1, ఆగస్టు 2018, బుధవారం

సమస్య - 2749 (సాగరం బబ్ధి...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"
(లేదా...)
"సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"

111 కామెంట్‌లు:

 1. నీదు శంకరాభరణము నిక్కముగను
  చేత కాదయ యీదగ చెన్నుగాను
  వేగమే పారిపోయెద తూగు వచ్చె:
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి!

  రిప్లయితొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  🙏 నమో భారత్యై 🙏

  ఆగమశాస్త్రసారలసదద్భుతదుగ్ధసమావృతమ్ము , స..
  ద్యోగతపోజపాదిగుణయుక్తగభీరము ., వాఙ్మయమ్ము , శ్రీ
  వాగనుశాసనాదిపరిభావితరత్ననిధాన., మీదగా
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

   తొలగించండి
  2. Bit paper with answers.... 😊🙏

   త్రాగెనదేమి కుంభజుడు ? రాజునకెయ్యదిపుట్టినిల్లు ? శ్రీ
   రాగిణి తండ్రి నా నెవడు ? రామశరాగ్ని వడంకెనెవ్వడె...
   ద్దౌ గతి ధాత్రిలో నదికి ? నంతములేనిదదేమి ? యన్నచో
   సాగర.,మభ్ధి.,తోయనిధి., సంద్రము.,వారిధి ., ద్వీపవంతమున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


  3. వెరీ వెరీ బ్యాడు కృష్ణుల వారి పేరు పెట్టుకుని ద్వారక యెచ్చట కలదు అన్న ప్రశ్న మైలవరపు వారు వదిలివేయటం తగదు గాక తగదు


   ఇట్లు
   ప్రొటెస్టు చేయువారు
   శ్రీకృష్ణ జిలేబి

   తొలగించండి
  4. శ్రీ కృష్ణ జిలేబీ గారికి వందనములు... అలా అడిగితే చిన్న ఇబ్బంది... సముద్రమునందు... అని జవాబివ్వాలి... దత్తపదాలన్నీ ప్రథమావిభక్తిలోవే... అయినా మీకు.. నాకు తెలుసుగా.. నమోనమః 🙏🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 3. ( అశోకవనంలో హనుమంతునితో సీతాదేవి )
  ఎటుల లంఘించి వచ్చితి వెంతవింత !
  వంత సుంతయైనను లేద వానరేంద్ర ?
  నూరుయోజనాలటగద ధీరవర్య !
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి .

  రిప్లయితొలగించండి


 4. సాగరం బబ్ధి, శరనిధి సంద్రము! దధి
  పెరుగు,పిచ్చిలము,సిగరి ! పేనవాహి
  వస్త్రము,వలిపము,తడుపు! పాలి,నడవ
  సేతువు! ఉలిమిరి!జిలేబి చేయి వేయి :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పర్యాయపదాల పట్టికను పద్యంగా పేర్చారు. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 5. శ్రీగిరిరాజపుత్రి శశిశేఖరుఁ డంతట గంగఁ దెచ్చి చె
  న్నౌ గతి నెత్తి నుంచిన మనంబునఁ గుందఁగఁ గాంచి షణ్ముఖుం
  డాగని రోషబద్ధుఁడు సురాపగఁ బొమ్మనె నామె ఖిన్నయై
  యేగుట కేది దిక్కనఁగ నింపుగ నారు ముఖంబు లిట్లనెన్
  "సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పదవ తరగతి విద్యార్థి పట్టుబట్టి
   నేర్చెఁ బర్యాయపదముల, మార్చిలోఁ బ
   రీక్షలో వ్రాసెఁ గడలికి రెచ్చిపోయి
   సాగరం, బబ్ధి, శరనిధి, సంద్ర, ముదధి.

   తొలగించండి
  2. గురుదేవుల పూరణలు చాలా బాగున్నవి.మొదటి పూరణము మరింత బాగున్నది .

   తొలగించండి
 6. ఏమి దాటె హనుమ? వాసమేది హరికి?
  నేది రత్నాకరమనగ? నేది జడధి?
  ధృత్వమనగనేమి టనగ తెలిపెనిట్లు
  సాగరం, బబ్ధి, శరనిధి, సంద్ర, ముదధి.

  రిప్లయితొలగించండి


 7. శ్రీ గురు వాక్య మిద్ది విను శ్రేయము పేయము గూర్చు మాలినీ
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్,
  వాగులు వంకలన్ని యును పారుచు పారుచు చేరు రీతిగా
  బాగరి! సర్వ దేవతల ప్రాంజలి యీశుని చేరు సర్వదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. తెలుగు పాఠమ్ము చివరన తెలుసుకొనగ
  పంచభూతము లేవంచు పంతులడగ
  బదులిడె మతిహీనుండగు బాలకుండు
  సాగరంబబ్ధి శరనిధి సంద్రముదధి.

  రిప్లయితొలగించండి
 9. చెప్పినదిచెప్పి చెప్పుచు చెప్పుచుండు
  శిక్షకులు వేచెదరుగద శిష్యగమిని
  సాగరం బబ్ధి శరవిధి సంద్రముదధి
  యనుచుతెలిపి తిమియనగ నర్థమడుగ

  రిప్లయితొలగించండి
 10. వాన్జ్మ య ంబు ను శోధించవలె నట న్న
  సాధ్య పడ దేరి కైనను సత్య మది య
  సాగ రం బ బ్ధి శర నిధి సంద్ర ముద ధి
  లోతు కను గొన లేరు గా లోక మందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వాఙ్మయాన్ని సాగరంతో పోల్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. ఏగతి వ్రాతు పద్యముల నింతటి తిప్పలు వెట్టుచుండ నౌ
  రా! గణముల్ కుదుర్చుకొనినంతట నా యతి పారిపోవు నె
  ట్లో గమనించి పట్టుకొన రోసము జూపును ప్రాస , చందమా !
  "సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ, బహుకాల దర్శనం... సంతోషం!
   ఛందస్సాగరాన్ని గురించిన మీ పూరణ ప్రశస్తంగా నున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. నిత్య సత్యానురక్తితో నెగడువాని
  సంతతము దైవ చింతన సల్పి,విష్ణు
  శరణు గోరగ దాటు సంసార మనెడు
  సాగరం బబ్ధి జలనిధి సంద్ర ముదధి.

  రిప్లయితొలగించండి
 13. ఏగతి చేతు పూరణము నీగతి నీయ సమస్యలన్ కటా
  ఓ గురువర్య తోయధికి నొప్పెడి మారు పదాల నిత్తురా
  బాగు మరిన్ని పేర్కొనెద వార్నిధి నీరధి పాథి కంధియున్
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పృచ్ఛకునికి తగిన సమాధానమే చెప్పారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 14. నిన్న చెప్పిన పాఠంబు నేర్చినావె
  చెప్ప గలవోయి జలనిధి కొప్పుమీర
  నన్యశబ్దంబులన గురు డాడె వటువు
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి.

  రిప్లయితొలగించండి
 15. "సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"
  కాగ సముద్రమున్ దెలుపు కమ్మని తెన్ గు పదమ్ము లట్టులే
  సాగరగామినీ,గతిల చాపిల, జక్కర, జాలు,వాహినుల్
  నా గమనించినట్టి కవనాల నదిన్ తెలుపన్ సుశబ్దముల్.
  (ఈ సమస్య కి ఒక వాక్యంగా అర్థం రాక అన్ని పర్యాయపదాల సమాహారం గా గమ్మత్తుగా ఉన్నది. కనుక అవి సముద్రానికి పర్యాయపదాలైతే ఇవి నదికి పర్యాయపదాలు అని పూరించాను.)

  రిప్లయితొలగించండి
 16. జలధినకివియె పర్యాయములగునార్య!
  సాగరంబబ్ధి శరనిధిసంద్రముదధి
  యిటుల నెఱుగంగ వలయును నితరములకు
  భాషపెంపొందుకొఱకుగాబ్రతియొకరును

  రిప్లయితొలగించండి
 17. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =======================
  సాగర మబ్ది తోయనిధి సంద్రము
  వారిధి ద్వీపవంతమున్
  ==========================
  సముద్రమునకు పర్యాయ పదములుగా
  సాగరము, అబ్ది, తోయనిధి, సంద్రము
  వారిధి, ద్వీపవంతము అని చెప్పుటలో
  విశేషమునే సమస్యగా పరిగణించ
  ==========================
  సమస్యా పూరణము - 213
  ====================

  కాలుష్యముగ తాపమది పెరిగె
  హరిత గృహ ప్రభావమరిగె
  ధృవ ప్రాంతముల మంచు కరిగె
  నీరుగా కదిలి జలధికి జరిగె
  తన మట్టమును పెంచుకొని
  భూమిని ముంచెత్త ఆత్రపడినన్
  సాగర మబ్ది తోయనిధి
  సంద్రము వారిధి ద్వీపవంతమున్

  ====##$##====

  విచ్చలవిడిగా శిలాజ ఇంధనములను
  (Fossil Fuels )(బొగ్గు, డీజిల్, పెట్రోల్ )
  మండించటము వలన కాలుష్యము పెరిగి
  ఫలితముగా "హరిత గృహ ప్రభావం "
  (Green House Effect ) ఏర్పడి భూమి
  యొక్క తాపము పెరిగి(Global Warming)
  ధృవప్రాంతముల యందలి మంచు కరిగి
  ఆ నీరంతయు సముద్రములలోకి చేరితే
  సముద్ర మట్టములు పెరిగి తీరప్రాంతములే
  కాదు చిన్న చిన్న దేశాలు మునిగి కనుమరుగు
  అవుతాయన్నది భావం

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 18. వేగమె వ్రాయుడీ రనుచు విజ్ఞుడు సద్గురు వర్యుడొక్కడున్
  రాగమయాత్ముడై కడకు రండని ఛాత్రుల బిల్చుచుండి స
  ర్వాగమ వేత్త వత్సలత నర్ణవ శబ్దము లివ్విరా యనెన్
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్

  రిప్లయితొలగించండి
 19. వేగమె జాహ్నవిన్ దఱుమ వేడగ షణ్ముఖు డంబకోర్కెపై
  "యేగతి యామెకింక?" యని యీశ్వరు డాతని పృచ్ఛ సేయగా
  నాగని కోపమున్ బలికె నారు ముఖమ్ముల వాడె యప్పుడున్
  "సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"
  (ఆఱు ముఖాలతో రోషముతో ఆఱు పర్యాయ పదాలు చెప్పినాడు పండితుడైన కుమార స్వామి)
  ****}{}{****
  ఈ పూరణ కాధారము సుప్రసిద్ధమైన యీ శ్లోకమే !
  )()(**)()(
  "అంబా కుప్యతి మూర్ధ్ని విహితా గంగేయ ముత్సృజ్యతాం
  విద్వన్ షణ్ముఖ కాగతిర్మయి చిరం తస్యా స్థితాయావద !
  రోషాత్కర్ష వశాదశేష వదనై ప్రత్యుత్తరం దత్తవాన్
  అంబోధిర్జలధి పయోధి రుదది వారాంనిధి వారిధి !!
  ****}{}{****

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈనాటి సమస్యకు కూడా ఈ శ్లోకమే ఆధారం. కాని ఎప్పుడో చిన్నప్పుడు విన్న శ్లోకం. అందువల్ల శ్లోక భావాన్ని యథాతథంగా నేను నా పూరణలో వెల్లడి చేయలేకపోయాను. ఆ పనిని మీరు సమర్థంగా నిర్వహించారు. ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
   శ్లోకం మొదటిపాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. క్షమించాలి.మొదటి పాదంలో గణదోషమన్నారు.ఎచటనో తెలుప ప్రార్థన!

   తొలగించండి
  3. అది శార్దూలవృత్తం. గణవిభజన చేసి చూడండి. మీకే తెలుస్తుంది.

   తొలగించండి
  4. కుప్యతి- మూర్ధ్ని కి మధ్య యింకొక పదముండాలి. చూడండి.

   తొలగించండి


  5. Kalidasa delights!
   King Bhoja declares: I will give you the fourth line of a four-line verse; the challenge for you is to complete the verse most appropriately by filling in the remaining lines of the verse. The fourth line that he gave was the following:

   अम्भोधिर्जलधिः पयोधिरुदधिर्वारां निधिर्वारिधिः ||

   The funny part of this proposition is that there are six words in this line of verse, but they all mean the same, namely, ‘ocean’! The poets of the assembly including Kalidasa dispersed for the day carrying the uneasy burden of this challenge which required to fill three lines of a verse which in its fourth line did nothing but to repeat the word ‘ocean’ six times. The next day when the assembly reconvened, Kalidasa brought a delightful verse:

   अम्बा कुप्यति तात मूर्ध्नि निहता गङ्गेयमुत्सृज्यताम्
   विद्वन् षण्मुख कागतिस्त्विह भवेत्तस्याः स्थिरायाश्चिरम् ।
   कोपारोपकरालशेषवदनैः प्रत्युत्तरं दत्तवान्
   अम्भोधिर्जलधिः पयोधिरुदधिर्वारां निधिर्वारिधिः ॥

   Ambā kupyati tāta mūrdhni nihatā gaṅgēyamutsr̥jyatām
   vidvan ṣaṇmukha kāgatistviha bhavēttasyāḥ sthirāyāściram.
   Kōpārōpakarālaśēṣavadanaiḥ pratyuttaraṁ dattavān
   ambhōdhirjaladhiḥ payōdhirudadhirvārāṁ nidhirvāridhiḥ.   Subrahmanya, the little son of Lord Shiva and Goddess Parvati, goes angrily and complains to his father. ‘'Father, please get rid of this Ganga on your head, Mother is very much upset about it'’. The Father replies, '‘Oh Six-headed One, she has been living on my head for long. Where shall I ask her to go?''

   The six-headed son, angry beyond words, replied with each of his six heads in succession: ''Ocean, ocean, ocean, ocean, ocean, ocean!’'

   Source

   https://www.rasikas.org/forums/viewtopic.php?t=20261&start=25#p287406

   తొలగించండి

  6. హమ్మయ్య శార్దూలమొకటి వచ్చె :)


   శంభో!గంగను కైవిడన్తగునయా శర్వాణి యాశంసగా"
   "అంభశ్ఛారము తానెటన్ చనునయా యాగ్నేయ? " కాంతాళసం
   రంభారూపపు షణ్ము ఖుండనెనథర్వా! తండ్రి!‌ఈశానుడా!
   అంభోధిర్జలధీపయోధితవిషాయంభోనిధీతర్షమున్"

   జిలేబి

   తొలగించండి
  7. శంభో శంకర! మా జిలేబి కిడుమా శార్దూల మత్తేభముల్

   తొలగించండి


 20. రమేశా వారి భావనకు :)


  జేగురు రంగు కల్మషము చేర్వ హరిత్తు గృహంపు వీకముల్
  సాగర మబ్ది తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్
  వాగఱతన్ క్రమించి మన భాగ్యవిధాత భువిన్ గ్రసించగా
  రేగడి మన్ను గాపృథవి రివ్వున మార్పును గాంచు గుండె పో !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. మొన్నటి పూరణ:

  చంపకమాల
  విడువడు సృష్టిజేయుటను విశ్వసృజుండుగ జీవజాలమున్
  తడబడుటన్నదే గనడు ధాతగ రాతను దీర్చి దిద్దుటన్
  కడుముదమంది భారతిని గైకొనె తా సృజియించ వెల్గ నా
  పడఁతి, పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్

  రిప్లయితొలగించండి
 22. ఏగతి కల్గునో భువిని యేఱుల కంచును బ్రశ్న వేయగా
  నాగురు దేవుడే యచ్చెరు వొందగ బల్కె శిష్యుడే
  వేగిని,జాలు,నబ్ధ,నదికిన్,వేగమె స్వత్వరి సోమధారకున్
  "సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"
  ***)()(***
  (నదికి ఆఱు పర్యాయ పదాలు చెప్పి, దాని గతి సముద్రమేనని దానికీ ఆఱు పర్యాయ పదాలు చెప్పి గురువు నచ్చెరు వొందించాడా శిష్యుడు.)

  రిప్లయితొలగించండి
 23. ఏమి దాటెను హనుమంతు డేగ లంక
  కనగ శిష్యుడు పలుకగ కష్ట పడగ
  పదియు పదిసార్లు గురువనె పంతగించి
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి

  నిన్నటి సమస్యకు నా పూరణ

  తెమ్మని ఫలములు పాలను
  నెమ్మది షుష్క వచనముల నిచ్చుట గాక
  న్నిమ్మహిలోగీతా సా
  రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్

  రిప్లయితొలగించండి
 24. సమస్య :-
  "సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"

  *తే.గీ**

  కడలి పర్యాయ పదములు నొడువుమన్న
  గురువు మాటకు పలకక కూర్చొనున్న
  ఉన్నత చదువరులకునూ తానెజెప్పె
  "సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పదముల నుడువు మన్న... పలుకక కూరుచున్న..." అనండి. మూడవ పాదంలో గణం, యతి రెండూ తప్పాయి. సవరించండి.

   తొలగించండి
  2. 3వ పాదం గణాలు సరిపోయాయి కదా ఆర్యా
   ఇక యతి ప్రాస యతి సరిపోవుననుకున్నాను

   తొలగించండి
 25. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సాగరంబబ్ధి శరనిధి సంద్రముదధి
  నంబుధి నపార జలరాశి నంబుభృత్తు
  వంటి కడలి నానార్థపు పలుకులెల్ల
  వ్రాసి వాడా పరీక్షలో పదిలుడయ్యె

  రిప్లయితొలగించండి
 26. ఉత్పలమాల
  ఊగితి గెల్చి వత్తునని నుత్తర గోగ్రహణంపు యుద్ధమున్
  సాగుచు నీబృహన్నలట సద్బల కౌరవ యోధులెల్లరున్
  మూగఁగ వారు వీరనుచు పోల్చఁగ నాగితి వారి సైన్యమే
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్ 

  రిప్లయితొలగించండి
 27. గూగులునందుజూడగనుగోముగగన్పడెవారరాశన
  న్సాగరమబ్ధితోయనిధిసంద్రమువారధిద్వీతవంతము
  న్నీగతిపూరణంబులనుశిష్టజనంబులుమెత్తురేభువిన్
  బాగుగలేనిచోమరలవ్రాతునుజెప్పుడుస్వామి!యిత్తఱిన్

  రిప్లయితొలగించండి
 28. పోఁగులు వోయుచున్ సిరులఁ బోరును సల్పుచు నెల్లవారితో
  సాగెను జీవితాంతము గసాయిగ నంత్యమునన్ జనమ్ముతో
  వేగగ లేని వాఁడొకడు వేదన తోననె నాజవమ్మనన్
  *"సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"*

  రిప్లయితొలగించండి

 29. ఏగతి కల్గునో భువిని యేఱుల కంచును బ్రశ్న వేయగా
  నాగురు దేవుడే మదిని యచ్చెరు వొందగ బల్కె శిష్యుడే
  వేగిని,జాలు,నబ్ధ,నదికిన్,వేగమె స్వత్వరి సోమధారకున్
  "సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"
  ***)()(***
  (నదికి ఆఱు పర్యాయ పదాలు చెప్పి, దాని గతి సముద్రమేనని దానికీ ఆఱు పర్యాయ పదాలు చెప్పి గురువు నచ్చెరు వొందించాడా శిష్యుడు.)

  రిప్లయితొలగించండి
 30. పెక్కు పేర్లఁ బరఁగు చుండుఁ బృధ్విఁ గడలి
  పలుక విషధి కూపారము పాథి వారి
  రాశి వార్థి పయోరాశి రత్న నిధియు
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి


  మ్రోగఁ దరంగ నాదములు మోహన రాగములై చెలంగి యా
  భోగ జలాశయమ్మునను బూర్ణ మనశ్శుచులై మునుంగ వే
  నీఁగును దోష సంచయము నే ననిశమ్మును భక్తిఁ గొల్తు నీ
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్

  రిప్లయితొలగించండి
 31. మిత్రులందఱకు నమస్సులు!

  వేగమె గాడ్పుపట్టి వినువీథికి నెక్కియు, వార్ధి దాఁటి, తాఁ
  జాఁగియు, లంకఁ జొచ్చి, యట జానకిఁ గన్గొని, లంకఁ గాల్చి, రాన్,
  వేగిరపాటుతోడ రఘువీరుఁడు రాముఁడు దాఁటఁ జేరె నా
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్!

  రిప్లయితొలగించండి
 32. ఉదరమందున క్షీరాబ్ధిపదిలబరచి
  ఆరునెలలకు సరిపడు నమ్మపాలు
  ఆయురారోగ్య మునుసంతు కందజేయు
  సాగరంబబ్ధి శరనిధి సంద్రముదది (తల్లిపాలవారోత్సవమునకైనాపూరణ తల్లిపాలుతరుగనినిధి)

  రిప్లయితొలగించండి
 33. కవి మిత్రులకు క్షమాపణములతో సరదా పూరణము

  తెలుపు మిస్సన్న మెదడును సులువు గాను .
  పోచిరాజు మెదడు నెట్లు పోల్చ వచ్చు,
  ఘన జిలేబి బుర్ర నెటుల కనగ వచ్చు
  మైలవరపు బుర్ర నెటుల మక్కళింతు
  సాటి చేతు మెచట జీ.పి శాస్త్రి మేధ,
  "సాగరం, బబ్ధి ,శరనిధి, సంద్రము,దధి,
  తరచి చూడ కవుల బుర్ర తారిషంబు,
  బ్లాగులోని వారెల్లరు పాధి మేధ
  సమము గలవారనగవచ్చు, సంకరమ్ము
  గళములో దాచి నిచ్చును కమ్మ నైన
  కంజమును శంకరార్యుడు ఘనత తోడ  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రశంసాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దాచి యిచ్చును' అనండి.

   తొలగించండి

  2. పూసపాటి వారు

   నమో నమ ఃఃఃః

   ఘన జిలేబి బుర్ర నెటుల కనగ వచ్చు

   జాంగ్రీ వలె సుడులు తిరిగుచుండు :)


   జిలేబి

   తొలగించండి
 34. (2)
  [కంసునిఁ జంపి, ముక్తినొసఁగఁగా, నతని మామ జరాసంధుఁడు తన యల్లునిఁ జంపినందులకుఁ బ్రతీకారముఁ దీర్చుకొనుటకు శ్రీకృష్ణునిపై పదునేడుమాఱులు దండెత్తిరాఁగా, నా హరి, జరుగనున్న యాపదను గ్రహించి, సముద్రమధ్యమున ద్వారకను గట్టుటకై సముద్రము చెంతకుఁ జేరిన సందర్భము]

  బాగునుఁ గోరి కంసునకు వైళమ ముక్తిని నీయ, నల్లునిన్
  వే గిరిధారి చంపుటను నెట్టన సైఁపక దండుఁగొంచుఁ బోన్,
  రాఁగల సేగి నెంచి, హరి గ్రక్కున ద్వారకఁ గట్టఁ జేరె నా
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్!

  రిప్లయితొలగించండి
 35. ఆటవిడుపు సరదా పూరణ:
  ("అరిషడ్వర్గ సాగరము")

  రాగము ద్వేషమున్ పొసగు రంగుల రాట్నపు జీవితమ్మిదే...
  మాగిన పండు వోలెడిది...మాయల మారిది...మేనకమ్మదౌ
  కౌగిట జీవునిన్ బిగిసి కామము క్రోధము నిట్టి పేర్లదౌ
  సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. రాగద్వేషములకటా
   మాగిన పండుగ జిలేబి మాదిరి సుమ్మీ
   కౌగిట బిగించి ద్రొక్కును
   సాగర మబ్ధి తిమి కంధి సంద్రము జడధిన్

   జిలేబి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   జిలేబీ గారూ,
   __/\__

   తొలగించండి
 36. జాగిలమన్న నేమిటన చారల పిల్లియనంగ నవ్వి యా
  బాగరి యడ్గెనిట్లు జల భాగము లెన్నని పేరులేవనన్
  వేగమె చెప్పెనొక్కడవి విశ్వము నందున యారటంచవే
  సాగర,మబ్ధి, తోయనిధి, సంద్రము, వారధి, ద్వీపవంతమున్ .

  రిప్లయితొలగించండి
 37. *సరదాగా*

  అవమాన భారాన్ని తట్టుకో లేక ద్రౌపది ప్రాయోపవేశం చేస్తానని చెప్పినట్టుగనూహించిన పద్యం

  బ్రతక లేనింక యవమాన భారమందు
  నాకు దిక్కిక....యనుచును శోకమందు
  మాట పెకలక నేడ్చెడు మగువతోడ
  పలికిరదివిని యేవురు భర్తలపుడు
  సాగర,మబ్ధి, శరనిధి, సంద్ర, ముదధి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సాగరం బబ్ధి...' లేకుంటే గణదోషం.

   తొలగించండి
 38. పసివయసునను మరిమరి పలుక పలుకు
  చిలుకలవలెను పలుకగ చిటిపొటిగను
  పరిపరినడిగిరి యనగ పలుకు వినగ
  సాగరం బబ్ధి శరనిధి సంద్రముదధి

  రిప్లయితొలగించండి
 39. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2749
  సమస్య :: సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్.
  సాగరము అబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతము అని జలనిధికి ఉన్న పేర్లను ఆరు విధాలుగా చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం :: షణ్ముఖుడు తండ్రియైన శివుని దగ్గఱకు వెళ్లి నాన్నగారూ! అమ్మకు కోపం వచ్చింది. నీ నెత్తిమీద ఉన్న గంగను వదలివేయి అని అన్నాడట. నేను వదలివేస్తే ఇక గంగకు ఎవరు దిక్కు అనే విషయం నీవే చెప్పు అని శివుడు అడిగినాడట. అప్పుడు షణ్ముఖుడు కోపంగా జవాబు చెబుతూ సముద్రమే దిక్కు అని అన్నాడట. ఐతే షణ్ముఖుడు ఒకసారి చెబితే ఆరుసార్లు చెప్పినట్లయ్యింది. ఎందువలనంటే అతనికి ఆరు ముఖాలు ఉన్నాయి కదా. అందువలన గంగకు దిక్కు సాగరము అబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతము అని ఆరు ముఖాలతో చెప్పినట్లయ్యింది అని విశదీకరించే శ్లోకం కూడా ఒకటి ఉంది. అది ఏమిటంటే
  అంబా కుప్యతి తాత! మూర్ధ్నివిలసద్గంగేయ ముత్సృజ్యతాం
  విద్వన్! షణ్ముఖ! కా గతిః మయి చిరా దస్యాః స్థితాయా వద ।
  కోపావేశవశా దశేష వదనైః ప్రత్యుత్తరం దత్తవాన్
  అంబోధిః జలధిః పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధిః !!
  ఇప్పుడు నా పూరణ :: షణ్ముఖ శివుల మధ్య జరిగిన సంభాషణ

  ‘’ఈ గతి నెత్తిమీద వసియించెడి గంగను వీడుమయ్య! తా
  నాగని కోప మందినది యంబయె’’ ; ‘’గంగకి కేది దిక్కగున్’’
  వేగము తోడ షణ్ముఖుడు వింతగ నుత్తర మిచ్చె కోపియై
  ‘’సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (1.8-2018)

  రిప్లయితొలగించండి
 40. బాగరి సీత కోసమని వాయు
  సుతుండట దాటెనేమి? నీ
  వేగతి యన్న బ్రోచుగద విష్ణువు తా వసియించు నెక్కడో?
  యే గని నుండురా లవణ? మెచ్చట రత్నములుండు భూరిగన్?
  స్వాగతమంచు జాహ్నవి నెవండట పిల్చును సంగమింపగన్?
  రాఘవమన్నభావమును వ్రాయుమటంచును కోర జెప్పెనే
  సాగర,మబ్ధి, తోయనిధి, సంద్రము, వారిధి, ద్వీపవంతమున్

  రిప్లయితొలగించండి


 41. వేగమె చెప్పెనొక్కడు భువిన్ జడధుల్ భళి యారటంచవే
  సాగర,మబ్ధి, తోయనిధి, సంద్రము, వారధి, ద్వీపవంతమున్!
  బాగు! కవీశ! యేడవ కబంధమకో యన చెప్పె తానిటుల్
  బాగరి నేత్ర వారి గ శుభమ్ముల గాంచె జిలేబులూరుచున్:)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 42. రిప్లయిలు
  1. మారుతి యెగుర సింధువు మాత నరయ
   ప్రేమ తోడ కేసరి దాను బ్రేమ జెప్పె
   సప్త సంద్రముల్ దాటగ స్మరణ జేయ
   సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి

   తొలగించండి
 43. విడుము గంగమ్మ వెంటనె విస్ఫులింగ
  కన్న!నెటులను చిరకాల కాపురమ్ము
  యెచట బొమ్మందు సురనది నిప్పళముగ
  క్రోధి షణ్ముఖుండరచెను కూతలిడుచు
  సాగరంబబ్ది శరనిధి సంద్రముదధి!

  రిప్లయితొలగించండి
 44. డా.పిట్టా సత్యనారాయణ
  'సాగరం'బీద జొర'నబ్ది 'శరసువర్ష,
  'అంబునిధి'పడవేయగ నదియ'సంద్ర'
  'ముదధి'వారికి నౌనని ముదము మీర
  నన్నిటిని గల్ప భాషయె అమరకోశ?
  మెన్నవలె నర్థ భేదంబు నమర యశము.
  (A synonym is not identically equal to a word.It is nearly similar to a particular word.Employing synonyms is a loose Sally.)

  రిప్లయితొలగించండి
 45. డా.పిట్టాసత్యనారాయణ
  సాగగదీయ నవ్యపద సంభ్రమ,భాషకు భావ మబ్బునే?
  ఆగగలేని తొందరను'యయ్యవి నియ్యవి యొక్కటే 'యనన్
  యోగమె పాండితీ ప్రభ 'సయోధ్యయె':నర్థపు లోతు కౌనటే?
  'సాగరమబ్ది తోయనిధి సంద్రము వారిధి దీపవంతమున్'

  రిప్లయితొలగించండి
 46. డా.పిట్టాసత్యనారాయణ
  కొమ్మను గూడగ పొందున
  నమ్మహి సమ్మతియె వలయు నింపుగ రమ్మా
  రమ్మనకుండనె పొందెడు
  "రమ్మును" గ్రోలినపుడెముని రాజన నొప్పున్

  రిప్లయితొలగించండి
 47. ధరణిజను వెదుకుచు నేమి దాటెను కపి
  ధరణిజ కొరకు నెక్కడ ధనువు నెత్తె
  రాఘవుండు,వంతెన నెట లాఘవముగ
  కట్టి బాటను చేసిరి ఘనముగాను
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"*

  గగన యానము చేయుచు ఘనముగాను
  తలచుచుంటిని మదిలోన దాటుచుంటి
  చక్కగానిట ముదమున సంద్ర మనగ
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"*


  పాఠశాలలో పంతులు ప్రతిదినమ్ము
  ప్రతిపదమునకు పర్యాయపదము లెల్ల
  వివరముగ దెల్పి విద్యార్థిన్ పిదప నడుగ
  జంకులేక బదులిడెను చక్క గాను
  సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి.

  రిప్లయితొలగించండి
 48. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  *"సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"*

  సందర్భము: బ్రహ్మ కు వేర్వేరు కల్పాలలో వేర్వేరు పేర్లతో రంగులతో శివుడు పుత్రునిగా లభించినాడు. పేర్లు రంగులు పైన నున్నవి. వీరినే పంచబ్రహ్మ లంటారు.
  పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శివావతారం విలసిల్లుతోంది.
  పంచాక్షరి స్మరిస్తే శివుని ఐదవతారాలను స్మరించిన ట్టవుతుంది.
  పంచాక్షరికి ముందు ఓంకారం చేరితే 'షడక్షరి'.లేదా ప్రణవ పంచాక్షరి. ఇది అన్ని మంత్రాలలో శ్రేష్ఠమైన దంటారు.
  *తద్బీజం సర్వ విద్యానాం మంత్ర మాద్యం షడక్షరమ్..* అని చెప్పబడింది.
  కృష్ణుడు తన గురువులలో ఒకడైన ఉపమన్య మహర్షిని అడుగగా ఆతడు ప్రణవ పంచాక్షరి మహిమను విశదీకరిస్తాడు.
  సర్వ విద్యలకు మూలమైన మంత్ర మిది. సకల ప్రయోజనాలను సిద్ధింపజేసే మంత్ర మిది.
  పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శివమూర్తి వెలుగుతూ ఓంకారంలో అన్ని శివమూర్తులూ నెలకొనివుంటా యని శివ లింగంలో ఆ యా దిక్కులకు తిరిగి వుండి ఆయా మూర్తులు సన్నిధి చేస్తా యని సంప్రదాయజ్ఞులు చెబుతారు.
  అందువల్ల పంచాక్షరిలోని ప్రతియొక్క అక్షరమూ ఒక సముద్రమే!
  ==============================
  కన నూర్ధ్వ ముఖుడు లింగాన నీశానుండు
  కద సుందరయ్య *న* కారమందు!..
  తూర్పు ముఖాన తత్పురుషుండువెలుగొందు,
  కన పచ్చనయ్య *మ* కారమందు..
  దక్షిణ ముఖు డౌచుఁ దనరు నఘోరుండు,
  కన నల్లనయ్య *శి* కారమందు..
  అలరు నుత్తర ముఖుడై వామదేవుండు,
  కన నెఱ్ఱనయ్య *వ* కారమందు..
  ఒగి పశ్చిమాస్య సద్యోజాతుడు వెలుంగు,
  కనఁ దెల్లనయ్య *య* కారమందు..

  నరయ వీరె పంచబ్రహ్మ లైదుగురును..
  శివునియవతారములు,విరించి వరసుతులు..
  మహిత మయిన పంచాక్షరీ మంత్ర మహిమ
  *"సాగరం, బబ్ధి, శరనిధి, సంద్ర, ముదధి"*

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  1-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 49. బాగుగ నిద్రలేపగను బాంబుల తాకిడి ఢంఢమాలునన్
  వేగమె నేర్వగా బుధుడు వెన్కటి చేష్టలు చెల్లవంచుచు
  న్నేగతి నీదిరాయనగ నిమ్రను ఖానుడు వెక్కినిట్లనెన్: 👇
  "సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"

  రిప్లయితొలగించండి