2, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2778 (మేకను సాధువులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మేకను సాధువులు వండి మేలని తినిరే"
(లేదా...)
"మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే"

63 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    ఈ కలి నాకలిన్ గొనిన యెల్లరి చూపులు మమ్మె చూచు., మే..
    మే కనిపింప జంపెదరు ! మృత్యుభయమ్మున బుట్టినాము ! దా
    మే కడుపార మమ్ము దిన మేలగు , పున్నెము దక్కునన్న యా
    మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  2. చీకటిని పాఱ ద్రోలుచు
    నాకలిని జయించు జ్ఞాను లవనిని జూడన్
    శాకాహారులె సుమ్మీ
    మేకను సాధువులు వండి మేలని తినరే.

    రిప్లయితొలగించండి
  3. డా. పిట్టా సత్యనారాయణ
    మేకయె కాయల నలముల
    నేకముగా పొట్టబెట్ట నిమిడిన మేనిన్
    జోకపు సాత్త్విక దినుసని
    మేకను సాధువులు వండి మేలని తినిరే!(శరీర మాద్యమ్ ఖలు ధర్మ సాధనమ్)

    రిప్లయితొలగించండి
  4. శాకములను పెట్టి పెనిచి
    యాకాళిక పూజల తఱి, యాగమ్ములలో
    చేకుఱ దృతి బలి యిచ్చిన
    మేకను సాధువులు వండి మేలని తినిరే

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    జోకను బొక్క, పల్లెమున జుర్రుచు మూల్గుల గ్రోల కాశిలో
    వీకను గంటనాదమును వ్రేల్చిన పుణ్యము వచ్చనంగ నీ
    పోకయె సర్వ సమ్మతము పోవగ నేలొకొ తీర్థయాత్రలన్
    మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే!(కంచంలో బొక్క మ్రోగితే కాశిలో గంట మ్రోగుతుంది, అదీ ఏకాదశి పర్వదినమున..ఈ నానుడి T.Sలో ప్రచారంలో నున్నది)

    రిప్లయితొలగించండి
  6. వేకువజాము నాచరితవిశ్రుతనిత్యతపోజపాదులై

    చేకొని బ్రహ్మచర్యమును జింతనతోఁ బరమాత్మ నట్లు తా

    మే, కను, వండి సాధువులు మేలని మెచ్చు నారగించి, రే

    శాకములైన, సత్త్వగుణసంగతపక్వసుధర్మబద్ధముల్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  7. డా. పిట్టా సత్యనారాయణ
    రాకను వేచి సర్వులు పరాకుగ భానునివారమందు వే
    పాకములన్ వినోదముగ బాముచు భిక్షకు లేదు లేదన
    న్నేకముగా భిషగ్వరులు నెన్నగ మాంసమె మాంస వృద్ధిగా
    లోకము పోకడన్ గనియు లోలుపులైరిటు దేహి గానిదే
    సాకున సాధనల్ జెలగు సాత్త్విక మెచ్చట కాన(అడవి)గానకే
    మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించరే?!(ఆరగించెదరను భావము)

    రిప్లయితొలగించండి
  8. శాకములన్ భుజించి వరసత్త్వఫలాశితపోనిమగ్నులై

    చేకొని బ్రహ్మచర్యమును శ్రేష్ఠతమమ్మగు ధర్మవర్తనన్

    మేకలు సాధుజంతువులఁ బెంచిరి పుత్రుల కైవడిన్ మరే

    మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే?.

    కంజర్ల రామాచార్ర.





    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా నుండి
    ఆఖరి పాదమున చివరన"నారగించిరే"గా చదువ గలరు.దీనితో సమస్యాపాదోషోల్లంఘనా విముక్తుడనౌతానను,ఆర్యా)

    రిప్లయితొలగించండి
  10. శాకము లెన్నొతిని రుచిగ
    పాకము దప్పుచు కొన్ని పాంచ భౌతికం
    బేకాయద మంచు బలుకగ
    మేకను సాధువులు వండి మేలని తినిరే

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2778
    సమస్య :: మేకను వండి, సాధువులు మేలని మెచ్చుచు నారగింపరే.
    సందర్భం :: *వాతాపి జీర్ణం* అనే కథ మన కందఱికీ తెలిసిందే కదండీ. వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు సింహికావిప్రచిత్తుల కుమారులు. ఇల్వలుడు తనకు ఒక మంత్రమును ఉపదేశించమని ఒక భూసురుని కోరి విఫల మనోరథుడయ్యాడు. అప్పటినుండి బ్రాహ్మణులపై కోపం పెంచుకొన్నాడు. కామరూప విద్య గల తన తమ్ముడైన వాతాపిని మేకగా మారమని ఆ మేకను వండి విప్రులను పిలిచి భోజనంలో వడ్డించేవాడు. ఆ సాధువులు భోజనం చాలా బాగున్నదని భుజించేవారు అని విశదీకరించే సందర్భం.

    మా కిడలేదు సాధువులు మంత్రము నంచును నిల్వలుండు దా
    వీకను భోజనమ్మునకు బిల్చును సాధుల, జంకు గొంకులే
    లేక సహోదరుం డచట ప్రీతిగ మేకగ మార, పెట్టు నా
    ‘’మేకను వండి, సాధువులు మేలని మెచ్చుచు నారగింపరే.’’
    (గురువర్యులు శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో)
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-9-2018)

    రిప్లయితొలగించండి


  12. ఆకలికి పాప మెయ్యది
    మాకు కలదనుచు తలపుల మాలిన్యము సా
    మీ కానక హముని కొలిచి
    మేకను సాధువులు వండి మేలని తినిరే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. ఆకలి దీర్చితరిట!సొ
    మ్మేకను?సాధువులు వండిమేలని తినిరే
    కాకారాయళ్లడిగిన
    సాకుట నీసాధ్యమగున సంపదలున్నా?
    (అన్నదాతకుమిత్రునిసలహా)

    రిప్లయితొలగించండి
  14. లోకుల మోసగించుటకు శ్లోకములన్ పఠియించుచున్ సదా
    శాకములన్ భుజించుచును సాధువులై తిరుగాడి జిహ్వకౌ
    కాకను తాళలేకనతి కాంక్షను నెవ్వరుఁజూడకుండగా
    *"మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే"*

    రిప్లయితొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    మధ్యాక్కర


    ఈ కలి‌ లో సాధు సుజను లెచ్చట గలరు ? కేవలము

    రూకలు గడియింప వివిధరూపములఁ గనిపించెదరు |

    మేకను సాధువుల్ వండి మే లని తినిరే గుడి కడ |

    పీకల దాకను బ్రాంది విస్కియు గ్రోలిరే , పడుచు ‌ |


    [ పడుచు = క్రిందపడుచు , పతనమగుచు ]

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  16. ప్రాకెడు తీవకు చక్కగ
    కాకర కాయలవి కొన్ని కాయగ వాటిన్,
    తోకను నులుముచు తఱిమియు
    మేకను ; సాధువులు వండి మేలని తినిరే!

    రిప్లయితొలగించండి
  17. ఆకులు, పూవులు, పండ్లను
    చేకొని తినువారు దలచి చిత్తమునందున్
    ‌మూకగు శాకమె యిదియని
    మేకను సాధువులు వండి మేలని తినరే

    రిప్లయితొలగించండి

  18. విప్రుడొకనికి పక్షవాతము రాగా పావురాయి రక్తము పూసిన పక్షవాతము తగ్గును కోడి గుడ్లు పాలతో త్రాగిన బలము వచ్చునని తెలుపుచు బలవంతము చేయు చుండ మేలైన మొలకులు తిని పాలు తేనే త్రాగుదునని తెలుపు సందర్భము



    పావురాయి స్వజము పక్షవాతపు జబ్బు
    నయము చేయు ననుచు నాకు పూయ
    నేల, బలమువచ్చు నీ కనుచు శిఖి యం
    డములును మాహ సూమమున గలిపి
    పానము నిడమని పలుక నేల , వినుము
    నామాట, ఘనులార నాకు పెట్ట
    వలదు "మేకను, సాధువులు వండి మేలని
    తినిరే బలము నిడు గెనుసు గడ్డ

    ల నడవుల లోన, ఋషు లెల్లరును తినిరట
    గురుముల గులకరములను, గోవు పాలు
    కలిపి తేనెను నాకీయ వలయు, పలము
    ముట్ట నని బల్కె నొకడు విముఖత తోడ




    గురుముల గులకరములు = మొలకెత్తిన గింజలు
    మాహ = ఆవు , సూమము= పాలు

    రిప్లయితొలగించండి
  19. మూకాంబకుబలియిత్తురు
    మేకను,సాధువులువండిమేలనితినిరే
    కాకరకాయలకూరను
    మూకుమ్మడిదమకుదాముమోదముతోడన్

    రిప్లయితొలగించండి
  20. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    మేకను వండి సాధువులు
    మేలని మెచ్చుచు నారగించిరే
    =======================
    సాత్వికతను సంతరించుకున్నవారే
    సాధువులు, మరియట్టి సాధువులు
    మేకను వండుకుని లొట్టలేసుకుంటు
    తిన్నారనటంలో అసంబద్దతె సమస్య
    ==========================
    సమస్యా పూరణం- 246
    =================

    భూతదయ మనకు యుండవలెను
    కరుణగ మన మది నిండవలెను
    ప్రాణుల బలులెండవలెను
    సాత్వికతయే తాను పండవలెను
    తమమున మనమిదె జొచ్చుచు
    తినకూడదనుచున్ మేకను వండి
    సాధువులు మేలని మెచ్చుచు
    నారగించిరే శాఖపు తిండి

    ====##$##====

    సగటున శాఖాహారుల కన్నా మాంసా
    హారుల వైద్యపరమైన ఖర్చులవి తడిసి
    మోపెడౌతున్నాయని అమెరికా దేశపు శాస్త్ర
    వేత్తల పరిశోధనయట

    తమమును పెంచే మాంసాహారము
    కన్నా సాత్వికతలో ఓలలాడగ శాఖములను
    వండుకొని తినుటయే మేలని సాధువులు
    తలపోసిరని భావము.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమేశ్ గారూ ఏమనుకోకండి. వెజిటేరియన్స్ అనే అర్థంలో “శాఖాహారము” బదులు శాకాహారము అని వ్రాయాలనుకుంటానండి.

      తొలగించండి
  21. గురువు గారికి నమస్సులు
    పాకన నాతియు తినునట
    మేకను,సాధువులు వండి మేలని తినిరే
    పాకములన్నియు వడిగాన్
    దూకుడు తగదట మృష్టాన్న దుగ్ధము తోడన్.

    రిప్లయితొలగించండి
  22. మేకనువండిసాధువులుమేలనిమెచ్చుచునారగించిరే
    మేకనుసాధుపుంగవులుమేలుగవండుచునారగించుటా?
    యీకలికాలమందిటులనింకనునేమిజరుంగునోగదా
    యీకనులేమియేమిగను నీశుడ!చెప్పగలేనునిత్తరిన్

    రిప్లయితొలగించండి
  23. మేకను శునకంబనిరే
    మూకుమ్మడిగా, తదుపరి మోసము గెలువన్
    కాకర కాయల మూటనె
    మేకను సాధువులు, వండి మేలని తినిరే..

    రిప్లయితొలగించండి
  24. ఈ కొలఁది కడుపున కిదియ
    మా కిఁకఁ జాలని తనిసిన మానసు లగుచున్
    వీఁకను బాయసము, పితికి
    మేఁకను, సాధువులు వండి మేలని తినిరే


    చేకొని సాధు సజ్జనులఁ జిత్తము నుంచి పదాంబుజంబులన్
    గైకొని వారి దీవనలు కమ్మగ నుండినఁ జాల మేలగున్
    మాకది యొప్పు వంటలను మాగృహ మందున, నెన్నడేని రా
    మేకను, వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే

    [రాము + ఏకను =రామేకను; ఏకు = తిట్టు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగున్నది సార్! మేక పాల పాయసం...

      https://gpsastry.blogspot.com/2010/06/renunciation-woes.html?m=0

      తొలగించండి
    2. శాస్త్రిగారు నమస్సులు ధన్యవాదములు. మీరు మెయిలు చూచుకున్నట్లు లేరు.

      తొలగించండి
    3. సార్!

      August 27 తారీకున మీరిచ్చిన మైలునకు ధన్యవాదములతో వెంటనే reply ఇచ్చితిని సార్!

      🙏🙏🙏

      తొలగించండి
  25. ఓహో అలాగా నాకేమి రాలేదే! కలుసు కోవడము కుదర లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Below, I take the liberty of copy-pasting my reply since there are no confidential matters in it. Hope you won't mind sir:

      **********************************

      Re: Kameswara Rao P
      27 August at 12.35 PM

      So nice hearing from you sir! Thank you very much!

      Unfortunately I am a bit unwell these days. Effect of ageing perhaps.

      ...I scan your padyams every day even though I rarely understand them. Yesterday I was waiting for your long poorana (as usual you would take it as a challenge to squeeze dattapadi into a short kanda padyam and expand nishidhakshari into a long one). I was expecting a 4-line vrattam but was thrilled to get an even longer seesam.

      You are truly blessed by Goddess Saraswati! My regards and best wishes to you and your near and dear:

      GP Sastry

      Sent from my iPhone

      తొలగించండి
    2. Thank you Sir. I might have deleted it by mistake. Next time I hope to visit you by God's grace so that we can have a glimpse our Guruji.
      .
      .

      తొలగించండి

    3. పోచిరాజు వారి స్పామ్ బాక్సు లో కనిపిస్తోందండి.


      తొలగించండి
    4. వారి స్పామ్ బాక్స్ మీకెలా కనిపిస్తోందండీ "జిలేబి" గారూ ☺?

      తొలగించండి
    5. నారదులవారికి తెలియనిది ఉంటుందా ?
      ట్యూబ్‌లైట్ అనిపించుకోవడం అవసరమా ?

      తొలగించండి
    6. కనిపిస్తుందండి యని వారి యుద్దేశ్య మనుకుంటాను.

      తొలగించండి

    7. విన్నకోట వారు

      ఇంతకు మునుపిట్లాగే కష్టేఫలే వారు ప్రాబ్లెమ్ అంటే
      వెతికితే ఆపై‌ వారి స్పామ్ లో‌ కనబడిందండి‌


      జిలేబి

      తొలగించండి
  26. లోకము లో సాత్వికు ల కు
    శాకాహారము ప్రియమగు సంతృప్త ము గా
    నీ కరణి ప ల్క నె చ టే
    మేక ను సాధువు లు వండి మేలని తిని రే !
    ______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి


  27. హా! పలమనేరు లో స
    ల్లాపము!కవివరులు గూడి లావణ్యముగా !
    వాపసు పల్లవుల హరి‌మ
    జ్ఞాపక ముల తెచ్చె లయను సాయంత్రముగా !


    శుభాకాంక్షలతో
    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. ఆకలి వేయగ స్వయముగ
    పాకము చేసికొనువారు ప్రాప్తించిన యే
    శాకము నందైన రుచిర
    మే కను సాధువులు, వండి మేలని తినిరే

    కను= పొందు,

    రిప్లయితొలగించండి
  29. ఈ కలికాలమందున మహీతల మందున మోక్షగాములై
    యాకలినే జయించిన మహాత్ములు వారలు గాదె తిందురా
    మేకను వండి సాధువులు? మెచ్చుచు నారగింపరే
    పాకము జేయనట్టి పలు పండ్లును పాలును కందమూలముల్.

    రిప్లయితొలగించండి

  30. శాకముగ నాకు కూరలు
    చేకొనుచును సాగు వారి చేతుల లాగన్
    దాకగ, రయమున దరుముచు
    మేకను, సాధువులు వండి మేలని తినిరే!


    శాకముగ నాకు కూరలు
    చేకొనుచును సాగు వారి చేతుల లాగన్
    దాకగ, రయమున దరుముచు
    మేకను, సాధువులు వండి మేలని తినిరే!





    రిప్లయితొలగించండి
  31. డా.బల్లూరి ఉమాదేవి

    ఆకొన్నను తినబోరుగ
    మేకను సాధువులు, వండి మేలని తినిరే
    శాకములను పలురీతుల
    స్వీకారము చేసిరెల్ల వేడిగ నుండన్.

    శాకము లెల్లను వండగ
    నాకారముమారి యవియు నజరూపొందన్
    స్వీకారముచేయుచునట
    మేకను సాధువులు వండి మేలని తినరే.

    రిప్లయితొలగించండి
  32. శ్రీకరముగ సారె నిడగ
    పాకమునకు పిండి గలిపి పలు నచ్చులలో
    కేకియు , కీరము, మరియున్
    మేకను సాధువులు వండి మేలని దినిరే!!!

    రిప్లయితొలగించండి
  33. కాకర కాయలు లేతవి
    మాకను దోయికి పసందు మఱి మఱి జేయన్
    చేకొని వెంటనె తెచ్చితి
    మే! కను ! సాధువులు వండి మేలని తినిరే !

    రిప్లయితొలగించండి

  34. చీకటి బలిపీఠమ్మున

    కేకలతో కాళిఁ గొలిచి ...కిచిడీ తోడన్ ...

    ఆకలితో బెంగాలున

    మేకను సాధువులు వండి మేలని తినిరే!

    రిప్లయితొలగించండి
  35. పోకుర! కాళిఘాటునకు పొంకము మీఱుచు కల్కటాను...నే

    సాకున తల్లిదండ్రులకు సంబర మీయను కాళిపూజలో...

    కేకలు మీరుచున్నచట కింకిణి గొట్టుచు తంత్రరీతులన్

    మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే!




    https://www.google.co.in/amp/s/m.timesofindia.com/city/kolkata/Nepal-King-to-offer-sacrifice-at-Kalighat/amp_articleshow/14289692.cms

    రిప్లయితొలగించండి
  36. ఆకలి మెండు వేయగను యాతన నొందుచు చింతగుబ్బలన్
    రోకలి తోడ దంచుచును రుబ్బుచు కొబ్బరి పల్కులన్ భళా
    కూకట పల్లిలో నిలిచి కూటును కుండను ; పారద్రోలుచున్
    మేకను; వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే

    రిప్లయితొలగించండి