17, డిసెంబర్ 2018, సోమవారం

దత్తపది - 150 (ఏక్-దస్‍-సౌ-హజార్)

ఏక్ - దస్ - సౌ - హజార్
పై పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. కురుసభకు పోతున్న కృష్ణునితో ధర్మరాజు పలుకులు....

    'ఏ కు'టిల భావములు లేక హితముఁ దలఁచి
    నీదు ప'ద సు'మముల నెద నిల్పినాఁడ
    మాకు 'సౌ'ఖ్య సంపద లెంచి మానితముగఁ
    గూర్తువా సంధి నిఁక స'హజార్తి' దొలఁగ.

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    బలమేకమ్మన సాధనమ్మగునె నిర్బంధింపగా భామినిన్ ? .,
    దలపన్ మత్పతులేవురుండిరట మేదస్సున్ హరింపంగ , నీ
    తలపున్ మార్చుకొనంగ మేలగును , సౌందర్యమ్మనన్ నిత్యమే ? ,
    దలపంగా సుమదేహ జారుగొనునే ? ధర్మమ్మొకో కీచకా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. ద్రౌపది ఆవేదన

    ఈ స(దస్య)మునందు నెందరో పెద్దలు సుఖముగ కూర్చుండి శోభ గాంచు
    చుంటిరి ,ధర్మము చూడరా ?(ఏక్కు)ను కలిగించు మాటలు పలుకె దుష్ట
    దుర్యోధనుడు, యిట్టి కార్యము ధర్మమా ?(సౌ)oదర్యవతినని సరస మాడ
    దగునా?పరునిభార్య తల్లితో సమముగాదా? నాదు పతులెల్ల మౌన గతిని
    కూరు చుండిరి ,యిక దిక్కుగొల్ల నయ్య,
    సరియగనుగ నాదు నపో(హ, జారు) చుండె
    వలువలు గిరిధరా కాచ వలెను నీవె
    యనుచు వేడెను పాంచాలి వినతు లిడుచు

    రిప్లయితొలగించండి
  4. (ఏకు)లంబునకులకాంతలీ స(దస్యు)
    లట్టిసభలన (సౌ)కర్యమట్టహాస
    దురితమొనరించియస(హజార్తు) లనొనర్చి
    కట్టడినిబెట్టిరీరామకలతమాన్పు

    ద్రౌపది కృష్ణరాయభారానికి ముందు కృష్ణుని తో ఆరడిని వివరిస్తూ...

    రిప్లయితొలగించండి
  5. ( సుదేష్ణ పంపగా సురకోసం వచ్చిన సైరంధ్రితో కీచకుడు)
    ఏకు మేకైన యట్లుగ నిట్లు పలుక
    దగునె ? నా మీద సుందరి ! దయను జూపు ;
    సరససౌందర్యలహరివై దరికి జేరు ;
    మహహ ! జారుచుండెను మన ; మంబుజాక్షి !

    రిప్లయితొలగించండి
  6. ఏక్చత్ర పురము నందున నేక తముగ
    ఇడుము లన్నిట సౌరని జడుసు కొనక
    దస[స్] దిశలందు దిరుగుచు దైత్య వధను
    విరటు ముంగిట హజార్మై వెలితి పడక

    రిప్లయితొలగించండి
  7. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    ఇచ్చిన పదాలు : ఏక్-దస్-సౌ-హజార్
    విషయము :: భారతార్థం
    ఛందస్సు :: ఏ పద్యమైనా సరే
    సందర్భం :: కురుక్షేత్ర రణరంగంలో తన కుమారుడైన అర్జునునికి విజయం కలగాలి అని భావించిన దేవేంద్రుడు సూర్యుని కుమారుని సమీపించి “ఓ కర్ణా! గొప్పగా దానములను చేసి నీవు దానకర్ణుడుగా పేరు పొందినావు. నేను కోరినది కూడా (అది ఏదైనా సరే) ఇస్తానని వాగ్దానం చేశావు. నాకు ఎటువంటి సంపదలూ వద్దు. నీ పుట్టుకతో పాటు నీ దేహమున పుట్టియున్న ఈ కవచకుండలములను నాకు దానంగా ఇవ్వు” అని చేతులు చాచి అడిగిన సందర్భం.

    ఇచ్చెద నంచు బల్కితివి ‘యేక’మనేకము నైన కర్ణ! నిన్
    మెచ్చెద, మెచ్చ సంపదల మేలని, ‘దస్త్ర’ము లొల్ల, వట్టిగా
    బుచ్చకు, ‘సౌ’మనస్యమున పొంగుచు కోరిన దిమ్ము, కౌగిటన్
    గ్రుచ్చెద, నిమ్ము నీ కవచకుండలముల్ వర దే’హజార్థ’ముల్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-12-2018)

    రిప్లయితొలగించండి
  8. డా. పిట్టా సత్యనారాయణ
    ఎక్-దస్-సౌ-హజార్ కహతేహి తమామ్ జగత్ ప్రసిద్ధ స
    ద్వాక్ యె బనేగి మత్లబి యవాక్ బనోగె సునో కహాని, వో
    ఏకహి కర్త కృష్ణ్ బఢె యే దస్ ఓర్ మ(ం)జూర్ హో
    ధాక్ జమాయె పాంచ్ నర్ థామ్ కె సౌ నరనాథ్ కౌరవోం
    కేక్ మహాన్ సు క్షేత్రమె జమే బర్ బాద్ హజారొ ఫౌజియోం
    కేక్ హి జీత్ ధర్మ్కకె ఫకీర్ కి ఔర్ హొ హార్ హుషారి కీ!

    రిప్లయితొలగించండి
  9. రాయబారి శ్రీకృష్ ణుని తో సుయోధనుడు --___
    ఏక పక్షము వహియించి యిట్లు పలుక
    వల ద సమ శౌర్య యుతు ల మై పాండవుల ను
    మట్టు బెట్టి మనుట సౌఖ్య మగును గాన
    భయపు టూ హ జా ర్తులొ నర్ప ఫలి త మేమి ?

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి వరంగల్ వెళ్తున్నాను. నేడు, రేపు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  11. ఏకలవ్యుడు వ్రేలుఁగోసిచ్చె భక్తి--
    రమణి నింద సముద్భవ రామ యయ్యె--
    పాండవాదులు సౌవర్ణ వర్జ్యులైరి --
    మోహజారుణ వర్ణుడై మురిసె రాజు.

    రమణి = ద్రౌపది
    రాజు=దుర్యోధనుడు

    రిప్లయితొలగించండి
  12. ఏక్ నిరంజనుండు ఏలిక మనకని
    నమ్మి కొలిచె సౌమనసమున, హరి
    దస్ యవతరణముల తారకునిన్, కుంతి
    దయకలిగె హజార్ విధముల పొగడ

    రిప్లయితొలగించండి
  13. వెలిగె నేకైక వీరుడై విజయు సూను
    డగునె శౌర్యేన బింబమ్మ దస్తమయమె?
    యతని సౌరును బొగడంగ నజుని తరమె?
    యూహ జారును గొప్పదౌ యుక్తి కైన !

    రిప్లయితొలగించండి
  14. రిపు వీ రానేక భయద
    సపురస్సర సౌకుమార్య శత జన వృతుఁ డా
    విపుల స్కంధుఁడు భీముం
    డపుడు హజారమున నిలిచె నానందముగన్

    రిప్లయితొలగించండి
  15. కీచకుడు ద్రౌపదితో నాడిన మాటలుగా నూహించి..............

    ఏకులాంగన నినుబోలి యింత వరకు
    దసలు పడలేదు నాకయ్యె తరుణి వినుము
    నీదు సహజారుణిమ దాల్చె నేత్రము లను
    గాంచి మురిసితిన్ సౌగంధి కరుణ జూపు.

    రిప్లయితొలగించండి
  16. సౌగంధిక పుష్పమ్మును
    వేగముగా తెచ్చుకొరకు వెడలెద సఖియా
    ఆగగనంబహ జారిన
    నాగకనేకదలెదననె యనిలాత్మజుడే. .

    రిప్లయితొలగించండి
  17. ఏకవస్త్ర తనను యీడుచుగొనితెచ్చి
    రీ సదస్సునందు లేది ధర్మ?
    మూరకుందురు మహ జార సములు మీరు
    ఔరు సౌరు పడెను గౌరవమ్ము ౹౹
    (వస్త్రాపహరణ సందర్భంలో ద్రౌపది మాటలు కురుసభని ఉద్దేశించి)

    రిప్లయితొలగించండి
  18. ఏక్సమూహము నందున నేక బిగిని
    సమర మొక్కటె నాకిట సౌఖ్య మనగ
    దస్దిశల పోర గల్లెడి దాన కర్ణు
    జూచి తహహజారెను నాదు సూక్ష్మ మనసు

    నిన్నటి సమస్యకు నా పూరణ

    పూజ లెన్నడు సలుపవు పూని భక్తి
    వల్లె వేయవ దెన్నడు వ్రత కధలను
    నిష్ఠతో నుండ జూడవు నిత్య మీవు
    రమణి ! పాపమ్ము గద పాశురములఁ జదువ

    రిప్లయితొలగించండి
  19. *ఏక* వస్త్రను నాకు ది క్కెవరటంచు
    చారు దే*హ జారు* పయిట వారణమ్ము
    సలుపుచు స*దస్సు*న గల పతులను గాంచి
    ఏడ్చె సౌజన్య వతి తిట్టి హీనులనుచు

    రిప్లయితొలగించండి
  20. క్రమపుణ్యప్రదచాపసంక్రమణమౌ, రాజత్తిరుప్పావునన్

    రమణీయాద్భుతభక్తిభావరచనారంగేశబోధార్థసం

    గమగోదానిగమాంతసారవిలసత్కావ్యోక్తులై, యేలనో!

    రమణీ! పా‌శురముల్, పఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  21. 'ఏక' చక్రపుర జనత యెదుట, బకుని
    పీచమణచ 'దస' లుపడ్డ భీమసేను
    'సౌ' ష్ఠవమును గాంచి తలచసాగిరిటుల
    "యి'హ జారు' నాయసురుని యిడుము" లనుచు

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టా నుండి
    ఆర్యా, నా పూరణములో మూడవ పాదంలో"యే దస్ ఓర్ సదా మ(అరసున్న)జూర్ హో"అని ఉండాలి
    సవరణ తో సమీక్షించండి

    రిప్లయితొలగించండి
  23. ఇంద్రలోకంలో అర్జునునితో ఊర్వశి...
    కందం
    జగదేకవీరుడవనుచుఁ
    దెగవిని ముందస్తు చరిత దివికన్యను నీ
    మగటమినా సౌందర్యము
    రగిలించెడు నూహ జార్చ! రసికతలివియా?

    రిప్లయితొలగించండి
  24. రాజ *హజారు* లోనగురు రాజుకుయుక్తికి బంధనమ్ము రా
    రాజుక *నేక* మార్లుసమ రాంగణమందునభంగపాటు నా
    యాజిస *దస్యు* లంతమను యాదవసింహునిరాయభారమే
    సాజము *సౌ* మనస్యమయి *సౌ* రు *హజారు* స *దస్యు* *లే క* నన్

    రిప్లయితొలగించండి
  25. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂దత్తపది 🤷‍♀....................
    *ఏక్ - దస్ - సౌ - హజార్*

    పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో మీకు
    నచ్చిన ఛందస్సులో పద్యం

    సందర్భము: కృష్ణు డనే వేదాంతి యొక్క ఏక్తార లాంటివాడు క్రీడి (అర్జునుడు). ధర్ముని (యమధర్మరాజు) యొక్క దస్కతు (సంతకం) లాంటి వాడు ధర్మరాజు.
    ఆత్మ సౌందర్యం వారి సొంత మనవచ్చు. అలాంటి వాళ్ళను స్మరిస్తే చాలు భౌతికమైన ఈహ (కోరిక) జారిపోతుంది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కృష్ణ వేదాంతి యేక్తార క్రీడి యగును..

    ధర్మజుండు ధర్మునియొక్క దస్కతు సుమ!..

    వసుధ నాత్మ సౌందర్యమే వారి సొంత..

    మీహ జార్ వారలన్ స్మరియించినంత

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    17.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి