16, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2789 (విషగళుండైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విషగళుండైన నవధాని వినుతి కెక్కు"
(లేదా...)
"విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై"

85 కామెంట్‌లు:

  1. సతిని కాదన్న మనలేడు సాటిలేని
    విషగళుండైన; నవధాని వినుతికెక్కు
    కమలభవ సతీ కరుణను కంఠమందు
    సుస్వరము వాగ్విభవమును జోడుగూడ!

    రిప్లయితొలగించండి
  2. గణము తెలియని వాడైన గాలి వాటు
    ఇంటి కొకపండి తుండట నిలను వెలసె
    గెలుపు కొఱకని సభలందు గోల జేసి
    విష గళుండైన నవధాని వినుతి కెక్కు

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ఋషివలె నేకవస్తుగతదృష్టి వధానమునందు నిల్పి , పౌ...
    రుషమున పృచ్ఛకాళిని నిరుద్ధులఁ జేయుచు స్వీయచాతురీ
    ధిషణల , ధైర్యవృత్తిఁ గొని , తేజములొల్కుచు , శబ్దరూపుడౌ
    విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. అపర శంకరుఁడై సమస్యల డమరుక
    మును, నిషిద్ధాక్షరీ శూలమును ధరించి
    దత్తపదుల విభూతితో ధారణాఖ్య
    విషగళుండైన నవధాని వినుతి కెక్కు.

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా ‌సత్యనారాయణ
    పచ్చ కప్పుర విడమున పట్టు జిక్కు
    జర్ద గుప్పించుకొని కంఠ జలము మ్రింగి
    యూహలో దేలియాడుచు నునికి బెంచ
    విష గళుండైన నవధాని వినుతికెక్కు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      జర్దా విషంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      జర్దా కిళ్ళీ వేసుకొనే అవధాని ఎవరైనా మీ దృష్టికి వచ్చారా?

      తొలగించండి


  6. పేరు పోగొట్టు కొనునయ పెచ్చుమీరి
    విషగళుండైన నవధాని, వినుతి కెక్కు
    శషభి షలులేక చక్కటి స్వరముతోడు
    త్విష గలిగినట్టి యవధాని తీరుగాను

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. పలుకు లమ్మను హృదయాన పదిలపరచి
    సాహితీతప మొనరించు స్రష్ట యనెడి
    కీర్తినొందుచు గాత్రమే గేశరపు త
    విష గళుండైన నవధాని వినుతి కెక్కు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కేశరపు తవిష గళుడు' అర్థం కాలేదు.

      తొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    అడుగు వాడెప్పుడైనను అడుగువాడు
    అనుకొనెడి యాత్మశక్తిని యలముకొనుచు
    "కొట్టి కొట్టించు కొను వేళ" కొంతనైన
    విషగళుండైన నవధాని వినుతికెక్కు("..."లోని హాస్యము స్వర్గీయ వరంగల్ అవధానిగారిది)

    రిప్లయితొలగించండి


  9. మషిమణి రాత సుద్ధి సయి మాన్యత గల్గిన మంచి పోకయున్
    ధిషణిని నాల్క తీరు సయి ధింధిమి జేర్చు జిలేబి పోడిమిన్
    శషభిష లేవి యున్ తను విచారము చేయక పల్కులోన ని
    ర్విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై!

    (మన రాజశేఖరులు మైలవరపు వారి లా అన్న మాట)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా సత్యనారాయణ
    ఝషమునకైన నోపు విష జాలము లేనిది యీదజాలునే?
    మృషలను మల్చి యొక్కడు సమస్య ను నొక్కిన వేరొకండు దా
    వృషభము నెక్కి చాటునిది విద్ధిని యక్షర ముండరాదనున్
    కష-కష మర్దనం గనెడు కష్టము లష్టము మేధ కల్పమౌ
    విషగళుడైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుడై

    రిప్లయితొలగించండి
  11. చక చక సమస్య పూరణ సరస యుక్త
    చతుర వచనా దురంధర శంకరు డను
    నాఖ్య తో పృచ్చకు లు మెచ్చ నాఢ్య ధార
    విష గళుoడైన నవధాని వినుతి కెక్కు

    రిప్లయితొలగించండి
  12. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    విషగళుండైన నవధాని వినుతి కెక్కు

    శ్రీ సూరం శ్రీనివాసులు గారి సూచనతో సవరణతో.. వారికి ధన్యవాదములతో..👇🏻

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    తాను కా దని, తనలోనఁ దనరు *శక్తి*

    చెప్పు నని తలంచుచు భక్తిచేత మ్రొక్కి

    చెప్ప శ్లాఘింతు రజుడైన శ్రీశుడైన

    విషగళుండైన!... నవధాని వినుతి కెక్కు..

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    16.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  13. కేశరము =మకరందము
    తవిషము = సముద్రము
    కేశరపు తవిషము = మకరంద సముద్రము గా గలిగిన అనే భావనతో వ్రాసాను తప్పైతే మరొకటి ప్రయత్నిస్తాను గురువుగారు🙏

    రిప్లయితొలగించండి
  14. కృషియు, మరింతనేర్చుకొను తృష్ణయు సాధన, మంచి ధారణల్,
    విషయములందు జ్ఞానమును, విజ్ఞత, వాక్పటిమంబు, మేటిదౌ
    ధిషణత, యోర్పుయున్ గలిగి దివ్యముగా స్థిరచిత్తమందునా
    *"విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యోర్పునున్' అనండి.

      తొలగించండి
  15. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    విష గళుడైనచో మిగుల విశ్రుతి
    కెక్కు వధాని మాన్యుడై
    ======================
    చేదుగ తోచు నిజములను చెప్పు
    కంఠపు పండితుడు మిక్కిలి ప్రసిద్ధి
    చెందును గొప్పవాడిగ యని చెప్పుట
    లోని విశేషమే సమస్యగ పరిగణించ
    ========================
    సమస్యా పూరణం- 256
    ==================

    సబ్బులు లేని నాటి కాలమున-
    తానే ఒక గట్టి సబ్బు యన
    ఉతికి ఆరేసెను కద వేమన-
    నేడది తోచె మనకు తీయన
    ముఖస్తుతి తీపి తినుట కంటె-
    చేదు చిలుకంగ యధార్థుడై
    విషగళుడైనచో మిగుల విశ్రుతి-
    కెక్కు వధాని మాన్యుడై

    ====##$##====

    వైదిక కర్మాచరణమును నిరసించిన
    వేమన బ్రతికుండగా ఆదరణను పొందినాడో
    లేదో తెలియదు కాని, నేడు తిరుమలలో తన
    పేరిట ప్రాజెక్టు ( వేమన సాహిత్య పరిశోధన
    ప్రాజెక్టు) గా నిలచినాడు.

    అప్పటికి మనను మెచ్చుకొనకున్ననేమి,
    నిజము అది తానెంత విషతుల్యమైననేమి,
    ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటయే విజ్ఞుల లక్షణం

    రెఫరెన్స్ గా వేమన :
    ===============

    " పిండములను చేసి పితరుల తలపోసి
    కాకులకు పెట్టెడి గాడ్దెలార
    పియ్యి తినెడి కాకి పితరుడెట్లాయెర
    విశ్వధాభి రామ వినుర వేమ "

    కొసమెరుపు:
    ==========

    గరికపాటి వారి నిజాలు కూడా ఈ కోవకు
    చెందినవే

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2789
    సమస్య :: విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుడై.
    గొంతులో విషాన్ని కలిగి ఉన్నవాడైతే అవధాని సన్మానింపబడుతాడు. బాగా కీర్తిని పొందుతాడు.
    సందర్భం :: అవధానం చేసేటప్పుడు పృచ్ఛకులు అవధానిని అష్టకష్టాల పాలు చేయాలని ప్రయత్నిస్తూ క్లిష్టమైన సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఆ సమస్యలను చూచి భయపడితే ఆ భయం కారణంగా అవధానికి గొంతులో తడి ఆరుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విషము అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో నీరు అనే అర్థాన్ని ఇక్కడ తీసికొందాం.
    సభలో భయపడకుండా ఉంటూ, నోట తడి (నీరు)ఆరిపోని పరిస్థితిని కలిగి ఉంటూ, అవధాని విషగళుడై కవిత్వం చెబుతూ ఉంటే మాన్యుడౌతాడు. సత్కీర్తిని పొందుతాడు అని విశదీకరించే సందర్భం.

    విష మన బెక్కు నర్థముల బెద్దలు చెప్పిరి, వాటి నెంచుచున్
    విష మనుచుండ నర్థముగ వింతగ నీటిని గొన్న, నోట నా
    విష మది యారిపోక మది భీతి దలంపక కైత లల్లు డీ
    విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుడై.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (16-9-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      తడియారని గొంతుపై మీ పూరన అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. . సవరణతో
      గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
      సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2789
      సమస్య :: విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుడై.
      గొంతులో విషాన్ని కలిగి ఉన్నవాడైతే అవధాని సన్మానింపబడుతాడు. బాగా కీర్తిని పొందుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
      సందర్భం :: అవధానం చేసేటప్పుడు పృచ్ఛకులు అవధానిని అష్టకష్టాల పాలు చేయాలని ప్రయత్నిస్తూ క్లిష్టమైన సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఆ సమస్యలను చూచి భయపడితే ఆ భయం కారణంగా అవధానికి గొంతులో తడి ఆరుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విషము అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో నీరు అనే అర్థాన్ని ఇక్కడ తీసికొందాం.
      సభలో భయపడకుండా ఉంటూ, నోట తడి (నీరు)ఆరిపోని పరిస్థితిని కలిగి ఉంటూ, అవధాని విషగళుడై కవిత్వం చెబుతూ ఉంటే మాన్యుడౌతాడు. సత్కీర్తిని పొందుతాడు అని విశదీకరించే సందర్భం.

      విష మన బెక్కు నర్థముల బెద్దలు చెప్పిరి, వాటి నెంచుచున్
      విష మనుచుండ నర్థముగ వింతగ నీటిని గొన్న, నోట నా
      విష మది యారిపోక, మది భీతి దలంపక, కైత లల్లుచున్
      విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుడై.
      కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (16-9-2018)

      తొలగించండి
  17. చంపకమాల
    ధిషణయు ధార, ధోరణులు దిట్టతనమ్ముయు ధారణాది పౌ
    రుషమున పృచ్ఛకాళియట రువ్విన క్ష్వేళము గొంతు నిల్పుచున్
    హసనము మోమువీడకనె హ్లాదము పంచెడు పూరణమ్ములన్
    విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'దిట్టతనమ్మును' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు
      సవరించిన పూరణ :

      చంపకమాల
      ధిషణయు ధార, ధోరణులు దిట్టతనమ్మును ధారణాది పౌ
      రుషమున పృచ్ఛకాళియట రువ్విన క్ష్వేళము గొంతు నిల్పుచున్
      హసనము మోమువీడకనె హ్లాదము పంచెడు పూరణమ్ములన్
      విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై

      తొలగించండి


  18. మీ పూరణ బాగున్నది
    మీ పద్యపువిరుపులున్ను మించారె సుమీ
    మీ పద్యంబు ప్రశస్తము
    మీ పద్యంబద్భుతము సమీక్షింప సుమీ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. మృషలవి లేనివాడు;శ్రుతిమించని వాక్కులవాడు;స్వేచ్ఛగా
    తృషలను దీర్చునాతడును; తీయనికైతల నిచ్చునాత; డే
    శషభిష లేనియాతడును; శాబ్దికసౌష్థవదివ్యధారణా
    విషగళుడైనచో మిగుల విశ్రుతికెక్కు వధాని మాన్యుడై .
    (ధారణ అనే అవిషం కంఠంలో గలవాడైతే )

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పృచ్ఛకు లడుగు ప్రశ్నలు పేర్చుకొనుచు
    మదిని పద్యము లల్లుచు మానికముగ
    చాటి సభలోన విజయుడై సాగునట్టి
    విషగళుండైన నవధాని వినుతికెక్కు

    రిప్లయితొలగించండి
  21. సర్వ మెఱిగిన మేధావి శర్వు డొకడె
    యట్టి సర్వజ్ఞు డవధాని యైన యెడల
    కవితతో మురిపించును; కాక యెటుల
    "విషగళుండైన నవధాని వినుతి కెక్కు"

    రిప్లయితొలగించండి
  22. నోటినుండియేవదలుచునురగనతడు
    మృత్యువొడిలోనికేగునుమెదడుముదల
    విషగళుండైన,నవధానివినుతికెక్కు
    మంచిధారణగలిగిన మందిచేత

    రిప్లయితొలగించండి
  23. సభ్యత విడి విషమ సమస్య వెలువడిన
    మ్రింగుడు పడకున్న సహించి మ్రింగ కుండ
    ప్రేక్షకాళికి పూరణన్ విందుఁ గూర్చు
    విషగళుండైన నవధాని వినుతి కెక్కు

    రిప్లయితొలగించండి
  24. కలిగి మిగుల సద్యస్స్ఫూర్తి సులభ రీతి
    వివిధ సునిశిత భావార్థ విలసిత పద
    తతి నియోగ రతుఁ డయి సతత మపగత
    విషగళుండైన నవధాని వినుతి కెక్కు

    [విషగళుఁడు = దుర్భాషలాడు వాఁడు]


    తృషఁ గొని పద్య గద్యములు తెల్లపు రీతిని భావ శబ్ద క
    ల్మషములు లేని భంగి బుధ మాన్య విధమ్ముగఁ జెప్ప నేర్వ మా
    నుష గురు యత్న భాసిత ఘనుండయి తృప్త కృతార్చనా బృహ
    ద్విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై

    [విషగళుఁడు = శివుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా, మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. శివుడు, విషమ సమస్యలను తేలికగాపరిష్కరించేవాడు, పన్నగ భూషణుడు, ధీరుడై పార్వతిని, గంగను ధరించిన వాడు, నిశ్చల తత్వము గలవాడు. అవధాని కూడ విషసర్పాల వంటి, ఉద్దండ పండితులు అడిగే సమస్యలను తేలికగా పరిష్కరించ గలిగి, ధిషణ, ధారణ కలిగి, సభాకంపము లేక నిశ్చల తత్వము గలవాడైన, గరళకంఠుని వలె మాన్యుడై విశ్రుతి కెక్కునని భావన!
    ధిషణ= పార్వతి( ఆంధ్ర భారతి)
    బిలేశయము= పాము( బిలములో నివసించునది)

    విషమ సమస్యలన్ మిగుల వేసటలేకనె దీర్చువాడుగన్
    విషపు బిలేశరూపపు సుపృచ్ఛక భూషణ శోభితుండగున్
    ధిషణయు, ధారణల్ గలిగి ధీరత నిశ్చల తత్వ రూపుడౌ
    విషగళుడైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుడై





    రిప్లయితొలగించండి
  26. ఆశుకవితల లోన ప్రవేశ మున్న
    పలు పురాణమ్ములఁ జదివి పలుకుల జవ
    రాలి మెప్పును పొందిన ప్రముఖుడైన
    విషగళుండైన నవధాని వినుతి కెక్కు

    రిప్లయితొలగించండి
  27. ధిషణను గొన్న కీర్తి వెస దివ్యజగమ్మునుఁ దాక, మెచ్చియే
    మిషగొని వారలున్ గదిలి మేదినిఁజేర వధానినెన్నగా
    నృషిగణపాలి దత్తపది నింకను వర్ణన నిచ్చువాడునా
    విషగళుడైనచో మిగుల విశ్రుతికెక్కు వధాని మాన్యుడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ, నమస్కారములు ధన్యవాదములు.

      అవధానము అంటే - కంది శంకరయ్య గారు ఉండల్సిందే గదా

      ఏ వధాన మైనను దేశమెద్దయినను
      వేవురు పరులుండినను సభావేదికఁగన
      నయముగాఁబృచ్ఛకుడొకండు నామ సామ్య
      విషగళుండైన నవధాని వినుతి కెక్కు.

      తొలగించండి
  28. గురువు గారికి నమస్సులు.
    బహుళ ప్రముఖుడు పుడమిన బతుక లేడు
    విషగళుo డైన ,నవధాని వినుత కెక్కె
    ధార,ధోరణి, ధైర్యంబు ధరణి నున్న
    పూజ్యు లగు వాగ్వి. వర్యులెల్ల పూజ సేయు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. 'వాగ్మి'ని 'వాగ్వి' అన్నారు.

      తొలగించండి
  29. విషమపరిస్ధితింబడునువీడునుబ్రాణముదప్పకుండగన్
    విషగళుడైనచో,మిగులవిశ్రుతికెక్కువధానిమాన్యుడై
    విషమపదంబులెయ్యెడలవేయకదేలికవాటినేదగన్
    ధిషణయుధారణంబునిటదేటపడంగనుజెప్పునోర్చుచో

    రిప్లయితొలగించండి
  30. విషయము లందు పట్టుగొని విద్యలతల్లి వసింప చిత్తమున్
    విషమసమస్య లైన కడు విజ్ఞతఁ బూరణ చేయ నేర్చినన్
    ధిషణయు ధ్యైర్యమున్ కలిగి తీరగు పద్యము లల్లు సూరి తా
    విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై

    రిప్లయితొలగించండి
  31. పాటవమ్మించుకయె లేని పండితుండు
    కీర్తి కండూతి పెరిగి సత్కీర్తి బడయ
    ధనము నిచ్చితా గొన్న సత్కార ములను
    విష గళుండైన నవధానివినుతి కెక్కు

    రిప్లయితొలగించండి
  32. అందమైన పరువముల నారబోయు
    రమణి కనిపించ చూపు మరల్చ లేడు
    విష గళుండైన, నవధాని వినుతి కెక్కు
    విమల మతియౌచు మెప్పింప పృచ్ఛకులను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. కృషిగల పండితుల్ విజయ కేతన మంబరమంటు రీతిగన్
      ధిషణత యున్న పృచ్ఛకుల ధీటగు ప్రశ్నల కెల్ల తాను పా
      యసమును గ్రోలుచందమున యాశువు పద్యము లెన్నొ చెప్పు ని
      ర్విషగళుడైనచో మిగుల విశ్రుతి కెక్కువధాని మాన్యుడై

      తొలగించండి
    3. విరించి గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      "చందమున నాశువు.." అనండి.

      తొలగించండి
  33. శివుడు!జగతియుగనలేని భవితనొసగి!
    జీవకోటికి రక్షణచెంతజేర్చి
    సంతసంబునునిల్పగ "చెంతనున్న
    విషగళుండైన నవధాని వినుతికెక్కె"

    రిప్లయితొలగించండి
  34. చేరి పృచ్ఛకు లచ్చోట చిలికి చిలికి
    విషయ మొక్కటి కురిపించే విషమునచట,
    శివుని యంశతో యవధాని శివము బలుకఁ
    విష గ ళుం డైన నవధాని వినుతి కెక్కు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కురిపించే' అన్నది వ్యావహారికం. 'కురిపించు' అనండి.

      తొలగించండి
  35. విషయము స్పష్టమై తనర, వేగసువిస్ఫురితార్థసంగతిన్

    తృషలను దీర్చ సత్కవనదీధితిఁ, బ్రష్ట లవాక్కులౌ గతిన్,

    ధిషణయు శోభిలం, గపటధిక్కృతదుస్స్వరమత్సరోక్తిని

    ర్విషగళుడైనచో మిగుల విశ్రుతికెక్కు వధాని మాన్యుడై.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి


  36. కుకవి నెవ్వరు మెచ్చరు కువలయాన
    విషగళుండైన,నవధాని వినుతి కెక్కె
    చక్కని పదములను వాడ సభల యందు
    ప్రస్తు తింతురెల్లరతని వాసి గాను.

    రిప్లయితొలగించండి
  37. రసిక జనుల మెప్పు బడసి రమ్యముగను

    కసిగ నధిక ప్రసంగిని కరచి విరిచి

    శషభిషలు చాలురాయని శాపమిడుచు

    విషగళుండైన నవధాని వినుతి కెక్కు :)

    రిప్లయితొలగించండి
  38. విషయము లన్ని నేర్చుచును విద్యల నన్నిట నారితేరుచున్
    ధిషణుని వోలె దీపిలుచు త్రెంచుచు కైపద జాలమందునన్
    శషభిషలన్నిటిన్ మిగుల శ్రావ్యపు రీతిని పృచ్ఛకాళికిన్
    విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై!

    రిప్లయితొలగించండి