4, మే 2019, శనివారం

సమస్య - 3007 (అధ్యాపక వృత్తి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే"
(లేదా...)
"అధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్" 
(ఛందోగోపనము)

84 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:
    (చిన్న నాటి జ్ఞాపకాలు)

    కోపము మీర బెత్తమున కొట్టుచు తిట్టుచు చిన్న పిల్లలన్
    వీపుల గుద్దుచున్ మురిసి విందును జేయగ బెంచి కెత్తుచున్
    పాపము పుణ్యమున్ గనక పాసును ఫైలును జేయునట్టి య
    ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్

    రిప్లయితొలగించండి
  2. అధ్యయనము జేయించగ
    నధ్యాపక వృత్తి యందు నానంద మటన్
    విద్యల మార్పుల నెంచగ
    నధ్యాపక వృత్తి కంటె నధమము గలదే

    రిప్లయితొలగించండి
  3. విద్యను బోధించి సదా
    విద్యార్థుల భవిత దిద్దు విజ్ఞుడు తానే
    బాధ్యత మరచిన చో నిక
    యధ్యాపక వృత్తికంటె నధమము గలదే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సాధ్యమైనంత వరకు ద-ధ ప్రాస వేయకండి.

      తొలగించండి
  4. గోల చేయుచునున్న కొట్టరాదుట పాఠ
    శాలలో పిల్లలన్, చదువు కొనక


    చరవాణి చూచుచున్ సమయము గడుపు వారలను దండించగ నలవికాదు

    మొదటి తరగతిని చదువు వాడు కనులు గొట్టిన పిల్లకున్,తిట్ట రాదు

    భృతికి నధ్యాపక వృత్తి కంటె నధమముకలదే జూడగన్ముదము లేదు,

    వేసవికి సెలవలు లేవు విసుగు కలుగు

    చుండు వేసవి శిక్షణల్, యెండ లోన

    యింటి యింటికి తిరిగెడు యిడుము లిపుడు,

    వలదు జనులార యీవృత్తి వలదు నేడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కందపద్య సమస్యకు మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
      'శిక్షణ లెండలోన । నింటి కింటికి' అనండి.

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    మీ పొలమెంత ? గేదెలును మేకలనెన్నిటి గల్గినారు? మీ
    పాపలు నెంతమంది యను వ్రాతలె తప్ప , పవిత్రమైన య..
    ధ్యాపనమెందు బోయనొ గదా యని కుందుచు బల్కుచుంటిన...
    ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రహ్లాదుని గురువుల అంతరంగం..

      పాపడు విష్ణుభక్తి యని పల్కుచునుండనసత్యమంచు మే...
      మాపగ లేము ! చూడ ప్రభువా హరివైరి ! తదీయనామమ...
      ధ్యాపన జేయ బంపె సుతునంచు కడుంగడు భీతి దల్చిర...
      ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. విద్యార్హతలేకున్నను
    విద్యార్ధులబతుకులతోవిచ్చలవిడిగా
    విద్యావ్యాపారస్తుల
    అధ్యాపకవృత్తికంటెనధమముగలదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బతుకులతో' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి

  7. పట్టణంలో అంగడి పెట్టుకున్న చెలికాడు, స్వాధ్యాయి (వర్తకుని) తో


    స్వాధ్యాయీ ! చెలి కాడా!
    నే ధ్యానించితిని మేలు నీయంగడియే!
    నా ధ్యాసకు లపకెక్కడ?
    అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం అర్థం కాలేదు.

      తొలగించండి

    2. లపక - ధనము

      నేను పెట్టిన ధ్యాసకు ధనము లేదే !

      సరియేనాండి కంది వారు ?


      జిలేబి

      తొలగించండి
    3. సరిపోయింది.
      ఇవాళ ఆకాశవాణిలో మీ అసలు పేరేమిటి అని అడిగారు. విన్నారా?

      తొలగించండి
  8. అధ్యయన విలువ నెఱిగియు
    నధ్యాపక వృత్తి జేయ నలరించు సదా!
    అధ్యయనమునే బాసిన
    అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే ?

    రిప్లయితొలగించండి
  9. విద్యానంతర మొనరే
    యుద్యోగము జేయనేమి యుపయోగమనే
    విద్యార్థులుండ తెలుగున
    నధ్యాపక వృత్తి కంటె నధమము గలదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒనరే... అనే' అనడం వ్యావహారికం. సవరించండి.

      తొలగించండి
  10. అధ్యవసానము = ప్రయత్నము
    సద్యము = అప్పుడు
    ఏ ప్రయత్నము చేయకుండా, కష్టపడకుండా రికమెండేషను తో అధ్యాపక వృత్తిలో చేరి సరిగా పాఠాలు చెప్పలేని వాడు ఈ విధంగా పలుకుతాడు - అనే భావంతో పద్యం :
    అధ్యవసానము జేయక
    నధ్యాపక వృత్తి జేరి యలసివ ఘనులున్
    సద్యము దలచుచునుందురు
    "అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే!

    రిప్లయితొలగించండి
  11. ( నేటి అధ్యాపకుడి అంతరంగం )
    ఆపని యల్లరిన్ మదికి
    యాతన గూర్చెడి మొద్దుపిల్లలు ;
    న్నేపని చేయకుండ భుజి
    యింపగ వచ్చెడి తిండిపోతులు ;
    న్నోపని రీతి వంకలను
    నోరిమి బాపెడి డీయివోలు ; న
    ధ్యాపకవృత్తి కంటె నధ
    మాధమ మైనది గల్గ దెద్దియున్ .

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    ప్రైవేటీకరణ ప్రభావము:
    సాధ్యమసాధ్యము నెంచక
    "నధ్యాపన మెట్టిద"నుచు నడుగగ గ(క)క్షన్ (తరగతిని)
    బాధ్యులె శిష్యులు కాగా
    నధ్యాపక వృత్తికంటె నధమము గలదే!!

    రిప్లయితొలగించండి


  13. నా పూరణ. ఉ.మా.
    ***** ***
    దీపము మాదిరిన్ గురువు తేజము వెల్గచు శిష్యజాతి కు

    ద్ధీపన జేసి వారలకు ధీషణ జ్ఞానము లిచ్చి దోషముల్

    పాపుచు నుండడే!యటుల భావ్యము నిట్లు వచించ ధాత్రి? "న

    ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్" 

    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    వ్యాపక మేది లేక తన వాచ్యము నమ్ముకొనంగ నేళ్ళుగా
    కోపము లేదు యీ ప్రభుత కొంచెము నిచ్చియు నూరకుండ నే
    ("మాలిక్ కో గుస్సా నహీ;నౌకర్ కో తనఖ్వాహ్ నహీ"--ఉర్దూ సామెత)
    పాపము జేయ జాలడొక పాకను గూర్చగ నోచుకోడు యే
    శాపమొ యద్దెకొంప నట జావగ నీయరు, రామ!రామ! య
    ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్

    రిప్లయితొలగించండి


  15. ఈ పుర మందు వెల్గితివి యిమ్ముల గాంచుచు శ్రేష్టిగా సఖా
    బాపడ! విద్య నేర్పుటయె బాగుయటంచును చెప్పుకొంటినే
    మేపుచు మంద మందల సమేతము దస్కము పూజ్యమాయె న
    ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్!


    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నారద ఉవాచ.... "శ్రేష్ఠిగ" అనండి.'బాగు + అటంచును = బాగటంచును'అవుతుంది. యడాగమం రాదు. "బాగని గొప్పలు/గొప్పగ చెప్పుకొంటివే" అనండి.

      తొలగించండి
  16. అధ్యాప క వృత్తి మిగుల
    బాధ్యత తో నిర్వ హిం ప భయ పడు చు సదా
    సా ధ్యాసాధ్య ము లెరు గ ని
    అధ్యాప క వృత్తి కంటె న ధ మ ము గలదే ?

    రిప్లయితొలగించండి
  17. విద్యాబోధన కన్నను
    విద్యార్ధుల జేర్చెడువిధి పెద్దదికాగా
    విద్యల నమ్మెడు బడులం
    దధ్యాపక వృత్తికన్న నధమము గలదే?!!

    చాల కార్పొరేటు విద్యాలయాలలో అడ్మిషన్లు చేయిస్తేనే జీతాలిస్తారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ సందర్భంగా నేనిదివరలో వ్రాసిన కొన్ని కూనలమ్మ పదాలు
      చదువు చెప్పువాడు
      చవకాయెనే నేడు
      చదువు "కొన్న"ఫలము
      ఓకూనలమ్మా

      అయ్యవారుండేది
      అడ్మిషన్లకే గాని
      అక్షరమ్మునకు గాదు
      ఓకూనలమ్మా

      విద్యలన్ని నేడు
      విత్తమునకే జూడు
      విలువలేమి గూడు
      ఓకూనలమ్మా

      కార్పొరేటు బడులు
      కలిమితెచ్చే మడులు
      కన్నవారి కొత్తిడులు
      ఓకూనలమ్మా

      విద్యలేని వాడు
      వింతపశువు నాడు
      విత్తమంత్రి నేడు
      ఓకూనలమ్మా

      ఆటపాటలు లేవు
      ఆరుబయళ్ళు లేవు
      ఆరుగాలము చదువె
      ఓకూనలమ్మా

      తొలగించండి
    2. చూపును మానవాళికిని సూచనలిచ్చుచు సత్యమార్గ మ
      ధ్యాపకవృత్తి,కంటె!నధమాధమ మైనది గల్గదెద్దియు
      న్నేపగ నన్యబాధ్యతల నేహ్యపురీతిని గృంగజేయుచున్
      చేపెడి బాడియావునటు జేర్చగ బండిని లాగుబాధ్యతన్

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ పూరణలు, కూనలమ్మ పదాలు అన్నీ బాగున్నవి.
      'కంటె' అంటే చూచితివా అని ప్రశ్నించడం.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా!కంటె అనగా చూచితే అని మొదట వ్రాశాను!

      తొలగించండి
  18. సేద్యము జేయుచు పోతన
    పద్యపు సుధలను మనకును పంచిన ఘనుడౌ
    చోద్యము డబ్బే విద్యయె
    నధ్యాపక వృత్తికంటె నధమము గలదే

    రిప్లయితొలగించండి
  19. శాపవశమ్ముచే ననయఛాత్ర తతమ్ముకు నొజ్జనైతినో
    పాపము చేసినాడనొ సువర్త్మము వారికి చూపలేక నే
    దాపము జెందుచుంటి నిరతమ్ము మనమ్మున దేవ! యిట్టి య
    ధ్యాపక వృత్తి కంటెనధమాధమమైనది గల్గదెద్దియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనయచ్ఛాత్ర...' అనడం సాధువు కదా? 'తతము' శబ్దానికి సమూహమన్న అర్థం ఉన్నట్టు లేదు.

      తొలగించండి
    2. శాపవశమ్ముచే నిట కుఛాత్ర గణమ్ముకు నొజ్జనైతినో - అనవచ్చు కద

      తొలగించండి
  20. ఉద్యోగమ్ములవన్నియు
    నధ్యాపక వృత్తి కంటె నధమము; గలదే
    విద్యా బుద్ధులు గరపెడి
    అధ్యాపక వృత్తి కంటె అగ్ర్యంబిలలో 🙏

    రిప్లయితొలగించండి
  21. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య

    అధ్యాపక వృత్తి కంటె నధమము కలదే

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    బ్రతుక లేకగ నాడు బడి పంతులుద్యోగమంటిరి,మారెను మదిర నయన,
    నేడు రోజులని, నన్నీవృత్తి లోనికి చేరగ నుసిగొల్పి పోరినావు ,
    మంచిగ వచ్చును ఫించను, నెల మొదటి దినమున్ జీతము ముదము నిడెడు
    సెలవలు , విడువక చెలిమి చూపిన పాలు పెరుగుయు ,కూరలున్ పరుగు బెట్టు
    ననుచు పేర్కొన నిజమనుచు నే నమ్మితి, టెట్టు పరీక్షలో నెట్టు కొస్తి,
    యింటి పట్టున నేను వంట జేయుచు కుటుంబము తో గడుపుచుండ పల్లె టూరు
    నకు బదిలీ చేసి నారు, పతికి వృత్తి నొకచోట, పిల్లలు నొక్క చోట
    నుంచి నే నిచ్చోట నొవ్వు చుండగ మొదలాయెను కష్టముల్ ,తోయ జాక్షి
    నీ పొందు కోరితి, నిరసన తెల్పిన నీపైన పడుచుండు నింద లెపుడు
    ననుచు నధికారి యల్లరి జేయుచు నాపై బురద జల్లి నరక మిడెను,
    మరుగు దొడ్లన్నియు మరుగు పడగ, బాధ పడుచు నే నింటికి పరుగు నిడితి,
    గోల చేయుచు నున్నకొట్టరాదట పిల్లలను నేను, చరవాణులను వలదని
    వారించ పోట్లాడి వార్నింగు లిడినారు పల్లె పెద్దలు, మంచి పాఠములను
    చదివించ లేదని బెదిరించు చుండెను తల్ల్ది తండ్రులు నన్ను, తళియ చేయు
    మనిషి రాకున్న నే మంటను బెట్టి చేయ వలెను వంటను , పవలు పాఠ
    ములు పోయి పిల్లలు గెలువడి కొరవడ తప్పునాది యనుచు దెప్పు చుండె,
    పండుగ సెలవలు దండగాయెను జనాభా లెక్కలకు నన్ను పంప , యెన్ని
    కల విధులని నన్ను కక్షతో నధికారి తీవ్ర వాదులు గల నీవృతముకు
    పంపెను , వేసంగి పాఠములని తర గతులును సృష్టించె కరుణ లేక,
    భృతికి నధ్యాపక వృత్తి కంటె నధమము కలదే జూడగ. ముష్టి కొలువు ,

    వలదు సర్కారు నౌకరీ, తెలివి గలిగి
    పలుకు చుంటిని, పతితోడ కలసి నేను
    చెలిమి చూపి సంసారమున్ మలచు కొందు
    ననుచు బల్కెను తండ్రితో తనయ యొకతె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం ప్రశంసనీయం. అస్వస్థత కారణంగా మీ పద్యాన్ని పూర్తిగా చదివి సమీక్షించలేకున్నాను. మన్నించండి.

      తొలగించండి



  22. వేద్యము గాని పదములన్
    పద్యముల సమీక్ష చేయ పడవేతురుగా
    చోద్యముగ జిలేబీవలె,
    నధ్యాపక వృత్తి కంటె నధమము గలదే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. అధ్యేతల రావించగ
    మధ్యేమార్గమ్మిదిగద మాటలమూటల్
    అధ్యవసాయముజూపక
    అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే!!

    ****అధ్యేతలు =చదువరులు
    అధ్యవసాయము=ఉత్సాహము

    రిప్లయితొలగించండి
  24. అధ్యాత్మజ్ఞానరహిత
    మధ్యాహ్న కబళ పథకనిమగ్నధురీణుల్
    నిధ్యానించన్ నయయో
    అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే

    రిప్లయితొలగించండి
  25. అధ్యాపకులనదైవమె
    యధ్యాపకవృత్తికంటెనధమముగలదె
    బుద్ధినిగలిగెడువారలు
    బాధ్యతలేకుండపలుకభావ్యమెజగతిన్

    రిప్లయితొలగించండి
  26. చూపుల లోన కోపమునుఁ జూపుచు చేతను కర్రఁ బట్టి యే
    పాపము తెల్యనట్టి పసి బాలల బాల్యము కాలరాచుచున్
    బాపలఁ బాఠశాలకిక బంధిగ మార్చెడు వృత్తియైన య
    ధ్యాపక వృత్తికంటె నధమాధమ మైనది గల్గ దెద్దియున్.

    రిప్లయితొలగించండి
  27. సాధ్యం బగునే దుష్టుల
    మధ్య నొనర్చఁగ వణిక్కు మానుగ నయ వై
    రుధ్యానృత దుర్వాణి
    జ్యాధ్యాపక! వృత్తి కంటె నధమము గలదే


    భూ పరివార మం దరయ మూర్ఖ జనాళియ నేడు మెండు సం
    తాపద భాషణమ్ముల సతమ్ము సుతప్తులఁ జేయ శిష్యులే
    పాప వికార కార్య కులపాంసన దైత్య పిశాచ సన్ని భా
    ధ్యాపక వృత్తి కంటె నధమాధమ మైనది గల్గ దెద్దియున్

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వీపును మోపి టేబులున విందును జేయుచు గుర్రు కొట్టుచున్
    తాపము తీర ముక్కుపొడి దమ్మును పీల్చుచు తుమ్మి చీదుచున్
    పాపల నింటికిన్ పిలిచి పండుగ జేసెడి ట్యూషనందు న
    ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్

    రిప్లయితొలగించండి
  29. ఈ పృథివీ తలమ్ముఁ గన నింతటి గౌరవనీయ వృత్తినిన్
    జూపగ లేము గాదుటె మరొక్కటి, యెంతగ నెంచి చూసినన్
    న్నే పురుషాధముండిటుల హీనపు వాక్కులు పల్కె చెప్పు మ
    ధ్యాపక వృత్తికంటె నధమాధమ మైనది గల్గదెద్దియున్.

    రిప్లయితొలగించండి
  30. అధ్యాపకు డాదర్శుడు
    విద్యార్థుల భవితబంచు విజ్ఞానిగనన్
    విద్యనునేర్పక సైకో
    అధ్యాపక వృత్తికంటె నధమముగలదే?

    రిప్లయితొలగించండి
  31. విద్యాలయముల బెట్టుచు
    నద్యాపకులకు నొసంగి యరకొర కూలిన్
    విద్యార్థులఁ దోచు బడి
    న్నధ్యాపక వృత్తి కంటె నధమము గలదే

    రిప్లయితొలగించండి
  32. పాపముగల్గునిట్లనగబావసమైనదెయెంచిచూడయ
    ధ్యాపకవృత్తికంటెనధమాధమమైనదిగల్గడెద్దియున్
    బాపులతోడిబంధములు,బాధలుగూర్చునుగాననెచ్చటన్
    బాపులజోలికిన్జనకభర్గునినామమునుచ్చరించుడీ

    రిప్లయితొలగించండి
  33. నా ప్రయత్నం :

    కందం
    స్వాధ్యయనమ్మున నేర్చిన
    విద్యార్థిని బొటన వ్రేలు ప్రియదక్షిణగా
    మిథ్యా గురువడుగ దలఁచు
    నాధ్యాపక వృత్తి కంటె నధమము గలదే?

    ఉత్పలమాల
    పాపడు నేకలవ్యుడట భక్తిగ ద్రోణుని బొమ్మ నొజ్జగన్
    బాపురె! యస్త్రవిద్యలను పట్టుగ నేర్వ వివక్షజూపుచున్
    దాపున నంగుటమ్ము గురుదక్షిణగా గొన నెంచ జూచు నా
    ధ్యాపక వృత్తికంటె నధమాధమమైనది గల్గదెద్దియున్




    రిప్లయితొలగించండి
  34. పూపమనస్కులైన పసి మొగ్గలు పిల్లలఁ జేరదీసి తా
    మోపిక తో జరింప వలె యొజ్జయె యుర్విన తల్లివోలె, నా
    పాపల భావిజీవితపు బ్రహ్మల మంచును మర్చి పోయెడ
    ధ్యాపక వృత్తి కంటెనధమాధమ మైనది గల్గదెద్దియున్.

    రిప్లయితొలగించండి
  35. విధ్యార్జన చేయరసలు
    విద్యార్థుల కసలు లేదు వినయము, కొలువా
    సద్యఃఫలితము లివ్వదు
    నధ్యాపక వృత్తికన్న నధమము కలదే

    రిప్లయితొలగించండి
  36. విద్యార్హత లేకున్నను
    విద్యాలయములు దెరిచిరి విద్యను బంచన్
    విద్యా జ్ఞానంబివ్వని
    అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే.

    గంగాపురం శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
  37. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    బాధ్యత నెఱుగని నేతలు
    బాధ్యత మరపించు పిచ్చి పను లిడగా నా
    రాధ్యు డగునె యధ్యాపకు!..
    డధ్యాపక వృత్తి కంటె నధమము గలదే!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.5.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి