24, సెప్టెంబర్ 2018, సోమవారం

సమస్య - 2798 (మిడుఁగుఱుల వెల్గులో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె"
(లేదా...)
"మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్"

56 కామెంట్‌లు:

  1. నీతి నియమము లేనట్టి నేతలుండ
    పడుచు లేచుచు గ్రుడ్డిగ పరవశించి
    భరత వర్షము సాగెగ ప్రజల మతిని...
    మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె :)

    రిప్లయితొలగించండి

  2. రవి కులమున బుట్టిన రాఘవుండు
    సతి నపహరించిన యసుర పతిని జంపె
    వానర యూధము తోడుగ వాసిగాను
    మిడుగురుల వెల్గులో రవి మింట సాగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వడిగొని రామ మంత్రమును వానర యూధము యుద్ధమందునన్
      కడలికి వారధిన్ నిలుప కారణజన్ముడు రామమూర్తియే
      సిడిముడి సేయగా యసుర సేనలు చిందరవంద రయ్యెనన్
      మిణుగురు దారిచూపగను మింటను సూర్యుడు సాగె సూటిగన్!

      తొలగించండి


  3. అగొ! గ్రహణము! సంపూర్ణము గా జిలేబి,
    రాత్రి యయ్యెననుచు రాగ రయత గాను
    మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
    కొన్ని నిమిషముల తొలగె గొర్వుమైల!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👏👏👏

      అర నిమిషమ్మున జిలేబి!
      మిఱిమిడిగా లేచె నెట్లు మిడుగుఱు పురుగుల్?

      తొలగించండి


    2. అర నిమిషమున జిలేబీ
      మిఱిమిడిగా లేచె నెట్లు మిడుగుఱు పురుగుల్?
      నరయంగ విట్టుబాబ
      య్య రయ్యనుచు ద్రోల గా వయారము గనుచున్ :)


      జిలేబి

      తొలగించండి

  4. జీ పీ యెస్ వారి గొర్వుచీకటి లో కై పద "సంహారం" :)

    అగొ! ప్రభాకరు డదె శంకరాభరణము
    మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
    కై పదముల పూరించుచు కవివరుడన
    నతడగు జిలేబి విడువడు నౌకబికయు.


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. తిమిర మందున జగమంత తేలు చుండ
    న్యాయ మన్యాయ మనునవి మాయ గాను
    గుడ్ల గూబల గ్రద్దల ఘోష నడుమ
    మిడుఁ గుఱుల వెల్గులో రవి మింట సాగె

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    చెడువ్యసనమ్ము మద్యము రుచించి చరించెడి తండ్రిఁగాంచి , పు...
    త్రుడు హితబోధ జేయ , విని, దుష్టవిధానము మాని , సద్గతిన్
    నడుచుట గాంచి లోకులిటు నవ్వుచు బల్కిరి , వింత జూడుమా!
    మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దానకర్ణుడు.....

      అడుగగ వచ్చుచుండెనమరాధిపుడల్లదె కుండలమ్ములన్
      వడినిడ మేలుకాదనగ భానుడు , తండ్రి ! మహేంద్రహస్తమే
      యడుగుచు క్రిందనుండ పయి హస్తము నాదగు గాదె ! పొమ్మనెన్
      మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. Velige panchaanga shuddhisthha vela yanuchu
    Paalanannoosu thoa mudi baraga betti
    Ye:lu mundasthu thikmaka ye:lika yaye
    midugurula velgu loa ravi minta saage

    రిప్లయితొలగించండి

  8. జీ పీ యెస్ వారి కటికిచీకటి కైపద సంహారం :)


    అడిగిన తక్షణమ్ము భళి యాతడు వచ్చుచు పద్య మాలికన్
    గడగడ గట్టి దేశమును కాల్చు సమస్యల పైన వేడిగా
    జడలమెకమ్ము కైవడిగ ఝాడిచి కైపదమున్, జిలేబియా
    మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాహ్! ఏమి కిట్టింపిది 👇


      పడుచు లతాంగి గైకొని శుభమ్ముగ పున్నమి వెన్నెలందు నే
      దడబడ పాఱ శీతలుడు దాగగ మబ్బుల నిల్లు జేరితిన్
      మిడుఁగుఱు దారిఁ జూపఁగను;...మింటను సూర్యుఁడు సాగె సూటిగన్
      గడబడ లేక పశ్చిమపు కానల క్రుంగుచు పూర్వ రాశికిన్ :)

      తొలగించండి
  9. ('మింట' అనే పేరున్న అడవిలో 'రవి' అనే వ్యక్తి ప్రయాణం)

    దుర్గమారణ్య మది 'మింట', త్రోవ కనులఁ
    బడని గాఢాంధకారమ్ము, పల్లె కిప్పు
    డేగవలసిన యక్కఱ నెంచుకొనుచు
    మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె.

    రిప్లయితొలగించండి
  10. ఆ బృహన్నల సారధ్య మందు నేను
    రణము కేగిన నవ్వరే జనులు గాంచి
    మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
    ననుచు యెగతాళి జేయరే యవని నృపులు.

    రిప్లయితొలగించండి
  11. కరువు మేఘాలు క్రమ్మ గా కర్షకుండు
    పంట లెండగ బ్రతుకు ట భార మైన
    మిణుగురు ల వెల్గు లో రవి మింట సాగె
    నను కరణి గ జీవించు తా నప్పు జేసి

    రిప్లయితొలగించండి
  12. : అడవిలో సాగె ముదమున నాటవికుడు
    కటికచీకటి మయమైనఁ గలక లేక
    మిడుఁగుఱుల వెల్గులో, రవి మింట సాగె
    సమయ పాలన చేయుచు స్యందనమున

    రిప్లయితొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2798
    సమస్య :: మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుడు సాగె సూటిగన్.
    మిడుఁగుఱు పురుగు దారి చూపిస్తూ ఉంటే సూర్యుడు ఆకాశంలో సూటిగా ముందుకు వెళ్లినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: దక్షుడు మొదలుపెట్టిన నిరీశ్వర యాగానికి వెళ్లడం భర్తకు ఇష్టం లేకున్నా సతీదేవి వెళ్లింది. తండ్రియైన దక్షుడు చేసిన శివనిందను భరించలేక ఆమె యోగాగ్నిని కల్పించుకొని తన శరీరాన్ని దహింపజేసికొని ప్రాణమును విడిచిపెట్టింది. ఉగ్రుడైన శివుడు తన అంశగా వీరభద్రుని సృష్టించి దక్షుడు చేసే యజ్ఞాన్ని ధ్వంసం చేయమని పంపించగా అతడు వెళ్లి దక్షుని తలను నఱికివేశాడు. అంతటా చీకటి వ్యాపించింది. ఆ సమయంలో వీరభద్రుని కన్నులు మిడుఁగుఱులను అంటే అగ్నికణాలను బయటకు వ్యాపింపజేస్తూ ఉండగా దేవతలందరూ ఎంతగానో భయపడి పాఱిపోసాగినారు. అప్పుడు ఆ దక్షయజ్ఞానికి వచ్చియుండిన సూర్యుడు కూడా భయపడినవాడై తక్షణమే అక్కడినుండి కదలిపోవడం మేలని అనుకొంటూ ఆ మిడుఁగుఱుల (అగ్నికణాల) వెలుతురు దారి చూపగా వెళ్లిపోయిన సందర్భం.

    విడువగ బ్రాణమున్ సతియె, వేగ శివాంశగ వీరభద్రుడే
    వడి జని దక్షయజ్ఞమును ధ్వంసము జేయ, తదక్షిజాతముల్
    మిడుఁగుఱు లంతటన్ మెఱయ, మేలగు నేగుట యంచు భీతితో
    మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుడు సాగె సూటిగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (24-9-2018)

    రిప్లయితొలగించండి
  14. ఏ వెలుగునిశి కనలేమ దేదియైన?
    నేడు గుఱ్ఱాల తేరుపై నెవరు తిరుగు?
    నెగుర వేసినట్టి పతంగ మేడ సాగె?
    మిడుఁగుఱుల వెల్గులో ; రవి ;మింట సాగె !

    రిప్లయితొలగించండి
  15. పరుగులెత్తెను పగలంత పంచి కాంతి
    రమణులెవ్వరు పిలిచిరో రాత్రివేళ
    తారలటమిన్కు మినుకంచు దారి జూప
    మిడుఁ గుఱుల వెల్గులో రవి మింట సాగె..

    రిప్లయితొలగించండి
  16. కటిక పేదల దయనీయ గాధ లెల్ల
    సంఘమున గాంచ నా కథల్ సాగుచుండ
    రవి యనెడు నేను వెల్గితి రచయత యన
    మిణుగురుల వెల్గులో రవి మింట సాగె.
    (నా పేరుని ఇరికించుకున్నాను. పేదవారి వ్యథలు నాకు రచయితగా మార్గాన్ని చూపాయి)

    రిప్లయితొలగించండి
  17. సమస్య :-
    "మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె"

    *తే.గీ**

    దేశమున చిన్న పార్టీల తీరు మారి
    గెలుపు బాటన పయనించి వెలిగిపోయె
    కాంగిరేసుపార్టీ నాడు కలిసిపోయి
    మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
    ....‌‌................✍చక్రి

    రిప్లయితొలగించండి
  18. అన్నికోట్ల ప్రజావళి యాశదీర్ప
    నొక్కగాంధి చూపెను బాట చక్కగాను ;
    తెల్లవారి మొగమ్ములు తెల్లబోవ
    మిడుగురుల వెల్గులో రవి మింట సాగె .

    రిప్లయితొలగించండి
  19. ఎడరి, విరాటుఁ గొల్వు బ్రతుకీడ్చిరి పాండవు లట్లు దుర్దశన్,
    బెడిదపుఁ గాటికాపరుల వృత్తి వహించె ధరాధినాథుడే,

    యిడుముల నిట్లు దార్కొనుట నీశునకైనను సాజమే కదా!

    మిడుగుఱు దారి జూపగను మింటను సూర్యుడు సాగె సూటిగన్.

    కంజర్ల రామాచార్య.








    రిప్లయితొలగించండి
  20. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ========================
    మిణుగురు దారి జూపగను
    మింటను సూర్యుడు సాగె సూటిగన్
    =========================
    అల్పమైన మిణుగురు పురుగు దారి
    చూపగ అనల్పమైన సూర్యుడు అను
    సరిస్తు ఆకాశంలో ముందుకు సాగిపో
    యినాడనుటలో అసంబద్దతె సమస్య
    =========================
    సమస్యా పూరణం- 264
    ==================

    అధర్మము గెంటు చుండ -
    ధర్మము రెండు కాళ్ళుగ కుంటుచుండె
    సర్వము కలిని మునిగి ఉండ-
    వేలి ముద్ర రాజ్యమేలు చుండె
    అయ్యో తెలివి తెల్లమొగమేయగను-
    గిలివి చెలరేగె ఘాటుగన్
    మిణుగురు దారి జూపగను -
    మింటను సూర్యుడు సాగె సూటిగన్

    ====##$##====

    గడబిడ శాఖామాత్యులు మిణుగురు
    పురుగేశ్వర్ ముందు సాగుతుండ 1980
    సివిల్స్ బ్యాచ్ ప్రధాన సచివుడు ( Chief
    Secretary) భాస్కర్ రావ్ చంకలో ఫైలుతో
    వెనుక అనుసరించు చుండె.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ----- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  21. స్వానుభవమునవ్రాసితిస్వామి!యిదియ
    వచ్చితింటికినొకరేయిభయముతోడ
    మిడుగురులవెల్గులో,రవిమింటసాగె
    దనదుకిరణాలకాంతితోదనరిమిగుల
    జగతినుపకృతులకిదియసహజగుణము

    రిప్లయితొలగించండి
  22. చంపకమాల
    వడిగొని మౌనిమంత్రమును భానుని వేడఁగ కుంతి యాతృతన్
    బుడమిని జేరి వాంఛితకు పుత్రునొసంగుచు నుత్సుకత్వమే
    దడబడఁ జేయ నా తరుణి దాంతముఁ జిందిన నిప్పుకన్నులన్
    మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్

    రిప్లయితొలగించండి
  23. కడుభయమొందుచుండియునుగాంచితినింటినినెట్టకేలకున్
    మిడుగురుదారిచూపగను,మింటనుసూర్యుడుసాగెసూటిగన్
    బుడమికినీయవెల్తురునుబూర్వపుదిక్కుననుధ్భవించిదా
    వడివడియైననశ్వములుబాఱుచునేగగబశ్చిమాద్రికిన్

    రిప్లయితొలగించండి
  24. ఇడుములు దాటిపోవగనెనెల్లసుఖంబులు వెల్లువెత్తు మే
    ఘుడు తొలగంగనెండయును గొప్పగ తీవ్రతనొందునెట్టులో
    వెడలగ చీకటుల్ భువిని వెల్గులు నిండగ స్వాగతమ్ముగా
    మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్"*

    రిప్లయితొలగించండి
  25. పద్మములు తటాకమ్ములఁ బాలివోవ
    నీడజమ్ములు సాగఁగ గూడులకును
    నాల మంద వోఁ జాగ గోశాల కంత
    మిడుఁగుఱుల వెల్గులో, రవి మింట సాగె


    అడరఁగఁ గాలకేయుల సురాధిపు పంపునఁ జంపెఁ బోరునన్
    జడియక పందికై యెఱుకు జాజర నున్న శివుం బెనంగెనే
    కడు వెఱఁ గయ్యె మాత్స్యునకుఁ గవ్వడి సారథి యయ్యె నక్కటా
    మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్

    రిప్లయితొలగించండి
  26. సూర్యగ్రహణ విశేషము

    చ.మా.
    కడివెడు కంద కూడ నొక కత్తికి లోకువ యన్న చందమై
    వడలెను భానుడా యగువు బారిన చిక్కుట నాదినమ్మునన్
    వడిగను నాకశమ్ముఁ గనఁ దారలు ద్యోతక మౌటఁ దోచెగా
    *"మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్"*

    రిప్లయితొలగించండి
  27. జాంబవంతుడు హనుమంతునితో....

    కడలిని దాటు సత్త గల గండరగండడి వీవు గాదుటే
    పుడమిని మించు నెవ్వడట పూషణుఁ శిష్యుని, వానరుల్ భువిన్
    గడసరి యాంజనేయుని ప్రకాశమెఱుంగరు గాంచినంతనే
    మిడుగుఱు దారిజూపగను మింటను సూర్యుడు సాగె సూటిగన్

    రిప్లయితొలగించండి
  28. అమవసిన చిమ్మచీకటి యందునపుడు
    యిలపయిన వేడుకలు ప్రతియింట సాగె
    మిడుగుఱుల వెల్గులో; రవి మింట సాగె
    పగటి పూటన వెలుగునింపార జేయ

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    "మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను
    సూర్యుఁడు సాగె సూటిగన్"

    సందర్భము: సీతాన్వేషణలో లంకకు చేరిన హనుమంతుడు సీతను దర్శించినాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణ సభలో ప్రవేశించినాడు.
    సీత నప్పగించు మని రావణునికి హితవు చెప్పినాడు. రావణుని కవి కారు కూతల వలె (వ్యర్థ ప్రలాపముల వలె) తోచినవి.
    నీవయిన కారులు నే విన నిట్లు బల్కరే!.. అంటే..
    1) నీ పిచ్చి మాటలు నేను వినగా (వింటే) ఇలా పలుకుతారు గదా! అనీ...
    2) నీ మాటలు నేను వినను.. ఇలా పలుకరే జనాలు.. అనీ..
    రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
    ఆ సందర్భంలో "నీ మాటలు నేను వింటే మిణుగురు పురుగు చూపిన దారిలో సూర్యుడు సాగిపోయిన ట్లుంటుం" దని చెబుతూ పావనితో రావణుడు పలికిన మాట లివి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మిడుగుఱు వంటి వాడ విల..
    మింటఁ బ్రభాకరు వంటి వాడనే!..
    వడకుదు రెట్టి దేవతలు
    వాకొన నాకడ.. కోతి చేష్ట.. లీ
    గడబిడ లేల? నీ వయిన
    కాఱులు నే విన నిట్లు బల్కరే!..
    "మిడుఁగుఱు దారిఁ జూపఁగను
    మింటను సూర్యుఁడు సాగె సూటిగన్"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    24.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  30. తేటగీతి
    మౌని మంత్రము తోడ కుమారి కుంతి
    సూర్యదేవుని రప్పించి సుతుని బొందె
    తత్తరపడఁగ నెర్రనౌ తరుణి కనుల
    మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె

    రిప్లయితొలగించండి
  31. కుడువగ నేర్పుఁ దల్లి, యడుగుల్ వడి వేయగ నేర్పుఁ దండ్రియున్,

    నడవడి నక్కరమ్ములన నంతరవిద్యల నొజ్జ నేర్పగా,

    నెడపక నున్నతస్థితులు నేర్పడఁ గీర్తుల వెల్గె నట్లుగా

    మిడుగురు దారి చూపగను మింటను సూర్యుడు సాగె సూటిగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  32. డా…పిట్టా…సత్యనారాయణ
    వెలిగెపంచాంగ శుద్ధిిిిస్థ వేేేేళయనుచు
    పాలనన్నూసుతోముడి బరగ బెట్టి
    యేలి ముందస్తు తికమక యేలిక యయె
    మిడుగుఱుల వెల్గులో రవి మింట సాగె

    రిప్లయితొలగించండి
  33. డా…పిట్టా సత్యనారాయణ
    కడుగడనాళి చేరె బహుకార్యసునిర్వహణంపుపెంపునన్
    వడిగల మంత్రముల్ జెలగ వచ్చునె శత్ర్రువు చావు హద్దులన్
    పడిపడి పంచవర్షములపాలన డింపున నాలుగేళ్ళయెన్
    బడుగులగాచు జన్నమదె భ్రష్టవ జూడమె జోష్య మెన్నగన్
    మిడుగుఱుదారిజూపగను మింటనుసూర్యుడు సాగె సూటిగన్

    రిప్లయితొలగించండి
  34. జడవక నాంగ్ల దండులకు చౌకది కర్రను చేతబట్టుచున్
    విడువక ధర్మ మార్గమును భీతిని వీడుచు జైలు చేరుచున్
    పడుచును లేచి పర్వులిడి భారత మాతకు ముక్తిదెచ్చెనే!👇
    మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్

    రిప్లయితొలగించండి