13, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2873 (పొలఁతి మేన....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట"
(లేదా...)
"పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై"

59 కామెంట్‌లు:

  1. లలిత లావణ్య వతియట లక్ష్మి యనగ
    గంగ దిగెనంట దివినుంచి భోగ వతిగ
    వనిత తనువంత పులకించ భక్తి తోన
    పొలతి మేనఁ బుణ్య క్షేత్రములు గలవఁట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భక్తితోను' అనండి.

      తొలగించండి
    2. లలిత లావణ్య వతియట లక్ష్మి యనగ
      గంగ దిగెనంట దివినుంచి భోగ వతిగ
      వనిత తనువంత పులకించ భక్తి తోను
      పొలతి మేనఁ బుణ్య క్షేత్రములు గలవఁట

      తొలగించండి
  2. కాశి కేదార బద్రియు కంచి మథుర,
    అరుణగిరి షిర్ది తిరుమల నరస విల్లి
    తలచి చూడగ నెన్నియొ తల్లి మనదె
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    💐పుణ్యభూమి నా దేశం నమోనమామి🙏💐

    గణ్యంబైనది భారతాంబ, ముఖమై కాశ్మీరు వెల్గంగ , స..
    త్పుణ్యస్థానము వారణాసి హృదయంబున్ బోలి దీపింప , ప్రా...
    మాణ్యంబౌ వర రామనాథపురమే మా తల్లి పాదాలు గాన్
    పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. వాణ్యూహాపరికల్పితమ్మనదగున్ భామాతనుశ్రీన్ , మహా...
      రణ్యమ్ముల్ , గిరియుగ్మషట్పదములున్ రాజీవమీనమ్ములున్ ,
      గణ్యమ్మౌనొకవాపియున్ గగనమున్ కన్పట్టు , దర్శింపగా
      పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  4. పరమ పావనమై యొప్పు, సురలకు నిది
    వాస మౌచును వెలుగొందు వసుధ పయిని
    ననుచు పల్కెద రీరీతి నార్యులు వృషభంపు
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. '..ననుచు పల్కెద రార్యులే యావనియెడి। పొలతి..." అనండి.

      తొలగించండి
  5. పతి యె ప్రత్యక్ష దైవము పడతి కెపుడు
    అన్న పూర్ణ గ నందరి నాదు కొనుచు
    సంతు క తి థుల దృష్టి లో సాధ్వి యైన
    పొలతి మేఁ న బుణ్యక్షేత్ర ము లు గల వ ట

    రిప్లయితొలగించండి
  6. మాతృమూర్తిగ సృష్టిలో మధురమైన
    యాడువారికి సాటి యీ యవని లేదు
    సంతతిని మోయు ధర్మము నెంతు మదిని
    పొలతి మేన పుణ్య క్షేత్రములుఁగలవఁట

    రిప్లయితొలగించండి
  7. భరత మాత గుడుల కాటపట్టు, పంట
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట
    కాంచి శ్రీశైలము మధుర కంచి కాశి
    వంటి తావులన్నియు ముక్తి బడయు డయ్య

    రిప్లయితొలగించండి
  8. సృష్టి ములమౌ గర్భంబు శిశువు దాల్చు
    స్తన్యమిచ్చి పోషించును చక్కగాను
    సృష్టి స్ధితుల నిచ్చెడు దేవి స్త్రీ యనంగ
    బొలతి మేన బుణ్యక్షేత్రములు గలవట!

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2873
    సమస్య :: పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై.
    సందర్భం :: చీరలు నేసే వ్యక్తి ఒకడు తనకు గల దేశభక్తిని ప్రదర్శిస్తూ ఒక చీరపై పుణ్యక్షేత్ర నిలయమైన భారతదేశ పటమును చిత్రించాడు. మిస్సిండియా పోటీలో పాల్గొనడానికి వెళ్తూ ఒక యువతి ఆ చీరను ఎంతో నైపుణ్యంతో ధరించి విజయాన్ని సాధించింది. అప్పుడు ఆ సభలోని ప్రేక్షకులు “ఆ పూబోడి శరీరంపై ఎన్నో పుణ్యక్షేత్రాలు కనిపిస్తూ ఉన్నాయి” అని మాట్లాడుకొనే సందర్భం.

    పుణ్యక్షేత్ర మయమ్ము భారతము సంపూర్ణమ్ముగా గన్పడం
    బుణ్యాత్ముండుగ చీర నేసె నొక డామోదమ్మునన్, దాని నై
    పుణ్యం బొప్ప ధరించె చూడు మదె యా పూబోడి మిస్సిండియా,
    పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (13-12-2018)

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా!సృష్టి స్ధితులు ఒకే పదమా? ష్టి గురువౌతుందా?

    రిప్లయితొలగించండి
  11. పచ్చ బొట్టుగ దేవుళ్ళ ప్రతిమ లెన్నొ
    మేను మీదనె ముద్రణ కాన వచ్చు
    నట్లు ముద్రింప జేయగ నందమైన
    "పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట"
    **)()(**
    ("పచ్చబొట్లుగ ? ")

    రిప్లయితొలగించండి
  12. ఏరులు బదివేల్ యొడిలోన పారుచుండు
    భరత మాత నగలు కావె పర్వతాలు?
    పాడి పంటలె తనమేని బట్టలగుచు
    "పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట"

    రిప్లయితొలగించండి
  13. గణ్యంబైన తెనుంగు చిత్రకళకున్
    గాణాచి "వడ్డాది" యే;
    గణ్యాత్యద్భుతధర్మమోక్షమణిసం
    ఘాతన్; గుణోపేత; గా
    రుణ్యన్; జిత్రణ జేసినా డదె సుధా
    రూపన్ మహా భారతిన్;
    పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట! యా
    పూబోడి నెమ్మేనుపై.

    రిప్లయితొలగించండి
  14. కాశిరామేశ్వరముమాయ కంచిమధుర
    ద్వారవత్యయోధ్యాదిసద్వ స్త్రభూష
    బొలతిమేన బుణ్యక్షేత్ర ములుగలవట
    చూడరండమ్మభరతోర్విసోయగమును

    దేవతాస్త్రీలు భూలోకంలో భరతభూమికి విహారయాత్ర చేద్దామంటూ చర్చించుకున్నారు

    రిప్లయితొలగించండి
  15. అద్భుతమైన పూరణ బాపూజీగారూ!!నమస్సులు!!

    రిప్లయితొలగించండి
  16. శివుని శిరమును చెన్నుగ జేరు గంగ
    ఘన హిమాలయ మందుండి కదలి భువిని
    భరత దేశము నందున పర్వులెత్తు
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఆశ సహజమగును గదా
    దేశమ్మేదైన నేమి దీటుగ బ్రతుకన్
    రాశిగ ధన మార్జించగ
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్

    రిప్లయితొలగించండి
  17. వాణ్యంచన్మధురోక్తిభాసరసన న్బాసిల్లగ న్బాసరా,

    వేణ్యుద్భాసితశీర్షభాగమదియే వేల్గ న్బ్రయాగాఖ్యమై,

    గణ్యస్థానపునీతభవ్యగిరులం గమ్రస్తనాభోగమై,


    పుణ్యక్షేత్రములెన్నొ యున్నవట, యా పూబోణి నెమ్మేనిపై.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.





    రిప్లయితొలగించండి
  18. జమ్ము కాశ్మీరాన శారదమ్మ వెలుగ, శ్రీ వైష్ణవీ దేవి చేరె జమ్ము
    నందు, విశాలాక్ష్మి నడయాడె కాశిలో, గౌరిఐ వెలసె బీహారు లోన,
    గౌహతి నగరాన కామాఖ్యగా వెల్గ,శృంఖలా దేవిగా శోభ నిడెను
    వంగదేశాన, ప్రయాగ లో మాధవేశ్వరి మాతగ, భువనేశ్వరు సమీప
    మందు వెలసె నంట మాత గిరిజగ, యుజ్జయిని మహాకాళి సంచరించ
    మధ్యప్రదేశాన, మాణిక్యాంబ వెలసె ద్రాక్ష రామములోన, లక్ష్మి దేవి
    గా కొల్హ పురమున కనువిందు జేయగా, పురుహుతి కమ్మగా పుట్టె పీఠి
    కా పురమందు, నలంపురమున జోగులాంబ కాగా, భ్రమరాంబ గా వె
    లసెనట శ్రీగిరుల నడుమ, చాముండికగ వెల్గె కర్నాటకమున, కంచి
    కామాక్షి గాపుట్టి కరుణ చూపె తమిళ జనులకు, ఘనమైన శక్తి క్షేత్ర
    ముల సరసన జ్యోతిర్లింగములును, తోడు
    విష్ణు దేవాలయములతో వెలిగె భరత
    మాత సుందర భూమిపై, మరులు గొల్పు
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట"

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. నిన్నటి పూరణతో కలిపి నేటి పూరణను గూడా పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.
    12-12-2018:

    రాశుల కొద్దిగ ధనమును
    కోశములో నింపగోరి కుదిరిక తోడ
    న్నాశించి యమెరికాకున్
    దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్.

    13-12-2018:

    మిన్నయౌ కాశి నుండి రామేశ్వరమ్ము
    వరకు తెలిసీ తెలియకుండ ప్రజలొనర్చు
    పాపముల రూపడచుటకై భరత దేశ
    పొలతి మేన పుణ్య క్షేత్రములు గలవట.

    రిప్లయితొలగించండి
  20. గణ్యంబైరచియించెబోయడురసాగ్రాస్వాదకావ్యంబు సా
    మాన్యుండ్రైప్రతిసృష్టిజేసెనొకడోమందాకినిన్దెచ్చె బ్రా
    మాణ్యంబౌభమునయ్యె;ధేనువుగదేమాయమ్మశక్తీస్థలం బాణ్యత్యద్భుతధర్మమోక్షతలమౌనధ్యాత్మికాభారతీ
    "పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై"

    రిప్లయితొలగించండి
  21. ధరణి భవ్య పుణ్య క్షేత్ర దర్శనములు
    కారణము లఘ సంఘ విఘాతమునకుఁ
    జూడఁ దగిన యట్టివి పెక్కు సుందరంపుఁ
    బొలఁతి! మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట

    [మేను = పార్శ్వము]


    పార్వతీ దేవి మనోదర్శనము సకల పుణ్యక్షేత్ర దర్శన తుల్యము:


    గణ్యంబైనది నైమిశాటవి యనం గాంతా శిరశ్శాల లా
    వణ్యంబౌ ముఖమండలమ్ము శశి సంభావ్యంపు వేశ్మంబ తా
    రుణ్య భ్రాజిత పాద యుగ్మ మఘ సంరోధంపు క్షేత్రం బనం
    బుణ్య క్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై

    రిప్లయితొలగించండి
  22. పుణ్యంబై యలరారు ప్రాంతమునఁ బెంపొందెన్ స్థిరమ్మై కడున్
    నాణ్యంమౌ పలుసోయగమ్ము లడరన్ నాదేశ మీయుర్విపై
    ధన్యంబౌ బ్రతుకుల్ ప్రజాతతికి నీధాత్రిన్ కనన్ భక్తితో
    పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై

    రిప్లయితొలగించండి
  23. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గుణ్యాగుణ్యము లెంచు లుబ్ధుడొకచో గుప్తమ్ముణణ్ గొణ్గుచుణ్
    కణ్యాశుల్కముణిచ్చుచుండి వడిగా కైవల్యముణ్ కోరగా
    కణ్యణ్ దెచ్చుచు రామపంతులణియెణ్: "కమ్మంగ జేకొణ్మురా!
    పుణ్యక్షేత్రము లెణ్ణొ యుణ్ణవఁట యా పూబోడి ణెమ్మేణుపై"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. “లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా”

      https://kandishankaraiah.blogspot.com/2016/07/2079.html?m=1

      తొలగించండి
  24. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ .. .

    చూడ వలెనని నాకాశ నేడు గలిగె
    వివిధమగు దేవి దేవతా విగ్రహములు
    విస్తరించిన భారత విమలమైన
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట.

    రిప్లయితొలగించండి
  25. అక్షరాలందు భావాలునతికినట్టు!
    పువ్వులందించు గంధమ్ము పొసగినట్లు
    అమ్మ నాంతర్యమందుననణగియుండ
    పొలతిమేనబుణ్య క్షేత్రములుగలవు

    రిప్లయితొలగించండి
  26. తల్లి భారతి నీకిదే తగును యిదిగొ
    వందనమ్మిదే నందుకోవమ్మ వింటి
    *"పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట"*
    నిజము, నాదేశ,మందంత,నెన్ని యోగ
    లవు మిగుల పుణ్య తీర్థములన్ని గనగ!!

    రిప్లయితొలగించండి
  27. గణ్యాంభోజవిలోచనద్వయమున న్గామాక్షి కొల్వుండగన్,

    శ్రోణ్యంచత్సువిలాసినీతనువునన్ శోభిల్ల, కామాఖ్యయే,

    వాణ్యగ్రాసనభాసమానరసన న్వాగ్దేవి తా నుండగన్,

    పుణ్యక్షేత్రములెన్నొ యున్నవట యా పూఁబోణి నెమ్మేనిపై.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.















    రిప్లయితొలగించండి
  28. వారణాశి శ్రీశైలము ఫలని కుక్కి
    గాణుగాపురు తిరుపతి కంచి మధుర
    యన్నవరముజ్జయిని వంటి వెన్నొ పంట
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట.

    రిప్లయితొలగించండి
  29. నాణ్యమ్మౌ చిరునవ్వుమోము శశి, యానక్షత్రముల్ కళ్ళు, లా
    వణ్యంబైన కరమ్ములబ్జములు, నావక్షోజముల్ కొండ, లా
    రణ్యమ్మంతటి దట్టమౌ కురులుకల్గన్నెట్లు నేపల్కెదన్
    *"పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై"*❓
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణ :
      నాణ్యమ్మౌ చిరునవ్వుమోము శశి, యానక్షత్రముల్ కళ్ళు, లా
      వణ్యంబైన కరమ్ములబ్జములు,
      గుబ్బల్ పర్వతమ్ముల్ ఘనా
      రణ్యమ్మంతటి దట్టమౌ కురులుకల్గన్నెట్లు నేపల్కెదన్
      *"పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై"*❓
      (చిరు ప్రయత్నం)

      తొలగించండి
  30. నా ప్రయత్నం :

    *భూదేవి, శ్రీవరాహమూర్తుల సంవాదము*

    తేటగీతి
    "దైత్యుని వధియించి వరాహ దర్శనమున
    బాలచంద్రుని కిరణంపు ప్రభల వెల్గు
    కోరల నను నిల్పితివేమి కారణమ్ము?" 
    " పొలఁతి! మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట!" 
    ** ** **
    లక్ష్మీ, వరాహస్వామి వారల సంవాదం..

    శార్దూలవిక్రీడితము
    " పుణ్యమ్మైంతగ జేసెనో కరుణనీ మోరన్ వరాహమ్మువై
    ధన్యంబొందఁగ నిల్పితే ధరణి నాదైత్యున్నిరోధించి" ?" లా
    వణ్యాంగీ!విను తాలిమిన్ గలుగ సర్వంబున్ ప్రజామోదమౌ
    పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట! యా పూబోడి నెమ్మేనుపై"


    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టాసత్యనారాయణ
    అలతి సౌఖ్యము నందంగ నరసి లక్ష్మి
    స్పర్ష,వీక్షణ భావనా సొఖ్యమబ్బ
    అంగమంగము నందు విహార మరయ
    పొలతి మేన బుణ్యక్షేత్రములు గలవట

    రిప్లయితొలగించండి
  32. డా.పిట్టా సత్యనారాయణ
    గణ్యాగణ్యము లింద్రియంపు తతులే గౌణంబు లల్పంబె;గా
    రుణ్యం బారయ గానమీ కరణినిన్ రూఢిన్నవే క్షేత్రముల్
    గణ్యంబుల్ సుకుమార దేవతలె బో గాచేరు సౌందర్యమున్
    పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవట యా పూబోడి నెమ్మేను పై

    రిప్లయితొలగించండి
  33. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2873
    సమస్య :: పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై.
    సందర్భం :: చీరలు నేసే వ్యక్తి ఒకడు తనకు గల దేశభక్తిని ప్రదర్శిస్తూ ఒక చీరపై పుణ్యక్షేత్ర నిలయమైన భారతదేశ పటమును చిత్రించాడు. మిస్సిండియా పోటీలో పాల్గొనడానికి వెళ్తూ ఒక యువతి ఆ చీరను ఎంతో నైపుణ్యంతో ధరించి విజయాన్ని సాధించింది. అప్పుడు ఆ సభలోని ప్రేక్షకులు “ఆ పూబోడి శరీరంపై ఎన్నో పుణ్యక్షేత్రాలు కనిపిస్తూ ఉన్నాయి” అని మాట్లాడుకొనే సందర్భం.

    పుణ్యక్షేత్ర మయమ్ము భారతము సంపూర్ణమ్ముగా గన్పడం
    బుణ్యాత్ముండుగ చీర నేసె నొక డామోదమ్మునన్, దాని నై
    పుణ్యం బొప్ప ధరించె చూడు మదె సొంపుల్ గుల్కు మిస్సిండియా;
    పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై.
    {అవధాన గురువరేణ్యులు శ్రీ నరాల రామారెడ్డి గారికి ధన్యవాదములతో}
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (13-12-2018)

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట

    సందర్భము: లలన చనులు అరుణాచలములు.. అనగా ఎఱ్ఱని కొండలు అని యొకరంటున్నారు.. *అరుణాచలం* అనే పుణ్య క్షేత్రం ధ్వనిస్తూ వున్నది.
    కాదు శ్రీ శైలములు అనగా (ప్రియునికి) అవి సిరు లిచ్చే కొండలు అని మరొక రంటున్నారు. *శ్రీ శైలం* అనే పుణ్య క్షేత్రం ధ్వనిస్తూ వున్నది.
    కాదు కాదు అవి మంగళ గిరులు అనగా ప్రియునికి శుభము లిచ్చే కొండలు.. అన్నా రట వేరొకరు. *మంగళగిరి* అనే పుణ్య క్షేత్రం ధ్వనిస్తూ వున్నది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    లలన చను *లరుణాచలము* లని రొకరు..

    వసుధ *శ్రీ శైలము* లటన్న వార లొకరు..

    *మంగళ గిరు* లన్నా రట మరియు నొకరు..

    పొలఁతి మేనఁ బుణ్య క్షేత్రములు గల వఁట!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    13.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  35. చిత్రకథ లోన నొక్క విచిత్ర మిదియె
    రేడు శివలింగములనె అర్చింప లేక
    తరుణి స్తనమె లింగమ్మని తలచి కొలిచె
    పొలతి మేన పుణ్యక్షేత్రములు గలవట
    (పరమానందయ్య శిష్యుల కథ అనే సినిమాలో రాజుకి (యన్ టి రామా రావు) శివార్చనకి వేళ ఐతే సమయానికి శివలింగం లభించదు. లింగాకారం లోని తన ప్రియురాలి స్తనాన్ని శివలింగం గా భావించి పూలు చల్లి పూజ చేస్తాడు)

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పొలతి మేనఁ బుణ్య క్షేత్రములు గల వట!

    సందర్భము: పొలతి నూగారు.. పరమక.. అసి.. గొప్ప కత్తి ఆకారంలో.. పరమ కాసి లేక *కాశి* అనే పుణ్యక్షేత్రం.. ఆకారంలో వున్నది. (శ్లేషలో శస లకు అభేదం లాక్షణిక సమ్మతం.)
    మోవి మధుర..ఆత్మచేత అనగా తీయని స్వభావముచేత లేదా *మధుర* అనే పుణ్యక్షేత్రం యొక్క ఆకారంతో వెలిగిపోతున్నది.
    కనుదోయి శ్రీ అనగా లక్ష్మికి.. రంగమే అనగా విహారరంగమే! లేదా *శ్రీ రంగమే!* (పుణ్య క్షేత్రమే) యనగా మెఱసిపోతున్నది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పరమకా శ్యాకృతి నలరు పడతి యారు..

    చెలగు మధురాత్మఁ దేనెలఁ జిందు మోవి..

    మెఱయుఁ గనుదోయి శ్రీ రంగమే యనంగ..

    బొలఁతి మేనఁ బుణ్య క్షేత్రములు గల వఁట!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    13.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. ధేనుమాత మేన గలరు దేవతలని
    మూడు మార్లుచుట్టుతిరిగి ముదము తోడ
    మ్రొక్కి నంతెనె లభ్యమౌ ముక్తి గనుడు
    పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట.

    రిప్లయితొలగించండి