9, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2783 (లంక నేలినాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లంక నేలినాఁడు లక్ష్మణుండు"
(లేదా...)
"లంకను పోరులో గెలిచి లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్"

82 కామెంట్‌లు:



  1. జంక మాకు చెప్పు చప్పున నొక నస
    త్యమును దిమ్మ తిరిగి ధమ్మటంచు
    జనులు పడవ లెను! సుజనులార వినుడయ్య
    లంక నేలినాఁడు లక్ష్మణుండు


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జంకమాకు' అనడం వ్యావహారికం. "జంకబోకు/ జంకవద్దు" అనవచ్చు.

      తొలగించండి


  2. జంకకు చెప్ప వే పడతి చప్పున బూటక మైన వాక్యమున్
    పొంకము లేక యెల్లరికి బుద్ధిని మందము చేయగాదగున్
    శంకర వర్యు లున్ బెదిరి సాజమనంగ! జిలేబి చెప్పె బో
    "లంకను పోరులో గెలిచి లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్"


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బెదరకుండానే చెప్తున్నా...
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. వినగ చోద్య మాయె వింతపో కడలంట
    నిలను జరిగి నటుల నిక్క మౌన
    పలుకు చుంద్రు జనులు పలురీతు లేగాని
    లంక నేలినాఁడు లక్ష్మ ణుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పోకడలంట। యిలను... నిక్కమగునె। పలురీతు లెప్పుడు..." అనండి.

      తొలగించండి
    2. వినగ చోద్య మాయె వింతపో కడలంట
      యిలను జరిగి నటుల నిక్క మగునె
      పలుకు చుంద్రు జనులు పలురీతు లెపుడు
      లంక నేలినాఁడు లక్ష్మ ణుండు

      తొలగించండి
    3. "పలురీతు లెప్పుడు" అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    4. వినగ చోద్య మాయె వింతపో కడలంట
      యిలను జరిగి నటుల నిక్క మగునె
      పలుకు చుంద్రు జనులు పలురీతు లెప్పుడు
      లంక నేలినాఁడు లక్ష్మ ణుండు

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    వంకరబుద్ధి రావణుడు పావని సీత హరింప, సద్గుణా...
    లంకృతుడైన దివ్య శుభ లక్షణ లక్ష్మణుడైన రాఘవుం...
    డంకిలి లేని ధైర్యమున నాతని , నాతని సైన్యవర్గమున్ ,
    లంకను , పోరులో గెలిచి., లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్"

    (లక్ష్మణుడు.. శ్రీమంతుడు)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పై పద్యం లో చిరు సవరణ... మన్నించండి 🙏

      పంకిలబుద్ధి రావణుడు పావని సీత హరింప, సద్గుణా...
      లంకృతుడైన దివ్య శుభ లక్షణ లక్ష్మణుడైన రాఘవుం...
      డంకిలి లేని ధైర్యమున నాతని , నాతని సైన్యవర్గమున్ ,
      లంకను , పోరులో గెలిచి., లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్"

      (లక్ష్మణుడు.. శ్రీమంతుడు)

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. మురళీకృష్ణ గారు నమస్సులు. ఇక్కడ లక్ష్మణుఁ డన్న శ్రీరామ చంద్రుఁడే యయిన, సత్కవీంద్రుల వచనమ్ములు ప్రామాణికములు కావలె గాని సత్యదూరములు కాకూడదు కదా!
      విభీషణుని పరముగా పూరణమును సవరించిన బాగుండునని నా యభిప్రాయము.

      తొలగించండి
    4. గురుతుల్యులు పండితులు శ్రీ పోచిరాజు వారి సూచన శిరోధార్యము... తదనుగుణముగా పూరణ...

      పంకిలబుద్ధి రావణుని పక్షమునుండుటకంటె , సద్గుణా
      లంకృతుడౌ దయానిధిని రాముని జేరుట మేలటంచు ని...
      శ్శంక విభీషణుండు జని సత్ఫలితమ్మును పొందె భక్తుడై !
      లంకను పోరులో గెలిచి , లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్ !!

      తొలగించండి
    5. వంకాయ వంటి కూరయు
      పంకజముఖి సీతవంటి భామామణియున్
      శంకరుని వంటి దైవము
      లంకాపురవైరివంటి రాజులు కలరే!!

      వంకయె లేని కూర యన వంగ ., యనన్యగుణాఢ్య సీతయౌ
      పంకరుహాస్య , దైవమన భద్రకరుండగు శంకరుండగున్ ,
      లంకకు వైరియైన రఘురాముడె రాజని చెప్పియుంట , నే
      లంకను పోరులో గెలిచి లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్ ??

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    6. సుహృద్భావముతో నా సూచనను గౌరవించి చక్కటి పూరణము నందించిన కవి వరేణ్యులు మురళీకృష్ణ గారికి నభినందన పూర్వక ధన్యవాదములు.
      భావికవి నికాయమునకు నిష్కళంక భాషా భాండప్రదానమే నేటి తరపుఁ గవి వరుల ప్రధాన కర్తవ్యము.
      అర్థానుస్వార ప్రయోగవిహీనమే కాక ద్రుతసంధి విస్మరణ మాంధ్ర భాషా కవితామతల్లికి దుఃఖదాయకము.

      తొలగించండి
  5. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    లంక నేలినాఁడు లక్ష్మణుండు

    సందర్భము: వా డసాధ్యుడు. నిజం చెప్పమన్నామా! ఖచ్చితంగా అబద్ధమే చెబుతాడు. అట్లే అబద్ధం చెప్పమంటే నిజమే చెప్పితీరుతాడు. (వాడి స్వభావ మది.)
    నా కా విషయం తెలీక "నిజం చెప్పరా నాన్నా!" అన్నాను. అంతే! వా డేం చెప్పాడో తెలుసా!..
    "లంక నేలినాఁడు లక్ష్మణుండు"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "నిజము చెప్పు" మన్న
    నిజము చెప్పడు "బొంకు"

    మన్న బొంక డాత..
    డది యెఱుగను..

    "నిజము చెప్పు" మంటి
    ని.. యతం డనియె నిట్లు..

    "లంక నేలినాఁడు
    లక్ష్మణుండు"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    9.9.18
    -----------------------------------------------------------
    జిలేబీ గారి ప్రేరణతో

    రిప్లయితొలగించండి
  6. వెండి కొండ రేడు వేంకట రమణుడు,
    లంకనేలినాడు లక్ష్మణుండు,
    పంక్తిగళుని జంపె పరమశివు డనుచు
    పలికె తాగుబోతు పదుగు రెదుట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్రాగుబోతు' అనండి.

      తొలగించండి
  7. అన్న వెంట నడచె నడవికి సౌమిత్రి
    ఓర్పు తోడ వేచె నూర్మిళమ్మ
    నిద్రలేచినట్టి నిండు జాబిలి యక
    లంక నేలినాడు లక్షణుండు..��

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ్ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. తాను దలచె భావి తనయుండు వెలుగొందు
    లంక నేలి, నాఁడు లక్ష్మణుండు
    వాని జంప దుఃఖ వార్ధిలో మునిగె నా
    రావణాసురుండు ఠేవయుడిగి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2783
    సమస్య :: లంకను పోరులో గెలిచి లక్ష్మణు డేలె సహస్ర వర్షముల్.
    లక్ష్మణుడు యుద్ధంలో లంకను గెలుచుకొని వేయి సంవత్సరాల పాటు ఆ లంకను పరిపాలించినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: జనశ్రుతిలో ఉన్న అనేక కథనాలను పరిశీలించినప్పుడు ఈ క్రింది శ్లోకం మనకు వినిపిస్తుంది.

    అపి స్వర్ణమయీ లంకా
    న మే లక్ష్మణ ! రోచతే।
    జననీ జన్మభూమిశ్చ
    స్వర్గాదపి గరీయసీ।।
    లక్ష్మణుడు శ్రీరాముని చూచి ‘’అన్నయ్యా! ఈ లంకానగరం బంగారు లంకగా విరాజిల్లుతూ ఉన్నది. రావణుని వధించి ఈ లంకను గెలిచి విభీషణునికి ఇస్తానని అంటున్నావు. విభీషణునికి ఈ లంకకు బదులుగా మన అయోధ్యను ఇచ్చేద్దాము’’ అని అనగా శ్రీరాముడు ‘’తమ్ముడా! లక్ష్మణా! జనని జన్మభూమి అనేవి స్వర్గం కన్నా మిన్న. అందువలన విభూషణునికి లంకకు బదులుగా అయోధ్యను ఇవ్వాలని ఆలోచించడం సరికాదు’’ అని అన్నాడు.
    తన కోరిక ఫలించలేదని ఆలోచిస్తూ నిద్రించిన లక్ష్మణునికి ఒక కల వచ్చింది. ఆ కలలో లక్ష్మణుడు లంకను గెలుచుకొని వెయ్యేండ్లు ఆ లంకను పరిపాలించినాడు అని కల్పించి చెప్పే సందర్భం.

    ‘’లంకను గొన్న మేలు, నవరత్న సువర్ణ మయమ్ము చూడు మీ
    లంక కయోధ్య నిత్తు’’ మని లక్ష్మణు డాడగ, ‘’జన్మభూమియే
    యింకను గొప్ప’’ దంచు వచియింపగ రాముడు, స్వప్న సీమ నా
    ‘’లంకను పోరులో గెలిచి లక్ష్మణు డేలె సహస్ర వర్షముల్.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (9-9-2018)

    రిప్లయితొలగించండి
  10. అన్న ననుసరించి య డ వికి నేగియు
    సేవ జేసి ధన్య జీవి యయ్యె
    నట్టి నిష్కళoకు డమల మూర్తి యే
    లంక నేలి నాడు లక్ష్మణుoడు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "....అమలమూర్తి యెపుడు" అందామా?

      తొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    యతుల గతుల నేర్పు యభ్యాసమున గురుం
    డాటవెలది నెంచి పాటబాడె
    "నోటికి యతి జెల్లు నొక్కవాక్యంబ"న(ప్రశ్న,గురువుది)
    "లంకనేలినాడు లక్ష్మణుండు"(సమాధానము,శిష్యునిది)
    (He eats mountains..ఈ సమాధానము వ్యాకరణ శుద్ధి గలది కావున grammar classలో ఒప్పుయైనట్లే ఛందస్సురీత్యా గురువు ఒప్పుకోవలసినదే పై వాక్యమును)

    రిప్లయితొలగించండి
  12. రాముని దయతోడ రావణానుజుడు తా
    లంక నేలినాఁడు, లక్ష్మణుండు
    సహజు సేవనముల సద్భక్తి చేయుచు
    గడిపె జీవితమును కడుముదమున

    రిప్లయితొలగించండి
  13. అంకితభావమున్ గడిపె యగ్రజుతో పదునాలుగేండులున్
    పంకజనేత్రియౌ తనదు భార్యను వీడుట కష్టమైననున్
    సంకటముల్ జయించి కడు సంతసమొందుచుఁజేరి యూర్మిళన్
    *"లంకను పోరులో గెలిచి, లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్"*
    (లంకలో యుద్ధం గెలిచి ఊర్మిళని ఏలుకొన్నాడని నా భావన. ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో మరి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గడిపె నగ్రజుతో... కష్టమైన దా। సంకటముల్" అనండి. (ఐననున్ అన్న ప్రయోగం సాధువు కాదు).

      తొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    పొంకపు స్వర్ణలంకగని పూర్ణ విలీనతనంది మానసం
    బంకము జేర్చ యూహల సహాయమునన్ దగనోలలాడి నా
    టంకములేక రావణు పటాలముతో సహజంపి నా"కలన్"
    లంకను పోరులో గెలిచి లక్ష్మణుడేలె సహస్ర వర్షముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..జేర్చ నూహల.. లాడి యాటంకము... పటాలముతోశను జంపి యా కలన్..." అనండి.

      తొలగించండి
  15. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    లంకను పోరులో గెలిచి
    లక్ష్మణుడేలె సహస్ర వర్షముల్
    ======================
    పోరులో గెలిచిన లంకను రామ
    లక్ష్మణులు రావణుని సోదరుడైన
    విభీషణునికే అప్పగించినారు,అట్టి
    యెడ లంకను వేయి సంవత్సరములు
    లక్ష్మణుడేలెననుట అసంబద్దం-సమస్య
    ==========================
    సమస్యా పూరణం- 251
    =================

    జయ విజయుల జన్మకు శాపము
    రావణ కుంభకర్ణ రూపము
    శ్రీహరి శేషుల అవతారము
    రామ లక్ష్మణ రూపాంతరము
    అవతారములు సమసెనన వారివి
    లంకను పోరులో గెలిచి
    లక్ష్మణుడేలె సహస్ర వర్షముల్
    భక్తి రాజ్యమునదె మలిచి

    ====##$##====

    సనకసనందనాదులచే ఇవ్వబడిన శాప
    కారణం వైకుంఠ ద్వార పాలకులు జయ
    విజయులకు మూడు జన్మలకు రాక్షస రూపం
    (హిరణ్యాక్ష/హిరణ్యకశిప)(రావణ/కుంభకర్ణ)
    (కంస/శిశుపాల).

    ధర్మోద్దరణతో పాటుగా జయవిజయుల
    శాపవిమోచనగా అవతారములు దాల్చిన
    శ్రీహరియు ఆదిశేషుడును లంకను గెలిచిన
    పిదప వైకుంఠమునకు తరలిరి. తదుపరి
    శేషుడు యథావిధిగా శ్రీహరికి పానుపై భక్తి
    రాజ్యమును వేల సంవత్సరాలుగా ఏలెనని
    భావము.

    (మాత్రా గణనము- అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  16. అతుల మైన మేటి యందాలతో మది
    సుందరమగు లంక చూరగొనగ
    నుల్లమందు మురిసి యూహా జగత్తులో
    "లంక నేలినాఁడు లక్ష్మణుండు !"
    ****)()(****
    ("అపి స్వర్గమయీ లంకా
    కిమ్ నో రోచసి లక్ష్మణ౹
    ●●●●●●●●●●●●●●●
    ●●●●●●●●●●●●●●●")

    రిప్లయితొలగించండి
  17. రావణానుజుండు రమ్యమౌ పేరందె
    లంక నేలి, నాడు లక్ష్మణుండు
    రామచంద్రులంత రాజ్యపట్టముగట్టి
    పడతి సీతతోడ వెడలిరాగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావణానుజుండు రమ్యమౌ యశమందె
      లంక నేలి, నాడు లక్ష్మణుండు
      రామచంద్రులంత రాజ్యపట్టముగట్టి
      పడతి సీతతోడ వెడలిరాగ.

      తొలగించండి
    2. హనుమచ్ఛాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. దుష్ట రావణుండు దుస్వప్నమును గనె
    యనిని తనను గూల్చి యనఘుడైన
    రామచంద్రుడపుడు రాజును జేయగా
    లంక నేలినాడు లక్ష్మణుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ స్వప్నవృత్తాంతపు పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గనె ననిని...' అనండి.

      తొలగించండి
  19. రావణుండు జావ రాజౌచు నాభ్రాత
    లంక నేలినాఁడు, లక్ష్మణుండు
    మరలె నన్నవెంట మరల నయోధ్యకు
    నితని సాటి యెవ్వ రిలను గలరు?

    రిప్లయితొలగించండి
  20. అన్న వెంట నడచి అడవుల జనినాడు
    నిద్ర మాని తాను నిలచి నాడు
    వనము లోని లంక పర్ణ శాల యనగ
    లంక నేలి నాడు లక్ష్మణుండు
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పర్ణశాల యనెడి' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  21. రామున కనుజుండు రమణి సీతాసతీ
    సోదరిని విబుధ జనాదరణను
    దరుణి జనక రాజ తనయ నూర్మిళ నక
    లంక నేలినాఁడు లక్ష్మణుండు


    మంకుతనమ్ము మీర నవమానిత రీతినిఁ బంప నన్నయే
    తంకము సెంది చేరఁగను ధర్మవిదుండు విభీషణుండు ని
    శ్శంకను రావ ణానుజుఁడు,సత్య పరాక్రమ రాముఁ డీయగన్
    లంకను బోరులో గెలిచి, లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్!

    [లక్ష్మణుఁడు = శ్రీమంతుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  22. పంక్తిరథుడు నాడు బంగారు మయమైన
    లంక నేలినాడు; లక్ష్మణుండు
    శంక లేక యన్న సాకేతరాముని
    కంకితమ్ము జేసె కాలమంత!

    రిప్లయితొలగించండి
  23. రామునాఙ్ఞమేరరావణానుజుడుసూ
    లంకనేలినాడు,లక్ష్శణుండు
    పరమభక్తితోడ బ్రతినిమిషంబును
    రాముసేవయందులగ్నమయ్యె

    రిప్లయితొలగించండి
  24. రావణాసురుండు రాక్షసరాజుగా
    లంకనేలినాడు!లక్ష్మణుండు
    భరతకన్నగాను,మరువనిశత్రుఘ్న
    తమ్ముడంట!నాడు నమ్మకాన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      లక్ష్మణుడు భరతునికి తమ్ముడు, శత్రుఘ్నునకు అన్న. మీరు వ్యతిరేకంగా వ్రాసారు. "భరతు కనుజునగను మరియు శత్రుఘ్నున। కగ్రజుడుగ పేరు నందినాడు" అందామా?

      తొలగించండి
  25. లంకనుపోరులోగెలిచిలక్ష్మణుడేలెసహస్రవర్షము
    ల్లంకనుపోరులోగెలిచిరాముడురాజ్యమునప్పగించగా
    పొంకముతోవిభీషణుడుపొందుచులంకనుసుస్ధిరంబుగా
    వంకలులేనిపాలననువర్షసహస్రముసేసెనత్తఱిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మరి మొదటి పాదానికి అన్వయం?

      తొలగించండి
  26. అంకితధర్మవర్తనసమార్జితకీర్తివిలాసకాంతి, న

    ల్వంకలఁ దేజరిల్లఁ బరిపాలనఁ జేసి, జయించి రాజ్యముల్,

    పొంకముగా రఘూద్వహునిఁ బొందు నయోధ్యను వర్ణితోపమా

    లంకను, పోరునన్ గెలిచి లక్ష్మణు డేలె, సహస్రవర్షముల్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  27. ఈవారం ఆకాశవాణివారి సమస్య తెలుపగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్నటి నుండి ఇప్పటిదాక 'సమస్యాపూరణ' కార్యక్రమం ప్రసారం కాలేదు.

      తొలగించండి


    2. పైవారం ఆకాశవాణి సమస్య


      వీయైపీలు కవీశ్వరుల్ భళిభళీ వెర్రన్నలున్‌వారెగా

      తొలగించండి
  28. సవరించిన పద్యం

    పంకజ నేత్రుడైన యిన వంశజుఁ బాహియనంచు వేడగా
    బింకము లేని వాడని విభీషణు రాజుగ జేసె రాముడే
    శంకర భక్తుడైన దనుజాగ్రణి రావణు డేలు రాజ్యమౌ
    లంకను పోరులో గెలిచి లక్ష్మణుడేలె సహస్ర వర్షముల్

    రిప్లయితొలగించండి
  29. రాముడు దయ తోడ రాజ్యమొసగ విభీ
    షణుడు భక్తి గలిగి చక్కగాను
    లంక నేలినాడు లక్ష్మణుండు
    భ్రాతృ భక్తితోడ వాసి కెక్కె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "...బాహి యటంచు..." అనండి మొదటి పూరణలో.
      రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "లక్ష్మణుండు పరమ। భ్రాతృభక్తి..." అందామా?

      తొలగించండి
  30. రావనుండు గొప్ప రాజుగా బ్రతుకుచూ
    లంక నేలినాడు, లక్ష్మనుండు
    బ్రతికె ,నాడు గొప్ప భ్రాతయై రాముని
    నీడ వోలె, వెంట నెంట నడిచె

    సురేశ్ కుమార్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సురేశ్ కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రావణుండు... బ్రతుకుచు...లక్ష్మణుండు... కూడి నడిచె' అనండి.

      తొలగించండి
  31. సవరణతో...ధన్యవాదములు...

    రావణుండు గొప్ప రాజుగా బ్రతుకుచు
    లంక నేలినాడు, లక్ష్మణుండు
    బ్రతికె ,నాడు గొప్ప భ్రాతయై రాముని
    నీడ వోలె, వెంట కూడి నడిచె

    సురేశ్ కుమార్

    రిప్లయితొలగించండి
  32. రావణుండు బహు రమ్యపు రీతిని

    లంక నేలినాఁడు,...లక్ష్మణుండు

    జంకు వీడి భళిగ చంపె నింద్రజితుని

    పొంకమునను కడకు పోరునందు :)

    రిప్లయితొలగించండి
  33. యమ కిట్టింపు:



    బింకము తోడ రావణుడు భీతిల కుండగ పోరుసల్పగా

    పొంకము మీర రాక్షసుని పూర్తిగ గెల్వగ రామభద్రుడుం,..

    (జంకును వీడుచున్ మునుపు చంపగ చెన్నుగ నింద్రజిత్తునున్

    లంకను పోరులో గెలిచి లక్ష్మణుఁ,..) డేలె సహస్రవర్షముల్!!!

    రిప్లయితొలగించండి
  34. పొంకము మీర రామునికి ప్రొద్దుట రాత్రియు సేవజేయుచున్
    జింకను పట్టరాదనుచు చించుచు గొంతును చెప్పి సోలుచున్
    లంకను పోరులో గెలిచి, లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్
    జంకక నన్న తోడుతను జంటగ కోసల రాజధానినిన్

    రిప్లయితొలగించండి