11, ఫిబ్రవరి 2019, సోమవారం

సమస్య - 2927 (సింగము నోటన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"
(లేదా...)
"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"

135 కామెంట్‌లు:

  1. సింగారముల నొక భవన
    ముం గట్టిరి, దానిపైన ముచ్చటగా ని
    ల్పంగ మృగమ్ముల బొమ్మలు,
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్.

    రిప్లయితొలగించండి
  2. సింగా రించగ చీరను
    బంగా రపురంగు లందు బామిని మెరిసెన్
    భంగిమ మార్చిన కొంగును
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి


  3. భంగును త్రాగి పలికెదవ
    చెంగున ప్రాంగమున దూకి చెప్పుము భడవా
    తింగరి బుచ్చి, యెచటరా
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్?

    ఇవ్వాళ పెందరాళే ముందే వచ్చేసిందేమిటి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రాంగణము దూకి...' అంటే బాగుంటుందేమో?
      మూడు గంటలకే మొలకువ వచ్చింది. నిద్ర పట్టలేదు. సమస్యకు పూరణ సిద్ధమయింది. షెడ్యూల్ చేసిన సమయాన్ని ముందుకు జరిపాను.

      తొలగించండి
    2. కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్ పూరణ గుర్తుకు వచ్చింది.

      తొలగించండి


  4. భంగును త్రాగినాడతడు బారుగ నేలను తాకినాడు తా
    చెంగున లేచినాడు తన చేతిని చాపుచు తాళమేయుచున్
    తింగరి బుచ్చి యొక్కడు కుదేలుమనంగ భళారె చెప్పెగా
    "సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"

    ఇవ్వాళ్టికి కత సమాప్తం :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ తింగరిబుచ్చి పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. వంగల భూమిని భామిని
    గంగను చేపలను మ్రింగి గాఢపు ధ్వనినిన్
    పొంగెడు గర్జన జేయగ:👇
    "సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వంగదేశాన్ని వదిలేట్టు లేరు!

      తొలగించండి
    2. 🙏

      వంగ దేశము వదిలి ఆంధ్రకు రాగా, రెండేళ్ళు మతి చలించినది...ఇంకా కోలుకో లేదు...

      😊

      తొలగించండి


  6. కొంగున నంగీ దోపగ
    తింగరి మనువాడెనర్ర తివిరి జిలేబిన్
    ఠంగున వచ్చెను తెలివిడి
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ దంపతులలో సింహ మెవరు? చిలుక యెవరు?

      తొలగించండి

    2. :)

      ఇంకెవరు ? :)

      సారంగమ్మది! సింహమధ్య తరుణీ! శాతోదరీ శ్యామలా :)

      జిలేబి

      తొలగించండి
    3. కారమ్మొల్కిన కందలల్లుచును తా కంగారు జేయున్ కవిన్

      తొలగించండి
  7. బంగరు వెండితీ గెలను బాగుగ నేసిన పట్టు చీరెలన్
    ఛెంగున తెచ్చి కట్టుకొని చేడియ లందరు మోదమందగా
    రంగుల బొమ్మలన్ గనిన లాంఛన మంచును ప్రస్తుతిం చెనే
    సింగము నోటిలోన నొకచిల్క వసించెఁ గడున్ ముదంబునన్

    రిప్లయితొలగించండి
  8. ( సింగడు తన భార్య సింగారితో వీరనారి ఝాన్సీరాణి
    విగ్రహం చూపించి అంటున్నాడు )
    సింగరి ! చూచినావు గద !
    శిల్పమిదెంతటి చిత్రమైనదో !
    సంగరరంగమందు దన
    సత్తువమేరకు దెల్లవారలన్
    జెంగున నశ్వమెక్కి యసి
    జీల్చిన నాయిక ఝాన్సిలక్ష్మి యన్
    సింగము నోటిలోన నొక
    చిల్క వసించె గడున్ ముదంబునన్ .

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    రంగదనూనభక్తి మది రంజిల శ్రీహరి నమ్మె , మిత్తియన్
    బెంగయె లేదు , సర్ప విష భీతియె లేదు , కరీంద్రమొండు ద్రొ...
    క్కంగనె నవ్వు బాలకుని గాంచిన వారికి దోచెఁ "దండ్రియన్
    సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రహ్లాదుని ప్రస్తావనతో మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గు రు మూ ర్తి ఆ చా రి

      ఆ హా ! ! నమో నమః

      తొలగించండి
    3. శ్రీ గురుమూర్తి గారికి.. శ్రీ శాస్త్రి గారికి ధన్యవాదాలు 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి


  10. రంగడి కేళిని నాటక
    రంగంబుగ లోకమాయె! రంగుల కలలో
    హంగులు నావే యనుకొని
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. చెంగట గుడి పై చెక్కిన
    రంగుల బొమ్మల ను గాంచి రయమున వ్రాలెన్
    హంగు లు చక్కగ నుండ గ
    సింగము నోటన్ వ సిం చె చిలుక ముదము నన్

    రిప్లయితొలగించండి


  12. జీపీయెస్ వారికంకితము :)



    బెంగాల్బేనర్జీ తా
    కంగారసలుపడదు తడకట్టు తనకు లే
    దంగట! రాష్ట్రము భోజ్యము!
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. రంగుల రాట్నము దిరుగుచు
    బంగరు కలలం దుతేలు భామిను లనగా
    వంగిన బానిస భర్తకు
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి
  14. చెంగట గుడి పై చెక్కిన
    రంగుల బొమ్మల ను గాంచి రయమున వ్రాలెన్
    హంగు లు చక్కగ నుండ గ
    సింగము నోటన్ వ సిం చె చిలుక ముదము నన్

    రిప్లయితొలగించండి
  15. బెంగాలీ మాంత్రికు డొక
    డుంగరమును జేతదిప్పి యొక మంత్రంబున్
    సంగతముగ బఠియించిన
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్.

    రిప్లయితొలగించండి
  16. 11ఫిబ్రవరి 2019,సోమవారం
    శంకరాభరణం
    సమస్య

    "సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"

    నా పూరణ. కం
    **** ***

    రంగమ్మ చీరపై గల

    సింగారపు బొమ్మలెన్నొ చిత్రము గొలిపెన్

    భంగి మొకటి గల దిట్టుల

    "సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  17. పొంగు రుధిర ధారల నర
    సింగము నోటన్, వసించె చిలుక ముదమునన్
    కొంగున శుభ్రము దుడుచుచు
    హంగుగ శాంతపరచి పతి యంకము నందున్

    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా సత్యనారాయణ
    సంహిత,వేదము లెరిగియు
    బృంహిత(ఏనుగు గీక) మరిచె ;బేరపు మ్లేచ్ఛుల్
    పెన్(ం)హితులనుకొని భారతి
    సింహము నోటన్ వసించె జిలుకముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టానుండి
      ఆర్యా,
      బృంహిత నొకమారు మరిచె;బేరపు మ్లేచ్ఛుల్(టైపాటును సవరించగా)

      తొలగించండి
    2. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెన్ + హితులు' అన్నది 'పెంహితులు' కాదు.

      తొలగించండి
  19. డా.పిట్టా సత్యనారాయణ
    అంగ విహీనులా మహిళ లన్నిట నీ నరులన్ గ్రసింపరే
    భంగము వారి దూకుడులు భర్తల ముందర బిల్లి కూనలై
    హంగులవెన్నియున్న తమ హాయియె నోర్పున గన్న రీతినిన్
    "సింగము నోటిలోన నొక చిల్క వసించె గడున్ ముదంబునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అంగ విహీనులు'?

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా, వారికి కాళ్ళుచేతులు లేవా?

      తొలగించండి
  20. రంగడి గుడిలోఁ దిరుగుచు
    ప్రాంగణమందు గల కప్పు పైనన్ వ్రేలా
    డం గమిగా గట్టిన బా
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. శృంగము జేరగా పలుకు జిల్కల కొల్కివిధాత ప్రేమ యన్
      గంగయె,కావ్యమయ్యె గనగా కలభాషిణి పాత్రమయ్యె నా
      పింగళి వంశ చంద్రుడు కవీశ్వరు డాఘను సూరనార్య ధీ
      సింగము నోటిలోన నొక చిల్క వసించె గడున్ ముదంబునన్

      తొలగించండి
    3. రాకుమార గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ధీ సింహము' దుష్టసమాసం.

      తొలగించండి

  21. రంగాపుర దేవాలయ
    చెంగట నొక శిల్పి చెక్కె సింగము బొమ్మన్
    రంగుగ గర్జించెడి యా
    "సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేవాలయ చెంగట' అనడం సాధువు కాదు. "రంగాపురమున గల గుడి। చెంగట..." అనండి.

      తొలగించండి
  22. ౧.
    క: రంగుల ప్రతిమలనుంచగ
    నంగణమునను కనువిందు చేయ, నాశ్చర్యముగా
    నింగిపయి నుండి కనుగొని
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదానికి వాట్సప్ లో సవరణ సూచించాను. చూడండి.

      తొలగించండి
  23. రిప్లయిలు
    1. శంకరాభరణము నేటి సమస్య

      సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్

      ఇచ్చిన పాదము కందము నాపూరణ సీసములో

      బలి చక్రవర్తి పాతాళ లోకములో ఉండగా శ్రీహరి వైకుంఠము వదలి కాపలా గా వెళతాడు. అప్పుడు శ్రీహరిని నన్ను వదలి వెడలుట న్యాయమా అని లక్ష్మి దేవి అడుగగా నువ్వు సత్వరమే బలిపురమునకు వెళ్ళు అతని గృహములో ఉండమనగా ఆ రాక్షసుని ఇంటిలో ఎలా ఉండాలి అని కంగారు పడి మనసును సర్ది చెప్పుకొని బలిపురమునకు లక్ష్మి వెళ్ళు
      సందర్భము



      పాల సముద్రమున్, పడతిని వదలి మీ
      రా బలి పురమున రమ్య గతిని

      వాసము చేయుచు మోసము చేయుట
      తగునా బలిధ్వంసి, తమరు లేని

      వైకుంఠమున నాకు వాసమేల యనుచు
      శ్రీహరినడిగెను సిరుల తల్లి ,

      వగచ వలదు, బలి నగరము లో నీవు
      వాసము చేయుము పద్మ వాస

      సత్వరమని బల్కె సరసిజ నాభుడు,
      వల్లె యనుచు లక్ష్మి వదలుచు తన

      గూటిని , (సింగము నోటన్ వసించెఁ జి
      లుక ముదమునను) పలుకులు నిజము,


      కాలమహిమ గద, యకటా! పాల కడలి
      లోన నివసించు చుండెడి దాన , ననుచు
      బ్రాహ్మణ వనిత గా మారి బలిపురమున
      కు పయ నంబయ్యె శ్రీహరి కోర్కె తీర్చ

      తొలగించండి
    2. గురువు గారు నమస్కారము వాట్సప్ లో మీరు సూచించిన ప్రకారము సవరణ చేసిన పూరణము

      తొలగించండి
    3. పూసపాటి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. ముంగిటి సింగపు శిలయే
    బంగరు రంగుల చిలుకకు భద్రతనొసగెన్,
    అంగిటిగుంటయె గూటిగ
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్..

    రిప్లయితొలగించండి
  25. పొంగిరిపో జనులంత వి
    నంగ యువకుని నవధానమంతను శ్లాఘిం
    చంగ యనిరి వహ్వా కవి
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కవి సింగము' దుష్టసమాసం.

      తొలగించండి
  26. మంగళకరమగు బెండ్లిని
    యంగీకృత పతినిగూడి యద్భుతరీతిన్
    సంగరమౌ కాపురమున
    సింగమునోటన్ వసించె జిలుక ముదమునన్

    జిలేబిగారిలాంటి వారు పతికి బదులు సతిగా మార్చుకోవచ్చు!(with lighter heart)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భంగురమైనబుద్ధి బరభామను నుంచగ లంకలోన, నా
      సింగము నోటిలోన నొకచిల్క వసించె;గడున్ ముదంబునన్
      బెంగనువీడె వానరుల వీరుడు దూతగ రాఘవోత్తమున్
      యంగుళి నీయగా,మిగుల యాదరమందున దీవెనీయగన్

      తొలగించండి

    2. :)

      మీ మాట మరో కందాన్ని గిట్టించెను :)


      జిలేబి

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పెండ్లిని నంగీకృత...' అనండి. 'రాఘవోత్తమున్ + అంగుళి' అన్నపుడు యడాగమం రాదు. "రామమూర్తిదా। యంగుళి" అందామా?

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా, సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
  27. కంగారుపడగ వలదుర
    సింగమయది ఱాయితోడ చెక్కినదేసూ
    జెంగట నెగురుచుగనినా
    సింగమునోటన్ వసించె జిలుకముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గని యా సింగము...' అనండి.

      తొలగించండి


  28. అంగజు కేళిని తేల్చగ
    పొంగుచు నయ్యరు జిలేబి పొలతిని వరుడై
    చెంగట, ణిసిధాత్వర్థపు
    సింగము నోటన్ వసించె జిలుక ముదమునన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. రంగని యింటికావలను రంగులమేడకు చెక్కినట్టియా
    సింగమునోటిలోన నొకచిల్కవసించె గడున్ముదంబునన్
    మంగళమే గృహంబునకుమన్ననతోడనునుందురెప్పుడున్
    భంగములొందరెచ్చటనుభావికడుంగడుపుణ్యమూర్తులౌ

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. భంగ పడంగ నేలనొ శుభాంగి ,వడిన్ బలి మందిరంబు చే
      రంగ వలెన్ హరిప్రియ ,విరాజితమున్గలు గంగ చేయుమా,
      డింగరి వాసమున్, వలదు డింబము, క్షేమము కల్గుగా యనన్
      బెంగను వీడి యా చపల బీరము తో బలి గీము చేరెగా,
      సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్

      తొలగించండి
    2. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. భృంగం బక్కజముగ జి
    హ్వాంగమ్ముగ మారి యంత నతి శీఘ్రమ, వే
    దాంగజ్ఞుఁడు మంత్ర జలము,
    సింగము నోటన్ వసించెఁ, జిలుక ముదమునన్

    [చిలుకు = చల్లు]


    అంగ విలాస లీలలు మహత్తరమై చన గోత్ర తుల్యమౌ
    భంగినిఁ గానిపించు నొక పాదప కుంజర రాజ మందునన్
    సంగడి కాని చెంతను వసంత దినమ్ముల వృక్ష కాండమన్
    సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్

    [ఆ మహావృక్షంపుఁ దొఱ్ఱ తెఱచుకొన్నసింగపు నోటినిఁ బోలె నన్న భావన.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.
      ధన్యవాదములండి కుమారార్యా.

      తొలగించండి
  32. పొంగారు వాన కురియగ
    భంగురమైన వసతివిడి పైకెగసిచనన్
    రంగుల శిలపై చెక్కిన
    సింగము నోటన్ వసించె జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి
  33. బలి చక్రవర్తి పాతాళ లోకములో ఉండగా శ్రీహరి వైకుంఠము వదలి కాపలా గా వెళతాడు. అప్పుడు శ్రీహరిని లక్ష్మి దేవి అడుగగా నువ్వు సత్వరమే బలిపురమునకు వెళ్ళు అతని
    గృహములో ఉండమనగా ఆ రాక్షసుని ఇంటిలో ఎలా ఉండాలి అని కంగారు పడి బెంగ
    పెట్టు కుంటుంది అప్పుడు శ్రీహరి పలుకులు

    కంగారు వలదు లక్ష్మీ,
    భంగమ్ము కలుగదు నీకు బలి సదనమునన్
    బెంగేల?ననెహరి,యపుడు
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్





    రిప్లయితొలగించండి
  34. పొంగిరిపో జనులంత వి
    నంగ యువకుని నవధానమంతను శ్లాఘిం
    చంగ యనిరిటుల వహ్వా
    సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బంగరు వన్నెదౌ శుకము భర్తను కాచుచు భ్రాతనొల్లుచున్
    రంగము రాజకీయమున రంగుల రాట్నము త్రిప్పగోరుచున్
    తొంగుచు చూచి వేచుచును దూకుచు భళ్ళున కూతకూయగా:
    👇
    "సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"

    రిప్లయితొలగించండి
  36. రంగా చూడుము చిత్రము
    సింగము నోటన్ వసించె, జిలుక ముదమునన్
    ముంగిట జోస్యము చెప్పుచు
    భంగపడియెతాను నోట బందీ యగుచున్.

    రిప్లయితొలగించండి
  37. కంగారులె జిక్కెనుగా
    కంగారుగ దిరుగు చుండ కానన మందున్ ;
    బెంగయె యెరుగక యటవిని
    సింగము నోటన్ ; వసించెఁ జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి
  38. సవరణతో :
    రంగాపురమున గల గుడి
    చెంగట నొక శిల్పి చెక్కె సింగము బొమ్మన్
    రంగుగ గర్జించెడి యా
    "సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"

    రిప్లయితొలగించండి
  39. రంగడను బాలుడు గనగ
    సింగపు నాలుక యతడికి చిలుకగ దోచెన్
    చెంగున గెంతుచు నరచెను
    "సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"

    రిప్లయితొలగించండి
  40. గురువు గారు, డాక్టర్ సీతాదేవి గారి కందపద్య కదంబము పుస్తకంలో ఈ బ్లాగు గురించి తెలుసుకున్నాను. నేను చేసిన మూడు పూరణలలో యతి, గణ దోషాలు దొర్లాయి. వారి పుస్తకం నుంచి ఒక పాత సమస్య (ఇక్కడ మీరు ఇచ్చినదే) పూరించే ప్రయత్నం చేశాను. చిత్తగించగలరు.

    దరహాసము అధరముపై
    అరవిచ్చిన పూవువోలె కళకళ మెరిసే
    తరుణీమణి మోమున మమ
    కారము పాయసమునందు గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారెడ్డి గారూ,
      మంచి భావంతో పూరణ చేశారు. బాగుంది.
      'అరువిచ్చిన' అనండి. 'మెరిసే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. కృష్ణారెడ్డిగారు నా ద్వారా బ్లాగుకు పరిచయం కావడం ముదావహము!
      రెండవ పాదములో యతి సరిపోయినదా?

      తొలగించండి
    3. అ, క ల మధ్య యతి కుదురుతుంది కదా?

      తొలగించండి
    4. సమస్యా పాదము కా అని దీర్ఘముతో నున్నది కనుక మొదటి మూడు పాదములు కూడా దీర్ఘము తోనే ఉండాలి.
      తిరిగి ప్రయత్నించండి.

      దరహాసము + అధరముపై = దరహాస మధరముపై – అవుతుంది. ఉత్వ సంధి.
      అధరము పైన్ + అర = అధరము పై/ నర
      దరహాసమ్మధరము పై
      నర విచ్చిన అంటే సరిపోతుంది.
      పద్యమున మొదటి యక్షరము తప్ప మిగిలిన చోట్ల అచ్చు వ్రాయ కూడదు.

      రెండవ పాదములో
      అ - క లకు యతి మైత్రి లేదు.
      2, 3 పాదాలలో 4 వ గణము మొదటి యక్షరము యతి.
      వోలె నయ్యది (లేక నాహా ) అనిన అ కు అయ్యది లో అ కు (లేక ఆహా లో ఆ కు) యతి సరిపోతుంది.
      మెఱసెన్ + తరుణీ = మెఱసెం దరుణీ – ద్రుత సంధి.
      మెఱసెం / దరుణీ మణి అంటే సరిపోతుంది.

      తొలగించండి
    5. యతిమైత్రి కలిగిన అక్షరాలు....
      1) అ-ఆ-ఐ-ఔ
      2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
      3) ఉ-ఊ-ఒ-ఓ.
      గమనిక - హల్లుతో పాటు దాని మీది అచ్చుకు కూడా యతిమైత్రి పాటించాలి. ఉదా- i)క-కా-కై-కౌ; ii)కి-కీ-కృ-కౄ-కె-కే; iii)కు-కూ-కొ-కో.
      4)క-ఖ-గ-ఘ
      5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
      6) ట-ఠ-డ-ఢ
      7) త-థ-ద-ధ
      8) ప-ఫ-బ-భ-వ
      9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
      ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
      ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
      ంట,ంఠ,ండ,ంఢ-ణ;
      ంత,ంథ,ంద,ంధ-న;
      ంప,ంఫ,ంబ,ంభ-మ.
      10) పు,ఫు,బు,భు-ము.
      11) ర-ఱ-ల-ళ.
      12) న-ణ.
      13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే (i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ; (ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే; (iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.
      14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
      15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ.

      తొలగించండి
    6. కృష్ణారెడ్డి గారూ:

      శుభాభినందనలు! నా పేరు ప్రభాకర శాస్త్రి. నేను సీతాదేవి గారి అన్నయ్యను. వయసులో పండ్రెండేళ్ళూ, శంకరాభరణంలో ముచ్చటగా మూడు నెలలూ ఆవిడ కన్నా సీనియరును.

      మరోలా మీరు అనుకోకపోతే మీకు ఒక అడగని సలహా:👇

      మీ పద్యాలు విడిగా కాకుండా శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి పద్యం క్రింద "ప్రత్యుత్తరం" నొక్కి ప్రచురించండి. వారు తప్పక స్పందించి మీకు రోజూ సవరణలు, సూచనలూ, కిటుకులూ తెలిపెదరు. మూడు సంవత్సరాలలో నేర్వలేనివి మీరు మూడు నెలలలో నేర్వగలరు.

      నేను, సీతాదేవి గారు, ఇలాగే ప్రారంభించాము.

      స్వస్తి.

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    8. గురు తుల్యులు శ్రీ కామేశ్వర రావు గారికి‌ నాబోటి ఒక శిష్యుడు ఈ రోజు నుంచి.సంతోషము అతని తో పాటు‌ నేను యల్ కే జి పాఠాలు‌ నేర్చుకుంటాను ప్రణామములు ఆర్యా

      తొలగించండి
    9. ఇంత విపులంగా ఉచితంగా పాఠాలు చెప్పే మాస్టరుగారు దొరకడం మనబోటి వాండ్రకు అదృష్టము! ధన్యవాదములు, నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    10. నేను నా పుస్తకావిష్కరణ సభలో నెల్లూరు నుంచి యింకా యెందరో కవులు రావాలని, శంకరాభరణంలో చేరాలని ఆహ్వానించాను. కృష్ణారెడ్డిగారు స్పంద్ంచ్ చేరడం చాల సంతోషం!

      తొలగించండి
  41. సింగము!కోరలుగలిగిన
    సింగారపు రాతి ప్రతిమజెక్కగ!నిలిచెన్
    ముంగిట :బ్రమరాంబ గుడియే
    సింగము నోటన్ వసించె చిలుకముదమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుడియె' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. మూడవ పాదంలో మొదటి గణం ర గణం అయిందేమో

      తొలగించండి
    3. 'ముంగిట' తెలుగు పదం కనుక గురువు కాదు. అది భగణమే.

      తొలగించండి
  42. గంగ యనెడు గయ్యాళికి
    యంగన సుకుమారి కోడలంజలిఁ గనుచున్
    జంగడను భర్త పలికెను
    సింగము నోటన్ వసించె జిలుక ముదమునన్.

    రిప్లయితొలగించండి
  43. బంగారక్కయె వెదికెను
    కంగారుగ జక్కెర చిలుక కొరకు తుదకా
    రంగుల గుళికఁ గనె నర
    సింగము నోటన్ వసించె జిలుక ముదమునన్

    రిప్లయితొలగించండి
  44. రంగుల విగ్రహ శోభను
    పొంగారు గుడి శిఖరమున పొందిక గూటిన్
    కంగారొంది వణుకుచూ
    సింగము నోటన్ వసించె జిలుక ముదమున్

    రంగు రంగుల విగ్రహాలున్న ఆలయ శిఖరం మీద గూటిలో ఉన్న చిలుక చలికి వణుకుతూ సింహం బొమ్మ నోటిలో వెచ్చదనం పొంది హాయిగా ఉంది.
    అయితే పద్యంలో ఈ భావం మొత్తం ఇమిడిందో లేదో అని సందేహం ఉంది గురువు గారు.

    రిప్లయితొలగించండి
  45. బంగారము పెళ్లి యనుచు
    సింగారముకలలుగనగ సేమముగానన్
    అంగీరసుడు కనెనుకల
    "సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"

    రిప్లయితొలగించండి
  46. జంగల మందు దేవలము స్థాపనజేయుచు గోపురమ్ముపై
    భంగిమ లెన్నొ చెక్కియును వైభవమొప్పగ నిల్పిరచ్చటన్
    ముంగిట శిల్పరూపమున ముద్దుగ శిల్పు లమర్చి నట్టి యా
    సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్!

    రిప్లయితొలగించండి
  47. [2/11, 07:11] Shankarji Dabbikar: భంగమయెన్ ప్రయత్నములు భాగవతున్హరిగాచుచుండగా
    సింగమువంటిదైత్యవిభు జిల్కలపల్కులచిన్నవానికిన్
    రంగడునారసింగడయి ప్రాణము లన్గొను జిల్కయయ్యగున్
    *"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"*
    [2/11, 07:13] Shankarji Dabbikar: బంగారుమాట కాదొకొ
    *సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్*
    సింగడు సింగికి కంబపు
    సింగము పైజిల్కచేర సింగికిబల్కెన్
    [2/11, 07:50] Shankarji Dabbikar: సింగము కాననాధిపము, జిల్కయగున్ సభగేయకారుడ
    భ్భంగిచరించునెయ్యమున బంధుర సాన్నిహితంబులక్షణై
    *"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"*
    మంగళ లక్షణాభిదలమాన్య కవీశుడు రాయకుండునే
    [2/11, 13:05] Shankarji Dabbikar: అంగన వక్రతుండమయి, యా ర్యుడు పూరుష సింహమై,విలా
    సాంగిగమెల్గ రామహృదిసారస భృంగమదే,మనోజ్ఞమౌ
    *"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"*
    రంగులు హంగులున్ వరలు ప్రాణసఖీసఖులిట్టులుండినన్

    రిప్లయితొలగించండి
  48. రంగా చూడుము చిత్రము
    సింగము నోటన్ వసించె, జిలుక ముదమునన్
    ముంగిట జోస్యము చెప్పుచు
    భంగపడియెతాను నోట బందీ యగుచున్.


    రిప్లయితొలగించండి