6, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2866 (త్రాగిన మానవులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్"
(లేదా...)
"త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్"

67 కామెంట్‌లు:

  1. యోగము భోగము మీరగ
    రాగము తాళమును జేర్చి రాముని భజనన్
    త్యాగయ పాదామృతమును
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    రిప్లయితొలగించండి
  2. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    సందర్భము: కాఫీగురించి యొక రంటున్నా రిలా...
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    బాగ విరేచన మౌ నని
    వేగిరముగ లేవగానె వింతగ కాఫీ
    తేగా నాదర బాదర
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బాగ' శబ్దసాధుత్వంపై సందేహం.

      తొలగించండి
  3. రాగానురాగశంకర
    యోగవిశిష్టతవిరాగియొ,యుమనుదాల్పన్
    భోగియొ,యద్వైతసుధన్
    త్రాగినమానవులు ధన్యతంగాంతురిలన్

    రిప్లయితొలగించండి
  4. భోగము ల న్ విడ నాడి యు
    యోగులు గా మారి భక్తి యుతు లై శివు నిన్
    ధీగు ణ ము ల రుచి కరముగ
    త్రాగిన మానవు లు ధన్యత oగాంతు రిలన్

    రిప్లయితొలగించండి
  5. త్యాగికిభోగికిభేదము
    రాగివిరాగులకునంతరంబెన్నరుగా
    త్రాగినమైకమమోఘము
    త్రాగినమానవులుధన్యతంగాంతురిలన్

    రిప్లయితొలగించండి
  6. భోగుల కైనను బహువిధ
    యోగుల కైన నమృతమయి యొప్పును గాదే!
    భోగింప రామ నామము
    "త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్"

    రిప్లయితొలగించండి
  7. డా. పిట్టా సత్యనారాయణ
    త్రాగక జీవిత మెల్లను
    త్రాగించగలేక నెవరి దట్టక నొకడై
    సాగని పనులకు బలిగాన్;
    త్రాగిన మానవులు ధన్యతం గాంతురిలన్

    రిప్లయితొలగించండి
  8. త్రాగిరితాపసోత్తములుత్రాగిరిభక్తులుముక్తిగోరుచున్
    త్రాగిరియోగిపుంగవులురాగివిరాగివికారమణ్చగన్
    త్రాగిరిజ్ఞానులర్థులుపరాత్పరుగీతసుధామృతంబునే
    *త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అణ్చగన్' అన్న రూపం సాధువు కాదు. "వికార మేగగన్" అనండి.

      తొలగించండి
  9. భోగములను విడి నిత్యము
    త్యాగములను చేయుచు సత మన్యులకొరకై
    రాగము హరి నామ సుధను
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    రిప్లయితొలగించండి
  10. డా పిట్టా సత్యనారాయణ
    మూగిన యంధకారమున(నంధకారమున)మున్కలు వేయుచు,స్వార్థ చింతనన్
    బ్రోగులు జేసి యీషణల బుక్కిట బట్టి యనంత జన్మలన్
    సాగిన నే ఫలంబు? సువిచారిగ రామ రసాయనంబునున్
    ద్రాగిన మానవోత్తములు ధన్యతగాంతురు లోకమందునన్

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గురుని సాటి దైవము
    ఆ గురు నామమున కన్న అర్చన లేదే
    శ్రీగురు నామామృతము
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దైవ। మ్మాగురు... కన్న నర్చన..." అనండి.

