2, జులై 2018, సోమవారం

న్యస్తాక్షరి - 57

అంశము - గ్రామ దేవతలు
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు... 
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా
'పో - లే - ర - మ్మ' ఉండాలి.

62 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    అంశము - గ్రామ దేవతలు
    ఛందస్సు- ఆటవెలది
    న్యస్తాక్షరములు... 
    నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా
    'పో - లే - ర - మ్మ' ఉండాలి.

    పోతపోయ కరుణ మూర్తీభవించితి !
    లేరు నీకు సాటి లేరు తల్లి !
    రక్ష నీవె మా పురమునకు ! మావుళ...
    మ్మ ! యని భీమవరము మహి రహించె !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదంలో రెండవ 'లేరు'కు అన్వయం?

      తొలగించండి
    2. పోలెరాంబ విడిచి పోలేరు , నీ దయ
      లేక నరులు నిలువ లేరు , తల్లి !
      రక్షనీవె నీవె , రక్తార్చితాంఘ్రి ! అ
      మ్మ ! కరుణఁ గని సతము మమ్ము బ్రోవు !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  2. పోతు లయ్య సామి పోచమ్మ మైసమ్మ
    లేచి వచ్చు నట్లు లీల నుండ
    రయము బోనము లను రక్షించు మనుచు న
    మ్మలు భక్తి మీర కొ లు తు రు గ ద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాలుగో పాదం లో మ్మలి ల అని సవరణ చేయడ మైనది

      తొలగించండి
    2. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. గురువుగారూ! నాల్గవ పాదంలో యతి సరియేనా?

      తొలగించండి
    4. నాలుగో పాదం లో ప్రాస యతి లికిని లుకును చెల్లింది సీతా దే వి గారూ

      తొలగించండి
  3. A.Satyanarayana Reddyజులై 02, 2018 6:00 AM
    పోసి జలము చేయ పూజనమ్మలను పో
    లేరు యిచ్చు శుభము లెండి వేగ
    రండి గ్రామ వాసు లార నిండుమది న
    మ్మను కొలిచి సుఖముగ మనుటకొరకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోలేరు + ఇచ్చు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పోలే రొసంగు శుభము..." అనండి.

      తొలగించండి
  4. డా.పిట్టాసత్యనారాయణ
    పోచ!మైస!ముసలి! పూర్ణమ్మ!కనకమ్మ!
    లేడ్గురక్క!లయ్య బోడమల్లు!
    రంగ!దుర్గ!నాగ! రౌద్రపు బీర!స
    మ్మతినిగొల్తు మయ్యలమ్మల మిము!💐
    (పోచమ్మను ప్రేమగా,"ఓ పోచ !"అంటూ పిలువడంT.S లో పల్లె పట్టుల ఆచారము కలదు.)

    రిప్లయితొలగించండి
  5. పోక రాక లిచ్చి పూర్ణంబుగా నిల్ఛి
    లేమి బాపి సిరుల లీలనిచ్చి
    రయముగాను మమ్ము రక్షింపు!ప్రేమ ని
    మ్మనుగు తల్లి నతుల నందజేతు

    రిప్లయితొలగించండి
  6. పోరు వంటి బ్రదుకు తీరులే మార్చియు
    లేమి నుండి జనుల లేవదీసి
    రయము వెతల ద్రోల 'రమ్ము!రారమ్ము!ర'
    మ్మనుచు గ్రామ దేవతను పిలిచెద.

    రిప్లయితొలగించండి
  7. పోతు వేట నిడగ పోచమ్మ గుడికేగి
    లేచి మబ్బు లోన కాచి యుంటి
    రగడ జేసి జేసి రాజన్న యలిగె న
    మ్మన వివిన గనడు మైసమ్మ దరికనె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. పోతు వేట నిడగ పోచమ్మ గుడికేగి
      లేచి మబ్బు లోన కాచి యుంటి
      రగడ జేసి జేసి రాజన్న యలిగె న
      మ్మనవి వినగ కదిలె మారు యనక

      తొలగించండి
  8. (పో)వ లెనిల గ్రామ దేవతల్ దురితంబు
    (లే)మి గూలి మాదు కామితములు
    (ర)యము తోడ దీరి జయమంద వలయున
    (మ్మ)యని కొలువ వలెను నియతి తోడ.

    రిప్లయితొలగించండి
  9. పోలేరమ్మవు నీవే పోశమ్మవు కూడ నీవే
    లేలెమ్మనగ నీవు రావే మమ్ముల కాచి పోవే
    రంజుగ ఇదె కల్లు ముంత మరి యాటలతో
    మాసంత
    మ్మత్తులోన జోగిరంత భక్తి లేదు వీసమంత

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశం ::న్యస్తాక్షరి
    నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు క్రమంగా
    *పో - లే - ర - మ్మ* అనే అక్షరాలు వచ్చేటట్లు *ఆటవెలది పద్యం* వ్రాయాలి.
    సందర్భం :: ఓ పోలేరమ్మ తల్లీ! నీకు సాటి యైన దేవతలు వేఱే లేనే లేరమ్మా! నీ చరణమే శరణమని నీ పాదం పట్టుకొన్నానమ్మా! తెలియక తప్పులు చేసినా మమ్ము వదలి వెళ్లిపోవద్దమ్మా! పాడి పంటలను అనుగ్రహించి మా పేదరికాన్ని తొలగించు మమ్మా! మాకు దిక్కు నీవే నమ్మా! మమ్ము చల్లగా చూడమ్మా! అని గ్రామ దేవతను ప్రార్థించే సందర్భం.

    *పో* కుమమ్ము వీడి *పో* కు పోలేరమ్మ!
    *లే* రు నీకు సాటి, *లే* మి బాపు,
    *ర* క్తి పట్టితిని ధ *ర* ణి నీదు చరణ మ
    *మ్మ!* గతి నీవె యమ్మ! మమ్ము గనుమ!

    పాదాది లోనే కాక యతి స్థానములలో కూడా న్యస్తాక్షరములను ఉంచే ప్రయత్నం జరిగింది.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-7-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      అద్భుతమైన పూరణ. న్యస్తాక్షరాలను పాదాదిలోను, యతిస్థానంలోను నిలిపిన మీ ప్రతిభ ప్రశంసనీయం. అభినందనలు.
      నాలువ పాదంలో యతిస్థానంలో ద్విత్వ మకారం లేదు. వచ్చే అవకాశమూ లేదు.

      తొలగించండి
    2. నాపై గల ఆదరాభిమానముల కారణంగా గొప్పగా అభినందించిన గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
  11. పోతరాజు నీకు బూజలే చేయగ
    లేచిరావె తల్లి బ్రోచగాను
    రక్ష నీవె రమణి రత్నాంగి! పోలెర
    మ్మ! కరుణావతార! మాననీయ!

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా! నాల్గవ పాదమున న్యస్తాక్షరం ప్రధమం కాకుండా ద్వితీయమైనది! పరిశీలింప ప్రార్ధన!🙏🙏🙏

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీతాదేవి గారి వ్యాఖ్యను గమనించి తగిన సవరణ చేయండి.

      తొలగించండి
    3. గు రు మూ ర్తి ఆ చా రి
      ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


      మూర్ఖ భక్తి
      ~~~~~~~


      పోటకమున పిల్ల పోరుపెట్టుచు నుండె |

      లేత మేక నిక బలి నొసగెదము

      రక్ష గట్టి | వేగ రక్షించు సుంకుల

      మ్మ ! మయి సమ్మ ! చౌడ మాంబ ! తల్లి ‌ !




      { పోటకము = స్ఫోటక మ‌ను చర్మ వ్యాధి ;

      రక్ష = తాయెత్తు ; }


      -------------------------------------------------------------------------------

      తొలగించండి
  13. పోతులెందుకమ్మ ? పూనకాలేలమ్మ ?
    లేనిపోని రభస గానవమ్మ !
    రక్తపాతమాపి రక్షణ సల్పు మ
    మ్మ ! మము గన్న తల్లి ! మాన్యచరిత!!

    రిప్లయితొలగించండి
  14. ప్రశస్తమైన పూరణ బాపూజీగారూ! అభినందనలు!!💐💐💐

    రిప్లయితొలగించండి
  15. పోతును బలి నిత్తు భోగమ్ము లీయవే
    లేని వాడనమ్మ లీల జూపు
    రక్త తర్పణమ్ము రంజిల చేతున
    మ్మ,నను కావుమమ్ము వినతు లివియె

    రిప్లయితొలగించండి
  16. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂న్యస్తాక్షరి🤷‍♀.. .. .. .. .. .. ..
    పో..లే..ర..మ్మ అనే అక్షరాలు
    4 పాదాల ఆదిలో వరుసగా రావాలి.
    అంశం.. గ్రామదేవతలు
    ఛందస్సు.. ఆటవెలది

    సందర్భము: పోచమ, బతుకమ్మ, తాయమ్మ, పోలేరమ, గెలువులమ, మారెమ, సుంకులమ్మ, జమ్ములమ్మ... వీళ్ళు గ్రామ దేవత లని తలుస్తాను.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పోచమ బతుకమ్మ పొసగ తాయమ్మ పో
    లేరమ గెలువులమ మారెమ యిల
    రమణకెక్కు సుంకులమ్మ యా జమ్ముల
    మ్మ లలి గ్రామ దేవత లని తలతు

    రమణకెక్కు=శోభించు
    లలి=ఒప్పిదమైన

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    2.7.18

    రిప్లయితొలగించండి

  17. పోలకమ్మ ! ఎర్రపోతమ్మ ! బ్రోవు పో
    లేరు తల్లి యెక్కిలి మము బ్రోవు
    రచన నాటవెలది ప్రణతులివి మరిడ
    మ్మ శరణు శరణనుచు మదిని గొల్తు!

    రిప్లయితొలగించండి
  18. పోతురాజునీకుపూజజేయగవచ్చె
    లేచిరమ్మువేగలీలతోడ
    రక్షజేయనీవుదక్షురాలవుగద
    మ్మనివేడుచుంటిమారెయమ్మ!

    రిప్లయితొలగించండి
  19. పోచుపుచ్చెదవుగ పురమునందలికీడు
    లేరు నీకు సాటి రిపులనణచ
    రక్తమీయలేదు రట్టడి చేయక
    మ్మ, మరిడెమ్మ బ్రోవుమమ్మ మమ్ము

    పోచుపుచ్చు=పోగొట్టు

    రిప్లయితొలగించండి
  20. పోవ దొడ్డవరము ముత్యా లనఁగ వేల్పు
    లేమఁ గాంతు మచట లేక సాటి
    రమణి వెంట నుండ నమృతాశి గోగుల
    మ్మ యతి భక్తి నే నమస్కరింతు

    [మా యూరు బి. దొడ్డవరము లోని దేవతలు: ముత్యాలమ్మ, గోగులమ్మలు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోవ లేరు విడిచి మూర్తి పోలేరమ్మ
      లేవ రమ్మ నిద్ర భావ మంద
      రయక నిన్ను నమ్మ రక్షింప మమ్ము ర
      మ్మ నినె పోల లేరమ భువి నమ్మ


      పో.. పోలేరమ్మ
      లే..రమ్మ
      ర మ్మ
      మ్మ పో..లే..ర..మ్మ

      తొలగించండి
  21. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. పోలికేది నీకు పోగొట్ట భీతిని
      లేరు నీకుసాటి లేమ లెచట
      రమ్మువేగ మమ్ము రక్షింప తిరుపత
      మ్మ! పెనుగంచి గ్రామ మాత లక్ష్మి!

      న్యస్తాక్షరాలను యతి స్థానములలో కూడ ఉంచే ప్రయత్నం చేశాను!

      తొలగించండి
  22. పోతరమ్ము వదలి పూజలు చేసెద,
    లేమి నాపి నిడు కలిమిని మాకు,
    రక్ష తోడ మమ్ము రమ్యమౌ చేటల
    మ్మనిరతమ్ము కాచు మనసు బెట్టి

    ప్రకాశము జిల్లా లో చచేటలమ్మ,అంకమ్మ అను గ్రామ దేవతలు గలరు

    రిప్లయితొలగించండి
  23. పోమ్మన్న పోని రోగాల్
    లేమ్మై పోవు గద నీ ఫలీకృత కరుణన్
    రమ్మన వచ్చు సి రుల్ , నా
    మ్మమ్మల్ గొల్చిన భగవతి! మాతా శరణం!

    రిప్లయితొలగించండి
  24. పోడిమి చెడుమాన్పు!పోలేరు యమ్మగా
    లేమిలేకజేయు లేశమైన
    రక్ష గూర్చుదేవి తక్షణమందు!న
    మ్మ?మనభక్తి శక్తిమార్గమౌను!

    రిప్లయితొలగించండి
  25. పోలి తల్లినిలను పోడిమిగ గొలువ
    లేమి సురిగిపోవు, లేదు భయము
    రక్షగోరి జనులు రమ్మని బిలువ త్రి
    మ్మటలనెడపి గాచు మహిత శక్తి!!!

    రిప్లయితొలగించండి
  26. పోలకయను తల్లి మేలొనర్చగ సాటి
    లేనిదనుచు దలచి మానవాళి
    రక్ష గోరి యామె నక్షయ వరములి
    మ్మనుచు గొల్తురైరి యవని యందు

    రిప్లయితొలగించండి
  27. ఆటవెలది
    పోషణమది నాటుపోటులన్ దయఁగూర్చి
    లేమి బాపి సాటిలేని బలిమి
    రసను గ్రామములకు రక్షగా నొసఁగు న
    మ్మలఁ గనంగ రమ్మ! మహిమఁ దెలియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపండితులు శ్రీ సూరారం శ్రీనివాసులు గారి సూచిత సవరణలతో :

      ఆటవెలది
      పోషణమతి నాటుపోటులన్ దయఁగూర్చి
      లేమి బాపి సాటిలేని బలిమి
      రసను గ్రామములకు రక్షగా నొసఁగు న
      మ్మలఁ గనంగ రమ్మ! మహిమఁ దెలియ

      తొలగించండి
  28. పోరి యోర్తు గొలిచె పుడమిలో నిను గోరి
    లేదు సంతు నీదు లీల చూప
    రమ్మటంచు కోర రయమున తీరెన
    మ్మ నిను పొగడ తరమె మనిషికిలను.


    పోరుసలిపి జనుల బ్రోతువు సతతమ్ము
    లేమి బాపి తీర్చు కామితమ్ము
    రయమున నిను గొల్చి రాజాధి రాజులి
    మ్మహిని యేలిరంట మానుగాను.

    పోకు మమ్మ తల్లి పురమును విడి నీవు
    లేరు మాకు దిక్కు వేరెవరును
    రక్షమాకు నీవె రయమున కావవ
    మ్మగిరి పుత్రి మమ్ము మహిని నీవు

    రిప్లయితొలగించండి
  29. కవి మిత్రులు శ్రీ బొల్లికొండ రామనాథం గారు వ్రాసిన న్యస్తాక్షరి పూరణను పరిశీలించగలరు.

    (పో)రు సల్పు వేల్పు పోలేరు మాతవే
    (లే)మి తనము మాకు లేక యుండ
    (ర)జత నాసికాభరణము రంజిలగ న
    (మ్మ)! నిను గొలుతు మమ్మ! మమ్ము గనుమ!

    రిప్లయితొలగించండి