4, సెప్టెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2779 (వనరాజుకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్"
(లేదా...)
"వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్"

86 కామెంట్‌లు:


  1. అనఘా ! సామ్రాజ్ఞి యగజ
    వనరాజుకు, మూషికమ్ము వాహన మయ్యెన్
    తన కొమరునకు, జిలేబీ,
    వనమూలంబుగ జగత్తు వర్దిల్లు సుమీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ శివుడు వనరా జెలా అయ్యాడు? 'వనమూలము' అంటే అర్థం కాలేదు.

      తొలగించండి

    2. వనరాజు - సింహము

      సామ్రాజ్ఞి అగజ - పార్వతి సామ్రాజ్ఞి సింహమునకు

      సరియేనాండి ?

      వనమే మూలము ధరణియు వర్ధిల్ల సుమీ !

      తొలగించండి
    3. సరిగానే ఉందండీ... నేను ప్రయాణపు టలసట, నిద్రాసక్తతతో సరిగా అవగాహన చేసికొనలేకపోయాను. మన్నించండి.

      తొలగించండి


  2. అనఘా ! పార్వతి, సుధ్యుపాస్య, సురసార్యాణీ మనస్తోకకా
    వనరాడ్వాహన మయ్యె, మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్
    తననందంతుడు వక్రతుండునికి పత్త్రంబై విభూషించెగా !
    వనమే మూలము జీవదానికి భళా వర్ధిల్ల మేల్కాంచుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ బాగుంది.
      కాని 'సురసార్యాణి మనస్తోకకావనరాడ్వాహన...' అర్థం కాలేదు. 'పత్రంబై'?

      తొలగించండి

    2. సురస - పార్వతి
      ఆర్యాణి - పార్వతి
      మనస్తోక - పార్వతి

      తొలగించండి

    3. వనరాడ్వాహనము - వన రాజు సింహము పార్వతి కి వాహనము - సింహధర!

      తొలగించండి
    4. బాగుంది. నిద్రాసక్తతతో నిఘంటు శోధన చేయక వ్యాఖ్యానించాను. మన్నించండి.

      తొలగించండి

    5. కంది వారికి నమో నమః

      అంతా విఘ్నేభకుంభగ్రసద్వనరాట్‌ వారి తమ్ముల செயல் :)


      ஜிலேபி


      తొలగించండి


    6. ఇప్పుడే పూరించి వస్తున్నా :)


      కంది వారి మన్ కీ బాత్ :)


      అనుమాన మేమియునులే!
      నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్,
      పనిలేని జిలేబీ పూ
      రణల చదువ కర్మ కలిగె రసనయు బోయెన్ :)

      కర్టసీ జీపీయెస్ వారి చేయూత


      జిలేబి

      తొలగించండి

    7. జీపీయెస్ వారు

      సమయోచితంగా మీరే కదండీ ఆ సమస్యను‌ వెలికి తీసేరు ఆ పాటి యైన ధన్యవాదములు తెలుపక‌ పోతే బావోదు కదండీ !


      జిలేబి

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    తన శారీరిక పుష్టి చాలదనుచున్ దైన్యస్థితిన్ పొందలే...
    దనిశమ్మున్ ప్రభుసేవ జేయుటయె ధన్యంబంచుభావించెడిన్ !
    వినుమా ! చిత్తబలమ్మె ముఖ్యమిలలో ! విఘ్నేభకుంభగ్రస..
    ద్వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వామ్మో !

      విఘ్నేభకుంభగ్రసద్వనరాట్‌ ! అంటే యేమిటండి మైలవరపు వారు ?


      జిలేబి

      తొలగించండి
    2. శ్రీమతి జిలేబీ గారికి వందనములు.. 🙏

      విఘ్నములనే ఏనుగులు
      వాటి కుంభస్థలమును భుజించు వనరాజు... గణపతికి 🙏🙏


      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి

    3. అవధానులవధానులవధానులే !


      జిలేబి

      తొలగించండి
    4. మురళీకృష్ణ గారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. ఘనతరముగ మోదకములు
    జనులొసగెడి యిక్షుఖండ జాలం బటుకుల్
    వనఫలరాశుల.సంసే
    వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. అనయము తల్లిని కొలుచుచు
    వినయముగ చరించు చుండు విఘ్నేశునకున్
    వెనకయ్యకు సతి యుప సాం
    త్వన రాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    కంప్యూటర్ వనంలోని పరిస్థితి:
    వనమయె నాండ్రాయిడు నా
    వనరాజే చేష్టదప్పి వ్యాకులమందన్
    జనె నొక చతురత చొరబడి
    వనరాజుకు మూషికమ్ము(mouse)వాహనమయ్యెన్!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    వనమే జీవన మార్గమన్న యవనుల్ వ్యాపార పారీణులై
    కనరాధ్యాత్మిక సౌరభమ్ము నెచటన్ గర్జించు సింహంబులై
    మనగా విశ్వ విచిత్ర మూషికమనన్ మాలిన్యముల్ బాపగా
    కనులన్ విప్పియు దారిజూపెను "నరేన్"(వివేకానంద)కళ్యాణసంధాతయై
    వనరాడ్వాహనమయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్!

    రిప్లయితొలగించండి
  8. మనమున తలచిన పనులను
    ఘనముగ నెరవేర్చ గోరి కమ్రపు భక్తిన్
    జనులెల్ల గొల్చు నా యౌ
    వన రాజుకు మూషిక మ్ము వాహన మయ్యె న్
    ________కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  9. వనదుర్గయె రాజ్ఞి గదా
    వనరాజుకు; మూషికమ్ము వాహనమయ్యెన్
    ఘన గణపతికి , మయూరము
    దణాదునికి, శివునికి దగు నందీశ్వరుడే!

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. ఘనకీర్తిగ్రథనేతిహాసకథనఖ్యాతాప్తిగాధాళిలే

      ఖనదివ్యాంచితయజ్ఞనిర్వహవరాఖ్యానార్థభావజ్ఞపా

      వనకైలాసగణేశ్వరప్రథితదీవ్యద్విఘ్నసంవేదనా

      వనరాడ్వాహనమయ్యె మూషికము దివ్యజ్ఞానులే మేల్మేలనన్.

      ( విఘ్నసంవేదన అవనరాట్ )

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మార్పుతో మరో పూరణ.

      ఘనకీర్తిగ్రథనేతిహాసకథనఖ్యాతాప్తగాధాళిలే

      ఖనదివ్యాంచితయజ్ఞనిర్వహవరాఖ్యానార్థభావజ్ఞపా

      వనకైలాసగణేశ్వరప్రథితదీవ్యద్విఘ్నసంవేదనా

      వనరాడ్వాహనమయ్యె మూషికము దివ్యజ్ఞానులే మేల్మేలనన్.

      ( విఘ్నసంవేదన అవనరాట్ )

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    3. రామాచార్య గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  11. కనగా గడు వింతయగును
    మన దేవుడు శ్రీ గణేశ మహరాజునకున్
    జనులందఱు గొలిచెడి పా
    "వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్"

    రిప్లయితొలగించండి
  12. గణములపతి, గజముఖుడును
    ఘనమగు వేలుపు,భజించ కరుణను సరిదీ
    వెనలిడు కవులకుకవి పా
    వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సాధ్యమైనంత వరకు ణ-న ప్రాసను వర్జించండి.

      తొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2779
    సమస్య :: ‘’వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్.’’
    వనమునకు (అడవికి) రాజైన సింహమునకు ఎలుక వాహనం కాగా దేవత లందఱూ భళి భళీ అని అన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: జనశ్రుతి ననుసరించి ఉన్న పురాణగాథలను పరిశీలిస్తే
    క్రౌంచుడు అనే గంధర్వుడు ఇంద్రుని శాపం వలన ఎలుకగా మారి వినాయకుని శరణు వేడినాడు. విఘ్నేశ్వరుడు ఆ మూషికానికి అభయమిచ్చి ఎల్లప్పుడూ తనతో పాటు పూజలను అందుకొనేటట్లు వరాన్ని అనుగ్రహించాడు. అతని భార్యయైన మహాశ్వేతను {ధవళను} తనకు శ్వేతఛత్రంగా ఉండమని దీవించాడు. అప్పుడు సర్వ జనావన రాట్ అగు గణపతికి ఆ మూషికము వాహన మయ్యింది. దేవతలందఱూ ఆనందంతో అభినందనలు తెలియజేశారు అని విశదీకరించే సందర్భం.

    ఘన గంధర్వుడు క్రౌంచు డాఖు వయిపోగా నింద్రు శాపాన, త
    ద్వినతిన్ గైకొని బ్రోచె మూషికమునే విఘ్నేశ్వరుం డెల్లెడన్
    తనతో పాటుగ పూజ లందుకొన సన్మానించె, నంతన్ జనా
    ‘’వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (4-9-2018)

    రిప్లయితొలగించండి
  14. *సమస్య :-*
    "వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్"

    *కందం**

    అనవరతము కార్టూనులు
    కనులారా కాంచు బాలిక నిదురనందున్
    కనబడె వింతగ కలలో
    వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్
    ...................✍చక్రి

    రిప్లయితొలగించండి
  15. ఘన భవనము నిర్మించగ
    మనువాడగ యువతి వరుని మంగళ కరమౌ
    క్షణమున బరుగిడు నాజ
    వ్వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    యాదవకుల సంభవ నిన్నె యార్తి గొలువ
    నహరహము మేము దలఁచెద మచ్యుత, హరి ,
    పవ్వళించక వారాశి వరము లిడుచు
    మమ్ము విడువక పాలింపుమయ్య సతము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      యౌవన రాజుకు అనండి.

      తొలగించండి
  16. అంబుజాసనునకు హంస వా హనము, పా
    ర్వతికి సింహంబు, నైరావతమ్ము
    హరితురంగమునకు,గరుడుడు పుండరీ
    కాక్షునకు , సిరికి కమలము,పులి
    హరిహర సుతునకు, గిరిజా పతికి ఋష
    భము, యమునకు మహిషము,నరయగ
    కవన రాజుకు మూషి కమ్మువాహనమయ్యె,
    నంజనీ సుతునకు నధ్వగమ్ము,

    కార్తికేయున కుం కాలకంఠము, హరి
    ణంబు వాయుదేవునకు, వానాయుజమ్ము
    కల్కికి , జల కిరాటము సిద్ద గంగ కాయె
    వాహనములు తరచిచూడ వాసి నిడుచు


    వినాయకునకు కవీశ అని పేరు కవులకు ఈశుడు బుద్ది విధాత నై మరియొక పేరు కాబట్టి అతడు కవనములకు రాజు . అతని వాహనము ఎలుక సరియేగదా


    (బ్రహ్మకు హంస,) (పార్వతికి సింహము), (ఐరావతము (హరితురంగముడు = ఇంద్రుడు)ఇంద్రునకు, గరుత్మoతుడు శ్రీహరికి , లక్ష్మికి కమలము, పులి అయ్యప్ప స్వామికి, శివునకు ఎద్దు, యమునకు మహిషము , కవన రాజు (వినాయకుడు) నకు ఎలుక ,ఆంజనేయునకు (అధ్వగము =ఒంటే) కుమారస్వామికి (కాల కంఠము = నెమలి)వాయుదేవునకు ( హరిణము =జింక) ( వానాయుజము =గుఱ్ఱము) కల్కికి , (జల కిరాటము =మొసలి ) గంగకు వాహనములు ఐనవి గదా

    రిప్లయితొలగించండి
  17. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ========================
    వనరాడ్వాహనమయ్యె మూషికము
    దివ్య శ్రేణి మేల్మేలనన్
    ========================
    వనరాజు , అనగా గజరాజుకు ఎలుక
    వాహనమైనది దేవతా గణములందరును
    భళి భళి యని మెచ్చుకొనగ యని చెప్ప
    డములోని విశేషమే సమస్య
    ============================
    సమస్యా పూరణం - 247
    ==================

    ఏకాదశ రుద్రాష్టవసువులు
    ద్వాదశాదిత్య ఇంద్రాదులు
    ముప్పది మూడు కోట్లై సురలు
    మేలొనరించగన్ హారతులు
    ప్రకృతిలో జీవవైవిధ్యమయ్యె
    తెరచి కనులు చూడగన్
    వనరాడ్వాహనమయ్యె మూషికము
    దివ్య శ్రేణి మేల్మేలనన్

    ====##$##====

    ముప్పది మూడుగా తెలిసి వచ్చే
    ఏకాదశరుద్రులు (11), అష్టవసువులు(8),
    ద్వాదశాదిత్యులు (12), ఇంద్రుడు (1),
    ప్రజాపతి (1) ఒక్కొక్కరు కోటి రీతులుగా
    మనకు ఉపకరించుటచే ముప్పది మూడు
    కోట్ల దేవతలైనట్లే, ప్రకృతితో జీవులకు గల
    అవినాభావ సంబంధమునే శాస్త్రమున
    జీవవైవిధ్యం (Bio-diversity) అంటారు.

    అట్టి జీవవైవిధ్యమునకు చక్కటి
    ఉదాహరణ గణపతి దేవుడు అతని పూజా
    ద్రవ్యములు, వాహనము కూడాను.

    ఏకాదశరుద్రులు:(11)
    ===============

    1. ప్రాణము 2. అపానము 3. వ్యానము
    4. సమానము 5. ఉదానము 6. నాగము
    7. కూర్మము 8. కృకలము 9.దేవదత్తం
    10.ధనంజయము 11. జీవాత్మ

    అష్టవసువులు : (8)
    =============

    1.అగ్ని 2.వాయువు 3.పృథివి 4.ఆదిత్యుడు
    5.చంద్రుడు 6.అంతరిక్షం 7.ఆకాశము
    8.నక్షత్రములు

    ద్వాదశాదిత్యులు:(12)
    ================
    చైత్రము మొదలు ఫాల్గుణము వరకు గల
    (12) మాసములు

    ఇంద్రుడు:(1)
    ==========
    ఇంద్రుడనగా విద్యుత్తు

    ప్రజాపతి:(1)
    ==========
    ప్రజాపతి యనగా యజ్ఞం

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జనరల్ గా కందివారు ఓ నమస్కారం పెడతారు :). ఇవ్వాళ యెన్ని నమస్కారాలు పెడతారో మరి :)


      జిలేబి

      తొలగించండి
    2. రమేశ్ గారూ,
      మీ భావాలు బాగుంటున్నవి. శంకరాభరణంపై మీరు చూపే ఆసక్తికి సంతోషం కలుగుతున్నది. కాని ఇది కేవలం సంప్రదాయ పద్యాలకు మాత్రమే వేదిక. కనుక మీరు పద్యాలు వ్రాయడానికి ప్రయత్నించండి. మీరు వ్రాయగలరన్న నమ్మకం నాకుంది.

      తొలగించండి
  18. ఘనమగు నాకారంబును
    సునిశిత మగు దృష్టి తోడ సూక్ష్మపు బుద్ధిన్
    గణనీయంబుగ గల త్రిభు
    వనరాజుకు మూషికమ్ము వాహనమయ్యెన్!!!

    రిప్లయితొలగించండి
  19. విందునునెవ్వరుజెప్పిన
    వనరాజుకుమూషికమ్మువాహనమయ్యె
    న్వినిదానినిసరిచేతును
    గణపతికిన్వాహనమ్ముఖనకమయనుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని మొదటి పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
  20. మన విఘ్నేశ్వరునకు వా
    హన రాజ మగుట ముదావహ మని తలఁచి తాఁ
    గనువిందుగ సురగణ పా
    వన రాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్


    కనఁగన్ వింతగు బొజ్జదేవరకు గంగా పార్వతీ నందనుం
    డన విఖ్యాతుఁడు నేక దంష్ట్రుఁడు గణాధ్యక్షుండు శూరుండు హ
    స్త్యనవద్యాస్యుఁడు విఘ్నరాజున కనింద్యాఖ్యుండు నా దేవతా
    వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్

    [వనము = సమూహము]

    రిప్లయితొలగించండి
  21. గురువు గారికి నమస్సులు.
    మనసున జేసెద ప్రార్థన
    వనారాజుకు,మూషికమ్ము వాహనమయ్యెన్
    గణనాథునకున్ ,రమ్యము
    గ నామదిన పదిలమయ్యె కావ్య ఋషిగాన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. సాధ్యమైనంత వరకు ణ-న ప్రాసను ప్రయోగించకండి.

      తొలగించండి
    2. గురువు గారు నమః పూర్వక ధన్యవాదములు.
      రమ్యము
      గ నామదిన పదిలమయ్యె గౌరీ సుతుడున్

      తొలగించండి
  22. వినయమె భూషణముగ గల
    త్రినయనుని సుతుండతండు ద్విపముఖుండౌ
    గణముల కధిపతి యా పా
    వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్

    రిప్లయితొలగించండి
  23. వినితానందనుడౌ యహిద్విషుడు తా విశ్వాత్మకుండైన పా
    వనరాడ్వాహనమయ్యె మూషకము దివ్యశ్రేణి మేల్మేలనన్
    ఘనుడౌ విఘ్నవినాశకారికిని, వ్రాఘ్రమ్మే గదా దుర్గకున్
    నెనుబోతే సమవర్తికిన్, శివుడు తానెద్దుక్కు నిత్యమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవ పాదంలో, రెండవ పూరణ చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  24. వనరాడ్వాహనమయ్యెమూషికముదివ్యశ్రేణిమేల్మేలన
    న్వినుమాయీయదివింతగొల్పెరమ!నీవేమీగనుంగొంటివే?
    కనవేమూషికవాహనంబగుటనాగామారిసూనుండుకు
    న్వనరాడ్వాహనమౌటయాగిరిజకేవాలాయమొప్పున్సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏమీ, సూనుండుకున్' అన్నవి సాధువులు కావు.

      తొలగించండి
  25. ఘనతను గూర్చగగణపతి
    మనసున దలచకను కార్యమగునా?యిలలో
    మనుగడయందున మనదీ
    వనరాజుకు ముషికమ్ము వాహనమయ్యెన్|

    రిప్లయితొలగించండి
  26. అనయము నా ధనికుడు కడు
    వినయముగా సైకిలు గొని విహరింపగ నా
    మనమున జనించె నొక భా
    వన, " రాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్!"

    రిప్లయితొలగించండి
  27. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    వనరాడ్వాహన మయ్యె మూషికము
    దివ్య శ్రేణి మే ల్మే లనన్

    సందర్భము: క్రౌంచు డనే గంధర్వుడు ఇంద్రుని శాపం వలన ఎలుకగా మారి వినాయకుని శరణు వేడి నాడు. ఆయన అభయమిచ్చి బ్రోచినాడు. అంతమాత్రాన అయిపోయింది.. పొమ్మన లేదు. ఎంతో కరుణతో వాహన యోగాన్ని దానికి ప్రసాదించినాడు.
    ఇంత చిన్న దేహంతో నీకు వాహనం అయ్యే దెలా అని అది అనుమానాన్ని వ్యక్తపరచ లేదు. శక్తి సమకూర్చేవాడు దైవమే అని నమ్ముకున్నది. గణపతికి వాహనమై అతనితోబాటు పూజలందుకొన్నది.
    ఎందుకంటే సజ్జన అవన రాజు.. అనగా సజ్జనులను రక్షించే ప్రభు వాతడు కదా!
    దేవత లది చూచి మేలు మే లన్నారు.
    *వాహనయోగం* అంటే వాహనం ఎక్కే యోగం అని లోకంలో రూఢ్యర్థం. కాని నే నిక్కడ వాహనముగా మారే యోగం అనే అర్థంలో ప్రయోగించినాను.
    ==============================
    ఘన గంధర్వుని బ్రోచి, పొ మ్మనడు; సత్
    కారుణ్య మేపార గూ

    ర్చెను సద్వాహన యోగ మా యెలుకకున్..
    చిన్నారి దేహాన నె

    ట్లన లే.. దద్ధి గణేశు నమ్మెను.. బలం
    బా దేవుడే! సజ్జ నా

    వన రా డ్వాహన మయ్యె మూషికము ది
    వ్యశ్రేణి మే ల్మే లనన్

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    4-9-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  28. అనఘా! మూషిక వాహనుండనగ నా యంబా సుతుండేకదా!
    వనరాజెవ్వడు? వానివాహనము లుప్తంబయ్యెనాయేమి? పా
    వనుడైనట్టి వినాయకుండు విన కోపంబొందునిట్లందువే?
    *"వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్"*
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  29. సమస్య

    *వన రాజుకు మూషికమ్ము వాహనమయ్యెన్*

    పూరణ

    ఘనమగు తొండము తోడన్
    గణపతి తొలి పూజలఁగొను గణనాయకుడౌ
    గణపతి నెక్కి తిరుగ త్రిభు
    *వన రాజుకు మూషికమ్ము వాహనమయ్యెన్*

    హంసగీతి
    4.9.18

    రిప్లయితొలగించండి
  30. విను హరియను పేరుగలదు
    వనరాజుకు ,మూషికంబు వాహనమయ్యెన్
    గణపతి కనుచును నిలలో
    వినయముతో గొల్వ బాయు విఘ్నము లెల్లన్.

    రిప్లయితొలగించండి
  31. వనముల మృగములు మ్రొక్కిరి

    వనరాజుకు;...మూషికమ్ము వాహన మయ్యెన్

    గణనాథుని నందనునకు...

    మునివర! దేవతలకెల్ల ముచ్చట మీరన్!

    రిప్లయితొలగించండి
  32. మన దుర్గమ్మకు కల్కతా నగరిలో మార్వారి పండాలులో

    వనరాడ్వాహన మయ్యె!...మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్

    ఘనమౌ వాహన మయ్యెగా కులికి శాకాహారి బొజ్జయ్యకే

    కనుమా! హైదరబాదులో జనులు ఢంకా బాది నర్తించగా!

    రిప్లయితొలగించండి
  33. కనలే దెప్పుడు వీతకేశ శిరునీ గడ్డంపు షానార్యునిన్
    వినలే దెప్పుడు కీచుకీచుమనునీ వీర్యంపు కర్వమ్మునున్
    ఘనుడౌ మోడికి వారువమ్మయెనుగా కంగారు లేకుండనే:👇
    "వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్"

    రిప్లయితొలగించండి