9, జులై 2018, సోమవారం

ఆవిష్కరణ సభ

"జడ కందములు - మా కందములు" ఆవిష్కరోత్సవానికి వచ్చిన కవిమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఎందరో మహానుభావులు, అవధానులు, పండితులు, కవిశ్రేష్ఠులు, బహుగ్రంథకర్తలు నామీది ఆప్యాయతతో దూర భారాలను లెక్కించక, ఇబ్బందులు పడుతూ వచ్చి సభను అలంకరించారు. వేదిక మీద కూర్చుని, సన్మానాలు పొందదగినవారు సామాన్య ప్రేక్షకులై సభనిండా కూర్చుని ఎదురుగా కనిపిస్తుంటే ఒకింత అపరాధ భావానికి లోనయ్యాను. నా పిలుపు మేరకు ఎక్కడెక్కడి నుండో వచ్చి, స్నేహభావంతో పలుకరించిన మిత్రుల సౌహార్దాన్ని చూచి భావోద్వేగానికి లోనయ్యాను. ఎన్నెన్నో విషయాలు చెప్పాలని, అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలని ఆత్రంగా ఉన్న నేను తీరా నన్ను మాట్లాడమనే సరికి కారణం లేకుండానే దుఃఖం ముంచుకు వచ్చి ఏమీ మాట్లాడలేకపోయాను. నా మాటలు వినాలని ఆసక్తిగా ఎదురు చూసిన మిత్రులను నిరుత్సాహ పరచినందుకు మన్నించండి.
పుస్తకాన్ని సలక్షణంగా ప్రకటించాలన్న ఉద్దేశంతో నేను, గుండు మధుసూదన్ గారు ఎంతో జాగ్రత్తగా పరిశీలించి దోషాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికి రెండు దోషాలు నా దృష్టికి వచ్చాయి.
"అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడింది" అని ఒక సామెత. అందరి తప్పులు వెదకి, దిద్దిన నేను నా పద్యంలో గణదోషాన్ని గుర్తించలేకపోయాను. అలాగే గోగులపాటి వారి పద్యంలో ప్రాస తప్పింది. ఇలాగే నా దృష్టికి రానివి కొన్ని ఉండవచ్చు.
ఇది నేను మొదటిసారిగా ప్రచురించిన పుస్తకం. మొదటిసారిగా నిర్వహించిన సభ. అనుభవ రాహిత్యం వల్ల ఏవైనా లోటు పాట్లు జరిగితే, ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను.
మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. పుస్తకావ్ష్కరణ సభ దిగ్విజయంగా జరిగినందుకు గురువుగారికీ, కవి మిత్రులందరికీ అభినందనలు!!👏👏👏👏💐💐💐💐💐

    రిప్లయితొలగించండి
  2. నిర్వాహకులకు పాల్గొన్న కవిమిత్రులకు అభినందనలు!💐👍👍👌👌💐

    రిప్లయితొలగించండి
  3. గురువుగారికి మఱియు తక్కిన కవి మిత్రులందరికీ శుభాభినందనలు. నేను హైదరాబాద్ లో లేకపోవడం వలన సభకు రాలేక పోయాను మన్నించండి.

    రిప్లయితొలగించండి
  4. అలుపెరుగని పట్టుదలతో అనుకున్నది సాధించిన మీకు అభినందనలు. ఇక లోటు పాట్లంటారా అటువంటి బృహత్కార్యంలో ఒకటి రెండు సహజం. బాధపడకండి. మీరు చేసిన పనితో వందలాది మంది కవిమిత్రులు చాలా ఆనందపడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు
    సభను దిగ్విజయంగా జరిపించి, శ్రమించిన పెద్దలకు గురువులకు అందరికీ పేరు పేరునా ధన్య వాదములు. కవిమిత్రులకు అభినందనలు

    రిప్లయితొలగించండి
  6. _()_()_()_
    గురువుగారికి పాదాభివందనములు.
    కవిమిత్రులకు అభినందనలు..

    రిప్లయితొలగించండి
  7. గురువుగారికి నమస్సులు!🙏🏻

    *శంకరాభరణం ప్రచురణలు* మొదటి పుస్తకమైన *జడ కందములు మా కందములు* ఆవిష్కరణ మహోత్సవం దిగ్విజయంగా పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ పుస్తక పరిష్కరణమునకు, ఆవిష్కరణకు, మీరు, శ్రీ గుండు మధుసూదన్ గారు పడిన శ్రమ గొప్పది. శ్రీ అన్నపరెడ్డివారు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడానికి పడిన శ్రమ అనితరసాధ్యము. శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు సభను రక్తికట్టించారు. నాకు కూడా ఉడతాభక్తిగా సేవ చేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ పాదాభివందనములు.

    ఇదే ఆరంభంగా కవి, పండిత, మిత్ర, దాతల సహకారంతో మరిన్ని పుస్తకాలు ప్రచురించబడి ఆచంద్రతారార్కం *శంకరాభరణం* పేరు నిలిచిపోవాలని ఆకాంక్ష.

    మీరెప్పుడు పిలచినా సాహితీ సేవకు నా వంతు సహకారం అందించడానికి సిద్ధం.

    ధన్యవాదములు
    🙏🏻

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి
  8. చాలాసంతోషమైనకార్యక్రమముఅందరికివందనాలు

    రిప్లయితొలగించండి
  9. మీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం గా భావిస్తున్నాను. సభ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆనంతకృష్ణ గారి సమీక్ష అద్భుతంగా ఉంది.
    అందరు మహామహుల మధ్య నేనుండటం చాలా సంతోషంగా అనిపించింది.
    డాక్టర్ ఉమాదేవి జంధ్యాల వారికి కృతజ్ఞతలు.
    వారి తిరుప్పావై గజల్ మాలిక ఆవిష్కరణ కూడా చక్కగా జరిగింది.
    ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిపించిన మీకు అభినందన పూర్వక వందనాలు !

    రిప్లయితొలగించండి
  10. పుస్తకావిష్కరణ సభను చక్కగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి శుభాభినందనలు! ఇందుకు తోడ్పాటునందించిన శ్రీ అసనారె, శ్రీ సూర్యనారాయణ, శ్రీ అవుసుల భానుప్రకాశ్, చి. విట్టుబాబు మఱియు ఇతర మిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు! పూలదండతో బాటుగా దారానికి గూడా మన్నన దక్కినట్లుగా, వారి యాజ్ఞను పాటించి, ఏదో నాకు చేతనైన పనిని చేసినంత మాత్రమున వారితో పాటుగా, నాకూ గౌరవం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరై, తమ అమూల్యమైన ప్రసంగాలతో సభను అలరించిన మాన్యులు చింతావారు, శ్రీ ముద్దు రాజయ్య గారు, అనంతకృష్ణగారు, తోపెల్ల వారు, ఎం.వీ. కృష్ణారెడ్డి గారు, రామకృష్ణ ఆచార్యులవారు మొదలైన అందరికీ కృతజ్ఞతాపూర్వక వందనములు! సభకు హాజరై వేదికపై ఆసీనులు కావలసిన మహోన్నతులైన శ్రీ మైలవరపు వారు, శ్రీ కోట వారు, శ్రీ ఆత్రేయ ప్రసాద్ గారు, శ్రీ వెల్దండ వారు, శ్రీ మునిగోటి వారు, శ్రీ బొగ్గరం ప్రసాద్ గారు ఇంకా ఇంకా చాలామంది గౌరవనీయులు సభకు నిండుదనాన్ని కలుగజేశారు. చిరంజీవులైన వర్ధమాన కవి మిత్రులందరూ ఎంతో అభిమానంతో సభకు హాజరై, శ్రీ శంకరయ్య గారిపై గల తమ భక్తి గౌరవాలను ప్రకటించుకొన్నారు. సభ దిగ్విజయం కావడానికి అందరూ తమ తమ పాత్రలను ప్రతిభావంతంగా పోషించారు. అందరికీ వందనాలు!

    రిప్లయితొలగించండి
  11. ।పుస్తకావిష్కరణ కార్యక్రమ o ఆద్యంతం తన భుజ స్కందాలపై వేసుకుని దిగ్విజయంగా నిర్వహి oచిన కంది శంకర య్య గారిని మనస్ఫూర్తిగా అభి నంది స్తున్నాను

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి...సభను జయప్రదంగా నిర్వహించిన మిత్రులందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మహోత్కృష్టాంధ్ర భాషా పద్య కావ్య రచనా జిజ్ఞా సాత పార్త పథికులకు రమణీయ శీతల హృదాశ్రయ మిచ్చి పోషించు గురు వరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారి స్వప్న సాకారమునకు సప్రణామ శత హృదయ పూర్వక ధన్యవాదములు. సభా విజయ కారక కవు లందఱికి నభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పద్య రచనలో పదునెనిమిది నెలల బిడ్డడి పద్యానికి పెద్దల పద్యాల సరసన చోటా !
    అందునా అందరు కవివరేణ్యుల సమక్షంలో సన్మానమా !
    ఎంతటి ఉత్సాహ పరిచే విధానం!
    నేరుగా శంకరయ్యగారి శిష్యులయిన వారెంత అదృష్టవంతులో !
    కనీసం ఇప్పుడైనా శిష్యుడనై ధన్యుడనయ్యాను

    రిప్లయితొలగించండి
  15. సార్! సభాసంబంధమైన వీడియో YouTubeలో upload చేయగలరా?

    రిప్లయితొలగించండి