20, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2879 (కర్నూలునఁ గానరాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"
(లేదా...)
"కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్"

104 కామెంట్‌లు:

  1. (1)
    (గద్వాల శతావధానానికి కర్నూలు కవులందరు పృచ్ఛకులుగా వచ్చారు)

    "అవధానమ్మునఁ బృచ్ఛకు
    లెవరయ్యా?" యనఁగ "వచ్చి రెల్లరు కర్నూ
    లు విడిచి గద్వాల, కిపుడు
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"

    (2)
    (కర్నూలు కవులందరు ప్రపంచ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి కలకత్తా వెళ్ళారు)

    స్తవనీయంబుగ నిర్వహింప కలకత్తా పట్టణంబందు దే
    శ విదేశాగతులైన సత్కవులదౌ సమ్మేళనం బొండు గౌ
    రవ మింపారఁగఁ బిల్చి రెల్లరను సంబ్రం బొప్పఁగా నేఁగినన్
    కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  2. జవురుచు భాగ్యపునగరిని
    కవి సమ్మేళనమునకును కాకుల వలెనే
    కవులందరువిచ్చేయగ
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
  3. అవధానము పండితుల కని
    కవులందరు కదలి రంట గద్వాల్ చేరన్
    అవకాశము దొరికె ననుచు
    కవి యొక్కడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గద్వాలకు తా। మవకాశము...' అనండి.

      తొలగించండి
    2. అవధానము పండితుల కని
      కవులందరు కదలి రంట గద్వాలకు తా
      మవకాశము దొరికె ననుచు
      కవి యొక్కడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

      తొలగించండి
  4. కవులకుగనకాభరణము
    కవులారారండురండు గంచికియనగా
    కవులేగిరి కైతలతో
    కవియొక్కడుగానరాడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రండు కంచికి ననగా' అనండి.

      తొలగించండి
    2. జవదాటక గురువాజ్ఞను
      కవిసమ్మేళణము కొరకు కదలిన వారిన్
      నవధాని పరీక్షింప కు
      కవియొక్కడు కానరాడు కర్నూలు పురిన్

      తొలగించండి
    3. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. అవిరళముగ శ్రమియించుచు
    భవితకు బంగారు బాట పఱచెడి వారే;
    యవగాహనయే లేని కు
    "కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      కుకవులు లేరన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  6. జ వ మున వెడలి రి తిరుపతి
    య వధాన ము లో న పృచ్చకాళి గ నుండ న్
    వివ రించ గ నత్త రి లో
    కవి యొక్క డు గాన రాడు కర్నూలు పురి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నేను కర్నూలు కవులను గద్వాలకు పంపితే మీరు తిరుపతికి పంపారు. బాగుంది.

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. కవు లిచ్చటి వారెల్ల సు

      కవులే, మధురసవదర్థకవనాంచితసం

      స్తవనీయులె, కన నిట కా

      కవి యొక్కడు కాన రాడు కర్నూలు పురిన్.

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      కాకవులతో మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. కవులన్దీసుకు వచ్చినన్ ప్రభలసత్కారార్చనల్ పత్రముల్
    స్తవనీయంబుగరాజభోగములు దేశంబంతటన్ ద్రిప్పి వై
    భవమొప్పన్ జిరపౌరసత్వమన బోవంజాలరేదేశముల్!
    కవియొక్కండునుగానరాడుగదయాకర్నూలునన్ జూడగన్

    రిప్లయితొలగించండి
  9. కవితలపొత్తములెన్నియొ
    అవనిన జూడని విధమున కలవనిజెప్పన్
    కవులందరేగిరచటకు
    *"కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"*
    --------యెనిశెట్టి గంగా ప్రసాద్
    కామారెడ్డి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది అభినందనలు
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి

      తొలగించండి
  10. సమస్య :-
    "కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"

    *కందం**

    చెవులను రిక్కించి వినుడు
    పవిత్రమైన కవనమ్ము పంచెదరంతన్
    భవిత మెరుగుపడునట్లు,కు
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  11. హవణిం గైతలఁ గూర్ప నొప్పు సరణిన్ వ్యాసక్తులై వ్రాయ, స



