9, మే 2019, గురువారం

సమస్య - 3013 (దారా సంగమము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ"
(లేదా...)
"దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్"

103 కామెంట్‌లు:

  1. మీరకు గురువుల యాజ్ఞను
    కోరకు వెలయాలి పొందు, కుజనుల సరసన్
    జేరకు మాశింపకు పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి


  2. రారా! మేలగురా యీ
    దారా సంగమము; మిగుల దౌష్ట్యము సుమ్మీ
    యీ రాత్రి నన్ను కాదని
    వేరుగ బోవ ! గృహమేధి విదురా రారా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. పారా వారము వంటిది
    వారాహిని కొలిచి నంత వరముల నీయన్
    భారము సౌఖ్యపు సందడి
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కాని పూరణలో స్పష్టత లోపించినట్లుంది.

      తొలగించండి
  4. కంజదళాయతాక్షి జనకాత్మజ జాడలకై కపీంద్రునిన్
    భంజితవైరివీర్యపటుబద్ధకవాటవిపాటనక్షముల్
    మంజులరామలక్ష్మణలు మాన్యులు సాయము కోరి రక్కటా!
    కుంజరయూధమొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. ప్రాతః కాలపు సరదా పూరణ:

      మీరిన ప్రీతితో భడవ మిక్కిలి యాశను పెండ్లియాడగా
      కోరిక తీర్చుచున్ కవల కూతులు పుట్టగ వెంటవెంటనే
      క్రూరపు కట్న కానుకలు గుండుల జేయగ నార్జితమ్ములన్
      దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్

      తొలగించండి


  6. హేరాళముగా వలచితి
    పారుడ! వినరా జిలేబి పల్కుల నీ సం
    హారంబగు చేష్టల పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సారాత్రాగుచు నిత్యము
    పోరాటమ్ముల సలుపుచు పోరుగుజనులతో
    తేరగ చిక్కెననుచు పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    భారతదేశసంస్కృతికి వారసుడెన్నగ నీవె సోదరా !
    ధీరుడు రామమూర్తి మన దేశపు చిహ్నము ధర్మబద్ధతన్ !
    ధారుణి దారి తప్పి ,పరదారను ధీరను శీలసద్గుణో...
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి



  9. పోరాటములన్ చేయుచు
    నోరారా యేడ్చియేడ్చి నొప్పింపంగన్
    మారామారికి హా! బృం
    దా! రాసంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నొరారా' అనడం వ్యావహారికం. "నోరారగ నేడ్చి యేడ్చి..." అనండి.

      తొలగించండి
  10. నేర గుణమ్ముతో చనుచు నిత్యము పేదల సొమ్ము గొంచు సం
    సారము ద్వేష భావమున సాగుచు నుండగ నన్యసద్మ మం
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్
    ధారుణ మైన రౌరవము తప్పక చేకుఱు నెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
  11. ( సంధ్యాసమయంలో రతిని కోరిన సతి దితితో కశ్యపుడు )
    మీరిన కాంక్షతోడ శ్రుతి
    మించిన తీరున బల్కుచుంటివే ?
    వారణ జేసినన్ వనిత !
    వాంఛను వీడవు ; మాటిమాటికిన్
    గీరెద ; వీ యకాలమున
    ఖేదము కోపము మానుమో సఖీ !
    దారను సంగమించుటయె
    దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్ .

    రిప్లయితొలగించండి
  12. రారమ్మని నూర్వశి మన
    సారా బిలువగ కిరీటి చాలని పలికెన్
    కోరగ వచ్చిన యే పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రారమ్మని యూర్వశి...' అనండి.

      తొలగించండి
  13. సవరించిన పూరణ
    --------------------
    పారా వారము వంటిది
    వారాహిని కొలిచి నంత వరముల నీయన్
    భారము గృహస్తు ధర్మము
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ .

    రిప్లయితొలగించండి
  14. కోరకు మితరుల సొత్తును
    దూరకు నితరుల నిరతము దొరలా గుండన్
    చేరకు మెరిసెడి యే పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దూరకు మితరుల... దొరవలె నుండన్...' అనండి.

      తొలగించండి


  15. పారించు సుఖమ్ముల నీ
    దారా సంగమము, మిగుల దౌష్ట్యము సుమ్మీ,
    ఓరోరి! రాననుచు నీ
    వీ రాత్రి హఠమును చేయ వినరా మగడా!


    పాపం పసివాడు :)
    జిలేబి

    రిప్లయితొలగించండి


  16. ఓరి! జిలేబి వెన్క బడి నొప్పును నొప్పునటంచు బల్కుచున్
    ప్రేరణ కల్గ చట్టనుచు వేళయు చూడక పొద్దుటేళనే
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్,
    దారికనా?ఛలోయనుచు తాపతిదేవుని త్రోసె ముద్దుగాన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెన్క బడి యొప్పును...' అనండి.

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది . అభినందనలు.
      విషాద... టైపాటు!

      తొలగించండి
    2. వారక పుణ్యసీమల, నవాంఛితరీతుల, తీవ్రరోగమం,
      దారయ తత్తిరస్కరహృదంతవిషాదనిమగ్నదారనున్
      పూరితదైవభక్తిపరిపూతమనోదృఢదివ్యదీక్షితో
      దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్

      తొలగించండి
  18. మారుని శరముల కె ర యై
    తోరపు కామము న జనులు దుష్ట తల పు నన్
    కోరు చు పరువ ము న న్ బర
    దారా సంగమ ము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  19. గరువులకు నమస్కృతులు
    నిన్నటి పపూరణ
    కందము. మంజుల భారత మాతయు
    రంజన చెడి తెల్ల దొరల రాజ్యము నందున్

    ఒంజిలె బానిస వృత్తిని
    కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    ఈనాటి పూరణ .దారాసంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ
    కందము
    ఘోరము పరధన కాంక్షా
    నేరము గురువాజ్ఞ విడుట-నెమ్మది నెంచన్
    రౌరవ నరకమె గతి. పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజలింగం గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కాంక్షయె' అనండి.

      తొలగించండి
  20. కోరకుమీ పరధనముల
    దూరకుమీ సాధు జనుల దులువ తనమునన్
    చేరకు నీచుల కడ,పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  21. తీరగు పాలన కొరకై
    ఈ రాజ్యసభకు జరిగెడు యెన్నిక లందున్
    యేరీతినైన గెలిచెడు
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    దార= విధానము

    రిప్లయితొలగించండి
  22. అంగద రాయబార సందర్భంలో

    శ్రీరాముని ధర్మపత్ని
    నో రావణ!యపహరింప నున్మాదివిగా!
    నేరము!నూహింపగ పర
    దారా సంగమము!మిగుల దౌష్ట్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  23. తీరగు జీవనమున్నను
    వేరొక గృహిణిని దమిగొని వివశము నామెన్
    గోరుట పాపము గద పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  24. వారము, వర్జ్యము చూడక
    వారసులపడయ వలెనను వాంఛయు లేకన్
    నూరక వ్యామోహమునన్
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  25. రావణాసురునితో మండోదరి...

    కందం
    మీరుచు సీతను దెచ్చితె
    శ్రీరాముడు కోపగించ శ్రేయము కాదే?
    వారించు నాశమును పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  26. డా.పిట్టా సత్యనారాయణ
    పేరా రాదయె;సంతును
    తీరా బెంచంగ కీర్తి తేజము శూన్యం
    బారాట మొకటి మిగులగ
    దారా సంగమము మిగుల దౌష్ష్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  27. డా.పిట్టా సత్యనారాయ
    భూరి కృషిం గడంగ నట బూనెను భాగ్యమటందురామెచే
    గూరె యశస్సు నా యువతి గూడినదే పొరపాటు పాటుకున్
    ఘోర పరాభవమ్ముగన;గూడదు కూడదు కూడదయ్య యా
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్!

    రిప్లయితొలగించండి
  28. ఆరయసబబేజగతిని
    దారాసంగమము,మిగులదౌష్ష్యముసుమ్మీ
    కూరిమిపరకాంతలదరి
    జేరుచునిజభార్యకడకుచేరకయుంటన్

    రిప్లయితొలగించండి
  29. ఆరయభావ్యమేయగునునార్యులుగూడనుగోరుకొందురే
    దారనుసంగమించుటయె,దౌష్ష్యమగున్ గృహమేధి కెప్పుడున్
    గూరిమిగల్గుచున్సతముకోరుటదేహపువాంఛనున్మదిన్ ,
    మీరకహద్దునెప్పుడునుమేళములాడకయుంటలెస్సగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  30. దూరపు దేశమ్ములఁ గని
    క్రూరాచారములు గొంట కూడదు సుమ్మీ
    ఘోరంపు నాగరికతన్
    దా రాసంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    [దార +అసంగమము; భార్యతో కలిసి యుండకుంట, విడాకులు]


    మూరి యశమ్ముఁ గోరుచు సమున్నత భూధన సంచయమ్ములం
    గోరిన వారి కిచ్చి యిఁక ఘోర దరిద్రము తాండవించినన్
    వారని సంకటమ్ము లవి ప్రాప్తము లైనను జేసి నట్టిదౌ
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్

    [దార = దానము; సంగమించుట = అంటుకొనుట]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శూరుడు పెండ్లియాడుచును స్రుక్కుచు వీడగ చిన్ననాటనే
    దారను తల్లితండ్రులను దైన్యము నొందిన దేశసేవకై
    తీరిక కోలుపోవగను త్రిప్పట మీర ప్రధానమంత్రియై
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మోడీని లక్ష్యంగా చేసికొని చేసిన మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. శారీరకసౌఖ్యానికి
    కోరికలకు దారిజూపు గోముకుబలియై
    మారగ మనసును గనిపర
    దారాసంగమము మిగుల దౌష్య్టముసుమ్మీ!

    రిప్లయితొలగించండి
  33. దారనుగనిమోహించితి
    దారను పెండ్లాడినేను దరిజేరంగా
    ఏరా వలదన నేలా
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అస్పష్టత ఉన్నది.

      తొలగించండి
  34. పోరాదుతప్పుదారుల
    కోరకుమెన్నడునుమైత్రి కుజనులతోడన్
    మీరకుమీ హద్దులు పర
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  35. దూరకు వేశ్యాగృహముల,
    మీరకు హద్దు, పశువాంఛ మితిమీరిన శృం
    గారమె, సుఖరోగము రా
    దా! రా! సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  36. సారాద్రాగుచు దనపై
    నేరారోపణలుజేసి నీల్గుచు నాపై
    వీరోచితమని దల్చెడి
    దారాసంగమము మిగుల దౌష్ట్యముసుమ్మీ!

    రోహిణినే గూడియుండి మిగిలిన భార్యలనుపేక్షించిన చంద్రునితో మామగారు హిమవంతుడు

    కూరిమి బెండ్లియాడి తగకూతుల నిర్వదియేడుమందినిన్
    పేరుకు భార్యలేయగు నభీష్టములేవియు దీర్చకుండగన్
    సారెకు రోహిణీసతికి సంగతి నీయగజూచుచున్నొకే
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధికెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  37. తీరని కోర్కెతోడ పతి తీయగ దాపుకు పిలువంగనే
    ఈరెయి నాకు యెక్కువగ యిక్కము కల్గును కూడదన్ననూ
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్
    ఈరకమింక
    నున్ననదియే గృహహింసగ చెప్పుకొందురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర గణదోషం. "నాకు నెక్కువగ నిక్కము..." అనండి. 'కూడదన్ననూ' అనడం సాధువు కాదు.

      తొలగించండి
    2. 🙏🏽 ధన్యవాదములు. సవరిస్తాను

      తొలగించండి
  38. మిత్రులందఱకు నమస్సులు!

    క్రూరుఁడు రావణుండు సుమ కోమలి రంభను కామవాంఛతోఁ
    జేరియు, జోడుఁగూడు మనఁ, జిక్కక యుండఁగఁ, గూడఁబోవఁ, గౌ
    బేరుఁడు శాప మిచ్చెఁ "దల ప్రేలియు వ్రక్కలు నౌను వేగ! మే
    దారియు నుండఁ బోదు! పరదారను బేలను సత్పతివ్రతో
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్!"

    [కౌబేరుఁడు=కుబేరుని కుమారుఁడైన నలకూబరుఁడు]

    రిప్లయితొలగించండి
  39. సవరణతో

    తీరని కోర్కెతోడ పతి తీయగ దాపుకు పిల్చినంతనే
    ఈరెయి నాకు నెక్కువగ నిక్కము కల్గును గానవద్దనన్
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్
    ఈరకమింక
    నున్ననదియే గృహహింసగ చెప్పుకొందురే

    రిప్లయితొలగించండి
  40. కం. పేరాశనరేయిపవలు
    ధారాళముసంగమింప తరిగునుబలమే
    వీరానినువారింతును
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  41. కీచకునితో సహోదరి సుధేష్ణ....

    ఉత్పలమాల
    కోరకు తమ్ముడా తగదు కూడిక దేవిడి గట్టువాలుతో
    నారికి భర్తలైదుగురు నాశనమెంచుదు రన్న వీడవే?
    శ్రీరఘు రాము సీతఁగొని చిక్కిన రావణుడీల్గె! నన్యమౌ
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  42. కం. శూరుడవనిధీరుడవని
    బీరములేపలికిపలికి ప్రేయసిపోందన్
    దూరంబయెసతులిద్దరు
    దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  43. రిప్లయిలు
    1. కోరిక లెంతొ మీరె ధర కూటములన్ విపరీతరీతియౌ
      ధోరణి హెచ్చిలన్, చదల దూగుచు, దేలుచు నీటిలో, బలా
      త్కారవిధమ్ము భాసిల, వికారతిరస్కృతభంగి, యేటిలో
      దారను, సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హెచ్చి + ఇలన్' అన్నపుడు (క్త్వార్థంబైన ఇత్తునకు) సంధి లేదు. "ధోరణి హెచ్చగన్..." అందామా?

      తొలగించండి
    3. శంకరకవిగారు, క్త్వార్థకమైన ఇత్తు కాదండి ఇది.
      హెచ్చి+ఇల కాదండి, హెచ్చిల్లు, హెచ్చిల, హెచ్చు+ఇల అనే ప్రయోగంలో వాడినానండి.

      ఉదా "వినీతి హెచ్చిలనెదురేగి." ఉ, రా. ౮, ఆ.)

      తొలగించండి
  44. ధారుణి యందు నిన్నొక కృతార్థుని జేయగ తల్లిదండ్రులే
    భారమటంచు నెంచక ప్రపంచపు జ్ఞానము నిచ్చి పెంచిరే
    వారి ఋణమ్ముఁ దీర్చుకొను పాళము కర్తవు నీవుగావునన్
    దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహ మేధికెప్పుడున్.

    రిప్లయితొలగించండి


  45. జీపీయెస్ వారు


    మీకోసం సమస్య :)

    పుచ్చలెగురు నొడయురాండ్రు పూనుకొనంగాన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  46. ఏరా!పులి రాజా!షో
    కారా?చెడఁ దిరుగుటన్న కామకలాపా!
    జారా!సుఖ రోగము సర
    దారా!సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  47. Ultra Test XR Shark Tank Reviews Improving endurance and functionality is a substantial issue for guys as soon as they begin coming their 40s. The decrease in testosterone levels and sexual actions allow us to look for nutritional supplements that could assist in enhancing it.
    https://ultratestxr.svbtle.com/ultra-test-xr

    రిప్లయితొలగించండి