      తొలగించండి
  12. గురువు గారికి నమస్కారములతో

    శ్రీ గురుని సాటి దైవ
    మ్మా గురు నామమున కన్న నర్చన లేదే
    శ్రీగురు నామామృతము
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    రిప్లయితొలగించండి
  13. రోగసమూహనాశకనిరూహ్యమహాబలదాయకమ్ము, తా

    ధీగరిమప్రవర్ధకము,దీర్ఘవిలాసవయోనిదానమున్,

    శ్రీగుణసత్త్వకారకము, శ్రేష్ఠతఁ గూర్చెడు దివ్యగోసుధన్

    ద్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  14. త్రాగుడు గురు నామమును
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్
    దోగు గురు పాదముల కడ
    బాగెము గల్గున్ ముదముద బడకే మనసా

    రిప్లయితొలగించండి
  15. త్యాగమయస్వరూపులగు
    ధాత్రిజలక్ష్మణరామచంద్రులున్ ,
    వేగమె లంకకేగి విభు
    వీరము దెల్పిన యాంజనేయుడున్ ,
    దాగిన వాల్మికోచ్చలిత
    తాత్వికకావ్యరసామృతమ్మునే
    త్రాగిన ; మానవోత్తములు
    ధన్యత గాంతురు లోకమందునన్ .

    రిప్లయితొలగించండి
  16. ఆకాశవాణి సిబ్బందికి రేపు సెలవు కనుక 'సమస్యాపూరణ' కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం రికార్డ్ చేస్తామన్నారు. అన్నపరెడ్డి వారితో నేను వెళ్తున్నాను.
    ఇప్పటివరకు పూరణలను పంపని మిత్రులు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట లోగా పంపించండి.
    సమస్య...
    *కరణము నమ్మువారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయంబుగన్*

    మీ పూరణలను క్రింది చిరునామాకు పంపించండి.
    padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2866
    సమస్య :: త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్.
    *త్రాగిన వాళ్లే మానవులలో ఉత్తములు ధన్యులు ఔతారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఈ ప్రపంచము మాయతో కూడినటువంటిది. భ్రాంతిని కలిగించేటటువంటిది. కల వంటిది. నిజమైనటువంటిది కాదు. దుఃఖకారకములైన రాగద్వేషములను పెంచేటటువంటి ఈ సంసారము ఒక విష వృక్షము. ఈ విష వృక్షము రెండే రెండు అమృతఫలములను కలిగియున్నది. గొప్ప కావ్యములలో ఉన్న అమృత రసాన్ని ఆస్వాదించడం అనేది ఒక పండు. సజ్జనులతో సహవాసము చేయుట అనేది మఱియొక పండు. కావున సజ్జనులను ఆశ్రయించిన మానవులు, రామాయణము మొదలైన కావ్యములలో ఉన్న అమృత రసమును త్రాగిన మానవులు ఉత్తములు ధన్యులు ఔతారు అని విశదీకరించే సందర్భం.

    సంసార విషవృక్షస్య ద్వే ఏవ మధురే ఫలే।
    కావ్యామృత రసాస్వాదః సజ్జనై స్సంగతి స్తథా॥

    రాగము గూర్చు ద్వేషమిడురా విషవృక్షముగా ప్రపంచమే
    సాగు, నొసంగు కావ్యసుధ సజ్జనసంగతి యన్ ఫలమ్ములన్;
    వేగమె సజ్జనావళిని ప్రీతిగ జేరిన, కావ్యధీసుధన్
    త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (6-12-2018)

    రిప్లయితొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    సందర్భము: ఎన్నో తాగుతారు మానవులు. తాగితే ధన్యులు కావా లంటే మాత్రం హరి కీర్తన యనే అమృతంతోనే.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఆ గజరా జా పోతన
    త్యాగయ గోపనలు భక్తి తత్పరు లగుచున్
    ద్రాగిరి హరి కీర్తన సుధ..
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  19. తూగుచువాగుచునుందురు
    త్రాగినమానవులు,ధన్యతన్గాంతురిలన్
    నాగమవిధినర్చించిన
    నాగీతాకారునెపుడునధికపుభక్తిన్

    రిప్లయితొలగించండి
  20. త్రాగిన పన్నులు వచ్చు
    త్రాగిన పింఛను జనులకు త్రాగిన కలుగున్
    బాగుగ సంక్షేమంబు
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    రిప్లయితొలగించండి
  21. రోగములందున మునుగక
    భోగములందంగబోక ముక్తిని బొందన్
    సాగుచు రామ రసమ్మును
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    రసమయ కవితల నల్లక
    రుసరుస లాడుచునె బలుకు రుగ్మత గలుగన్
    పసగల కావ్యమనెడి నీ
    రసమయ కావ్యము , జనుల విరక్తులఁ జేయున్

