6, మే 2019, సోమవారం

సమస్య - 3007 (నీటిమీఁది వ్రాత..)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నీటిమీఁది వ్రాత నిలుచు సతము"
(లేదా...)
"నీటన్ వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా"

59 కామెంట్‌లు:

  1. మొదటి వలపు తీపి యెదపైన కడదాక
    కదలి విరహ బాధ కలత బెడుచు
    మరల మరల మెదిలి మధుర భావననింపి
    నీటి మీఁది వ్రాత నిలుచు సతము

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వాటంబైనది పైటకొంగు గొనుచున్ వైనమ్ముగా చేరుచున్
    కూటమ్మందున బూతు వెల్పలనువే కుందించి మాట్లాడకే
    మీటన్ నొక్కుచు వోటు వేయుచును భల్ మేలైన రీతిన్గ క
    న్నీటన్ వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా!

    రిప్లయితొలగించండి
  3. నిలిచి యుండ బోదు నీవెంత వ్రాసినన్
    నీటి మీఁది వ్రాత, నిలుచు సతము
    మర్మ గర్భమందు మనసుదోచిన సఖి
    మాటలాడి నంత మేటి గాను.

    రిప్లయితొలగించండి
  4. గోటి తోడ చెట్టు కొమ్మను నరికిన
    నీటిమీఁది వ్రాత నిలుచు సతము
    ననుచు నేను తలతు, ననృతపు పలుకల్
    వలదని సతి పలికె వరుని తోడ

    రిప్లయితొలగించండి
  5. నాయకులనుమాట నాటికి నేటికి
    నీటిమీది వ్రాత!"నిలచుసతము
    రాజశాసనాలు రక్షణగూర్చగ
    నిత్య సత్యమట్లు నేడునాడు"!

    రిప్లయితొలగించండి
  6. మాట మార్చు వాని మాయలు గనుమోయి
    నీటి మీది వ్రాత; నిలుచు సతము
    పేదసాద కిచ్చు పిడికెడు సొమ్మైన!
    సత్య మిదియె వేద సార మదియె.

    రిప్లయితొలగించండి
  7. మాట లాడి తప్పు మనుజుని వైనం బు
    నీటి మీద వ్రాత ; నిలు చు సతము
    సత్య సంధు మా ట నిత్య మై వెలుగొo ది
    యెల్ల వేళ లందు కల్ల గాక

    రిప్లయితొలగించండి
  8. నీరు లేక రైతు నిలుచునే పొలమున?

    బ్రతుకునె మనుజుండు వారి లేక?

    ఉన్నతముగ నరసి యుత్తర్వులిచ్చెను

    నీటి మీది వ్రాత నిలుచు సతము.

    రిప్లయితొలగించండి
  9. ధరణి లోన చెరగు ధర్మాత్ము లాడెడు
    పలుకు లవియు కావు వ్యర్థ మెపుడు
    సత్య వాక్కు లన్న జగతిలో నవికావు
    నీటి మీది వ్రాత, నిలుచు సతము.

    రిప్లయితొలగించండి


  10. మాటామంతి జిలేబి పద్యములు సామాన్యంబుగాతేలుచున్
    నీటన్ వ్రాసిన వ్రాత; శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా
    నోటన్ పల్కెడు వృత్తపద్యముల వేనోళ్లన్ పడన్ వ్రాయగాన్
    ధాటీగా సభ లోన కందివరులే ధారన్ భళీ మెచ్చగాన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. తేలదే జిలేబి తెమ్మర వ్రాలున
    నీటిమీఁది వ్రాత; నిలుచు సతము
    నోటి మాట మదిని నొవ్వక పల్కగ
    విశ్వ వినుత భామ వినవె మాట!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. వేయ వోటు తనకు వేయి మాటలు చెప్పు
    పీట నెక్కి నంత మాట మార్చు
    మెలిక లేక నేత నిలుపు కున్న యెడల
    నీటిమీఁది వ్రాత నిలుచు సతము

    రిప్లయితొలగించండి
  14. ( ఎన్నికలలో ఎన్ని కలలో కనే మన్నికలేని నాయకులు )
    మాటల్ బెక్కుల జెప్పుచుంద్రు ; " బ్రతుకే
    మాదింక మీ " దంచు స
    య్యాటల్ మీర నసాధ్యమైన నరుదౌ
    హామీల పత్రంబగున్
    నీటన్ వ్రాసిన వ్రాత ; శాశ్వతముగా
    నిల్చున్ గదా మిత్రమా !
    మాటల్ చేతలు చిత్తముల్ గలియుచున్
    మామంచిగా నిల్చినన్ .

    రిప్లయితొలగించండి
  15. ఎగసి పడును మనల నేమార్చు వాక్యములు
    మిట్టి పడును నీటి మీది వ్రాత
    నిలచు సతము సత్య నిజ రూప బోధనలు
    నిండు కుండ వోలె నిజము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  16. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    నీటిమీఁది వ్రాత నిలుచు సతము

    సందర్భము: వామనుడు మూ డడుగుల నడిగితే బలిచక్రవర్తి అంగీకరించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వద్దన్నాడు. వామనుడు సందేహించినాడు. బలి యిలా అంటున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మూ డడుగుల నిత్తు.. ముచ్చటఁ దీరుతు..
    మాట తిరుగలేరు మానధనులు..
    నమ్ము మయ్య వడుగ నా మాట!.. కా దిది
    నీటిమీఁది వ్రాత.. నిలుచు సతము..

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    6.5.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  17. ఘటిక కాలమందె కలసిపోవు నుగద
    నీటిమీఁది వ్రాత ; నిలుచు సతము
    కాగితమ్ము మీద కలముతో వ్రాయంగ
    తెలియుమయ్య నీవు తెలుగువాడ

    రిప్లయితొలగించండి
  18. నేతలు తమ మాట నిలబెట్టు కొన్నచో
    కొండ తేలు నయ్య కొలను లోన
    హవము దాకినంత హాయిని గొల్పును
    నీటిమీఁది వ్రాత నిలుచు సతము

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురుభ్యోన్నమః🙏🙏

    నేటి పరిస్థితులకు అనుకూలంగా నా పూరణ:

    గంగ నీకు యేల కర్వరి యుండను
    మాకు వదలు గంగ మహిని కరవు
    మాన్ప వచ్చు దేవ మహదేవ నీవౌదు
    నీటి మీది వ్రాత నిలుచు సతము!

    కర్వరి-పార్వతి

    రిప్లయితొలగించండి
  20. ప్రేమపేరు మీద ప్రియుడాడు బాసలు
    నీటిమీద వ్రాత,నిలుచు సతము
    తల్లిదండ్రి ప్రేమ తరగని గనియౌచు
    తెలివిగలిగి మెలగు తెలుగుబాల

    రిప్లయితొలగించండి
  21. ఎన్నిక గెలువంగ నేర్పరచెదనన్న
    నీటిమీఁది వ్రాత ; నిలుచు సతము
    చేసిచూపి నపుడు చేతల, మాటల
    తెరవు నెరిగి మసలు తెలుగు వాడ

    రిప్లయితొలగించండి
  22. రాతిమీద బొమ్మ రాలిపోయెగనుము
    చార్మినారు పైన చక్కదనము
    శాశ్వతంబు లేదు శాశ్వతిలోనిక
    నీటిమీఁది వ్రాత నిలుచు సతము?

    రిప్లయితొలగించండి
  23. ఓటున్ గోరెడు నేత మాటలవి ఓహో వర్ణనాతీతముల్
    కోటల్ పేటల దాటుఁజూడగను,దక్కున్ నీదె స్వర్గమ్మనున్
    బాటల్ వేయును కల్పితమ్ములకు, నబ్బా!వాస్తవాలైనచో
    నీటన్ వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా

    రిప్లయితొలగించండి
  24. ఓటు నడుగు వేళ నొసగును వరములు
    సీటు చిక్కగానె చేతులెత్తు
    నేటి రాజకీయ నేతల మాటలు
    నీటి మీఁది వ్రాత నిలుచు సతము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నోటన్ బల్కిన మాట నాచరణలో నుంచంగ లేకౌనదే
      నీటన్ వ్రాసిన వ్రాత; శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా
      మాటన్ దప్పక నిల్చు వారి చరితమ్మారాధ్యమై వెల్గుగా
      నేడీ జాతికి యట్టి వారి కధలే నీమంబు నాదర్శమౌ

      తొలగించండి
  25. మైలవరపు వారి పూరణ

    దీటౌ మానవజన్మ , పుణ్యగతి సాధింపంగ యత్నించుమా....
    రాటంబేలనొ ? ప్రాప్తమెంతొ నొసటన్ వ్రాసెన్ గదా బ్రహ్మ , జం...
    జాటంబున్ విడుమా ! హితమ్ము వినుమా ! సత్యమ్మురా ! మున్గినన్
    నీటన్ ., వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    ["శ్రీకృష్ణుని కథలను మోక్షార్థి తన మనస్సులో స్మరిస్తూ, మోద బాష్పములు విడుస్తూ, గ్రంథ రూపంలో వ్రాసినచో, శాశ్వతంగా నిలుస్తాయి గదా!" అని ఒక హరిభక్తుడు తన మిత్రునితో చెప్పే సందర్భం]

    "నోటన్ బూతన పాలఁ బీల్చి, యుసురున్ గొల్లాడి, వే తల్లియున్
    ఱోటం గట్టఁగఁ, జెట్లఁ గూల్చియును, ముల్లోకంబులన్ నోటిలో
    దీటున్ లేని విధానఁ జూపి, ద్విషులన్ ద్రెళ్ళించియున్, దత్సరి
    న్నీటన్ స్నానము సేయు గోపికల నెంతేఁ గావ, వస్త్రంపుఁ బె
    న్మూటల్ దోఁచిన వెన్నదొంగ కథలన్ మోక్షార్థి, మోదంపుఁ గ
    న్నీటన్ వ్రాసిన వ్రాఁత, శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వజ్ఝ్లలవారికి ధన్యవాదములతో...చిన్న సవరణతో...

      మిత్రులందఱకు నమస్సులు!

      ["శ్రీకృష్ణుని కథలను మోక్షార్థి తన మనస్సులో స్మరిస్తూ, మోద బాష్పములు విడుస్తూ, గ్రంథ రూపంలో వ్రాసినచో, శాశ్వతంగా నిలుస్తాయి గదా!" అని ఒక హరిభక్తుడు తన మిత్రునితో చెప్పే సందర్భం]

      "నోటన్ బూతన పాలఁ బీల్చి, యుసురున్ గొల్లాడి, వే తల్లియున్
      ఱోటం గట్టఁగఁ, జెట్లఁ గూల్చియును, ముల్లోకంబులన్ నోటిలో
      దీటున్ లేని విధానఁ జూపి, ద్విషులన్ ద్రెళ్ళించియున్, జాలు చ
      న్నీటన్ స్నానము సేయు గోపికల నెంతేఁ గావ, వస్త్రంపుఁ బె
      న్మూటల్ దోఁచిన వెన్నదొంగ కథలన్ మోక్షార్థి, మోదంపుఁ గ
      న్నీటన్ వ్రాసిన వ్రాఁత, శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా!"

      మధురకవి గుండు మధుసూదన్, ఓరుగల్లు

      తొలగించండి
  27. నిలచియుండబోదు నిముషమే యైనను
    నీటిమీఁది వ్రాత ; నిలుచు సతము
    సత్య సంధుడైన సత్య హరిశ్చంద్రు
    డాడినట్టి మాట యవని నిజము

    రిప్లయితొలగించండి
  28. అభినందనలు!
    శ్రీ శారదా మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించిన పద్య కథల పోటీలో ద్వితీయ బహుమతి సాధించిన మన శంకరాభరణం సభ్యురాలు సోదరి గుఱ్ఱం సీతాదేవి గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
    2. హృదయపూర్వకాభినందనలండి డా. సీతా దేవి గారు.

      తొలగించండి
    3. పూజ్యులు మధుసూదన్ గారికి,కామేశ్వరరావుగారికి హృదయపూర్వక ధన్యవాదములు! నేనే యింకా నమ్మలేకపోతున్నాను!

      తొలగించండి
    4. అభినందనలు సీతాదేవి గారూ _/\_

      తొలగించండి
    5. అభినందనలండి సీతాదేవిగారు.ఈ
      పద్యకధాప్రక్రియను మునుముందుకు తీసుకవెళ్ళవలసిన ఆవశ్యకత చాలా ఉందండి కొనసాగించగలరని సాహితీబంధువుల కోరిక.

      తొలగించండి
    6. సోదరి సీతాదేవి గారికి శుభాకాంక్షలు

      తొలగించండి
    7. ధన్యవాదములు సూర్యగారూ,రామాచార్యగారూ,వామనకుమార్ గారూ!
      రామాచార్యగారూ,నాది మీలా ప్రౌఢకవిత్వం కాదండీ.అలా యెన్నటికైనా వ్రాయగలనా అనుకుంటూ ఉంటాను.ఏదో సరళ పద్యాలలో కథ వ్రాశాను.బహుమతి వస్తుందని ఊహించనే లేదు.ఇది తప్పక మాబోంట్లకు ప్రోత్సాహకరమే!నమస్సులు!

      తొలగించండి


    8. అభినందనలండీ సీతాదేవి గారు ! సూపర్ !



      జిలేబి

      తొలగించండి
    9. హృదయ పూర్వక శుభాభినందనలు సీతాదేవి గారూ 💐🌼💐_/\_💐🌸💐

      తొలగించండి
    10. అభినందన మందారములు సీతాదేవి గారు

      తొలగించండి
    11. జిలేబిగారికి,రాకుమారగారికి,అక్కయ్యగారికి హృదయపూర్వక ధన్యవాదములు,నమస్సులు!

      తొలగించండి
  29. కవిమిత్రులకు నమస్సులు!
    రేపు అమలాపురం దగ్గర తొత్తరమూడిలో జరుగబోయే పుస్తకావిష్కరణ సభకు వెళ్తున్నాను. ఎల్లుండి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  30. బొంక నేర నయ్య శంకింపఁ బనిలేదు
    వమ్ము కాదు సుమ్ము నమ్ము నాదు
    మేటి భాషణమ్ము మిత్రమ కా దిది
    నీటిమీఁది వ్రాఁత నిలుచు సతము


    కోటీరమ్మట కావ్య రాజముల సంకోచంబె రామాయణం
    బాటల్ పాటల సంతతమ్ము సుజనారాధ్యమ్ము దివ్యమ్ము శై
    లాటక్షిప్త విహంగ దర్శనజ మోహార్తుండు వాల్మీకి క
    న్నీటన్ వ్రాసిన వ్రాఁత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా

    రిప్లయితొలగించండి
  31. ఆ: మహిని నేత చెప్పు మాటనెపుడునెంచ
    నీటిమీఁది వ్రాత, నిలుచు సతము
    నాక్షణమ్ము వరకె , యంతర్ధాన మగును
    పిదప తగిన పదవి యొదవినంత

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శ్రీనాథుడు:

    కూటమ్మందున రాజరాజులను భల్ కొండాడి మెప్పొందుటన్
    పోటీ లేనిది తీరునన్ వడివడిన్ పుట్టించ పద్యమ్ములన్
    శీటీ గొట్టుచు గోచి దాల్చి మునుగన్ శృంగార ధామాన ప
    న్నీటన్;..వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా :)

    శీటీ = ఈల
    శృంగార ధామము = 5-Star Bath Tub

    రిప్లయితొలగించండి
  33. పాటుల్ తప్పవు పృథ్విపైన నెటులన్ ప్రార్థింప శ్రీకంఠునిన్
    దీటైనట్టి నృపాలుడైన విధి యుద్దేశమ్ము దర్శించు నే
    మాటల్ వేయి వచింపనౌ లిఖితమున్ మార్చంగ మున్గినన్
    నీటన్, వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా

    రిప్లయితొలగించండి
  34. పోటీ తత్వము హెచ్చుగా పెరుగగా మూర్ఖుల్ మహా నేతలై
    పాటే యుండని నేటి యెన్నికలలో వారిచ్చు వాగ్దానముల్
    నీటన్ వ్రాసిన వ్రాత, శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా
    పూటే లేదని యేడ్చు పేదజనులీ భూమిన్ సదా యుందురే.

    రిప్లయితొలగించండి
  35. ఆటవెలది
    వేదనాభరితపు 'పెన్నేటి పాట' లో
    నదిని గూర్చి మనసు కదలు నట్లు
    విశద పఱచి నట్టి 'విద్వాను విశ్వం'పు
    నీటి మీఁది వ్రాత నిలుచు సతము

    రిప్లయితొలగించండి
  36. పోటాపోటిగ నాడుమాటలు క్రియాపూర్తిప్రలుప్తంబులై
    " నీటన్ వ్రాసిన వ్రాత " గా జగతిలో నిల్చున్ వృథా వాక్కులై,
    మాటల్ రూపు ధరించి శోభిలు శిలా మాన్యాక్షరాలేఖనల్
    " నీటన్ వ్రాసిన వ్రాత " , శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా!.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  37. నోటిమాటచాలు నోటుతోపనియేమి
    నీతిమంతుఁడట్టినియతిపరుఁడు
    మాటఁదప్పనట్టి మహనీయమూర్తుల
    నీటి మీఁది వ్రాత నిలుచు సతము

    రిప్లయితొలగించండి
  38. రామసేతువు గట్టిన తర్వాత వానర సైన్యంలో ఒక సైనికుడు తన మిత్రునితో....

    శార్దూలవిక్రీడితము

    బీటల్వారగ రామమూర్తి హృది దీవిన్ జేర్చసీతమ్మనే
    వేటాడంగ దశాస్యు, వానరులు సేవించంగ వారాశిపై
    మేటన్వేయుచు తేలు రామ శిలలన్బేర్చంగనౌ సేతువన్
    నీటన్ వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా!

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టా సత్యనారాయణ
    సప్త ఖండములను సరి "మాయపలక"(desk top)పై
    అక్షరములు నిండి యాడె;రేపు
    ఇంటి పళ్ళెరమున నిరవుగ గన వింత!
    నీటి మీదవ్రాత నిలుచు సతము!!

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టా సత్యనారాయణ
    ఆటన్ బాటల నధ్యయంబున మహా యారాటమున్ బెంచి నీ
    బాటన్నీ జగమున్ వినూత్న గతినిన్బాటింప జేయంగ;నా
    మాటన్నేప్జె కలాము వాణి జదువన్ మాన్యుండవే!స్వప్నపు(APJ Abdul Kalam)
    న్నీటన్ వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా!!

    రిప్లయితొలగించండి