12, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2872 (దేశము వీడిపోయిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్"
(లేదా...)
"దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్"
(2-12-2018 నాడు ఆముదాల మురళి గారి అష్టావధానంలో సమస్య)

84 కామెంట్‌లు:

  1. వరములు కోరక మరిమరి
    కరములు జోడించి పతికి కౌగిలి నిడుచున్
    నిరతపు పాతివ్రత్యా
    చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ సమస్య 23-10-2017 నాడు ఇచ్చిన విషయాన్ని కోట రాజశేఖర్ గారు గుర్తు చేసారు. అందువల్ల మార్చాను. గమనించండి.

      తొలగించండి
    2. ఆశలు మీరగ చనుచున్
      కోశము పూరించు విధిని కొల్కట నుండన్...
      రాశుల మీనుల బంగళ
      దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్ :)

      కొల్కట = Kolkata (earlier Calcutta)

      తొలగించండి
  2. కోశము నింపగ ధనమును
    నాశగ దండుకొన గోరి నానా విధముల్
    రోశిని వెదకుచు మరిమరి
    దేశమ్మును వీడి చన నదృష్టము గలుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరూ దేశాన్ని విడిచిపోయిన వారే కదా!

      తొలగించండి
    2. నిజమే మరి కొడుకుల దగ్గర తప్పనిసరి కదా !

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    *జాతిపిత... క్విట్టిండియా*... 🙏

    కోశములన్ హరించి , మనకోర్కెల గాదని , బానిసత్వమన్
    బాశముతోడఁ గట్టి ., మన వైదికభాషల గాలరాసి ., ఆ...
    దేశపు రీతి గమ్యమని తెల్పు దురాత్ములునాంగ్లపాలకుల్
    దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "Don't Quit India"

      మీ కోరిక...Don't quit India


      తాత... మనవరాలితో...

      దేశము కన్నతల్లియును దేవతలే ! నిను కంటిరెప్పగా
      లేశము బాధనొందనటులే కని పెంచిరి, డబ్బుఁగోరి వై
      దేశికవాసమేల ? కడు తీయని బంధము శాశ్వతమ్ము ! నీ
      దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె, యెల్లవారికిన్!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పుట్టిన యిల్లు (పూర్వము)
      పుట్టిన యూరు
      పుట్టిన తాలూకా
      పుట్టిన జిల్లా
      పుట్టిన రాష్ట్రము
      పుట్టిన దేశము
      పుట్టిన ఖండము
      పుట్టిన భూమి
      పుట్టిన విశ్వము
      వరుస క్రమములో ప్రేమార్హములు! పూజార్హములు!!!

      తొలగించండి
  4. డా.పిట్టా సత్యనారాయణ
    వేశము లెన్నయు వేసిన
    కోశము ఖాళీగ నుండు కుత్సిత బుద్ధిన్
    లేశము వీడని మనుజుల
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేషము'ను 'వేశము' అన్నారు. 'ఎన్నియు' టైపాటు.

      తొలగించండి
  5. ద్వాశతవత్సరమ్ములు న
    వారితదుర్మదదుష్టవర్తనన్
    గ్లేశము లెన్నియో కలుగ
    గింకరులట్టుల భారతీయులా
    క్రోశము బొంద హర్షులగు
    క్రూరులు చోరులు నాంగిలేయు లీ
    దేశము వీడి పోయిన న
    దృష్టము గల్గదె యెల్లవారికిన్ .

    రిప్లయితొలగించండి
  6. ఆశల పూలదోటల విహారమొనర్చెడు గోర్కెఁ దీర్చు ని

    ర్దేశితగమ్యముం గనక తీవ్రమనోవ్యథ జెందు, కుందు, నా

    క్రోశమసూయయుం బొడముఁ గూడని దుఃఖవిదాయియౌ దురు

    ద్దేశము, వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్ల వారికిన్..

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    పాశము తల్లి ప్రేమదని బాయక బుట్టిన భూమి గొల్వగన్
    రాశిని, వాసి, దుండగుల రాజ్యమయెన్;మనలేని విజ్ఞులా
    ఈశుని ,నై.టి నెన్నుకొని యేగ విదేశమె స్వాగతించగా(Information Technology=ఐ.టి)
    దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్?(కల్గుతుందని భావము)

    రిప్లయితొలగించండి
  8. సమస్య :-
    "దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్"

    *కందం**

    ఆశగ నున్నటి జనులకు
    దేశమ్మున పీడితపు నధిపతులు,నక్సల్,
    నాశనపు నుగ్రవాదము
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్
    ........................✍చక్రి

    రిప్లయితొలగించండి
  9. ఆశలుడిగిపోయె, జనుల
    ఆశీస్సులు మృగ్యమాయె, ఆవేశముతో
    నే శపథము జేసె, యికను
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్


    గెలిస్తే గడ్డం తీస్తానని శపథం చేసిన ఉత్తముడి స్వగతం

    రిప్లయితొలగించండి
  10. ఆశాపాశంబుననవ
    కాశముగోల్పోయియాత్మగమ్యాకాంక్షన్
    లేశంబైనదలపవే
    దేశమ్మునువీడిచననదృష్టముగల్గున్

    రిప్లయితొలగించండి
  11. ఆశగ వానల కొరకా
    కాశము వైపు హలి కుండు గాంచి యు తన దౌ
    నాశపు పంటలు వదలి యు
    దేశ మ్ము వీడి చన న దృష్టము గల్గు న్

    రిప్లయితొలగించండి
  12. దేశముమాతృదేవతలదేసురలోకముకన్నమిన్నయౌ
    దేశముసర్వతోముఖమతిన్ జతురాశ్రమలక్ష్యలక్షసం
    దేశమునించునెంచపరదేశమొసంగునుభావదాస్యమా
    "దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్"

    రిప్లయితొలగించండి
  13. దేశము వీడి పోవు తరి దృప్తిగ బల్కెను బాలు డివ్విధిన్
    "దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్ !"
    దేశము దాటియున్ తుదకు తృప్తియె పోవగ తండ్రి యిట్లనెన్
    "దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్ !"
    (రెండవ పాదం లో దేశం వదిలితే అదృష్టం కలుగుతుందని ఆశాభావం. నాలుగవ పాదం లో దేశం వదిలినవారి కి అందరికీ అదృష్టం కలుగదేమో ? అనే నిరాశ )

    రిప్లయితొలగించండి
  14. ఆశయమున్న కుటుంబపు
    పాశము విడి పోయినపుడె ప్రాప్తించు నిధుల్
    కోశము నింప ప్రగతికై
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్

    రిప్లయితొలగించండి
  15. ఈశుని దీవెనల్ గలుగ నీభువి నిత్యము స్వర్గతుల్యమౌ
    నాశుగ జెప్పగా నగున దైక్యత లేమియె దుఃఖ హేతువా
    వేశము శాంతినే కలచి వేయును తథ్యము; కోపతాపముల్
    దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్ ?

    రిప్లయితొలగించండి
  16. పెద్ద చదువులు చదివినా మన దేశములో విలువ లేదు ఉద్యోగ ములు దొరకక కాసులు రాలవు అమెరికా వంటి విదేశములకు వెళితే బాగా అదృష్టం కలసి వస్తుంది అని పతి యొకడు భార్య తో పలికిన పలుకులు

    కాసులు రాలవిచట మన

    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్

    వీసపు విలువలు మన న

    భ్యాసమునకు లేవని పతి బాధగ పలికెన్

    రిప్లయితొలగించండి
  17. ఆశలు సూపి యెల్లరకునండగనేలికలన్గొనిన్
    లేశముకూడ చట్టముల లెక్కయుఁజేయక కోట్లు రూకలన్
    కోశమునుంచి దోచుకొనఁ గుట్రలఁజేసెడి దుష్టులెల్లరీ
    *"దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏🏻🙏🏻🙏🏻
      సవరణ:
      ఆశలు సూపి యెల్లరకునండగ పాలకవర్గముండగా
      లేశముకూడ చట్టముల లెక్కయుఁజేయక కోట్లు రూకలన్
      కోశమునుంచి దోచుకొనఁ గుట్రలఁజేసెడి దుష్టులెల్లరీ
      *"దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్"*

      తొలగించండి
  18. ఆశాపాశము బెంచుచు
    నాశము జేకూర్చెడి పర నాగరికతయే
    లేశము సందియ మెంచక
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్!

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2872
    సమస్య :: దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్.
    *మన దేశాన్ని వదలిపెట్టి విదేశాలకు పోతే అదృష్టం కలుగుతుంది అందఱికీ* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ “భారతదేశాన్ని జయించేందుకు వెళ్లదలచినాను” అని తన గురువు మరియు గొప్ప తత్త్వవేత్త అగు అరిష్టాటిల్ కు చెప్పినాడట. అప్పుడు అరిష్టాటిల్ “భారతదేశాన్ని జయించడం సులభం కాదు. ఒకవేళ నీవు భారతదేశం వెళ్లినట్లయితే పరమ పవిత్రమైన అక్కడి మట్టిని, పావన గంగాజలాన్ని, దివ్య రామాయణ గ్రంథాన్ని, పంచమవేదమైన మహాభారతాన్ని, సద్గురువును నాకోసం తీసికొనిరా” అని చెప్పినాడట.
    ఈ విషయాన్ని వినిన మా అమెరికా మనుమడు మాట్లాడుతూ “అలాగైతే మా అమెరికా దేశాన్ని వదలి భారత దేశానికి వెళ్తే అదృష్టవంతులౌతారు అందఱూ” అని భారతదేశ మహిమను గుఱించి విశదీకరించే సందర్భం.

    “దేశము భారతమ్ము వినుతిన్ గనె, విశ్వవిజేత! పోకు మా
    దేశము గెల్వ జాల” వని తెల్పెను గ్రీకుల తత్వవేత్త; “యా
    దేశములోని మట్టి, వరతీర్థము గంగయు, రామగాథ, సం
    దేశము నిచ్చు భారతము, దివ్య గురుండును ముక్తి నిచ్చు, నా
    కాశియు” గాన, మా యమెరికా మనుమం డిటు పల్కినాడు “మా
    దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్.”
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (12-12-2018)

    రిప్లయితొలగించండి
  20. పాశమ్మైనను సరినా
    దౌశాసనమే బ్రజలకు నంతిమమనుచున్
    నాశముగోరెడి బ్రభువా
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్"

    రిప్లయితొలగించండి
  21. ఆశ లుడిగి చిత్తమునం
    బాశ విముక్తులయి నరు లమర గురుని ప్రతీ
    కాశము నిజాప్తులకు సం
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్


    దేశము నందునన్ ధరణి దేవుఁడు వాసము సేయ కుండినన్
    దేశము నందు వైద్యుఁడు నుదీర్ణతఁ గన్పడ కుండ నుండినన్
    దేశము నందు జీవ నది తీర్థము నిత్యము పాఱ కుండినన్
    దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేశము నందునన్ ఋణము దీరుగ నీయని సంస్ధలుండినన్......

      అప్పిచ్చు వానిని మరచారే?!!
      ఆర్ధికాభివృద్ధికి తప్పదుగదా!!🙏🙏🙏

      తొలగించండి
    2. చొప్పడకున్నట్టి దేశాన్ని ప్రస్తావిస్తూ చక్కని ఉత్తమమైన పూరణలందించారు. అభినందనలు.

      తొలగించండి
    3. డా. సీత దేవి గారు మీరు చెప్పినది సత్యమే. మూడు పాదాలు నిండినవి కదా యని యూరుకున్నాను. ఆ లోటు మీరు దీర్చారు. “దేశము నందునన్ ఋణము దీరుగ నీయని సంస్ధలుండినన్” అని.
      అయితే నా కలములో నుంచి వెలువడిన నది యిట్లుండును.
      దేశము నందు నప్పులిడు దీరగు సంస్ధలు లేక యుండినన్

      పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    4. ఆర్యా! మీ శైలి ఉత్తమముగా నున్నది!!
      ఏదో పూరించాను కాని మీతో సరితూగ గలనా? అదే పెద్ద సాహసం!!🙏🙏🙏

      తొలగించండి
    5. పైన మూడు పాదములు వ్యతిరేకార్థములో నున్నవికదా అందుకని. అంతే. మీ పాదము సంశోభితమే.

      తొలగించండి
  22. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మా అబ్బాయి సందేశము:👇

    ఆశలు మీరుచున్ యువత హాయిగ తేలగ స్వప్నసీమలో
    నాశన మొందగా చదువు నాయన తిట్టగ నమ్మ మొట్టగా
    పాశము ప్రీతిదౌ వలపు బంగళ నారుల త్రుంచివేయుటన్
    దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలియదు...ఊహించిన రీతిగానే నా e-mail కి reply లేదు. కానీ నా బ్లాగును మునుపులా రోజుకు ఐదు సార్లు కాకుండా అప్పుడప్పుడూ చూస్తున్నారని నా అనుమానం. అంటే శంకరాభరణం బ్లాగును కూడా చూస్తూనే ఉంటారు...కించిత్తు busy ఐపోయారేమో...దిగులుగా తప్పకుండా ఉన్నది :(

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      జిలేబీ గారు తమ 'వరూధిని' బ్లాగులోను పోస్టులు పెట్టడం లేదు. అస్వస్థులయ్యారేమో?

      తొలగించండి
    3. అదే సందేహము పీడిస్తున్నది! త్వరగా బ్లాగులో అడుగు పెట్టాలని కోరుతూ....🙏🙏🙏

      తొలగించండి
  23. కం.
    ఆశయ సాధన కొరకు వి
    దేశము వెడలగ తుపాకి దెబ్బల తోడన్
    పాశవిక దాడి జరిగె,వి
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్ .

    రిప్లయితొలగించండి
  24. ఉత్పలమాల
    ఆశలు దీరగా చదివి యందల మెక్కక మాతృభూమిఁ బే
    రాశఁ బరాయి దేశమున రాశుల సంపద పొంద గోరి నీ
    దేశము వీడనెంచు నవిధేయతఁ జూపెడు స్వార్థపూరి తో
    ద్దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  25. ఆశయసిద్దిగ చదువరి
    నాశనమిడు సోమరిపనినమ్మకనే!నా
    దేశించగ పెద్దలు తన
    దేశమ్మును వీడిచన?నదృష్టముగల్గున్!

    రిప్లయితొలగించండి
  26. ఆశల యూహలన్ని యడియాశల జేసి విదేశ పౌరులే
    నాశము సేసి భారతపు నందము నెల్లయు కొల్లగొట్టనా
    క్రోశము జెందు వారనియె ద్రోహులు నీచులు దుష్టబుద్ధులే
    దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  27. పాశమ్మైనను సరి నా
    దౌశాసనమే బ్రజలకు నంతిమమనుచున్
    నాశముగోరెడి బ్రభువా
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్"

    రిప్లయితొలగించండి
  28. ఆశయ సాధన కొరకై
    యాశలు మెండుగ మెదలగ నాతృత తోడన్
    పాశమ్ముల త్రెంచుకొనుచు
    దేశమ్మును వీడి చననదృష్టము గల్చున్.
    [

    కోశము దోచి తినుచు నా
    కాశపు మేడలను తాము గట్టుచు వేగన్
    లేశపు కరుణను చూపక
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్.
    [

    రిప్లయితొలగించండి
  29. కాసుల లోగన డాలరు
    వాసియె యని తెలుసుకున్న ప్రజలెల్లరి వి
    శ్వాసము ధన మార్జింపగ
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్.

    రిప్లయితొలగించండి
  30. క్లేశమదేలర బాలక?
    కోశము నిండుగ ధనమది కూడగ సొంపౌ
    రాశియె సతియై యమరును
    దేశమ్మును వీడిచన నదృష్టము గల్గున్!

    రిప్లయితొలగించండి
  31. ఆశఘటిల్ల మానసము నందున పొందగ నార్జనమ్ము నీ
    పాశము లన్నియున్ విడిచి వాటముగాగల చోటుకున్ చనన్
    దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్
    కోశము నిండు దేశమున కూడ పరాయి ధనమ్ము మెండుగా

    రిప్లయితొలగించండి
  32. ఆశయ మొక్కటే జనుల కార్థిక పుష్టిని కల్గియుండుటే
    కాసులు లేనివాడు కొరగాడిల దేనికి లోకమందు నా
    కాసుల లోన డాలరులె కల్పము నందున మేటియటంచు నీ
    దేశము వీడిపోయిననదృష్టము గల్గదె యెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  33. కందము
    కోశము నింప నరుగఁ బే
    రాశను జవిగొన వివక్ష ప్రాణమ్ములపై
    నాశ స్వదేశమునకు పర
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్

    సందర్భము: ఆశ వదిలిపెట్టి నూరు రూపాయలు ఇచ్చియైన సరే దుష్టు లున్న ప్రదేశాన్ని వీడి యేమాత్రం శంకింపక వృథావేశానికి లోనుగాక సంతోషంతో దూరంగా వెళ్ళిపోవాలి.. అప్పుడే అదృష్టం వరిస్తుంది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    లేశము శంకింపకయె ని
    రాశను నూ రిచ్చియైన యా క్షణమె వృ థా
    వేశమ్మును, ఖలు లున్న ప్ర
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి