7, మే 2019, మంగళవారం

సమస్య - 3011 (నాలుగారులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నాలుగారులు పదునాలు గగును"
(లేదా...)
"నాలుగారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్"

44 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కాలు గాలెను పిల్లికే గది కాడ జూడగ నెల్కలన్
    మేలుగానది లెక్కబెట్టగ మీగడొల్లుచు కుల్కుచున్
    వీలుగా పది తీసి వేయగ వేడు కాయెగ నిట్టులే:
    నాలుగారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్

    రిప్లయితొలగించండి
  2. నేడు మీకు నేను కూడిక నేర్పెద
    పిల్లలార! మనసు పెట్టి వినుడు
    కూడి చూడుడంత మూడంకెలివి నాల్గు
    నాలుగారులు పదునాలు గగును

    రిప్లయితొలగించండి
  3. ప్రశితిని గురుడొకడు ప్రశ్నించె నీరీతి

    నాలు గారు లెంత నయముగాను

    శిష్యుడంత నిట్లు జెప్పె దెలివిలేక

    "నాలుగారులు పదునాలు గగును"



    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి
  4. గొంతు చించు కొనుచు గురువు చెప్పగ నేమి
    మారబోడు గాదె మంద బుద్ధి
    నాలుగారులు పదునాలు గగుననుచు
    పలికె నయ్యె తుగకు బాలుడపుడు.

    రిప్లయితొలగించండి
  5. పదికి నాల్గు కూడ పదునాలు గునగను,

    మూడు రెండ్లు నొకటి యేడు గాదె

    నొకటి తోడ నొకటి,నొక్కటికి నొకటి

    నాలు గారులు పదునాలుగగును

    రిప్లయితొలగించండి
  6. ( పాలమనిషి వెంకటప్పయ్య ఇరవైనాలుగు లీటర్ల పాలు
    పోస్తే అందులో పదిలీటర్లు నీళ్లే - ఇంటావిడ అంటున్నది )
    చాలు చాలును వెంకటప్పయ !
    జంకు నీకది లేదుగా ;
    పాల గల్పిన నీర మెంచగ
    బల్కుచుంటిని చూడుమా !
    యేల వాదము చేతు విట్టుల ?
    నెంచి చెప్పెద లీటరుల్
    నాలుగారులు చూడగా బదు
    నాలుగే కద లెక్కకున్ .

    రిప్లయితొలగించండి
  7. అక్రమార్జన గొని నాక్రమించగ భూమి
    భార్య పేరుమీద బావమరది
    పేర కొంతబెట్ట పిల్లలగని భవ
    నాలు గారులు పదునాలు గగును

    రిప్లయితొలగించండి
  8. చేత బట్టి నట్టి చెవులపిల్లినిజూపి
    కాళ్ళు మూడటంచు ఖలుడు బల్కు
    వడ్డి నడుగ రాగ వ్యాపారి తోజెప్పె
    నాలు గారులు పదు నాలుగగును

    రిప్లయితొలగించండి
  9. బాలుడా!చెపు నాలుగారుల పద్దు యెంతని పల్కగా
    *"నాలుగారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్"*
    పేలిపోవును చెంప చెళ్ళని పిచ్చి లెక్కలు కూడినన్
    'నాలుకా యది తాటి మట్టని 'నాల్గు మొట్టెను టీచరే!

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    బాలగా కనిపింపగా పలు పద్ధతుల్ గమనించుచున్
    లీలగా గొని చిత్రవర్ణపు లేపనమ్ముల పూయుచున్
    హేలనున్న నటీమణిన్ వయసెంత నీకనఁ బల్కెడిన్
    నాలుగారులు ! చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. క్షమించాలి రాజమండ్రి స్టేషనులో శ్రీ కంది శంకరయ్య గారి సెల్ ఫోను పోయింది.

    రిప్లయితొలగించండి
  12. వాదనలుజేసి గణితము రాదనకుము
    నాల్గు నాలుగారులు పదునాలు గగును
    కుదురునాయంకెలన్నిటి గూడిజూడ
    నేతెలిపినది సరియని నీకె తెలియు

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. కాకినాడ చేరెను నేడు కంది వారు

    బ్లాగు లోన వీక్షణలకు జాగు గలుగు,

    సరస కవులార రయముగ తరలి రండు,

    తప్పు లొప్పుల నీనాడు చెప్పరయ్య

    రిప్లయితొలగించండి
  15. మంత్రి గారి బుద్ధి మందపు తనయుడు
    బడిలోనఁ జేర బయలు దేరె
    లెక్కలయ్యవారు లెక్కలు యడుగంగ
    నాలుగారులు పదునాలు గగును

    ఒక మంత్రిగారి తెలివి తక్కువ కొడుకు పాఠశాలలో ప్రవేశం కోసం వచ్చినప్పుడు వాడిని పరీక్షించడానికి గణితం మాష్టారు అడిగిన ప్రశ్నకు నాలుగారులు పదునాలుగు అని సమాధానం ఇచ్చాడు. అయినా సరే బడిలో ప్రవేశం ఇవ్వక తప్పలేదు. అది వేరే సంగతి

    రిప్లయితొలగించండి


  16. రెండు రెళ్ళెనిమిది ! రిమ్మ తెగులువీడ
    నాలుగారులు పదునాలు గగును!
    ఊరి కేగ నయ్య నుసికొలుపువిధము
    లెక్ఖ నిచ్చి తాము లెస్స వెడల!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    [ఋగ్యజుస్సామాధర్వణములను వేదములు నాలుఁగు; ఆయుర్ధనుర్గాంధర్వార్థశాస్త్రములను ఉపవేదములు నాలుఁగు; శిక్షా వ్యాకరణచ్ఛందోనిరుక్తజ్యోతిషకల్పములను వేదాంగములు ఆఱు. మొత్తము కలిపిన పదునాలుఁగు...అనుట]

    నాలుఁగౌఁ గన వేదముల్ మఱి నాల్గునౌ నుపవేదముల్
    ప్రాలుమాలక లెక్కవేయఁగ వానియంగము లాఱిలన్!
    మేలు మేలని నేర్వఁ బూనిన మేదినిన్ గల నాలుఁగున్
    నాలుఁ గాఱులు చూడఁగాఁ బదునాలుఁగే కద లెక్కకున్!

    రిప్లయితొలగించండి
  18. ఎండ వాన కోర్చి ఎంతయో పండించి
    సరిగ తూక మేసి సంత కేగ
    కొలువ మళ్ళి మళ్ళి కొంతతగ్గుటజూడ
    నాలుగారులు పదునాలు గగును

    రిప్లయితొలగించండి
  19. నాకు నిచ్చె నతడు నలుబది రూకలె
    యారు,నారు నాల్గు మారు లిస్తి
    యింక మిగులు బాకి యిచ్చినట్టిది పోవ
    నాలుగారులు ; పదునాలు గగును"

    రిప్లయితొలగించండి
  20. ఎన్నిగలవు చూడ పెనుమినుకులవియె?
    మంచి గుణములెన్ని పంచ గాను?
    లోకములనచునవలోకించ నేమగు?
    నాలుగారులు పదునాలు గగును!

    రిప్లయితొలగించండి
  21. పాఠమేమి రాని పండిత పుత్రుడు
    లెక్కలన్న తిప్పలేను యనును
    జెప్ప నెక్కమొకటి చిక్కు ప్రశ్నగ మారి
    నాలుగారులు పదునాలు గగును

    రిప్లయితొలగించండి
  22. అప్పు గొనియు రూక లటముప్ప దెనిమిది
    యారు,నారు నాల్గు మారు లీయ
    యింక మిగులు బాకి ; యిచ్చి నట్టిది పోవ
    నాలుగారులు ; పదునాలు గగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. (ముప్పై యెనిమిది రూపాయలు అప్పు గొన్నాను.రు.ఆరు చొప్పున నాలుగు మార్లు నాలుగార్లు రు.ఇరవై నాలుగు యిచ్చి వేయగా మిగులు బాకి పదునాలుగయింది.)

      తొలగించండి
  23. మంద మతి ని యడిగె మాస్టరు o డొక పరి
    లెక్క జెప్పు మనుచు చక్క గాను
    నాలు గారు లు పడు నాలు గటo చు ను
    బుద్ధి హీనుడని యే బోధ పడ క

    రిప్లయితొలగించండి
  24. డా.పిట్టా సత్యనారాయణ
    సెల్లు లోన గణన సేయని రోజుల
    సేటు యెక్కములకు శీల మమరె
    తాను యిచ్చునపుడు తగునమ్మ యీలెక్క
    నాలుగారు పదునాలు గగును
    రైతు ధాన్యరాశి రహిని గొనెడు కొలత
    నాలుగారులు పదునాలుగగును!

    రిప్లయితొలగించండి
  25. డా.పిట్టా సత్యనారాయణ
    "జాలువారిన తెలివి యెందుకు?""చాల మోసము జేయగా"
    కాలునాన్చగ బాటు-పళ్ళెము గట్టిగా నినదించదే
    నాలుగారులు చూడగా బదునాలుగే కద లెక్కగన్
    సాలు పంటలు సర్వమీగతి సౌఖ్య హీనములాయెనే!
    మేలుకోవె దళారులుందురు మేదినిన్ రైతాంగమా!

    రిప్లయితొలగించండి
  26. వినఁగ వినఁగ విందు వీనుల కొసఁగితి
    వివిధ రాగములను వెలసి నీవు
    పాడ పాట లచటఁ గూడఁగ నాలుగు
    నాలు గారులు పదునాలు గగును


    వీలగుం జన సత్వరమ్ముగఁ బ్రీతి నందఱిఁ గూడి వా
    హ్యాళికిన్ నగ రేతరమ్ముల కద్భుతమ్ములు గాంచవే
    మేలుగా నవి పేర్చ నచ్చట మేటి సుందర వర్ణ యా
    నాలు గారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్

    [యానాలు + కారులు; కారులు = నలుపువి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరములు మొగిడ్చి మ్రొక్కుదుఁ గ్రమ్మర మన
      సార పార్వతీ సతి! కరుణా రస ప్ర
      పూర్ణ! స సిత రు చ్యవకీర్ణ పూర్ణ తమ సి
      తామల విలస ద్బింబాంబ రాంబ రాంబ!

      తొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కాలు గాలెను చంద్ర శేఖరు కందరున్ భళి తిట్టగా...
    వీలుగానిట స్పాటునందున వెంట వెంటనె చేరుచున్
    మేలు పంతులు కూడగానిట మీసమున్ భళి త్రిప్పుచున్:
    నాలుగారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్!

    రిప్లయితొలగించండి
  28. కూలిడబ్బుల నీయనెంచితి కూడిచెప్పమటంచనన్
    బాలుడాతని లెక్కగాంచుచు భారమెంచక చెప్పెనే
    వ్రేలితోడ గణించుచున్ గడు విజ్ఞుడాతడు నాల్గుకున్
    నాలుగారులు చూడగా పదునాలుగే కద లెక్కకున్.

    రిప్లయితొలగించండి
  29. అయోధ్యలో గుసగుసలు...

    మత్తకోకిల
    ఆలుకైకయు దాసిమందర యత్మజన్ముడు రాజులున్
    లీలలాడగ లోనిశత్రులు రెచ్చి చేసినదేమిటో?
    యేలకన్ పదునాలుగేడులు నేగు రాముడుఁ గాడికిన్!
    నాలుగారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్!!

    రిప్లయితొలగించండి
  30. భాగహార గణిత పాఠంబునం దుప
    దేశి నేర్పె నలుబదెనిమిదగును
    నాలుగారులు, పదునాలు గగును యేడు
    రెండు చేత పంచ లెక్క నందు ౹౹

    రిప్లయితొలగించండి
  31. ఉన్నవారలందుపిన్నలునలుగురు
    పెద్దబాలుడొకడు బుద్ధియుతుడు
    వయసుచూడవారువరుసక్రమంబుగా
    నాలుగారులు పదునాలుగగును

    రిప్లయితొలగించండి
  32. ఆటవెలది
    ఏడు రెండ్ల నెంచ, గూడ నెనిమిదారు,
    పదికి నాల్గుఁ గలిపి పలికి చూడ
    తొమ్మిదైదు గలుప నమ్ముమదియె నాల్గు
    నాలు, గారులు పదునాలుగగును

    రిప్లయితొలగించండి

  33. నాలుగారులుయేవిధిన్ పదునాలుగౌనది చెప్పనా
    నాలుగారులనుండి ముందుగనాలుగున్ కుదియించియున్
    తీరుగానటనుండియారునుతీయగానదె వచ్చుగా
    నాలుగారులు చూడఁగాఁబదునాలుగేకద లెక్కకున్

    రిప్లయితొలగించండి
  34. హవ్వ! దేమి చోద్యమయొతప్పులేకుండ
    చదువు మనగ నొకడు చదివె నెటులొ
    నాలుగెక్కమందు నాల్గు తప్పులటర
    నాలుగారులు పదునాలు గగున!!

    రిప్లయితొలగించండి
  35. ఉసిరికాయలమ్మె నూరులో నొక్కండు
    డజను యెనిమిదనుచు డప్పుఁ గొట్టి
    బేరమాడి నంత వెలను మార్చి బలికె
    నాలుగారులు పదునాలుగగును

    రిప్లయితొలగించండి
  36. ఎక్కములను చెప్పు మిక్కడే యనినంత
    నాలుగారుtలు పదునాలుగనగ
    సవరణమ్ము తోడ చక్కగా నక్క తా
    కాదిరువది నాలుగనుచు దెలిపె

    రిప్లయితొలగించండి