11, సెప్టెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2785 (బలరాముని కంటె...)

కవిమిత్రులారా,
నేఁడు 'బలరామ జయంతి'

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బలరాముని కంటె పాపి వసుధం గలఁడే"
(లేదా...)
"బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్"

90 కామెంట్‌లు:



  1. ఇల బలవంతుడు కలడే
    బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే
    విలువలు వదిలిన నాతడి
    బలుగు వటువు రాజరాజు బజగెడి కంటెన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రొద్దున్నే ఆంధ్రభారతి తలుపు తట్టేట్టు చేసారు (బజగెడి కోసం).

      తొలగించండి
    2. 👏👏👏 మాయదారి శిష్యుడి కోసం కూడ ఆం.భా. తలుపు తట్టాల్సి వచ్చింది!!😊😊

      తొలగించండి

    3. పొద్దుటి నుంచి బర్తరులు,బలుగు, బజగెడిలతో నే కుస్తీ అయిపోతావుందిస్మీ :)


      జిలేబి

      తొలగించండి
  2. (శకుని దుర్యోధనునితో....)

    అల పాండవులకుఁ గష్టం
    బులఁ గల్గించితి మని కరిపురము నలుకతో
    హలమున నెత్తఁగఁ జూచెడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే?

    తుల లేనట్టి పరాక్రమాఢ్యు లయినన్ ద్యూతమ్ములో నోడి కా
    నలకై యేగిరి పాండుపుత్రులని చింతాక్రాంతుఁడై వచ్చి తా
    నలుకన్ హస్తిపురంబునున్ హలముతో నయ్యయ్యొ యెత్తెం గదా!
    బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్?

    రిప్లయితొలగించండి
  3. తలచిన రీతిగ నెప్పుడు
    పలుకం దగదోయి గదను పట్టుట లోనన్
    కలనైన కుశలు డన్యుడు
    బలరాముని కంటె పాపి! వసుధం గలఁడే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      పాపి శబ్దాన్ని సంబోధనగా మార్చి చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. డా. పిట్టా సత్యనారాయణ
    బలహీనులపై బాంబుల
    కలకలమన పశుబలంబె కారణమయ్యెన్
    కలియుగమున గన కేవల
    బలరాముని కంటె పాపి వసుధం గలడే?(లేడని భావము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      కలియుగ బలరాముని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  5. ఇలలో శూరుడు గండరీడు‌గలడే యీడేర్చ నిక్కట్ల నా
    బలరామున్ దలమీఱు? పాపి గలఁడే భావింపఁగా మేదినిన్
    సులభా శిష్యుడు రాజరాజు వలె పో! స్తోత్రంబు చేయంగనే
    తలపై పెట్టుకొనంగ రాదు వటులన్ తాలించి చూడన్ దగున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. రావణుడు సీతతో పలికిన మాటలుగాః-

    లలనను తాటక నడవిన
    యలనాడు వధించె గాదె యబలా వినవే
    యలఘుడు కాదు నరుడు ని
    ర్బల రాముని కంటె పాపి వసుధం గలడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాటక నడవిని। నలనాడు...' అనండి.

      తొలగించండి
  7. కలలో నైనను తలచని
    వెలుగును జూడంగ ముక్తి విజ్ఞాన ఘనునిన్
    విలువైన హలమును బట్టిన
    బలరాముని కంటె పాపి వసుధం గలడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ భావం అర్థం కాలేదు.
      రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "విజ్ఞాన ఘనున్। విలువైన హలము బట్టిన..." అనండి.

      తొలగించండి
    2. అసలు నాకర్ధ మైతేకదా ? ఎందుకు రాసానో , ఎలారాసానో ?
      అదన్నమాట అసల్ సంగతి

      తొలగించండి
  8. గెలువగ సభ నెవ్వరు ధీ
    బలరాముని కంటె? పాపి వసుధం గలడే
    కలవర పరచగ పండిత
    కులమున శుంఠగ జనించి కూడగ కూళల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గెలువగ నెవడు ఘనుడు ధీబలరాముని కంటె' అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
    3. గెలువగ ఘను డెవ్వడు ధీ
      బలరాముని కంటె? పాపి వసుధం గలడే
      కలవర పరచగ పండిత
      కులమున శుంఠగ జనించి కూడగ కూళల్!

      తొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    కలయా?సప్తతి మించు మేళనమునన్ గన్నెర్రనున్ వీడకే
    పలు సంధుల్ గని మాటమార్చి గడగన్ బ్రక్కింటి బాంధవ్యముల్,
    చెలిమిన్ గానని పొర్గు నేమనగ నా శీలంబె బల్ చోద్యమౌ
    వెలయన్ "పాక"న(పాక్*అన)"తేజ"మర్థమట నీ విస్ఫార చీకట్ల పాక్--
    బలరామున్ దలమీరు పాపి గలడే భావింపగా మేదినిన్
    (పేరుకు పాకిస్తానము..తిమిరానికి తేజోనామము..కాళోజీ)

    రిప్లయితొలగించండి
  10. కలలుగనుచున్న వయసున
    బలవంతముగముకు చెవుల వందఱ లాడెన్
    తలచిన పలవించు మది, య
    బల! రాముని కంటె పాపి వసుధం గలఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      చక్కని విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    కులనామమ్ము జపించుచున్, ప్రజలకాక్రోశమ్ము గల్పించుచున్
    బలగర్వాంధుడు, దుర్వినీతుడని మా ప్రాంతప్రసిద్ధుండునౌ
    కలుషాత్ముండగు నేత వీడు , గెలవంగా రాదు , క్రూరాత్ము మా
    బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లౌకిక బలరాముని గురించిన మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  12. (సంగ్రామ సాహాయ్యంగా పదివేలమంది వీర
    సైనికులను కృష్ణుడందిస్తే బలరాము డేసాయం
    చేయక యాత్రకు వెళ్లినందుకు రారాజు ఉక్రోషం )
    కలకల నవ్వుచు కృష్ణుడు
    బలగము పదివేలమంది పనిచిన ; నాకున్
    విలువల నీయక వెడలిన
    బలరాముని కంటె పాపి వసుధం గలడే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని తనను ఎంతో అభిమానించే గురువును గురించి దుర్యోధను డిలా అనుకొనడం?

      తొలగించండి
    2. అందుకే పైకి అనకుండా లోపల అనుకున్నాడని
      అన్నానండీ! ధన్యవాదాలు.

      తొలగించండి
    3. అందుకనే అన్నాడని కాకుండా అనుకున్నాడని అన్నా
      నండీ! ధన్యవాదాలు.

      తొలగించండి
    4. అందుకనే అన్నాడనకుండా అనుకున్నాడన్నాను . ధన్య
      వాదాలండీ!

      తొలగించండి
  13. గురువర్యులుశ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2785
    సమస్య :: బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపగా మేదినిన్.
    సందర్భం :: ఈ రోజు *బలరామ జయంతి*
    రోహిణీ వసుదేవులకు కుమారుడుగా జన్మించిన బలరాముడు
    ఆదిశేషునియొక్క అవతారము. ఈ బలదేవుడు భక్తితో (యతియైన అర్జునుడు మొదలైన) సన్న్యాసులను పూజిస్తాడు.ఈ రేవతీరమణుడు (తనను అగౌరవించిన సూతమహర్షిని దర్భతో కొట్టి ప్రాయశ్చిత్తం కోసం) శ్రద్ధగా తీర్థయాత్రలు చేస్తాడు. ఈ హలాయుధుడు (భీముని చూచి నాభికి క్రింది భాగాన గదతో కొట్టరాదని) ధర్మబద్ధంగా మాట్లాడుతాడు.
    శ్రీ కృష్ణుడు ఒకసారి ధర్మరాజా! లోకంలో ఎవరైనా చెడ్డవారు ఉన్నారా? అని ప్రశ్నించగా యుధిష్టిరుడు సమాధానం చెబుతూ ఓ మాధవా! లోకంలో నేను తప్ప మిగిలిన అందఱూ మంచివారే. ప్రతియొక్కడూ సన్న్యాసులను పూజిస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. ధర్మం పక్షం వహించి మాట్లాడుతున్నారు. అందువలన పై మూడు సుగుణాలలో శ్రీ బలరాముని మించిపోయి ఉన్నారు. ఈ భూమిమీద పాపి అనేవాడు లేడు కదా అని విశదీకరించే సందర్భం.

    విలసత్తేజుడు ధర్మజుం డనె నిటుల్ “విశ్వాత్మ! హే మాధవా!
    యిల సన్న్యాసుల గొల్చు, యాత్రలకు దా నిచ్ఛన్ బ్రయాణించు, ధీ
    కలితుండై వచియించు, గాన ప్రతియొక్కండెన్న దేవుండునై
    బలరామున్ దలమీఱు; పాపి గలఁడే భావింపగా మేదినిన్?”
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (11-9-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      చక్కని అన్వయంతో సమర్థంగా అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  14. అలమరె రామకఛ విని య
    బల, రాముని కంటె పాపి వసుధం గలడే
    బలీయమైనది యీవధి
    వలచిన సతిని వనమునకు పంపిడె ననుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపు దోషాలున్నవి. మూడవ పాదం మొదటిగణం జగణం కాకూడదు.

      తొలగించండి


  15. రామాయణంలో పిడకల వేట సాగించు నేటి మేధావులు :)



    అలనాడు సీతనంపెను
    తలమున కని రామభద్రు తలపైన తుపా
    కులు బెట్టి యందురు ముకా
    బల! రాముని కంటె పాపి వసుధం గలడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      అలాంటి వారి సంఖ్య పెరిగిపోతున్నది. మంచి పూరణ. అభినందనలు.

      తొలగించండి


    2. ధన్య వాదాలండీ కంది వారు

      కొంత మంది కుహనామేధావుల పైత్యం‌ చూస్తా వుంటే

      గుమ్మడి కాయల దొంగ కథ గుర్తు కొస్తోంది

      ఏం చేద్దాం రామా హరే కృష్ణా హరే అంతే అనుకోవాలె


      జిలేబి

      తొలగించండి
  16. అలకం బూనిన మామ కంసు డట దుష్టాలోచనన్ గృష్ణు న

    య్యలఘుక్రూరమతిన్ వహించి దన మేనల్లున్ హతుం జేయగన్;

    హలహస్తాబ్జుఁ, దదగ్రజన్ముఁ, దనతో నాహూతు, వంచించ నా

    బలరాముం; దలమీఱు పాపి గలడే? భావింపగా మేదినిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  17. కలగనె నొక్కండoదున్
    పలువిధ కల్ల లు గనబడె వైవిధ్య ము గన్
    పలవర ముగబల్క దొడగె
    బల రాముని కంటె పాపి వసుధ న్ గలడే !

    రిప్లయితొలగించండి
  18. శంకరాభరణము నేటి సమస్య
    (బలరాముని కంటె పాపి వసుధం గలఁడే)
    కంద పద్య పాదమును సీసములోనికి మార్చి నా పూరణము



    పాండవులు రాజ్యము కోల్పోయి వనవాసము నకు వెడలినారు ఆ సమయమున సుభద్ర తన సుతుడు అభిమన్యునితో సోదర్డు బలరాముని పురములో నున్నది. బలరాముడు ,రేవతి తన కుమార్తె శశిరేఖను అభిమన్యునకు ఇచ్చుపెండిలి చేయుటకు నిరాకరించి వారిని అవహేళనము చేస్తారు. దారుకాశ్రమమునకువదలిన తర్వాత అభిమన్యుడు బాధ పడుచు తన తల్లితో అన్న బాల్య చాపల్యముతో అన్న మాటలు అని భావన తో పూరణము (అప్పుడు సుభద్ర పెద్దవారిని అలా తూల నాడవద్దని చెబుతుంది)

    సీసము
    భాగ్యము లేకున్న బందు జనంబులు పలుక బోరుగద భువనము నందు,
    రాజ్యము లేదని రమణిని నాకిచ్చి మనువు జరుపగ బోమనుచు తేల్చె,
    మాతులు డిరువురి మనమును గాయపరచెను గా, మీయన్న రక్కసుండు
    గద, బలరాముని కంటె పాపి వసుధం గలఁడే యని పలుకు ఖలము పైన


    జనులు, మా బిడ్డ లేయని జాలి పడక
    మమ్మిరువురను విడదీసి మదము తోడ
    తరిమి గొట్టె వనమునకు పురము నుంచి
    యనుచు నభిమన్యుడు పలికె జనని తోడ


    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అలవుగ గద నెవడు మెదపు
    బలరాముని కంటె? పాపి వసుధం గలఁడే
    తెలిసిన యాయుధ విద్యను
    పొలుపుగ వాడక కెరలెడి పోకిరి కంటెన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యం పూర్వార్ధం కొంత అర్థం కాలేదు.

      తొలగించండి
  20. వలచిన వానిని కాదని
    వలదను వానిని వరింప వంతకు తరమా?
    తలచె నిటుల శశిరేఖయె
    "బలరాముని కంటె పాపి వసుధం గలఁడే"

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కవి మిత్రులకు మనవి:
    నా ఫోనులో అనుకోకుండా ఇంగిలీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే యాప్ మాయమైంది. తేలికగా తర్జుమా చేసే అలాంటి యాప్ ను దయతో ఎవరైనా సూచిస్తే డౌన్ లోడ్ చేసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  22. బలరామునిగూర్చియిటుల
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
    పలుకగదగునేమీకది
    బలరాముడుపాపిగాడుపరమాత్ముండే

    రిప్లయితొలగించండి
  23. స్వరచక్ర తెలుగు
    యాప్ ను download
    చేసికోండి
    తెలుగు
    English
    రెండూవస్తాయి

    రిప్లయితొలగించండి
  24. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =======================
    బలరామున్ దలమీఱు పాపి గలడే
    భావింపగా మేదినిన్
    ==========================
    అది శేషుని అవతారమైన బలరాముడిని
    మించిన పాపాత్ముడు కలడా ఆలోచించి
    చూడగ ఈ భూమండలము పైన యని
    చెప్పుటలో అసంబద్దతె సమస్య
    ===========================
    సమస్యా పూరణం- 253
    =================

    శేషుడు తానై అవతారమెత్తి
    దేవకి గర్భమున మొలకెత్తి
    మామ చంపునని చేయెత్తి
    పారె రేవతి గర్భానికి పరుగెత్తి
    సుతుడై పుత్ర శోకము మిగిల్చె
    తన తల్లికి తానన యెంచగన్
    బలరామున్ దలమీఱు పాపి
    గలడే భావింపగా మేదినిన్

    ====##$##====

    శ్రీహరి ఆదేశము మేరకు యోగమూయ
    దేవకి గర్భమున ప్రవేశించిన ఆది శేషుని గర్భ
    విఛ్ఛిత్తి లేదా గర్భ పాతమని లోకులు తలచు
    రీతిగా తరలించి రేవతి గర్భమునందు ప్రవేశ
    పెట్టినది.

    శేషుడు లేదా బలరాముడు తాను దేవకి
    గర్భమున మొలకెత్తినను రేవతి గర్భమునకు
    తరలించబడి గోకులములో పెరిగినాడు తప్ప
    కంసుని వధ జరుగు వరకు దేవకి కంట బడక
    ఆమెకు పుత్ర శోకమును మిగిల్చినాడు. ఈ
    విధముగా మాతృత్వపు దృక్కోణమున చూసి
    న బలరాముని కంటె పాపి భూమండలమున
    మరొకడు కలడాయని నిష్టూరవచన భావము.

    ( మాత్రా గణనము- అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  25. బలుడెవడు లేడు నరయగ
    బలరామునికంటె,పాపి వసుధం జూడన్
    చులకన జేయుచు కృష్ణుని
    పలువిధముల వదరెడు శిశుపాలనృపుండే!!!

    రిప్లయితొలగించండి
  26. అల తాళద్రుమ వనమున
    ఫలములఁ దిన నీయ డతఁడు ప్రజలను దినుచున్
    ఖల ఖర దైత్యుండు బలుఁడె
    బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే


    కల లందైనను బాహు నిర్జిత మహాకాళింది యేకైక కుం
    డలుఁ డుగ్రుండును ముష్టికాంతకుఁడు గాఢస్కంధు పాటిన్ రసా
    తలమం దెచ్చట నైన రోసినను దైత్యశ్రేణు లందెల్ల, నీ
    బలరాముం దలమీఱు, పాపి గలఁడే భావింపఁగా మేదినిన్

    [తలమీఱు = అతిక్రమించు]

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    బలరామున్ దలమీఱు పాపి గలఁడే
    భావింపఁగా మేదినిన్

    సందర్భము: ఈ రోజు మీ రిచ్చిన సమస్య వల్ల నా కొక కొత్త విషయం తెలిసింది. అ దే మంటే బలరాముడు గొప్ప పుణ్యాత్ముడు.
    ఎందుకంటే మీ రిచ్చే సమస్య ఎట్లాగూ విరుద్ధార్థంలోనే ప్రవర్తిస్తుంది కదా! బలరాముని మించిన పాపి ఉన్నాడా అనే కదా మీరిచ్చిన సమస్యా వాక్యం. అలా అన్నప్పుడే బలరాముడు మహా పుణ్యాత్ము డని నాకు తెలిసిపోయింది.
    ఆతడు సాధు సమర్చనం తీర్థయాత్రాటనం ధర్మోపదేశం మొదలైన పుణ్య కర్మలయందు రతు డన్న విషయం శ్రీ కోట రాజశేఖర్ గారి "విలసత్తేజుడు.." అనే పద్యం ద్వారా గ్రహించవచ్చు.
    రౌహిణేయుడు=రోహిణి కుమారుడు.. బలరాముడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఇలలో పుణ్యము మూట గట్టుకొను వా
    డీ రౌహిణేయుం డహో
    తెలిసెన్; మీదు సమస్య భిన్నముగ వ
    ర్తించున్ త దర్థంబునన్
    తెలివిన్ జూడగ పుణ్యు డాత డగు నెం
    తే... మీదు వాక్యం బిదే!
    "బలరామున్ దలమీఱు పాపి గలఁడే
    భావింపఁగా మేదినిన్"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    11.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. మిత్రులకు మనవి....
    ఈ బ్లాగులో కేవలం సమస్యాపూరణలు, పద్యాలు మాత్రమే పోస్ట్ చేయండి. ఇతర విషయాలు, వ్యక్తిగత విమర్శలు వద్దు.

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. లలనకు తగు వాని నరసి
      కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
      వలదని యలుగుచు పరుగిడు
      బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

      నిన్నటి సమస్యకు నా పూరణ

      కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
      చేపరూపము గొనిహరి చేసె నేమి ?
      రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
      ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

      తొలగించండి
    2. లలనకు తగు వాని నరసి
      కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
      వలదని యలుగుచు పరుగిడు
      బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

      నిన్నటి సమస్యకు నా పూరణ

      కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
      చేపరూపము గొనిహరి చేసె నేమి ?
      రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
      ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

      తొలగించండి
  30. బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్"
    బళిరాయేమనిబల్కుచుంటిరిటమీభావంబునట్లుండెగా
    బలరాముండదెచూడగాదెలిసెనాభావంబునందున్సదా
    యిలలోనాతనిమించుభక్తవరునెయ్యెయ్యెందుగానంగదే

    రిప్లయితొలగించండి
  31. బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్"
    బళిరాయేమనిబల్కుచుంటిరిటమీభావంబునట్లుండెగా
    బలరాముండదెచూడగాదెలిసెనాభావంబునందున్సదా
    యిలలోనాతనిమించుభక్తవరునెయ్యెయ్యెందుగానంగదే

    రిప్లయితొలగించండి
  32. అలమరె రామకఛ విని య
    బల, రాముని కంటె పాపి వసుధం గలడే
    బలమైనదిగద యీవిధి
    వలచిన సతిని వనమునకు పంపుట యనుచున్

    రిప్లయితొలగించండి
  33. లలనకు తగు వాని నరసి
    కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
    చేపరూపము గొనిహరి చేసె నేమి ?
    రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
    ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

    రిప్లయితొలగించండి
  34. లలనకు తగు వాని నరసి
    కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
    చేపరూపము గొనిహరి చేసె నేమి ?
    రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
    ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

    రిప్లయితొలగించండి
  35. లలనకు తగు వాని నరసి
    కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
    చేపరూపము గొనిహరి చేసె నేమి ?
    రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
    ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

    రిప్లయితొలగించండి
  36. లలనకు తగు వాని నరసి
    కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
    చేపరూపము గొనిహరి చేసె నేమి ?
    రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
    ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

    రిప్లయితొలగించండి
  37. లలనకు తగు వాని నరసి
    కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
    చేపరూపము గొనిహరి చేసె నేమి ?
    రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
    ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

    రిప్లయితొలగించండి
  38. లలనకు తగు వాని నరసి
    కలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
    చేపరూపము గొనిహరి చేసె నేమి ?
    రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
    ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె

    రిప్లయితొలగించండి
  39. గురువు గారికి నమస్సులు.
    బలవంతుడు లేడు గదా
    బలరాముని కంటే, పాపి వసుధన్ గలడే
    చెల్లిని తార్చడు వాడున్
    కలియుగమున కా పురుషుల కాలము గదయా.

    రిప్లయితొలగించండి
  40. రావణుడు సీతతో పలికిన మాటలుగాః-

    లలనను తాటక నడవిన
    యలనాడు వధించె గాదె యబలా వినవే
    యలఘుడు కాదు నరుడు ని
    ర్బల రాముని కంటె పాపి వసుధం గలడే.

    రిప్లయితొలగించండి
  41. సీతతో అశోకవనిలో రావణుని మాటలుగాః-

    లలనా నామది మ్రుచ్చలించితివిగా లాలించవే మోహమున్
    శలభమ్మే గన మానవుండిటకు దుస్సాధ్యమే చేరుటన్
    కలికిన్ దాటక జంపె ముక్కు జెవులన్ ఖండించెనోస్త్రీకి ని
    ర్బల రామున్ దల మీఱు పాపిగలడే భావింపగా మేదినిన్.

    రిప్లయితొలగించండి
  42. లలనకు తగు వాని నరసి
    కలనిజ మగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బల రాముని కంటె పాపి వసుంధ గలడే

    నిన్నటి సమస్కుకు నా పూరణ

    కంసు నేకాలమున జంపె కన్యయ గను?
    చేప రూపము గొని హరి చేసె నేమి?
    రావణుని గూల్చె నెవ్వడు రణమునందు?
    ద్వాపరమున ,సోమకుజంపె ,దాశరథియె


    రిప్లయితొలగించండి
  43. విలువగుయెన్నికలందున
    అలవోకగడబ్బు బంచినధికారవగా!
    భవితను నాశనబరచిన
    బలరామునికంటె పాపివసుధన్ గలడే?

    రిప్లయితొలగించండి
  44. విలువగు యెన్నికలందున
    అలవోకగడబ్బు బంచి నధికారమునన్
    నిలువున ముంచియుప్రజలను
    బలరామునికంటెపాపివసుధన్ గలడే!

    రిప్లయితొలగించండి
  45. పంపినపూరణలువెళ్లుటలేదుఎందుకుసార్

    రిప్లయితొలగించండి
  46. విలువగు ఎన్నికలందున
    అలవోకగ డబ్బుబంచి అధికారమునన్
    నిలువెత్తు ముంచి ప్రజలను
    బలరాముని కంటెపాపివసుధంగలడే|

    రిప్లయితొలగించండి
  47. వలపుల్ మీరగ గోపనాన శశి బావన్ గూడి సంతుష్టిగా
    చిలిపిన్ రాతిరి వెన్నెలన్ పడవలో శృంగార మాశించగా
    కలతన్ జెందుచు వెంటనాడుచును చీకాకై సతాయించు నా
    బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్!

    రిప్లయితొలగించండి
  48. వలపున పిరియపు కొమరిత
    చిలిపిని పడవ విహరణము చేయగ బూనన్
    కలతనుగొని పరుగులిడిన
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే :)

    రిప్లయితొలగించండి
  49. కొలనున్ జేరగ కూతురున్ ప్రియుడు భల్ గుప్తంపు వాహ్యాళికై
    గలభా జూచుచు కాపరుండు వడిగా గైకొన్గ వార్తన్నటన్
    విలనున్ బోలుచు దార తోడుతను తా విచ్చేయు క్రూరాత్ముడౌ
    బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్!

    రిప్లయితొలగించండి