10, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2870 (చెడు గుణ మున్నపుడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"
(లేదా...)
"చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్"

102 కామెంట్‌లు:

  1. హడలక నెన్నిక లందున
    పడుచును లేచుచు పరిపరి భాగ్యపు నగరిన్
    తడబడకయె మిత్రుల ముం
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్ :)

    రిప్లయితొలగించండి
  2. అడుగడుగున యెదురయ్యెడు
    చెడుగని భీతిలక సతము చిచ్చర పిడుగై
    కడుధైర్యముతో నెదురిం
    చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.

    రిప్లయితొలగించండి
  3. మడిమాన్యము లడుగకయే
    జడి వానల వోలె పరుల సాయము కొఱకై
    వడి సంతోషముతో ని
    చ్చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    మిడి మిడి జ్ఞానము, ప్రాణమె
    కడు తీపిగ వేరు గణన గానని రీతిన్
    విడిగా దినియున్ ద్రాగెడు
    చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్

    రిప్లయితొలగించండి
  5. విడువక సద్వర్తన ము ను
    బుడమిని నంద రు నొక టను బొల్పగు బుద్ది న్
    త డ యక దీన జనుల గా
    చెడు గుణ మున్న పు డె యశము చేకు రు జగతి న్

    రిప్లయితొలగించండి
  6. నడతలు పరులకుహితమై
    పడతుల సోదరిగనెంచి భగవన్నుతియే
    పడవగుభవాబ్ధికని యెం
    చెడుగుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పడవ + అగు = పడవ యగు' అవుతుంది. సంధి లేదు.

      తొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    వడి గని చేయి జాచిన నవారిత దానమొసంగు దాతగాన్
    నడి రణ రంగమున్ జొరియు నాజిని బోరెడి జోదుగా మనన్
    బిడియము వీడి రాము దలపే సువిచా,ము గాగ ,దీను బ్రో
    చెడు గుణమున్నచో యశము చేకురు ధారుణి నెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా నుండి
    ఆర్యా,3వ పాదములో"సువిచారము"గా ,టైపాటును విస్మరించి మన్నించ గలరు.

    రిప్లయితొలగించండి
  9. అడచిన ధనమున కొంతయు
    యడిగిన పాత్రులకదనుగ యందింపగ, వా
    రెడనెడ సేవలు గావిం
    చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొంతయు నడిగిన... అదనుగ నందింపగ...' అనండి.

      తొలగించండి
  10. సమస్య :-
    "చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"

    *కందం*

    వడిగొని చిరు తప్పులకును
    విడిపోయెడు దంపతులకు విలువలు జెప్పన్
    కడు నేర్పున సంధానిం
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
    ‌.. ...................✍చక్రి

    రిప్లయితొలగించండి
  11. బిడియము లేకను నిరతము
    పెడ త్రోవను నడచు వాడు భేషజ మొప్పన్
    నడవడి మార్చుకు ప్రేమిం
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నడవడిని మార్చి ప్రేమిం...' అనండి.

      తొలగించండి
    2. బిడియము లేకను నిరతము
      పెడ త్రోవను నడచు వాడు భేషజ మొప్పన్
      నడవడిని మార్చి ప్రేమిం
      చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్

      తొలగించండి
  12. ఎడదమృడుండునుండ సిరి యెందుకు నాతడె తోడునీడ నె
    య్యెడజడచేతనల్ బుడమి నేడ గడంచుదలంచు బుణ్యుల
    న్నొడినిడికంటిరెప్పవలెనొడ్డుకు
    జేర్చునటంచు జెప్పి బ్రో
    చెడుగుణమున్నచోయశము చేకుఱుధారుణినెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
  13. అడిగినదెల నిచ్చి యశమార్జనఁ జేసెను గర్ణుడట్లుగన్

    సుడిగొని విత్తసర్వమిడి శోభిలె చంద్రమతీశుడయ్యెడన్

    మడియగ రాదు వెంట నణుమాత్రము దానఫలమ్ము దప్ప, ని

    చ్చెడు గుణమున్నచో యశము జేకురు ధారుణి నెల్లవేళలన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  14. కడుసుందర భావంబున
    నడుగిడు సామర్ధ్యముండి యన్యుల ఘనతన్
    తడయక సతతము కీర్తిం
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్.

    రిప్లయితొలగించండి
  15. ౧.
    కడుముదమున యాతనలను
    పడు పేద జనులఁ గాంచి పరిచర్యలతో
    కడఁగుచు ననురాగముఁ బం
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2870
    సమస్య :: చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్.
    *చెడ్డ గుణం ఉన్నట్లయితే అన్నివిధాలా కీర్తి లభిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం ::
    త్యజ దుర్జన సంసర్గం
    భజసాధు సమాగమం।
    కురు పుణ్యమహోరాత్రం
    స్మర నిత్య మనిత్యతాం॥ అనే శ్లోకం ద్వారా గురువు శిష్యునికి ఇలా ఉపదేశం చేస్తూ ఉన్నాడు.
    నాయనా! చెడు గుణాలున్న దుర్జనుల సహవాసాన్ని వదలివేసేయి. గొప్పవారైన సాధువులను సేవించెడు గుణముతో కాలం గడుపు. పుణ్యమును సంపాదించిపెట్టే మంచిపనులు చేయి. *ధర్మో రక్షతి రక్షితః* అని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ధర్మమును ఆచరించెడు గుణమును కలిగియుండుము. నీకు వెంటనే యోగక్షేమాలు సిద్ధిస్తాయి. కనిపించే ఈ లోకము అనిత్యమైనది అని నిత్యమూ (ఎల్లప్పుడూ) స్మరించెడు గుణమును కలిగియున్నట్లయితే నీకు అన్ని విధాలా గొప్ప కీర్తి లభిస్తుంది అని విశదీకరించే సందర్భం.

    చెడు గుణమున్న దుర్జనుల జేరకుమా, ఘన సాధులన్ భజిం
    చెడు గుణశాలివై మనుమ, చేయుమ పుణ్యము, ధర్మమున్ గణిం
    చెడు గుణమున్న భద్రమగు శీఘ్రమె, నిత్య మనిత్యమున్ స్మరిం
    చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-12-2018)

    రిప్లయితొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    ౧.
    "గడచిన ప్రభుత్వ మిట్టిది
    నడచిరి దుష్టంపుఁ ద్రోవ" నని తిట్టుచుఁ దాఁ
    గడపని నవజీవికఁ గాం
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్!

    ౨.
    కడునిడుములు ముసిరి ముసిరి
    తొడరి యుసురు తఱిగి తఱిగి తొలఁగఁగ నున్నన్
    దడయక పరమాత్ముని గొ
    ల్చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్!

    ౩.
    మిడిమిడి జ్ఞానముఁ జూపక,
    మిడుకక, శత్రులకు బన్న మెన్నఁ డిడక, తా
    నొడఁబడి పరహిత మునుఁ గూ
    ర్చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్!

    రిప్లయితొలగించండి
  18. ( మహాసేనాని తానాజీ సింహగఢ్ దుర్గాన్ని జయించటం )
    గడగడలాడ శాత్రవులు
    ఖడ్గము దూసిన ధీరమూర్తియై ;
    వడివడి బల్లెమున్ బగర
    భళ్లున వేసెడు వీరవర్యుడై ;
    తడబడకుండు తానజికి
    ధాటిగ సింహగఢంబునే జయిం
    చెడు గుణమున్నచో యశము
    చేకురు ధారుణి నెల్ల భంగులన్ .

    రిప్లయితొలగించండి
  19. గడగడవణకెడుచలిలో
    గడపగడపకునుజనుచునుగరుణతతోడన్
    నడుగకయేబీదలకి
    చ్చెడుగుణమున్నపుడెయశముచేకుఱుజగతిన్

    రిప్లయితొలగించండి
  20. అడుగడు గందునన్ మిగుల యారడి బెట్టెడి దుష్టలోకమున్
    కడువడి కీడు జేయ వెనుకాడని దుర్జను లున్న సంఘమున్
    బడుగుల నాదరించి పలు బాధల బాపగ గొప్ప ప్రేమ పం
    చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్ !

    రిప్లయితొలగించండి
  21. నడవడిగాంచి మోదమున నల్గురు మెచ్చెడి రీతి పోవుచున్
    దృఢమగు భక్తితో సిరి పతిన్ స్తుతియించుచు నెల్లవేళలన్
    బడుగుల భాదలన్ కనుచు బాధ్యత తో తగఁ బ్రేమ నిచ్చ పం
    చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
  22. సుడిగాళ్ళ మాయ లోకము
    వడివడి గా నిచ్చె నెక్కు వాటము తోడన్
    పడి యేడ్వ ఫలము లేదయ!
    చెడు గుణమున్నపుడె యశము జేకురు జగతిన్!

    రిప్లయితొలగించండి
  23. నిజంగా నిజం!

    గడబిడ లెందుకురా! యెం
    చెడి వారను ముంచగఁ దలచెడి *నేతలకున్*
    మడి గట్టుకు నుండక దో
    *"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"*

    రిప్లయితొలగించండి
  24. నా ప్రయత్నం :

    కందం
    కడు భక్తినిఁ బ్రహ్లాదుడుఁ
    బడుచుండియు పాట్లనెన్నొ భజియించి హరిన్
    బడసెన్ సేమము స్మరియిం
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్

    చంపకమాల
    విడువక లింగమున్ గొనియె వేడి మృకుండుని సూనుఁడాయువున్
    జడియక దైత్యసూనుడట సాగెను శ్రీహరి భక్తినార్తితో
    నడరెను రిక్కయై ధ్రువుడు నాకసమందున! దైవమున్ స్మరిం
    చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్


    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కడిదిగ తనకడ నుండిన
    ముడుపును నిర్ధనుల కిడెడి పూనిక తోడ
    న్నడరెడు తత్త్వముతో కా
    చెడు గుణమున్నపుడె యశము చేకుఱు జగతిన్

    రిప్లయితొలగించండి
  26. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,



    మడతి సహోదరీ సమము , మాతృ సమాన మటంచు లో దలం

    చెడు గుణ మున్నచో యశము చేకురు ధారణి నెల్లభంగులన్ |

    మడయుట తథ్యమౌను , పరమానిని గోరు నభీకు డైన నీ

    చుడు || మరియున్ సతీమణికి క్షోభను గూర్చ లులాయ తుల్యు డౌ |


    ( మడతి = పడతి ; అభీకుడు = కాముకుడు ; లులాయ తుల్యుడు

    = దున్నపోతుతో సమానము )


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  27. మైలవరపు వారి పూరణ

    *భీమసేనుడు... ధర్మజునితో*

    కుడుప విషాన్నమున్ , తమరు కోరగ కోపము మ్రింగినాడ , నీ
    పడతి పరాభవమ్ము గని భగ్గున మండియు మిన్నకుంటి ., నూ...
    ళ్లడుగుట , సంధి కోరుటన న్యాయమె ? అగ్రజ ! పోరి , వైరి ద్రుం...
    చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్!!


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ మధ్య సెల్ ఫోన్ లో చీమలను చంపడం.. పక్షులవేట వంటి హింసాత్మకమైన ఆటలను అందరూ ఆడుచుండుటను చూచి... ఆటలంటే ఇవి అని తెలియజెప్పాలనే సంకల్పంతో.. 🙏


      చెడుగుడు గోళీలును దా..
      గుడు మూతలు ఖోకొ కోతి కొమ్మచ్చియు , జా...
      రుడుబల్లలాడి మురిపిం...
      చెడు గుణమున్నపుడె యశము చేకుఱు జగతిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కడిదిగ తాను గల్గిన భగమ్మును జూచి ప్రమోద మొందకన్
    బెడగుగ నెంచి సంతతము పేదలకాధనమంత పంచుచున్
    నడచెడి పోక తోడుగన్ ఘనమ్ముగ తోడగు వారినంత కా
    చెడి గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్ల భంగులన్.

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. అడిగిన విద్యను దాచక
      నడతను గమనించి, ధనమునది కోరక పాం
      థుడివలె విజ్ఞానము బం
      చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్

      తొలగించండి
  30. నడయాడఁగ వీధులఁ దా
    నడరిన దుర్వ్యసనముల ధనాతిశయమునం
    గడువడిఁ గుల గౌరవ మది
    చెడు, గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్


    నడవడి ముఖ్య మెల్లరకు న్యాయము కన్నను మిన్న యైన దీ
    పుడమినిఁ గాంచ నేరము ప్రమోద మొసంగు క్షమా గుణం బిలం
    దడయక యుద్యమించుచు సదా శరణన్న నరాతి కోటిఁ గా
    చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
  31. ఇడుముల పాల్జేయు భువిని
    చెడుగుణ మున్నపుడె, యశము చేకుఱు జగతిన్
    యొడిదుడుకు లెన్ని వచ్చిన
    కడవరకును పట్టు విడక కర్మము జేయన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జగతిన్ + ఒడిదుడుకు' లన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బడుగులనుద్ధరించుటకు బంగరు పంటల స్వర్గసీమకై
    యడలక భ్రాంతి పెంచుచును యాతన నొందక వీధివీధులన్
    బడబడ లాడి శ్రోతలను భాషణ లిచ్చుచు వీనులార దం
    చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      జిలేబీ గారు కొద్ది రోజులుగా బ్లాగులో కనిపించడం లేదు. వారి వరూధిని బ్లాగులోను రెండవ తేదీ తరువాత పోస్టులు పెట్టలేదు. ఏమయిందో?

      తొలగించండి
  33. చెడుకాలము నరుదెంచగ
    నిడుముల పాలయిన భువిని నీరసబడకున్
    కడు భక్తితో హరిని గొ
    ల్చెడు, గుణమున్నపుడె యశము చేకుఱు జగతిన్!!!


    రిప్లయితొలగించండి
  34. పుడమిని వక్రమార్గమున బోయెడు వారికి మంచి మాటలన్
    నడుగక ముందె చెప్పుచు సహాయము సేయుటె కాదు వాటినే
    విడువక నెల్లవేళలను విజ్ఞత తోడను వాటినాచరిం
    చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్ల భంగులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మంచిమాటలే । యడుగక... విడువక యెల్ల... వాని నాచరించెడు...' అనండి.

      తొలగించండి
  35. గడిచినకాలచక్రమును,గాయ మొనర్చినగుండెయద్దమున్
    విడిచినబాణతూణములు, ప్రేలినపల్కులురావువెన్కకున్
    నడవడినీడశాంతినిడు,నాభరణంబనె,ధీప్రదీపమెం
    చెడుగుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విడిచిన వాడి బాణములు...' అనండి. తూణమును విడువరు కదా?

      తొలగించండి
  36. నుడువుచు సమయము గడిపిన
    తడబడి కార్యమును జరుప తప్ప దపజయం
    బడుగడు గున గెలువగ జూ
    చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్

    రిప్లయితొలగించండి
  37. విడువక నడవడిగడుపుచు
    తడబడకను యిడుములకడ దడదడయనకన్
    బడుగుల సౌఖ్యమునేబం
    చెడుగుణమున్నపుడె!యశముచేకురుజగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృత్త్యానుప్రాసాలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తడబడకను + ఇడుముల' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  38. ఒడయడుచాగియీతడుమహోత్తమపూరుషుడాండ్రుబిడ్డలన్
    బడసి,వదాన్యశేఖరవిభావిభవప్రభుదానకర్ణయన్
    గడునుతులొందినేడగడగా ప్రజడెందమునందునిల్చి గా
    చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చెడు గుణ మున్నపుడె యశము
    చేకుఱు జగతిన్

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    విడనాడి యహంకారము

    నెడపక శివునాజ్ఞ లేక యేది జరుగ దన్

    నుడి మది నిడి, దేవునిఁ దల

    చెడు గుణ మున్నపుడె యశము

    చేకుఱు జగతిన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  40. విడువకనెల్లవేళలనుబీదలకంచితరీతిదానమి
    చ్చెడుగుణమున్నచోయశముచేకురుధారుణినెల్లభంగులన్
    నడగకపోయినప్పటికిహర్షముతోడనునీయగోరుచో
    నెడపకయాజనార్దనుడెయిమ్ముగసంపదలెన్నియోయిడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధారుణి బల్విధాల నే। మడుగక... నెడపక నా జనార్దనుడె" అనండి.

      తొలగించండి
  41. రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ఆ రెండింటిని వర్జించడం వల్ల శాంతి సుఖాలు లభిస్తాయి కాని కీర్తి లభించడం?

      తొలగించండి
  42. బడి పంతుల్లంతగలిసి
    బడిబాటనుబట్టినారు, బడుగులబుత్రులన్
    విడువక బడికిన్నేతెం
    *"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విడువక బడికిన్ రప్పించెడు..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  43. చచంపకమాల
    పిడుగులు రాలి పైబడిన వీడక సత్యమహింస దీక్షలన్
    మెడిమను ద్రిప్ప నేర్వక యమేయముగా నెదిరించ తెల్లలున్
    జడియుచు పారిపోయిరట జాతిపితాయన పోరి త్యాగమెం
    చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్

    రిప్లయితొలగించండి
  44. సవరణతో..
    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చెడు గుణ మున్నపుడె యశము
    చేకుఱు జగతిన్

    సందర్భము:
    పడతులకు మన సీయరాదు.
    వైద్యులకు తను వీయరాదు.
    ఇస్తే చెడిపోతారు.
    (తప్పనిసరి ఐతే జాగ్రత్తగా.. తాత్కాలికంగా.. మాత్రమే యీయవచ్చు.)
    ఇది నేను గమనించిన జీవిత సత్యం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "పడతులకు మనసు నిచ్చిన

    యెడలఁ దనువు వైద్య తతికి

    నిచ్చిన యెడలన్

    జెడుదు... రిది సత్య" మని తల

    చెడు గుణ మున్నపుడె యశము

    చేకుఱు జగతిన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.12.18
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీ నివాసులు గారికి కృతజ్ఞతలతో..

    రిప్లయితొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చెడు గుణ మున్నపుడె యశము
    చేకుఱు జగతిన్

    సందర్భము: కోరిక లన్నింటికీ కళ్ళెం వేయాలి. ప్రాణాల మీ దుండే తీపికి (ప్రేమకు) కూడ. ఎందుకంటే అదీ ఓ కోరికే మరి!
    అలా భావించ గలిగినప్పుడే మనుష్యునికి యశము.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఎడతెగని కోరికలకును

    వడిగా కళ్ళెమును వేయ వలె..

    నసువులఁ బ్రే

    ముడితోబా" టని మది తల

    చెడు గుణ మున్నపుడె యశము

    చేకుఱు జగతిన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  46. అడిగిన జనముల కెప్పుడు
    విడువక దానమును చేయ విరివిగ వేగన్
    వడిగా వారల మదిదో
    చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.

    విడువక నన్నార్తులకిల
    కడుప్రేమనుచూపి సతము కమ్మని విందున్
    నడగకయే దయతో పం
    చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.


    తడయక బాధలు తీర్చుచు
    పడతుల కిలలో సతతము భ్రాతయు వోలెన్
    విడువక సహాయమును పం
    చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.


    రిప్లయితొలగించండి