6, సెప్టెంబర్ 2018, గురువారం

సమస్య - 2780 (చెల్లికి మగఁడయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్"
(లేదా...)
"చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే"

62 కామెంట్‌లు:

  1. అల్లన గాంచితి మారుని
    యుల్లము రంజిల్లు రీతి యుత్సు కమందున్
    మెల్లగ కోరితి బంధము
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మారుని నుల్లము...రీతి నుత్సుక..' అనండి.

      తొలగించండి
    2. అల్లన గాంచితి మారుని
      నుల్లము రంజిల్లు రీతి నుత్సు కమందున్
      మెల్లగ కోరితి బంధము
      చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్

      తొలగించండి
  2. నల్లని వాడు, గిరిధరుడు,
    గొల్లల గీమున పెరిగిన కొమరుడు ,హౌమ్యo
    బెల్లాపి, రుక్మి భూపతి
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్"

    రిప్లయితొలగించండి
  3. నల్లని వాడగు కృష్ణుని
    యుల్లము దోచిన కిరీటి యోగిగ జని యా
    చల్లని యదుకుల భూషణు
    జెల్లికి మగడయ్యె జనుల చిత్తము లలరన్

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ఉల్లమునందు రుక్మిణి మహోన్నతు గృష్ణుని గోరె , ప్రోలునం...
    దెల్లరు రుక్మిణిన్ హరికినెంచిరి కృష్ణుడు వచ్చి , రుక్మియన్
    ప్రల్లదు ద్రుంచి.,
    రాక్షసవివాహమునన్ గొని పోయి , వానికిన్
    చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. ఝల్లన వైరిగుండియలు ; చయ్యన బాణపుదీవ్రవర్షమున్
    గొల్లగ కొల్లకొల్లలుగ గుర్యుచు నుజ్వలశంఖనాదమున్
    బెల్లుగ జేయు ఫల్గునుడు పేర్మి సుభద్రకు బూరుషోత్తముం
    జెల్లికి వల్లభుం డగుటచే జనులెల్లరు మోదమందిరే!

    రిప్లయితొలగించండి
  6. అల్లిన కాయమా నమున యందరి ముంగిట సంతసం బునన్
    యుల్లము రంజిలన్ మిగుల నుత్సుక తన్ తన భాగస్వా మికై
    తల్లడ మల్లడం బగుచు తారక శైలము జేరినం తగా
    చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమం దిరే
    కాయమానము = పందిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాయమానమున నందరి.. సంతసాన తా।నుల్లము...' అనండి. 'భాగస్వామి' అన్నపుడు 'గ' గురువై గణదోషం.

      తొలగించండి
    2. అల్లిన కాయమా నమున నందరి ముంగిట సంతసాన తా
      నుల్లము రంజిలన్ మిగుల నుత్సుక తన్ తన దారకో సమై
      తల్లడ మల్లడం బగుచు తారక శైలము జేరినం తగా
      చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమం దిరే

      తొలగించండి


  7. అల్లుకుని పోవు నైజము
    కల్లాకపటంబెరుగని కన్నడు భళిరా
    సల్లాపంబుల వచ్చెను
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  9. అల్లది కనుమా ! గుణ సం
    పల్లీల దనరు కిరీటి, పార్థుడు లక్ష్మీ
    వల్లభుడౌ యా శ్రీహరి
    "చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్"

    రిప్లయితొలగించండి
  10. తెల్లని జలధిని జిలుకగ
    మెల్లగ జనియించినట్టి మెలతుక హరియే
    చల్లగ జేపట్టి విధుని
    చెల్లికి మగడయ్యె జనుల చిత్తము లలరన్!

    రిప్లయితొలగించండి
  11. చల్లని చిత్తముంగలిగి చక్కని రూపము గల్గు వాడునౌ,
    యెల్లరి మానసంబులనె యెప్పుడు దోచెడి బల్లిదుండునౌ,
    కల్లయె సుంత మాత్రమది కానని సద్గుణుడే వరాల మా
    "చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే"

    రిప్లయితొలగించండి
  12. కొల్లలు కొల్లలీ జగతి కూర్మి సహోదరు లెందరెందరో?

    యల్ల నరణ్యవాసమున నన్నకుఁ దన్నుగఁ బోవఁ దల్చడా

    తల్లి నవోఢవీడి చన తాను మహోన్నతలక్ష్మణుడట్లు సీతకున్

    జెల్లికి, వల్లభుండ గుటచే జను లెల్లరు మోదమందిరే!

    "తం తుదేశం నపశ్యామి
    యత్ర భ్రాతా సహోదరః"
    అనే స్ఫూర్తితో


    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  13. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    చెల్లికి వల్లభుండగుటచే
    జనులెల్లరు మోదమందిరే
    ======================
    సోదరిని వివాహమూడి ఆమెకు
    పతిగా మారిన సోదరుని గని
    ప్రజలందరు సంతోషించిరని చెప్ప
    డంలో గల అసంబద్దతె సమస్య
    =======================
    సమస్యా పూరణం- 248
    ==================

    పిన తండ్రి మామ తురుష్కులన్
    సోదరి సతియౌ చూడగన్
    జాతి సంస్కృతి ఆచరణన్
    సుదూర రక్తమె మేలనగన్
    సోదరులు తాముగ వియ్యంకులై
    వేసిరట పెళ్ళి పందిరే
    చెల్లికి వల్లభుండగుటచే
    జనులెల్లరు మోదమందిరే

    ====##$##====

    క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరముల
    కాలం నాటి "ఇండో యూరోపియన్ కల్చర్"
    ను "ఓల్గా టు గంగా" పేరిట చారిత్రక గ్రంధ
    ముగ వ్రాసినది గొప్ప చారిత్రక పరిశోధకుడు
    "రాహుల్ సాంకృత్యాయన్"

    నాటి సంస్కృతి లో మాతృస్వామిక వ్యవస్థ
    అమలులో ఉండి భర్త చనిపోయిన ఆడది
    తన పెద్ద కుమారుడితో జత కూడేదట.
    (Edipusism/Edipus Complex/Incest
    ism/ British Royal Blood Theory)

    ఏది ఏమైనను క్రోమోజోముల పునర్వవ్యస్థీ
    కరణ జరిగి సత్సంతానం కలగవలెనన్న
    సుదూర రక్తమె మేలని శాస్త్రం చెబుతున్నది

    ( మాత్రా గణనము- అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి


  14. మల్లిక లార, రాధనము మానస మెల్లను బొంద నూదె తా
    నల్లన వేణు నాదమును, నల్లని వాడట, కాలకంఠుడిన్
    చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే
    నుల్లము తూగ,కన్నడని నూతన రీతిని భక్తియోగమై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. ఉల్లము నందున రుక్మిణి
    చల్లని వలపుల తలపులు సందడి చేయన్
    చెల్లె న న గ హరి రుక్మి కి
    చెల్లికి మగడ య్యే జనుల చిత్తము లల ర న్

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2780
    సమస్య :: చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోద మందిరే.
    చెల్లెలికి భర్త ఐనాడని అందరూ సంతోషపడ్డారు కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: రుక్మి యొక్క చెల్లెలు అగు రుక్మిణి శ్రీకృష్ణుని భర్తగా పొందాలని కోరుకొని అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ద్వారా ప్రేమలేఖను కూడా పంపింది. శ్రీకృష్ణుని మనస్సులో కూడా రుక్మిణియే ఉన్నది. అందువలన శ్రీకృష్ణుడు విదర్భలోని కుండిన పురం చేరుకొని రాక్షసవివాహము అనే పద్ధతి ద్వారా రుక్మిణీ పాణిగ్రహణం చేసి ఆమెను తనతో తీసికొని వెళుతూ ఉండగా రుక్మి ఎదిరిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మిని ఓడించి అతని శిరోజములు మీసములు గొఱిగి అవమానిస్తాడు. అప్పుడు మిత్రులు దుఃఖిస్తున్న రుక్మిని ఓదారుస్తూ ఉన్న సందర్భం.

    ఎల్లెడ కృష్ణు నాథునిగ నెంచుచు బంపెను ప్రేమలేఖనే,
    యుల్లము నందు రుక్మిణియె యున్నది కృష్ణునికిన్, మనోజ్ఞ సం
    పల్లలితాంగి రాక్షస వివాహమునన్ గొనె, రుక్మి ! తాను నీ
    ‘’చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోద మందిరే.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (6-9-2018)

    రిప్లయితొలగించండి
  17. నల్లని వాడే జెప్పగ
    మెల్లగ సన్యాసి వేషమే తగవేసెన్
    అల్లన నరుడే కృష్ణుని
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్.

    రిప్లయితొలగించండి
  18. అల్లదెమాయాయోగిగ
    మెల్లగదావచ్చిక్రీడి,మిలమిలసొగసు
    న్నుల్లమునలరించినకపి
    చెల్లికిమగడయ్యెజనులచిత్తములలరన్

    రిప్లయితొలగించండి


  19. ముల్లాగారబ్బాయట
    అల్లాటప్పాగ తిరుగు అహ్మదు చౌద్రీ
    కొల్లూరు లో సరాఫీ
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్.

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. ఉత్పలమాల
    పెల్లుబుకన్ హలాహలము భీతిలి నంతనె ముజ్జగమ్ములున్
    దల్లిగ సేమమున్ దలఁచి త్ర్యక్షుడు గైకొన జూచినంతటన్
    వల్లెయనన్ యపర్ణ, వృషపర్వుడు దాల్చఁగ చక్రపాణికిన్
    జెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే.

    రిప్లయితొలగించండి
  21. తెల్లని పాలసంద్రమును తేకువమీరగ జిల్కగా కరం
    బల్లన నుద్భవించిన నవాంబుజ లోచని కల్పవల్లికిన్
    నల్లని మేనివాడు హరి నారద వంద్యుడు నంబుజన్మునిన్
    జెల్లికి వల్లభుండగుటచే జనులెల్లరు మోదమందిరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. సీతా దేవి గారు కొంచె మీ క్రింది వ్యాకరణ విశేషమును గమనించండి.
      “అంబుజన్ముని చెల్లికి” లోని “ని” డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాష నగు నను సూత్రముచే వచ్చిన నిగాగమము. దీనిని “నిన్” అనరాదు.
      అంబుజన్ముని యొక్క చెల్లికి సమాసమున విభక్తి లోపించి “అంబుజన్ముని చెల్లికి” షష్ఠీ తత్పురుష సమాసమయినది.
      ని గాగమము రాని యెడల “నంబుజన్ము చెల్లికి”.

      “అంబుజన్మునిన్” అనిన ద్వితీయా విభక్త్యర్థము వచ్చును. అంబుజన్మునికిం జెల్లికి ననవచ్చును.
      భారతము లోని ఉదాహరణములు:
      ధర్మసుతు సఖుఁడ
      పరశురాము జన్మ ప్రపంచము
      అర్జును సూనులు

      తొలగించండి
    2. ఆర్యా! మీ సుదీర్ఘ వివరణకు ధన్యవాదములు! అంబుజన్ముకున్ యనవచ్చునా? చతుర్ధీ విభక్తిలో! తెలియజేయగలరు! 🙏🙏🙏🙏

      తొలగించండి
    3. డా. సీతా దేవి గారు కొన్ని యెడల నగాగమము చూపట్టదు కాని యన్ని యెడల నది భావ్యము కాదు. “అంబుజన్మునకున్” విన సొంపుగా నుండును. చంద్రార్థములో నన్య పదమును ప్రయోగించండి.
      ఉదా: “చందమామకుం” , “శీత రశ్మికిం” ఇత్యాదులు.
      “అంబుజన్ముకున్” షష్ఠీ విభక్తియే.

      తొలగించండి
    4. ధన్యవాదములండీ! సవరిస్తాను! 🙏🙏🙏

      తొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఉల్లములో ప్రేమయె రా
    ణిల్లగ యతియై నటించి నిల్చిన నరుడున్
    మెల్లగ నా శ్రీకృష్ణుని
    చెల్లికి మగడయ్యె జనుల చిత్తము లలరన్

    రిప్లయితొలగించండి
  23. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,

    ఉల్లము దోచు రూపము , మహోన్నత సద్గుణ రాశియున్ , గడున్

    జల్లని మానసంబు , ఘనసంపద , చక్కని బంధు వర్గము ,

    న్నెల్ల ప్రజల్ సతంబును నుతించు ప్రభుత్వపు వృత్తి , గల్గి రా

    జిల్లెడు వాడు , కట్న మను చింత యొకింతయు లేని వాడు , నా

    చెల్లికి వల్లభుం డగుటచే జనులెల్లరు మోద మందిరే !

    రిప్లయితొలగించండి
  24. మెల్లగ యతి వేష మలర
    నల్లనఁ గుంతీ తనయుఁడు నర్జునుఁ డంతం
    జల్లంగ వాసుదేవుని
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్


    ప్రల్లదు రాజుఁ జేయ జనవారపు సమ్మతిఁ బొంద నేర్తునే
    తల్లడ మేల పుత్రకుఁ డితండు విభుం డని చెప్పె రాజు దాఁ
    గల్లరి కంత పట్ట మది కట్టక యొక్క దినంబు మాత్ర మం
    చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే

    [అంచు + ఎల్లికి = అంచెల్లికి; ఎల్లికి = రేపటికి]

    రిప్లయితొలగించండి


  25. ఉల్లము దోచిన పార్థుడు
    మెల్లగ చేరెను యతివలె మురిపెముతోడన్
    నల్లని వాడగు కృష్ణుని
    చెల్లికి మగడయ్యె జనుల చిత్తము లలరన్

    రిప్లయితొలగించండి
  26. 0
    ఇల్లాలినివదిలేయగ
    మల్లేశ్వరి మరులుగొల్ప?మనసుకువశమై
    తల్లిగమారగ?తదుపరి
    చెల్లికిమగడయ్యె జనుల చిత్తములలరన్

    రిప్లయితొలగించండి
  27. నల్లనివాడుపద్మనయనంబులతేజుడురుక్మి!నీదగు
    న్జెల్లికివల్లభుండగుటచేజనులెల్లరుమోదమందిరే
    యుల్లముగట్టిజేసికొనినోర్పునునొందుచునుండుమాయికన్
    నల్లదికానిచోనెఱుగుమచ్యుతుబాణమునొచ్చునీమదిన్

    రిప్లయితొలగించండి
  28. విల్లును చేతబట్టి యరి వీరుల ద్రుంచెడు సవ్యసాచి తా
    గల్ల తనమ్ముతో యతిగ కామిని సేవల నొందగోరుచున్
    నల్లని వాడె సై యనగ నారి సుభద్రను, బావ కృష్ణకున్
    జెల్లికి వల్లభుండగుట చే జను లెల్లరు మోదమందిరే

    రిప్లయితొలగించండి
  29. విల్లంబులనాడు పార్థుడు
    కల్లజపిగనై సుభద్ర కన్నులబడగన్
    గొల్లవిభుడు బలరాముని
    చెల్లికి మగడయ్యె జనుల చిత్తము లలరన్

    రిప్లయితొలగించండి
  30. కల్లయె గొల్లనివవ నా
    చెల్లెలు నీ భార్య యగుట , చెల్లదు చోరా !
    చెల్లును నీ బ్రతుకన నా
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్

    రిప్లయితొలగించండి
  31. గురువు గారికి నమస్సులు.
    తల్లియు సుశీల తండ్రియు
    సల్లాప జగన్మోహనుడగు చరితన్ వింటిన్.
    పుల్లసరసిజ సు నేత్రీ
    చెల్లికి మగడయ్యె జనుల చిత్తము లలరన్ .

    రిప్లయితొలగించండి
  32. ఉల్లమునందు నెవ్వలపులూరగఁ గోర హరిన్, మనమ్ము రం

    జిల్ల, విరోధుఁ గూల్చి యటఁ జేకొనుదంచును వాక్ప్రదత్తుడా

    పల్లవపాణిరుక్మిణికి; ప్రాణసమాదృతమానరక్షియై

    చెల్లికి ; వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్

    సందర్భము: సుభద్రను అర్జునున కీయడం యిష్టం లేని బలరాముడు వారి వివాహం జరిగిపోగా విచారిస్తుంటే కృష్ణు డంటున్నా డిలా...
    "అల్లరి చిల్లరి వాడు కాడు గదా అర్జునుడు! భవిష్యత్తులో శివునంతటి వాణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకోబోయే వాడు అర్జునుడే! అతడే మన చెల్లెలు సుభద్రకు మగడైనాడు. ప్రజలుకూడా సంతోషిస్తున్నా రన్నా!"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "అల్లరి చిల్లరి వాడా!
    చల్లని గ ట్టల్లు కినుక జార్చి వరంబున్
    మెల్లగ గొను.. నరుడే.. మన
    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తములలరన్"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  34. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈరోజు హుస్నాబాద్ మా అక్కయ్య ఇంటికి వచ్చాను. రేపు వరంగల్ వెళ్తున్నాను. నేడు రేపు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  35. ఉల్లము దొంగిలించె, స్వసహోదరి కయ్యెడ నాడబిడ్డ, త

    న్నెల్లరు సమ్మతించగ వరించియుఁ దానును బెండ్లియాడ, న

    ట్లల్లుడుగా గృహమ్మునకు నాప్తుడు బావ కనుంగురాలునౌ

    చెల్లికి వల్లభుం డగుటచే జనులందరు మోదమందిరే!.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  36. చెల్లియొ చెల్లకొ లక్ష్మణు

    డుల్లము పొంగుచు దశరథు డొల్లిన ఘటనన్

    మల్లెలు తెచ్చిన సీతమ

    చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్ :)

    రిప్లయితొలగించండి
  37. చెల్లియొ చెల్లకో ఘనుడు శ్రీరఘురాముని సోదరుండహా

    తల్లియు తండ్రియున్ మురిసి తన్మయ మొందిన లగ్నమందునన్

    మల్లెల సౌరభమ్మునను మానస మొల్లగ జానకమ్మకిన్

    చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే!

    రిప్లయితొలగించండి
  38. పల్లకి లోన వచ్చి మనువాడగ మాదగు వంశమందునన్
    మెల్లగ మెల్లగా కుదిరి మేలగు నాస్తుల నాక్రమించుచున్
    కొల్లలు కొల్లలౌ కలిమి కూడగ బెట్టుచు లండనందు, నా
    చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే :)

    రిప్లయితొలగించండి