    రిప్లయితొలగించండి
  22. వేగమ మందిరమునఁ దగ
    మూఁగుచు శ్రీరామ నవమి పూజల తోడన్
    వేఁగక మదిఁ బానకముం
    ద్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్


    ఆగమ సంచ యావన పరాత్మ రమాహృద యాబ్జ భాస్కర
    ప్రాగధినేత కీర్తిత సుపాద ధరా ధవ నామ గానముల్
    సాగుచు నుండ నిత్యమును శౌరి పదాంబుజ చింతనా సుధం
    ద్రాగిన మాన వోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్

    రిప్లయితొలగించండి
  23. భోగపు జీవితమ్ము విడి పుణ్యయుతమ్మగు మార్గ మందునన్
    సాగుచు నిశ్చలంపు మది శౌరిని నిత్యపు పూజ చేయుచున్
    రాగము తోడనిచ్చ రఘురాముని నామ సుధారసమ్మునున్ (నే)
    త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్

    రిప్లయితొలగించండి
  24. వ్రీగగ నరిషడ్వర్గము
    మ్రాగిన దోస ఫలమువలె మారక మందన్
    శ్రీ గంగాధరు తీర్ధము
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్ !

    "త్రయంబకం యజామహే ... ఊర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ "

    రిప్లయితొలగించండి
  25. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    (తెలంగాణా ఎన్నికల సమయము)

    భోగము భాగ్యనగ్రినిట! వోటుల వేళను వీధివీధులన్
    పోగులు జేరగా జనులు పూరిలు కూడగ కోడి బిర్యనిన్
    వేగమె నేతలిచ్చినవి వ్హిస్కిని రమ్మును నాటుసారనున్
    త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "Rs 86.5 Crore Cash, 4 Lakh Litres Of Liquor Seized In Telangana"

      https://www.google.co.in/amp/s/www.ndtv.com/telangana-news/in-telangana-rs-86-5-crore-cash-4-lakh-litres-of-liquor-seized-1958477%3Famp%3D1%26akamai-rum%3Doff

      తొలగించండి
  26. ఆగమశాస్త్రమేమిగులయాద్యమమంచునుగీతసారము
    న్ద్రాగినమానవోత్తములుధన్యతగాంతురులోకమందున
    న్ద్రాగినదాపసోత్తములుదాముగబొందిరిమోక్షమప్పుడు
    న్యాగముజేసినన్గలుగుయాగపుధన్యతయెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  27. 👌💐👍🙏🏼
    సాగుచుఁ బోవు జీవగతి సత్తునసత్తునెఱుంగఁ జాలమిన్
    రాగిలి రామనామమును రంజిలుచున్ బఠియించుచుండి, లో
    దాగిన రామ నామ సుధ తన్మయతన్ వర భక్తియుక్తులై
    త్రాగిన మానవోత్తములు ధన్యతఁగాంతురు లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  28. యాగము లేవియు జేయక
    బాగుగ భక్తిరసపూర్ణ భావనతోడన్
    రాగసుధామృతధారల
    *"త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్"*

    రిప్లయితొలగించండి
  29. ఆగుణ ధాముడు రాముడు
    నాగటిచాలును వరించు నళినాక్షుండౌ
    మేగలి నామామృతమును
    త్రాగిన మానవులు ధన్యతం గాంతురిలన్!!!

    మేగలి = శూరుడు

    రిప్లయితొలగించండి
  30. చాగంటి వారు చెప్పిరి
    భాగవతమె జాతికింక భద్రత నొసగున్
    భోగముఁ విడి భక్తి రసము
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్.

    రిప్లయితొలగించండి
  31. తీగను బోలు మేను వడి దిప్పిన యట్లుగ నున్న కౌను హా!
    సోగ కనుద్వయమ్ము ముకు సూటిగ నున్న చనుద్వయమ్ము సు
    స్వాగత రాగముల్ బలుకు భామిని మోవి సు ధారసమ్మునే
    త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్

    రిప్లయితొలగించండి
  32. మైలవరపు వారి పూరణ

    ఆగమమంత్రసారము , మహౌషధమౌ భవరోగబాధకున్ !
    త్రాగవె! జిహ్వికా ! మధురతారకనామసుధారసమ్మికన్ !
    త్యాగయ రామదాసులు ముదంబున త్రాగిరి ! ముక్తిఁ బొందిరే !
    త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  33. సాగగ సంతసామృత విశారదబంచినరాగరంజితా
    భగమె నన్నమయ్యకృతి!భావసుగంధబంధమే
    దాగగ!పాటబాడవినదగ్గదె"మానసమంతయున్ సదా
    త్రాగిన?మానవోత్తములు ధన్యతగాంతురులోకమందునన్

    రిప్లయితొలగించండి
  34. ఈ గతి నిహ పరములలో
    రాగద్వేషముల వీడి రయముగ నెపుడున్
    సాగగ గీతామృతమును
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్!

    రిప్లయితొలగించండి
  35. భోగపు వాడలం దిరుగి భోగపు సానుల పొందు కోరెడిన్
    భోగియె చెప్పె మిత్రులకు మోక్షము నందులభించు సద్గతుల్
    బాగరి పొందులోన గన వచ్చునిలన్ నధరామృతమ్మనే
    త్రాగిన మానవోత్తములు ధన్యత గాంతురు లోకమందునన్

    రిప్లయితొలగించండి


  36. ఆగమ వినుతునిసతతము
    రాగముతో కొలుచుచు పాడ నానందముతో
    నాగశయనునామసుధను
    త్రాగినమానవులుధన్యతగాంతురిలన్

    రిప్లయితొలగించండి
  37. భాగవత పద్యములనిల
    రాగముతోపాడుకొనగ రహియది కలుగున్
    వేగమె హరి నామ మధువును
    త్రాగిన మానవులు ధన్యత గాంతురిలన్.

    రిప్లయితొలగించండి
  38. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ...

    మూగిన దు:ఖ బాధలను మోదము తోదొలగించు శ్రేష్ట మౌ
    యోగులు సాధు సజ్జనుల యూధము కొల్చెడి నిర్మలోత్తమౌ
    రాఘవ రామచంద్రుడని రాజిలు నామ సుధామృతంబెసన్
    త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్"

    రిప్లయితొలగించండి
  39. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    త్రాగగ నేల నోయి భవరాగ విషాంబువు మూర్ఖచిత్తుడా ‌ !

    భోగము లన్ని మానుచు , విభుత్వ మహోన్నత మూర్తి యైన యా

    శ్రీగిరివాస నామ మధు శీకర ధార సతమ్ము భక్తితో

    త్రాగిన మానవోత్తములు ధన్యత గాంతురు లోక మందునన్

    రిప్లయితొలగించండి
  40. రాగము భావము లమరుచు
    యోగముగా గూడెగాద,యోగ్యతయొప్పన్
    త్యాగయ పాడిన సుధలను
    త్రాగిన మానవులు ధన్యతన్ గాంతురిలన్

    రిప్లయితొలగించండి
  41. శ్రీ గిరి పై వెలసి జనుల
    వేగిరమేగాతువయ్య వేంకటనాథా!
    నీగానామృత రసమును
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్.

    రిప్లయితొలగించండి
  42. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    సందర్భము: ఒకే పూట భోజనం చేసి రాత్రి వేళల్లో పాలొకటే తాగి పడుకోగలిగిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు యోగు లౌతున్నారు..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    యోగులు తా మగుదురు గద!
    భోగము విడనాడి యేక భుక్తముతో రా
    త్ర్యాగమమున పా లొక్కటి
    త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి