22, జులై 2018, ఆదివారం

సమస్య - 2739

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సీమంతముఁ జేసిరంత సీతాపతికిన్"
(లేదా...)
"సీమంతంబును జేసి రెల్ల రపుడున్ సీతాసతీభర్తకున్"
ఈ సమస్యను పంపిన కిలపర్తి దాలి నాయుడు గారికి ధన్యవాదాలు.

51 కామెంట్‌లు:

  1. ప్రేమయు మీరగ సీతకు
    సీమంతముఁ జేసిరంత; సీతాపతికిన్
    గోముగ దీవెనలిచ్చిరి,
    కామితములు తీరుననిరి కార్యము నందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సమ్మ సినిమా గుర్తొచ్చినది

      😊

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కామితములు దీర సుతుడు గలుగు నటంచున్" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  2. కోమలి సీతమ్మ కచట
    సీమంతము జేసిరంత, సీతా పతికిన్
    బ్రేమగ కానుక లొసగుచు
    మామయె జనకుండతనిని మన్నన జేసెన్

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    శ్రీరామపట్టాభిషేకసంరంభం.....

    ఏమానందము ! రామచంద్రుడట ! పాలింపంగ రాజంట ! మా
    నోముల్ పండెనటంచు స్వాగతమిడన్ మోదమ్మునన్ భూజనుల్
    ప్రేమన్ పూలను జల్లి మార్గమున , పేర్మిన్ దత్సభన్ దాసదా...
    సీమంతంబును జేసిరెల్లరపుడున్ సీతాసతీభర్తకున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. దాస దాసీ మంతము : నిజమే సభలో నున్న వారెల్లరు రామ దాసులే! మనోహరమైన పరిష్కారము. అభినందనలు మురళీ కృష్ణ గారు.

      తొలగించండి
    3. కవిపండితులు మహనీయులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి మనఃపూర్వక నమశ్శతములు.. ధన్యోऽస్మి 🙏🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి


  4. భామా గనన్ జిలేబికి
    సీమంతముఁ జేసిరంత, సీతాపతికిన్
    జామంతయు సందడియే
    కోమలుల పరాచికముల కుంచియ గూడన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలమ్మెదియో! జిలేబి! వడిగా సంధించి గాండ్రించరో!

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    3. శార్దూల సమస్య రావడమూ వేయక పోవడమూనే ?
      వేసేసామండీ జిలేబీ వారి జాంగ్రీ :)


      నెనరుల్స్

      జిలేబి

      తొలగించండి
    4. ఐదు పాదాలు మీ శార్దూలానికి...మరి పరుగుల్ పెట్టదా :)

      తొలగించండి
  5. హేమంతము వచ్చెననుచు
    సీమంతముఁ జేసిరంత , సీతా పతికిన్
    క్షేమం కరమని మురియుచు
    ప్రేమగ దీవించి రంట వేడుక జేయన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    భామకు ఋషిపత్నులు వని
    సీమంతము జేసిరంత; సీతాపతికిన్
    గోముగ వంశాంకురముల
    గామించిరి ఘనతజెంద గావగ జనమున్

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    క్షేమంబున్ గలకాల శాంతి నరయన్ "శ్రీకాంతు"రంగస్థలిన్
    రాముండేయన బెళ్లి జేసి; వనినిన్ రాజిల్ల సీతమ్మగా
    బ్రేమన్ బాత్రను మార్చ నద్భుతముగా బ్రీతిన్ వనమ్మందె యీ
    భామల్ బ్రేక్షక వర్గమే ఋషులకున్ బత్నుల్ ఫలాదుల్ గొనన్
    సీమంతంబును జేసిరెల్లరపుడున్ సీతా సతీ భర్తకున్

    రిప్లయితొలగించండి
  8. ఏమా సంరంభము! దా
    సీమంతము జేసిరంత సీతాపతికిన్
    కోమలులందరు జేరుచు
    ధీమంతుడ సురుని ద్రుంచి తేకువ జూపన్!

    మైలవరపువారి బాటలో 🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  9. ప్రేమమున కుజ కడవిలో
    సీమంతముఁ జేసిరంత, సీతాపతికిన్
    శ్రీమతి కలలో కనబడి
    గోముగ వివరించెను తన గోత్రపు క్రియలన్

    రిప్లయితొలగించండి
  10. భామలు మురియు చు సీతకు
    సీమ oతము చేసి రం త ;; సీతాపతి కి న్
    శ్రీమoతము కలిగి య త ని
    కామిత ములు తీరు ననుచు కాంక్షించి ర ట న్

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2739
    సమస్య :: సీమంతంబును జేసి రెల్ల రపుడున్ సీతాసతీభర్తకున్.
    సందర్భం:: శ్రీపతి అని అన్నా, రుక్మిణీపతి అని అన్నా, సీతాసతీభర్త అని అన్నా, మోహినీసతి అని అన్నా ఆ విష్ణుమూర్తియే కదా. {మహిష అనే రాక్షసిని వధించగలవాడు హరిహరసుతుడు మాత్రమే అని బ్రహ్మదేవుని వాక్కు} అందువలన ఆ మోహినిని శంకరుడు మోహించాడు. ఆ తరువాత ఆ మోహినీదేవికి అందఱూ సీమంతం చేసినారు అని ఊహించి చెప్పే సందర్భం.

    శ్రీమంతుండన రుక్మిణీవిభుడనన్ సీతాసతీభర్తయౌ
    రాముం డన్నను మోహినీసతియనన్ రాజిల్లు నా విష్ణు, వా
    భామన్ మోహినిఁ గూడఁ శంకరుడు, శుంభన్మోహినీరూపకున్
    ‘’సీమంతంబును జేసి రెల్ల రపుడున్ సీతాసతీ భర్తకున్.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
    (22-7-2018)

    రిప్లయితొలగించండి
  12. కోమలి సీతకు బ్రియమున
    సీమంతముజేసిరంత,సీతాపతికిన్
    గోమున బహుమతులెన్నియొ
    మామగు జనకుండునిచ్చె మణుగులకొలదిన్

    రిప్లయితొలగించండి
  13. హేమంతమ్మున జానకి
    సీమంతము జేసి; రంత సీతాపతికిన్;
    ధీమంతునికిన్; మునిజన
    సామంతునికి; నుడుగరల జనకుం దొసగెన్.

    రిప్లయితొలగించండి
  14. కొడుకులుగా పుష్కల తక్షులు భరతునికి కలిగె
    తండ్రిగ ఉనికి
    యేండ్లుగ కలగలేదు సంతానం రామునికి
    రామానుజునికి
    అవనిజ గర్భము దాల్చగ సీమంతంబు జేసి
    రెల్ల రపుడున్
    సీతాపతి భర్తకున్ మోదము కులమునకు
    శుభము చేకూరెడిన్

    రిప్లయితొలగించండి
  15. భామిని సీతమ్మకు తొలి
    సీమంతము చేసిరంత ,సీతాపతికిన్
    మోమున గోమును గనినం
    త మురిసిరి జనులు జననము ధన్యత నొందన్

    రిప్లయితొలగించండి
  16. భామగ పాత్రను వేసియు
    భామల వలె నభినయించి పండింపంగన్
    'కోమలి' యను నాటికలో
    "సీమంతముఁ జేసిరంత సీతాపతికిన్"
    ***)()(***
    పండింపగ = పాత్రకు న్యాయము చేయగ.

    రిప్లయితొలగించండి


  17. ఓ మారైన జిలేబి పెన్మి టినటన్ ఓ రామ రారాయనన్
    తా ముద్దాడగ లేదు! చిత్రముగ‌యీ తన్వంగి తీర్థంబులా
    డేమాసంబు సమీపమయ్యె! భళివీడే యార్యు డార్యుండనన్
    సీమంతంబును జేసి రెల్ల రపుడున్, సీతాసతీ భర్తకున్
    పూమాలల్నిడిరమ్మ మెచ్చుకొనుచున్ పూబోడి పూబోడియా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. గురువు గారికి నమస్సులు
    గ్రామంబున వేడుకగా
    సీమంతము జేసిరంత, సీతాపతికిన్
    ప్రేమ రవ్వంతెక్కున్
    కోమలి వాంఛన్ దీర్పగ కోరిక మీరన్.

    రిప్లయితొలగించండి
  19. శ్రీమంతుని రఘు వీరు న
    యోమయ తనుఁ బుణ్య సతులు జ్యోతిష్మంతున్
    ధీమంతునిఁ గని చక్కటి
    సీమంతముఁ జేసిరంత సీతాపతికిన్

    [సీమంతము = పాపట]


    ఏమీ మాయ బలారి శత్రువట తా నేతెంచి బంధించ నే
    లా మా రామున కిట్టి బాధలని గోలాంగూలవీరుల్ వడిన్
    భీమాస్త్రమ్ముల తీక్ష్ణఘాతముల సంప్రీతిన్ దయామానసుల్
    సీ మంతంబును జేసి రెల్ల రపుడున్ సీతాసతీ భర్తకున్

    [సీము +అంతంబును = సీమంతంబును; చీము = తెల్లని చెడ్డ రక్తము]

    రిప్లయితొలగించండి
  20. దేవిక
    -------

    సీమంతినులు వనమ్మున
    సీమంతము జేసి ;రంత సీతాపతికిన్
    కైమోడ్పులిడుచు జానకి
    ప్రేముడి కలన్గన్పడగను ప్రీతిని బొందెన్ !

    రిప్లయితొలగించండి
  21. స్థేమాస్తోకపరాక్రమార్జితలసద్ధీమత్త్వ మేపార, సం
    క్షేమం బారయ నొప్పు సంతు ననుచున్,
    సీతమ్మకుం దాపసుల్
    సీమంతంబును జేసి, రపుడున్ సీతాసతీభర్తకుం
    దామంతన్ మది జోత లిచ్చి రచటన్ నాకౌకసుల్ తృప్తులై.


    రిప్లయితొలగించండి
  22. జామున సీతకుపందిట
    సీమంతము జేసిరంత!సీతాపతికిన్
    కామితసిద్దియునొసగగ
    ప్రేమగ నాశీస్సులిడిరి పెద్దలు నచటన్

    రిప్లయితొలగించండి

  23. ఏమండీ జీపీయెస్ వారు
    ఆక్రోశవాణి వారి సమస్యాపూరణ పైవారపు సమస్య యేమిటి ?/విశేషంబులెవ్వి


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    ("శ్రీ జానకీదేవి సీమంత మలరే")

    ఆమంత్రించిరి రంగరావు సతితో...నామెన్ పతిన్ ...హాయిగా
    భామల్ జేరిరి కట్టుకట్టి,...పతినిన్ బంధించి,...మిస్సమ్మకున్
    సీమంతంబును జేసి రెల్ల రపుడున్;...సీతాసతీభర్తకున్
    సామంతమ్మును జూపి
    గ్రుడ్లురిమెనా సావిత్రి రమ్యమ్ముగా!

    "సీతాసతీభర్త" = రామారావు
    (N T)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆబ కందము :)

      ఆమంత్రించి జిలేబికి
      సీమంతము జేసిరంత!సీతాపతికిన్
      గోముగ పాటల పాడుచు
      సామంతముగల రమణిగ సావిత్రి మనెన్!

      జిలేబి

      తొలగించండి
  25. భూమింబుట్టిన సాధ్వి దౌహృదిని సంపూజింపగా నెంచుచున్
    భామల్జేరిరి మోదమందుచును సంభారమ్ముతో వేడ్కగా
    సీమంతంబును జేసిరెల్ల, రపుడున్ సీతాసతీభర్తకున్
    బ్రేమన్ మీరగ కట్నకానుకల నంపింపన్ దలన్ బోసిరే.

    రిప్లయితొలగించండి


  26. కోమలియౌసీతమ్మకు
    సీమంతముఁజేసిరంత, సీతాపతికిన్
    సేమము చేకూరు ననుచు
    ప్రేమగ దీవించిరెల్ల వేడుక తోడన్.

    రిప్లయితొలగించండి
  27. రేలంగి ఉవాచ:👇

    ఆ మిస్సమ్మను లాగి భామలటవే హైరాన నొందించుచున్
    సీమంతంబును జేసి రెల్ల రపుడున్;...సీతాసతీభర్తకున్
    గోమున్ జూపుచు స్వీట్లు కుక్కుచునిటన్ కూర్చుండ బెట్టించగా
    జాముల్ మీరగ గోడ నెక్కుచును తా జంపించి పార్పోయెగా!!!

    సీతాసతీభర్త = రామారావు NT

    రిప్లయితొలగించండి