    త్కవనార్థం బుదయించిరేమొ యనగా కావ్యర్షులే చొప్పడ




    న్గవు లే యింటను మువ్వు రిర్వును కనంగానొప్పు, నేకాకియౌఁ


    గవి యొక్కండును గాన రాడు గద యా కర్నూలనన్ జూడగన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  12. కవులకు నిరతము నిలయము;
    నవనవకాంతుల విధుసతి నాణెపు మొలనూల్;
    జవ మొప్పారగ వెదుక ; గు
    కవి ; యొక్కడు గానరాడు కర్నూలు పురిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      కుకవులు లేరన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  13. ప్రవిమల మనస్సుతోడన్
    కవితల లిఖియించుచుంద్రు కమనీయముగా
    దివిటీ తో వెదకినను కు
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      దివిటీతో వెదకినా కుకవి కనిపించడన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు అసనారె

      తొలగించండి
  14. సవనము వలె కవనమునకు
    చవిగొని బహుమతులనీయ చక్కగ ప్రభుతే
    యవధాని గాని విరసపు
    కవియొక్కడు గానరాడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రభుత + ఏ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2879
    సమస్య :: కవి యొక్కండును కానరాడు గద యా కర్నూలునన్ జూడగన్.
    *కర్నూలులో ఎంత వెతికినా ఒక్క కవి కూడా కనిపించడం లేదు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: మనోహరమైన అష్టావధానాలను ఎన్నింటినో చేసిన శ్రీమతి బులుసు అపర్ణ గారు కర్నూలులో శతావధానానికి శ్రీకారం చుట్టినారు. వాణీ స్వరూపంగా అపర్ణ గారు శతావధాన సభలో విరాజిల్లుతూ ఉండగా దేశవిదేశములనుండి పృచ్ఛకులుగా విచ్చేసిన గొప్ప గొప్ప కవిపండితులతో ఆ సభ సరస్వతీమయమై శోభిల్లింది. కర్నూలులో నిర్వహింపబడిన ఆ సాహితీ సభలో ఎంతగా వెతికినా కుకవి(కాకవి) ఒక్కడు కూడా కనిపించలేదు అని ఊహించి చెప్పే సందర్భం.

    స్తవ ముప్పొంగ నపర్ణ శ్రీ బులుసు వంశ ఖ్యాతినే పెంచగా
    నవనిన్ జేసె శతావధానమును తా నా వాణియై, మేటి స
    త్కవులై వెల్గిరి పృచ్ఛకుల్ ఘనులు సత్కారార్హు లచ్చోట కా
    కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (20-12-2018)

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    కవితా శ్రీ విలసద్వధాని వరులౌ గండ్లూరి వారుండ , బం...
    ధవిశేషమ్మగు కైతలో ఘనులు వైద్యం వారలుండంగ , స...
    త్కవి ! యెట్లందువు లేరటంచవునులే ! గర్వాంధుడౌ మత్తుడౌ
    కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కవిపండితులకు నిలయము ,
      ప్రవిమలచర్చాదిరూపవాగ్యుద్ధమునన్
      భువి గెలువగలడె వేరొక
      కవియొక్కడు ? గాన ., రాడు కర్నూలు పురిన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. కవిపండితులకు నిలయము ,
      ప్రవిమలచర్చాదిరూపవాగ్యుద్ధమునన్
      భువి గెలిచిన పరదేశపుఁ
      గవియొక్కడు గానరాడు కర్నూలు పురిన్ !

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  17. కవితలపొత్తములెన్నియొ
    అవనిన జూడని విధమున యద్భుతమొదవన్!
    కవులందరేగిరచటకు
    *"కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"*
    --------యెనిశెట్టి గంగా ప్రసాద్
    కామారెడ్డి.
    ***సవరణతో..🙏

    రిప్లయితొలగించండి
  18. వివరణ దెలియనివారికి
    కవియొక్కడు కానరాడు కర్నూలుపురిన్
    కవితాశక్తియు యుక్తియు
    భవితవ్యముమెచ్చునట్లు బంచిరికవులే!

    రిప్లయితొలగించండి


  19. స్తవములు మెండుగ చేయుచు
    కవనము లల్లుచు జగతిన ఖ్యాతిని పొందన్
    కవితావిలువలెరుగని కు
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్*?

    అవురా!యిట్టన దగునా
    "కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"*?
    చవులూరించగ వ్రాసెడు
    కవులట కోకొల్లలుగను గలరది వినుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "జగతిని" అనండి.

      తొలగించండి
  20. కవులచ్చట సత్కవులే
    చవులూరెడి రీతి రచన సాగింతురులే
    కవి! నిజమే!! నీ మాదిరి
    *"కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"*

    రిప్లయితొలగించండి
  21. సవరించిన పూరణ:

    సవనము వలె కవనమునకు
    చవిగొని బహుమతులనీయ చక్కని రీతిన్
    స్తవనీయుడు గానట్టి కు
    కవి యొక్కడు గానరాడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
  22. కవిరైతన్నలకావ్యబంధు ,కవిరక్షాభీమ ,కావ్యార్ధవా
    దవివాదాంబరకావ్యవస్తువులు, విద్యాభ్యాసభద్రత్వమన్
    కవిసంక్షేమఫలాదులిత్తురను- సర్కారాంధ్రచాటింపుతో
    *"కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్"*

    రిప్లయితొలగించండి
  23. కవులెందఱొయుండగనట
    కవియొక్కడుగానరాడుకర్నూలుపురిన్
    నవమానంబుగదలతురు
    కవిపుంగవులెల్లదీనికర్నూలుపురిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పురిన్ + అవమానంబు = పురి నవమానంబు' అవుతుంది.

      తొలగించండి
  24. కవులుండగఁ గనకుండగ
    వివరమ్మే తెలియకుండ, వెదకుచుఁ బురిలో
    నెవరెవరా మాటన్నది
    *"గవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"*

    రిప్లయితొలగించండి
  25. అవతార మూర్తి శ్రీ రా
    ఘవేంద్రు పుణ్యతిథికేగె ఘనమైన కవుల్
    కవితాలాపనకు, వెతుక
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పుణ్యతిథి కేగ' అనండి.

      తొలగించండి
  26. కవులా భారవులా రవీంద్రులు నొకోకావ్యార్థమార్తాండులో
    స్తవనీయాత్మవిధేయులోవిదులునోసాహిత్యసామ్రాట్టులో
    భవులోభావుకులోగవీశులనవిశ్వశ్రేయులేధూర్తుడౌ
    *"కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్"*

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    సందర్భము:
    శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులుగారి గురించి.
    శ్రీ వైద్యంవారు పాలమూరు జిల్లా కురుమూర్తి పుణ్యక్షేత్ర వాస్తవ్యులు. కర్నూలులో స్థిరపడిన సత్కవి వరేణ్యులు. కర్నూ లంటేనే వైద్యం వారు గుర్తుకు రాని సాహిత్యాభిమాని యుండడు. వారి వలె సంప్రదాయ కవిత్వాన్ని వెలయించిన వారు కర్నూలు పట్టణంలో మరొకరు కనిపించ రంటే అతిశయోక్తి కాదు.
    ప్రస్తుతం వారి రచనలలోని ఒక విశిష్టమైన శతక సంపుటాన్ని మటుకు పరిచయం చేస్తున్నాను.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    నవవిధ భక్తి నిలయమై

    భవతారకమయిన కవిత వ్రాసెడు *వైద్య*

    *మ్ము* వలెను రచింప నింకొక

    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    20.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      వైద్యం వారిని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  28. కవియొక్కండునుగానరాడుగదయాకర్నూలు
    నన్జూడగన్
    నవునా!వారలువెళ్ళిరేమొమఱియాయాదాద్రిసాన్నిధ్యము
    న్గవనంబల్లగనొక్కరొకరుగసత్కావ్యములింపొందగా
    స్తవనీయంబయిపల్గురిన్మీగులయాశాజ్యోతివెల్గించెసూ

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. నివసింతురు నాగరికులు
      వివేకవంతులు కడింది విజ్ఞానముతోఁ
      గవు లెందఱొ కల రచటఁ గు
      కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్


      అవిరామమ్ముగఁ దిర్గి తిర్గి యిక నే నా పట్టణంబందునన్
      సువిశా లాపణ ముత్క్రమించి చనఁగన్ సొమ్ముల్ మహా చోరు పా
      లు విచిత్రమ్ముగ నూఱడింపు గల పల్కుల్ విన్న నొప్పౌను నా
      కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునం జూడఁగన్

      [నాకు + అవి = నాకవి]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      ముఖ్యంగా రెండవ పూరణ విరుపు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నది.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చవినిన్ నెల్లురు రాములన్న వలనన్ సంగ్రామమున్ జేయుచున్
    భువిలో నాంధ్రులు ముఖ్యపట్టణముగా ముద్దాడ కర్నూలునే
    కవులచ్చోటకు చేరిరాగ;... త్వరలో గ్రాసమ్ము కోల్పోవగా
    కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్

    కవి = నీటి కాకి (?)

    రిప్లయితొలగించండి
  31. శంకరా భరణము నేటి సమస్య
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్
    కంద పద్య పాదము నా పూరణ సీసములో

    ఒకడు వరద రాజ శతకము వ్రాసి దానిపై సమీక్ష వ్రాయించు కొనదలచి నెల్లూరు వెళ్ళగా జి సీతాదేవి గారు లేరు లండన్ వెళ్లారు . పగుడుపాడు వెళ్ళగా కోట వారు అమెరికా వెళ్లారు . తిరుపతి వెళ్ళగా రాణి సదాసివ మూర్తిగారు మొదలగు కవి వరులెల్లరు అవధాన గోష్టికి వెళ్లారు రాష్ట్రములోని మేటి కవులెల్లరు రాజధాని అమరావతి మాతృ భాష ఉత్సవ సంబరాలలో పాల్గొనుటకు వెళ్లారు చివరకు కర్నూలు లో నైన మేటి కవులు గలరేమోనని నా బోటి చిరుకవి దగ్గిరకు రాగ నేను చెప్పిన పద్యము ఇది (సరదాగా సుమా)



    సంక్రాంతి పండుగ సంబరా లుననుచు
    కొందరు నవధాన గోష్టి పెట్ట
    వెడలిరికొoదరు విబుధులు, రాజదా
    ని యమరావతి చనె నెమ్మి తోడ
    వర కవులెల్లరు పరుగులిడుచు మాతృ
    భాష యుత్సవములన్ పాల్గొనంగ,
    ఘనత గలకవి యొక్కఁడుఁ గాన రాఁడు క
    ర్నూలు పురిన్ నేడు, చాలు తిరుగ


    వలదు వీధివీధికి నేడు, తెలిసి యున్న
    వచ్చు వాడవు కాదుగా, వరద రాజ
    స్వామి శతకము వీక్షించ సర్వ రసులు
    దొరక రని చిరు కవిబల్కె దోస్తు తోడ

    పూసపాటి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమీక్ష కొరకు వాట్సప్ సమూహం చూడండి.

      తొలగించండి
  32. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....

    నవనవ భావబంధురపు నవ్యసుధామయ సూక్తి పద్యముల్
    కవనము లల్లి మిక్కిలి సుగౌరవ సిద్ధిని పొందినట్టి ధీ
    కవివరు లెందరో కలరు కాని కవిత్వములోన నజ్ఞుడౌ
    కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి మూడుపాదములను చంపకమాలనుండి మత్తేభమ్ముగా మార్చాలి కదా సర్

      తొలగించండి
  33. అవకతవకగా నల్లితి
    కవితలవి యనుచు మురిసితి గర్వపడితినే
    చవటను ననుబొగడగ హాఁ
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
  34. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పవిదిని ఛందము తోడను
    కవనము పలికెడి విబుధులు కాపురముండన్
    కవితలనలేని చవట కు
    కవి యొక్కడు గానరాడు కర్నూలుపురిన్.

    రిప్లయితొలగించండి
  35. అవురా! యేమి? యఖర్వగర్వమది నీ వామాడ్కి వాక్రుత్తువే?

    యవిరామార్థిజనాళిదానరతులై న్యాయజ్ఞులై యుండ, వా

    రవినీతు ల్గడు లుబ్ధులందు వవురా! యజ్ఞానివౌ కుర్రకుం

    కవి, యొక్కండును గానరాడు గద యా కర్నులునం జూడగన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  36. కవిపోషకులకు వోలెన్
    కవివరులకు పట్టుకొమ్మ కర్నూలు గదా!
    కవనమున పస కొఱవడిన
    కవి యొక్కడు కానరాడు కర్నూలు పురిన్!

    రిప్లయితొలగించండి
  37. ఎవరికి వారై స్వయముగ
    కవనంబుల సేద్యములను గావించుటయే
    యవకాశముకై జూచెడు
    కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"

    రిప్లయితొలగించండి


  38. కవిసమ్మేళనములనగ
    జవమున సభలోన చేరి చక్కని రీతిన్
    కవితలు చెప్పగ నేర్వని
    కవి యొక్కడు కాన రాడు కర్నూలు పురిన్.

    4.వపూరణ
    రవిగాంచనివియు నిలలో
    కవిగాంచుననెడి విధముగ కందెనవోలన్
    కవులుండగనన తగునా
    కవియొక్కడు కానరాడు కర్నూలు పురిన్.

    కవిత్వము చెప్ప లేనను
    కవియొక్కడు గానరాడు కర్నూలు పురిన్
    నవలీలగ స్త్రీ బాలలు
    కవితా వ్యవసాయములను కావింతు రొగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణ మొదటి పాదంలో మొదటి గణం జగణ మయింది. "కవితలను చెప్పలేనను" అనండి.

      తొలగించండి
  39. స్తవనీయంబగు కైతలన్ పలికి, భాషాయోష చిత్తమ్ములో
    నివసంబుండఁ బ్రగాఢమైన దయతో నిత్యమ్ము, పేరొంది రా
    కవివర్యుల్, సరిలేరు వారికి భువిన్ గాలించ, గర్వాంధుడౌ
    కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ౨.
      స్తవనీయంబగు కైతలన్ పలికి, భాషాయోష చిత్తమ్ములో
      నివసించన్ తగ గాఢమైన దయతో నిత్యమ్ము, పేరొంది రా
      కవివర్యుల్, సరిలేరు వారికి భువిన్ గాలించ, నజ్ఞానియౌ
      కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్

      తొలగించండి
  40. గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు అసనారె

    రిప్లయితొలగించండి
  41. అవధానమ్మని పండితోత్తముల నాహ్వానించె మాన్యుండు గౌ
    రవనీయుండగు కంది శంకరులు హైద్రాబాదుకున్ బ్రేమతో
    కవయిత్రుల్ మరియున్ కవుల్ కదలిరా గ్రామంబు నే వీడగా
    కవియొక్కండును గానరాఁడు గద యా కర్నూలు నన్ జూడగన్.

    రిప్లయితొలగించండి
  42. సవరించిన పద్యం

    జవదాటక గురువాజ్ఞను
    కవిసమ్మేళణము కొరకు కదల కవుల పా
    టవముఁ బరీక్షింపంగ కు
    కవియొక్కడు కానరాడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
  43. మత్తేభవిక్రీడితము
    కవితాకన్యక వెల్గులీనునె యలంకారాదులున్ లేకనే? 
    స్తవనీయంబగునే కవిత్వమువిడన్ సామాజికశ్రేయమున్
    వివరాలన్నియు నేర్చికూర్చగల ప్రావీణ్యాదులున్లేని యే
    కవి యొక్కండును గానరాడుగద యా కర్నూలునన్ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  44. కందం
    శ్రవణీయంబుగు శబ్దా
    ల వర్ణణ లెసఁగ కవిత్వ ప్రావీణ్యమునన్
    కవితా వేశవిహీనతఁ
    గవియొక్కడుఁ గానరాఁడు కర్నూలు పురిన్

    రిప్లయితొలగించండి
  45. దేవిక
    -----

    అవగాహనమ్ము తోడను
    నవకమ్మౌ కవితలల్లి నలువొందెడు స
    త్కవులే యుండిరి గాని కు
    కవి యొక్కడు గానరాడు కర్నూలు పురిన్ !

    రిప్లయితొలగించండి
  46. భువిలోపేరునునొందగా సతము దుర్బుద్ధిన్ మహాపండితుం
    డెవరో వ్రాసిన పద్యముల్ తనవిగానేసిగ్గు లేకుండగా
    కవిసమ్మేళన వేదికన్ జదువ సంకల్పించు దౌర్భాగ్యుడౌ
    కవియొక్కండును గానరాడు గద యా కర్నూలునంజూడగన్.

    రిప్లయితొలగించండి
  47. కారు గుర్తును గూల్చగ గలిసి వారు
    కూట మనుపేర దిరిగిరి పేట పేట
    గెల్వ లేకనె పోయిరి కేళి నందు
    ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ

    రిప్లయితొలగించండి
  48. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కవి యొక్కండును గానరాఁడు గద యా
    కర్నూలునన్ జూడఁగన్

    సందర్భము: కర్నూలు జిల్లాలో ఎంతోమంది కవివరేణ్యు లున్నారు.
    చాలవరకు పైన పేర్కొన్న ఒక్కొక్క యింటి పేరుతో నలుగురో ఐదుగురో కవు లున్నారు.. వారిలో కొందరిని యింటిపేర్లతో స్మరించుకుందాం..
    *మేడవరం* చెన్నకేశవ శాస్త్రి, రామబ్రహ్మ శాస్త్రి, లక్ష్మీ నృసింహకవి, సుబ్రమణ్య శర్మ, సుబ్రమణ్య శాస్త్రి,
    *వైద్యం* ఆంజనేయులు, వేంకటేశ్వరాచార్యులు,
    *తెల్కపల్లి* విశ్వనాథ శర్మ, వేంకటరమణ శర్మ, వేంకట సుబ్బరామశర్మ, సుబ్రమణ్య యజ్వ, పాండురంగ శర్మ,
    *సురభి* భానుమూర్తి, వేంకట హనుమంత రామ శాస్త్రి, సుబ్బయ్య,
    *పాలుట్ల* మృత్యుంజయ రావు, లక్ష్మణ కవి, వేంకట నరసయ్య, సుబ్బారావు
    *నాగెళ్ళ* రామయ్య, ఏలియా, శివమూర్తి
    *శ్యామ* శాస్త్రులు
    *వఝా* పాపకవి
    *బత్తుల* మార్కు, సుబ్బరాయడు
    *బొడ్డు* చర్ల చిన తిమ్మయ్య, లోకనాథుడు, సుబ్బకవి, బొడ్డు పల్లి రామకృష్ణ కవి
    *భారతుల* నరసింహ శాస్త్రి, పేరయ్య శాస్త్రి, వేంకటరామకవి, శివరామ శర్మ
    *రామ* కవి భోగ ఘనుడు, రామనామాత్యుడు, రామరాజు రంగపరాజు, రామలింగమ్మ, రామావఝల కొండుభట్లు, రామశ్రౌతి, రామేశ్వర పండితులు
    *శ్రీ ధర* చంద్ర శేఖర శాస్త్రి, నరసింహ యజ్వ, పరశురామ శాస్త్రులు, భట్ట రామేశ్వరయాజులు, భట్లు, రామసుబ్బకవి, విశ్వపతి శాస్త్రులు, సుబ్రమణ్యం
    *గొట్టి* ముక్కల గోపాల కృష్ణ శాస్త్రి, గొట్టి ముక్కల సుబ్రమణ్య శాస్త్రి
    వీళ్ళందరూ సత్కవులే! దుష్కవి ఒక్కడూ కనిపించడు.
    ( *శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారి కర్నూలు జిల్లా కవి తరంగిణి* అనే పుస్తకం ఆధారంగా...వారికి కృతజ్ఞతలతో)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కవులై రెందరొ కొందరిన్ దలచెదన్
    కర్నూల్ జిలాలోన.. మే
    డవరుల్, వైద్యము, తెల్కపల్లి, సురభుల్,
    పాలుట్ల, నాగెళ్ళ, శ్యా
    మ, వఝా, బత్తుల, బొడ్డు, భారతుల,రా
    మ శ్రీధరుల్, గొట్టి... దు
    ష్కవి యొక్కండును గానరాఁడు గద యా
    కర్నూలునన్ జూడఁగన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    20.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి