంపదల్
    విరివిన్ బొందగ నెంచుచున్ జనులనే పీడించు పాపాత్ములే
    హరమౌ పాపమటంచు లోకులన జేయంగన్ ఫలమ్మేమిరా
    పరమేశుంగొలువంగ, బాపములు వేపండంగ నిక్కమ్ములే.

    రిప్లయితొలగించండి
  41. దరహాసమ్ముల త్రుళ్ళు పద్యముల భల్ దారుణ్యమొప్పరగ్గా
    సరదా పూరణ లొల్కుచున్ తెలుగునన్ ఛందస్సు దొబ్బించుచున్
    కరవాలమ్ముల ద్రుంచుచున్ కవుల తా కవ్వించి క్రీడించుచున్
    పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే

    రిప్లయితొలగించండి